10-01-1982 అవ్యక్త మురళి

* 10-01-1982     ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వరాజ్యాధికారీ ఆత్మల యొక్క ఆసనము - కర్మాతీత స్థితి

ఈరోజు బాప్ దాదా రాజ్యసభను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్యాధికారులు, నెంబర్ వారీగా తమ కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారులు. వర్తమాన సంగమయుగ స్వరాజ్యాధికారీ ఆత్మల యొక్క ఆసనము అనండి లేక సింహాసనము అనండి, అది కర్మాతీత స్థితియే. కర్మాతీతము అనగా కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క బంధనాల నుండి అతీతముగా ఉండడం. కర్మకు వశీభూతమవ్వడం కాదు, కర్మేంద్రియాల ద్వారా ప్రతి కర్మనూ చేస్తూ అధికారము యొక్క నషాలో వారు ఉంటారు. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి నెంబర్ వారి రాజ్యాధికారము యొక్క లెక్కలో, నెంబర్ వారీగా సభను చూస్తున్నారు. సింహాసనమూ నెంబర్‌వారీగా ఉంది మరియు అధికారము కూడా నెంబర్ వారీగా ఉంది. కొందరు సర్వాధికారులుగా ఉన్నారు. మరికొందరు అధికారులుగా ఉన్నారు. ఏ విధంగా భవిష్యత్తులో విశ్వమహారాజుకు మరియు మహారాజుకు తేడా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా సర్వ కర్మేంద్రియాల యొక్క అధికారి అనగా సర్వ కర్మల యొక్క బంధనము నుండి ముక్తులుగా ఉంటారు. దీనినే సర్వ అధికారి అని అంటారు. మిగిలినవారు సర్వాధికారులు కారు. కేవలం అధికారులే. కావున ఈ రెండు రకాల సింహాసనాధికారుల యొక్క దర్బారును చూస్తున్నారు. ప్రతి ఒక్క రాజ్యాధికారి యొక్క మస్తకముపై చాలా సుందరమైన రంగురంగుల మణులు ప్రకాశిస్తున్నాయి, ఇవి దివ్యగుణాల యొక్క మణులు. ఎంతెంతగా దివ్యగుణధారులుగా అయ్యారో అంతగానే మస్తకముపై మణులు ప్రకాశిస్తున్నాయి. కొందరివి ఎక్కువగా ఉన్నాయి. కొందరివి తక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ప్రకాశము వారి వారిది. ఇలా మీ రాజ్యసభ యొక్క రాజ్య అధికారీ చిత్రము జ్ఞానము యొక్క దర్పణములో కనిపిస్తోందా? అందరి వద్దా దర్పణము ఉందా? కర్మాతీత చిత్రమును చూడగలరు కదా? మీ చిత్రమును చూస్తున్నారా? ఇది ఎంత సుందరమైన రాజ్యసభ! కర్మాతీత స్థితి యొక్క ఆసనము ఎంత శ్రేష్ఠమైన ఆసనము! ఈ స్థితి యొక్క అధికారీ ఆత్మలు అనగా సింహాసనాధికారీ ఆత్మలు విశ్వం ముందు ఇష్టదేవుల యొక్క రూపంలో ప్రత్యక్షమవుతారు. స్వరాజ్యాధికారీ సభ అనగా ఇష్టదేవుల యొక్క సభ, అందరూ స్వయమును ఈ విధంగా ఇష్టదేవ ఆత్మలుగా భావిస్తున్నారా? మీరు ఇటువంటి పరమపవిత్రులు, సర్వుల ప్రతి దయార్ద్ర హృదయులు, సర్వుల ప్రతి మాస్టర్ వరదాతలు, సర్వుల ప్రతి మాస్టర్ ఆత్మిక స్నేహసాగరులు. సర్వుల ప్రతి శుభభావనా సాగరులు... ఇటువంటి పూజ్య ఇష్టదేవ ఆత్మలు మీరు. బ్రాహ్మణ ఆత్మలందరిలోనూ నెంబర్ వారీగా ఈ సంస్కారాలన్నీ ఇమిడియున్నాయి, కానీ ఎమర్జ్ రూపంలో ఇప్పటివరకూ ఇంకా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇష్టదేవాత్మ యొక్క సంస్కారాలను ఎమర్జ్ చేయండి. వర్ణన చేయడంతో పాటు స్మృతిస్వరూపులుగా మరియు సమర్ధ స్వరూపులుగా అయి స్టేజి పైకి రండి. ఈ సంవత్సరంలో సర్వ ఆత్మలు మేము ఎవరినైతే వెతుకుతున్నామో, ఏ ఆత్మలనైతే మేము ఇష్టపడుతున్నామో, ఏ శ్రేష్ఠ ఆత్మల నుండైతే మేము కోరుకుంటున్నామో ఆ శ్రేష్ఠ ఆత్మలు వీరే అని అనుభవం చేసుకోవాలి. అందరి నోటి నుండి లేక మనస్సు నుండి వీరు వారే అన్న శబ్దమే వెలువడాలి. వీరిని కలుసుకున్నట్లయితే తండ్రిని కలుసుకున్నట్లు. ఏదైతే లభించిందో వీరి ద్వారానే లభించింది. వీరే శిక్షకులు, మార్గదర్శకులు, దేవదూతలు, సందేశకులు అని అనుభవం చేసుకోవాలి. వీరే, వీరే, వీరే వారు అన్న ఈ ధుని అందరిలోనూ కలగాలి. 'వీరే వారు' అన్న ఈ శబ్దం యొక్క ధునియే ఉండాలి. లభించారు, లభించారు అన్న సంతోషము యొక్క చప్పట్లు మోగాలి. ఇటువంటి అనుభవాన్ని కలిగించండి. ఇటువంటి అనుభూతిని కలిగించేందుకు విశేషంగా అష్టశక్తి స్వరూపము, అలంకారీ శక్తిస్వరూపము కావాలి, కానీ ఆ శక్తి స్వరూపము కూడా మాతృ స్వరూపంలో ఉండాలి. ఈ రోజుల్లో కేవలం శక్తి స్వరూపము ద్వారా కూడా సంతుష్టులవ్వలేరు, కావున శక్తి మాతగా అవ్వాలి. ప్రేమ మరియు పాలనను ఇచ్చి బాబా యొక్క ప్రతి పిల్లలను ప్రేమ యొక్క ఊయలలో ఊగించండి, అప్పుడే బాబా వారసత్వము యొక్క అధికారులుగా అవ్వగలుగుతారు. బాబాను కలుసుకునేందుకు యోగ్యులుగా చేయడంలో మీరు నిమిత్తముగా శక్తి యొక్క రూపములో ఇటువంటి పవిత్ర ప్రేమను మరియు మీ ప్రాప్తుల ద్వారా శ్రేష్ఠ పాలనను ఇవ్వండి. యోగ్యులుగా తయారుచేయండి అనగా యోగులుగా తయారుచేయండి. మాస్టర్ రచయితలుగా అవ్వడమైతే అందరికీ వస్తుంది కదా! అల్పకాలిక ప్రాప్తులను కలిగించే నామమాత్రపు మహాత్ములు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎంతో రచనను రచించుకుంటారు. ప్రేమను కూడా ఇస్తారు కానీ పాలనను ఇవ్వలేరు.

కావున అనుచరులుగా అయిపోతారు కానీ పాలన ద్వారా పెద్దవారిగా చేసి తండ్రితో కలిపించడం అనగా పాలన ద్వారా తండ్రి యొక్క అధికారులుగా యోగ్య ఆత్మలుగా తయారుచేయలేరు. కావున అనుచరులుగానే ఉండిపోతారు. పిల్లలుగా అవ్వరు. తండ్రి వారసత్వము యొక్క అధికారులుగా అవ్వరు. అలాగే బ్రాహ్మణ ఆత్మలు కూడా రచనను చాలా త్వరగా రచించుకుంటారు, అనగా నిమిత్తముగా అవుతారు కానీ ప్రేమ మరియు పాలన ద్వారా ఆ ఆత్మలను అవినాశీ వారసత్వానికి అధికారులుగా తయారుచేయడంలో చాలా తక్కువమంది మాత్రమే యోగ్య ఆత్మలుగా ఉన్నారు. ఏ విధంగా లౌకిక జీవితంలో తల్లి పాలన ద్వారా పిల్లలను శక్తిశాలిగా తయారుచేస్తుందో తద్వారా తాను ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు తయారుగా అవుతాడో సదా ఆరోగ్యవంతంగా, సంపన్నంగా ఉంటాడో అలాగే శ్రేష్ఠ ఆత్మలైన మీరు జగన్మాతలుగా అయి ఒకరిద్దరు పిల్లలకు తల్లిగా కాక జగత్తుకు తల్లిగా, అనంతమైన తల్లిగా అయి మనస్సు ద్వారా ఇటువంటి శక్తిశాలులుగా అవ్వండి, తద్వారా సదా ఆత్మలు స్వయమును విఘ్న వినాశకులుగా, శక్తి సంపన్నముగా, ఆరోగ్యవంతంగా మరియు సుసంపన్నంగా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు ఇటువంటి పాలన యొక్క అవసరం ఉంది. ఇటువంటి పాలన ఇచ్చేనారు చాలా తక్కువగా ఉన్నారు. పరివారం యొక్క అర్ధమే ప్రేమ మరియు పాలన యొక్క అనుభూతిని కలిగించడం. ఇటువంటి పాలన యొక్క దాహార్తికల ఆత్మలు ఉన్నారు.

కావున ఈ సంవత్సరం ఏం చేయాలో అర్ధమయ్యిందా? అందరి నోటి నుండి, మా సమీప సంబంధీకులు మాకు లభించారు అన్నదే వెలువడాలి. మొదట సంబంధం యొక్క అనుభూతిని కలిగించండి, ఆపై సంబంధం సహజమైపోతుంది. 'మా వారు మాకు లభించారు' అన్న ఈ అల నలువైపులా వ్యాపించాలి. అప్పుడు ఎవరిని పొందాలో వారిని పొందేసాము అన్న మాట నోటి నుండి వెలువడుతుంది. ఏ విధంగా బాబాను భిన్న భిన్న సంబంధాల ద్వారా అధికారీ ఆత్మలైన మీరు అనుభవం చేసుకుంటారో అలా ఆ తపిస్తున్న ఆత్మలు ఏదైతే లభించాలో, ఏదైతే పొందాలో అదంతా వీరి ద్వారానే లభించనున్నది. వీరి ద్వారానే పొందాలి అని భావించాలి. ఆ తర్వాత భిన్న భిన్న పేర్లతో పిలుస్తారు. ఇటువంటి వాయుమండలమును తయారుచేయండి. తల్లి కూడా పిల్లలకు తండ్రి యొక్క పరిచయమును తాను స్వయమే ఇస్తుంది. తల్లియే పిల్లలను తండ్రితో కలిపిస్తుంది. కేవలం మీ వరకే చేసుకోకూడదు. తండ్రితో సంబంధాన్ని జోడించుకునేందుకు యోగ్యముగా తయారుచేయాలి. కేవలం అమ్మా. అమ్మా అంటూ ఉండే చిన్న పిల్లలుగా తయారుచేయకండి. బాబా, బాబా అని అనడం నేర్పించండి, వారసత్వానికి అధికారులుగా తయారుచేయాలి, అర్ధమయ్యిందా?

ఏవిధంగా బాబాను గూర్చి అందరి నోటి నుండి 'నా బాబా' అనే వెలువడుతుందో, అలాగే శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరిపైన కూడా అటువంటి భావనయే ఉండాలి. అటువంటి అనుభూతే ఉండాలి. తద్వారా ప్రతి ఒక్కరూ వీరు నా తల్లి అని అనుభవం చేసుకోవాలి. ఇది అనంతమైన పాలన. ప్రతి ఒక్కరి నుండి వీరు మా స్వంత వారు అనే భావన ఉత్పన్నమవ్వాలి. వీరు నా శుభచింతకులు, సహయోగులు, సేవలో తోడుగా ఉండేవారు అని భావించాలి. దీనినే బాబా సమానముగా అవ్వడం అని అంటారు. దీనినే కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారులుగా అవ్వడం అని అంటారు. సేవా కర్మ యొక్క బంధనలోకి కూడా రాకూడదు. నా స్థానము, నా సేవ, నా విద్యార్ధులు, నా సహయోగీ ఆత్మలు - ఇవి కూడా సేవా కర్మ బంధనలే. ఈ కర్మ బంధన నుండి కర్మాతీతులుగా అవ్వండి. ఈ సంవత్సరం ఏం చేయాలో అర్ధమయ్యిందా? కర్మాతీతముగా అవ్వాలి మరియు 'వీరు వారే, వీరు సర్వస్వము' అన్న అనుభూతిని కలిగించి ఆత్మలను సమీపముగా తీసుకురావాలి. వారి లక్ష్యానికి తీసుకురావాలి. స్వయమును గూర్చి చెప్పారు మరియు సేవను గూర్చి కూడా వినిపించారు. అచ్చా! అందరికీ, ఇప్పుడు ఏం చేయాలి? ఏ అలలను వ్యాపింపజేయాలి? అన్న సంకల్పం ఉంది కదా? అచ్చా!

ఇటువంటి స్వరాజ్యాధికారీ, కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారులకు, సర్వులకు సమీప సంబంధం యొక్క అనుభూతిని కలిగించేవారికి, అనంతమైన ప్రేమ నిండిన పాలనను ఇచ్చేవారికి, ఇటువంటి ఇష్టదేవ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

శక్తిసేనను చూసి బాబా ఎంతో హర్షిస్తారు. శక్తులు సదా బాబాకు తోటివారు, కావున శివశక్తి అన్న గాయనము ఉంది. శక్తులతో పాటు బాబా యొక్క స్మృతిచిహ్నము కూడా ఉంది. కావున మీరు కంబైన్డ్ అయ్యారు కదా! శక్తులు శివునితో వేరుగా లేరు. శివుడు శక్తి నుండి వేరుగా లేరు. ఇలా కంబైన్డ్ గా ఉన్నారు. ఒక్కొక్కరు జగత్ జీతులు. తక్కువేమీ కారు. మొత్తం జగత్తు పైనా మీరు విజయాన్ని పొందుతారు. మీరు జగత్తుపై రాజ్యం చేయాలి కదా! ఆ సేనలో దళములు ఉంటాయి. రెండు, నాలుగు దళాలు ఉంటాయి. ఇక్కడైతే అనంతముగా ఉన్నాయి. అనంతమైన తండ్రి యొక్క సైన్యము మరియు అనంతముపైన విజయము. బాప్ దాదాకు కూడా ఎంతో సంతోషము కలుగుతుంది. పిల్లలు ఒక్కొక్కరు హద్దుకు కాదు, అనంతానికి అధిపతులు. పిల్లలందరూ బాబా యొక్క ముఖములే కదా! బాబా యొక్క ముఖము అనగా ముఖము ద్వారా బాబా యొక్క పరిచయమును ఇచ్చేవారు, కావున గోముఖము యొక్క గాయనము కూడా ఉంది. సదా ముఖము ద్వారా బాబా, బాబా అనే వెలువడితే ఆ ముఖముకు కూడా మహత్వమేర్పడుతుంది కదా!

బాప్ దాదా పిల్లలందరినీ బాబా ఇంటి యొక్క మరియు బాబా యొక్క సింగారముగా భావిస్తారు. కావున బాబా ఇంటి యొక్క సింగారము వెళుతున్నారు. ఇతరులను అలంకరించేందుకు వెళుతున్నారు. ఎంత మందిని అలంకరించి తీసుకువస్తారు? ఒక్కొక్కరు బాబా ముందుకు ఒక పూలగుచ్చితాన్ని తీసుకురావలసి ఉంటుంది. రత్నాలందరూ అమూల్యమైనవారే. ఎందుకంటే బాబాను తెలుసుకున్నారు మరియు బాబా నుండి అన్ని పొందారు. కావున సదా స్వయమును ఇదే సంతోషములో ఉంచుకోండి మరియు అందరికీ ఇదే సంతోషమును పంచుతూ ఉండండి, అచ్ఛా!

సంగమయుగమే నడిచే మరియు నడిపించే యుగము. ఏ విషయములోనూ ఆగిపోకూడదు. నడుస్తూ ఉండడంలోనే మీ యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణము ఉంది. సంగమయుగములో బాప్ దాదా సదా మీ తోడుగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడే తండ్రి పిల్లల ముందు హాజరై ఉంటారు, స్మృతి చేయగానే హాజరవుతారు. చూస్తూ కూడా చూడకుండా ఉండండి. వింటూ కూడా వినకుండా ఉండండి. బాబా మాటలనే వింటూ ఉంటే ముందుకు వెళుతూ ఉంటారు. అచ్ఛా!

Comments