04-01-1980 అవ్యక్త మురళి

04-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వర్తమాన రాజ్యధికారులే భవిష్యత్తులో రాజ్యాధికారులు.

అందరూ తమను డబల్ రాజ్యాధికారులుగా భావిస్తున్నారా? వర్తమానంలోనూ రాజ్యధికారులే, భవిష్యత్తులో కూడా రాజ్యాధికారులే. వర్తమానము, భవిష్యత్తుకు దర్పణము. వర్తమాన స్థితి ద్వారా అనగా దర్పణం ద్వారా తమ భవిష్యత్తును స్పష్టంగా చూడగలరు. వర్తమానం మరియు భవిష్యత్తులో రాజ్యాధికారులుగా అయ్యేందుకు - "నాలో పాలనా శక్తి ఎంత ఉంది, విశేష కార్యాన్ని చేసే సూక్ష్మ శక్తులైన సంకల్ప శక్తి, బుద్ధి, సంస్కారాలపై ఎంత అధికారముంది" అని సదా చెక్ చేసుకోండి. విశేషించి ఈ మూడు శక్తులు రాజ్యాధికారులుగా చెయ్యడంలో సదా సహయోగులు అనగా రాజ్య వ్యవహారాలు నడిపించే ముఖ్యమైన సహయోగీ కార్యకర్తలు. ఈ ముగ్గురు కార్యకర్తలు మీ ఆత్మ అనగా రాజ్యాధికారి రాజు సూచనపై నడుస్తూ ఉంటే ఆ రాజ్యం సదా యథార్థ పద్ధతితో నడుస్తుంది. ఎలాగైతే తండ్రి కూడా ముగ్గురు మూర్తుల ద్వారానే కార్యం చేయించాల్సి వస్తుందో, అందువలన త్రిమూర్తి రూపానికి విశేషించి గాయనం మరియు పూజ జరుగుతూ ఉందో, అందుకే త్రిమూర్తి శివ అని అంటారో, ఒక్క తండ్రికి విశేషించి ముగ్గురు కార్యకర్తలు ఉండి వారి ద్వారా విశ్వ కార్యాన్ని చేస్తున్నారో అలా ఆత్మలైన మీరు రచయితలు, ఈ మూడు శక్తులు అనగా త్రిమూర్తి శక్తులు మీ విశేషమైన కార్యకర్తలు. మీరు కూడా ఈ మూడు రచనలకు రచయితలు. కనుక “త్రిమూర్తి రచన తమ అధీనంలో ఉందా?” అని చెక్ చేసుకోండి.

మనసు అనగా ఉత్పత్తి చేసేది అనగా సంకల్పాలను రచించేది. బుద్ధి నిర్ణయించేది అనగా పాలన సమానమైన పని చేసేది. సంస్కారం మంచి, చెడులను పరివర్తన చేయించేది. ఎలాగైతే బ్రహ్మాబాబా ఆదిదేవునిగా ఉన్నారో అలా మొదటి ఆదిశక్తి మనసు అనగా సంకల్ప శక్తి. ఆదిశక్తి యథార్థంగా ఉంటే ఇతర కార్యకర్తలు వారి తోడుగా ఉన్న శక్తులు కూడా యథార్థంగా పని చేస్తాయి. కనుక - ఆత్మ రాజునైన నా మొదటి కార్యకర్త సదా సమీప సాథీ సమానంగా సూచనపై నడుస్తున్నదా? అని మొదట చెక్ చేసుకోండి. ఎందుకంటే మాయ శత్రువు కూడా మొదట ఈ ఆదిశక్తిని(మనసును) తిరుగుబాటు చేసే విధంగా అనగా ద్రోహిగా తయారు చేస్తుంది, రాజ్యాధికారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందువలన ఆదిశక్తిని(మనసును) సదా తమ అధికార శక్తి ఆధారంతో సహయోగిగా, విశేష కార్యకర్తగా చేసుకొని నడిపించండి. ఎలాగైతే రాజు స్వయంగా ఏ కార్యమూ చేయడో, చేయిస్తాడో, రాజ్య వ్యవహారం చేయువారు వేరుగా ఉంటారో, ఒకవేళ రాజ్య వ్యవహారం సరిగ్గా లేకపోతే రాజ్యం కదిలిపోతుందో అలా ఆత్మ కూడా చేయించేది. చేసేవి విశేషించి ఈ త్రిమూర్తి శక్తులు. మొదట వీటిపై పాలన చేసే శక్తి(రూలింగ్ పవర్) ఉంటే ఈ సాకార కర్మేంద్రియాలు దీని ఆధారంతో స్వతహాగానే సరైన మార్గంలో నడుస్తాయి. కర్మేంద్రియాలను నడిపించేది కూడా విశేషంగా ఈ మూడు శక్తులే. ఇప్పుడు వీటిపై రూలింగ్ పవర్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోండి.

ఎలాగైతే డబల్ విదేశీయులుగా ఉన్నారో అలా డబల్ అధికారులుగా ఉన్నారా? ప్రతి ఒక్కరి రాజ్య వ్యవహారం అనగా స్వరాజ్యం సరిగ్గా నడుస్తున్నదా? ఎలాగైతే సత్యయుగ సృష్టిలో ఒకే రాజ్యం, ఒకే ధర్మం అని అంటారో అలా ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యం అనగా స్వంత సూచనతోనే(ఆజ్ఞానుసారమే) అన్నీ నడిచే విధంగా ఉండాలి. ఒకే ధర్మం అనగా ఒకే ధారణ అందరికీ ఉండాలి అనగా సదా శ్రేష్ఠమైన ఆచరణ కలిగి వృద్ధి కళలో(ఉన్నతి చెందే కళలో) నడవాలి. మనసు తన మతాన్ని నడిపిస్తూ, బుద్ధి తన నిర్ణయ శక్తితో అలజడి చేస్తూ, కల్తీ చేస్తూ ఉంటే సంస్కారం ఆత్మను కూడా నాట్యం చేయించేదిగా అయిపోతే దానిని ఒకే ధర్మం అనీ అనరు, ఒకే రాజ్యమనీ అనరు. కనుక మీ రాజ్య పరిస్థితి ఎలా ఉంది? త్రిమూర్తి శక్తులు సరిగ్గా ఉన్నాయా? అప్పుడప్పుడు సంస్కారం కోతిలా నాట్యం చేయించడం లేదు కదా? కోతి ఏమి చేస్తుంది? క్రిందికి, పైకి గంతులేస్తుంది కదా. అలా సంస్కారం కూడా ఇప్పుడిప్పుడే ఉన్నత కళ, ఇప్పుడిప్పుడే దిగిపోయే కళలో ఉంటే ఇది కోతి నాట్యం కదా! కావున మీ సంస్కారం మిమ్ములను నాట్యం చేయించడం లేదు కదా? అన్నీ అధీనంలోనే ఉన్నాయి కదా? బుద్ధి ఎప్పుడూ కలీ చేయడం లేదు కదా? ఎలాగైతే ఈ రోజుల్లో కత్తీ చేస్తారో అలా నిర్ణయశక్తి కూడా కల్తీ చేస్తుంది. ఎప్పుడూ బుద్ధి కల్తీ చేయడం లేదు కదా! ఇప్పుడిప్పుడే యథార్థత, ఇప్పుడిప్పుడే వ్యర్థం ఉంటే కల్తీ అయినట్లే కదా! 

విదేశాలలో మాయ వస్తుందా? విదేశీయుల వద్దకు మాయ రాకూడదు. ఎందుకంటే విదేశాలలో వర్తమాన సమయంలో కొంచెం సమయంలోనే ఉన్నతంగా పైకీ ఎక్కుతారు, క్రిందకూ పడిపోతారు. కనుక కొద్ది సమయంలోనే అన్ని రకాల అనుభవాలు చేసి అన్నీ పూర్తి చేసుకున్నారు. ఎలాగైతే ఏ పదార్థమునైనా చాలా ఎక్కువగా తింటే మనసు నిండిపోతుందో, ఇక కోరిక అనేది ఉండదో అలా విదేశాలలో కూడా అన్నీ ఫుల్ ఫోర్సులో ఉన్న కారణంగా విదేశీ ఆత్మలు ఇప్పుడు వీటితో అలసిపోయారు. ఎవరైతే అలసిపోయి ఉంటారో వారికి విశ్రాంతి లభిస్తే వారు అలా పడుకుంటూనే నిద్రలోకి వెళ్లిపోతారు. గాఢ నిద్రను అనుభవం చేస్తారు. కావున విదేశీయులకు మాయ కొద్ది సమయంలోనే చాలా అనుభవం చేయించింది. ఇప్పుడేం చెయ్యాలి? ఏ కొత్త వస్తువు కొరకు వెతికేవారో అది లభించింది కదా. మరలా మాయ ఎందుకు వస్తుంది? రాకూడదు కదా! మరలా ఎందుకు వస్తుంది? (మాయకు పాత ఖాతాదారులు). మాయకు కూడా మంచి కొత్త గిరాకులు లభిస్తే పాతవారిని స్వతహాగానే వదిలేస్తుంది. రూలింగ్ పవర్ ఉన్నవారి వద్దకు మాయ రాలేదు. కార్యకర్తలందరూ తెలివిగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే అక్కడ మాయ ధైర్యం చెయ్యలేదు. రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది? అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ శక్తి లేకుంటే అందుకు కారణమేమి? కారణాన్ని నివారణలోకి పరివర్తన చెయ్యండి. కారణం సమాప్తమవ్వడం అనగా మాయ సమాప్తమైపోయినట్లే. మాయ ముఖ్య స్వరూపం కారణ రూపంలో వస్తుంది. కారణాన్ని నివారణ నివారణ రూపంలోకి పరివర్తన చేసుకుంటే మాయ సదాకాలం కొరకు సమాప్తమైపోతుంది.

ఈ రోజు కలుసుకునేందుకు వచ్చారు. మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు మురళి ముందు మాయ అర్హణమయ్యేలా మురళీధరులుగా అవ్వండి. ఇలాంటి మురళీధరులుగా ఉన్నారా? లేక ఆ స్టూలమైన మురళిని వాయించేవారిగా ఉన్నారా? అది చాలా బాగా వాయిస్తారు. ఇందులో కూడా మురళీధరులుగా కండి. మాయను అధీనం చేసుకునే మురళి. ఈ వాయిద్యాన్ని కూడా మోగించగలరు కదా? సంగీత వాయిద్యాలను మోగించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఏ సమయంలో ఏ వాయిద్యం మోగించినా ఆ సమయంలో మాయాజీత్ గా అయ్యే రహస్య రాగం కూడా వస్తుందా? అని ఆలోచించండి. ఈ రహస్య రాగాన్ని సదా మోగిస్తూ ఉంటే మాయ సదాకాలానికి సమర్పణైపోతుంది. ఇలాంటి వాయిద్యము మోగించడం వస్తుందా? విదేశీయులు కూడా కోటాను రెట్లు భాగ్యశాలురుగా ఉన్నారు. దూరం నుండి వస్తారు కనుక అవకాశం కూడా కోటాను రెట్లు లభిస్తుంది. ఈ దేశం వారు ఒక సంవత్సరంలో ఎంత తీసుకుంటారో దాని కంటే ఎక్కువగా విదేశీయులకు కొద్ది సమయంలోనే ప్రాప్తిస్తుంది. వారికి విశేష పాలన లభిస్తోంది.

అందరి దృష్టి విశేషంగా విదేశీయులపై ఉంటుంది. కావున విశేషించి పాలనా రూపాన్ని ప్రత్యక్ష ఫలం రూపంలో విశేషంగా చూపించాల్సి ఉంటుంది. ఎలాగైతే స్థాపన సమయంలో విశేష పాలన జరిగిందో అలా ఇప్పుడు కూడా మీకు విశేష పాలన జరుగుతూ ఉంది. మొదట పాలన తీసుకున్నవారు ఆ పాలనకు బదులుగా సేవను స్థాపన చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? సేవను సమాప్తి చేస్తారు. సంపూర్ణత లేక ప్రత్యక్షతా పేరును ప్రసిద్ధి చేస్తారు? ఇప్పుడు మీరు(విదేశీయులు) సమాప్తి తేదీని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ మీ కొరకే ఎదురు చూస్తున్నారు. బాప్ దాదాను వినాశనం ఎప్పుడవుతుందని అని ఎవరైనా అడిగితే విదేశీయులను అడగండని చెప్తాను. దేశంలో ఉన్నవారు స్థాపనా బాధ్యత తీసుకున్నారు. విదేశీయులు కూడా ఏదో ఒక బాధ్యతను తీసుకుంటారు కదా! విదేశం వినాశనమయ్యేదే,
భారతదేశం అవినాశే కనుక భారతవాసులు స్థాపనా కార్యం చేశారు. విదేశీయులు వినాశన కార్యంలో విశేషంగా నిమిత్తమవుతారు. భారతవాసి పిల్లలు యజ్ఞ స్థాపనలో తమ ఆహుతులను వేసి స్థాపన చేశారు. యజ్ఞాన్ని రచించారు. మీరు అంతిమ ఆహుతి వేసి సమాప్తం చెయ్యండి. అప్పుడు మరలా జయ జయ ధ్వనులు అవుతాయి. ఇప్పుడు త్వర త్వరగా అంతిమ ఆహుతిని వెయ్యండి. అందరూ కలిసి ఒక్క సంకల్పాన్ని స్వాహా చేసినట్లయితే సమాప్తమైపోతుంది. దీని తారీఖు ఎప్పుడు చెప్తారు? 80 లో చేస్తారా ? లేక 81 లో చేస్తారా? ఈ తారీఖు చెప్పండి. (ఒక్కసారి మధువనానికి మరలా రావాలి). వినాశనం మొదలవుతే సదాకాలానికి వచ్చేస్తారు. అందుకే ఇక్కడ పెద్ద హాలు నిర్మిస్తున్నారు. కేవలం మీ వైర్లెస్ సెట్ బాగుండాలి. ఇక్కడ వైర్ లెస్ (తీగలు లేకపోవడం) అనగా నిర్వికారి స్థితి. వైర్లతో సంబంధం లేకుండా “మీరు వచ్చేయండి” అనే ధ్వని మీకు చేరుకుంటుంది. ఒకవేళ వైర్‌లెస్ సెట్ లేకపోతే ధ్వని కూడా ఉండదు. డైరక్షన్ లభించజాలదు. స్థూల సాధనాల ద్వారా ధ్వని రాదు. నిర్వికార బుద్ధియే ఈ అంతిమ డైరక్షన్ ను క్యాచ్ చేయగల్గుతుంది. అందువలన మీరు త్వర త్వరగా చేస్తే సమయం కూడా త్వర త్వరగా వచ్చేస్తుంది. మొదట శక్తిశాలి మైకును తయారుచెయ్యండి. ఈ మైకు ద్వారా ధ్వని భారతదేశానికి చేరుకోవాలి. ఎలాగైతే వారి ఎలక్షన్ (ఎన్నికలు) జరుగుతున్నపుడు ఒక రోజు ముందు ప్రచార సాధనాలన్నీ అపేస్తారో, ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుందో అలా మొదట మైకు ద్వారా ధ్వనిని వ్యాపింపజేయండి. తర్వాత అది కూడా శాంతిగా (సైలెన్స్ గా) అయిపోతుంది. తర్వాత రిజల్ట్ వెలువడ్తుంది. ఇప్పుడు ప్రచారం చేసే మైకును ఎంతవరకు తయారు చేశారు? మొదట ధ్వని వ్యాపిస్తుంది. తర్వాత ఎంత సంపూర్ణ శాంతిగా అయిపోతుందంటే దానిని బట్టి ధ్వనిని వ్యాపింపజేసే పాత్ర కూడా సమాప్తమైపోతుంది. తర్వాత మరలా పరివర్తనవుతుంది. ఇప్పుడు మొదటి స్టేజ్ నడుస్తున్నది కదా. మొదటి స్టేజ్లో సమయం పడుతుంది. రెండవ దానిలో అంత సమయం పట్టదు.

ఆస్ట్రేలియా పార్టీతో - ఆస్ట్రేలియా పిల్లలలో గల అన్నిటికంటే గొప్ప విశేషత ఏమిటో తెలుసా? ఆస్ట్రేలియా వారు తమ ఇతర ధర్మంలో పాత్రను అభినయించుటకు నిమిత్తమాత్రం సమయముండేదో ఇప్పుడా సమయం సమాప్తమైపోయింది. అందువలన తమ ధర్మం యొక్క పరిచయం లభించగానే సహజంగా, త్వరగా వచ్చేశారు, ఇతరులను కూడా బయటకు తీయాలని చాలా ఉత్సాహముంది. కనుక దీనిని బట్టి తాత్కాలిక సమయం కొరకు ఇతర ధర్మంలోకి వెళ్లారో, అది ఇప్పుడు సమాప్తమైపోయిందని ఋజువవుతుంది. అందువలన ఇది కూడా విశేషతే. ఎవరు వచ్చినా మెజారిటి మనవాళ్లుగా అనిపిస్తారు. ఇతర ధర్మానికి చెందినవారిగా అనిపించరు. ఆస్ట్రేలియన్లు లేక విదేశీయులుగా ఉన్నా తపన కల్గిన ఛాత్రక ఆత్మలుగా అనిపిస్తారు. కనుక ఆత్మ తపన మన ధర్మం వారే అని ఋజువు చేస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా. పొరపాటున మరొక కొమ్మలోకి వెళ్లిపోయామని అనిపిస్తుంది.సేవ కొరకు ఇది కూడా కొద్ది సమయం పాత్ర లభించింది. లేకుంటే విదేశాల సేవ ఎలా జరుగుతుంది? అక్కడి వారిని నిమిత్తంగా చేసుకొని విదేశీ సేవ చేయిస్తున్నారు. ఎలాగైతే కల్పం ముందు పాండవులు గుప్త వేషంలో ఇక్కడకు, అక్కడకు సేవ కొరకు వెళ్లారని గాయనం ఉందో అలా పాండవ సైన్యమైన మీరు కూడా రూపాన్ని, ధర్మాన్ని మార్చుకొని సేవ కోసం వెళ్లారు. కాని మీరు పాండవ సైన్యమే. ఇప్పుడైతే ధర్మం, దేశం, గుణాలు, కర్తవ్యం అన్నీ మారిపోయాయి కదా? మీరు అక్కడ ఉంటున్నా ఆస్ట్రేలియా నివాసులకు బదులు తమను మధువన నివాసులుగా భావించి ఉంటున్నారు కదా! మీ పుట్టినిల్లు మధువనము. సాకారంలో మధువనము, నిరాకారంలో పరంధామము. ఆస్ట్రేలియా మీ ఆఫీసు(కార్యాలయం). ఎలాగైతే ఆఫీసుకు పని చెయ్యడానికి వెళ్తారో అలా మీరు కూడా సేవ చేయుటకు వెళ్తున్నారు. ఆఫీసుకు వెళ్లి ఇంటిని మర్చిపోరు కదా. కనుక ఎవరైనా మీ ఇంటి అడ్రస్సు అడిగితే ఏమిస్తారు? (పాండవ భవన్). ఇదే స్మృతిలో ఉండుట వలన సదా ఉపరామ స్థితిలో ఉంటారు. ఆఫీసు వస్తువులలో ఎప్పుడూ ఆకర్షణ ఉండదు. ఎందుకంటే ఆ వస్తువులు సేవ కొరకని, మనవి కాదని భావిస్తారు. కనుక ఇక్కడ కూడా అలాగే ఉపరాంగా ఉన్నారు కదా? ఎంత ప్రియమైన వస్తువైనా కావచ్చు, లేక ఆకర్షించే సేవలో తోడుగా ఉండేవారు కావచ్చు కాని ఆఫీసులో పని చేసేవారి కొరకు నియమం ఉంటుంది. పని చేయుట కొరకు మాత్రమే తోడుగా ఉంటారు తర్వాత అతీతంగా అవుతారు. ఒకవేళ పొరపాటుగా పరస్పరంలో ప్రేమ కలుగుతే మంచివారని అంగీకరించరు. ఇంట్లోవారితో స్నేహముంటుంది, ఆఫీసువారితో పని నడిపించడం ఉంటుంది. కనుక ఇలా నడవండి.

ఆస్ట్రేలియా వారు సేవను పెంచారు కదా. ఇప్పుడు అక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి? (5). ప్రతి ఒక్కరూ రాజ్య పాలన చేయుటకు తమ-తమ ప్రజలను తయారుచేసుకోల్సిందే కదా. (వినాశనంలో మా పరిస్థితి ఏమవుతుంది) వినాశనంలో ఆస్ట్రేలియా మొత్తం ఒకే ద్వీపంగా అయిపోతుంది. కొంచెం నీటిలోకి వచ్చేస్తుంది, కొంచెం పైన ఉంటుంది. మీరు సురక్షితంగా ఉంటారు. వినాశనానికి ముందే మీకు ధ్వని చేరుకుంటుంది. అప్పుడు మీరందరూ సురక్షిత స్థానానికి చేరుకుంటారు. తర్వాత వినాశనమవుతుంది. ఎలాగైతే భట్టీలో పిల్లి పిల్లలు సురక్షితంగా ఉన్నాయని గాయనముందో అలా ఏ పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటారో వారు వినాశనంలో వినాశనం కారు, స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. వినాశన పరిస్థితుల మధ్య శరీరాన్ని వదలరు. దీని కొరకు ఒకటి బుద్ధి లైన్ క్లియర్ గా ఉండాలి, రెండవది అశరీరిగా అయ్యే అభ్యాసం చాలా ఉండాలి. ఏమి జరిగినా మీరు అశరీరిగా అయిపోండి. తమంతట తాము శరీరాన్ని వదిలేయాలనే సంకల్పం చేసినప్పుడు సంకల్పం చేస్తూనే వెళ్లిపోతారు. దీని కొరకు చాలా సమయం నుండి అభ్యాసం కావాలి. చాలా సమయం నుండి స్నేహీ, సహయోగులుగా ఉన్నవారికి అంతిమంలో తప్పక సహాయం లభిస్తుంది. ఎలాగైతే స్థూల వస్త్రాలను వదిలేస్తారో అలా శరీరాన్ని వదిలేస్తారు. రోజంతటిలో నడుస్తూ నడుస్తూ మధ్య మధ్యలో అశరీరిగా అయ్యే అభ్యాసం తప్పకుండా చెయ్యండి. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ రికార్డు మ్రోగినప్పుడు అక్కడ పనిలో ఉంటున్నా మధ్య మధ్యలో తమ కార్యాన్ని(దినచర్యను) తామే సెట్ చేసుకుంటే లింక్ జోడింపబడుంది. దీనితో అభ్యాసం అవుతూ ఉంటుంది.

మీలో ఈ విశేషత కూడా ఉంది - ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగం వదిలిపెట్టగలరు, చేయాలంటే చేయవచ్చు. మీరు నిర్భంధనులు. కేవలం మనసు మరియు సంస్కారాల బంధన ఉండరాదు. అలాగే దేహము, దేహ ధర్మాల నుండి ఫ్రీగా ఉండాలి. సగం బంధనాల నుండి ముందే ఫ్రీగా ఉన్నారు. ఇక మిగిలిన బంధనాలను స్మృతి మరియు సేవ ద్వారా సమాప్తి చెయ్యండి. అందరూ హైజంప్ చేసేవారిగా ఉన్నారు. 

Comments