05-06-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అలౌకిక జీవితం యొక్క కర్తవ్యమే వికారిని నిర్వికారిగా తయారుచేయటం.
లౌకికం నుండి అలౌకికంగా తయారుచేసేవారు, స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే అనుభవీ పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
సదా స్వయాన్ని బాప్ దాదా యొక్క సహయోగిగా, విశ్వ పరివర్తన అనే కార్యం యొక్క సంలగ్నతలో నిమగ్నమై ఉన్నట్లుగా భావించి నడుస్తున్నారా? బాప్ దాదా యొక్క కార్యమే మా కార్యం అనే స్మృతి ఉంటుందా? బాబా ఏవిధంగా అయితే సర్వశక్తుల, గుణాల సాగరుడో అదేవిధంగా స్వయాన్ని కూడా సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? స్వయం యొక్క బలహీన సంకల్పాలు మరియు సంస్కారాలను పరివర్తన చేసుకునే శక్తిలో సమర్థత వచ్చిందా? ఎందుకంటే ఎప్పటి వరకు స్వయం పరివర్తన అయ్యే శక్తిలో సమర్థత రాదో అంత వరకు విశ్వాన్ని కూడా పరివర్తన చేయలేరు. కనుక ఇప్పుడు నేనెంత వరకు పరివర్తన అయ్యాను? అని స్వయాన్ని చూస్కోండి. సంకల్పంలో, వాణిలో, కర్మలో ఎంత శాతం లౌకికం నుండి అలౌకికంగా అయ్యాను? అని చూస్కోండి. పరివర్తన అంటేనే లౌకికం నుండి అలౌకికంగా అవ్వటం, మరయితే ఈ శక్తి అనుభవం అవుతుందా? ఏ లౌకిక వ్యక్తి లేదా వస్తువుని చూస్తున్నా అలౌకిక స్వరూపంలోకి పరివర్తన చేసుకోవటం వస్తుందా? దృష్టిని, వృత్తిని, తరంగాలను, వాయుమండలాన్ని లౌకికం నుండి అలౌకికంగా తయారు చేసుకునే అభ్యాసం ఉందా? బ్రాహ్మణుల జన్మయే అలౌకికమైనది. అలౌకిక జన్మ, అలౌకిక తండ్రి, అలౌకిక పరివారం అదేవిధంగా కర్మ కూడా అలౌకికంగా ఉంటుందా? బ్రాహ్మణ జీవితం యొక్క విశేష కర్మయే లౌకికాన్ని అలౌకికంగా తయారుచేయటం. మీ జన్మ యొక్క కర్మపై ధ్యాస ఉంటుందా? లౌకికం నుండి అలౌకికంగా తయారుచేసే పురుషార్థమే అన్ని సమస్యల నుండి, బలహీనతల నుండి ముక్తుల్ని చేస్తుంది.
అమృతవేళ నుండి రాత్రి వరకు ఏది చూస్తున్నా, వింటున్నా, ఆలోచిస్తున్నా లేదా కర్మ చేస్తున్నా దానిని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేస్కోండి. ఈ అభ్యాసం చాలా సహజం. కానీ ధ్యాస పెట్టుకోవలసిన అవసరం ఉంది. తినటం, త్రాగటం, నడవటం వంటి శారీరక క్రియలు ఎంత సహజ రీతిలో చేస్తున్నారో ఆ శారీరక క్రియలతో పాటు ఆత్మ యొక్క మార్గం, ఆత్మ యొక్క భోజనం, ఆత్మ యొక్క పురుషార్థం అంటే నడవటం, ఆత్మ యొక్క విహారం, ఆత్మ రూపాన్ని చూడటం, ఆత్మ రూపం గురించి ఆలోచించటం ఇవన్నీ వెనువెంట చేస్తూ నడిస్తే అప్పుడు లౌకికం నుండి అలౌకిక జీవితం సహజంగా అనుభవం అవుతుంది. ఏదైనా లౌకిక వ్యవహారాన్ని నిమిత్తమాత్రంగా చేస్తూ ఉంటే ఆ లౌకిక కార్యం యొక్క ఆకర్షణ లేదా భారం తనవైపుకి లాగదు. లౌకిక కార్యం చేస్తూ కూడా అలౌకిక కార్యం చేస్తున్న కారణంగా డబుల్ సంపాదన అయినట్లుగా కూడా అనుభవం అవుతుంది. అలౌకిక స్వరూపం అంటే నిమిత్తం. నిమిత్తంగా అయ్యి కార్యం చేయటం ద్వారా ఏమవుతుంది? ఏవిధంగా అవుతుంది? ... అనే భారం సమాప్తి అయిపోతుంది. అలౌకిక స్వరూపం అంటే కమల పుష్ప సమానం. ఎటువంటి తమోగుణి వాతావరణం అయినా కానీ, అటువంటి తరంగాలు ఉన్నా కానీ సదా కమలం సమానంగా ఉంటారు. లౌకిక చెత్తలో ఉంటూ కూడా అతీతంగా అంటే ఆకర్షణ అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అనుభవం చేసుకుంటారు. ఏ రకమైన మాయావి అంటే వికారాలకు వశీభూతం అయిన వ్యక్తి సంపర్కంలోకి వచ్చినా కానీ స్వయం వశీభూతం అవ్వరు. ఎందుకంటే వశీభూత ఆత్మలను బంధనయుక్తుల నుండి బంధన్ముక్తులుగా చేయటం, వికారి నుండి నిర్వికారిగా చేయటం, లౌకికం నుండి అలౌకికంగా చేయటం ఇదే మా అలౌకిక జీవితం యొక్క కార్యం అంటే కర్తవ్యం అని సదా స్మృతి ఉంటుంది. వశీభూత ఆత్మను విడిపించేవారు స్వయం వశీభూతం అవ్వరు.
మనందరం ఒకే తండ్రి యొక్క సంతానం,ఆత్మిక సోదరులం అనే అలౌకిక దృష్టి యొక్క స్మృతి ద్వారా దేహధారి దృష్టి అంటే లౌకిక దృష్టి, దీని ద్వారానే వికారాలన్నీ ఉత్పన్నం అవుతాయి. ఆ దృష్టి యొక్క బీజమే సమాప్తి అయిపోతుంది. బీజం సమాప్తి అయిపోయినప్పుడు అనేక రకాల వికారాల వృక్షం యొక్క విస్తారం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది.
ఇప్పటి వరకు కూడా చాలామంది పిల్లల యొక్క ఫిర్యాదు ఏమిటంటే దృష్టి చంచలం అవుతుంది లేదా దృష్టి చెడుగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బాబా యొక్క ఆజ్ఞ - లౌకిక దేహం అంటే శరీరంలో అలౌకిక ఆత్మను చూడండి అని అయితే మరి దేహాన్ని ఎందుకు చూస్తున్నారు? అలవాటు అని అంటున్నారు. అంటే అలవాటు కారణంగా బలహీనం అయిపోతున్నారు లేదా ఏదోక అల్పకాలిక రసానికి వశీభూతం అయిపోతున్నారు. అంటే దీని వలన రుజువు అయ్యేది ఏమిటంటే ఇప్పటి వరకు కూడా ఆత్మ - పరమాత్మ యొక్క రసం యొక్క అనుభవిగా కాలేదు అని. పరమాత్మ ప్రాప్తి యొక్క రసం మరియు దేహధారి కర్మేంద్రియాల ద్వారా అల్పకాలికంగా ప్రాప్తి యొక్క రసం రెండింటి యొక్క మహా తేడాను అనుభవం చేసుకోలేదు. అల్పకాలిక చెవుల యొక్క రసం, నోటి యొక్క రసం, నయనాల యొక్క రసం లేదా ఏ కర్మేంద్రియం యొక్క రసం అయినా ఆకర్షితం చేస్తుందంటే ఆ సమయంలో ఈ మహాన్ తేడా యొక్క యంత్రాన్ని ఉపయోగించండి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా - ఇప్పుడు మీకు తెలిసిపోయింది కూడా, దేహ ఆకర్షణ, దేహ దృష్టి, దేహం ద్వారా ప్రాప్తించే రసం సర్పం లాంటిది. ఇది సదాకాలికంగా సమాప్తి చేసేది. ఇది ఆకర్షితం చేసే రసం కాదు, సర్పం యొక్క విషం. అయినా కానీ అమృత రసాన్ని వదిలి విషం వైపుకి ఆకర్షితం అవ్వటాన్ని ఏమంటారు? అటువంటి వారిని జ్ఞాన సాగరులు లేదా మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారా? వశీభూత ఆత్మ సదా బలహీనంగా మరియు స్వయంతో అసంతుష్టంగా ఉంటుంది. అందువలన లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేస్కోండి.
ఆత్మిక స్మృతి యొక్క మొదటి పాఠాన్ని పక్కా చేస్కోండి. ఆత్మ ఈ శరీరం ద్వారా దేనిని చూస్తుంది? ఆత్మ, ఆత్మనే చూస్తుంది కానీ శరీరాన్ని కాదు. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తుంది. కనుక ఇతరాత్మల యొక్క కర్మను చూస్తూ కూడా వీరు కూడా ఆత్మ, కర్మ చేస్తున్నారు అనే స్మృతి ఉంటుంది. ఎవరిని చూసినా ఆత్మ రూపంలో చూడాలి - ఇలా అలౌకిక దృష్టి ఉండాలి. ఈ అభ్యాసం యొక్క లోపం కారణంగా పాఠాన్ని పక్కా చేసుకోలేదు. కానీ ఇతరులకు పాఠం చెప్పటంలో నిమగ్నమైపోయారు. దీని కారణంగా స్వయంపై ధ్యాస తక్కువగా ఉంటుంది, ఇతరులపై ఎక్కువ ధ్యాస ఉంటుంది. స్వయాన్ని ఆవిధంగా చూసుకుంటున్న కారణంగా ఇతరులను చూస్తూ కూడా అలౌకికానికి బదులు లౌకిక రూపమే కనిపిస్తుంది. స్వయం యొక్క బలహీనతలను తక్కువగా చూసుకుంటూ ఇతరుల బలహీనతలను ఎక్కువ చూస్తున్నారు. ప్రతి ఒక్కరితో అలౌకిక వృత్తి ద్వారా శుభ భావన, కళ్యాణ భావనతో సంపర్కంలోకి రావాలి. దీనినే అలౌకిక జీవితం యొక్క అలౌకిక వృత్తి అని అంటారు. కానీ అలౌకిక వృత్తికి బదులు లౌకిక వృత్తి, అవగుణాలను ధారణ చేసే వృత్తి, ఈర్ష్య, అసూయ వృత్తిని ధారణ చేయటం వలన అలౌకిక జీవితం యొక్క అలౌకిక పరివారం ద్వారా లభించవలసిన అలౌకిక సహయోగం యొక్క సంతోషాన్ని, అలౌకిక స్నేహం యొక్క ప్రాప్తి యొక్క శక్తిని పొందలేక పోతున్నారు. అందువలన లౌకిక వృత్తిని అలౌకిక వృత్తిలోకి పరివర్తన చేస్కోండి. కనుక పురుషార్థంలో బలహీనంగా ఉండడానికి కారణం ఏమిటి? లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకోవటం రావటం లేదు. లౌకిక సంబంధాలలో కూడా అలౌకిక సంబంధం అంటే ఆత్మిక సోదరీ సోదరులు అనే స్మృతిలో ఉండండి. ఏ సంబంధం వైపు అయినా అంటే ఏ లౌకిక సంబంధం యొక్క ఆకర్షణ అయినా ఆకర్షిస్తుంది అంటే మోహ దృష్టి వెళ్తుంటే ఆ లౌకిక సంబంధం యొక్క స్థానంలో బాబాతో సర్వ అవినాశి సంబంధాలను పెట్టుకోండి. బాబాతో సర్వ సంబంధాల అనుభవం యొక్క జ్ఞానం లోపంగా ఉన్న కారణంగానే లౌకిక సంబంధాల వైపుకి బుద్ధి భ్రమిస్తుంది. కనుక సర్వ సంబంధాల యొక్క అనుభవీ మూర్తి అవ్వండి. అప్పుడు లౌకిక సంబంధాల వైపు ఆకర్షితం అవ్వరు. లేస్తూ, కూర్చుంటూ లౌకికం మరియు అలౌకకం యొక్క తేడాను స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు లౌకికం నుండి అలౌకికం అయిపోతారు. అప్పుడు ఈ ఫిర్యాదు సమాప్తి అయిపోతుంది. మాటిమాటికి ఒకే ఫిర్యాదు చేస్తున్నారంటే ఏమి రుజువవుతుంది? అలౌకిక జీవితం యొక్క అనుభవం లేదు అని కనుక ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులు అవ్వండి. అర్థమైందా? ఈ చిన్న విషయం అర్ధం కావటం లేదా? బాధ్యత అయితే చాలా పెద్దది తీసుకున్నారు కదా? ప్రపంచానికి చాలా పెద్ద శపథం చేశారు కదా? సెకనులో ముక్తి - జీవన్ముక్తి ఇస్తాం అని శపథం చేస్తున్నారు కదా! ఆహ్వాన పత్రికలో ఏమి వ్రాస్తారు? వచ్చి ఒక్క సెకనులో తండ్రి నుండి వారసత్వం తీసుకోండి లేదా ముక్తి, జీవన్ముక్తికి అధికారి అవ్వండి అని వేస్తారు. ఇలా ప్రపంచానికి శపథం చేసేవారు మీ వృత్తి, దృష్టిని మార్చుకోలేకపోతున్నారా? పరివర్తన అయ్యే తీరతాం అంటే విజయీ అయ్యి చూపిస్తాం అని స్వయం గురించి కూడా శపథం చేయండి. మంచిది.
ప్రతి సంకల్పం, సమయం, సంబంధ సంపర్కాలను లౌకికం నుండి అలౌకికంగా తయారు చేసుకునేవారికి, అలౌకిక బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవీ మూర్తులకు, విశ్వ పరివర్తనతో పాటు స్వ పరివర్తన ద్వారా విశ్వానికి సరైన మార్గం చూపించేవారికి, సదా బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభవీ మూర్తులకు, సర్వ ప్రాప్తుల యొక్క రసంలో నిమగ్నమై ఉండేవారికి, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవంలో ఉండేవారికి, అనుభవీ మూర్తులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment