08-01-1982 అవ్యక్త మురళి

* 08-01-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

లండన్ గ్రూపుతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము.

బాబా ఈ రోజు విశేషంగా లండన్ నివాసులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. నిజానికి అందరూ బాప్ దాదాకు సదా ప్రియమైన వారే, అందరికీ విశేషంగా కలుసుకొనే అవకాశము లభించింది. కానీ నిమిత్తముగా లండన్ నివాసులను కలుసుకుంటున్నారు. లండన్ నివాసులైన పిల్లలు సేవలో హృదయపూర్వకముగా తమ సహయోగమును ఇచ్చారు, మరియూ ఇంకా ఇస్తూనే ఉంటారు. స్వయం యొక్క ఎగిరే కళపై కూడా మంచి ధ్యానము ఉంది. నెంబరువారీగా అయితే ఉన్నారు, కానీ వేగము బాగుంది. (ఒక పక్షి ఎగురుతూ క్లాసులోకి వచ్చింది) అందరూ ఎగరడం చూసి సంతోషిస్తున్నారు కదా? అలాగే స్వయం యొక్క ఎగిరే కళ కూడా ఎంత ప్రియంగా ఉంటుంది! మీరు ఎగిరేటప్పుడు స్వతంత్రంగా ఉంటారు. కానీ ఎగిరేందుకు బదులుగా ఎప్పుడైతే క్రిందకు వచ్చేస్తారో అప్పుడు బంధనలోకి వచ్చేస్తారు. ఎగిరే కళ అనగా భంధనముక్తులుగా, యోగయుక్తులుగా ఉండడం. మరి లండన్ నివాసులు ఏం భావిస్తున్నారు? ఎగిరే కళలో ఉన్నారు కదా? క్రిందికైతే రావడం లేదు కదా. క్రిందకు వచ్చినా క్రింద ఉన్నవారిని పైకి తీసుకువెళ్ళేందుకే వస్తారు. ఎవరైతే క్రింది స్థితిలో ఉంటారో, వారికి ధైర్యము మరియు ఉత్సాహమును కలిగించి, వారిని కూడా ఎగిరేలా చేసే సేవను చేసేందుకు క్రిందకు వస్తూ మళ్ళీ పైకి వెళ్ళి పోయే అభ్యాసముందా? మీరేం భావిస్తున్నారు ? లండన్ నివాసుల గ్రూప్ వారు సదా దేహము మరియు దైహిక ప్రపంచము యొక్క ఆకర్షణల నుండి అతీతముగా మరియూ సదా ప్రియంగా ఉన్నారు. దీనినే కమల పుష్ప సమానముగా ఉండడము అని అంటారు. సేవార్ధము ఉంటూ కూడా అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు, మరి మీది ఆతీతముగా మరియు ప్రియముగా ఉండే గ్రూపే కదా. లండన్లో మొత్తం విదేశము యొక్క సేవా కేంద్రాలన్నింటికి సంబంధముంది. కావున లండన్ నివాసులు ఈ సేవా వృక్షము యొక్క పునాది వంటి వారు. పునాది బలహీనముగా ఉంటే. మొత్తం వృక్షమంతా బలహీనమైపోతుంది. కావున పునాది సదా తమపై మరియు సేవ యొక్క భాద్యతపై అటెన్షన్ ఉంచాలి. నిజానికి ప్రతి ఒక్కరి పైన తమ యొక్క మరియు విశ్వ సేవ యొక్క భాద్యత ఉంది. అందరూ బాధ్యతా కిరీటధారులేనని ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ లండన్ నివాసులైన పిల్లలకు విశేషంగా ధ్యానము నుంచమని చెబుతున్నాను. ఈ బాధ్యతా కిరీటము సదా కాలికముగా డబల్ లైట్ గా చేస్తుంది. ఇది భారముగా ఉండే కిరీటము కాదు. అన్ని రకాల భారాలను ఇది అంతం చేస్తుంది. మీరు అనుభవజ్ఞులు కూడా. తనువు మనస్సు ధనము, మనసా వాచా కర్మణా అన్ని రూపాలలోనూ సేవాధారిగా అయి సేవలో బిజీగా ఉన్నట్లైతే సహజముగానే మాయా జీతులుగా, జగత్ జీతులుగా అయిపోతారు. దేహము యొక్క అభిమానమును స్వతహాగానే మరియు సహజముగానే మర్చిపోతారు. కష్టపడవలసిన అవసరము ఉండదు. అనుభవము ఉంది కదా! సేవా చేసే సమయములో బాబా మరియు సేవ తప్ప ఇంకేమి సృజించదు, సంతోషములో నాట్యం చేస్తూ ఉంటారు. కావున ఈ బాధ్యతా కిరీటము తేలికైనదే కదా? అనగా తేలికగా తయారు చేస్తుంది. కావుననే బాప్ దాదా పిల్లలందరికీ ఆత్మిక సేవాధారులు అనే టైటిల్ ను విశేషముగా గుర్తు చేయిస్తారు. బాప్ దాదా కూడా ఆత్మిక సేవాధారిగా అయి వస్తారు. కావున తండ్రి స్వరూపమేదైతే ఉందో అదే పిల్లల యొక్క స్వరూపము కూడా. మరి డబల్ విదేశీలందరూ కిరీటధారులేనా? బాబా సమానముగా సదా ఆత్మిక సేవాధారులు. కళ్ళు తెరువగానే మిలనము జరుపుతారు మరియు సేవా క్షేత్రములో ఉపస్తితులవుతారు. గుడ్ మార్నింగ్ నుండి సేవ ప్రారంభమవుతుంది మరియు గుడ్ నైట్ వరకు సేవయే సేవ. ఏ విధంగా నిరంతర యోగులో ఆలాగే నిరంతర సేవాధారులు కూడా. కర్మణా సేవ చేసినా ఆ కర్మణా ద్వారా కూడా ఆత్మలలో ఆత్మిక శక్తిని నింపుతారు. ఎందుకంటే కర్మణా సేవతో పాటు మనసా సేవను కూడా చేస్తారు. కర్మణా సేవలో కూడా ఆత్మిక సేవ. భోజనం తయారు చేసేటప్పుడు ఆ భోజనంలో ఆత్మికతను నింపేస్తారు. కావున అది బ్రహ్మా భోజనంగా అయిపోతుంది, శుద్ధ అన్నముగా అయ్యిపోతుంది. అది ప్రసాదములా అయిపోతుంది. కావున స్థూల సేవలో కూడా ఆత్మిక సేవ నిండి ఉంది. ఇటువంటి నిరంతర సేవాధారులు నిరంతర మాయా జీతులుగా అయిపోతారు, విఘ్నవినాశకులుగా అయిపోతారు. మరి లండన్ నివాసులు ఎవరు? నిరంతర సేవాధారులు. మాయ లండన్ కైతే రావడం లేదు కదా, లేక మాయకు కూడా లండన్ అంటే ఇష్టమా? అచ్చా!

లండన్ నివాసులు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? లండన్లో మంచి మంచి రత్నాలు ఉన్నారు. వివిధ స్థానాలకు వెళ్ళారు. విదేశాలలోని అన్ని సేవా కేంద్రాలు ఒకదానితో ఒకటి తెరువబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సేవాకేంద్రాలు ఉన్నాయి? (50) కావున లండన్ 60 స్థానాలకు పునాది వంటిది. కావున వృక్షం సుందరముగా అయిపోయింది కదా. ఏ కాండమునుండైతే రెమ్మలు శాఖోపశాఖలు వెలువడ్డాయో ఆ వృక్షము ఎంత సుందరముగా ఉంటుంది! కావున విదేశము యొక్క వృక్షం కూడా విస్తారముగా బాగా ఫలీభూతమైపోయింది. బాప్ దాదా కూడా పిల్లల యొక్క, కేవలం లండన్ వారిదే కాదు పిల్లలందరి యొక్క సేవలోని ఉల్లాస ఉత్సాహాలను చూసి ఎంతో హర్షిస్తారు. విదేశాలలో లగనం బాగుంది. స్మృతి యొక్క మరియు సేవ యొక్క రెండిటి లగనము బాగుంది. కేవలం ఒక్క విషయం ఏమిటంటే మాయ యొక్క చిన్న చిన్న రూపాల నుండి కూడా త్వరగా కంగారుపడతారు. భారతదేశములో కొందరు బ్రాహ్మణులు ఎలుకను చూసి కూడా భయపడతారు. అలాగే బొద్దింకను చూసి కూడా భయపడతారు. అలాగే విదేశి పిల్లలు మాయ యొక్క చిన్న రూపాన్ని చూసి కూడా కంగారు పడతారు. చిన్న దానిని కూడా పెద్దదిగా భావిస్తారు, కాని నిజానికి ఏమి లేదు. కాగితపు పులిని చూసి నిజమైన పులిగా భావిస్తారు. ఎంతగా లగనము ఉందో, అంతగానే భయపడే సంస్కారాలు కూడా కొద్దిగా మైదానములోకి వచ్చేస్తాయి. కావున విదేశీ పిల్లలు మాయను చూసి భయపడకూడదు, ఆడుకోవాలి. కాగితపు పులితో ఆడుకొంటారా లేక భయపడతారా? అది బొమ్మ కదా, బొమ్మను చూసి భయపడేవారిని ఏమంటారు? మీరు ఎంతగా కష్టపడుతున్నారో అంతగా, ఆ లెక్కలో చూస్తే డబల్ విదేశీలందరూ నెంబర్ వన్ సీటును తీసుకోవచ్చు. ఎందుకంటే ఇతర ధర్మం యొక్క పరదా లోపల అనగా డబల్ పరదాలో ఉంటూ తండ్రిని గుర్తించారు. ఒకటేమో సాధారణ స్వరుపము యొక్క పరదా మరియూ ఇంకొకటి వేరే ధర్మము యొక్క పరదా, భారతవాసీయులైతే ఒకే పరదాను తెలుసుకోవలసి వస్తుంది, కానీ విదేశీ పిల్లలు రెండు పరదాల లోపల గుర్తించారు. ఎంతో ధైర్యవంతులు కూడా. అసంభవాన్ని సంభవం చేసారు. క్రైస్తవులు లేక ఇతర ధర్మాల వారు, మా ధర్మం వారు బ్రాహ్మణులుగా ఎలా అవ్వగలరు. అది అసంభవము అని భావిస్తారు. కావున అసంభవాన్ని సంభవం చేసారు. తెలుసుకోవడంలోనూ చురుకుగా ఉన్నారు, అంగీకరించడంలోనూ చురుకుగా ఉన్నారు. రెండింటిలోనూ నెంబర్ వన్ గా ఉన్నారు. కాని మధ్యలో ఎలుక వచ్చేస్తేనే భయపడతారు. నిజానికి ఇది సహజ మార్గమే కానీ మీ వ్యర్ధ సంకల్పాలను కలిపేయడంతో సహజమైనది కూడా కష్టమైపోతుంది. కావున ఇందులో కూడా జంప్ చేయండి. మాయను గుర్తించే నేత్రాన్ని తీవ్రతరం చేయండి. తప్పుగా అర్ధం చేసుకుంటారు, కాగితపు పులిని నిజముగా భావించటం సరిగ్గా అర్ధం చేసుకోకపోవటమే కదా. డబల్ విదేశీయుల విశేషతలు కూడా ఎన్నో ఉన్నాయి. కేవలం ఈ ఒక్క బలహీనతే ఉంది. తమపై తాము నవ్వుకుంటారు కూడా. ఎప్పుడైతే ఇది కాగితపు పులి, నిజమైన పులి కాదు అని అర్ధం చేసుకుంటారో అప్పుడు నవ్వుకుంటారు. పరిశీలించుకుంటారు మరియు పరివర్తన కూడా చేసుకుంటారు, కాని ఆ సమయములో భయపడిన కారణంగా క్రిందకు వచ్చేస్తారు లేక మధ్యలోకి వచ్చేస్తారు. మళ్ళీ పైకి ఎక్కేందుకు కష్టపడతారు, దానితో సహజముగా అనుభవమయ్యేందుకు బదులుగా కష్టముగా అనుభవమవుతుంది. నిజానికి అందులో కొద్దిగా కూడా శ్రమ లేదు. బాబాకు చెందినవారిలా అయ్యాక, అధికారీ ఆత్మలుగా అయ్యారు, ఖజానాకు ఇంటికీ, రాజ్యానికి అధిపతులుగా అయ్యారు. ఇంకేం కావాలి? మరప్పుడు ఏం చేస్తారు. భయపడే సంస్కారాలను ఇక్కడే వదిలి వెళ్ళండి. బాప్ దాదా కూడా ఆటను చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. పిల్లలు లోతులలోకి కూడా వెళ్తూ ఉంటారు. అలాగే అక్కడక్కడ భయపడుతు ఉంటారు కూడా. లాస్ట్ లో కూడా ఫాస్ట్ గా వెళ్ళి సంస్కారాలు ఉన్నాయి. మొదట విదేశీయులలో విశేషముగా చిక్కుకుపోయే సంస్కారాలు ఉండేవి. ఇప్పుడు వేగంగా వెళ్ళే సంస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక ఒక్కరిలో చిక్కుకోవడం లేదు. అనేకులలో చిక్కుకుంటున్నారు. జీవితంలో ఎన్ని రకాల పంజరాలు ఉంటయి! ఒక పంజరము నుండి బయట పడితే ఇంకొక దానిలో చిక్కుకుంటారు. కావున ఎంతగా చిక్కుకునే సంస్కారాలు ఉండేవో అంతగానే వేగంగా ముందుకు వెళ్ళే సంస్కారాలు ఉన్నాయి. కేవలం ఒక్క విషయం ఉంది, చిన్న విషయాన్ని పెద్దగా చేయకండి, పెద్దదానిని చిన్నగా చేయండి. ఇలా కూడా జరుగుతుందా? అన్న ప్రశ్న వద్దు. ఇలా జరిగిందేమిటి? ఇలా కూడా జరుగుతుందా? అని అనేందుకు బదులుగా ఏది జరిగితే అది కళ్యాణకారి అంటూ ప్రశ్నలు సమాప్తమైపోవాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి. బుద్ధిని ఇందులో ఎక్కువగా తిప్పకండి, లేకపోతే శక్తి వ్యర్ధమైపోతుంది మరియు స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకోరు. ప్రశ్నార్థకాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఇప్పుడు మధువన వరదానీ భూమిలో ఈ ప్రశ్నార్ధకాలను సమాప్తం చేసి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళండి. ప్రశ్నార్ధకాలు కష్టమైనవి, ఫుల్ స్టాప్ సహజమైనది. కావున సహజమైన దానిని వదిలి కష్టమైన దానిని ఎందుకు ధారణ చేస్తారు? ఇందులో శక్తి వ్యర్ధమవుతుంది మరియు ఫుల్ స్టాప్లో జీవితం ఉత్తమంగా అయిపోతుంది. అక్కడ వ్యర్ధము, ఇక్కడ సఫలము - మరి ఏమి చేయాలి? ఇప్పుడు వ్యర్ధం చేయకూడదు. ప్రతి సంకల్పము, ప్రతి క్షణము ఉత్తమంగా ఉండాలి.  అచ్చా - లండన్ నివాసులతో సంభాషణ పూర్తయ్యింది. లండన్ లోని ప్రియమైన పిల్లలందరికీ బాప్ దాదా యొక్క కోటానురెట్ల ప్రియస్మృతులు. సాకార రూపములో మధువనం వరకూ చేరుకోలేదు. కానీ బాప్ దాదా సదా పిల్లలను సమ్ముఖముగా చూస్తారు.

సేవాధారులైన పిల్లలెవరైతే ఉన్నారో వారి ఒక్కొక్కరి పేరును ఏం చెప్పగలం! వారందరికీ, సహయోగీ ఆత్మలందరికీ ప్రియస్మృతులు. అందరూ నిశ్చింతులుగా అయి నషాలో ఉండండి, ఎందుకంటే మీ అందరికీ తోడుగా స్వయంగా తండ్రియే ఉన్నారు. అచ్చా, అందరికీ ప్రియస్మృతులు. 

Comments