07-02-1980 అవ్యక్త మురళి

07-02-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విచిత్రమైన రాజదర్బారు.

బాప్ దాదా పిల్లలందరి(రూప్-బసంత్) జ్ఞానయుక్తమైన దివ్యగుణ రూపం రెండిటి సమతుల్యత చూస్తున్నారు. దివ్యగుణధారిగా(బసంత్ గా) కావాలి మరియు జ్ఞాన స్వరూప స్థితి (రూప్) కూడా కావాలి. రెండింటి సమతుల్యత (Balance) ఉందా? ఎలాగైతే బసంత్ అనగా ధ్వనిలోకి వచ్చే అభ్యాసం చాలా ఉందో అలా వాచాకు అతీతంగా అయ్యే అభ్యాసం కూడా ఉందా? అన్ని కర్మేంద్రియాలను కర్మలు చేసే స్థితికి అతీతంగా ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితమై ఉండగలరా? కర్మ ఆకర్షిస్తుందా లేక కర్మాతీత స్థితి ఆకర్షిస్తుందా! చూడడం, వినడం, వినిపించడం. ఇటువంటి విశేష కర్మలు సహజంగా అలవాటైపోయాయి. అలాగే కర్మాతీతులుగా అయ్యే స్థితి అనగా కర్మలను “సర్దుకునే శక్తి" ద్వారా అకర్మీ అనగా కర్మాతీతులుగా అవ్వగలరా? ఒకటేమో కర్మలకు అధీన స్థితి, రెండవది - కర్మాతీత స్థితి అనగా సంగమయుగీ కర్మేంద్రియాజీత్ స్వరాజ్య అధికారీ స్థితి. రాజ్య అధికారి రాజుల రాజ్య వ్యవహారము సరిగ్గా నడుస్తూ ఉందా? అని రాజ్య అధికారి రాజులను అడుగుచున్నారు. ప్రతీ రాజ్యాధికారి రోజూ తమ రాజదర్బారును నిర్వహిస్తున్నారా? రాజదర్బారులో రాజ్యవ్యవహారం చేసేవారు తమ కార్యాల రిజల్ట్ ను అందరికీ తెలుపుతారు. ప్రతి కర్మచారీ (కర్మేంద్రియాలు) రాజ్యాధికారులైన మీ అధీనంలో ఉన్నాయా? ఏ కర్మేంద్రియమూ మోసము(తాకట్టులో మోసం) లేక ఏ విధమైన గొడవ చేయడం లేదు కదా? రాజ్యాధికారి అయిన మిమ్ములను ఎప్పుడూ మోసం చేయడం లేదు కదా. మీ ఆజ్ఞానుసారం నడవడానికి బదులు మిమ్ములను నడిపించడం లేదు కదా? రాజ్యాధికారులైన మీ రాజ్యం ఉందా లేక ప్రజారాజ్యం ఉందా? ఇలాటి చెకింగ్ చేసుకుంటున్నారా లేక శత్రువు వచ్చినప్పుడు తెలివి వస్తుందా? రోజూ మీ దర్బారును నిర్వహిస్తున్నారా లేక అప్పుడప్పుడు దర్బారు పెట్టుకుంటున్నారా? తమ రాజ్యంలో ఉన్న కర్మచారుల పరిస్థితి ఎలా ఉంది? రాజ్య వ్యవహారం సరిగ్గా ఉందా? ఇంత అటెన్షన్ ఇస్తున్నారా? ఇప్పుడు రాజులుగా ఉన్నవారే జన్మ జన్మాంతరాల వరకు రాజులుగా అవుతారు. తమ దాసీలు(ఇంద్రియాలు) పనులు బాగా చేస్తున్నాయా? అన్నింటికంటే చాలా పెద్ద దాసి ప్రకృతి. ప్రకృతి అనే దాసి సరిగ్గా పని చేస్తున్నదా? ప్రకృతిజీత్ ల ఆజ్ఞానుసారము పని చేస్తున్నదా? ప్రకృతిజీతులుగా ఉండేవారు ప్రకృతి ఆజ్ఞకు లోబడుట లేదు కదా? తమ రాజ్యదర్బారులో ముఖ్యంగా ఉన్న ఎనిమిది సహయోగ శక్తులు తమ కార్యంలో సహయోగాన్ని ఇస్తున్నాయా? రాజ్య కార్య వ్యవహారానికి శోభ ఈ అష్ట శక్తులే అనగా అష్టరత్నాలు, అష్ట సహయోగులు. కావున ఈ ఎనిమిది సరిగ్గా ఉన్నాయా? తమ రిజల్ట్ చెక్ చేసుకోండి. రాజ్య కార్యవ్యవహారం నడిపించడం వస్తుందా? రాజ్యాధికారులు సోమరితనపు నిద్రలో, అల్పకాలిక ప్రాప్తుల నషాలో లేక వ్యర్థ సంకల్పాల నాట్యంలో మస్త్ గా ఉంటే, మునిగి ఉంటే సహయోగ శక్తులు కూడా సమయానికి సహయోగం ఇవ్వవు. కనుక రిజల్ట్ ఎలా ఉందనుకోవాలి? ఈ వర్తమాన సమయంలో బాప్ దాదా ప్రతి పుత్రుని భిన్న భిన్న రూపాల రిజల్ట్ చెక్ చేస్తున్నారు. మీరు కూడా మీ రిజల్ట్ ను చెక్ చేసుకుంటున్నారా? మొదట సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి సంస్కార శక్తి - ఈ మూడు శక్తులు ఆర్డర్ లో ఉన్నాయా? తర్వాత అష్ట శక్తులు ఆర్డర్ లో ఉన్నాయా? ఈ మూడు శక్తులు మహామంత్రులు. కావున ఈ మంత్రి మండలి సరిగ్గా ఉందా లేక కదిలిస్తూ ఉందా? మీ మంత్రులు కూడా పార్టీ మారిపోవడం లేదు కదా? ఎప్పుడూ మాయకు దాసులుగా కావడం లేదు కదా?

ఇప్పటివరకూ కంట్రోలింగ్ పవర్ లేకపోతే అంతిమ(ఫైనల్) రిజల్ట్ లో ఏమవుతుంది? ఫైన్ చెల్లించుటకు ధర్మరాజపురిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫైన్ అనగా ధర్మరాజపురిలోని శిక్షలు. రిఫైన్(స్వచ్ఛంగా) అయినారంటే ఫైన్ చెల్లించే అవసరం ఉండదు. ఇప్పటి నుండే రాజ్యదర్బార్ బాగుండేవారు ధర్మరాజు దరారు వెళ్లరు. ధర్మరాజు కూడా వారిని స్వాగతం చేస్తారు(గౌరవిస్తారు). స్వాగతం చేయించుకోవాలా లేక మాటిమాటికి శపథం(ప్రతిజ్ఞ చేస్తూ ఉండాలా! ఇక చెయ్యము, ఇక చెయ్యము అని మాటిమాటికి చెప్పాల్సి ఉంటుంది. తమ అంతిమ తీర్పును చేసుకున్నారా లేక ఇప్పుడు కూడా ఫైళ్ల భండారము నిండి ఉందా? ఖాతా క్లియర్ అయిపోయిందా? మస్తకం అనే టేబుల్ పై ఇది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అనే ఫైళ్లు లేవు కదా? 

ఇంకా ఇప్పటివరకూ పాత ఖాతాల లెక్కలను సమాప్తి చేసుకోకుండా పెంచుకుంటూ పోతే ఫలితం ఏమవుతుంది! పాత ఖాతాను ఎంతగా నడిపిస్తూ ఉంటే అంతగా ఆర్తనాదాలు చెయ్యాల్సి ఉంటుంది. ఈ ఆర్తనాదాలు చెయ్యడం చాలా బాధాకరంగా, భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్క సెకండు ఒక్కొక్క సంవత్సరం సమానంగా అనుభవమవుతుంది. అందువలన ఇప్పుడైనా శివ మంత్రం ద్వారా సమాప్తి (సమర్పణ) చేసెయ్యండి. ఇంకా చాలామంది ఖాతాలు భస్మం కాలేదు. ఇప్పటికీ పాత ఖాతాలనే నడిపిస్తూ ఉన్నారు. వినిపించాను కదా! చాలా మందిలో ఇప్పుడు కూడా తండ్రి ఇచ్చిన సర్వ ఖజానాలలో ఈ మూడు శక్తులు మోసం చేస్తున్నాయి. స్వకళ్యాణం మరియు విశ్వకళ్యాణం కొరకు తండ్రి ఖజానాలు ఇచ్చారు. కానీ వ్యర్థం వైపు వినియోగించడం, అకళ్యాణ కార్యంలో వినియోగించడం - ఇది తాకట్టు పెట్టిన దానిలో మోసం అవుతుంది. శ్రీమతంతో పరమతం, జనమతం(జనుల మతం) కలుస్తున్నాయి. కల్తీ చెయ్యడంలో చాలా తెలివిగలవారిగా కూడా ఉన్నారు. రూపం శ్రీమతమున్నట్లే ఉంటుంది. మురళిలోని మాటలే తీసుకుంటారు కాని మాటలు “శివం మరియు శవం” అను పదాల అర్థానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. శివబాబాకు బదులుగా శవానికి తగులుకుంటారు. వారి భాష చాలా రాయల్ గా ఉంటుంది. సదా తమను రక్షించుకునేందుకు ఎవరు చేశారు? ఎవరు చూస్తున్నారు? అని ధైర్యంగా స్వయాన్ని నడిపించుకుంటూ ఉంటారు. ఇతరులను మోసం చేస్తున్నామని అనుకుంటారు. కానీ స్వయం దు:ఖాన్ని జమ చేసుకుంటున్నారు. ఒకటికి వంద రెట్లుగా జమ అవుతూ ఉంటుంది. అందువలన మోసము మరియు కల్తీని సమాప్తి చేయండి. ఆత్మీయతను మరియు దయా గుణాన్ని ధారణ చెయ్యండి. స్వయం మరియు సర్వుల పైన దయా హృదయులుగా కండి. స్వయాన్ని చూసుకోండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి. అర్జునులు కండి. ఎవరు చేస్తే వారు అర్జునునిగా అవుతారు. సదా ఈ స్లోగన్ ను గుర్తుంచుకోండి. “చెప్పి నేర్పించరాదు, చేసి నేర్పించాలి”. శ్రేష్ఠ కర్మలు చేసి నేర్పించాలి. వ్యతిరేకతను నేర్పించరాదు. నేను మారి అందరినీ మార్చి చూపిస్తాను. వ్యర్థ మాటలు వింటున్నా, చూస్తున్నా హోలీ హంసలుగా అయ్యి వ్యర్థాన్ని వదిలి సమర్థతను ధారణ చెయ్యండి. సదా మెరుస్తున్న(చమ్ కీలీ) డ్రస్సులో అలంకరించబడిన సౌభాగ్యవంతులుగా ఉండండి. తండ్రి మరియు నేను మూడవ వారెవ్వరూ ఉండరాదు. సదా ఊయలలో ఊగుతూ ఉండండి. తండ్రి ఒడి అనే ఊయలలో ఊగండి లేక సర్వ ప్రాప్తుల ఊయలలో ఊగండి. సంకల్పం అనే గోరు కూడా మట్టిలోకి వెళ్ళరాదు. ఈ సంవత్సరం ఏమి చెయ్యాలో అర్థమయిందా! లేకపోతే మీరు మట్టి తుడుచుకుంటూ ఉంటే ప్రియుడు వచ్చేస్తాడు. ప్రియుడు గమ్యానికి చేరుకుంటాడు, మీరు మట్టి తుడుచుకుంటూ ఉండిపోతారు. పెళ్ళి ఊరేగింపు లిస్టులోకి వచ్చేస్తారు. సమయం కొరకు ఎదురు చూడకండి. సదా స్వయాన్ని నేను ఎవరెడీగా ఉన్నానని ఆఫర్ చేయండి. ఇప్పుడేం చెయ్యాలో అర్థమయిందా! 

గడచిపోయిన సంవత్సరం ఫలితాలు చూస్తే ఇంకా చాలామంది ఖాతాలు క్లియర్ కాలేదు. ఇప్పటివరకు చాలా మంది పై పాత-పాత మచ్చలు ఇంకా ఉన్నాయి. రుద్దుకుంటూ ఉంటారు, మరలా మచ్చలు(మరకలు) వేసుకుంటూ ఉంటారు. చాలామందికి మొదట చిన్న మచ్చ ఉంటుంది. కానీ దాచుకుంటూ దాచుకుంటూ పెద్దదిగా చేసుకున్నారు. కొంతమంది దాచుకుంటారు, కొంతమంది నేర్పరితనంతో తమను నడిపించుకుంటారు. అందువలన మచ్చ లోతుగా, గాఢమైపోతుంది. ఏ విధంగా చాలా లోతైన మచ్చ పడినప్పుడు ఏ వస్తువు పై ఆ మరక ఉంటుందో అది అక్కడే చినిగిపోతుంది. కాగితంపై కావచ్చు, వస్త్రంపై కావచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా గాఢమైన మరక పడినవారు(హృదయం చీల్చుకొని) గుండె పగిలేలా ఏడవాల్సి ఉంటుంది. ఈ పని చేశాను, ఈ పని చేశాను అని గుండె పగిలేలా ఏడ్వవలసి ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఒక్క సెకండు చూచినా అది వినాశన కాలం కంటే కూడా భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. అందువలన సత్యంగా కండి, స్వచ్ఛంగా కండి. బాప్ దాదాకు ఇప్పుడు కూడా దయ వస్తుంది. అందువలన ప్రతిరోజు తమ రాజదర్బార్‌ను పెట్టుకోండి. న్యాయ విచారణ చెయ్యండి. చెక్ చేసుకుంటే పరివర్తన (Change) అయిపోతారు.

ఇలాంటి స్వ పరివర్తన ద్వారా విశ్వపరివర్తన చేయువారికి, సదా రాజ్యా ధికారులుగా ఉన్నవారికి, సదా ఆత్మీయత మరియు దయా వృత్తి కల్గిన వారికి, విశ్వంలో సదా సుఖ శాంతుల వాయుమండలాన్ని తయారు చేయువారికి, వెతుకుచున్న ఆత్మలకు, లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వాలనే దృఢ సంకల్పము చేయువారికి, పాత ప్రపంచపు ఆకర్షణలకు దూరంగా ఉండేవారికి, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.. 

సేవాధారీ సోదర- సోదరీలతో:- సేవాధారులనగా తండ్రి సమానమైనవారు. తండ్రి కూడా సేవాధారీగా అయ్యే వస్తారు. సేవాధారిగా అవ్వడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. కావున ఇది కూడా డ్రామాలో లాటరీలో నా పేరు వచ్చిందని భావించండి. సేవకు అవకాశం లభించడం అనగా లాటరీలో పేరు రావడం. సదా సేవ చేసే అవకాశం లభించడం అనగా లాటరీలో పేరు రావడం. సదా సేవ చేసే అవకాశం తీసుకుంటూ ఉండండి. అందరి రిజల్ట్ చాలా బాగుంది - శుభాకాంక్షలు. అచ్ఛా 

వ్యక్తిగత మిలనము - పార్టీలతో- బాప్ దాదా ప్రతీ పుత్రుని ఏ దృష్టితో చూస్తారు? బాప్ దాదా దృష్టి ప్రతీ పుత్రుని విశేషతల పైకి వెళ్తుంది. ఏ విశేషత లేని వారెవ్వరూ ఉండరు. విశేషతలున్నాయి కనుకనే విశేషాత్మలై బ్రాహ్మణ పరివారంలోకి వచ్చారు. మీరు కూడా ఎవరి సంపర్కములోకి వచ్చినా, మీ దృష్టి వారి విశేషతల పైకే వెళ్లాలి. విశేషత ద్వారా వారితో కార్యము చేయించగలరు, లాభము తీసుకోగలరు. ఎలాగైతే తండ్రి హోప్ లెస్(Hopeless) వారిని హోప్ (Hope) గలవారిగా చేస్తారో అలా ఎటువంటి వారైనా, ఎవరైనా, ఎలా ఉన్నా వారి ద్వారా పని తీసుకోవాలి. ఇదే సంగమ యుగ బ్రాహ్మణుల విశేషత. ఎలాగైతే రత్నాల వ్యాపారి దృష్టి సదా వజ్రముపై ఉంటుందో అలా మీరు కూడా నగల వ్యాపారులే కనుక మీ దృష్టి రాళ్ల పైకి పోరాదు, రత్నాలనే చూడండి. సంగమ యుగము కూడా వజ్ర తుల్య యుగము కదా. పాత్ర హీరో పాత్ర యుగము వజ్రతుల్యమైనది, కనుక వజ్రమునే(హీరా) చూడండి. మరి స్థితి ఎలా ఉండాలి? మీ శుభ భావనల కిరణాలు అన్ని వైపులా వ్యాపింపజేస్తూ ఉండండి. వర్తమాన సమయంలో ఈ మాటపై విశేష గమనముండాలి. ఇటువంటి పురుషార్థులనే తీవ్రపురుషార్థులని అంటారు. ఇటువంటి పురుషార్థులు కష్టపడే అవసరముండదు. అన్ని పనుల సహజమైపోతాయి. సహజ యోగుల ముందు ఎంత పెద్ద విషయమైనా అసలు ఏమీ జరగలేదు అన్నంత సహజమైపోతుంది. శూలము చిన్న ముల్లు వలె అయిపోతుంది. కనుక ఇటువంటి సహజయోగులుగా ఉన్నారు కదా? బాల్యములో నడక నేర్చుకునే సమయంలో నడక కష్టమనిపిస్తుంది. కనుక కష్టమైన పని అనుట బాల్యములోని మాట. ఇప్పుడు కష్టము సమాప్తమై అన్నీ సహజమైపోయాయి. ఎక్కడైనా, ఏదైనా కష్టము అనుభవమవుతుందో అక్కడ అదే స్థానములో బాబాను ఉంచండి. భారము మీ పై ఉంచుకుంటే కష్టమనిపిస్తుంది. ఆ భారాన్ని తండ్రి పై ఉంచితే తండ్రి దానిని సమాప్తం చేసేస్తారు. ఎప్పుడైతే పండాను(మార్గదర్శకుని) మర్చిపోతారో అప్పుడు మార్గము కష్టంగా అనుభవమవుతుంది. శ్రమలో సమయం వృథా అయిపోతుంది. ఇప్పుడు మనసా సేవ చెయ్యండి, శుభ చింతన చెయ్యండి, మనన శక్తిని పెంచండి. కష్టము చేసేది కూలీలు, మీరు అధికారులు కదా. 

బ్రాహ్మణ జీవితములోని విశేషత - అనుభవము:- జ్ఞానముతో పాటు ప్రతి గుణము అనుభవమవ్వాలి. ఏ ఒక్క గుణమును గాని, శక్తిని గాని అనుభవము చేయలేదంటే ఎప్పుడో ఒకప్పుడు విఘ్నానికి వశమైపోతారు. ఇప్పుడు అనుభూతి కోర్సును ప్రారంభించండి. ప్రతీ గుణము, ప్రతీ శక్తుల ఖజానాలను ఉపయోగించండి. ఏ సమయంలో ఏ గుణము అవసరమో ఆ సమయంలో దాని స్వరూపమైపోండి. ఉదాహరణానికి ఆత్మ గుణము ప్రేమ స్వరూపము. కేవలం ప్రేమ కాదు, ప్రేమ స్వరూపమైపోవాలి. ఏ ఆత్మను చూచినా ఆ ఆత్మకు ప్రేమ అనుభవమవ్వాలి. స్వయానికి గాని, ఇతరులకు గాని అనుభవం కాకుంటే లభించిన దానిని ఉపయోగించడం లేదు అని అర్థమౌతుంది. ఎలాగైతే ఈ రోజులలో కూడా ఖజానాలు లాకర్స్ లో పడి ఉంటే సంతోషముండదో అలా జ్ఞాన ఖజానాను బుద్ధి అనే లాకర్ లో ఉంచకండి, ఉపయోగించండి. అప్పుడు ఈ బ్రాహ్మణ జీవితము ఎంత శ్రేష్ఠమనిపిస్తుందో చూడండి. అప్పుడు “వహ్వా నేను” అనే పాట పాడుతూ ఉంటారు. అనుభవీల మాటలకు, జ్ఞానుల మాటలకు వ్యత్యాసముంటుంది. కేవలం జ్ఞానమున్న వారు ఎప్పుడూ అనుభవం చేయించలేరు. కనుక నేను ఎంత వరకు అనుభవీ మూర్తిగా అయ్యాను? ఏ శక్తిని ఎంత శాతము ప్రాప్తి చేసుకున్నాను? సమయానికి ఆ శక్తిని కార్యములో తీసుకురాగలుగుతున్నానా? లేదా? శత్రువు వచ్చినప్పుడు కత్తి ఉపయోగించకుంటే లేక ఢాలు ఉపయోగించాలన్నప్పుడు కత్తిని, కత్తి ఉపయోగించాల్సినప్పుడు ఢాలు గుర్తు రాకూడదు. ఏ సమయంలో ఏది అవసరమో అదే ఉపయోగించాలి. అప్పుడే విజయులుగా అవుతారు. అచ్ఛా!

Comments