06-11-1981 అవ్యక్త మురళి

* 06-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశేష యుగము యొక్క విశేషఫలము.

ఈ రోజు విశ్వకళ్యాణకారి అయిన తండ్రి తమ విశ్వకళ్యాణ కార్యమునకు ఆధారమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఈ ఆధారమూర్తులే విశ్వపరివర్తనను చేయడంలో విశేష ఆత్మలు. ఇటువంటి విశేష ఆత్మలను బాప్ దాదా కూడా విశేష దృష్టితో చూస్తారు. ప్రతీ విశేష ఆత్మ యొక్క విశేషత సదా బాప్ దాదా ముందు స్పష్టంగా ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరూ మహాన్ పుణ్య ఆత్మలు, పురుషోత్తములు అనగా దేవ ఆత్మలు, విశ్వపరివర్తనకు నిమిత్తులైన ఆత్మలు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్వయాన్ని భావిస్తూ నడుచుకుంటున్నారా? ఎలా ఉండేవారు మరియు ఎలా అయిపోయారు? ఈ మహాన్ అంతరము సదా మీ ముందు ఉంటోందా? ఈ తేడా మహామంత్ర స్వరూపంగా స్వతహాగానే చేసేస్తుంది. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఏ విధంగా బాబా ముందు పిల్లలు ప్రతి ఒక్కరూ విశేష ఆత్మల యొక్క రూపంలో ఉంటారో అలాగే మీరందరూ కూడా మీ విశేషత మరియు సర్వుల యొక్క విశేషతను సదా ఇదే విధంగా చూస్తున్నారా? సదా బురదలో ఉండే కమలాన్ని చూస్తున్నారా లేక బురదను మరియు కమలాన్ని రెండింటినీ చూస్తున్నారా? సంగమ యుగము విశేష యుగము మరియు ఇదే విశేష యుగములో విశేష ఆత్మలైన మీ అందరికీ విశేషమైన పాత్ర ఉంది, ఎందుకంటే మీరు బాప్ దాదా యొక్క సహయోగులు. విశేష ఆత్మల కర్తవ్యము ఏమిటి? స్వయం యొక్క విశేషత ద్వారా విశేష కార్యంలో ఉండడము అనగా మీ విశేషతను కేవలం మనస్సులో లేక ముఖముతో వర్ణన చేయడం కాదు. విశేషత ద్వారా ఏదైనా విశేష కార్యాన్ని చేసి చూపించాలి. ఎంతగా మీ విశేషతను మనస్సులో లేక వాణిలో మరియు కర్మ యొక్క సేవలో వినియోగిస్తారో అంతగా అదే విశేషత విస్తారమవుతూ ఉంటుంది. సేవలో వినియోగించడము అనగా ఒక్క బీజము నుండి అనేక ఫలాలు ప్రకటితమవ్వడం. బాబా ద్వారా ఈ శ్రేష్ఠ జీవితంలో ఏ విశేషత అయితే జన్మసిద్ధ అధికారం యొక్క రూపంలో లభించిందో దానిని కేవలం బీజరూపంలోనే ఉంచామా లేక బీజమును సేవ యొక్క ధరణిలో వేసి విస్తారమును పొందామా అని పరిశీలించుకోవాలి. అనగా మీ స్వరూపాన్ని లేక సేవ యొక్క సిద్ధీ స్వరూపాన్ని అనుభవం చేసుకున్నారా?

బాప్ దాదా పిల్లలందరి విశేషత అనే భాగ్యము యొక్క రేఖను జన్మించడంతోనే గీసారు. జన్మతోనే పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై విశేషత అనే భాగ్యం యొక్క తార ప్రకాశిస్తూ ఉంది. పిల్లలు ఎవరూ ఈ భాగ్యం నుండి వంచితులవ్వలేదు. ఈ భాగ్యాన్ని మేల్కొల్పుకొనే మీరు వచ్చారు. మరి తేడా ఎందుకు ఉంది? కొందరు ఈ వరదానమనే బీజమును, భాగ్యం యొక్క బీజమును లేక జన్మసిద్ధ అధికారం యొక్క బీజమును విస్తారములోకి తీసుకువస్తారు. మరికొందరు ఈ బీజమును కార్యములోకి తీసుకురాని కారణంగా దానిని శక్తిహీన బీజముగా చేసేస్తారు. ఏ విధంగా బీజమును సమయానుసారంగా కార్యంలో వినియోగించకపోతే అది ఫలదాయకంగా ఉండదో అలాగే ఇక్కడ కొందరు ఏం చేస్తారు? 

బీజమును సేవ యొక్క ధరణిలో కూడా వేస్తారు. కాని ఫలము వెలువడక ముందే వృక్షమును చూసి నేను బీజమును కార్యంలో వినియోగించాను అని అందులోనే సంతోషపడిపోతారు. కావున దాని రిజల్ట్ ఏమౌతుంది? వృక్షం పెరిగిపోతుంది, శాఖోపశాఖలు, కొమ్మలు, రెమ్మలు పెరుగుతూ ఉంటాయి కాని ఫలము రాదు. చూసేందుకు వృక్షము చాలా పెద్దగా, సుందరంగా ఉంటుంది కాని ఫలము వెలువడదు అనగా జన్మసిద్ధ అధికార రూపంలో ఏ విశేషత అయితే లభించిందో దాని ద్వారా స్వయమూ సఫలతా రూపీ ఫలమును పొందరు. అలాగే ఇతరులను కూడా ఆ విశేషత ద్వారా సఫలతాస్వరూపులుగా చేయలేరు. విశేషతారూపీ బీజము యొక్క అన్నిటికన్నా శ్రేష్ఠ ఫలము ' సంతుష్టత'. కావున ఈ రోజుల్లో భక్తులు సంతోషీమాత యొక్క పూజను ఎక్కువగా చేస్తున్నారు. కావున సంతుష్టంగా ఉండడము మరియు సర్వులను సంతుష్టముగా ఉంచడము విశేష యుగము యొక్క విశేష ఫలము. చాలామంది పిల్లలు ఇలా ఫలదాయకముగా అవ్వరు. వృక్షము యొక్క విస్తారము అనగా సేవ యొక్క విస్తారమును చేసుకుంటారు కాని సంతుష్టత యొక్క ఫలము లేకుండా వృక్షము ఎందుకు పనికి వస్తుంది? కావున విశేషత అనే వరదానము యొక్క బీజమును సర్వశక్తులనే జలముతో తడిపినట్లయితే ఫలదాయకంగా అయిపోతారు, లేకపోతే విస్తారమయ్యాక వృక్షం కూడా సమయ ప్రతి సమయము వచ్చే తుఫానులతో కదులుతూ కదులుతూ ఒక్కోసారి ఒక్కో కొమ్మ ఊడిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది? వృక్షం ఉంటుంది కాని ఎండిపోయిన వృక్షం ఉంటుంది. ఒకవైపు ఎండిపోయిన వృక్షము, అందులో ముందుకు వెళ్ళాలనే ఉత్సాహము, ఉల్లాసము, సంతోషము, ఆత్మకనషా మొదలైన పచ్చదనముండదు. బీజములోనూ పచ్చదనముండదు, వృక్షములోనూ ఉండదు. అలాగే దానితో పాటు ఇంకొకవైపు పచ్చగా ఉన్న, నిండుగా ఉన్న ఫలదాయక వృక్షము. మీకేది నచ్చుతుంది? కావున బాప్ దాదా విశేషత అనే వరదానము యొక్క శక్తిశాలీ బీజమును పిల్లలందరికీ ఇచ్చారు. కేవలం విధి పూర్వకంగా దాన్ని ఫలదాయకంగా చేయండి. ఇది స్వయంలోని విశేషత యొక్క విషయము. ఇప్పుడు విశేష ఆత్మల యొక్క సంబంధ సంపర్కములో సదా ఉంటారు, ఎందుకంటే బ్రాహ్మణ పరివారము అనగా విశేష ఆత్మల యొక్క పరివారము. కావున పరివారము యొక్క సంపర్కములోకి వస్తూ ప్రతి ఒక్కరి యొక్క విశేషతలను చూడండి. విశేషతలను చూసే దృష్టినే ధారణ చేయండి అనగా విశేషమైన కళ్ళద్దాలను ధరించండి. ఈ రోజుల్లో కళ్ళద్దాలు వేసుకోవడం ఒక ఫ్యాషన్ గా మరియు అవసరముగానూ అయిపోయింది. కావున విశేషతను చూసే కళ్ళద్దాలను ధరించినట్లయితే మీకు మళ్ళీ ఇంకేదీ కనిపించదు. సైన్స్ యొక్క సాధనాల ద్వారా ఎర్రకళ్ళద్దాలు ధరిస్తే పచ్చవస్తువు కూడా ఎర్రగానే కనిపించగలదు, కావున ఈ విశేషత యొక్క దృష్టి ద్వారా విశేషతనే చూస్తారు. చెత్తని చూడకుండా కమలమునే చూస్తారు మరియు ప్రతి ఒక్కరి విశేషత ద్వారా విశ్వపరివర్తన యొక్క కార్యంలో విశేష కార్యానికి నిమిత్తులుగా అయిపోతారు. కావున ఒకటి - మీ విశేషతను కార్యంలో వినియోగించండి, విస్తారము చేసి ఫలదాయకమును చేయండి, రెండవది - సర్వులలోనూ విశేషతలు చూడండి, మూడవది - సర్వుల యొక్క విశేషతలను కార్యంలో వినియోగించండి, నాల్గవ విషయం - మీరు విశేష యుగం యొక్క విశేష ఆత్మలు. కావున సదా విశేష సంకల్పములు, మాటలు మరియు కర్మలే చేయాలి, అప్పుడేమౌతుంది?

విశేష సమయం లభిస్తుంది, ఎందుకంటే విశేషంగా భావించని కారణంగా స్వయం ద్వారా స్వయం యొక్క విఘ్నాలు మరియు దానితో పాటు సంపర్కంలోకి రావడం ద్వారా కూడా వచ్చే విఘ్నాలలో ఎంతో సమయం పోతుంది, ఎందుకంటే స్వయం యొక్క బలహీనత లేక ఇతరుల యొక్క బలహీనతల యొక్క కథ మరియు కీర్తనలు రెండూ ఎంతో పొడుగ్గా ఉంటాయి. మీ స్మృతిచిహ్నమైన రామాయణమును చూడండి, ఆ కథ మరియు కీర్తన రెండూ చాలా ఆసక్తికరంగా, పొడుగ్గా ఉంటాయి. కాని అందులో ఉన్నదేమిటి? విశేషతను చూడకుండా ఈర్ష్యలోకి వచ్చినట్లయితే ఎంత పెద్ద కీర్తన మరియు కథగా అయిపోయింది! అలాగే విశేషతను చూడకపోతే లక్ష్మీనారాయణుల కథకు బదులుగా రామకథగా అయిపోతుంది మరియు ఇదే కథ, కీర్తనలో స్వయం యొక్క, సేవ యొక్క సమయమును వ్యర్థం చేసుకుంటారు. ఇంకా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడతారు. కేవలం ఒక్కరి కీర్తన, కథ చేయరు, కీర్తనామండలిని కూడా తయారుచేసుకుంటారు కావున ఈ వ్యర్థ కీర్తన, కథల నుండి సమయము మిగిలిన కారణంగా విశేషంగా సమయం కూడా లభిస్తుంది. కావున ఏమి చేయాలి, ఏమి చేయకూడదో అర్ధమైందా? ఈ రోజుల్లోని ప్రపపంచంలోని వారితో మీరు భక్తి యొక్క ఫలాన్ని ప్రాప్తించుకోండి, సహజ రాజయోగులుగా అవ్వండి అని అంటే ఆ రెండింటిలో ఎక్కువగా ఎందులో రుచిని ఉంచుతారు? భక్తి యొక్క కథ, కీర్తనలలోనే ఎక్కువ ఆసక్తిని ఉంచుతారు కదా! దాన్ని మనోరంజకంగా భావిస్తారు. అలాగే కొందరు విశేష ఆత్మలు కూడా వ్యర్థమనే రామకథ యొక్క మండలిలో లేక కీర్తనా మండలిలో ఎంతో మనోరంజన ఉందని భావిస్తారు. ఇటువంటి సమయంలో ఆ ఆత్మలను ఈ కీర్తనను వదలమని, శాంతిలో ఉండమని అంటే వారు అంగీకరించరు. ఎందుకంటే ఆ సంస్కారాలు ఉంటాయి కదా! ఇప్పుడు ఈ కీర్తనా మండలిని సమాప్తం చేయండి, అర్థమైందా? మీరు విశేష ఆత్మల యొక్క సభలో కూర్చున్నారు కదా! అలాగే గ్రూప్ కూడా ఎంతో విశేషమైనది. ఇరువురూ గద్దెపైకి ఎక్కేవారే. ఒకటి, ప్రవేశత యొక్క గద్దె, ఇంకొకటి రాజసింహాసనము. అది రాజ్యం యొక్క తాళంచెవి లభించిన గద్దె(కలకత్తా) మరియు ఇది రాజ్యము చేసే గద్దె (ఢిల్లీ) కావున రెండూ గద్దెలే అయ్యాయి కదా! కావున రెండింటికీ విశేషత ఉంది కదా! తాళంచెవి లభించకపోతే రాజ్యము కూడా చేయరు, కావున విశేషతను మరచిపోకండి, అచ్ఛా!

ఈ విధంగా సదా విశేషతలను చూసేవారికి, విశేషతలను కార్యంలో వినియోగించేవారికి, విశేషంగా సమయాన్ని సేవలో వినియోగించి సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవించేవారికి, సదా సంతుష్ట ఆత్మలకు, సదా సంతుష్టత ద్వారా సర్వులను సంతుష్ట పరచేవారికి, ఇటువంటి విశేష ఆత్మలకు బాపదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో - 1. శబ్దము నుండి అతీతంగా వెళ్ళే యుక్తిని గూర్చి మీకు తెలుసా? అశరీరులుగా అవ్వడము అనగా శబ్దము నుండి అతీతంగా అయిపోవడము. శరీరము ఉంటే శబ్దము ఉంటుంది. శరీరము నుండి అతీతంగా అయపోతే అంతా నిశ్శబ్దమే. సైలెన్స్ యొక్క శక్తి ఎంత గొప్పదో దాని యొక్క అనుభవం ఉంది కదా! సైలెన్స్ యొక్క శక్తి ద్వారా సృష్టి యొక్క స్థాపనను చేస్తున్నారు. సైన్స్ యొక్క శక్తి ద్వారా వినాశనము మరియు సైలెన్స్ యొక్క శక్తి ద్వారా స్థాపన, కావున మేము మా సైలెన్స్ శక్తి ద్వారా స్థాపన యొక్క కార్యమును చేస్తున్నాము అని భావిస్తున్నారా? మనమే స్థాపన యొక్క కార్యానికి నిమిత్తులము. కావున స్వయం సైలెన్స్ రూపంలో స్థితులైనట్లయితే అప్పుడే స్థాపన యొక్క కార్యమును చేయగల్గుతారు. కాని స్వయం చంచలత లోకి వస్తే స్థాపన యొక్క కార్యము సఫలమవ్వజాలదు. విశ్వంలో అన్నింటికన్నా ప్రియాతిప్రియమైన వస్తువు శాంతి అనగా సైలెన్స్ దీనికొరకే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ ను చేస్తుంటారు. శాంతిని ప్రాప్తించుకోవటమే అన్నింటికన్నా పెద్ద లక్ష్యం. ఇదే అన్నింటికన్నా ప్రియమైన మరియు శక్తిశాలీ వస్తువు. కాని మీరైతే శాంతి మా స్వధర్మము అని భావిస్తారు. ఎంతగా శబ్దంలోకి రావడం సహజమనిపిస్తుందో అంతగా ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతముగా వెళ్ళాలి. ఈ అభ్యాసము ఉందా? సైలెన్స్ శక్తి యొక్క అనుభవజ్ఞులైన ఎటువంటి అశాంత ఆత్మకైనా శాంతి స్వరూపంగా అయి శాంతి యొక్క కిరణాలను ఇచ్చినట్లయితే వారు కూడా అశాంతి నుండి శాంతిగా అయిపోవాలి. శాంతి స్వరూపంగా ఉండడము అనగా శాంతి యొక్క కిరణాలను అందరికీ ఇవ్వడం. ఇదే మీ పని. విశేషంగా శాంతి యొక్క శక్తిని పెంచండి. స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు కూడా శాంతిదాతలుగా అవ్వండి. భక్తులు శాంతిదేవా అని తలుచుకుంటూ ఉంటారు. దేవతలు అనగా దానం చేయువారు. ఏ విధంగా తండ్రికి శాంతి దాత అని మహిమ ఉందో అలాగే మీరు కూడా శాంతి దేవతలు. ఇదే అన్నింటికన్నా పెద్ద మహాదానము. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. కావున మీరందరూ శాంతి దేవులు. అశాంతయుతమైన వాతావరణంలో ఉంటూ స్వయమూ శాంతి స్వరూపంగా ఉంటూ ఇతరులను కూడా శాంతపర్చేవారిగా ఉండండి. బాబా యొక్క కార్యమేదైతే ఉందో అదే పిల్లల యొక్క కార్యం కూడా. బాబా అశాంత ఆత్మలకు శాంతినిస్తారు. కావున పిల్లలు కూడా బాబాను అనుసరించాలి. ఇదే బ్రాహ్మణుల యొక్క వృత్తి. అచ్ఛా!

2. జ్ఞానసూర్యులుగా అయి మొత్తం విశ్వమంతటికీ సర్వశక్తుల యొక్క కిరణాలను ఇవ్వడం బ్రాహ్మణుల యొక్క విశేషకర్తవ్యము. అందరూ విశ్వకళ్యాణకారులుగా అయి విశ్వానికి సర్వశక్తుల యొక్క కిరణాలను ఇస్తున్నారా? మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులే కదా! సూర్యుడు ఏం చేస్తాడు? తన కిరణాల ద్వారా విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తాడు. కావున మీరందరూ కూడా మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి సర్వశక్తుల యొక్క కిరణాలను విశ్వమంతటికీ ఇస్తున్నారా? మొత్తం రోజంతటిలో ఎంత సమయమును ఈ సేవలో వినియోగిస్తున్నారు? బ్రాహ్మణ జీవితం యొక్క విశేష కర్తవ్యమే ఇది. ఇక మిగిలింది నిమిత్తమాత్రంగా ఉన్నారు. బ్రాహ్మణ జీవితము లేక జన్మ విశ్వకళ్యాణము కొరకే లభించింది. మరి మీరు సదా ఇదే కర్తవ్యంలో బిజీగా ఉంటున్నారా? ఎవరైతే ఈ కార్యంలో తత్పరులై ఉంటారో వారు సదా నిర్విఘ్నంగా ఉంటారు. ఎప్పుడైతే బుద్ధి ఫ్రీగా ఉంటుందో అప్పుడే విఘ్నాలు వస్తాయి. సదా బిజీగా ఉన్నట్లయితే స్వయమూ నిర్విఘ్నంగా ఉంటారు మరియు సర్వుల ప్రతి కూడా విఘ్నవినాశకులుగా ఉంటారు. విఘ్నవినాశకుల వద్దకు విఘ్నాలు ఎప్పుడూ రాజాలవు.

3. సంగమ యుగంలో బ్రాహ్మణుల యొక్క విశేష స్థానము బాప్ దాదాల హృదయసింహాసనము. అందరూ స్వయాన్ని బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఇటువంటి శ్రేష్ఠస్థానము ఎప్పుడూ లభించదు. సత్యయుగంలో వజ్రవైఢూర్యాలు లభిస్తాయి కాని హృదయసింహాసనము లభించదు. కావున బ్రాహ్మణులైన మీరు అందరికన్నా శ్రేష్ఠమైనవారు, మేము హృదయసింహాసనాధికారులము అనే ఇంతటి నషా ఉంటోందా? కిరీటమూ ఉంది, సింహాసనమూ ఉంది, తిలకమూ ఉంది. కావున సదా కిరీటము, సింహాసనము, తిలకధారులుగా ఉంటున్నారా? స్మృతీ భవ అనే అవినాశీ తిలకము దిద్దబడి ఉంది కదా! మొత్తం కల్పంలో మా వంటివారు ఇంకెవ్వరూ లేరు అన్న నషాలోనే సదా ఉండండి. ఇదే స్మృతి సదా నషాలో ఉంచుతుంది మరియు సంతోషంలో ఊగుతూ ఉంటారు.

4. లైట్ హౌస్ గా అయి అందరికీ ప్రకాశమును ఇవ్వడమే ఆత్మిక సేవాధారుల యొక్క కర్తవ్యము. సదా స్వయాన్ని లైట్ హౌస్ గా భావిస్తున్నారా? లైట్ హౌస్ అనగా ప్రకాశధామము. ఇంతటి అపారమైన ప్రకాశమును విశ్వమంతటికీ లైట్‌హౌస్ గా అయి సదా ఇస్తూ ఉండాలి. లైట్ హౌస్లో సదా ప్రకాశము ఉండనే ఉంటుంది, అప్పుడే అది ప్రకాశమును ఇవ్వగలుగుతుంది. లైట్‌హౌస్ తాను స్వయమే ప్రకాశము లేకుండా ఉన్నట్లయితే ఇతరులకు ఎలా ఇవ్వగలదు? ఇంట్లో అన్ని సాధనాలు కలిసే ఉంటాయి, కావున ఇక్కడ కూడా లైట్ హౌస్ అనగా సదా లైట్ జమా అయి ఉండాలి. లైట్ గా అయి ప్రకాశమును ఇవ్వడమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము. సత్యమైన ఆత్మిక సేవాధారులు మహాధానులుగా, లైట్‌హౌస్లుగా ఉంటారు. దాత యొక్క పిల్లలు దాతలుగా ఉంటారు. కేవలం తీసుకునేవారిగా కాదు ఇచ్చేవారిగా కూడా ఉండాలి. ఎంతగా ఇస్తారో అంతగా స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. పెంచుకునేందుకు సాధనము ఇవ్వడమే.

5. సర్వవరదానాలతో సంపన్నంగా అయ్యే సమయం సంగమ యుగం. ఈ శ్రేష్ఠ సమయం యొక్క మహత్వమును లేక సమయం యొక్క వరదానమును గూర్చి మీకు తెలుసు కదా? మొత్తం కల్పమంతటిలో వరదానీ సమయం ఏది? (సంగమ యుగము). కావున ఈ వరదానీ సమయంలో స్వయాన్ని వరదానాలతో సంపన్నంగా చేసుకున్నారా? ఎందుకంటే విధాత ద్వారా వరదానాల యొక్క బండారము నిండుగా ఉంటుందని మరియు అన్నీ తెరవబడిన బండాగారాలుగా ఉంటాయని మీకు తెలుసు. ఎవరు ఎంత కావాలనుకుంటే అంత తమను సుసంపన్నంగా చేసుకోవచ్చు. కావున ఈ విధంగా సుసంపన్నంగా చేసుకున్నారా? కాస్త ఖజానాను తీసుకొని, ఆ కొద్దిలోనే సంతృప్తి చెందకండి. తీసుకోవాలంటే పూర్తిగా తీసుకోవాలి, కొద్దిగా తీసుకోవడం కాదు. అధికారీ ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు కొద్దిలో సంతోషపడిపోరు. అవ్వాలంటే తప్పక నెంబర్ వన్‌గా అవ్వాలి. తీసుకోవాలంటే తప్పక  సంపన్నంగానే తీసుకోవాలి. కావున ఈ విధంగా లక్ష్యము మరియు లక్షణాలు రెండూ సంపన్నంగా ఉండాలి.

సదా ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్ ద్వారానే బాబా ద్వారా మరియు సర్వుల ద్వారా దీవెనలు లభిస్తూ ఉంటాయి మరియు జీవితము ఆనందమయంగా అవుతుంది. బ్యాలెన్ను ఉంచి దీవెనలను తీసుకోవడము మరియు ఇవ్వడము ఇదే ముఖ్యమైన కానుకను మధువనము నుండి తీసుకు వెళ్ళాలి. ఇదే ఇక్కడి రిఫ్రెష్మెంట్. అచ్చా. ఓం శాంతి. 

Comments