03-12-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
విశ్వకళ్యాణకారులే విశ్వానికి యజమానులుగా కాగలరు.
బాప్ దాదా విశ్వకళ్యాణకారీ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. బాబా బేహద్ విశ్వ కళ్యాణకారులు, తండ్రికి సదా ఒకే సంకల్పం ఉంటుంది. "ఇప్పుడిప్పుడే సర్వుల కళ్యాణం జరిగిపోవాలి" సంకల్పానికి విశేష ఆధారం ఈ విషయమే. సంకల్పానికి బీజం ఇదే(అందరికీ కళ్యాణము ఇప్పుడే జరగాలి). మిగిలినదంతా వెరైటీ వృక్షం యొక్క విస్తారం. అలాగే తండ్రి మాటలలో సదా పిల్లల కళ్యాణం కొరకు రకరకాల యుక్తులు ఉంటాయి. నయనాలలో పిల్లల కళ్యాణం కొరకు సర్చ్ లైట్ (దూరం వరకు ప్రకాశాన్ని వ్యాపింపజేయడం) ఉంది. మస్తకంలో కళ్యాణకారీ పిల్లల స్మృతి చిహ్నం మణి రూపంలో ఉంది. ప్రతి కర్మలో కళ్యాణకారీ కర్మ ఉంది. కనుక తండ్రి సంకల్పం లేక మాటలలో, నయనాలలో సదా కళ్యాణ భావన మరియు శుభకామనలు ఎలా నిండి ఉన్నాయో అలా పిల్లలైన మీరు కూడా ఏ పని చేస్తున్నా హద్దు ప్రవృత్తిని నడిపించేందుకు కావచ్చు లేక ఏదైనా సేవాకేంద్రం నడిపించేందుకు నిమిత్తంగా ఉండవచ్చు, సదా విశ్వ కళ్యాణ భావన ఉండాలి. సదా మీ ఎదురుగా విశ్వములోని సర్వాత్మలు ఎమర్జ్ అయ్యి ఉండాలి. మీ స్మృతి ఆధారంగా ఎంత దూరంలోని ఆత్మలైనా సదా మీ సన్ముఖంలో సమీపంగా కనిపించాలి. ఉదాహరణానికి సేవ కొరకు భవిష్యత్ శ్రీ కృష్ణుని రూపం చూపే ఒక చిత్రం ఉంది కదా! మొత్తం విశ్వాన్ని కృష్ణుని చేతిలో ఒక గోళంగా చూపించారు. విశ్వానికి యజమాని అయినందున విశ్వ గోళాన్ని వారి చేతిలో చూపించారు. అలాగే వర్తమాన సమయంలో కూడా విశ్వ కళ్యాణకారులైనందు వలన మొత్తం విశ్వంలోని సర్వాత్మలు మీ మస్తకంలో సదా సమీపంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్నా అమెరికాలో కావచ్చు లేక ఎంత దూరంగా ఉండే ఆత్మ అయినా కావచ్చు సెకండ్ లో ఆ ఆత్మకు తమ శ్రేష్ఠ భావనలు, శ్రేష్ఠ కామనల ఆధారంతో శాంతిని లేక శక్తి కిరణాలను ఇవ్వగల్గుతారు. ఇలాంటి మాస్టర్ జ్ఞానసూర్యులు విశ్వానికి కళ్యాణ ప్రకాశాన్ని ఇవ్వగలరు.
సైన్సు సాధనాల ద్వారా సమయం, ధ్వని ఎంత దూరంగా ఉన్నా సమీపంగా అయ్యింది కదా. ఉదాహరణానికి విమానం ద్వారా సమయం ఎంత దగ్గరైపోయింది. కొద్ది సమయంలోనే ఎక్కడి నుండి ఎక్కడకు చేరుకోగల్గుతున్నారు. టెలిఫోన్ ద్వారా శబ్దము ఎంత దగ్గరైపోయింది. లండన్లో ఉన్న వ్యక్తి మాటలు కూడా సన్ముఖంలో మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తాయి. అలాగే టెలివిజన్ సాధనాల ద్వారా ఏ దృశ్యం లేక ఏ వ్యక్తి ఎంత దూరంగా ఉండినా సన్ముఖంగా అనుభవం అవుతూ ఉంది. సైన్సు అయితే మీ రచన. మీరు మాస్టర్ రచయితలు. సైలెన్స్ శక్తితో మీరందరూ విశ్వంలో ఎంత దూరంలో ఉన్న ఆత్మ ధ్వనినైనా వినగల్గుతారు. ఎలాంటి ధ్వని? సైన్సు నోటి ద్వారా వచ్చు ధ్వనిని వినిపించడానికి సాధనంగా అవుతుంది. కానీ మనసు చేసే ధ్వనిని చేర్చలేదు. సైలెన్సు శక్తి ద్వారా ప్రతీ ఆత్మ మనసు చేసే ధ్వని ఎంత సమీపంగా వినిపిస్తుందంటే ఎవరో సన్ముఖంలో మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తుంది. ఆత్మల మససులోని అశాంతి, దు:ఖముల స్థితి టీ.విల ద్వారా దృశ్యం లేక వ్యక్తిని స్పష్టంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఎలాగైతే ఈ సాధనాలను కరెంటుతో కలిపి స్విచ్ ఆన్ చేస్తే అవి స్పష్టంగా వినిపిస్తాయో, కనిపిస్తాయో అలా తండ్రితో సంబంధం జోడించి శ్రేష్ఠ భావన మరియు కామనల స్విచ్ ఆన్ చేస్తే దూరంలో ఉన్న ఆత్మలను కూడా సమీపంగా అనుభవం చేస్తారు. దీనినే విశ్వ కళ్యాణతారీ స్థితి అని అంటారు. ఇలాంటి స్థితిని తయారు చేసుకునేందుకు విశేషంగా ఎలాంటి సాధనాన్ని తమదిగా చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఆధారం - సైలెన్స్, వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని జమా చేసుకోండి. మనసు యొక్క ధ్వని సంకల్పాల రూపంలో వస్తుంది. మనసు యొక్క ధ్వని అనగా వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేసి ఒక్కటే సమర్థ సంకల్పంలో ఉండండి. సంకల్పాల విస్తారాన్ని ఇముడ్చుకొని సార రూపంలోకి తీసుకొచ్చినప్పుడు సైలెన్స్ శక్తి స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది.
వ్యర్థం అంటే బాహ్యముఖత మరియు సమర్థం అంటే అంతర్ముఖత. అలాగే నోటి మాటల ధ్వనిలోని వ్యర్థాన్ని సమాప్తి చేసుకొని సమర్థం అనగా సార రూపంలోకి తీసుకొచ్చినప్పుడు సైలెన్స్ శక్తిని జమా చేసుకోగల్గుతారు. సైలెన్స్ శక్తి యొక్క విచిత్ర ఉదాహరణలు (నిదర్శనము) చూస్తారు. దూరంలో ఉండే ఆత్మలు మీ ఎదురుగా వచ్చి మీరు మాకు సరైన మార్గాన్ని చూపించారని అంటారు. మీరు మాకు సరైన స్థావరాన్ని సూచించారు. మీరు నన్ను పిలిచారు, నేను వచ్చేశాను. తమ దివ్య స్వరూపం వారి మస్తకం అనే టీ.వీలో స్పష్టంగా కనిపిస్తుంది. సన్ముఖంలో కలిసినట్లు అనుభవం చేస్తారు. ఇంత స్పష్టంగా అనుభవం చేస్తారు. సైలెన్స్ శక్తి ఇంతటి ఆత్మిక అద్భుతాలను చూపిస్తుంది. ప్రారంభములో కూడా దూరంగా ఉన్నా బ్రహ్మాబాబా స్వరూపాన్ని స్పష్టంగా చూస్తూ ఈ స్థానానికి చేరుకోండి అని సూచన లభించేది. అలాగే చివర్లో మీ అందరి విశ్వ కళ్యాణకారీ ఆత్మల విచిత్ర పాత్ర విశేషంగా నడుస్తుంది. దీని కొరకు ఆత్మలు సర్వ బంధనాల నుండి ముక్తులుగా, స్వతంత్రులుగా అవ్వాలి. ఎప్పుడు కావాలంటే. ఎక్కడ కావాలంటే, ఏ శక్తి కావాలంటే దానితో కార్యం చెయ్యగలగాలి. ఇలాంటి బంధనము లేని ఆత్మ అనేకులను జీవన్ముక్తులుగా తయారు చేస్తుంది. అర్థమయ్యిందా. ఎంత ఉన్నతమైన గమ్యం ఇది? ఎక్కడి వరకు చేరుకోవాలి? బేహద్ సేవ రూపురేఖలు ఎంత శ్రేష్ఠంగా ఉన్నాయి? అనేక కష్టాల నుండి ముక్తులవుతారు. కానీ ఒక కష్టం చెయ్యాల్సి ఉంటుంది. అంత ధైర్యం ఉందా?
మహారాష్ట్ర ఏదైనా మహాన్ కార్యం చెయ్యాలి. మహారాష్ట్ర అలాంటి అద్భుతం చేసి చూపించాలి. అప్పుడు విహంగ మార్గంలో సేవ జరుగుతుంది. ఒక్క సెకండ్ లో ఎక్కడి నుండి ఎక్కడకో చేరుకోగల్గాలి. మహారాష్ట్ర పేరుతోనే మహాన్ ఆత్మగా రావడం సహజం కావాలి. ప్రతి కర్మ మహాన్ గా ఉండాలి. ప్రతి మాట మహోన్నతంగా ఉండాలి. మహారాష్ట్రలో ఉన్నవారందరూ ఇలాంటి మహోన్నతంగా ఉన్నారు కదా? ఏ ఆత్మను చూసినా మహాన్ ఆత్మగా అనుభవం కావాలి. అలాగే ఉన్నారు కదా? టీచర్లు ఏమనుకుంటున్నారు? మహారాష్ట్రలో ఏ సమస్యా లేదు కదా? ఎక్కడ మహానత ఉంటుందో అక్కడ సమస్య సమాప్తము. మహారాష్ట్ర అనగా లేక మహాన్ ఆత్మల రాష్ట్రము. రాష్ట్రము అనగా స్థానము. స్థానం మరియు స్థితి సమానంగా ఉంది కదా. కేవలం మేము సమానంగా ఉన్నామని గుర్తుంచుకోండి. అప్పుడు నంబర్ వన్‌గా అయిపోతారు. మహారాష్ట్ర జోన్ నంబర్ వన్లో ఉంది కదా? నంబర్ వనకు గుర్తు "మాయను గెలిచే విజయులుగా" ఉంటారు. ఇలా ఉన్నారు కదా? ఏమిటి, ఎందుకు అనేవి లేవు కదా.
ఇలా సదా సమర్థులుగా ఉన్నవారికి, సదా ఒకే శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ స్థితిలో స్థితమై ఉండేవారికి, తండ్రి సమానంగా సదా విశ్వ కళ్యాణకారులకు, సదా ఒకే లగ్నములో నిమగ్నమై ఉన్న, శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా ప్రియసృతులు మరియు నమస్తే.
టీచర్లతో - మనసా, వాచా, కర్మణా, సంపర్కంలో సదా మహానత కనిపించాలి. ఎందుకంటే టీచర్లకు మహాన్ గా తయారయ్యే సాధనాలు లభించాయి. వాతావరణం, సాంగత్యం, శుద్ధ భోజనం, సేవ, సంపర్కం మరియు సంబంధం అన్నీ మహాన్ గా లభించాయి. ప్రవృత్తిలో ఉండేవారు ప్రవృత్తిలో ఉంటున్నా వారు అతీతంగా ఉండాల్సి వస్తుంది. కానీ టీచర్ అంటేనే అతీతంగా ఉండేవారు. అతీతంగా ఉండే అభ్యాసం చెయ్యాల్సిన అవసరం లేదు. హంస, కొంగలు కలిసి ఉంటూ కూడా అతీతంగా ఉండేవారిదే అద్భుతం. ఆ లెక్కతో చూస్తే టీచర్లకు ఎంత భాగ్యం లభించింది. టీచర్ల కొరకు పురుషార్థం సహజం. ఇలా అనుభవం చేస్తున్నారా లేక కష్టం అనిపిస్తుందా? టీచర్లకు ఎక్కడైనా కష్టం అనిపిస్తుంది అంటే దానికి ఒక్కటే కారణం, అది ఏమిటి? టీచర్ మొత్తం సమయం తమను బిజీగా ఉంచుకుంటే ఎప్పుడూ కష్టం అనేది ఉండదు.
కర్మణా మరియు వాచా సేవ చేస్తున్నారు. అలాగే మనసా దినచర్యను కూడా సెట్ చేసుకోండి. మనసా బిజీగా ఉంటే మాయాజీతులుగా సహజంగా అవ్వగలరు. మిమ్మల్ని ఖాళీగా ఉంచుకుంటే అది చూచి మాయ కూడా వచ్చేస్తుంది. బిజీగా ఉంటే మాయ కూడా సహజంగానే దూరమవుతుంది. తమను బిజీగా ఉంచుకోవడం రాకపోతే మనసా చార్టు తయారుచేసుకోవడం రాకపోతే మాయ వస్తుంది లేక కష్టం అనిపిస్తుంది.
2)బిజీగా ఉంచుకొనుటకు ఎంతగా చదువు వైపు అటెన్షన్ ఉండాలి. చదువు పై హృదయపూర్వక ప్రీతి ఉండాలి. ఎవరికైతే చదువుపై హృదయపూర్వక ప్రేమ ఉంటుందో వారు సదా స్వయం మరియు ఇతరులను కూడా బిజీగా ఉంచగల్గుతారు. అప్పుడప్పుడు పై పైన ప్రేమ ఉంటే స్వయం కూడా అప్పుడప్పుడు బిజీగా, అప్పుడప్పుడు ఫ్రీగా ఉంటారు. స్వయాన్ని కూడా బిజీగా ఉంచుకోలేరు. అందువలన సదా బిజీగా ఉంటూ స్వయాన్ని కూడా విఘ్న వినాశకులుగా మరియు ఇతరులను కూడా విఘ్న వినాశకులుగా తయారు చెయ్యండి.
3)ప్లానింగ్ బుద్ధిగా కండి. ఉపాయాలు ఆలోచించండి. మొదట స్వయానికి ప్లాన్ తర్వాత సేవకు ఉపాయాలు ఆలోచించండి. ప్లానింగ్ బుద్ధి గలవారు సదా బిజీగా ఉంటారు. డైరక్షన్ ప్రమాణంగా నడిచేవారి బుద్ధి అప్పుడప్పుడు ఫ్రీగా, అప్పుడప్పుడు బిజీగా ఉంటుంది. ప్లానింగ్ బుద్ధిగా కండి అని తండ్రి డైరెక్షన్ లభించింది. స్వయం మరియు ఇతరుల గురించి ప్లాన్ తయారు చెయ్యండి. ఇలాంటి ప్లానింగ్ బుద్ధి గలవారిగా ఉన్నారా లేక తయారైన ప్లాన్ లభిస్తే చేస్తారా! మొదట స్వయానికి టీచర్ గా తర్వాత ఇతరులకు టీచర్ గా కండి. టీచర్ విద్యార్థికి ప్లాన్ తయారు చేసి ఇస్తారు. అలా స్వయానికి టీచర్ గా కండి, తర్వాత ఇతరుల కొరకు కండి.
మంచిది. అందరూ తమ తమ లగ్నముననుసరించి పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు కదా? ఉన్నతయ్యే కళలో ఉన్నారు కదా? టీచర్లంటే అందరూ అనుసరించే వారిగా ఉంటారు కదా! పాలోఫాదర్ అయితే ఉంది. అయినా అందరూ నిమిత్తముగా ఉన్న టీచర్ను చూస్తారు. నిమిత్తంగా ఉన్న వారిలో తండ్రిని చూస్తారు. చూసే అద్దము పాడైనట్లయితే తండ్రి కూడా స్పష్టంగా కనిపిస్తారా? అద్దం స్పష్టంగా, శక్తిశాలిగా ఉంటే ఏ వస్తువునైనా స్పష్టంగా, సహజంగా చూసి అనుభవం చేసుకోగలరు. ఇలాంటి స్పష్టమైన శక్తిశాలి అద్దంగా ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా మీలో తండ్రిని స్పష్టంగా అనుభవం చేసుకోగలగాలి.
బాప్ దాదాకు టీచర్ చేసే ఏ ఫిర్యాదులనైనా వినడం మంచిగా అనిపించదు. ఎవరైనా టీచర్ నేను బలహీనంగా ఉన్నాను, మాయ వస్తుంది లేక జిజ్ఞాసులు సంతుష్టంగా ఉండటం లేదు లేక నేను సంతుష్టంగా ఉండటం లేదు - ఇలాంటి ఫిర్యాదులు చేస్తే వినడం కూడా బాగుండదు. టీచర్ పని అందరినీ సంపూర్ణంగా తయారు చేయుట. స్వయం టీచరుకే ఫిర్యాదులుంటే సంపూర్ణంగా ఎలా చేస్తారు? ఎవరి లోపం ఉండకూడదు. టీచర్లు అనగా సంపన్నులు. టీచర్లు అనగా విఘ్న వినాశకులు. టీచరుకు తండ్రి సమానమైన మహిమ ఉంది. తండ్రి మహిమ ఏదైతే ఉందో అది టీచర్ల మహిమ అవుతుంది. టీచర్ల మహత్వం ఏమిటో అర్థమయ్యిందా? ఏ ఫిర్యాదులు లేనటువంటి అవినాశి సంఘటనను తయారుచెయ్యండి. వృద్ధి చాలా చేస్తున్నారు కానీ విఘ్న వినాశకులుగా కండి, అందరినీ అలా తయారుచేయండి.
పార్టీలతో- తండ్రి, టీచర్, సద్గురువు - ఈ మూడు సంబంధాల ద్వారా మూడు ప్రాప్తులు - సదా మూడు సంబంధాలతో వారస్వతాన్ని, చదువును, ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తున్నారా? తండ్రితో వారసత్వం లభించింది. టీచర్ సంబంధంతో చదువు లభించింది. సద్గురువు సంబంధంతో ఇంటి మార్గం లభించింది. అంతేకాక జతలో వెళ్తాము. మూడు సంబంధాలతో మూడు ప్రాప్తులు లభిస్తాయి. ఆ సంబంధం మరియు ప్రాప్తి సదా గుర్తుంటుందా? మేము శ్రేష్ఠ ఆత్మలమని స్వయం పరమాత్మ తండ్రి టీచర్, సద్గురువుగా అయ్యారని అర్థం చేసుకున్నారా! ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలాంటి భాగ్యము అనగా సర్వ సంబంధాలతో పరమాత్మ లభిస్తారని ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండరు. ఈ అసంభవ విషయం కూడా సాకారంలో సంభవం అవుతూ ఉంటే అది ఎంత గొప్ప భాగ్యం! తండ్రి, టీచర్ మరియు సద్గురువుగా కూడా అయ్యారు. భగవంతుడు సంతుష్టమైతే ఇంటి కప్పు చీల్చుకొని ఇస్తారని భక్తులు అంటారు. బాబా కూడా ఆకాశతత్వాన్ని దాటుకొని ఇవ్వడానికి వచ్చారు కదా. వారు కేవలం ఇంటికప్పు చీల్చుకొని వస్తారని అంటారు కానీ ఆకాశ తత్వానికి కూడా అతీతంగా ఉండేవారు 5 తత్వాలను కూడా దాటుకొని ప్రాప్తి చేయిస్తూ ఉంటే ఎంత భాగ్యశాలిగా అయ్యారు. ఇలాంటి భాగ్యం సదా గుర్తుండాలి. ఇది ప్రాక్టికల్ గా మీ జీవితంలో జరిగింది. జ్ఞానమైతే మర్చిపోతారు కానీ ప్రాక్టికల్ జీవితంలోని ఏ విషయాన్నీ మర్చిపోరు కదా, సదా జ్ఞాపకం ఉంటుంది. జరిగిపోయిన జీవిత విషయాలు మర్చిపోవాలనుకున్నా జ్ఞాపకం వస్తాయి కదా! మరి ఇది ఎలా మర్చిపోగల్గుతారు? ఒక్కటే శబ్ధం జ్ఞాపకం ఉంచుకోవాలి. 'బాబా బాబా, బాబా' అని అంటూ ఉంటే సదా స్మృతి స్వరూపంగా ఉంటారు. రెండు సంవత్సరాల బాలుడు కూడా బాబా బాబా అని అంటూ ఉంటాడు. మీరు ఇంత జ్ఞాన స్వరూప పిల్లలు ఒక్క బాబా శబ్ధం జ్ఞాపకం ఉంచుకోలేరా? సహజ మార్గం కదా - కష్టమనిపించడం లేదు కదా? శక్తి సైన్యం ఏమనుకుంటున్నారు? సదా ఒక్క తండ్రి మరియు మీరు మూడవవారు ఎవరూ లేరు. అలాగే ఉంటారు కదా. ఏ మూడవ విషయం జ్ఞాపకం రావడం లేదు కదా? తండ్రి మరియు నేను, ఇదే నశాలో ఉండండి. శక్తి సైన్యము నిర్మోహులుగా ఉన్నారా? లేక హద్దు ఇంటిలో పిల్లలలో మోహముందా? ఏమి జరిగినా నిర్మోహులుగా, సాక్షిగా ఉంటూ డ్రామాలోని దృశ్యాలను చూస్తూ ఉండండి.
పాండవులలో ఆవేశం మరియు క్రోధం ఉంటుంది. పాండవులు కోపం లేనివారిగా అయ్యారా? ఏమనుకుంటున్నారు? పాండవులు దీనిపై విజయం పొందారా? కొంచెం కూడా దేహ భ్రాంతి లేక ఆవేశం ఉండరాదు. పూర్తిగా బ్రహ్మాకుమారులుగా, నిరహంకారులుగా అవ్వాలి. క్రోధాన్ని వదిలిపెట్టారా! కొద్ది కొద్దిగా ఆయుధంలాగా శస్త్రంగా) ఉపయోగిస్తున్నారా! సమాప్తమైపోయింది అనుకునేవారు చేతులెత్తండి. ఎవరు తిట్టినా, ఏ అసత్య నిందలు మోపినా మీకు కోపం రాకూడదు. క్రోధం రావడానికి రెండే విషయాలుంటాయి. ఒకటి ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు, రెండవది నిందించినపుడు. ఈ రెండు విషయాలు క్రోధానికి జన్మనిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా క్రోధం రాకూడదు. అలా ఉన్నారా? అపకారులకు కూడా ఉపకారం చెయ్యాలి, ఇదే బ్రాహ్మణుల కర్మ. వారు తిట్టినా, మీరు హృదయానికి హత్తుకోండి. ఇదే అద్భుతం. దీనినే పరివర్తన అని అంటారు. ప్రేమించే వారిని ప్రేమించడం పెద్ద విషయమేమీ కాదు. కాని నిందించే వారిని సత్యమైన మిత్రులుగా మనస్ఫూర్తిగా అంగీకరించండి. కేవలం మాటలతో కాదు. ఇలా అయినారా? ఇటువంటి పరివర్తన జరిగినపుడు విశ్వం ముందు ప్రసిద్ధమవుతారు. ప్రపంచంలోనివారు ఏదైతే జరగదని అంటారో అది మీరు చేసి చూపించండి. అప్పుడే "అద్భుతం" అని అంటారు.
Comments
Post a Comment