* 09-10-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అంతర్ముఖులే సదా బంధనముక్తులు మరియు యోగయుక్తులు.
ఈరోజు బాప్ దాదా తమ సదా సహయోగి, సదా శక్తిస్వరూపులు, సదా ముక్తులు మరియు యోగయుక్తులు అయిన ఇటువంటి విశేషమైన పిల్లలను అమృతవేళ నుండి విశేషరూపములో చూస్తున్నారు. బాప్ దాదా పిల్లలందరిలోనూ రెండు విషయాల యొక్క విశేషతను చూసారు. 1. ఎంతవరకూ ముక్తులుగా అయ్యారు. 2. ఎంతవరకూ జీవన్ముక్తులుగా అయ్యారు అని గమనించారు. జీవన్ముక్తులు అనగా యోగయుక్తులు. బాప్ దాదా వద్ద కూడా పిల్లల మనసులోని సంకల్పాల ప్రతి క్షణము యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రేఖలను చూసి బాప్ దాదా నవ్వుతూ విశేషముగా ఒక విషయం యొక్క చిత్రాన్ని చూసారు. ఆ చిత్రములో రెండు రకాల లక్షణాలను చూసారు. ఒకరు 'సదా అంతర్ముఖులు' ఆ కారణముగా స్వయమూ సదా సుఖము యొక్క సాగరములో ఇమిడియుంటారు మరియు ఇతర ఆత్మలకు కూడా సదా సుఖము యొక్క సంకల్పాలు మరియు వైబ్రేషన్ల ద్వారా, వృత్తి మరియు మాటల ద్వారా, సంబంధము మరియు సంపర్కము ద్వారా సుఖము యొక్క అనుభూతిని కలిగిస్తారు. రెండవవారు “బాహ్యముఖులు' బాహ్యముఖత అనగా వ్యక్తభావము, వ్యక్తి యొక్క భావ స్వభావాలు మరియు వ్యక్త భావము యొక్క వైబ్రేషన్లు, సంకల్పాలు, మాటలు మరియు సంబంధ, సంపర్కాల ద్వారా సదా బాహ్యముఖత యొక్క కారణముగా ఒకరినొకరు వ్యర్ధము వైపుకు ఉసిగొలుపుకుంటూ ఉంటారు. సదా అల్పకాలికమైన సుఖము యొక్క లడ్డూలను తింటూ మరియు ఇతరులకు కూడా అవే తినిపిస్తూ ఉంటారు. సదా ఏదో ఒక చింతనలో ఉంటారు, ఆంతరిక సుఖము, శాంతి మరియు శక్తి నుండి సదా దూరముగా ఉంటారు, అప్పుడప్పుడూ ఏదో కాస్త అనుభవం చేసుకునేవారిగా ఉంటారు. ఇటువంటి
బాహ్యముఖులను కూడా చూసారు.
దీపావళి వస్తోంది కదా! కావున వ్యాపారస్థులు తమ ఖాతా పుస్తకాలను చూసుకుంటారు. పాత ఖాతాలను, కొత్త ఖాతాలను చూస్తారు. బాబా ఏమి చూస్తారు? బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి పాత ఖాతాలు ఎంతవరకూ సమాప్తమయ్యాయి, కొత్త ఖాతాలలో ఏమేమి జమా చేసుకున్నారు అన్న ఇవే ఖాతాలను చూస్తారు. కావున ఈ రోజు ఈ తేడాను చూస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మా బాబా ఇప్పుడు ఏ విషయమును గూర్చి ఎదురుచూస్తున్నారో నిన్నకూడా వినిపించాము కదా! (ద్వారాలు తెరిచేందుకు) మరి ఈ ప్రారంభోత్సవం కొరకు ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎవరితోనైనా ప్రారంభం చేయించేటప్పుడు ఏమి చేస్తారు? ఏ వస్తువులను సేకరించి ఉంచుతారు? ప్రారంభోత్సవానికి ముందు రిబ్బను కడతారు లేక పూలను కడతారు మరియు వాటిని మొదట కత్తెరతో కత్తిరిస్తారు. ఆ తర్వాత ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి ఆ కత్తెరను ఎక్కడ ఉంచుతారు? పూలతో అలంకరింపబడిన పళ్ళెములో ఉంచుతారు, దాని ద్వారా ఏమి నిరూపింపబడుతుంది? బంధనముక్తులుగా అయ్యేందుకు ముందు స్వయాన్ని గుణాలనే పూలతో సంపన్నం చేసుకోవాలి. అప్పుడు స్వతహాగానే బంధనముక్తులుగా అయిపోతారు. ప్రారంభోత్సవం యొక్క ఏర్పాట్లు ఏమిటి? ఒకవైపు స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి కానీ సంపన్నముగా అయ్యేందుకు ముందు బాహ్యముఖత యొక్క బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి, అలా తయారయ్యారా? బాహ్యముఖత యొక్క రసాస్వాదాలు బయటి నుంచి చాలా ఆకర్షిస్తాయి కావున దానికి కత్తెరను వేయండి. ఈ రసాలే సూక్ష్మమైన బంధనాలుగా అయి సఫలత యొక్క లక్ష్యం నుండి దూరం చేసేస్తాయి. ప్రశంస జరుగుతుంది కానీ ప్రత్యక్షత మరియు సఫలత లభించజాలదు. కావున ఇప్పుడు ప్రారంభోత్సవం యొక్క ఏర్పాట్లను చేయండి. ప్రారంభోత్సవం కొరకు ఏర్పాట్లు చేసేవారు సదా పుష్పాల మధ్యలో బాప్ దాదా ద్వారా నాటబడిన పూలతోటలో పూల యొక్క విశేషతరూపీ సుగంధాన్ని తీసుకోవడంలో మరియు అదే సుగంధాన్ని వాసన చూస్తూ ఉండడంలో సదా తత్పరులై ఉంటారు అనగా వారి జీవితంరూపీ పళ్ళెములో సదా పూలే పూలు ఉంటాయి. అలా తయారుగా ఉన్నారా? ఇందులో నెంబర్ వన్ లోకి ఎవరు వెళతారు? మధువనం వారు వెళతారా లేక ఢిల్లీ వారు వెళతారా? ఎంతో పదవి లభిస్తుంది. బాప్ దాదాతో పాటు ప్రారంభోత్సవం చేసేవారిగా ఉంటారు. దీనికన్నా గొప్ప భాగ్యం ఇంకేమిటి? సమానంగా ఉండే ఆత్మలే తోడుగా ప్రారంభోత్సవం జరుపుతాయి. ప్రారంభోత్సవం జరపడం అనగా సదాకాలికముగా సూక్ష్మవతనవాసులుగా లేక మూలవతనవాసులుగా అవ్వడం అని భావించడం లేదు కదా!
బ్రహ్మా బాబాతోపాటు మూలవతన నివాసులుగా అందరూ అవుతారా లేక కొద్దిమందే అవుతారా? మీరేమి భావిస్తున్నారు? అందరూ సేవాస్థానాలను వదిలి వారితోపాటు వెళతారా? కలిసి వెళతారా లేక ఆగుతారా? (కలిసి వెళతాము) అచ్చా, బ్రహ్మా బాబా సూక్ష్మవతనములోకి వెళ్ళారు. మరి మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మరేమి చేస్తారు? (దాదీతో) (కలిసి వెళతాము) అచ్చా, మరి దీదీ - దాదీ ఇద్దరూ కలిసి వెళతారా? ఏమవుతుంది? ఇది కూడా విచిత్రమైన రహస్యమే. కావున విశేషమైన విషయం - ప్రారంభానికి మీరు తయారుగా ఉన్నారా? ఢిల్లీవారు తయారుగా ఉన్నారా? నిమిత్తసేవాదారులు ఏమి భావిస్తున్నారు? ఇంకేమైనా ఆశలు మిగిలియున్నాయా? (సంగమ సమయం బాగుంది) బాప్ దాదాయే వెళ్ళిపోయాక కూడా ఉంటారా? ఎప్పటివరకూ ఉండాలి? తోడుగా కలిసివెళ్ళేవారు ధర్మరాజుకు టాటా చెబుతారు. అసలు వారు ధర్మరాజు వద్దకే వెళ్ళరు, అచ్ఛా - బాబా అయితే లెక్కాపత్రాలను స్వచ్చముగా ఉండడం చూడాలనుకుంటున్నారు. పాత ఖాతాలు కొద్దిగా కూడా అనగా బాహ్యముఖత యొక్క ఖాతా, సంకల్పం లేక సంస్కార రూపంలో కూడా మిగిలియుండకూడదు. సదా సర్వబంధనముక్తులుగా మరియు యోగయుక్తులుగా ఉండాలి. ఈ బాహ్యముఖత యొక్క వాయుమండలమును సమాప్తము చేసేందుకు ఈ సంవత్సరం విశేషంగా ప్రేరణను ఇస్తున్నారు. సేవ చేయండి, బాగా చేయండి కానీ బాహ్యముఖత నుండి అంతర్ముఖులుగా అయి చేయండి. అది అంతర్ముఖత యొక్క ముఖము ద్వారా జరుగుతుంది. సేవలో బాహ్యముఖతలోకి బాగా వచ్చేస్తున్నారు. కావున సేవ బాగుంది, సేవ ఎంతగానో చేస్తున్నారు అంటూ కేవలం ఈ పేరు మాత్రమే ప్రఖ్యాతమవుతుంది. వీరి బాబా చాలా మంచివారు, తండ్రి ఉన్నతోన్నతమైనవారు అన్న ప్రత్యక్షత యొక్క సఫలత తక్కువగా జరుగుతుంది. కావున బాహ్యముఖత యొక్క రిజల్టును వినిపించారు కదా! ప్రశంస చేస్తారు కానీ ప్రసన్నచిత్తులుగా అవ్వరు. “బాబాకు చెందినవారిగా అయిపోవాలి, ఇదే ప్రసన్నచిత్తులుగా అవ్వడం'.
ఇలా సదా అంతర్ముఖులుగా ఉండేవారికి, సదా ప్రసన్నచిత్తులుగా ఉండేవారికి, ఇతర ఆత్మలను కూడా సదా ప్రసన్నచిత్తులుగా తయారుచేసేవారికి, సదా స్వయాన్ని గుణసంపన్నముగా, బాబా సమానముగా ఉంచుకొనేవారికి, సదా సుఖము యొక్క సాగరములో ఇమిడియుండేవారికి, ఇలా ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అని భావించే ఇటువంటి లగ్నములో మగ్నమై ఉండేవారికి, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఢిల్లీ జోన్:- బాప్ దాదాకు పిల్లలందరూ అతి ప్రియమైనవారే, ఎందుకంటే బాప్ దాదా విశేషతల యొక్క ఆధారముపై డ్రామా అనుసారముగా వారిని ఎంచుకొని ఈ బ్రాహ్మణ పరివారము యొక్క పుష్పగుచ్ఛములోకి తీసుకువచ్చారు. ఇది చైతన్యపుష్పాల యొక్క పుష్పగుచ్చితము కదా! ప్రతి ఒక్క పుష్పములోనూ రంగు, రూపము యొక్క విశేషత వేర్వేరుగా ఉంటుంది. కొన్నింటిలో సుగంధము ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిలో రంగు, రూపము పుష్పగుచ్ఛమును అలంకరించేదిగా ఉంటుంది కానీ రెండింటి యొక్క అవసరమూ ఉంటుంది. కేవలం గులాబీపూల యొక్క పుష్పగుచ్చాన్ని తయారుచేసి అలాగే ఇంకొకటి వెరైటీ పుష్పాలది తయారుచేస్తే రెండింటిలో ఏది అందంగా ఉంటుంది? వెరైటీ కూడా కావాలి కానీ గులాబీ పుష్పాలనైతే సదా మధ్యలో ఉంచుతారు మరియు వెరైటీ పుష్పాలను చుట్టూ అమరుస్తారు, మరి నేనెవరిని? అన్నది ప్రతి ఒక్కరికీ తమను గూర్చి తమకు తెలుసు. బాప్ దాదాల అనంతమైన పుష్పగుచ్ఛంలో నా స్థానం ఎక్కడ ఉంది? అది కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆ పుష్పగుచ్ఛములోనే ఉన్నారు కదా! ఇదైతే పక్కాగా ఉంది, కావుననే మీరు మధువనములోకి వచ్చారు.
పాండవ భవనము (ఢిల్లీ) యొక్క పాండవులు ఏమి చేసారు? స్మృతి చిహ్నాలలో కూడా ఇదే సమాచారాన్ని అడిగారు కదా! పాండవులు ఏమి చేస్తున్నారు? పాండవ భవనము నెక్స్ట్ టు మధువనము. కావున పాండవ భవన నివాసులు సేవ యొక్క ఏ ప్లాన్‌ను తయారుచేస్తున్నారు? ఎటువంటి సేవను చేయాలంటే ఆ సేవ యొక్క కారణముగా అందరి దృష్టి పాండవ భవనము వైపుకు వెళ్ళాలి. ఇది కొత్త విషయం. ఇటువంటి ప్లాన్ నేదైనా తయారుచేసారా? పాండవ భవనము విశ్వములోకే విశేష భవనము. కావున విశేషముగా వి.ఐ.పి. స్థానము అయిపోయింది కదా! కావున ఏ విధముగా వి.ఐ.పి. స్థానముగా ఉందో అలా వి.ఐ.పి. యొక్క సేవ జరగాలి కదా! ఢిల్లీ వి.ఐ.పి.ల నగరము అలాగే స్థానము కూడా వి.ఐ.పి.గా ఉంది మరియు చేసేవారు కూడా మంచి మహావీరులు మరియు వి.ఐ.పి.లు, కావున మరి ఇప్పుడు ఏమి చేస్తారు? ఇప్పుడు మీ దినచర్యను సెట్ చేసుకోండి. ఇక్కడ (మధువనములో ఇంత పెద్ద కార్యము జరుగుతోంది) కానీ దినచర్య సెట్ అయిపోయి ఉన్న కారణముగా నలువైపులా ఉన్న కార్యములో సఫలతను పొందుతున్నారు. కార్యము పెద్దగా ఉంది, కానీ దినచర్య సెట్ అయి ఉన్న కారణముగా కార్యము సరిగ్గా జరిగిపోతుంది. కేవలం ఈ అటెన్షన్ను ఉంచండి. ఉదయం నుంచి రాత్రి వరకూ మీ యొక్క ఫిక్స్ ప్రోగ్రాం యొక్క డైరీని తయారుచేయండి. ఎందుకంటే, మీరు బాధ్యతాయుతులైన ఆత్మలు, మామూలు ఆత్మలు కారు. మీరు విశ్వకళ్యాణకారీ ఆత్మలు కావున వ్యక్తులు ఎంత గొప్పవారైతే అంతగా వారి దినచర్యసెట్ అయి ఉంటుంది. గొప్ప వ్యక్తుల యొక్క గుర్తు ఎక్యురేటుగా ఉండడం. ఆ ఎక్యురేట్ గా ఉండడానికి సాధనము దినచర్య యొక్క సెట్టింగ్. ఒక్క వ్యక్తి 10 వ్యక్తుల యొక్క కార్యాన్ని చేయగలుగుతాడు. అలా సెట్టింగ్ చేయడం ద్వారా సమయము, శక్తి సురక్షితమవుతుంది. శక్తి మిగులుతుంది, తద్వారా ఒక్క కార్యానికి బదులుగా 10 కార్యాలు జరుగుతాయి, అచ్ఛా - సదా సంతుష్ట ఆత్మలేనా? సదా బాబా యొక్క తోడు అనగా సదా సంతుష్టంగా ఉండడం. బాబా మరియు మీరు సదా కంబైన్డ్ గా ఉన్నట్లయితే మరి ఆ కంబైన్డ్ గా ఉండే శక్తి ఎంత గొప్పది! ఒక్క కార్యానికి బదులుగా వేయి కార్యాలను చేయగలుగుతారు. ఎందుకంటే, వేలాది భుజాలు గల తండ్రి మీతో పాటు ఉన్నారు. అందరూ సహయోగులే కదా! బాబాకు చెందిన వారిగా అవ్వడం అనగా సహయోగులుగా అవ్వడం. ఎందుకంటే పిల్లలు అనగా భాగ్యశాలులు.
పిల్లలకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు ఉన్నారు? తల్లి ఉంటూ కూడా ప్రాప్తికి ఆధారము తండ్రియే. ప్రేమ యొక్క సంబంధములో తల్లి గుర్తుకు వస్తుంది. ప్రాప్తి యొక్క సంబంధములో తండ్రి గుర్తుకు వస్తారు. యోగము జోడించవలసిన అవసరం రాకూడదు, అప్రయత్నంగా కూడా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ కనిపించకూడదు. తండ్రికి చెందినవారిగా అవ్వడం అనగా సహయోగులుగా అవ్వడం, అచ్ఛా - ఓం శాంతి.
Comments
Post a Comment