08-10-1981 అవ్యక్త మురళి

* 08-10-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రహ్మ బాబా యొక్క ఒక శుభ ఆశ

ఈ రోజు బాప్ దాదా విజయీ రత్నాలను చూస్తున్నారు. ఈ రోజు భక్తులు విజయదశమిని జరుపుకుంటున్నారు. భక్తుల పని తగులబెట్టడం మరియు పిల్లలైన మీ పని మిలనమును జరుపుకోవడం. తగులబెట్టిన తర్వాత మిలనమును జరుపుకోవడం ఉంటుంది. భక్తిమార్గములో కూడా రావణున్ని తగులబెట్టిన తర్వాత అనగా విజయాన్ని పొందిన తర్వాత ఏ మిలనమును చూపిస్తారు? భక్తి యొక్క విషయాలను గూర్చి అయితే మీకు బాగా తెలుసు. రావణుడు సమాప్తమైన తర్వాత ఏ స్థితి ఉంటుంది? దానికి గుర్తులు ఏమిటి? 'పరస్పరం కలుసుకుంటారు' ఇది సోదరభావం యొక్క స్థితి. సోదరభావముతో కూడుకున్న దృష్టికి గుర్తు సేవ మరియు స్నేహము. స్నేహానికి గుర్తుగా దీపావళిని చూపించారు. సేవ యొక్క సఫలతకు ఆధారముగా సోదరభావాన్ని చూపించారు. ఇది లేకుండా దీపావళినిని జరుపుకోరు. దీపావళి  లేకుండా రాజ్యతిలకమును దిద్దుకోలేరు. కావున ఈనాటి స్మృతిచిహ్నమైన విజయదశమిని జరుపుకున్నారా? దీనికి ఆధారముగా ముందు అష్టమిని జరుపుకుంటారు. అష్టమి లేకుండా విజయము లేదు కావున మీరు ఎక్కడివరకూ చేరుకున్నారు? అష్టమిని జరుపుకున్నారా? అందరూ నవదుర్గలుగా అయిపోయారా? అష్టశక్తులు మరియు ఒక్క సర్వశక్తివంతుడు. సర్వశక్తివంతుడైన తండ్రితో పాటు అష్టశక్తి స్వరూపముగా ఇలా నవదుర్గలుగా అయ్యారా? దుర్గ అనగా దుర్గుణాలను సమాప్తము చేసి సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి, అప్పుడే దసరాను జరుపుకోగలుగుతారు. కావున బాప్ దాదా పిల్లలు దసరాను జరుపుకున్నారా? అని చూసేందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికీ తమను గూర్చి తమకు బాగా తెలుసు మరియు నేను దసరాను జరుపుకున్నానా? లేక ఈ అష్టమిని జరుపుకున్నానా? అని చూసుకుంటూ ఉంటారు కూడా! అవినాశీ తిలకాన్ని దిద్దుకున్నారా? లేక అల్పకాలికమైన తిలకాన్ని దిద్దుకున్నారా? రావణున్ని తగులబెట్టారా లేక సర్వవంశావళిని కూడా తగులబెట్టారా? రావణున్ని సమాప్తం చేసారా లేక రావణరాజ్యాన్ని సమాప్తం చేసారా? 

ఈ రోజు వతనములో బ్రహ్మా బాబాతో ఆత్మిక సంభాషణ జరిగింది, ఏ సమయంలో? (క్లాస్ సమయంలో) బాప్ దాదా కూడా పిల్లల యొక్క ఆత్మిక సంభాషణను వింటారు. పిల్లలందరినీ ఎప్పుడైతే దసరాను జరుపుకున్నారా? అని ప్రశ్నించడం జరుగుతుందో అప్పుడు జరుపుకున్నాము అని చేతులెత్తరు, అలాగే జరుపుకోలేదు అన్నదానిలో కూడా చేతులెత్తరు. వ్రాయమన్నప్పుడు కూడా జవాబు ఇవ్వడంలో చాలా చతురులుగా ఉంటారు. అబద్ధమూ చెప్పరూ అలాగే స్పష్టంగా కూడా వ్రాయరు. 3, 4 జవాబులు అందరికీ వస్తాయి మరియు అవే జవాబులలో ఏదో ఒక జవాబు చెబుతారు కావున బ్రహ్మా బాబా యొక్క ఆత్మిక సంభాషణ జరిగింది. బ్రహ్మా బాబా ఇంటి తలుపులను తెరవడానికి పిల్లలను ఆహ్వానిస్తున్నారు కానీ ఈనాటి ప్రశ్నకు అందరి యొక్క జవాబు కాగితంపై కాక మనస్సు యొక్క సంకల్పాల ద్వారా బాబా ముందు అయితే స్పష్టముగానే ఉంది. క్లాస్ సమయంలో దాదీ ప్రశ్న అడుగుతోంది మరియు బాప్ దాదా అందరి జవాబునూ చూస్తున్నారు. జవాబు యొక్క సారాంశమునైతే వినిపించేసాను కదా! వినిపించే అవసరం కూడా లేదు. మీకే ఎక్కువ తెలుసు. ఆ జవాబు వింటూ బ్రహ్మా బాబా ఏమి చేసారు? చాలా మంచి మాట చెప్పారు, బ్రహ్మా బాబా యొక్క విశేషతా సంపన్నమైన సంస్కారమును గూర్చి అయితే మీకు తెలుసు. విశేషతలతో కూడుకున్న సంస్కారముల యొక్క పాత్రనే అభినయించారు, అది ఏమిటి? ఆ విషయం యొక్క సంబంధం బ్రహ్మా బాబా యొక్క ఆదికాలములో, ప్రవేశం జరిగిన జీవితకాలంతో సంబంధితమై ఉంది, రిజల్టును చూసినప్పుడు ఒక్క క్షణము బ్రహ్మా బాబా ఆలోచనలో పడ్డారు మరియు ఇలా అన్నారు - ఈరోజు నేను అడిగే ఒక విషయాన్ని మీరు పూర్తిచేయవలసిందే అని అన్నారు. అదేమిటి? “ఈ రోజు నాకు తాళం చేతులు ఇవ్వండి' అని బ్రహ్మా బాబా అన్నారు. ఏ తాళం చేతులు? అందరి బుద్ధులనూ పరివర్తన చేసే తాళంచేతులు, సంపన్నముగా తయారుచేసే తాళంచేతులు. ప్రారంభంలో కూడా ఈ తాళం చేతుల యొక్క నషా ఉండేది. ఖజానా ఉంది, తాళంచేతులు ఉన్నాయి. ఇక మిగిలింది కేవలం తెరవడమే అన్న నషా ఉండేది, అలాగే బ్రహ్మా బాబా కూడా ఈ రోజు సంపన్నముగా తయారుచేసే తాళం చేతిని ఇవ్వమని బాబాను అడిగారు. ఆ సమయం యొక్క దృశ్యాన్ని సాకారములో అనుభవం చేసుకున్నవారు బ్రహ్మా బాబా మరియు శివబాబా యొక్క ఆత్మిక సంభాషణ ఎలా జరిగిందో తెలుసుకోగలరు. ఇప్పుడు బ్రహ్మకు తాళంచేతులు ఇవ్వవచ్చా? మరియు బ్రహ్మను బాబా వద్దనగలరా? పిల్లలు వద్దు అనీ అనరు, అలాగే ఇవ్వమనీ అనరు. 

కానీ బ్రహ్మాబాబాకు పిల్లలందరినీ సదా సంపన్నముగా చూడాలి అనే కోరిక ఎంతగానో ఉంది. అవ్వాలి అని కాదు, ఇప్పుడు తయారైపోవాలి అని ఉంది. పిల్లల యొక్క విషయం ఎప్పుడు ప్రస్తావనలోకి వచ్చినా బ్రహ్మా బాబా ముఖము దీపమాలలా తయారైపోతుంది. ఎంతో తీవ్రమైన ఉత్సాహముతో మాస్టర్ సాగరుని సమానముగా ఎత్తైన అలలు ఎగిసిపడతాయి మరియు అదే ఉత్సాహము యొక్క ఉన్నతమైన అలలలో అందరినీ సంపన్నముగా చేసేసి దీపమాలను వెలిగించాలి అని భావిస్తారు. బ్రహ్మా బాబా యొక్క సాకారచరిత్రలో కూడా బ్రహ్మా బాబాకు ఒక మాట జన్మ నుండే నచ్చేది కాదు, అది ఏమిటి? తమ కార్యములోనూ అది వారికి నచ్చలేదు, అలాగే పిల్లల యొక్క కార్యములోనూ నచ్చలేదు. తర్వాత చేద్దాములే' ఈ పదము నచ్చేది కాదు. ప్రతి విషయంలోనూ ఇప్పుడే చేయాలి అని, చేసారు మరియు చేయించారు. సేవ యొక్క ప్లాన్లలో చూడండి,  స్వపరివర్తనలో చూడండి, ఇప్పుడిప్పుడే వెళ్ళండి, ఇప్పుడిప్పుడే చేయండి. రైలుకు సమయం కొద్దిగానే ఉన్నా ఇప్పుడే వెళ్ళిపోండి, ట్రెయిన్ లేట్ అవుతుంది, ఆగుతుంది అని అనేవారు. మరి ఏ సంస్కారము ఉంది? ఇప్పుడిప్పుడే చేయాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే కావున ఎలాగైతే ఇప్పుడిప్పుడే చేయాలి అనే విశేషమైన బాషను విన్నారో అలాగే ఈ రోజు కూడా వతనములో ఇప్పుడిప్పుడే కావాలి అన్న ఈ భాషనే మాట్లాడడం జరిగింది. నవ్వు పుట్టించే ఇంకొక విషయాన్ని వినిపిస్తాను - అది ఏమై ఉంటుంది? బ్రహ్మాబాబా స్వయం సంపన్నముగా ఉన్న కారణముగా, పిల్లలు ఎప్పుడో? ఎప్పుడో అని ఎందుకు అంటున్నారు? అని చూడలేకపోతున్నారు కావున వీరు ఎందుకు మారడం లేదు, వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అని పదే పదే బాబాతో అంటారు. వీరు ఇప్పటివరకూ ఇలాగే ఎందుకు అంటున్నారు? ఆశ్చర్యం అనిపిస్తుంది! డ్రామా యొక్క విషయం వేరు. ఇది రమణీయకమైన, నవ్వు పుట్టించే విషయం. అలాగని డ్రామాను గూర్చి వీరికి తెలియదని కాదు. కానీ చూస్తూ, చూస్తూ స్నేహము యొక్క కారణముగా బాబాతో నవ్వుతారు. బాబాతో నవ్వడానికైతే అనుమతి ఉంది కదా! బాబా కూడా నవ్వుతారు. మరి ఇప్పుడు బ్రహ్మా బాబా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకున్నారు కదా! ఇప్పుడు ముక్తులుగా అయి ముక్తిధామము యొక్క ద్వారాలను తెరిచేందుకు బాబాకు సహాయకులుగా అవ్వండి. ఇది పిల్లలపై బ్రహ్మా బాబాకు ఉన్న శుభ ఆశ. మొదట ఈ దీపావళిని జరపండి. బాబా యొక్క శుభ ఆశల యొక్క దీపాలను వెలిగించండి. ఈ ఒక్క దీపము ద్వారా దీపావళి స్వతహాగానే వెలుగుతుంది, అర్ధమయ్యిందా? అచ్చా, తర్వాత ఇంకెప్పుడైనా భారత మిలాప్ యొక్క రహస్యాన్ని గూర్చి వినిపిద్దాము.

ఈ విధంగా బాప్ దాదా యొక్క శ్రేష్ఠ సంకల్పాన్ని సాకారములోకి తీసుకువచ్చేవారికి, అవినాశీ దృఢ సంకల్పము యొక్క తాళంచెవిని తిప్పి అవినాశీ విజయులుగా అయ్యేవారికి, సాకార బాబా సమానముగా సదా 'ఇప్పుడే చేయాలి' అనే భాషను కర్మలోకి తీసుకువచ్చేవారికి, ఎప్పుడో అన్నదానిని సమాప్తము చేసి అందరికీ సాకార బాబా యొక్క మూర్తిని తమ ముఖముపై చూపించేవారికి, ఇటువంటి విజయీ రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారీలతో - కుమారీలు సదా ఎగిరే పక్షుల వంటివారు, ఎందుకంటే కుమారీలు అనగా సదా తేలికగా ఉండేవారు, కుమారీలు అనగా ఎటువంటి భారమూ లేనివారు. తేలికైన వస్తువు పైకి వెళుతుంది కదా! సదా పైకి వెళ్ళేవారు అనగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. మరి మీరు అలా ఉన్నారా? మీరు ఎక్కడివరకూ చేరుకున్నారు? బాబా శ్రీమతం ఏదైతే ఉందో దాని అనుసారముగా, అదే రేఖ లోపల సదా ఉండేవారు సదా ఎగురుతూ ఉంటారు. కావున రేఖ లోపలే ఉండేవారు ఎవరు? సత్యమైన సీతలు. కావున అందరూ సత్యమైన సీతలే కదా? పక్కాయేనా? రేఖ బయట అడుగుపడితే రావణుడు వచ్చేస్తాడు. ఎక్కడైనా, ఎవరైనా కాలు బయటపెడితే ఎత్తుకుపోవచ్చు అని రావణుడు ఎదురుచూస్తూ ఉంటాడు. కావున కుమారీలు అనగా సత్యమైన సీతలు. ఇక్కడినుండి బయటకు వెళ్ళి మారిపోకండి, ఎందుకంటే మధువనములో వాయుమండలం యొక్క, వరదానము యొక్క ప్రభావము ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ట్రా లిఫ్ట్ ఉంటుంది కానీ అక్కడైతే కష్టంగా నడువవలసి ఉంటుంది. కుమారీలను చూసి బాప్ దాదాకు వేలాదిరెట్ల సంతోషము కలుగుతుంది, ఎందుకంటే కసాయిల నుండి సురక్షితులయ్యారు. మరి సంతోషమే కదా! అచ్చా, ఇప్పుడు పక్కా ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి.

పాండవులతో:- పాండవులందరూ శక్తిస్వరూపులే కదా? శక్తులు మరియు పాండవులుగా కంబైన్డ్ గా ఉన్నారా? సర్వశక్తివంతుని ముందు శక్తిగా అయిపోతారు మరియు పాత్రను అభినయించడంలో పాండవులుగా ఉంటారు. సర్వశక్తివంతుడిని శక్తిగా అయి స్మృతి చేయకపోతే అంత ఆనందం కలుగదు. ఆత్మ ఒక సీత మరియు తాను రాముడు కావున ఈ పాత్రలో కూడా ఎంతో ఆనందం ఉంది. సంగమయుగము యొక్క ఇదే పాత్ర అన్నింటికన్నా అద్భుతమైనది. ఇందులో పాండవులు శక్తులుగా అయిపోతారు మరియు శక్తులు సోదరులవుతారు. తద్వారా దేహభావాన్ని మరచిపోయారని దీని ద్వారా నిరూపింపబడుతోంది. అత్యలో రెండు సంస్కారాలూ ఉన్నాయి. కొన్నాళ్ళు పురుషుని యొక్క, మరికొన్నాళ్ళు స్త్రీల యొక్క పాత్రను అభినయించారు కదా! ప్రేయసిగా అయి ప్రియుడిని స్మృతిచేయడం సంగమయుగములోని వినోదము. శక్తిగా అయి సర్వశక్తిమంతుడిని సృతి చేయండి, సీతగా అయి రాముడిని స్మృతి చేయండి.

మాతలతో - శక్తి సైన్యము సదా శస్త్రధారులే కదా! శక్తుల యొక్క అలంకరణ ఈ శస్తాలే, ఎవరైతే సదా శస్త్రధారులుగా ఉంటారో వారే సదా మహాదానులుగా, వరదానులుగా ఉంటారు. అన్ని శాస్త్రాలు నిలిచియుంటున్నాయా? అప్పుడప్పుడూ కాదు, సదా ఉండాలి. శక్తుల యొక్క తపస్సు సర్వ శక్తిమంతుడిని తీసుకువచ్చింది. ఇప్పుడు శక్తులు సర్వశక్తివంతుడిని ప్రత్యక్షము చేయాలి. ప్రతి అడుగులోనూ వరదానాలు ఇస్తూ ముందుకు వెళ్ళండి. శుభభావనతో అందరికీ వరదానాలను ఇవ్వాలి. సుఖసాగరుని పిల్లలు సదా సుఖస్వరూపులుగా ఉన్నారు కదా? సదా మిలన మేళా యొక్క సంతోషములో ఊగుతున్నారు కదా! తింటూ, తాగుతూ, నడుస్తూ అశోకముగా అనగా సంకల్పమాత్రములో కూడా శోకము మరియు దుఃఖము రాకుండా ఉండాలి, సదా సుఖస్వరూపముగా ఉండాలి. దుఃఖమునకు విడాకులు ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే దుఃఖప్రపంచములో అర్థకల్పం ఉన్నారు. ఇప్పుడు ఇది ఇక సుఖము యొక్క విషయము. సుఖసాగరుడు లభించాడు, మరి ఇక దుఃఖము దేనికి? సదా సుఖవంతులుగా ఉండాలి, ఇదే వరదానము బాబా నుండి సదాకాలికముగా లభించింది. అచ్ఛా

Comments