07-01-1978 అవ్యక్త మురళి

* 07-01-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విదేశి అయిన తండ్రి విదేశీయులైన పిల్లలతో కల్సుకుంటున్నారు.

ఈరోజు విదేశి అయిన బాబా ఈ సాకార ప్రపంచంలోని విదేశీ పిల్లలతో మిలనం జరిపేందుకు వచ్చారు. ఇరువురూ విదేశీయులే, మరి ఈరోజు విశేషంగా విదేశీయులైన పిల్లలను కల్సుకొనేందుకు ఎందుకు వచ్చారు? మీ విశేషతలను గూర్చి మీకు తెలుసా? ఆ విశేషత యొక్క కారణంగానే బాబా విశేష రూపంలో వచ్చారు. విదేశీయులలో ఏ విశేషత ఉంది. నా కల్పపూర్వపు పిల్లలెవరైతే దూరదూరంగా ఈ వ్యక్త దేశాలలో భిన్న నామ, ధర్మాలలోకి వెళ్ళిపోయారో వారు మళ్ళీ తమ దూరమయిన తండ్రిని లేక పరివారమును కల్సుకొనేందుకు స్థానం వద్దకు వచ్చి చేరుకున్నారని బాబాకు తెలుసు. మీకూ ఇలా అనుభవమవుతోందా? ఎంతగా మీకు బాబాను కల్సుకున్న సంతోషం, పరివారమును పొందిన సంతోషం ఉందో అంతకన్నా ఎక్కువగా బాబాకు సంతోషం ఉంది ఎందుకంటే, పిల్లలే ఇంటికి సింగారమని బాబాకు తెలుసు. ఎలాగైతే సింగారము లేకుండా ఏ వ్యక్తి లేక స్థానము అంతగా బాగోదో అలాగే బాబాకు కూడా పిల్లల యొక్క సింగారము లేకుండా నచ్చదు. విదేశీ ఆత్మలలో ఒక విశేషత యొక్క కారణంగా విశేషంగా బాబాకు ఎక్కువ ప్రేమ ఉంది, అది ఏ విశేషత? భారతదేశంలో ఒక ఆటను ఆడతారు, రకరకాల వస్తువులను ఒక గుడ్డలో దాచి ఉంచుతారు మళ్ళీ దాని పైన ఇంకొక గుడ్డను కప్పుతారు, ఆ తర్వాత పిల్లలను ఆ కవరు తీసి అన్ని వస్తువులను చూడమని చెప్పి మళ్ళీ కవరును వేసేస్తారు ఆ తర్వాత అందులో ఏయే వస్తువులు ఉన్నాయి మరియు ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయి అని పిల్లలను పరీక్షిస్తారు. ఎవరైతే అందులో ఉన్న వస్తువులను ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుంచుకోగల్గుతారో, వినిపిస్తారో వారికి నెంబరు లభిస్తుంది. ఈ బుద్ధి యొక్క ఆటను పిల్లలతో ఆడించడం జరుగుతుంది. అలాగే విదేశీయులైన పిల్లలు కూడా భిన్న ధర్మాలు, భిన్న భిన్న తత్వాలు, భిన్న రకాలైన జీవన పద్ధతులు అనబడే కవరు లోపల దాగి ఉన్న తండ్రిని ఎలా ఉన్నారో అలా ఆవిధంగానే తెలుసుకున్నారు. ఈ బుద్ధి యొక్క అద్భుతము యొక్క కారణంగానే బాబాకు విదేశీ పిల్లలపై స్నేహముంది, అర్థమైందా?

ఈ బుద్ధి యొక్క ఆటలో కోట్లాదిమందిలో ఏ ఒక్కరో పాసయ్యారు అటువంటి పిల్లలను చూసి బాప్ దాదా కూడా హర్షితమవుతారు మరి మీరందరూ కూడా అలా హర్షితమవుతున్నారా? బాబా ఎక్కువగా హర్షిస్తున్నారా లేక మీరు ఎక్కువగా హర్షిస్తున్నారా? ఏదైతే పొందాలో అది పొందేసాము అన్న సంతోషం యొక్క గీతమునే సదా పాడుతూ ఉండండి. ఈ సంతోషంలో ఉండడం ద్వారా ఎటువంటి ఉదాసీనత లేక చిక్కులు రాజాలవు అనగా మాయా ప్రూఫ్ గా అయిపోతారు. మీరు ఎటువంటి మాయా ప్రూఫ్ గా అవ్వాలంటే మీ యొక్క ఉదాహరణను బాప్ దాదా అందరికీ చూపించాలి. ఇటువంటి ఉదాహరణగా అయ్యారా? మేమందరమూ ఈ విధంగా, బాప్ దాదా విశ్వం ముందు ఉంచే విధంగా ఉదాహరణ మూర్తులుగా అయ్యాము అని ఎవరు భావిస్తున్నారు? ఎవర్రెడీగా కాక రెడీగా ఉన్నారా? ఎందుకంటే విదేశాలలో ఉండే పిల్లలకు ఇంకొక విశేషమైన లిఫ్ట్ కూడా లభించింది. వారు స్వయాన్ని విశ్వం ముందు ప్రఖ్యాతము చేసి బాబా యొక్క పరిచయమును ఇస్తారు, ఇటువంటి సేవను చేయడం ద్వారా ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి, ఇటువంటి సేవను చేశారా లేక చేయాలా? భారతదేశము యొక్క ఆత్మలు మిమ్మల్ని చూసి, వీరు తండ్రిని గుర్తించారు కానీ ఇంకా మేము గుర్తించలేదే అని భావిస్తారు. తండ్రిని గుర్తించిన మీ ముఖమును చూసి మేము మా భాగ్యమును పోగొట్టుకున్నామే అని భారతవాసీయులకు పశ్చాత్తాపము కలుగుతుంది. కావున మీరు ఈ సేవ కొరకు నిమిత్తమై ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ కాన్ఫ్ రెన్స్ లో కూడా విదేశాల నుండి వచ్చిన పిల్లలందరి యొక్క విశేష సేవ ఇదే - ఏ ఆత్మను ఎవరు చూసినా ప్రతి ముఖము పైనా బాబా ద్వారా లభించిన అవినాశీ సంతోషము, అతీంద్రియ సుఖము, అవినాశీ శాంతి యొక్క రూపము కనిపించాలి. మీ అందరి ముఖములు బాబా ద్వారా లభించిన ఆస్తిని చూసేందుకు అధారాలుగా అయిపోతాయి. ఇటువంటి సేవను చేసేవారికి బాప్ దాదా ద్వారా విశేషమైన మార్కుల యొక్క ఇనామ్ లభిస్తుంది. ఈ సేవ సహజమే కదా లేక కష్టతరమనిపిస్తోందా?

ఎటువంటి ప్రకాశమైనా తన వైపుకు తప్పకుండా ఆకర్షిస్తుంది అలాగే ఆత్మలైన మీరందరూ కూడా ప్రకాశము మరియు శక్తి రూపాలు. మీరు తండ్రి వైపుకు ఆకర్షించండి, కాన్ఫరెన్స్ లో ఏ సేవ చేయాలో మీరు అర్థం చేసుకున్నారా? విదేశాలలో ఉండే పిల్లల వద్దకు మాయ వస్తోందా? మీరు భయపడేవారైతే కాదుకదా! ఛాలెంజ్ చేసేవారే కదా! నీవు రా, వచ్చి వీడ్కోలు తీసుకో అని మాయకు ఛాలెంజ్ చేస్తారు కదా! మాయ రావడం అనగా అనుభవజ్ఞులుగా అవ్వడం. కావున మాయతో ఎప్పుడూ భయపడకూడదు, భయపడినట్లయితే అది కూడా వికరాళ రూపాన్ని ధారణ చేసుంది. భయపడకపోతే నమస్కారం చేస్తుంది. నిజానికి అది అసలు ఏమీ కాదు, అది కాగితపు పులి వంటిది. మీరు కాగితపు పులిని చూసి భయపడతారా? అది వికరాళ రూపాన్ని ధారణ చేస్తుంది కానీ, నిజానికి అది శక్తి హీనమైనది. ఇక్కడ కూడా భయానకమైన ముసుగులను ధరించి భయపెడతారు, కానీ లోపల ఉండేది మనుష్యులే. భయట ఉన్న ఆ ముసుగును తీసేస్తే భయమే లేదు కానీ భయటి రూపాన్ని చూసి భయపడితే ఫెయిలైతారు. మాయతో ఓటమి ఎక్కువగా జరుగుతోందా లేక విజయం ఎక్కువగా జరుగుతోందా?

విదేశాల నుండి వచ్చిన పిల్లలలో తాము 108 యొక్క మాలలోని మణులుగా ఉన్నాము అని ఎవరు బావిస్తున్నారు? నిశ్చయము యొక్క విజయము తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడూ లక్ష్యమును బలహీనంగా ఉంచుకోకూడదు సదా మేమే కల్పపూర్వపు విజయులము మరియు సదా విజయులుగా ఉంటాము అన్న నిశ్చయమునే ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. తద్వారా సదా స్వయాన్ని విజయీ రత్నాలుగానే అనుభవం చేసుకుంటారు. ఎన్నో దేశాల నుండి వచ్చారు, ఏయే దేశాల నుండి బాబా పిల్లలు వెలువడ్డారో ఆయా స్థానాలకు కూడా మహత్వము ఉంది. ఆ స్థానాలు కూడా ఏదో ఒక రూపంలో స్మృతిచిహ్నాలుగా అయిపోతాయి. వీరు విశేషంగా ఆయా స్థానాలలో విహారాలు చేస్తూ ఉంటారు (అంతలో కరెంటు పోయింది). అశరీరులుగా అవ్వడం కూడా ఇంతే సహజంగా ఉండాలి. ఏ విధంగా స్థూలమైన వస్త్రాలను తీసేస్తారో అలాగే ఈ దేహాభిమానం యొక్క వస్త్రాలను కూడా క్షణంలో తీసెయ్యాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ధారణ చేయాలి మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీంద్రియంగా అయిపోవాలి. కానీ, ఎప్పుడైతే ఏవిధమైన బంధనా ఉండదో అప్పుడే ఈ అభ్యాసం జరుగగలదు. మనసా సంకల్పం యొక్క బంధన ఉన్నా కానీ అతీతంగా అవ్వజాలరు. ఏవైనా బాగా బిగువుగా ఉన్న బట్టలను వేసుకున్నప్పుడు వాటిని ఏ విధముగా వెంటనే మార్చలేరో అలాగే మనసా, వాచా, కర్మణా మరియు సంబంధాలలో మోహము, ఆకర్షణ ఉన్నట్లయితే అతీతులుగా అవ్వలేరు. ఎటువంటి సంకల్పం చేస్తే అటువంటి స్వరూపంగా అయిపోయే అభ్యాసమును సహజంగా చేయగలరా? సంకల్పంతో పాటు స్వరూపంగా అయిపోతారా లేక సంకల్పము తర్వాత స్వరూపంగా అవ్వడంలో సమయం పడుతుందా? సంకల్పం చేయగానే అశరీరులుగా అయిపోండి, సంకల్పము చేయగానే మాస్టర్ ప్రేమసాగరులుగా స్థితులైపోండి మరియు అది మీ స్వరూపంగా అయిపోవాలి. అటువంటి అభ్యాసము ఉందా? ఇప్పుడు ఈ అభ్యాసమునే పెంచండి. ఈ అభ్యాసము యొక్క ఆధారముపై స్కాలర్ షిప్ పొందగల్గుతారు.

ఇప్పటివరకూ విదేశీయులు ఒక ప్లానును ప్రాక్టికల్ చేయలేదు. ఏ ప్లానును ఇచ్చారో మీకు గుర్తుందా? ఇప్పుడు భారతదేశము యొక్క కుంభకర్ణులు ఇంకా నిద్రిస్తున్నారు, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో వారిని ఎలా మేల్కొల్పుతారో చూద్దాం. ఎవరైతే పూర్తిగా నిద్రలో మునిగిపోయి ఉంటారో వారిని నీళ్ళను జల్లి మేల్కొల్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లానును ప్రత్యక్షతలోకి తీసుకురండి. మీ ముందుకు రావడంతోనే ఇక మేం కూడా మేల్నొనాలి మరియు తయారవ్వాలి అని భావించేలా మీరు ఉండాలి. మీ మాట వైపుకు సంకల్పించకపోయినా కూడా అందరి ధ్యానము వెళ్ళిపోయే విధంగా ఉండాలి. ఏ వైపునుండైనా అటువంటివారిని తయారుచేశారా?

అన్ని సేవాస్థానాలు సరిగ్గా నడుస్తున్నాయా? అందరూ స్వయముతో మరియు సేవతో సంతుష్టంగా ఉన్నారా? మీరు ఎంతో అదృష్టవంతులు. మేము చాలా కాలం తర్వాత కల్సిన ముద్దు పిల్లలము అని భావిస్తున్నారు. అన్ని సెంటర్లలోనూ రేసులో నెంబర్ వన్ గా ఎవరున్నారు? ప్రతి దేశానికి తన విశేషత ఉంది. లండన్ నిమిత్తమై ఉన్న కారణంగా అది ప్లానింగ్ సెంటర్ గా ఉంది. ఈ విశిష్టత యొక్క కారణంగా లండన్ నెంబర్ వన్ అని పిలవబడుతోంది. కానీ, సేవాధారులను మరియు శబ్దాన్ని వ్యాపింపచేయడంలో విశేషమైన క్వాలిటీని తయారుచేసే సేవలో గయానా నంబర్ వన్ గా ఉంది. సంఖ్య యొక్క రూపంలో మారిషస్ నెంబర్ వన్ గా ఉంది మరియు లుసాకా అన్నింటినీ సహిస్తూ కూడా పరిస్థితులను దాటి వెళ్ళడంలో అలజడి యొక్క పరిస్థితులలో ఉంటూ కూడా అచలంగా ఉండడంలో నెంబర్‌ వన్‌గా ఉంది. ఆస్ట్రేలియా యొక్క విశేషత కూడా ఉంది. ఒక్కొక్క దీపంతో అనేక దీపాలను కలిగించి దీపమాలను తయారుచేయడంలో నెంబర్ వన్ గా ఉంది. ఆస్ట్రేలియా ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. వీరు ప్లానింగ్ బుద్ధి కలవారు మరియు ప్లానులు కూడా ఎంతో మంచి మంచివి తయారుచేస్తారు. వారి వద్దనున్న ప్లానులన్నింటిని ప్రత్యక్షతలోకి తీసుకువచ్చినట్లయితే లండన్ కన్నా నెంబర్ వన్ అవ్వగలరు. కాని, ఇప్పుడు బుద్ది వరకే ప్లానులు ఉన్నాయి, ప్రాక్టికల్ గా చేయలేదు.

ఒక్కొక్క రత్నమూ ఎంతో విలువైనది. కానీ, మీ విలువను స్టేజ్ మీద దాకా తీసుకురాలేదు. మారియా ఇది చేయగలదని బాప్ దాదాకు ఆశ ఉంది. కేవలం త్యాగము మరియు తపస్సు యొక్క డ్రస్సును ధరించి స్టేజి పైకి వచ్చినట్లయితే విజయం మీ కంఠహారంగా అయిపోతుంది. సేవ చేసి ఎవరినైనా మీతో పాటు ఇండియాకు తీసుకురండి. ఆస్ట్రేలియా యొక్క ధరణి బాగుంది.

జర్మని నుండి కూడా శబ్దాన్ని వ్యాపింపచేసే ఆత్మలు వెలువడగలరు. ఎంతో బాగా శ్రమిస్తున్నారు. అక్కడి నుండి ప్రత్యక్షంగా ఎటువంటి విశేషమైన ఉదాహరణ రావాలంటే, తన ద్వారా ముందు చూస్తున్న ఆత్మలకు విశేషమైన ప్రేరణ లభించాలి. ధైర్యము మరియు ఉత్సాహములో నెంబర్ వన్ గా ఉన్నారు. లేస్టర్ లండన్ తో పాటు ఉంది. లేస్టర్ వారిది కూడా అద్భుతమే. లేస్టర్ లో నిశ్చయబుద్ది విజయీ ఆత్మలైన పిల్లలు ఎందరో ఉన్నారు. పరివారము పరివారమంతా ఉదాహరణను ఇచ్చేందుకు ఎంతో బాగా తయారై ఉన్నారు. బాప్ దాదా యొక్క మనసుకు నచ్చినవారిగా ఉన్నారు. నైరోబి మరియు బుల్వాయ తీవ్ర పురుషార్ధంలో మరియు లగ్నంలో మగ్నమై ఉండడంలో తక్కువ ఏమీ కాదు. ముందు నెంబరు తీసుకున్నారు. దీపంపై బలిహారమయ్యే ఉదాహరణను ప్రత్యక్షంలో చూసారు కదా! నిమిత్తమై ఉన్న ఆత్మ ఎక్కడైనా తన అనుభవాన్ని వినిపించినా దాని శబ్దం కూడా కొంత కార్యం చేయగలదు. హాంకాంగ్ యొక్క ధరణిపై స్నేహీ మరియు సహయోగీ ఆత్మల యొక్క విశేషత ఉంది మరియు శక్తిశాలి ఆత్మలు కూడా హాంకాంగ్ యొక్క ధరణిపై ఉన్నారు. కానీ ఇప్పుడు వారు దాగి ఉన్నారు, సమయం వచ్చినప్పుడు హాంకాంగ్ ధరణిపై దాగి ఉన్న రత్నాలు అందరికీ కనిపిస్తారు. కావున ప్రతి విదేశీ సేవా కేంద్రమునకు తమ తమ విశేషతలు ఉన్నాయి. కావున అందరూ సెంబర్ వన్నే. కెనడా కూడా ఇప్పుడు ఇందులో నెంబరు తీసుకుంటోంది, రెడీ అవుతోంది. కెనడా యొక్క ధరణిలో కూడా విశేషత ఉంది. అక్కడి నుండి ఎవరైనా ఒక్కరు వెలువడితే సహజంగానే ఒక్కరు అనేకులను తీసుకురాగలరు, ఆశావాదులుగా ఉన్నారు. ఒక్కరు వెలువడినా ఇక పెద్ద సమయం పట్టదు. లాస్ట్ సో ఫాస్ట్ గా ముందుకు వెళతారు, ఎంతో బాగా శ్రమిస్తున్నారు, లగ్నము కూడా బాగుంది, పురుషార్థమూ బాగుంది, శుభభావనా బాగుంది. శుభభావన తన ఫలితాన్ని తప్పక ఇస్తుంది.

అయినా అద్భుతమంతా జానకిదే. తాను విదేశము యొక్క ధరణిపై సదా ఉల్లాస ఉత్సాహములను పెంచడంలో నిమిత్తమయ్యింది, బాధ్యతను స్వీకరించింది. సహయోగీ భుజాలు ఎంతో బాగున్నాయి అయినా ఎంతో బాధ్యతను స్వీకరించింది అని అనడం జరుగుతుంది కదా! ఎంతెంతగా వినాశనం యొక్క సమయం సమీపంగా వస్తుందో అంతంతగా వాతావరణాన్ని చూసి, సందేశమునిచ్చే మీ కొరకు అందరూ వెదుకుతారు. మాకు తండ్రి యొక్క పరిచయమును ఇచ్చిన ఆ ఫరిస్తాలు ఎవరు అని వెదుకుతారు. సేవలో ఎక్కడ కాలు పెట్టినా అక్కడ సఫలత లభించకపోవడమనేదే ఉండదు. కొన్ని భూములు త్వరగా ఫలితమును ఇస్తాయి, కొన్ని భూములు ఫలములను ఇవ్వడంలో సమయమును తీసుకుంటాయి. కానీ, ఫలములను తప్పక ఇస్తాయి. ఏవిధంగా భారతదేశంలో రైలు వెళ్ళే దారిలో మధ్య మధ్యలో మన స్థానాలు, సేవా కేంద్రాలు ఉన్నాయో అలాగే విమానం ఎక్కడెక్కడ ఆగుతుందో అక్కడక్కడ కూడా సెంటర్లు ఉండాలి. అవి తప్పక ఉంటాయి. విదేశీయుల యొక్క రేసు బాగా నడుస్తోంది, అచ్చా!

పార్టీలతో అవ్వక్త బాప్ దాదా: - 

1. వృత్తి చంచలంగా ఉండటానికి కారణం మరియు అచలంగా ఉండటానికి సహజ విధి.

ఎందుకు మరియు ఏమిటి అన్న ఈ పదాలే వృత్తి చంచలమయ్యేందుకు కారణాలు. ఇవి అలజడిలోకి తీసుకువస్తాయి మరియు 'నత్తింగ్ న్యూ' (కొత్త ఏమీ లేదు) అన్న శబ్దము అచలంగా చేసేస్తుంది. 'తప్పక జరిగి తీరవలసిందే' మరియు ముందే జరిగి ఉంది. ఇది తప్ప ఇంకే విషయమూ లేకపోతే చంచలంగా అవ్వగలరా? నత్తింగ్ నూ అన్నది గుర్తుంటే ఎందుకు మరియు ఏమిటి అన్నది సమాప్తమైపోతుంది. ఎటువంటి విషయం వచ్చినా మనస్సు యొక్క, వాణి యొక్క లేక సంబంధ సంపర్కాల యొక్క విషయాలు ఏవి వచ్చినా నత్తింగ్ న్యూ. ఎందుకు లేక ఏమిటి అన్న ప్రశ్న క్రొత్తవాటిలోనే వస్తుంది. కొత్త ఏమీ లేదు అని అన్నప్పుడు ప్రశ్నలూ ఉండవు, ఆశ్చర్యాలూ ఉండవు కావున ఈ పాఠమును రివైజ్ చేసి పక్కా చేయండి. 

2. మాయ యొక్క జాలం నుండి సురక్షితంగా ఉంటూ సదా విజయులుగా అయ్యేందుకు విధి.

మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క స్థితిలో స్థితులై ఉండండి. మాస్టర్ సర్వశక్తివంతులు అనగా విజయీ రత్నాలు. మాయ లోలోపల పూర్తిగా శక్తిహీనంగా ఉంది, దాని బాహ్య రూపాన్ని చూసి భయపడకండి. దానిని జీవించి ఉన్నట్లుగా భావిస్తూ మూర్చితులవ్వకండి. మాయ మూర్చితమై ఉంది. అప్పుడప్పుడూ మూర్చితులను చూసి కూడా మూర్చితులవుతారు. కానీ ఇప్పుడు దానికి వీడ్కోలు చెప్పండి. జ్ఞానస్వరూపంలో ఉన్నట్లయితే ఎప్పుడూ మోసపోజాలరు.

3. అమరనాథుడైన బాబా ద్వారా సంగమ యుగంలో కూడా సదా అమరంగా ఉండే వరదానమును పొందడం.

'అమర భవ' అన్న వరదానమూ ఈ జన్మలోనూ మరియు భవిష్యత్తులోనూ ప్రాప్తమవుతుంది. సంగమయుగంలో మాయ నుండి సురక్షితంగా ఉండే అమర వరదానము మరియు భవిష్యత్తులో అకాలమృత్యువు నుండి సురక్షితంగా ఉండే వరదానము లభించింది. అమర భవ యొక్క వరదానమును పొందేవారిని మాయ కదిలించజాలదు. అది దూరము నుండి కూడా దృష్టిని ప్రసరింపచేయజాలదు. సదా నమస్కారము చేస్తుంది. మాకు అమర భవ యొక్క వరదానము లభించింది అని సదా స్మృతిలో ఉంచుకోండి. వరదానము కల ఆత్మ నిశ్చయబుద్ధి కలిగి ఉన్న కారణంగా విజయునిగా అవుతుంది. ఎవరికైతే ఈ వరదానము యొక్క నషా ఉంటుందో వారు స్వప్నంలో కూడా మాయ చేత మూర్చితులవ్వజాలరు. బాబా ద్వారా వరదానం లభించడమేమైనా చిన్న విషయమా. సద్గురువు స్వయంగా వరదానం ఇస్తున్నప్పుడు మరి ఎంత నషా ఉండాలి.
నికి నిమిత్తమయ్యారు. సహయోగి హస్తాలు చాలా బాగున్నారు. వినాశన సమయం సమీపంగా వచ్చేసరికి వాతావరణాన్ని చూసి మాకు బాబా పరిచయాన్ని ఇచ్చిన ఫరిస్తాలు ఎవరు? అని సందేశం ఇచ్చినవారిని వెతుకుతారు. సేవలో ఎక్కడ పాదం పెట్టినా అక్కడ సఫలత లభించకపోవటమనేది ఉండదు. కొన్ని భూములు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని భూములు ఫలించడానికి సమయం పడుతుంది. కానీ ఫలం తప్పకుండా ఇస్తుంది.
                ఎలా అయితే భారతదేశంలో రైలులో వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో మన సేవాకేంద్రాలు ఉంటాయో అదేవిధంగా విమానం కూడా ఎక్కడెక్కడ ఆగుతుందో అక్కడ సేవాకేంద్రం ఉండాలి. విదేశీ ఆత్మల పరుగు మంచిగా నడుస్తుంది, జరగవలసిందే. మంచిది.

Comments