06-01-1982 అవ్యక్త మురళి

* 06-01-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగ బ్రాహ్మణ జీవితములో పవిత్రత యొక్క మహత్వము.

ఈ రోజు బాప్ దాదా విశేషముగా పిల్లల యొక్క పవిత్రతను పరిశీలిస్తున్నారు. సంగమయుగములో విశేషముగా వరదాత అయిన బాబా నుండి రెండు వరదానాలు పిల్లలందరికీ లభిస్తాయి. ఒకటి సహజయోగి భవ, ఇంకొకటి పవిత్ర భవ. ఈ రెండు వరదానాలను బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ పురుషార్ధానుసారముగా జీవితములో ధారణ చేస్తున్నారు. ఇటువంటి ధారణా స్వరూప ఆత్మలను బాబా చూస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకము మరియు నయనాల ద్వారా పవిత్రత యొక్క ప్రకాశము కనిపిస్తోంది. పవిత్రత సంగమయుగ బ్రాహ్మణుల మహాన్ జీవితము యొక్క గొప్పతనము. పవిత్రత బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠ సింగారము. ఏ విధముగా స్థూల శరీరములో విశేషముగా శ్వాస ఆడడం ఆవశ్యకమో, శ్వాస లేకపోతే ఏ విధముగా జీవితము ఉండదో అలాగే బ్రాహ్మణ జీవితము యొక్క శ్వాస ఈ పవిత్రత. 21 జన్మల ప్రారబ్దానికి ఆధారము అనగా పునాది పవిత్రతయే. ఆత్మ అనగా పిల్లలు తండ్రితో మిలనమును జరిపేందుకు ఆధారము పవిత్ర బుద్ధియే. సర్వ సంగమయుగ ప్రాప్తులకు ఆధారము పవిత్రత, పవిత్రత పూజ్య పదవిని పొందేందుకు ఆధారము. ఇటువంటి మహాన్ వరదానమును సహజముగా పొందారా? వరదానము యొక్క రూపములో అనుభవం చేసుకుంటున్నారా? లేక కష్టముగా ప్రాప్తించుకుంటున్నారా? వరదానములో శ్రమ అనేది ఉండదు కానీ వరదానమును సదా జీవితములో ప్రాప్తించుకునేందుకు కేవలం ఒక్క విషయం యొక్క అటెన్షన్ కావాలి. వరదాత మరియు వరదానీ రెండింటి యొక్క సంబంధం సమీపముగా మరియు స్నేహము యొక్క ఆధారముపై నిరంతరమూ ఉండాలి. వరదాత మరియు వరదానీ ఆత్మలు ఇరువురూ సదా కంబైన్డ్ రూపములో ఉన్నట్లయితే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడకు అపవిత్రత స్వప్నమాత్రముగా కూడా రాజాలదు. సదా బాబా మరియు మీరు యుగళరూపములో ఉండండి. ఒంటరిగా కాదు, యుగళరూపములో ఉండండి. ఒంటరిగా ఉంటే పవిత్రత యొక్క సౌభాగ్యము తొలగిపోతుంది. లేకపోతే పవిత్రత యొక్క సౌభాగ్యము మరియు శ్రేష్ఠ భాగ్యము సదా మీతో ఉంటుంది కావున బాబాను తోడుగా ఉంచుకోవడం అనగా మీ సౌభాగ్యమును, భాగ్యమును తోడుగా ఉంచుకోవడం. మరి అందరూ బాబాను సదా తోడుగా ఉంచుకోవడంలో అభ్యాసులే కదా!

విశేషముగా డబుల్ విదేశీ పిల్లలకు ఒంటరి జీవితం ఇష్టముండదు కదా! సదా కంపానియన్ (తోడు) కావాలి కదా! కావున ఇటువంటి కంపానియన్ మరియు కంపెనీ మొత్తం కల్పంలో ఇంకెప్పుడూ లభించదు. కావున తండ్రిని తోడుగా చేసుకోవడం అనగా పవిత్రతను సదాకాలికముగా మీ స్వంతం చేసుకోవడం. ఇటువంటి యుగళరూపులకు పవిత్రత అతి సహజము. పవిత్రతయే సహజ జీవితముగా అయిపోతుంది. పవిత్రముగా ఉండాలి, పవిత్రముగా అవ్వాలి అన్న ప్రశ్నే ఉండదు. బ్రాహ్మణుల యొక్క జీవితమే పవిత్రత. బ్రాహ్మణ జీవితము యొక్క ప్రాణదానమే పవిత్రత. ఆది, అనాది స్వరూపమే పవిత్రత. నేను అది, అనాది పవిత్ర ఆత్మను అన్న స్మృతి కలిగింది. స్మృతి కలగడం అనగా పవిత్రత యొక్క సామర్ద్యత రావడం. కావున స్మృతిస్వరూపులు, సమర్ధస్వరూప ఆత్మలు, నిజ పవిత్ర సంస్కారాలు గల వారి అనాది సంస్కారమే పవిత్రత. సాంగత్యదోషము యొక్క సంస్కారాలు అపవిత్రతతో కూడుకున్నవి, కావున యదార్థ సంస్కారాలను ఎమర్ట్ చేసుకోవడం సహజమా? లేక సాంగత్య దోషము యొక్క సంస్కారాలను ఎమర్జ్ చేసుకోవడం సహజమా? బ్రాహ్మణ జీవితము అనగా రాజయోగిగా మరియు సదాకాలికముగా పావనముగా ఉండడం. పవిత్రత బ్రాహ్మణ జీవితపు విశేష జన్మ యొక్క విశేషత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధి యొక్క భోజనము. పవిత్ర దృష్టి బ్రాహ్మణుల కన్నులలోని ప్రకాశము. పవిత్ర కర్మ బ్రాహ్మణ జీవితము యొక్క విశేష వ్యాపారము. పవిత్ర సంబంధం మరియు సంపర్కము బ్రాహ్మణ జీవితము యొక్క మర్యాద. కావున బ్రాహ్మణ జీవితము యొక్క మహానత ఏమిటో ఆలోచించండి. అది పవిత్రతయే కదా! ఇటువంటి గొప్ప విషయాన్ని ధారణ చేయడంలో కష్టపడకండి. దానిని హఠముతో మీ స్వంతం చేసుకోకండి. శ్రమ మరియు హఠము నిరంతరముగా ఉండజాలదు. కానీ ఈ పవిత్రత అయితే మీ జీవితము యొక్క వరదానము. ఇందులో శ్రమ మరియు హఠము ఎందుకు? అది మీ నిజ వస్తువు. మీ యదార్థమైన దానిని ధారణ చేయడంలో శ్రమ ఎందుకు? పాత వస్తువును స్వంతం చేసుకోవడంలో శ్రమ ఉంటుంది. పరాయి వస్తువు అపవిత్రతయే కానీ పవిత్రత కాదు. రావణుడు పరాయివాడు, మన వాడు కాదు. బాబా మన వాడు, రావణుడు పరాయివాడు. కావున బాబా.వరదానము పవిత్రత, రావణుని యొక్క శాపము అపవిత్రత. మరి రావణుని పరాయి వస్తువును ఎందుకు మీదిగా చేసుకుంటారు? పరాయి వస్తువు నచ్చుతుందా? మన వస్తువు పైన నషా ఉంటుంది, కావున సదా స్వస్వరూపము పవిత్రత, స్వధర్మము పవిత్రత అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత, స్వదేశము పవిత్ర దేశము. స్వరాజ్యము పవిత్ర రాజ్యము. స్వయం యొక్క స్మృతిచిహ్నము పరమ పవిత్రమైనది, పూజ్యమైనది. కర్మేంద్రియాల యొక్క అనాది స్వభావము సుకర్మ. కావున ఇదే సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే శ్రమ మరియు హఠయోగము నుండి ముక్తులైపోతారు. బాప్ దాదా పిల్లలు శ్రమించడం చూడలేరు. కావున అందరూ పవిత్ర ఆత్మలే. ఈ స్వమానములో స్థితులైపోండి, స్వమానము ఏమిటి? 'నేను పరమపవిత్ర ఆత్మను'. సదా మీ యొక్క ఈ స్వమానమనే ఆసనముపై స్థితులై  ప్రతి కర్మనూ చేయండి, తద్వారా సహజముగా వరదానులుగా అయిపోతారు. ఇది సహజ ఆసనము. కావున సదా పవిత్రత యొక్క నషాలో ఉండండి. స్వమానము ముందుకు దేహ అభిమానము రాజాలదు. అర్ధమయ్యిందా?

డబుల్ విదేశీయులైతే ఇందులో పాస్ అయ్యారు కదా? హఠయోగులుగా అయితే లేరు కదా! బాగా కష్టపడే యోగులుగా అయితే లేరు కదా! ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులవుతారు. లవలీన ఆత్మలుగా అవ్వండి. సదా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్నదే సహజమైన పవిత్రత. కావున ఈ గీతమును గానం చేయడం రాదా? ఈ గీతమును గానం చేయడమే సహజ పవిత్ర ఆత్మగా
అవ్వడం. అచ్చా!

ఇలా సదా స్వ ఆసనము యొక్క అధికారీ ఆత్మలకు, సదా బ్రాహ్మణ జీవితము యొక్క మహానత లేక విశేషతను జీవితములో ధారణ చేసుకునే ఆది, అనాది పవిత్ర ఆత్మలకు, స్వస్వరూప, స్వధర్మ, సుకర్మలో స్థితులైయుండే శ్రేష్ఠ ఆత్మలకు లేక పరమ పవిత్ర పూజ్య ఆత్మలకు, పవిత్రత యొక్క వరదానమును ప్రాప్తించుకునే మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఫ్రాన్స్, బ్రెజిల్ మరియు ఇతర కొన్ని స్థానాలనుండి వచ్చిన విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దా దా యొక్క మిలనము:-

1. అందరూ స్వయాన్ని సదా మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తూ ప్రతి కర్మా చేస్తున్నారా? సదా సేవ యొక్క క్షేత్రములో స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తూ సేవ చేసినట్లయితే సేవలో సఫలత తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే వర్తమాన సమయంలో సేవ, సఫలత యొక్క విశేష సాధనము - వృత్తి ద్వారా వాయుమండలమును తయారుచేయడం. ఈ రోజుల్లోని ఆత్మలకు తమ శ్రమ ద్వారా ముందుకు వెళ్ళడం కష్టం. కావున మీ వైబ్రేషన్ల ద్వారా ఎటువంటి శక్తిశాలీ వాయుమండలమును తయారుచేయాలంటే, దాని ద్వారా ఆత్మలు స్వతహాగానే ఆకర్షితులై రావాలి. కావున సేవా వృద్ధి యొక్క పునాది ఇదే. అలాగే సేవ యొక్క సాధనాలేవైతే ఉన్నాయో వాటిని నలువైపులా చేస్తూ ఉండాలి. కేవలం ఒకే స్థానములో ఎక్కువగా కష్టపడుతూ మీ సమయాన్ని వినియోగించకూడదు. నలువైపులా సేవ యొక్క సాధనాల ద్వారా సేవను వ్యాపింపజేయండి, తద్వారా అన్ని వైపుల నుండి వెలువడిన చైతన్య పుష్పాల యొక్క పూలగుచ్చితము తయారవుతుంది.

2.బాప్ దాదా అదృష్టవంతులైన పిల్లలను చూసి ఎంతో హర్షిస్తారు. ప్రతి ఒక్కరూ ఆత్మిక గులాబీ పుష్పాలు. ఆత్మిక గులాబీ పుష్పాల సమూహము అనగా ఆత్మిక తండ్రి యొక్క స్మృతిలో లవలీనమై ఉండే గ్రూప్. అందరి ముఖముపై సంతోషము యొక్క ప్రకాశము కనిపిస్తోంది.

బాప్ దాదాకు ఒక్కొక్క రత్నము యొక్క విలువ తెలుసు. ఒక్కొక్క రత్నము విశ్వములో అమూల్య రత్నము. కావున బాప్ దాదా అదే విశేషతను చూస్తూ ప్రతి రత్నము యొక్క విలువనూ చూస్తారు. ఒక్కొక్క రత్నము అనేకుల సేవ కొరకు నిమిత్తమయ్యే రత్నము. సదా స్వయమును విజయీ రత్నముగా అనుభవం చేసుకోండి. సదా మీ మస్తకముపై విజయము యొక్క తిలకము దిద్దబడి ఉండాలి, ఎందుకంటే బాబాకు చెందిన వారిగా అయిపోయాక విజయము మీ జన్మసిద్ధ అధికారము. కావుననే స్మృతిచిహ్నము కూడా విజయమాలగా గానం చేయబడ్డది. అందరూ విజయమాలలోని మణులే కదా? ఇప్పుడు ఇంకా ఫైనల్ అవ్వలేదు, కావున అవకాశం ఉంది. ఎవరు కావాలనుకుంటే వారు అందులో సీటు తీసుకోవచ్చు.

3. సదా స్వయమును ప్రతి గుణము. ప్రతి శక్తి యొక్క అనుభవీ మూర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే సంగమయుగములోనే సర్వ అనుభవీ మూర్తులుగా అవ్వగలుగుతారు. సంగమయుగము యొక్క విశేషత ఏదైతే ఉందో దానిని తప్పకుండా అనుభవం చేసుకోవాలి కదా! మరి అందరూ స్వయమును ఈ విధముగా అనుభవీ మూర్తులుగా భావిస్తున్నారా? శక్తులు మరియు గుణాలు - రెండూ గొప్ప ఖజానాలు. మరి మీరు ఎన్ని ఖజానాలకు అధిపతులుగా అయిపోయారు? బాప్ దాదా అయితే ఖజానాలన్నింటినీ పిల్లలకు ఇచ్చేందుకే వచ్చారు. ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. వారు సాగరము కదా! కావున సాగరము అనగా అపారము, తరగనివారు. మరి మీరు మాస్టర్ సాగరులుగా అయ్యారా?

అందరికన్నా ఎక్కువ భాగ్యము విదేశీయులదే. వారికి ఇంట్లో కూర్చుంటూనే బాబా యొక్క పరిచయం లభించింది. మరి స్వయాన్ని ఇంతటి భాగ్యవంతులుగా భావిస్తున్నారు కదా? చాలా లగ్నము గల ఆత్మలుగా, స్నేహీ ఆత్మలుగా ఉన్నారు. స్నేహము యొక్క ప్రత్యక్ష స్వరూపముగా బాబా మరియు పిల్లల యొక్క మేళా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని సూర్యవంశీ ఆత్మలుగా భావిస్తున్నారా? మొదటి రాజ్యములోకి వస్తారా లేక రెండవ నెంబర్ రాజ్యములోకి వస్తారా? మొదటి రాజ్యములోకి వచ్చేందుకు ఒకే పురుషార్ధము ఉంది. అది ఏమిటి? సదా ఒక్కరి యొక్క స్మృతిలో ఉంటూ ఏకరసస్థితిని తయారుచేసుకున్నట్లయితే 1 - 1 - 1 లోకి వచ్చేస్తారు. అచ్చా,

Comments