08-11-1981 అవ్యక్త మురళి

* 08-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

తేడాను సంపన్నం చేసేందుకు సాధనము -'తక్షణ దానము మహాపుణ్యము'.

ఈ రోజు బాప్ దాదా, ఉదయం ప్రాతఃకాలంలో వతనంలో బాప్ దాదాలిరువురి మధ్య జరిగిన ఆత్మిక సంభాషణల యొక్క కథను చిత్రాల సహితంగా వినిపిస్తారు. కథను వినే అభిరుచి అందరికీ ఉంది కదా! మరి ఈనాటి కథ ఏమిటి? బ్రహ్మాబాబా వతనంలోని తోటలో షైర్ చేస్తున్నారు. షైర్ చేసే సమయంలో బాబా ముందు సదా ఎవరు ఉంటారు? ఇదైతే మీకు బాగా తెలుసు కదా! కావున బాబా పిల్లల యొక్క మాలను స్మరిస్తున్నారు. అది ఏ మాల? గుణాల యొక్క మాల. కావున బ్రహ్మా బాబా గుణమాలను స్మరిస్తున్నారు. శివబాబా బ్రహ్మా బాబాతో నీవు ఏం స్మరిస్తున్నావు అని అడిగారు. మీ పని ఏదైతే ఉందో అదే నా పని కూడా, నేను పిల్లల యొక్క గుణమాలను చూస్తున్నాను అని అన్నారు. ఏమేమి చూశావు అని శివబాబా అడిగారు. బాబా ఏం చూసుంటారు? కొందరు పిల్లల సద్గుణాల మాల కేవలం నెక్లెస్ వలే ఉంది, మరికొందరిది కాళ్ళవరకూ పొడుగ్గా ఉంది. కొందరు పిల్లలకైతే ఎన్నో వరుసల మాల ఉంది. కొందరు పిల్లలు ఎన్ని మాలలతో అలంకరింపబడి ఉన్నారంటే ఆ మాలలు వారి వస్త్రాలుగా అయిపోయాయి.

బ్రహ్మా బాబా వెరైటీ గుణమాలలతో అలంకరింపబడి ఉన్న పిల్లలను చూస్తూ ఎంతో హర్షిస్తున్నారు. మీ అందరికీ మీ గుణమాలను గూర్చి తెలుసా? మీరు ఎంతగా అలంకరింపబడి ఉన్నారో మీ చిత్రాన్ని చూస్తున్నారా? బ్రహ్మా బాబా చిత్రరేఖగా అయి చిత్రాన్ని గీస్తున్నారు అనగా చిత్రంలో భాగ్యం యొక్క రేఖలను దిద్దుతున్నారు. మీరు స్వయమూ స్వయం యొక్క చిత్రాన్ని అనగా భాగ్యం యొక్క రేఖను దిద్దుకోగలరు కదా! ఫొటో తీయగలరు కదా! ఫొటో తీయడం వచ్చా? మీదా లేక ఇతరులదా? మీ ఫొటో తీయడం వస్తుందా? కావున ఈ రోజు వతనంలో అందరి యొక్క ఫొటో ఉంది. ఎంత పెద్ద కెమెరా ఉండి ఉంటుంది! కేవలం మీదే కాదు బ్రాహ్మణులందరి యొక్క ఫొటో ఉంది. మాలల యొక్క సింగారమును చూస్తూ కొందరు పిల్లల యొక్క విశేషతను ఏ విధంగా చూశారు? ప్రతి గుణము వజ్రాల రూపంలో వెరైటీ రూపురేఖలు మరియు రంగు కలిగి ఉండడం చూశారు. విశేషంగా 4 రకాల రంగులు ఉన్నాయి. అందులో ముఖ్యమైన 4 సబ్జెక్టుల యొక్క 4 రంగులు ఉన్నాయి. మీకు సబ్జెక్టులైతే తెలుసు కదా!

జ్ఞానము-యోగము - ధారణ మరియు సేవ. జ్ఞాన స్వరూపానికి గుర్తుగా ఏ రంగు ఉంటుంది? జ్ఞాన స్వరూపానికి గుర్తు బంగారు రంగు. అది స్వల్పమైన స్వర్ణిమ వన్నెలో ఉన్న కారణంగా ఆ ఒక్క వజ్రం నుండి అన్ని రంగులు కనిపించాయి. ఆ ఒక్క వజ్రం నుండే భిన్న భిన్న రంగులు కిరణాలలా మెరుస్తూ కనిపించాయి. దూరం నుండి సూర్యుడు ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇదైతే ఆ సూర్యుని కన్నా సుందరమైనది. ఎందుకంటే సర్వ రంగుల యొక్క కిరణాలు దూరం నుండే స్పష్టంగా కనిపించాయి. ఆ చిత్రం మీ ముందుకు వస్తోంది కదా!  వజ్రం ఎలా ప్రకాశిస్తోంది? స్మృతి యొక్క చిహ్నము సహజమే కదా! స్మృతిలో ఎక్కడ కూర్చున్నా ముందు ఏం చేస్తారు? ఎర్ర రంగు. కాని ఈ ఎరుపు రంగులో స్వర్ణిమ రంగు కూడా కలిసి ఉంది, కావున మీ ఈ ప్రపంచంలో ఆ రంగు లేదు. చెప్పేటప్పుడు మాత్రం ఎరుపు రంగు అనే అంటారు.

ధారణకు గుర్తు - తెల్లరంగు. కాని తెల్లరంగులో కూడా ఏ విధంగా అయితే చంద్రుని ప్రకాశంలో మధ్యలో స్వర్ణిమ రంగు కలిపినా లేక చంద్రుని రంగులో కాస్త పసుపు రంగు కలిపినా వెన్నెలలాగానే కనిపిస్తుంది. కాని కాస్త స్వర్ణిమంగా ఉన్న కారణంగా దాని ప్రకాశము ఇంకా సుందరమైపోతుంది. ఇక్కడ ఆ రంగును తయారుచేయలేరు ఎందుకంటే అది ప్రకాశించే రంగు. ఎంతగా ట్రయల్ చేసినా, కాని వతనంలోని రంగులు ఇక్కడకు ఎలా రాగలవు?

సేవకు గుర్తు - పచ్చరంగు. సేవలో నలువైపులా పచ్చదనం చేసేస్తారు కదా! ముళ్ళ అడవిని పూలతోటలా చేసేస్తారు. 

మరి ఆ నాలుగు రంగులు ఏమిటో ఇప్పుడు విన్నారా? ఈ 4 రంగుల యొక్క వజ్రాలు అలంకరింపబడి ఉన్న మాలలు అందరి మెడలో ఉన్నాయి. ఇందులో భిన్న భిన్న సైజులు మరియు ప్రకాశములో తేడా ఉంది. కొందరి జ్ఞాన స్వరూపం యొక్క మాల పొడుగ్గా ఉంటే కొందరి స్మృతి స్వరూపం యొక్క మాల పొడుగ్గా ఉంది. మరికొందరి 4 మాలలు కాస్తంత తేడాలో ఉన్నాయి. ఎవరికైతే 4 రంగుల యొక్క అనేక మాలలు ఉన్నాయో వారు ఎంత అందంగా ఉండి ఉంటారు! కావున బాప్ దాదా అందరి యొక్క రిజల్ట్ ను మాలల యొక్క రూపంలో చూస్తున్నారు. దూరం నుండి వజ్రాలు చిన్న చిన్న బల్బుల యొక్క వరుస వలే కనిపిస్తున్నాయి. ఇదే ఆ చిత్రము. ఈ చిత్రాల ద్వారా రిజల్టును చూసి బ్రహ్మా బాబా 'సమయం యొక్క వేగం అనుసారంగా పిల్లలందరి యొక్క సింగారము సంపన్నమైంది.' అని అన్నారు. ఎందుకంటే రిజల్టులో అయితే తేడా ఉంది. మరి ఈ తేడాను ఎలా సంపన్నం చేయాలి? పిల్లలైతే ఎంతో కష్టపడతారు. శ్రమతోపాటు అందరికీ ఆ కోరిక కూడా ఉంది, సంకల్పం కూడా చేస్తారు. కాని మిగిలి ఉన్నదేమిటి? అదైతే అందరికీ తెలుసు కదా! జ్ఞానస్వరూపులుగా అయితే అయిపోయారు. మరి ఏంతేడా మిగిలి ఉందో, ఏ కారణంగా కొందరి మాల నెక్లెస్ వలే కొందరిది కాళ్ళ వరకూ పొడుగ్గా అందులోనూ అనేక మాలలుగా ఎందుకు ఉందో చెప్పండి? మీరు వినేది ఒక్కరి నుండే, వినిపించేది ఒక్కటే, అందరి యొక్క విధి కూడా ఒక్కటే మరియు విధాత కూడా ఒక్కరే. అలాగే విధానము కూడా ఒక్కటే కాని, మిగిలి ఉన్న తేడా ఏమిటి? సంకల్పమూ ఒక్కటే, మీ ప్రపంచమూ ఒక్కటే. మరి తేడా ఎందుకు?

బ్రహ్మ బాబాకు ఈ రోజు పిల్లలపై ఎంతో స్నేహము కలుగుతోంది. అన్ని చిత్రాలను సంపన్నంగా చేసేందుకు తీవ్రమైన ఉత్సాహము కలుగుతోంది. ఇప్పుడే అందరినీ మాలలతో అలంకరించాలనిపిస్తోంది. బాబా అలంకరించేసినా కాని ధారణ చేసే సమర్థత కూడా కావాలి, అలాగే సంభాళించే సమర్థత కూడా కావాలి. కావున బ్రహ్మా బాబా విషయం ఏమిటి అని శివబాబాను అడిగారు. పిల్లలు కలిసి వెళ్ళేందుకు సంపూర్ణంగా ఎందుకు అలంకరించుకోరు? అలంకరింపబడి ఉన్నవారే తోడుగా వెళతారు కదా, కారణమేమిటి? ఆ రెండింటి మధ్య తేడా అయితే చిన్నదే అని శివబాబా చెప్పారు. అందరూ ఆలోచిస్తారు, అందరూ చేస్తారు కూడా కాని ఆలోచించడము, చేయడము రెండూ ఒకే సమయంలో చేసేవారు కొందరే ఉన్నారు అనగా ఆలోచించడము మరియు చేయడము కలిసి ఉన్నాయి. వారు సంపన్నంగా అయిపోతారు, మరికొందరు ఆలోచిస్తారు మరియు చేస్తారు కూడా, కాని ఆలోచించడంలో మరియు చేయడంలో మార్జిన్ ఉంటుంది. ఎంతో బాగా ఆలోచిస్తారు కాని కొంత సమయం తర్వాతే చేస్తారు. అదే సమయంలో చేయరు, కావున సంకల్పంలో ఆ సమయం యొక్క తీవ్రత, ఉల్లాసము, ఉత్సాహము ఏదైతే ఉంటుందో అది సమయం గతించిన తర్వాత దాని శాతంలో తేడా ఏర్పడుతుంది. వేడిగా ఉన్న తాజా వస్తువు యొక్క అనుభవానికి మరియు చల్లబడిపోయిన లేక నిలువచేయబడి ఉన్న వస్తువు యొక్క అనుభవానికి తేడా ఉంటుంది కదా! తాజా వస్తువు యొక్క శక్తికి మరియు నిలువ ఉంచిన వస్తువు యొక్క శక్తికి తేడా ఉంటుంది కదా! వస్తువు ఎంత గొప్పగా ఉన్నా కాని నిలువ ఉంచిన వస్తువు యొక్క రిజల్టు అదే విధంగా వెలువడజాలదు, అలాగే ఏ సంకల్పాలైతే చేస్తారో వాటిని అదే సమయంలో ప్రాక్టికల్ గా చేయడంలోని రిజల్టుకు మరియు ఈ రోజు ఆలోచించి ఇంకెప్పుడో చేయడంలోని రిజల్టుకు తేడా ఉంటుంది. మధ్యలో సమయం యొక్క మార్జిన్ ఉన్న కారణంగా ఒకటేమో, తాజా వస్తువుల్లోని విటమిన్లకు, నిలువ ఉండిన వస్తువుల యొక్క విటమిన్లకు తేడా ఉన్నట్లుగా అన్నింటిలోని పర్సంటేజ్ లో తేడా ఏర్పడుతుంది. రెండవది - మార్జిన్ ఉన్న కారణంగా సమస్యల రూపీ విఘ్నాలు కూడా వచ్చేస్తాయి. కావున ఆలోచించడము మరియు చేయడము కలిసి ఉండాలి. దీనినే తక్షణ దానము మహా పుణ్యము అని అంటారు. లేకపోతే మహా పుణ్యానికి బదులుగా పుణ్యమే అవుతుంది. మరి తేడా ఉంది కదా! మహా పుణ్యం యొక్క ప్రాప్తికి మరియు పుణ్యం యొక్క ప్రాప్తికి తేడా ఉంటుంది. కారణమేమిటో అర్థమైందా? కారణం చిన్నదే. మీరు దానిని చేస్తారు కూడా, కాని ఇప్పుడు చేసేందుకు బదులుగా ఇంకెప్పుడో చేస్తారు. కావుననే ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. కావున ఇప్పుడు ఇక ఈ కారణాన్ని నివారణ చేయండి అని బ్రహ్మా బాబా పిల్లలకు చెప్పారు. ఈనాటి కథను విన్నారు కదా! ఇది ఇద్దరు తండ్రుల మధ్య జరిగిన కథ. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నివారణ చేయండి. నివారణ చేయడమే నిర్మాణము చేయడమవుతుంది. కావున స్వయములోనూ నవ నిర్మాణము మరియు విశ్వంలోను నవ నిర్మాణము. అచ్ఛా!

ఈ విధంగా సదా అలంకరింపబడి ఉన్న, ఆలోచించడము మరియు చేయడము రెండింటినీ సమానం చేసుకునేవారికి, సదా బాబా సమానంగా తక్షణ దానము చేసే మహాపుణ్య ఆత్మలకు, ఇరువురు తండ్రుల యొక్క శుభకామనను పూర్ణం చేసేవారికి, ఇటువంటి సంపన్న ఆత్మలకు బాప్ దాదా  యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

టీచర్లతో - సేవాధారులు అమృతవేళ నుండి రాత్రి వరకు సేవ యొక్క స్టేజ్ పైన ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నా కూడా స్టేజ్ పైనే ఉన్నారు. స్టేజ్ పైన కూడా నిదురించే పాత్రను అభినయిస్తారు కదా! ఎలా పడుకున్నారు అని అందరి దృష్టి ఉంటుంది. అదే విధంగా సేవాధారులు అనగా 24 గంటలూ స్టేజ్ పైన పాత్రను అభినయించేవారు. కావున ప్రతి అడుగు, ప్రతి క్షణము మొత్తం విశ్వం ముందు సేవాధారులు సదా హీరో పాత్రధారులుగా భావిస్తూ నడుచుకోవాలి. మీరు సెంటర్లో కూర్చోలేదు, స్టేజ్ పైన కూర్చున్నారు. విశ్వం యొక్క స్టేజ్ పైన కూర్చున్నారు. కావున ఇంతటి అటెన్షన్ ను ఉంచడం ద్వారా ప్రతి సంకల్పము మరియు కర్మ స్వతహాగానే శ్రేష్ఠంగా ఉంటాయి కదా! నేచురల్ అటెన్షన్ ఉంటుంది, అటెన్షన్ ఉంచవలసిన అవసరముండదు, అది ఉండే ఉంటుంది. ఎందుకంటే మీరు స్టేజీపై ఉన్నారు కదా! మరియు సదా స్వయాన్ని పూజ్య ఆత్మలుగా భావించినట్లయితే, పూజ్య ఆత్మ అనగా పావన ఆత్మ కల్పకల్పము పూజ్యముగా ఉంటుంది. పూజ్యులుగా భావించడం ద్వారా సంకల్పములు మరియు స్వప్నములు కూడా సదా పావనంగా ఉంటాయి. మరి ఇటువంటి నషా ఉంటోందా? సేవాధారులుగా మెజార్టీ కుమారీలే ఉన్నారు. కుమారీలు డబల్ కుమారీలైపోయారు. బ్రహ్మాకుమారీలుగా ఉన్నారు మరియు కుమారీలుగా కూడా ఉన్నారు. కావున మీరు అంతటి మహాన్ గా అయిపోయారు. కుమారీలకు ఇప్పుడు 84వ అంతిమ జన్మలో కూడా చరణాల యొక్క పూజ జరుగుతుంది. కావున మీరు ఇంతటి పావనులుగా అయ్యారు. కావుననే ఇప్పటివరకూ పూజ జరుగుతోంది. కుమారీలను ఎప్పుడూ కాళ్ళకు నమస్కరించనివ్వరు, అందరూ కుమారీల చరణాలపైనే పడతారు. వారి చరణాలు కడిగి త్రాగుతారు. మరి ఆ కుమారీలు ఎవరు? బ్రహ్మాకుమారీలే కదా! కావున సేవాధారులైన మీరు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలు. ఎవ్వరి యొక్క పూజ జరుగుతోంది? మీదే. ప్రతి ఇంటిలోను పూజ జరుగుతుంది అన్న గీతం కూడా ఉంది కదా! కావున మా పూజ జరుగుతోంది అని చెప్పండి. బాప్ దాదా కూడా నమస్తే చేస్తారు కదా! మీరు అంతటి పూజ్యులు, కావున బాబా కూడా నమస్కరిస్తారు. ఇదే స్మృతి స్వరూపంలో ఉండడం ద్వారా సదా వృద్ధి జరుగుతూ ఉంటుంది. స్వయం యొక్క వృద్ధి మరియు సేవ యొక్క వృద్ధి కూడా జరుగుతుంది, అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి. ఇదే స్మృతిలో అన్ని విశేషతలు నిండి ఉన్నాయి. అచ్ఛా!

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:-

1. జీవితం యొక్క అనేక సమస్యల యొక్క సమాధానము - తీర్థ స్థలం యొక్క స్మృతి. 

భాగ్యవిధాత యొక్క భూమి పైకి చేరుకోవడం కూడా చాలా పెద్ద భాగ్యము. ఇది కేవలం ఏదో స్థానం కాదు, ఇది మహాతీర్థ స్థానము. తీర్థస్థానానికి వెళ్ళడం ద్వారా పాపాలు అంతమైపోతాయి అని భక్తిమార్గంలో భావిస్తారు కాని ఎప్పుడవుతాయి, ఎలా అవుతాయి అన్నది వారికి తెలియదు. ఈ సమయంలో ఈ మహాన్ తీర్థస్థానంపైకి రావడం ద్వారా పుణ్య ఆత్మలుగా అయిపోతారని పిల్లలైన మీరు అనుభవం చేసుకుంటారు. ఈ తీర్థస్థానం యొక్క స్మృతి జీవితంలోని అనేక సమస్యల నుండి అతీతంగా తీసుకువెళుతుంది. ఈ స్మృతి కూడా ఒక తాయత్తు వలే పనిచేస్తుంది. ఎప్పుడు స్మృతి చేసినా ఇక్కడి వాతావరణం యొక్క శాంతి మరియు సుఖము మీ జీవితంలో ఎమర్ట్ అయిపోతుంది. మరి మీరు పుణ్య ఆత్మలే కదా! ఈ ధరణి పైకి రావడం కూడా భాగ్యానికి గుర్తె. కావున మీరు చాలా చాలా భాగ్యశాలులు. ఇప్పుడు భాగ్యశాలులుగా అయిపోయారు. కాని సౌభాగ్యశాలులుగా అవ్వడము లేక పదమాపదమ భాగ్యశాలులుగా అవ్వడము మీ చేతులలోనే ఉంది. బాబా భాగ్యశాలులుగా అయితే చేసేశారు. ఇదే భాగ్యము సమయ ప్రతిసమయము సహయోగమునిస్తూ ఉంటుంది. ఏ విషయం జరిగినా బుద్ధి ద్వారా మధువనానికి వచ్చేయండి. అప్పుడు సుఖము మరియు శాంతి యొక్క ఊయలలో ఊగడం అనుభవం చేసుకుంటారు. అచ్ఛా!

2. స్వదర్శనచక్రధారుల గుర్తు సఫలతా స్వరూపులుగా ఉండడం. 

అందరూ స్వయాన్ని స్వదర్శనచక్రధారులుగా భావిస్తున్నారా? బాబాకు ఏ మహిమ అయితే ఉందో అదే మహిమా స్వరూపులుగా అయ్యారా? ఏ విధంగా బాబా యొక్క ప్రతి కర్మ చరిత్ర యొక్క
రూపంలో ఇప్పుడు కూడా గానం చేయబడుతోందో అలాగే మీ యొక్క ప్రతి కర్మ కూడా చరిత్ర సమానంగా జరుగుతోందా? ఇటువంటి చరిత్రవంతులుగా అయ్యారా? ఎప్పుడూ సాధారణ కర్మలైతే జరగడం లేదు కదా! ఎవరైతే బాబా సమానంగా స్వదర్శనచక్రధారులుగా అయ్యారో వారి ద్వారా ఎప్పుడూ సాధారణ కర్మలు జరుగజాలవు. ఏ కార్యము చేసినా అందులో సఫలత ఇమిడి ఉంటుంది. సఫలత లభిస్తుందా, లభించదా అనే సంకల్పం కూడా ఉత్పన్నమవ్వజాలదు. సఫలత లభించే తీరుతుంది అన్న నిశ్చయం ఉంటుంది. స్వదర్శనచక్రధారులు మాయాజీతులుగా ఉంటారు. మాయాజీతులుగా ఉన్న కారణంగా సఫలతామూర్తులుగా కూడా ఉంటారు మరియు ఎవరైతే సఫలతామూర్తులుగా ఉంటారో వారు సదా ప్రతి కర్మలోనూ పదమాపదమపతులుగా ఉంటారు. ఇటువంటి పదమాపదమపతులుగా అనుభవం చేసుకుంటున్నారా? 21 జన్మల వరకూ నడిచేంతటి సంపాదనను జమా చేసుకున్నారా? సూర్యవంశీయులు అనగా 21 జన్మల కొరకు జమా చేసుకునేవారు. కావున సదా ప్రతి సంకల్పంలోనూ జమా చేసుకుంటూ ఉండండి. అచ్చా!

3. చైతన్య దీపమాలల యొక్క కర్తవ్యము అంధకారంలో ప్రకాశమును వ్యాపింపచేయడం.

స్వయాన్ని సదా వెలుగుతున్న దీపాలుగా భావిస్తున్నారా? విశ్వంలోని దీపకులైన మీరు అవినాశీ దీపాలు. దాని స్మృతిచిహ్నముగా ఇప్పుడు కూడా దీపావళి జరుపుకోబడుతోంది. కావున మేము దీపమాలలోని దీపకులము అన్న నషా సదా ఉంటోందా? ఇప్పటివరకూ మీ మాలను ఎంతగా స్మరణ చేస్తూ ఉంటారు? ఎందుకు స్మరణ చేస్తారు? ఎందుకంటే మీరు అంధకారమును ప్రకాశవంతంగా చేసేవారిగా అయ్యారు. స్వయాన్ని ఈ విధంగా సదా వెలుగుతున్న దీపాలుగా అనుభవం చేసుకోండే కాని మిణుకు మిణుకుమనే దీపాలుగా కాదు. ఎన్ని తుఫానులు వచ్చినా కాని సదా ఏకరసంగా, అఖండ జ్యోతి సమానంగా వెలుగుతున్న దీపాలుగా ఉండండి. ఇటువంటి దీపాలకు విశ్వం కూడా నమస్కరిస్తుంది మరియు బాబా కూడా ఇటువంటి దీపకులతో ఉంటారు. వారు మిణుకు మిణుకుమనే దీపాలతో ఉండరు. బాబా ఏ విధంగా సదా వెలుగుతున్న జ్యోతిగా ఉన్నారో, అఖండ జ్యోతిగా ఉన్నారో, అమరజ్యోతిగా ఉన్నారో అలాగే పిల్లలు కూడా సదా అమరజ్యోతులే. జ్యోతి యొక్క రూపములో కూడా మీ యొక్క స్మృతిచిహ్నము ఉంది. చైతన్యంలో కూర్చొని మీ జడ స్మృతిచిహ్నాలన్నింటినీ చూస్తున్నారు. మీరు ఎంతటి శ్రేష్ఠ ఆత్మలు! అచ్ఛా!

Comments