07-01-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమయుగీ చక్రవర్తి పదవి - సత్యయుగీ చక్రవర్తి పదవి.
ఈ రోజు బాప్ దాదా సంగమయుగీ చింతలేని సభను చూస్తున్నారు. సంగమయుగమంటేనే చింతలేనిపురము(బేగంపూర్). సంగమ యుగములోని బ్రాహ్మణులందరూ చింతలేని పురానికి చక్రవర్తులు. సత్యయుగములోని చక్రవర్తి పదవి ఈ సంగమయుగములోని నిశ్చింత చక్రవర్తి పదవి కంటే పదమా రెట్లు శ్రేష్ఠము.
ఈ రోజు వతనంలో సత్యయుగ చక్రవర్తి పదవికి, సంగమ యుగములోని చక్రవర్తి పదవికి గల తేడాను గురించి ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండినది. సత్యయుగం ఎంత శ్రేష్ఠమైనదో అది కూడా మీకు అనుభవమే కదా.
1. సత్యయుగ దినచర్యలో మిమ్ములను ప్రకృతిలోని సహజ సంగీతం(పాటలు) మేల్కొల్పుతుంది. కాని సంగమ యుగములో బ్రాహ్మణుల ఆదికారము - అమృతవేళ నుండి శ్రేష్ఠతను ఎంత మహోన్నతమయ్యిందో చూడండి(గమనించండి) అక్కడ ప్రకృతి సాధనాలు మేల్కొల్పుతాయి. సంగమ యుగములోని ఆదికాలము అనగా అమృతవేళలో ఎవరు మేల్కొల్పుతారు? స్వయం ప్రకృతికి యజమాని అయిన భగవంతుడే మేల్కొల్పుతారు.
2. ఏ మధురమైన పాటలు వింటారు? తండ్రి ప్రతి రోజు మధురమైన పిల్లలూ! అని పిలుస్తారు. ఇది న్యాచురల్ పాట. మీరు అనుభవీలే కదా, మరి సత్యయుగములోని పాట గొప్పదా లేక సంగమయుగములోని పాట గొప్పదా? ఇది సత్యయుగములోని సంస్కారాలను, ప్రాలబ్ధాన్ని తయారు చేసుకొని స్వయంలో నింపుకునే సమయం. సంస్కారాలు నిండుతాయి, ప్రాలబ్దము తయారవుతుంది. ఇదంతా
సంగమ యుగములోనే జరుగుతుంది.
3. అక్కడ సతో ప్రధానమైన అత్యంత రుచికరమైన రసం కలిగిన వృక్ష ఫలాలు తింటారు. ఇక్కడ వ్యక్షపతిద్వారా సర్వ సంబంధాల రసము సర్వ ప్రాప్తి సంపన్నమైన ప్రత్యక్ష ఫలం భుజిస్తారు.
4. అది బంగారు యుగంలోని ఫలం. ఇది వజ్రాల యుగములోని ఫలాలు కనుక శ్రేష్ఠమైనదేది?
5. అక్కడ దాస దాసీల చేతులలో పాలన పొందుతారు. ఇక్కడ తండ్రి చేతులలో పాలన పొందుతున్నారు.
6. అక్కడ మహాన్ ఆత్మల తల్లిదండ్రులుగా ఉంటారు. ఇక్కడ పరమాత్మ తల్లితండ్రిగా ఉన్నారు.
7. అక్కడ రత్న జడిత ఊయల తల్లిదండ్రుల ఒడి. ఇక్కడ కేవలం ఒకే ఊయలలో ఊగరు. రకరకాల ఊయలలో ఊగుతారు. అతీంద్రియ సుఖమునిచ్చే ఊయల, సంతోషాలనిచ్చే ఊయల......... అక్కడ రత్నజడిత ఊయల ఉంటుంది, అయితే ఇక్కడ ఊయల ఎంత మహోన్నతమైనది.
8. అక్కడ రత్నాలతో, ఆటబొమ్మలతో పరస్పరం ఆడుకుంటారు కానీ ఇక్కడ బాబా చెప్తున్నారు - "సదా నాతో ఏ రూపములో కావాలనుకుంటే ఆ రూపంలో ఆడుకోవచ్చు. సఖునిగా చేసుకొని ఆడుకో, బంధువుగా చేసుకొని ఆడుకో, కొడుకుగా చేసుకొని కూడా ఆడుకోవచ్చు. ఇటువంటి అవినారి ఆటబొమ్మ ఎప్పుడూ లభించదు. ఈ ఆటబొమ్మ ఎప్పుడూ విరిగిపోదు, పగిలిపోదు. అంతేకాక ఖర్చు చేసే పని కూడా ఉండదు.
9. అక్కడ సుఖంగా మెత్తని పరుపులపై పడుకుంటారు. ఇక్కడ స్మృతి అనే పరుపుపై పడుకోండి.
10. అక్కడ నిద్రా లోకంలోని వెళ్లిపోతారు. కాని ఇక్కడ సంగమ యుగంలో తండ్రితో పాటు సూక్ష్మ వతనంలోకి వెళ్లిపోండి.
11. అక్కడ విమానాలలో కేవలం ఒక్క లోకంలోనే విహరించగలరు. కాని ఇక్కడ బుద్ధి రూపీ విమానం ద్వారా మూడు లోకాలలోనూ విహరించగలరు.
12. అక్కడ విశ్వనాథులుగా పిలువబడ్డారు, కాని ఇప్పుడు మీరు త్రిలోకనాథులు.
13. అక్కడ రెండు నేత్రాలుంటాయి. ఇక్కడ మీరు త్రినేత్రులు.
14. సంగమ యుగములో జ్ఞాన సాగరులుగా, శక్తి సాగరులుగా, ఆనంద సాగరులుగా ఉంటారు. దీనికి పోలుస్తే అక్కడ రాయల్ బుద్దుగా (తెలివిహీనులు) అయిపోతారు.
15. ప్రపంచము వారి లెక్కలో పరమ పూజ్యులుగా ఉంటారు. విశ్వమంతా గౌరవిస్తారు. కాని జ్ఞానము లెక్కతో చాలా తేడా ఉంటుంది.
16. ఇక్కడ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు తండ్రికి చెప్తారు. అక్కడ ఆత్మలు ఆత్మలకు చెప్తారు.
17. అక్కడ విశ్వ రాజ్యాధికారులుగా ఉంటారు. రాజ్య పాలన చేస్తారు. ఇక్కడ విశ్వ కళ్యాణకారులు, మహాదానులు, వరదానులుగా ఉంటారు. అంటే శ్రేష్ఠులెవరు? సత్యయుగ విషయాలు విని సంతోషించారు. ఇప్పుడు సదా సంతోష స్వరూపులుగా కండి
18. అక్కడ రకరకాల భోజనం తింటారు. ఇక్కడ బ్రహ్మాభోజనం తింటారు. దీని మహిమ దేవతల భోజనం కంటే అతిశ్రేష్ఠమైనది. అందువలన సదా సత్యయుగ ప్రాలబ్ధాన్ని, వర్తమాన సంగమ యుగ మహత్యాన్ని, ప్రాప్తిని తోడు తోడుగా ఉంచుకోండి. వర్తమాన సమయాన్ని తెలుసుకొని ప్రతి సెకండును, ప్రతి సంకల్పాన్ని శ్రేష్ఠంగా చేసుకోండి. తెలిసిందా.
ఈ రోజు పంజాబు జోను వచ్చింది. పంజాబుకు రెండు విశేషతలున్నాయి. మొదటిది పంజాబులోని నీరు, రెండవది పంజాబులోని భూమి. ఆ ప్రభుత్వము పంజాబులో రెండు విశేషతలు చూపించారు. పాండవ గవర్నమెంటు తరఫున పంజాబు ఏ విశేషతను చూపించింది. పంజాబు జ్ఞాన నదులనే హ్యాండ్స్ ను తయారు చేసింది. అయితే అద్భుతము కూడా చేసింది. పంజాబులోని నదులు పంజాబులోనే ప్రవహిస్తాయి. అన్ని వైపులకూ అంతగా ప్రవహించవు. పంజాబు నదులు, పంజాబులోనే ఉంటాయి. అందువలన పంజాబులోని నీరు ప్రసిద్ధి చెందింది. పంజాబులో సీజన్ కాకపోయినా ధాన్యాన్ని పండిస్తారు. అటువంటి సాధనాలు తయారుచేశారు. అందువలన పంతాలువారు 12 నెలలకు, 12 ఫలాలు ఇవ్వాలి. సైన్సు శక్తి సీజన్ కాకపోయినా ధాన్యాన్ని పండిస్తూ ఉంటే సైలెన్స్ శక్తి ఫుల్ సీజన్ అయిన సంగమ యుగములో ప్రతి నెలా ఫలాన్ని ఇవ్వలేదా? వారు అసంభవాన్ని కూడా సంభవము చేసే సాధనాలను ఎలా ఉపయోగిస్తున్నారో అలా సాధన ద్వారా పంజాబు భూమి పరివర్తన చెయ్యండి. ప్రత్యక్ష ఫలము ఇవ్వాల్సి వస్తుంది. పంజాబువారు ఈ నూతన సంవత్సరంలో ఒక స్లోగన్ గుర్తుంచుకోవాలి. ఏ స్లోగన్? “అనుకున్న వెంటనే చేసే దానము మహాపుణ్యమునిస్తుంది "(తురంత్ దాన్ మహా పుణ్య్) ఇప్పుడు జ్ఞాన గంగల పాత్ర నడుస్తూ ఉంది. పాండవులు వెన్నముక వలె ఉన్నారు. ముందు శక్తులను నిమిత్తంగా ఉంచండి. ఇందులో కూడా పాండవులకు లాభమే ఉంది. లేకుంటే దెబ్బలు తినాల్సి వస్తుంది. విశేషంగా పంజాబులో చాలా లూఠీ దెబ్బలు పడ్డాయి. అందువలన శక్తులు గైడుగా ఉంటారు. పాండవులు గార్డుగా ఉంటారు. గార్డ్ మరియు గాడ్ రెండిటి రాశి కలుస్తుంది, ఎలాగైతే తండ్రి వెన్నముకగా ఉండి శక్తులను ముందుంచారో అలా పాండవులు కూడా తండ్రి సమానం వెన్నముకగా నిల్చి శక్తులను ముందుంచండి. కనుక ఇప్పుడు నూతన సంవత్సరంలో పంజాబు ఏ నవీనతను చూపిస్తుంది? భూమిని పరివర్తన చేసి నవీనత. అర్థమయ్యిందా!
విదేశీ సేవలో మంచి మంచి మహావీరులు, మహావీరవనితలు సైన్సు పై సైలెన్స్ శక్తి ద్వారా విజయము ప్రాప్తి చేసుకునేవారు తయారవుతూ ఉన్నారు. మంచి మంచి సేవాధారులు, తండ్రికి భుజాల వంటివారు తయారయ్యే ఉన్నారు. కుడి భుజాలు, కుడి చేతుల ద్వారా సదా శ్రేష్ఠ కార్యాలు సహజంగా జరుగుతాయి. ఇప్పుడు విదేశాలలో కుడి భుజాలు(చేతులు) తయారవుతూ ఉన్నారు. అచ్ఛా, ఈసారి కలిసినప్పుడు విశేషతలు వినిపిస్తాను. దేశ విదేశాలలోని పిల్లలందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. దగ్గర నుండి మరియు దూరము నుండి మేళాకు వచ్చినవారందరికీ అభినందనలు.
ఇలా సదా తండ్రితో మిలనము చేయువారు, రాత్రింబవళ్లు "ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు" అనే చింతనలో ఉండువారు, సదా విశ్వములోని అత్మలకు సర్వ ఖజానాల మహాదానమును వరదానమును ఇచ్చేవారు, సదా సంగమ యుగ విశేషతలను ముందుంచుకొని శ్రేష్ఠ భాగ్యము యొక్క సృతి స్వరూపులు ఇటువంటి శ్రేష్ఠ వృత్తి శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా విశ్వ కళ్యాణము చేయు ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే..
పార్టీలతో కలయిక :- పంజాబు జోన్ - పంజాబువాసులు విశేష ఆత్మలైనందున తప్పక విశేష ఫలమును ఇవ్వాల్సి వస్తుంది. పంజాబులో విశేషంగా అకాల సింహాసనానికి స్మృతి చిహ్నముంది. ఈ స్మృతి చిహ్నమెక్కడ ఉందో అక్కడి నివాసులు కూడా స్వయం సదా అకాల సింహాసనముపై విరాజమానులుగా ఉంటారు. కర్మేంద్రియాల ద్వారా సాక్షిగా ఉంటూ పనులు చేస్తూ స్వ రాజ్య అధికారులుగా ఉన్నారా? అకాల సింహాసనాధికారి ఆత్మలనగా రాజ్య అధికారులు. ఇటువంటి రాజ్యాధికారులై నడుస్తున్నారా? కర్మేంద్రియాలకు అధీనులుగా కారు కదా. ఎక్కడ అధీనత ఉంటుందో అక్కడ బలహీనత ఉంటుంది. అర్ధ కల్పము బలహీనంగా ఉండినారు. ఇప్పుడు మీ రాజ్యం తీసుకున్నారా? రాజ్యం లేక అధికారము తీసుకున్న తర్వాత అధీనత సమాప్తమైపోతుంది. కనుక మీరు రాజ్య అధికారులే కదా. ఏదైనా ఈనాటి ప్రపంచములో ప్రజలపై ప్రజారాజ్యములో సదా ఆందోళనలుంటాయి. అదే రాజుల రాజ్యములో రాజ్యము స్థిరంగా నడుస్తుంది. కనుక స్థిరమైన రాజ్యము నడుస్తూ ఉంది కదా?
వర్తమాన సమయంలో సంకల్పాల ఆందోళన కూడా పెద్దదిగా పరిగణించబడుంది. ముందు సంకల్పాలను ఫ్రీగా వదిలేసి, వాచా, కర్మణాలపై అటెన్షన్ ఉంచేవారు కాని ఇప్పుడు మనసులో కూడా ఆందోళన ఉండరాదు. ఎందుకంటే చివర్లో మనసా ద్వారానే విశ్వ పరివర్తన జరగాలి. ఇప్పుడు మనసు ద్వారా సాధారణ విషయంగా భావించకండి. ఇంత అటెన్షన్ ఉండాలి. ఇప్పుడు సమయం మారిపోయింది. పురుషార్థ వేగము కూడా మారిపోయింది కనుక సంకల్పాలలో కూడా ఫుల్ స్టాప్ కావాలి. మనసుపై కూడా అటెన్షన్ ఉన్నతమయ్యే కళ అని అంటారు. సదా ఉన్నతమయ్యే కళ ఉండాలి, ఇప్పుడిది సదా కొరకు చేసే వ్యాపారము.
అవ్యక్త బాప్ దాదా వ్యక్తిగత మిలనము - డబల్ విదేశీ సోదరీ సోదరులతో:-
లండన్ :- సదా మీ పవిత్రమైన భూమి(హోలీ ల్యాండ్) స్మృతిలో ఉంటున్నారా? హోలీ ల్యాండ్ లో ఉండేవారు సదా తమ హోలీ స్థితిలో ఉంటారు. స్వయాన్ని సదా సంపూర్ణ పవిత్ర స్థితిలో అనుభవం చేస్తున్నారా? ఇక్కడ పవిత్రతా కిరీటధారులుగా అయినప్పుడు అక్కడ రత్న జడిత కిరీటము కూడా లభిస్తుంది. సదా మీ తలపై ప్రకాశ కిరీటాన్ని అనుభవం చెయ్యండి. ఎవరైతే రాకుమారులు, రాకుమారీలుగా ఉంటారో వారు కిరీటధారులుగా ఉంటారు కదా. మీరు భగవంతుని కుమారులు, కుమార్తెలు కనుక కిరీటము లేకుండా ఎలా ఉంటుంది. లండన్ నివాసులందరూ కిరీటధారులుగా ఉన్నారు కదా? మీ కిరీటాన్ని చూసి అందరూ నమస్కరించే కిరీటధారులుగా ఉన్నారా?
మేము పవిత్రతా ప్రకాశ కిరీటధారులము అను స్మృతిలో సదా ఉండండి. మాయ మీ కిరీటాన్ని తొలగించుట లేదు కదా, మీరిప్పుడు మాయకు ఇక్కడే వీడ్కోలునిచ్చి వెళ్లాలి. మాయ రూపాన్ని పరివర్తన చేసి వెళ్లాలి. శత్రువుకు బదులు ఆట బొమ్మ రూపంలో రావాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ పరివర్తన చెయ్యండి.
అమెరికా:- పాండవులు 5 మంది ఉన్నారు. కల్పక్రితము కూడా పాండవులు ఏ అద్భుతము చేశారు? అయిదు మందే అయినా ఎన్ని అక్షౌహిణీల సైన్యమును జయించారు? మీరు విజయ జండాను ఎగురవేసే పాండవ సైన్యము కదా? ఒక్కొక్క పాండవులు ఎంతమందికి సమానము. వారిది అక్షౌహినీ సైన్యము, మీరేమో 5 మంది. కనుక ఎంత అమూల్యమైనవారు, విలువైనవారు. ఇప్పుడు అమెరికా నలువైపులా వ్యాపించండి. ఎలాగైతే వలను పరుస్తారో అలా మీ యోగ శక్తి అనే వలను పరుస్తే వెతుకుతూ ఉండే ఆత్మలు వచ్చేస్తారు. అమెరికాలో విశేషంగా సంతోషాన్ని, శాంతిని దానంగా ఇస్తూ ఉంటే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి.
గయానా పార్టీ :- సదా సేవాధారీ రత్నాలు కదా. ప్రతి ఒక్కరిలో సేవ చేసే సంస్కారము ఎంత ఉందంటే, శరీరములో రక్తము నిండి ఉన్నంతగా నిండి ఉంది. శరీరంలో రక్తము లేదంటే ఆ శరీరము పనికి రాకుండా పోతుంది. అలాగే సేవ చేయకుంటే బ్రతికి ఉన్నా చనిపోయిన వారికి సమానమైపోతారు. బ్రాహ్మణ జీవితానికి ఆధారము సేవయే. అందరిలో సేవ ఇమిడి ఉండాలి. సేవాధారి తిలకము అందరి మస్తకముపై దిద్దబడి ఉండాలి. గయానావారు కూడా సేవకు మంచి ఋజువు చూపించారు. గయానాలోని విశేష శక్తుల దృష్టాంతములో అనేక స్థానాలలో సేవ జరుగుతుంది. గయానావారు సేవలో విశేషంగా నిమిత్తమై ఉన్నారు. ఎలాగైతే కనులలో కంటిపాప ఇమిడి ఉందో అలా ఎవరైతే బాప్ దాదాకు అపురూప రత్నాలుగా ఉన్నారో వారు కూడా కనులలో ఇమిడి ఉన్నారు.
జర్మనీ పార్టీ:- జర్మనీ గ్రూపు చాలా అద్భుతము చేయాలి. జర్మనీ వారు భవిష్యత్తు కొరకు ఎటువంటి గ్రూపు చేయాలంటే వారు భవిష్యత్తులో(సత్యయుగము) వచ్చి మీ సేవకు నిమిత్తమవ్వాలి. సత్యయుగములో కూడా అణుశక్తితో పనులు నడుస్తాయి. కనుక జర్మనీలో సంపర్కములోకి వచ్చిన ఆత్మలు అక్కడ ఇటువంటి కార్యానికి నిమిత్తమవుతారు. కాని మీరేమో యజమానులుగా అవుతారు. ఇక్కడ సంపర్కములోకి వచ్చినవారు అక్కడ మీ సేవకు నిమిత్తముగా అవుతారు. పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు. సంపర్కములోకి ఎవరు వస్తే వారికి సేవ చేస్తూ పోండి.
స్వదర్శన చక్రధారులెప్పుడూ ఉన్నతమయ్యే కళ, అవనతమయ్యే కళల చిత్రాన్ని తిప్పరాదు. ఇప్పుడు గతించినదేదో గతించిపోయింది(గతం గతః) ఎలాగైతే పాత సంవత్సరం సమాప్తమైపోయిందో అలా ఈ సంస్కారాలు కూడా సమాప్తమైపోవాలి. సంస్కార రూపములో పరివర్తన. సంస్కారము బీజము వంటిది. బీజము నుండి మొక్క రాకుండా ఉండాలంటే దానిని అగ్నిలో కాలుస్తారు. కనుక బలహీన సంస్కారాల బీజాన్ని స్మృతి అనే లగ్నము యొక్క అగ్నిలో కాల్చేస్తే వృక్షము మొలకెత్తదు. అనగా మనసా, వాచా, కర్మలలో బలహీనత రానే రాదు. ఎలాగైతే హోలీని కాల్చుటలో తెలివిగలవారుగా ఉన్నారో అలా హోలీ(పవిత్రం)గా కాలుస్తే పవిత్రమైపోతారు. బలహీనతలను కాల్చేస్తే విఘ్న వినాశకులైపోతారు. సదా "నేను విఘ్న వినాశక ఆత్మను" అనే టైటిల్ గుర్తుంచుకోండి. స్వయంతో పాటు విశ్వానికి కూడా విఘ్న వినాశకులుగా కండి. ఇప్పుడు సేవ గుర్తుంచుకోండి. స్వయంతో పాటు విశ్వానికి కూడా విఘ్న వినాశకులుగా కండి. ఇప్పుడు సేవ లగ్నమవ్వనే అవ్వాలి.
Comments
Post a Comment