09-01-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అలౌకిక దస్తులు మరియు అలౌకిక శృంగారము.
ఈ రోజు బాప్ దాదా విశేషించి నలువైపులా ఉన్న పిల్లల రమణీయ స్థితిని చూస్తూ ఉన్నారు. ఆ స్థితిని చూసి మందహాసము చేస్తున్నారు, అప్పుడప్పుడు బాప్ దాదాకు విశేషమైన నవ్వు కూడా వస్తూ ఉంది. అది ఎలాంటి స్థితి? సంగమయుగీ సర్వ శ్రేష్ఠమైన వజ్రతుల్య యుగ నివాసులు మరియు సర్వ శ్రేష్ఠమైన బాప్ దాదా పిల్లలు, ఈశ్వరీయ సంతానము, బ్రాహ్మణ కులంలోని శ్రేష్ఠ ఆత్మలు మరియు అల్లారు ముద్దు పిల్లలు, అపురూపమైన పిల్లలకు బాప్ దాదా విశేషించి రోజంతటికి రకరకాల డ్రస్సులు మరియు శృంగారాలు, వాటి జతలో కూర్చునేందుకు స్థానాలు మరియు ఆసనాలు ఎంత శ్రేష్ఠమైనవి ఇచ్చారో చూస్తున్నారు. ఎటువంటి సమయమో అటువంటి డ్రెస్ మరియు అలాంటి శృంగారాన్ని చేసుకోగలరు. సత్యయుగంలో రకరకాల డ్రస్సులు మరియు శృంగారాలను మార్చుకుంటారు. కాని సంస్కారాలనైతే ఇక్కడి నుండే నింపుకోవాలి కదా! బ్రాహ్మాబాబా సంగమయుగం యొక్క రకరకాల దుస్తులు మరియు అలంకరణలతో బ్రాహ్మణ పిల్లలను అలంకరించారు. కాని ఏ రమణీయమైన స్థితిని చూశారు? ఇంత అందమైన దుస్తులు మరియు అలంకరణలు ఉన్నా కొంతమంది పిల్లలు పాత దుస్తులు, మట్టి పట్టిన మురికి దుస్తులను ధరిస్తున్నారు.
అమృతవేళ డ్రెస్ మరియు శృంగారం గురించి తెలుసా? రోజంతటిలో ధరించే రకరకాల డ్రస్సులు, అలంకరణలు ఏవో తెలుసా? బాప్ దాదా ద్వారా పిల్లలకు రకరకాల టైటిల్స్ (స్వమానాలు) లభించాయి. రకరకాల టైటిల్స్( బిరుదుల) స్థితిలో స్థితులవ్వడమే దుస్తులు ధరించడం. శృంగారమనగా భిన్న భిన్న గుణాలనే నగల సెట్. అనేక రకాల దుస్తులు, నగల సెట్లు ఉన్నాయి. ఎటువంటి దుస్తులో అటువంటి నగల సెట్ ధరించి అందుకు తగినట్లు అలంకరించబడిన సీటులో సదా స్థితులై ఉండండి. మీకు ఎన్ని డ్రస్సులున్నాయో లెక్కపెట్టండి. మీకిచ్చిన టైటిళ్ల స్థితిలో స్థితులవ్వడమనగా దుస్తులు ధరించడం. ఒకసారి విశ్వకళ్యాణకారీ డ్రస్సును, ఒకసారి మాస్టర్ సర్వశక్తివాన్ డ్రస్సును, మరొకసారి స్వదర్శన చక్రధారి డ్రస్సును ధరించండి. ఎటువంటి సమయమో, ఎలాంటి కర్తవ్యమో, అలాంటి దుస్తులు ధరించండి. తోడుగా భిన్న భిన్న నగల సెట్లను ధారణ చేయండి. చేతులకు, మెడలకు, చెవులకు మరియు మస్తకంలో ఈ శృంగారముండాలి. మస్తకంలో నేను ఆనంద స్వరూపాన్ని అను స్మృతిని ధారణ చెయ్యండి. ఇది మస్తకంలోని పాపిడి బొట్టు అవుతుంది. నోటి ద్వారా అనగా కంఠంలో కూడా ఆనందాన్ని కలిగించే మాటలు ఉండాలి. ఇది కంఠహారమవుతుంది. చేతుల ద్వారా అనగా కర్మలో కూడా ఆనందస్వరూప స్థితి ఉండాలి. ఇవి చేతులకు కంకణాలు(గాజులు) అవుతాయి. చెవుల ద్వారా కూడా ఆనంద స్వరూపంగా అయ్యే మాటలు వింటూ ఉండాలి. ఇవి చెవులకు శృంగారము. పాదాల ద్వారా ఆనంద స్వరూపంగా తయారుచేసే సేవ వైపు అడుగు వేయాలి. అనగా ప్రతి అడుగు ఆనంద స్వరూపంగా తయారై ఇతరులను తయారు చేసేందుకే వేయాలి. ఇది పాదాలకు అలంకారము. ఇప్పుడు ఒక సెట్ ను అర్థం చేసుకున్నారు కదా? పూర్తి సెట్‌ను ధరించారా? ఇలా వేర్వేరు సమయాలలో వేర్వేరు సెట్లు ధరించండి. సెట్‌ను ధరించడం వస్తుంది కదా? లేక కంఠాన్ని వదిలేస్తారా? ఈనాటి ప్రపంచంలో సెట్ ధరించే ఆచారముంది. మీకు ఇన్ని శ్రేష్ఠ శృంగారాల సెట్లు ఉన్నాయి. వాటిని ధారణ ఎందుకు చెయ్యడం లేదు? ఎందుకు ధరించుట లేదు? ఇన్ని రకాలైన అందమైన డ్రెస్లను వదిలి దేహాభిమానపు స్మృతి గల మట్టి డ్రెస్ (మురికి దుస్తులను) ఎందుకు ధరిస్తున్నారు?
ఈ రోజు దుస్తులు మరియు శృంగారాల పోటి చూశారు. ఏ పిల్లలు రోజంతా అలంకరించబడి ఉంటున్నారు, ఏ పిల్లలు డ్రస్సులు మార్చుకోవడంలో, ధరిస్తూనే తీసేయడంలో లగ్నమై పోతున్నారో చూస్తున్నారు. ఇప్పడిప్పుడే ఒక డ్రెస్ ధరిస్తారు, ఇప్పుడిప్పుడే ఆ డ్రెస్ తీసేసి తుచ్ఛమైన తక్కువ విలువ గల డ్రెస్ ను ధరిస్తారు. శ్రేష్ఠమైన, అందమైన డ్రెస్ ను ఎక్కువ సమయం ధరించలేకున్నారు. ఇంకా ఏమి చూశారు? కొంతమంది పూర్తిగా దుర్వాసన వచ్చే దుస్తులను ధరిస్తున్నారు. ఎలాంటి దుర్గంధం? దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాలపై ఆకర్షణ అనే దుర్వాసన వచ్చే డ్రెస్ ను ధరిస్తున్నారు. దూరం నుండే ఆ చెడు వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది మురికి చర్మంతో చేసిన డ్రెస్ ను ధరించారు. అనగా వికారీ చర్మాన్ని చూచే మురికి చర్మపు డ్రెస్ ను ధరించి ఉన్నారు. కొంతమంది దుస్తుల పై మురికి మచ్చలు కూడా అంటుకుని ఉన్నాయి. మురికి మచ్చలనగా ఇతరుల అవగుణాలు అనగా(ఆ మరకలను) ఆ మచ్చలను తమలో ధారణ చెయ్యడం. కావున మురికి మురికిగా మచ్చలు కల్గిన డ్రెస్లు కూడా ఉన్నాయి. కొంతమంది డ్రెస్ చాలా పాడైపోయి రక్తపు మరకలతో ఉంది. అది అలా ఎందుకు ఉంది? మాటిమాటికి వికర్మలను చెయ్యడం అనగా ఆత్మహత్య చేసుకొనుట. ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితిని హత్య చేసుకొనుట. ఇలాంటి దుస్తులు వేసుకున్నవారు కూడా ఉన్నారు. సుందరమైన బిరుదుల స్థితి కలిగిన డ్రెస్లు ఎక్కడ, ఈ మురికి డ్రెస్లు ఎక్కడ అని ఆలోచించండి. శ్రేష్ఠ ఆత్మల డ్రెస్లు కూడా శ్రేష్ఠంగా ఉండాలి. కావున ఏమి చూశారు? కొంతమంది పిల్లలు రోజంతా అదే శ్రేష్ఠమైన డ్రస్సులో, శృంగారాల సెట్లను ధరించి సీటుపై మంచిగా స్థితులై ఉన్నారు. మరి కొంతమంది ఇంత గొప్ప డ్రెస్లు ఎదురుగా ఉన్నా ధరించాలని అనుకుంటూ కూడా ధరించలేకున్నారు. అందువలన అమృతవేళ నుండి శ్రేష్ఠ శృంగారాల సెట్ను ధరించండి. శ్రేష్ఠమైన టైటిల్స్ అనే డ్రస్సును ధరించినప్పుడు, గుణాల శృంగారము చేసుకుంటే అప్పుడు ఎలాగైతే సత్యయుగంలో విశ్వ మహారాజు మరియు విశ్వ మహారాణుల రాజ దుస్తుల వెనుక దాస దాసీలు డ్రస్ పట్టుకొని నడుస్తారో అలా ఇప్పుడు మాయాజీతులు, సంగమ యుగపు స్వరాజ్యాధికారుల టైటిల్స్ అనే డ్రస్సులో స్థితమై ఉండు సమయంలో పంచతత్వాలు, పంచ వికారాలు తమ డ్రస్సును వెనుక నుండి పట్టుకుంటాయి అనగా మీకు అధీనమై నడుస్తాయి.
మాయాజీతుల వెనుక ఈ రావణుని పది తలలు 10 సేవాధారులై ఎలా నడుస్తాయో ఆ దృశ్యాన్ని తమ ఎదురుగా తీసుకురండి. కానీ డ్రస్ బిగుతుగా అనగా సరిగ్గా ఉండాలి అంతేకాక నిరంతరం అనగా పొడవుగా, వెడల్పుగా ఉన్నపుడే ఆ 10 సేవాధారులు మీ వెనుక వెనుక మీ దుస్తులు పట్టుకొని వస్తారు. ఈనాటి రాజులు, రాణులు కూడా పాదాల వరకు వ్రేలాడు ఒక విధమైన పెద్ద గౌనులాంటి, చాలా పొడువుగా వెడల్పుగా ఉండే దుస్తులు ధరిస్తారు. అవి వెనుక ఇంకొకరు ఎత్తి పట్టుకునే విధంగా ఉంటాయి. ఒకవేళ నిరంతరం పొడవుగా ఉండక, నిరంతరం టైటిల్స్ తో బిగుతుగా లేకుంటే ఈ సేవాధారులే డ్రస్సును తీసేస్తారు. ఎందుకంటే వదులుగా ఉంటుంది కదా! అందువలన ఇప్పుడు దృఢ సంకల్పంతో మీ బిరుదుల డ్రస్సును బిగుతుగా చేసుకోండి. దృఢ సంకల్పం అనేది బెల్టు. దీనితో బిగించినట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. అంతేకాక సదా సేవాధారులు అధీనమై ఉంటారు. వినిపించాను కదా! వికారాలు పరివర్తనై సహయోగులుగా, సేవాధారులుగా అవుతాయి. ఇప్పుడు డ్రస్సును ధరించడం వచ్చేసింది. (టైట్) బిగించడం కూడా వచ్చేసింది. ఏ సమయంలో ఏ డ్రస్ కావాలంటే ఆ డ్రస్సును ధరించండి. కానీ మురికిగా ఉన్న డ్రస్సును ధరించకండి. వెరైటీ డ్రస్సులు మరియు వెరైటీ శృంగారాల లాభం తీసుకోండి. బ్రహ్మాబాబా, బాప్ దాదాలు సంగమ యుగపు కట్నం ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కనుక కట్నం కూడా లభిస్తుంది కదా! కావున కట్నం ఈ వెరైటీ శృంగారాల సెట్ మరియు అందమైన డ్రస్ బాప్ దాదా ఇచ్చిన కట్నాన్ని వదిలి పాత కట్నాన్ని ఉపయోగించకండి. కొంతమంది పిల్లలు బాప్ దాదా ఇచ్చే కట్నాన్ని కూడా తప్పకుండా తీసుకుంటారు లేక తీసుకున్నారు కూడా. అయితే అందుకు తోడుగా పాత డ్రస్సును కూడా దాచుకొని ఉంచుకున్నారు. అందువలన అప్పుడప్పుడు దానిని కూడా ధరిస్తారు. ఎప్పుడైతే పాతదానిపై ఆకర్షణ ఉంటుందో అప్పుడు పాత డ్రస్సును ధరిస్తారు. విలువైన డ్రస్సును వదిలి చినిగిపోయిన డ్రస్సు ధరిస్తారు కావున ఇలా చేయకండి. ఇప్పటివరకు దాచుకొని ఉంటే దానిని కాల్చేయండి, కాల్చేసి బూడిదను కూడా మీ వద్ద ఉంచుకోకండి. దానిని కూడా సముద్రంలో స్వాహా చేస్తే సదా అంలకరించబడి ఉంటారు. అంతేకాక తండ్రితో పాటు హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. ఈ సింహాసనం నుండి దిగితే ఉరికంబపు కొయ్య పలక పైకి వచ్చేస్తారు. అప్పుడప్పుడు లోభము, అప్పుడప్పుడు మోహంలోకి వచ్చేస్తారు. కావున ఈ కొయ్య సింహాసనాధికారులుగా కండి. కట్నాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నారు కదా! ఉపయోగించండి. కట్నాన్ని అలాగే ఉంచుకోకండి. కేవలం చూస్తూ చాలా బాగుంది, చాలా బాగుంది అనడం కాదు, ధారణ చెయ్యండి. డ్రస్సుల పోటిలో ఫస్టు నంబర్లో రావాలి. వినిపించాను కదా, నంబరు “నిరంతరం" అనే దానిపై ఆధారపడి ఉంటుంది. డ్రస్సును ధరించడం అయితే అందరికీ వస్తుంది. కాని డ్రస్ సదా టిప్ టాప్ గా ఉంచుకోవడం రాదు. కావున సదా అలంకరింపబడిన వారికే నంబర్ ఉంటుంది. పోటీలో విదేశీయులు మొదటి నంబరు తీసుకుంటారా లేక భారతవాసులు తీసుకుంటారా! ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అక్కడ బహుమతి ఇస్తారు. కనుక ఒక్కరికే ఫస్ట్ నంబర్ వస్తుంది. ఇక్కడైతే చాలా మంది ఫస్ట్ నంబర్ గా కావచ్చు. ఇక్కడ తరగని ఖజానా ఉంది అందువలన ఎంతమంది ఫస్ట్ వస్తే వారందరికీ ఫస్ట్ సైజు లభిస్తుంది. మంచిది రేపటి నుండి ఏమి చేస్తారు?
అమృతవేళ నుండి రకరకాల డ్రస్సులు, శృంగారాల సెట్స్ తో అలంకరించుకొని రోజంతా తండ్రి జతలో ఉండండి. అమృతవేళ నుండే ఫస్ట్ నంబరు దుస్తులు ధరించండి. ఇలా అలంకరింపబడిన ప్రేయసులను బాబా తన వెంట తీసుకెళ్తారు. ఇతరులను తీసుకెళ్లరు. ఎవరైతే పోటీలో ఫస్టు నంబరులోకి వస్తారో, వారే జతలో ఉంటారు, జతలో నడుస్తారు. ఎవరైతే ఉండరో వారు తోడుగా కూడా రారు. కనుక సదా ఈ స్లోగన్ గుర్తుంచుకోండి అనగా "తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము" అనే తిలకం దిద్దుకోండి. పోటీలో ఎంత బాగా అనిపించాలో అర్థమయింది కదా! తండ్రి బ్రహ్మాబాబాకు వతనంలో ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. పిల్లల స్మృతి అయితే బ్రహ్మాబాబాకు కూడా ఉంటుంది. అందుకే పిల్లల పరిస్థితిని తండ్రి చూపిస్తూ ఉంటారు.
ఈవిధంగా సదా అలంకరింపబడిన మూర్తులకు, సంగమ యుగ శ్రేష్ఠ జీవిత మహత్యాన్ని తెలుసుకున్న మహాన్ ఆత్మలకు, శత్రువును కూడా సేవాధారిగా, సహయోగిగా తయారు చేసుకునే మాస్టర్ సర్వ శక్తివంతులకు సదా తండ్రి మరియు మీరు "ఈ విచిత్రమైన యుగల్ రూపంలో ఉండువారికి, ఇలాంటి పరమ పూజ్యులకు, మహిమా యోగ్యులైన ఆత్మలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
సేవాధారి పిల్లల పట్ల బాప్ దాదా మధుర మహావాక్యాలు-
సేవాధారీ పిల్లల మహిమ చాలా మహోన్నతమైనది. ఎందుకంటే తండ్రి సమానంగా ఉన్నారు కదా! తండ్రి కూడా పిల్లల సేవ చేయుటకు వస్తారు. మీరు కూడా సేవకు నిమిత్తముగా ఉన్నారు కనుక సమానత ఉంది కదా! సమానంగా ఉన్నవారికి మహిమ ఉంటుంది. సమానంగా ఉండువారే సదా తోడుగా ఉండగలరు. సమానంగా లేకుంటే తోడుగా కూడా ఉండలేరు. తండ్రి సమానం అనగా సదా స్వమానములో ఉండేవారు. తండ్రి తన స్వమానాన్ని ఎప్పుడూ మర్చిపోరు. కావున తండ్రి సమానమైనవారు అనగా సదా స్వమానంలో ఉండేవారు. ఇలా ఉన్నారా? ఎలాగైతే శరీర స్మృతి సహజంగా ఉంటుందో అలా సదా తండ్రి మరియు సేవ ఈ రెండింటి స్మృతి స్వతహాగా ఉండాలి. స్మృతి చేసే పని ఉండదు కానీ స్వతహాగానే స్మృతి ఉంటుంది. ఇలాగే తండ్రి స్మృతి మరియు సేవ కూడా స్వతహాగానే జ్ఞాపకం ఉండాలి. ఒకవేళ స్మృతిలో ఉండేందుకు మీరు కష్టపడుతూ ఉంటే ఇతరులను సహజయోగులుగా ఎలా చేస్తారు. సేవాధారి పిల్లల అర్హతలే సహజ యోగులు, స్వతహా యోగులు.
ఇప్పుడు సమయానుసారము కష్టం అనే మాట సమాప్తమవ్వాలి. ఒకవేళ ఇప్పుడు కూడా కష్టం అనుభవం అవుతూ లేక ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటే తమ కర్తవ్యాన్ని చెయ్యలేరు. ఎందుకు, ఏమిటి అనడం అనగా క్యూలో నిలబడటం. ఒకవేళ స్వయం క్యూలో ఉన్నట్లయితే ఇతరులను తృప్త ఆత్మగా ఎలా చెయ్యగలుగుతారు. స్వయమే తీసుకోనేవారిగా ఉన్నట్లయితే దాతగా ఎలా కాగలుగుతారు. సేవాధారి అనగా ఇస్తూ వెళ్ళండి మరియు తోడగా తీసూకుంటూ వెళ్ళండి. స్వయమే ఎందుకు, ఏమిటి అనేవారిగా ఉంటే వారు భికారులలాగా అడుక్కునేవారిగా ఉంటారు. శక్తి ఇవ్వండి, సహయోగం ఇవ్వండి. నేను ఈ పని చేస్తున్నాను మీరు సఫలతనివ్వండి అని దరఖాస్తులు పెట్టుకోవడం కూడా రాయల్ బికారితనం అవుతుంది. ఎవరైతే స్వయం భికారుల క్యూలో ఉంటారో వారు ఇతరులకు దాతగా అయ్యి ఎలా ఇవ్వగలరు? ఇప్పుడు బాల్యం సమాప్తమయ్యింది. బాల్యంలో అన్నిటికీ స్వేచ్ఛ ఉండేది. ఏడ్చుటకు, ఫీలింగ్ లోకి వచ్చుటకు, సంకల్పాలకు కూడా స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడలా లేదు. ఇప్పుడు వానప్రస్థ స్థితికి చేరుకున్నారు కదా! బాల్యంలోని మాటలు వానప్రస్థంలో ఉండవు. దీనిలో ఎందుకు, ఏమిటి అనేది లేదు. ఎందుకు, ఏమిటి అనేవారు అనగా బేబీ(చిన్న పిల్లల) క్వాలిటీవారు. ఎవరైతే బేబీగా ఉంటారో వారు బీబీగా (పత్నిగా) కాలేరు. ఇప్పుడిది పతి-పత్నుల విషయము. ఇప్పుడు బాల్యం సమాప్తమయ్యింది. తండ్రి సమానంగా అయ్యారంటే పతి పత్నిగా అయ్యారు కదా! చిన్న పిల్లలను సమానమని అనరు. ఎప్పుడైతే పెద్దగా అవుతాడో లేక తండ్రిగా అవుతాడో అప్పుడు సమానమని అంటారు. కావున ఇప్పుడు బేబీ క్వాలిటీ సమాప్తమవ్వాలి.
సంస్కారం కలవడం లేదు అనే సంకల్పం కూడా రాకూడదు. కలుపుకోవాల్సిందే. కలవడం లేదని ఎవరంటారు? వీళ్ళు మారడం లేదు, వినడం లేదు - ఇలా లేదు. లేదు అని ఇలాంటి భాష మాట్లాడేవారు ఎవరు? ఇప్పుడు “జరగాల్సిందే. అలాగే " అని అనాలి. లేదు అనే మాట సమాప్తమవ్వాలి. కనుక మీరందరూ అలాగే అలాగే అనేవారే కదా! ఇప్పుడు బేహద్ లో ఉండండి. హద్దును వదిలేయండి. వినిపించాను కదా ఏ జోన్ హెడ్ అయినా కావచ్చు ఇది కూడా హద్దు కదా. మ్యాపులో చూడండి మీ జోన్ ఎలా ఉంది. బిందువు కదా! ఇది హద్దే కదా. ఫలాన స్థానానికి చెందినవారు అని కూడా ఉండరాదు. ఫలానా స్థానంలోనే బాగున్నారు. ఇది కూడా హద్దు. బేహద్ కు యజమానిగా అవ్వాలా లేక ఒక్క స్థానానికి మాత్రమే అవ్వాలా? స్థానం మారితే కొంచెం స్థితి కూడా మారుతుంది అని కూడా ఉండరాదు. ఇక్కడకు, అక్కడకు ఎక్కడనైనా ఇప్పుడే పంపిస్తాము తయారుగా ఉన్నారా? విదేశానికి పంపించినా లేక ఏ స్థానానికి పంపించినా ఎవరెడిగా ఉండాలి. దేశంలోకి పంపినా, విదేశాలకు పంపినా ఎవరెడీగా ఉండాలి. అలా వెళ్ళడం జరిగినపుడు శక్తి స్వతహాగానే లభిస్తుంది. రేపటి నుండి అందరినీ మార్చమంటారా! మంచిది, క్రొత్త బులెటన్ తీయండి, తర్వాత వెళ్ళము అని అనకండి తయారు కావడానికి ఇంకా సంవత్సరం ఇవ్వండి, నాలుగు నెలలు ఇవ్వండి, రెండు నెలలు ఇవ్వండి అని అనరు కదా. ధైర్యం ఉందా? అసలు మీదంటూ ఏముంది? ఒకవేళ ఉంటే అంతా మీదే, లేనే లేకుంటే మీదంటూ ఏమీ లేదు. తండ్రిది ఏదో మీది కూడా అదే. తండ్రిది అనంతం అయితే మీది కూడా అనంతమే. “అందరూ నా వారే" - దీనినే బేహద్ అని అంటారు.
బాప్ దాదా పిల్లలందరికీ సదా విశేష సహయోగాన్ని ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో అలాంటి విశేష సేవాదారులకు విశేష సహయోగం సదా ప్రాప్తిస్తూనే ఉంటుంది. విశేష కార్యం చేసేవారే మొదట జ్ఞాపకం వస్తారు కదా! లౌకికంలో కూడా హిస్టరీలో ముందు ఎవరు గుర్తుకొస్తారు? విశేష వ్యక్తులే కదా. సంగమ యుగ చరిత్రలో కూడా ఎవరు ఎంత విశేష సేవాధారులుగా ఉంటారో వారే విశేష ఆత్మలు. కనుక బాప్ దాదా ఎప్పుడు స్మృతి చేసినా మొట్టమొదట వారే స్వతహాగా జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకముంచుకోండి అని చెప్పాలిన అవసరమే ఉండదు. కేవలం విశేష స్మృతికి బదులు ఇచ్చేవారిగా కండి. తండ్రి అందరికీ స్మృతికి బదులు ఇస్తారు కానీ తీసుకునేవారు అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా తీసుకోరు. తండ్రి వద్ద ఏదైతే ఉందో అది ఇవ్వడం కొరకే కనుక తండ్రి ఏమో అందరికీ ఇస్తారు కానీ తీసుకునేవారు నంబర్‌వార్‌గా ఉన్నారు.
Comments
Post a Comment