04-01-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంపూర్ణత అనే దర్పణంలో నిజ స్వరూపాన్ని చూసుకోండి.
విశ్వకళ్యాణకారి త్రిమూర్తి శివబాబా తన పిల్లలతో మాట్లాడిన మహావాక్యాలు -
ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ యొక్క ఇప్పటి వరకు గల జీవితంలో బ్రాహ్మణుల యొక్క విశేష కర్తవ్యం అయిన వినాశనం మరియు స్థాపన అనే కర్తవ్యం ఎంత వేగంగా చేస్తున్నారు? ఎంత వరకు తమ కర్తవ్యం యొక్క భాధ్యతను నెరవేర్చారు? మరియు ఇంకా ఎంత మిగిలి ఉంది అని కర్తవ్య వేగాన్ని చూస్తున్నారు. కర్తవ్యం ఆధారంగా బ్రాహ్మణుల యొక్క విశేష టైటిల్స్ - విశ్వ కళ్యాణకారి, విశ్వ ఆధారమూర్తి, విశ్వ ఉద్దారమూర్తి, విశ్వ పరివర్తకులు బిరుదుని అనుసరించి కర్తవ్యం యొక్క ప్రత్యక్ష రూపం ఎంత వరకు తయారయ్యింది మరియు ఇంకా ఎంత తయారవ్వాలి అని ప్రతి ఒక్కరు కర్తవ్యం యొక్క శాతాన్ని చూసుకోండి. సమయాన్ని అనుసరించి ఇంత వరకు వేగం తీవ్రంగా ఉందా లేక ఇప్పుడు ఇంకా తీవ్రము అవ్వాలా? స్వయం పరిశీలించుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే వినాశనం మరియు స్థాపన అనే కర్తవ్యం స్వయంలో ఎంత వరకు చేశాను? అంటే గత పాత కర్మలఖాతా, స్వభావ, సంస్కారాలు ఎంత వరకు వినాశనం చేసుకున్నాను? మరియు క్రొత్త స్వభావ సంస్కారాలను అంటే బాబా సమాన సంస్కారాలను ఎంత వరకు స్థాపన చేసుకున్నాను? పూర్తిగా వినాశనం చేశారా లేక సగం చేశారా? పాతవాటిని ఎంతగా వినాశనం చేస్తారో అంతగా క్రొత్త స్వభావ సంస్కారాలను ధారణ చేయగలరు. కనుక ఈ కార్యాన్ని ఎంత వేగంతో చేస్తున్నాను అని పరిశీలించుకోండి.
రెండవ విషయం - స్వయం యొక్క సంప్రదింపుల్లోకి వచ్చే ఆత్మలు లేదా సంబంధంలో ఉండే ఆత్మల యొక్క పాత స్వభావ సంస్కారాలను చూస్తూ చూడకండి. అంటే మీ కర్తవ్యం యొక్క స్మృతి ద్వారా లేదా మీ బిరుదు యొక్క సమర్థత ద్వారా ఆ ఆత్మలను కూడా పరివర్తన చేసే కార్యం యొక్క వేగం ఎంత ఉంది? ఇంటి నుండి ఉద్దరణ ప్రారంభించారా? ఎంత తమోగుణి ఆత్మ అయినా కాని బ్రాహ్మణులైన మీ కర్తవ్యాన్ని అనుసరించి ఇటువంటి ఆత్మల పట్ల కూడా కళ్యాణ భావన ఉంటుందా? లేక అసహ్య భావన ఉంటుందా? దయ వస్తుందా లేక ప్రభావంలోకి వస్తున్నారా? ప్రభావంలోకి వచ్చేసి మాటిమాటికి బాబా ముందు లేదా నిమిత్త ఆత్మల ముందు ఆ ఆత్మల గురించి వీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఇలా ఎందుకు? అంటూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
మూడవ విషయం - విశ్వంలోని సర్వాత్మల పట్ల సదా సంకల్పంలో కళ్యాణం చేయాలనే స్మృతి ఉంటుందా! బేహద్ సేవ అనగా విశ్వసేవకు భాధ్యతాదారిగా భావించి నడుస్తున్నారా? విశ్వానికి మనస్సు ద్వారా మీ శక్తులు, జ్ఞానం, గుణాల ఖజానాను మహాదానియై దానం చేస్తున్నారా? స్వయాన్ని విశ్వం ముందు అధికారిగా భావిస్తున్నారా? లేక మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ గ్రామానికి లేదా దేశానికి అధికారిగా భావిస్తున్నారా? ఏ సేవ ప్రత్యక్ష స్మృతిలో ఉంటుంది? ఎదురుగా హద్దు వస్తుందా లేక బేహద్ వస్తుందా? శక్తిశాలి సంకల్పం ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ సేవ చేయాలి మీ సంకల్పంలో అంత సమర్థత ఉందా? మీ వృత్తి యొక్క శుద్దత ద్వారా వాయుమండలం శుద్ధి అయిపోవాలి. వృత్తిలో అంత శక్తి ఉందా? శుద్ధత అంటే పవిత్రత. పవిత్రతకి ఆధారం - సోదరులు అనే స్మృతి యొక్క వృత్తి. వృత్తి ఈ విధంగా ఎంత వరకు తయారయ్యింది? ఈ విధంగా మీ కర్తవ్యం యొక్క వేగం మరియు విధిని పరిశీలించుకోండి. ఎంత వరకు అయితే స్వయంలో వినాశనం మరియు స్థాపనను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురారో అంత వరకు విశ్వంలో కర్తవ్యం ప్రత్యక్షమవ్వటం కూడా స్వయం యొక్క వేగాన్ని అనుసరించే ఉంటుంది. ఎందుకంటే ఈరోజుల్లో విశ్వాత్మలు చూసి వ్యాపారం చేసేవారు, కేవలం విని ఒప్పుకునేవారు కాదు. మీ యదార్థ సిద్ధాంతాలను వారు ఒప్పుకోవాలంటే ముందు మీరు ఆ సిద్ధాంతాల యొక్క స్వరూపంగా అవ్వాలి. ఆ స్వరూపం యొక్క ఉదాహరణ ద్వారా ఈ వ్యాపారం చాలా సహజమైనది అని అర్ధమవుతుంది. ఇప్పటి వరకు అనేక అల్పజ్ఞ అయదార్ధ సిద్ధాంతాల ద్వారా ఎక్కువమంది ఆత్మలు విశ్వ పరివర్తన లేదా స్వ పరివర్తన చాలా కష్టం లేదా అసంభవం అని అనుకుని కూర్చుని ఉన్నారు. దీని కారణంగా మనస్సు యొక్క బలహీనత అనే రోగం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో శారీరక రోగాల్లో గుండెపోటు అనేది ఎలాగైతే ఎక్కువగా ఉందో అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిలో మానసిక బలహీనత అనే రోగం ఎక్కువగా ఉంది. ఇలా మానసికంగా బలహీనంగా ఉన్న ఆత్మలకు ప్రత్యక్ష పరివర్తన ద్వారానే అంటే కళ్ళతో చూడటం ద్వారానే ధైర్యం లేదా శక్తి వస్తాయి. చాలా విన్నారు కానీ ఇప్పుడు చూడాలనుకుంటున్నారు. రుజువు చూసి పరివర్తన అవ్వాలనుకుంటున్నారు. కనుక విశ్వపరివర్తన కొరకు లేదా విశ్వ కళ్యాణం కొరకు సదా స్వకళ్యాణాన్ని ఉదాహరణగా చూపించండి. కర్తవ్యం గురించి ఏమి పరిశీలన చేసుకోవాలో ఇప్పుడు అర్థమైందా? విశ్వకళ్యాణం యొక్క సేవా క్షేత్రంలో సహజ సఫలతకు సాధనం - ప్రత్యక్ష రుజువు ద్వారా బాబాని ప్రత్యక్షం చేయటం. ఏది చెప్తున్నారో అది కనిపించాలి. మేము బ్రాహ్మణులం మాస్టర్ సర్వశక్తివంతులం, మాయాజీతులం, దయాహృదయులం, ఆత్మిక సేవాధారులం అని చెప్తున్నారు. కానీ మీరు ఏదైతే చెప్తున్నారో వాటి యొక్క ప్రత్యక్ష స్వరూపం చూడాలనుకుంటున్నారు. పేరు మాస్టర్ సర్వశక్తివంతులు కానీ స్వయం యొక్క వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తి చేసుకోలేకపోతే విశ్వ కళ్యాణకారి అని ఎవరు ఒప్పుకుంటారు! నడుస్తూ నడుస్తూ స్వయం యొక్క స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో బలహీనులు అయిపోయేవారిని విశ్వ పరివర్తకులు అని ఎవరు ఒప్పుకుంటారు! స్వయమే సహయోగం అడిగేవారిగా ఉంటే వరదాని అని ఎవరు ఒప్పుకుంటారు! అందువలన సంపూర్ణత అనే అద్దంలో స్వయం యొక్క స్వరూపాన్ని చూడండి. స్వయాన్ని సంపన్నంగా చేసుకుని ఉదాహరణ అవ్వండి. ఏమి చేయాలో అర్థమైందా! ఈ సంవత్సరం స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకుని విశ్వకళ్యాణకారి అవ్వండి. పరిశీలించుకోండి మరియు పరివర్తన కూడా అవ్వండి.
ముందుగా గుజరాత్ వారు దీక్ష చేయండి. వినడంలో ఎంత సంతోషం ఉంటుందో తయారవ్వడంలో కూడా అంతగానే సంతోషం ఉంటుంది. గుజరాత్ భూమి సాత్వికమైనది. కనుక గుజరాత్ వారు శ్యాంపిల్ గా తయారవ్వాలి. ఆ శ్యాంపిల్ ఎదురుగా కనిపిస్తుంది. గుజరాత్ ను విస్తరింపచేయడం విశేషమైనది. పాదయాత్ర కూడా చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇటువంటి విధిని తయారుచేయండి - ఎటువంటి వాయుమండలం ఉండాలంటే దీని ద్వారా విఘ్నములు వినాశనమైపోవాలి. విశ్వ చమత్కారముల ఆకర్షణ కూడా ఈ ఆత్మిక వాయుమండలం వైపుకు రావాలి. గుజరాత్‌ను లైట్‌హౌస్‌గా తయారుచేయండి. కేవలం గుజరాత్ ని లైట్ హౌస్ గా చేయడం కాదు, మొత్తం విశ్వమును లైట్ హౌస్ గా తయారు చేయాలి. దీని ద్వారా విశ్వ చమత్కారములకు స్వయం యొక్క మరియు తండ్రి యొక్క పరిచయము లభిస్తుంది. పరమాత్మ బాంబు యొక్క అభిషేకం చేయండి. ఇటువంటి పరమాత్మ బాంబును విసిరినట్లయితే ఆత్మలన్నీ తమ గమ్యం వైపు పరుగులు తీస్తాయి. మొదట గుజరాత్ ను మధువనంలో ఎందుకు ప్రారంభించారు? ఎవరైతే ముందుకు వస్తారో వారే అర్జునుడు అవుతారు. అర్జునుడు అనగా ప్రథమ స్థానంలో ఉన్నవారు. మంచిది.
ఈవిధంగా సదా సేవాధారి, ప్రతి సెకను, సంకల్పం, కూడా సేవ లేకపోతే శాంతి ఉండదు, అటువంటి నిరంతర యోగి, నిరంతర సేవాధారులకు, అన్ని రకాల సేవలో ప్రత్యక్షత ఫలాన్ని చూపించేవారికి, ఈ విధంగా ప్రత్యక్ష రుజువై విశ్వ కళ్యాణం చేసే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో కలయిక :-
1. సంగమయుగములో ప్రతి అడుగులో పదమాల సంపాదన జరుగుతుంది. సదా బాబా స్మృతిలో ఉంటే పదమాల సంపాదన చేసుకునే అవకాశం ఉన్నట్లేనా ? ప్రతి అడుగులో పదమాల సంపాదన అని ఏదైతే గానం చేస్తున్నారో అది ఎవరిది? మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. సంగమములో పదమాల సంపాదన జరుగుతుంది. మొత్తం కల్పంలో మళ్ళీ ఇటువంటి అవకాశం కనిపించదు. సంగమయుగమును జమ చేసుకునే యుగము అని అంటారు. సత్యయుగమును ప్రాలబ్ధమును పొందే యుగము అని అంటారు, కానీ జమ చేసుకునే యుగము అని అనరు. ఇది జమ చేసుకునే యుగము కనక పదేపదే మీరు సాగరం అంతటినీ జమ చేసుకోవాలనుకుంటారు. కనుక ఎంత జమ చేసుకుని ఉన్నారు?వాస్తవానికి, మీరు రైల్వే లేదా విమానయాన రంగంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ దీన్ని చేయవలసిన అవసరం లేదు. ఒక్క అడుగు, అంటే ఒక సెకను కూడా వృధా చేయకూడదు. ఎంతగానో అటెన్షన్ ఉండాలి.
సత్యయుగములో విశ్వమహారాజు లేక రాజుగా అయ్యేందుకు ఆధారం కూడా ఈ సమయమే. అయితే పెద్ద మహారాజు మరియు చిన్న మహారాజు ఏమి చెప్తారు? పెద్ద రాజుల వద్ద అసంఖ్యాకమైన రిపబ్లికన్ లు ఉంటారు, లేదంటే ఎంతో సంపాదన ఎలా జమ అయ్యి ఉంటుంది? సదా భండారా నిండుగా ఉంటుంది. ప్రాప్తించని వస్తువు అంటూ ఏదీ ఉండదు... అవి ఇప్పటి సంస్కారములే. తృప్తాత్మ ముందు ఇవన్నీ కూడా ఏమీ కాదు కదా? అవన్నీ కూడా ముళ్ళువంటివి. కొద్దిగా సహాయమును ఇవ్వండి, ఇది ఇలా కాదు, సహాయం లభించాలి,స్కేల్ మరింత ముందుకు వెళితే అది ముందుకు సాగుతుందా లేదా అనేది రుజువు అవుతుంది. కనుక తృప్తికరమైన మరియు ఆదర్శవంతమైన ఆధ్యాత్మికత ఏమిటి?బాప్ దాదా అయితే స్వతహాగానే దాతగా ఉన్నారు. కానీ వారిని నిందించారు. వారికి ఆ దాదా కూడా అవసరం లేదు కనుక ఇటువంటి తృప్త ఆత్మ భవిష్యత్తులో అఖండ ఖజానాలతో ఉంటుంది. ఇప్పటినుండి ఆ సంస్కారము నింపుకుంటే, అప్పుడు భవిష్యత్తులో ఆవిధముగా అవుతారు. మంచిది.
Comments
Post a Comment