09-02-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మధువన నివాసిసోదరీ సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక .
ఈ రోజు విశేషంగా భాగ్యశాలురైన మధువన వాసులతో కలుసుకొనుటకు వచ్చారు. మధువన వాసుల మహిమను భక్తులు కూడా ఈనాటి వరకు గానము చేస్తున్నారు. బ్రాహ్మణులు కూడా మహిమ చేస్తారు. ఎందుకనగా మధువన భూమికి ఎంత మహిమ ఉందో ఆ భూమిపై నివసించే వారికి కూడా స్వతహాగా వచ్చేస్తుంది. డ్రామానుసారము మధువనం వారికి అన్నిటిలో విశేషమైన అవకాశము లభించింది. బాప్ దాదా వారి చరిత్ర భూమి, కర్మభూమి అయినందున ఎలాగైతే స్థాన ప్రభావం స్థితిపై పడ్తుందో అలా స్వస్థితిలో శ్రేష్ఠతను తీసుకొచ్చి తీవ్ర పురుషార్థులుగా చేయు స్థానమైనందున కూడా మధువనం వారికి విశేషమైన ఛాన్స్ ఉంది. మనసును విశ్వకళ్యాణకారి వృత్తిలో శక్తిశాలిగా చేసే స్థానము. అనగా విశ్వసేవకు ముఖ్యకేంద్రము మధువనము. మధువనంలో వచ్చు అతిథులకు మనసా, వాచా, కర్మణా సేవలతో పాటు ఆత్మిక అవ్యక్త వాతావరణాన్ని తయారుచేయు సేవ లభించే ప్రత్యేకమైన అవకాశముంది. మధువనము వారిని చూచి సర్వాత్మలు సులభంగా అనుసరించడం నేర్చుకుంటారు. ఎలాగైతే మధువనం అనంతమైనదో అలా మధువన నివాసులకు కూడా అనంతమైన సేవలు చేసే అవకాశముంది. తమ కర్మల ప్రాలబ్దపు లెక్కతో ప్రతి ఆత్మకు యథా కర్మ తథా ఫలము లభించనే లభిస్తుంది. కాని ఎంతమంది ఆత్మలు వచ్చారో అంతమందికి సేవ జరిగి వారు తృప్తి చెంది వెళ్తే అంతమంది ఆత్మల తృప్తిలో భాగము మధువన నివాసులకు, అతిథి మర్యాదలు చేసేవారికి లభిస్తుంది కదా. ఇంట్లో కూర్చునే సేవా ఫలితంలో భాగము జమ అయిందంటే అది విశేషమే కదా. అంతేకాక మధువనం వారికి ప్రత్యక్షఫలం లభించుటలో కూడా విశేషత ఉంది. భవిష్య ఫలమేమో తయారవుతూనే ఉంది, అది కాక మధువనం వారికి మరొక ప్రత్యేక లిఫ్ట్ కూడా ఉంది. బాప్ దాదా పాలన అయితే లభిస్తూనే ఉంది, కాని సాకార రూపంలో నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల పాలన కూడా లభిస్తుంది. కనుక డబల్ పాలనల లిఫ్ట్ లభించింది. అంతేకాక అన్ని సాధనాలు రెడీమేడ్ గా లభిస్తున్నాయి. కనుక ఇటువంటి శ్రేష్ఠ భాగ్యశాలురైన మీరు తమ శ్రేష్ఠ భాగ్యాన్ని గుర్తించి సేవలో నిమిత్తంగా ఉంటూ నడుస్తున్నారా? రెండు సర్టిఫికెట్లు లభించినపుడు యజ్ఞ సమాప్తి సమీపంగా ఉందని అంటారు. అందరూ చాలా బాగా కష్టపడ్డారు. ఎవరైతే రాత్రింబవళ్లు తమ తనువు, మనసు, శక్తుల ఖజానాలను సేవాకార్యములో ఉపయోగించారో అటువంటి పిల్లలకు బాప్ దాదా కూడా అభినందనలు తెలుపుతున్నారు. త్యాగము చేసిన వారికి భాగ్యము న్యాచురల్ ఖుషీ రూపములో, తేలికతనాన్ని అనుభవించు రూపములో వెంటనే ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ గుర్తుల ద్వారా ప్రతి ఒక్కరూ తమ రిజల్టు చెక్ చేసుకోండి. ఎంత సమయము త్యాగము, నిష్కామ భావాలుండినాయో, నిమిత్త భావముండినదో లేక మధ్య మధ్యలో ఇంకా ఏదైనా ఇతర భావము మిక్స్ అయ్యిందో చెక్ చేసుకొని భవిష్యత్తు కొరకు పరివర్తన చేసుకోండి. ఇది ఉన్నతి చెందే కళ కొరకు చేయవలసిన విశేష పురుషార్థము.
రెండవ మాట - అందరూ ఒక విశేష గుణాన్ని సదా సహజంగా ఇది నా గుణమే అన్నట్లు ధారణ చెయ్యాలి. ఆ గుణము స్వంతమైపోతే ప్రయత్నించే అవసరముండదు. అది న్యాచురల్ జీవితమైపోతుంది. ఆ విశేష గుణమేదంటే - ఒకరి బలహీనతలు మరొకరు ధారణ చెయ్యకండి, వర్ణించకండి. అది వాతావరణంలో వ్యాపిస్తుంది. ఎవరైనా వినిపించినా, విన్నవారు శుభ భావనతో దానిని దాటేయండి. అంతేగాని ఇలా అనింది నేను కాదు, వారన్నారని అనరాదు. ఎవరో చెప్తే విన్నావు కదా, అది నిజమే కదా! ఎలాగైతే చెప్పేవారికి (పాపం) తయారవుతుందో అలా వినేవారికి కూడా తయారవుతుంది. శాతములో వ్యత్యాసముంది కాని తయారేమో అవుతుంది కదా? వ్యర్థ చింతన లేక బలహీనతలను గురించిన మాటలు నడవరాదు. జరిగిపోయిన విషయాలను కూడా దయాహృదయులై ఇముడ్చుకోండి. ఇముడ్చుకొని శుభ భావన ద్వారా ఆ ఆత్మ పట్ల మనసాసేవ చేస్తూ ఉండండి. 5 తత్వాల పట్ల కూడా మీకు శుభ భావన ఉంది కదా. మరి మీరు సహయోగి బ్రాహ్మణాత్మలు కదా. భలే సంస్కార వశమై ఎవరైనా ఉల్టాగా(తప్పుగా) మాట్లాడినా, చేసినా లేక విన్నా మీరు ఆ ఒక్కరిని పరివర్తన చెయ్యండి. ఒకరి నుండి రెండవవారికి, రెండవ వారి నుండి మూడవ వారికి - ఇలా వ్యర్థ మాటల మాల యొక్క దీపమాలగా కారాదు. ఈ గుణాన్ని ధారణ చెయ్యండి. ఎవరి మాటలనైనా వినుట, వినిపించుట కాదు, ఇముడ్చుకోవాలి. సహయోగలై మనసు ద్వారా లేక వాచా ద్వారా వారిని కూడా ముందుకు తీసుకెళ్లండి. అయితే జరిగేదేమంటే - ప్రతి ఒక్కరికి ఒక మిత్రుడుంటాడు. ఆ ఒక్కరికి మరొక మిత్రుడు, ఆ రెండవ మిత్రునికి మూడవ మిత్రుడు ఉంటాడు. ఇటువంటి వ్యర్థ మాటల మాల పెద్దదై నలువైపులా వ్యాపిస్తుంది. అందువలన ఈ విషయాల పై గమనముంచండి. అచ్చా.
మధువనంలోని పాండవుల యూనిటీకి(ఐకమత్యానికి) కూడా విశేషత ఉంది. పూర్తి సీజనంతా నిర్విఘ్నంగా జరిగిందంటే 'నిర్విఘ్న భవ' వరదానులుగా అయ్యారు కదా! సేవ యొక్క సఫలతలో అందరూ పాస్ అయ్యారు. ఇది సేవ చెయ్యడం కాదు, మేవా(బాదం, ద్రాక్ష మొదలైన డ్రై ఫలాలు) తినడం. సర్వ బ్రాహ్మణ పరివారము యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా అగుట - ఇది మేవా తినినట్లా లేక సేవ చేసినట్లా?
Comments
Post a Comment