04-02-1980 అవ్యక్త మురళి

04-02-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

భాగ్యవిధాత తండ్రి మరియు భాగ్యశాలీ పిల్లలు.

ఈ రోజు జ్ఞానదాత, భాగ్య విధాత అయిన తండ్రి తన పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు. సర్వ శ్రేష్ఠ ఆత్మల భాగ్యము ఎంత శ్రేష్ఠమైనదో? ఎలా శ్రేష్ఠమైనదో చూస్తున్నారు. ఎలాగైతే మీరందరూ తండ్రి పరిచయం ఇచ్చునప్పుడు విశేషంగా 6 విషయాలు వినిపిస్తారు. వాటి ద్వారా తండ్రి పరిచయాన్ని స్పష్టం చేస్తారు. ఆ 6 విషయాలు తెలుసుకున్నారంటే ఆత్మ శ్రేష్ఠ పదవిని పొందగలదు. వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటిలో సర్వ ప్రాప్తులకు అధికారిగా కాగలదు. అలాగే బాప్ దాదా కూడా పిల్లలందరి భాగ్యాన్ని 6 మాటల ఆధారంతో చూస్తున్నారు. ఆ 6 విషయాలు ఏవో తెలుసా? 

1. పేరుకు భాగ్యము:- శ్రేష్ఠ ఆత్మలైన మీ పేరుకు కూడా భాగ్యముంది - మీ పేరును ఇప్పటికీ విశ్వములోని ఆత్మలు వర్ణిస్తున్నారు. ఉదాహరణానికి బ్రాహ్మణుల పిలక బ్రాహ్మణుల పేరు ద్వారానే ఈనాటి నామధారీ బ్రాహ్మణులు కూడా ఈ చివరి సమయం వరకు శ్రేష్ఠమైన వారని మహిమ చేయబడున్నారు. ఇప్పుడు వారి పని మారింది, కానీ పేరుకు గౌరవం లభిస్తూనే ఉంది. అలానే పాండవ సేన, ఈనాటికి కూడా 'పాండవులు' అను పేరుతో నిరుత్సాహంగా ఉన్న ఆత్మలకు స్వయానికి ఉత్సాహం ఇప్పిస్తారు. పంచ పాండవుల సమానం తండ్రిని జతలో ఉంచుకుంటే విజయులుగా అవుతారు. కొంతమంది ఉన్నా పర్వాలేదు, వారు సదా విజయులు కనుక మనము కూడా విజయులుగా అవుతామని భావిస్తారు. అదే విధంగా గోప-గోపికలు ఈనాటికి కూడా గోప-గోపికలను మహిమ చేస్తూ సంతోషపడ్డారు. ఆ పేరు వింటూనే ప్రేమలో లవలీనమైపోతారు. ఇలా మీ పేరుకు కూడా భాగ్యముంది. 

2. రూపానికి కూడా భాగ్యముంది:- శక్తుల రూపములో ఇప్పటి వరకూ భక్తులు దర్శనం కొరకు వేడిని - చలిని సహిస్తున్నారు. ఇక్కడైతే మీరు విశ్రాంతిగా, సుఖంగా ఉన్నారు. భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి వారు తపస్సు చేస్తారు. కనుక మీకు శక్తుల రూపంలో, దేవీదేవతల రూపంలో పూజ్యులుగా అయ్యే భాగ్యముంది. రెండు రూపాల్లో పూజ్యులుగా అవుతారు. కనుక మీ రూపానికి గాయనంతో పాటు పూజ కూడా ఉంది. విశేష పూజలందుకునే భాగ్యం కూడా ఉంది. 

3. గుణాల భాగ్యము:- ఈ రోజు వరకు మీ గుణాలను కీర్తనల రూపములో వర్ణన చేస్తున్నారు. మీ గుణాలను ఎలా వర్ణిస్తున్నారంటే, ఆ గుణాల భాగ్యము యొక్క ప్రభావమును కీర్తించువారికి కూడా అల్పకాలము కొరకు శాంతి, సంతోషం, ఆనందాలు అనుభవమవుతాయి. ఇదే గుణాల భాగ్యము. ఇంకా ముందుకు వెళ్ళండి. 

4. కర్తవ్యాల భాగ్యము:- ఈ రోజు వరకు మొత్తం సంవత్సరంలో రకరకాల ఉత్సవాలు జరుపుతారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు అనేక రకాల సాధనాలచే ఉత్సాహమిప్పించారు. అందువలన కర్తవ్య భాగ్యానికి గుర్తుగా ఉత్సాహాలు జరుపుతారు. ఇంకా ముందుకు వెళ్ళండి. 

5. నివాస స్థానము :- నివాస స్థానమంటే ఉండే ధామము(ఊరు). దాని స్మృతి చిహ్నాలుగా తీర్థ స్థానాలున్నాయి. మీ స్థానానికి కూడా ఇంత భాగ్యముంది. ఆ స్థానాలు తీర్థస్థానాలైపోయాయి. అక్క డి మట్టికి కూడా భాగ్యముంది. తీర్థ స్థానాల మట్టిని కూడా మస్తకములో రాసుకుంటారు. కనుక స్వయాన్ని భాగ్యశాలురుగా భావిస్తున్నారా? ఇది స్థానము యొక్క భాగ్యము. 

6. సమయం:- ఈ సంగమయుగ భాగ్యము యొక్క వర్ణన విశేషంగా అమృతవేళ రూపంలో గాయనం చేయబడ్తుంది. అమృతవేళ అనగా అమృతం ద్వారా అమరులుగా అయ్యే వేళ. దీనితో పాటు ఇది ధర్మయుగము, పురుషోత్తమ యుగము. సాయంకాల సమయాన్ని కూడా శ్రేష్ఠ భాగ్యంగా అంగీకరిస్తారు. ఈ సమయం యొక్క మహిమ అంతా ఇప్పటి మీ సమయపు గాయనమే. కనుక మీ శ్రేష్ఠ భాగ్యం ఏమిటో అర్థమయ్యిందా.

బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని విశేషంగా ఈ 6 మాటలతో చూస్తున్నారు. 6 రకాల భాగ్యాన్ని ఎంత శాతంలో తయారు చేసుకున్నారు? మీ శ్రేష్ఠ పేరు స్మృతిలో ఎంతవరకు ఉంటున్నారు? ఎంత సమయం ఉంటున్నారు? ఏ స్థితిలో ఉంటున్నారు? మీ దివ్య గుణధారి దేవతా రూపం, మాస్టర్ సర్వశక్తివంతుల శక్తి రూపం. రెండు రూపాల్లో ఎంత వరకు సమర్థ స్వరూపులై ఉన్నారు. ఇలా ప్రతి విషయములో రిజల్ట్ చూశారు. సూక్ష్మ వతనంలో పరిశీలించుటకు శ్రమ చేయాల్సిన అవసరం లేదని వినిపించాను కదా. సంకల్పమనే స్విచ్ ఆన్ చేస్తూనే ప్రతి ఒక్కరి అన్ని రకాల మొత్తము రిజల్ట్ ఎమర్జ్ అవుతుంది. సాకార ప్రపంచంలో వలె శ్రమించాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఏ సైన్స్ సాధనాలు వెలువడుతున్నాయో వాటి రిఫైన్ రూపం అక్కడ ముందు నుంచే ఉన్నాయి. ఇక్కడ టి.వి. కూడా ఇప్పుడే వెలువడింది.
కాని పిల్లలైన మీకు సూక్ష్మవతనములో స్థూలవతనపు దృశ్యము స్థాపన ఆదిలోనే చూపించి అనుభవం చేయించారు. సైన్స్ వారు శ్రమజీవులు. ఇప్పుడు నక్షత్రాల వరకు శ్రమిస్తారు. చంద్రునిలో ఏమీ లభించలేదు. కనుక నక్షత్రాల వద్దకు వెళ్ళుటకు శ్రమిస్తారు. కాని పిల్లలైన మీరు సైలెన్స్ శక్తి ద్వారా నక్షత్రాల కంటే దూరంగా పరంధామాన్ని ఆది నుంచే అనుభవం చేస్తున్నారు. అయినా పిల్లలందరికీ శ్రమకు ఫలితం తప్పక లభిస్తుంది. వారికి కూడా విశ్వములో పేరు, గౌరవ మర్యాదలు మరియు సఫలతకు అల్పకాలపు సంతోషం ప్రాప్తి అవుతుంది. వీరు కూడా డ్రామాలో పరవశులు అనగా పాత్రకు వశమై ఉన్నారు. దేవతల ముందుకు ప్రకృతి వజ్రాలు, రత్నాలు నింపిన పళ్ళాలతో వచ్చిందని గాయనం చేయబడింది. భూమి మరియు సముద్రం మీ కొరకు నలువైపుల వ్యాపించి ఉన్న బంగారు మరియు వజ్రవైఢూర్యాలు ఒకే చోట ప్రోగు చేయుటకు నిమిత్తమవుతాయి. దీనినే పళ్ళాలతో నింపడమని అంటారు. చెల్లా చెదురుగా ఉన్న వస్తువులు పళ్లెంలో ఒకే చోటుకు చేరుతాయి కదా. కావున ఈ భారతదేశము మరియు చుట్టు ప్రక్కల ఉన్న స్థానాలు పళ్ళెంగా అయిపోతాయి. సేవకులై విశ్వ యజమానుల కొరకు సిద్ధం చేసి మీ ముందుంచుతాయి. ఇలాగే దేవతల కొరకు సర్వ రిద్ధి, సిద్ధులు కూడా సేవాధారులుగా అవుతాయి. ఇక్కడ రకరకాల సాధనాల ద్వారా సఫలత అంటే సిద్ధిని పొందుతున్నారు. ఈ సిద్ధులన్నీ అనగా సైన్స్ కూడా రీఫైన్ రూపంలో, సఫలత రూపంలో, సిద్ధి రూపంలో మీకు సేవాధారులుగా అవుతాయి. ఇప్పుడైతే ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రాప్తి కూడా ఉంది. కాని రీఫైన్ సిద్ధి రూపంలో దుఃఖం కలుగుటకు కారణాలన్నీ సమాప్తమై సదా సుఖము మరియు సఫలతా రూపమైపోతాయి. ఇక్కడ ఉన్న భిన్న భిన్న డిపార్ట్ మెంట్ల వారు తమ తమ జ్ఞాన సిద్ది ద్వారా కనుగొనే ఆవిష్కరణలు మీ సేవలోకి తీసుకొస్తారు. దీనినే ప్రకృతి కూడా దాసిగా అవుతుందని, సర్వ రిద్ధి, సిద్ధులు ప్రాప్తి అవుతాయని అంటారు. ఆజ్ఞాపిస్తూనే కార్యం జరిగిపోతుంది. దీనినే సిద్ధి స్వరూపమని అంటారు. కనుక మీ భాగ్యము ఎంత గొప్పదో తెలిసిందా? తండ్రి భాగ్యాన్ని ఆత్మలు వర్ణిస్తాయి. కాని మీ భాగ్యాన్ని తండ్రి వర్ణిస్తారు. దీనికంటే గొప్ప భాగ్యము ఇంతవరకు లేదు, ఇక మీదట ఉండదు. ఇప్పుడైతే అందరికీ అదృష్టపు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తున్నదో, అలా సదా మీ భాగ్య నక్షత్రాన్ని మెరుస్తూ ఉన్నట్లు చూడండి.

ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలురు, సర్వ ఆత్మల భాగ్యమును తయారు చేయుటకు నిమిత్తమైన ఆత్మలు, సదా ప్రకృతిజీతులై ప్రకృతిని కూడా సేవాధారిగా చేసుకొనువారు, మాస్టర్ సర్వశక్తివంతులై శక్తుల ఆధారంతో సర్వ రిద్ధి, సిద్ధులు ప్రాప్తి చేసుకొనువారు, ఇలా సదా సర్వశక్తివంతులై, విశ్వకళ్యాణకారులై విశ్వ ఆత్మలకు మహాదానమును, వరదానమును ఇచ్చే జ్ఞానదాతలు, భాగ్యవిదాత పిల్లలకు, బాప్ దాదా గారి ప్రియస్మృతులు మరియు నమస్తే. 

వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయడమే బేహద్ సేవ(నిమిత్త సేవాధారీ టీచర్లతో) - స్వయం నిండుగా ఉండి సర్వులను నింపడమే సేవాధారి పిల్లల విశేష సేవ. శక్తి స్వరూపులై శక్తి స్వరూపులుగా చేయడం. ఈ కార్యంలో బిజీగా ఉన్నారా? కోర్స్ ఇవ్వడం, భాషణం చేయుట, ఇవి 7 రోజుల విద్యార్థులు కూడా చేస్తారు. ఎవ్వరూ చేయని పనిని మీరు చేయాలి. మిమ్ములను విశేష కార్యము కొరకు నిమిత్తంగా చేశారు. తండ్రి ద్వారా ప్రాప్తించిన విశేషతలను బలహీన ఆత్మల్లో మీ శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల ద్వారా నింపుటే విశేష కార్యము. సదా శుభ భావనలు, శ్రేష్ఠ కామనా స్వరూపులుగా కావడమే మీ కార్యము. ఎవరిలోనైనా భావన ఉంచుతూ, ఉంచుతూ వారి భావవాన్ గా కావడం శ్రేష్ఠ భావన కాదు. ఈ తప్పు చేయరాదు. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ వ్యతిరేకంగా కూడా చేస్తారు. భగవాన్లుగా కావడమంటే వారి భక్తులుగా కావడం అనగా వారి గుణాలపై అర్పణ కావడం అంటే భక్తులుగా అవ్వడం. శుభ భావన కూడా బేహద్ గా ఉండాలి. ఒకరిపై విశేష భావన కూడా హద్దుయే. హద్దులో నష్టముంది, బేహద్ లో లేదు. నిర్బల ఆత్మలకు మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శుద్ధ వైబ్రేషన్ల వాయుమండలం ద్వారా శక్తిశాలిగా చేయుటే వర్తమాన సమయంలో పిల్లలైన మీ పని. ఈ కార్యంలోనే సదా బిజీగా ఉంటున్నారా? కోర్స్ చేయు సమయం ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఫోర్స్ యొక్క కోర్స్ చేయించాలి. కోర్స్ చేయించువారు ఇతరులు కూడా తయారైనారు. కావున మీరు వాయుమండలాన్ని శక్తిశాలీగా చేయు సేవ చేయండి. ఎందుకంటే విశ్వపు వాయుమండలం రోజు రోజుకు మాయావీగా అవుతూ పోతుంది. మాయ కూడా చివరి అవకాశంలో తన యంత్ర, మంత్ర, జంత్రాలు తన వద్ద ఉన్నవన్నీ ఉపయోగిస్తుంది. దాడి అయితే చేస్తుంది కదా. ఇలాగే వీడ్కోలు తీసుకోదు. కనుక ఇలాంటి వాయుమండలం మధ్య మీ సెంటర్ వాయుమండలాన్ని చాలా అవ్యక్తంగా, శక్తిశాలిగా తయారు చేయండి. మీ జడ మందిరాల వాయుమండలం ఎలాంటి ఆత్మనైనా తనవైపు ఆకర్షిస్తుంది. అశాంతిగా ఉన్నవారు అల్పకాలానికి శాంతమైపోతారు. జడచిత్రాలున్న స్థానాల్లో ఇలాంటి వాయుమండలముంటే చైతన్య సేవా స్థానాల్లో ఎలాంటి శక్తిశాలి వాయుమండలముండాలి? ఈ రోజు వాయుమండలం శక్తిశాలిగా ఉందా? అని పరిశీలించండి. వచ్చినవారు ఎవరైనా వ్యక్తము మరియు వ్యర్థ మాటలకు అతీతమైపోవాలి. నడుస్తూ నడుస్తూ అనేక రకాల విఘ్నాలు వస్తాయి లేక ఏదైనా వ్యక్త భావములోకి వచ్చేస్తారు. అందుకు కారణం వాయుమండలంలోకి వ్యక్త భావము. అవ్యక్త భావముంటే, వ్యక్త భావపు మాటలు తెచ్చినవారు పరివర్తనైపోతారు. జడ మందిరాల్లో అల్పకాలము కొరకు మారుతారు కదా. ఇది సదా కాలపు మాట ఎందుకంటే అది జడము, ఇది చైతన్యం. కనుక ఇప్పుడు కేవలం భాషణం లేక ప్రదర్శినీల లిస్ట్ తయారు చేయరాదు. దీనితో పాటు శక్తిశాలి వాయుమండలాన్ని కూడా పరిశీలించండి.

వాయుమండలాన్ని శక్తిశాలీగా చేయు సాధనమేది? మీ అవ్యక్త స్వరూప సాధనం. ఇదే సాధనం దీనిపై పదే పదే గమనమివ్వాలి. సాధన చేయు మాట పైనే గమనముంటుంది. ఒకే కాలిపై నిలబడే సాధన ఉంటే దీనిపై పదే పదే అటెన్షన్ ఉంటుంది. కనుక ఇది సాధన అంటే పదే పదే అటెన్షన్ ఇచ్చే తపస్సు, నేను అవ్యక్త ఫరిస్తాగా ఉన్నానా? అని చెక్ చేసుకోండి. స్వయం మీరే కాకుంటే ఇతరులను ఎలా చేస్తారు.

తండ్రి ద్వారా లభించే సూచనలను అర్థము చేసుకొని నడుస్తూ ఉండండి. పురుషార్థము ఎలా చేయాలని అడిగే సమయం దాటిపోయింది. మీరే అడుగుతూ ఉంటే ఇంకా వచ్చేవారు ఏమి చేస్తారు? అందుకే భిన్న భిన్న పురుషార్థము చేయుటకు యుక్తులు వినిపించారు. అందులో ఒక యుక్తిని స్వీకరించినా స్వయం సఫలమగుటే కాక ఇతరులను కూడా సఫలం చేయగలరు. కనుక ఇప్పుడు ఎలా చేయాలి, ఏమి చేయాలనే భాష సమాప్తం చేయండి. మురళీలో ప్రతి రోజు ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే మాటలకు సమాధానం లభిస్తుంది. మరలా అడుగుతున్నారంటే మురళీని ఆచరించే శక్తి తక్కువగా ఉంది.

అయినా సేవాధారీ పిల్లలందరినీ బాప్ దాదా సమాన సాథీలుగా అంటే మిత్రులుగా భావిస్తారు. అందుకే స్నేహితులకు అభినందనలు. అయితే మీ ఫ్రెండ్ సమానంగా అలాగే సదా సఫలతా మూర్తులుగా కండి. ఒక ఫ్రెండ్ సదా సఫలతామూర్తిగా ఇంకొకరు మెల్ల మెల్లగా నడిచేవారిగా ఉంటే చేతిలో చెయ్యి కలిపి ఎలా నడుస్తారు. ఫ్రెండ్ అంటేనే జతగాడు వెనక వచ్చేవారిని ఫ్రెండ్ అని అనలేరు. తండ్రి ఏమో లక్ష్యానికి దగ్గరగా ఉండి పిల్లలు ఆగుతూ, నడిచేవారుగా ఉంటే లక్ష్యాన్ని చేరుటకు బదులు చూచేవారి లైన్ లో వస్తారు. కనుక ఇలా అయితే లేదు కదా? జతలో నడిచేవారు కదా! 

పార్టీలతో :- అందరూ స్వయాన్ని మోస్ట్ లక్కియెస్ట్ గా అత్యంత అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మనం ఏమి చూశామో, ఏమి పొందామో అది విశ్వములోని ఆత్మలు పొందలేదని అనుభవం చేస్తున్నారా? వారు ఒక బిందువు కొరకు దప్పికగొని ఉన్నారు. మీరందరూ మాస్టర్ సాగరులైపోయారు. కావున మోస్ట్ లక్కియెస్ట్ అయ్యారు కదా. ఇలా మీ భాగ్యాన్ని అర్థము చేసుకొని సదా నడుస్తున్నారా? పూర్తి రోజంతా గుర్తుంటుందా లేక ప్రవృత్తిలో మరచిపోతారా. మీ వస్తువును ఎప్పుడూ మరవరు. మీ వస్తువుపై అధికారం ఉంటుంది కదా? తండ్రిని తమవారిగా చేసుకున్నారు. అందుకే అధికారముంటుంది కదా. అధికారులు ఎప్పుడూ మరచిపోరు. 

నిరంతరం స్మృతిలో ఉండుటకు సహజ సాధనం:- ప్రవృత్తిలో ఉంటూ (పరవృత్తి) అతీతంగా ఉండుట. పరవృత్తి అనగా ఆత్మిక రూపం. ఇలా సదా ఆత్మిక రూపంలో ఉండువారు సదా న్యారా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారు. ఎంత పని చేసినా, పని చేసినట్లుకాక ఒక ఆటగా అనుభవమవుతుంది. ఆటలో మజా వస్తుంది కదా. అందుకే సహజమనిపిస్తుంది. కనుక ప్రవృత్తిలో ఉండి ఆడుకుంటున్నారు, బంధనంలో లేరు. స్నేహము, సహజయోగముతో పాటు శక్తిని కలపండి. అప్పుడు మూడింటి బ్యాలెన్స్ ద్వారా హైజంప్ చేస్తారు. ఈ నూతన సంవత్సరంలో స్వయాన్ని తండ్రి సమానంగా చేసుకొని, నలువైపులా తెలిపిస్తూ ఉన్న ఆత్మలకు లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యి దారి చూపుతూ పోండి. ప్రతి ఆత్మకు ఏదో కొంత తప్పక ఇవ్వాలనే లక్ష్యముంచుకోండి. ముక్తి కావాలంటే ముక్తిని, జీవన్ముక్తి కావాలంటే జీవన్ముక్తిని. ఎవరైనా ముక్తి కావాలనేవారుగా ఉంటే వారికి కూడా తండ్రి పరిచయమునిచ్చి ముక్తిని వరదానంగా ఇవ్వండి. అలా చేస్తే సర్వుల పట్ల మహాదానీ, వరదానీగా అవుతారు. మీ మీ స్థానాల సేవనైతే చేస్తున్నారు. కానీ ఇప్పుడు బేహద్ విశ్వకళ్యాణకారులుగా కండి. ఒకే స్థానంలో ఉంటున్నా మనసా శక్తి ద్వారా వాయుమండలం, మరియు వైబ్రేషన్ల ద్వారా విశ్వ సేవ చేయవచ్చు. ఇటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాయుమండలం శక్తిశాలిగా తయారవ్వాలి.

Comments