08-01-1979 అవ్యక్త మురళి

08-01-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగంలో సమానతలో సమీపంగా ఉండే వారే భవిష్య సంబంధంలో కూడా సమీప ఆత్మలు.

                        సర్వుల విఘ్నాలను వినాశనం చేసే ఆత్మిక తండ్రి శివబాబా మాట్లాడుతున్నారు -
                      
     ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న విదేశీ మరియు దేశవాసీయులైన పిల్లలను దూరంగా ఉన్నా కానీ దగ్గరగా చూస్తూ పిల్లలందరికి విశేషంగా విదేశీయులకు ఒక విషయంలో శభాష్ చెప్తున్నారు. ఎందుకంటే కోనకోనలో దాగి ఉన్న బాబా యొక్క పిల్లలు బాబాని గ్రహించి నిశ్చయంతో చాలా మంచిగా జంప్ చేసారు. రకరకాలైన ధర్మాలనే పరదాల లోపల ఉంటూ కూడా సెకనులో పరదాలను తొలగించుకుని బాబాకి సహయోగి ఆత్మలుగా అయిపోయారు. ఆ సంలగ్నతలో వచ్చే విఘ్నాలను కూడా సహజంగా దాటుతున్నారు. అందువలనే బాప్ దాదా విశేషంగా శభాష్ చెప్తున్నారు. ఇలా ధైర్యం ఉంచుకునే పిల్లలకి సదా బాప్ దాదా యొక్క సహయోగం సదా ఉంటుంది. ప్రతి బిడ్డకు ప్రతి కర్మలో బాబా తోడుగా ఉంటారు. పిల్లలందరికి బాప్ దాదా ద్వారా బుద్ధి రూపి లిఫ్ట్ అనే గిఫ్ట్ (బహుమతి) లభించింది. బహుమతి అయితే అందరికీ లభించింది. కానీ దానిని కార్యంలో తీసుకురావటమనేది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. ఇది చాలా శక్తివంతమైన, సహజమైన లిఫ్ట్ యొక్క బహుమతి. దీని ద్వారా సెకనులో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకుంటారు. ఈ అద్భుతమైన లిఫ్ట్ మూడు లోకాల వరకు వెళ్తుంది. స్మృతి అనే స్విచ్ వేయగానే సెకనులో అక్కడికి చేరుకోగలము. ఈ లిఫ్ట్ ద్వారా ఎంత సమయం, ఏ లోకాన్ని అనుభవం చేసుకోవాలనుకుంటున్నారో అంత సమయం అక్కడ ఉండవచ్చు. ఈ లిఫ్ట్ యదార్ధంగా ఉపయోగించుకునే విధి - అమృతవేళ జాగ్రత్త (కేర్‌ఫుల్)గా స్మృతి అనే స్విచ్ ని యదార్ధ రీతిలో అమర్చుకోండి. అప్పుడు రోజంతా స్వతహాగానే పని చేస్తూ ఉంటుంది. ఇలా అమర్చుకోవటం వస్తుంది కదా! మంచి అభ్యాసీలు ఉన్నారు కదా! దివ్యబుద్ది అనే లిఫ్ట్ రోజంతటిలో ఎక్కడా ఆగిపోవటం లేదు కదా! అధికారి అయ్యి ఈ లిఫ్ట్ ని కార్యంలో ఉపయోగించటం ద్వారా ఎప్పుడు మోసం చేయదు. వర్తమాన సంగమయుగీ లిఫ్ట్ - దివ్యబుద్ధి యొక్క లిఫ్ట్. దానితో పాటు వెనువెంట భవిష్య స్వర్గ రాజ్యం యొక్క బహుమతి కూడా బాప్ దాదా ఇప్పుడు ఇస్తున్నారు. స్వర్గ ద్వారం యొక్క తాళంచెవి బాప్ దాదా పిల్లలకే ఇస్తున్నారు. తాళంచెవి ఏమిటంటే అధికారి స్థితి అంటే అధికారిగా అవ్వటం. అధికారం అనే తాళంచెవితో ద్వారం తెరుచుకుంటుంది. నెంబర్ వన్ అధికారిగా ఎవరు అవుతారు? అంటే అధికారం ద్వారా ద్వారాన్ని మొదట ఎవరు తెరుస్తారో మీకు తెలుసు కదా! కాని ఒంటరిగా తెరవరు. ఆ కార్యక్రమం చేసేటప్పుడు మీరందరు కూడా ఉంటారు కదా! చూసేవారు ఉంటారా లేక చేసేవారు ఉంటారా? ఎవరు ఉంటారు? తోడుగా ఉండేవారే ఉంటారు కదా! తక్కువలో తక్కువ చప్పట్లు కొట్టేవారు అయినా ఉంటారు కదా! సంతోష పుష్పాల వర్షం కురుస్తుంది కదా! బాప్ దాదా సమయం యొక్క సమీపతను చూస్తూ ప్రతి బిడ్డ బాబాతో ఏ సమీప సంబంధంలో ఉన్నారు అనేది చూస్తున్నారు. అతి సమీపంగా ఎవరు ఉన్నారు? మరియు సమీపంగా ఎవరు ఉన్నారు? మరియు కొంచెం దూరం నుండి చూసేవారు ఎవరు? అని చూస్తున్నారు. పిల్లల డబుల్ భవిష్యత్తు బాప్ దాదా ఎదురుగా వస్తుంది. 1. సంగమయుగీ భవిష్యత్తు అంటే బాబా సమానంగా అయ్యే భవిష్యత్తు. 2. మొదటి జన్మ యొక్క భవిష్యత్తు అంటే స్వర్గం యొక్క భవిష్యత్తు. ఇక్కడ సమానతలో సమీపంగా ఉన్నవారే అక్కడ సంబంధంలో సమీపంగా ఉంటారు. ఎంతెంతగా ఇక్కడ సమానత ద్వారా సదా వెంట ఉంటారో అంత మూల వతనంలో కూడా అటువంటి ఆత్మలు వెనువెంటే ఉంటారు మరియు స్వర్గంలో కూడా ప్రతి దినచర్యలో సంబంధంలో తోడుగా ఉంటారు. ఎలా అయితే నీతోనే మాట్లాడతాను, నీతోనే ఆడుకుంటాను, నీతోనే తోడు నిలుపుకుంటాను అని అంటున్నారో అలాగే భవిష్యత్తులో కూడా ఉదయం ఉండి తోటలో ఆడుకుంటారు, నాట్యం చేస్తారు, పాఠశాలలో చదువుకుంటారు. ఇలా సదా కలుసుకుంటూ ఉంటారు మరియు వెంటే రాజ్యం చేస్తారు. బ్రహ్మాబాబా ఎలాగైతే స్వ రాజ్యాధికారిగా ఉండేవారు, స్వయానికి ఆధీనం అయ్యేవారు కాదు, అధికారిగా ఉండేవారు. అలాగే బ్రహ్మాబాబాని అనుసరించేవారు అంటే సదా సంకల్పంలో స్వరాజ్యం మా జన్మ సిద్ధాధికారం అని ఇక్కడ స్వరాజ్యం చేసేవారే అక్కడ బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యం చేస్తారు. ఇక్కడ నెంబర్ వన్ నిత్యం మరియు సరైన సమయానికి క్లాసుకి వచ్చే ఈశ్వరీయ విద్యార్థిగా ఉంటారో వారే అక్కడ కూడా కృష్ణునితో పాటు చదువుకుంటారు. ఎందుకంటే బ్రహ్మాబాబా మొదటి నెంబర్ భగవంతుని విద్యార్ధి. ఎవరైతే ఇక్కడ బాప్ దాదాతో అతీంద్రియ సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉంటారో వారు అక్కడ కూడా కలిసి ఊయలలో ఊగుతారు. ఎవరైతే ఇక్కడ అనేక ప్రాప్తులనే సంతోషంతో నాట్యం చేస్తారో వారు అక్కడ కూడా కలిసి నాట్యం చేస్తారు. ఎవరైతే ఇక్కడ బాబా యొక్క గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో. సర్వ సంబంధాలు బాబాతో అనుభవం చేసుకుంటారో వారు అక్కడ ఉన్నత కుటుంబం యొక్క సమీప సంబంధంలోకి వస్తారు. ఇలా బాప్ దాదా ప్రతి ఒక్కరి నయనాలలో రెండు భవిష్యత్తులను చూస్తున్నారు. మొదటి జన్మలోకి రావటమే మొదటి నెంబర్ ప్రాలబ్దం. విదేశీ పిల్లలందరు మొదటి జన్మలోకి వస్తారు కదా! ఇంతమంది మొదట నెంబర్లోకి వచ్చేస్తారా? మొదటి నెంబర్ లోకి ఎవరు వస్తారో విశేషంగా ఒక విషయం ఆధారంగా తెలుసుకోవచ్చు. అది ఏమిటి? ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు. విఘ్నాలు వచ్చినా కానీ విఘ్నాలను జంప్ చేసి దాటుతున్నారా లేక విఘ్నాలకు వశం అయిపోతున్నారా? నిర్విఘ్నం అంటే విఘ్నాలు రావు అని కాదు, కానీ విఘ్నవినాశకులుగా మరియు విఘ్నాలపై సదా విజయీగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఆది నుండి అంతిమం వరకు మంచిగా ఉంటే మొదటి జన్మలో తోడుగా అవుతారు. సహజ మార్గమే కదా! మంచిది.
                        కర్ణాటక పిల్లలు కూడా వచ్చారు. ఇది కూడా భారత దేశానికి విదేశమే. లండన్ నుండి సహజంగా వస్తున్నారు, కానీ వీరు చాలా కష్టపడుతున్నారు. అందువలన శ్రమకు ఫలితంగా ప్రత్యక్షంగా బాబా యొక్క మిలనం జరిగింది. సంలగ్నత ఉన్నవారు మంచిగా ఉన్నారు. పిల్లల సంలగ్నత చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. సదా ఈ సంలగ్నత అనే దీపాన్ని మాటి మాటికి ధ్యాస అనే నూనెతో అవినాశిగా ఉంచుకోవాలి. కర్నాటక వైపు దీపాలు చాలా వెలిగిస్తూ ఉంటారు. ఎలా అయితే సూలమైన దీపం సదా వెలుగుతూ ఉంటుందో అలాగే సంలగ్నత అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి. అందరు స్వయాన్ని బాబా యొక్క అదృష్టవంతమైన పిల్లలుగా భావిస్తున్నారు కదా! మంచిది. ఈరోజు కలయిక యొక్క రోజు.
                       ఈవిధంగా ప్రియమైన పిల్లలకు, శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకునే పిల్లలకు, సదా స్వరాజ్యాధికారిగా పిల్లలకు తిలకం మరియు సింహాసనాధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక (06-01-1979)

బ్రాహ్మణ జన్మ యొక్క ముఖ్య పర్సనాలిటీ - పవిత్రత.

సదా స్వయమును మనసా, వాచా, కర్మణా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ కలవారిగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క పర్సనాలిటీయే (వ్యక్తిత్వం) పవిత్రత. ఏదైతే బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం ఉందో, దానిని స్వయం జీవితములో అనుభవం చేస్తున్నారా? ఎంతగా వ్యక్తిత్వం ఉంటుందో అంతగా విశేష ఆత్మలుగా గాయనం చేయబడతారు. ముఖ్యమైన వ్యక్తిత్వము - పవిత్రత. బ్రహ్మాబాబా కూడా ఆదిదేవుడు మరియు మొదటి రాజకుమారుడు ఏ విధముగా అయ్యారు? ఈ పవిత్రత అనే వ్యక్తిత్వం యొక్క ఆధారంగా మొదటి నెంబర్ వ్యక్తిత్వం కలవారి యొక్క లిస్టులోకి వచ్చారు. కనుక ఫాలో ఫాదర్ చేయాలి కదా. సంస్కారములు కూడా పవిత్రముగా ఉండాలి. బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. అందుకనే ఈ రోజులలో బ్రాహ్మణుల ద్వారానే ఏ విధమైన శుద్ధ మరియు శ్రేష్ట కార్యమునైనా చేయిస్తారు. ఎందుకంటే వారిని మహాన్ గా భావిస్తారు. శ్రేష్టతయే పవిత్రత. కనుక బ్రాహ్మణ జీవితములో ఈ విధమైన నిజ సంస్కారమును సదా అనుభవం చేస్తూ ఉండండి. పవిత్రతను జన్మతః సంస్కారముగా చేసుకున్నారా? ఎవరికైనా క్రోధమనే సంస్కారం జన్మతోనే ఉంటే కనుక నేను ఆ విధంగా ఉండాలనుకోలేదు కానీ అది నా జన్మ సంస్కారము అని అంటారు. అదేవిధంగా ఈ జన్మ సంస్కారము స్వతహాగానే కార్యం చేస్తుంది. స్వప్నంలో కూడా ఏ విధమైన అపవిత్రతతో కూడిన సంకల్పము రాకూడదు - అటువంటివారిని పవిత్రత యొక్క పర్సనాలిటీ కలవారు అని అంటారు. ఈ వ్యక్తిత్వం కారణంగానే విశ్వాత్మలు ఇప్పటివరకు నమస్కరిస్తున్నారు. మహానాత్మల గురించి తెలియకపోయినా కూడా నమస్కరిస్తారు. ఎందుకంటే మీరు సాధారణమైనవారు కాదు, ఈ విధమైన మహానాత్మలు కదా.

మోహమునకు బీజము సంబంధము - ఈ బీజమును సమాప్తం చేసినట్లయితే అన్ని ఫిర్యాదులు సమాప్తం అవుతాయి. మాతలందరూ నష్టోమోహులే కదా. సర్వ సంబంధములు ఒకే బాబాతో జోడించినట్లయితే ఇక ఎవరి పట్లనైనా మోహం ఎందుకు కలుగుతుంది? ఏ సంబంధం వైపుకు మోహం వెళ్ళదు. సదా ఇది గుర్తుపెట్టుకోండి - సంబంధమే లేకపోతే మోహము ఎక్కడి నుండి వస్తుంది. మోహం యొక్క బీజం - సంబంధం. బీజముల సమాప్తం చేసినట్లయితే వృక్షము ఏ విధంగా వృద్ధి చెందుతుంది. ఇప్పటికీ కూడా కొద్దిగా జోడిస్తున్నారు, కొద్దిగా వదులుతున్నారు  - ఇలా రెండు వైపులా ఉన్నారు అనేది సిద్ది అవుతోంది. ఇలా రెండు వైపులా ఉండేవారు గమ్యమును చేరుకోవడం అనేది జరగదు. మీరైతే ఈ విధమైనవారు కాదు కదా. అందరూ నష్టమోహులే కదా. ఏమి చేయను, బంధన ఉంది, తొలగిపోవడం లేదు అని ఈవిధముగా మళ్లీ ఫిర్యాదులు చేయకండి. ఎక్కడైతే మోహం తొలగిపోతుందో అక్కడ స్మృతి స్వరూపులుగా అయిపోతారు. కనుక తొలగిపోవడం లేదు, తెగిపోవడం లేదు - ఈ విధమైన భాషను సమాప్తం చేయండి. సర్వప్రాప్తి స్వరూపులుగా అయిపోండి. సదా మన్మనాభవులుగా ఉండేవారే మనసు యొక్క బంధన నుండి ముక్తులుగా ఉంటారు. మంచిది, ఓం శాంతి.

విదేశీ సోదరీ సోదరులతో

మీరు బాబాకి సదా నియరెస్ట్ మరియు డియరెస్ట్ గా ఉన్నారా? స్వయమును ఏ విధంగా భావిస్తున్నారు? మీ కల్ప పూర్వపు ప్రాలబ్ధం స్పష్టంగా ఎదురుగా ఉంది కదా. డబల్ విదేశీ ఆత్మలకు నెంబర్ వారిగా ఈ సంగమయుగంలో విశేష పాత్రలలో విశేషమైన పాత్ర జోడింపబడి ఉంది. డబుల్ విదేశీ పిల్లలకు బాప్ దాదా ద్వారా ఏ విశేషమైన వరదానం ఉంది? విదేశీ పిల్లలు ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో ఆ మొదటి ఘడియ నుండి బాప్ దాదా నుండి బాప్ దాదా యొక్క చత్రచాయలో ఉండే‌ విశేష వరదానం లభించింది. భారతదేశము యొక్క శాస్త్రాలలో చూపిస్తారు, జైలులో శ్రీకృష్ణుని యొక్క జన్మ జరిగినప్పుడు నది దూరముగా వెళ్ళిపోతుంది, పాము రక్షణకు సాధనంగా అయిపోతుంది. అలాగే విదేశీ పిల్లలకు వరదానం ఉంది - వాతావరణం ఎంత సిద్ధంగా ఉన్నా, ఏ విధమైన పాత్రను అభినయిస్తున్న పాత్రధారిని చూసినా కానీ పిల్లలను తండ్రి యొక్క ఛత్రఛాయ సదా రక్షణగా ఉంచుతుంది మరియు చివరివరకు కూడా రక్షణగా ఉంచుతుంది.

2. విదేశీ పిల్లలు తండ్రిని తమకు తోడుగా అనుభవం చేస్తూ ఉన్నట్లయితే తండ్రి యొక్క విశేషం సహాయం కూడా ఉంటుంది. విదేశీ పిల్లల మూడవ విషయం, విశేష రూపంలో జన్మతః సేవా సంస్కారం యొక్క సహయోగం ఉంది. డ్రామానుసారంగా ఈ విశేషమైన పాత్ర లభించింది.నాలుగవ విషయం, స్మృతి యాత్రలో సహజంగా అనుభవాల ఖజానాలను ప్రాప్తించుకునే వరదానము కూడా విదేశీయులకు ప్రాప్తించింది. మరి మీరు ఎంత అదృష్టవంతులో చెప్పండి? బాప్ దాదా యొక్క సంగమయుగి విశేష అమూల్య రత్నాలు, ఈ అమూల్య రత్నముల ద్వారా బాప్ దాదా విశ్వంలో ఇటువంటి రత్నములను శ్యాంపిల్ రూపంలో ఉంచారు. కనుక సదా తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏ ఇతర విషయములు స్మృతిలోకి రాకూడదు. తోడు యొక్క అనుభవం సదా చేస్తూ ఉంటున్నారా? శక్తిసేన ఏమని భావిస్తున్నారు? శివుడు మరియు శక్తి సదా తోడుగా ఉన్నారు కదా. పేరు శక్తి కాదు, శివశక్తి. శివశక్తులు స్మృతి లేకుండా ఉండలేరు. ఏ కార్యం చేస్తున్నప్పటికీ సదా ఇది ఆలోచిస్తారు - విశ్వసేవ అనగా నిమిత్తమాత్రముగా కార్యము చేయడం, దీనినే కమలపుష్ప సమానము అని అంటారు. అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవుతూ ఉన్నారా? పాండవులు కమలపుష్ప సమానంగా ఉన్నారు కదా. ఈ లౌకిక కార్యము కూడా అనేక ఆత్మలను సంపర్కములోకి తీసుకువచ్చే సాధనము. అందువలన ఈశ్వరీయ సేవ కొరకు సంపర్కములను తయారు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా తయారుచేయబడిన సంపర్కములోకి వెళ్ళాలి. అందువలన డబల్ కార్యం కొరకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరియు ఇలా సంపర్కంలో ముందుకు వెళుతూ ఉండండి, అయితే సంపర్కం యొక్క అవసరము లేదు కానీ అలౌకిక కార్యమునకు నిమిత్తముగా భావించి లౌకికములోకి వెళ్ళాలి. అందరిలోనూ ఈ స్థితి రావాలి మరియు సదా ఉండాలి. దీనిని సేవ అవకాశముగా భావించి కార్యం చేయండి.

ఆస్ట్రేలియా పార్టీ - ఆస్ట్రేలియా వారు తండ్రిని ప్రత్యక్షం చేసే సంకల్పమును సాకారములో చాలా మంచిగా తీసుకున్నారు. ఏ అనుభవం అయితే లభించిందో దానిని అన్యాత్మలకు కూడా చేయించారు, ఏ ప్రాక్టికల్ రూపమును చూపించారో అది చాలా బాగుంది. ఈ విశేషత కారణంగా ఆస్ట్రేలియా యొక్క నంబరు బాప్ దాదా వద్ద నెంబర్ వన్ లో ఉంది. భారతదేశంలో ప్రతి ఇల్లు మందిరముగా అవుతుంది అనే గాయనము ఏదైతే ఉందో, అలాగే ఆస్ట్రేలియా వారు ప్రతి ఇంటిలోనూ అనగా ఎవరైతే  వచ్చారో ఈ సేవ యొక్క రుజీవని ఇవ్వడంలో ప్రతి ఇంటిని మందిరం గా తయారు చేయడంలో నంబర్ వన్ లోకి వచ్చారు. అయితే మీరందరూ ఏ విధంగా అయ్యారు? మందిరములో ఉండే చైతన్య మూర్తులు. మీరందరూ మేము నెంబర్ వన్ అని భావిస్తున్నారా? తండ్రి కూడా సంతోషిస్తున్నారు. ఈ విధంగా మిమ్మల్ని చూసి అందరూ మిమ్మల్ని ఫాలో చేయాలి. ఆస్ట్రేలియాలో క్యూ అందరికంటే ముందు ఉంటుంది. బాప్ దాదా ఎలా అయితే పిల్లలు అందరిపైనా ఆశ పెట్టుకుంటారో, అలాగే మీరందరూ కూడా ఆశా సితారలే కదా. ఆస్ట్రేలియా యొక్క ధ్వని ఏదైతే ఉందో అది నలువైపులా ఈ ధ్వని వ్యాపించాలి. భారతదేశమునకు ముందుగా చేరుకోవాలి. ధ్వని పెద్దగా  ఉన్నప్పుడే చేరుకుంటుంది.  నలువైపులా పెద్దగా ధ్వని చేసినప్పుడు ఈ ధ్వని వెలువడాలి - మా తండ్రి గుప్త వేషములో వచ్చారు. ఎలా అయితే మన తండ్రి గుప్తం నుండి పిల్లలను ప్రత్యక్షంలోకి చేసుకోవచ్చారో, అలాగే మనమందరము తండ్రిని ప్రత్యక్షం చేయాలి. శక్తులందరూ కలిసి తమ వ్రేలును ఇచ్చినట్లయితే సహజమైపోతుంది. చాలా మంచి మంచి రత్నాలు ఉన్నారు. ప్రతి ఒక్క రత్నమునకు తమ తమ విశేషత ఉంది. సదా తమను కల్పపూర్వపు రత్నముగా భావించి నడిచినట్లయితే విజయం యొక్క జన్మ సిద్ధ అధికారం ప్రాప్తమవుతుంది, విజయులుగా వుంటారు. మంచిది, ఓం శాంతి.

Comments