03-11-1981 అవ్యక్త మురళి

* 03-11-1981        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

యోధులుగా కాదు, హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి.

ఈరోజు దూరదేశ నివాసి అయిన పరదేశీ తండ్రి తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు కూడా స్వదేశము యొక్క స్మృతిని కలిగించేందుకు వచ్చారు మరియు సమర్ధముగా చేసి తమతో పాటు తీసుకొని వెళ్ళేందుకు వచ్చారు. స్వదేశము మీ స్మృతిలోకి వచ్చేసింది కదా! ఇది పరాయిదేశము, పరాయిరాజ్యము. ఇందులో అంతా పాతగానే కనిపిస్తుంది. వ్యక్తులను చూసినా, వస్తువులను చూసినా అన్నీ ఎలా కనిపిస్తాయి? అన్నీ జడజడీ భూతముగా అయిపోయాయి. నలువైపులా అంధకారమే వ్యాపించి ఉంది. ఇటువంటి దేశములో మీరంతా బంధనాలలో బంధింపబడియున్న బంధనయుక్తులైన ఆత్మలుగా అయిపోయారు. అప్పుడు తండ్రి వచ్చి స్వరూపము యొక్క మరియు స్వదేశము యొక్క స్మృతిని కలిగించి బంధనముక్తులుగా చేసి స్వదేశములోకి తీసుకువెళతారు. దానితో పాటు స్వరాజ్యము యొక్క అధికారులుగా తయారుచేస్తారు. కావున పిల్లలందరూ తమ స్వదేశములోకి వెళ్లేందుకు తయారుగా ఉన్నారా? మీరు ఒక డ్రామా చూపిస్తారు కదా! అందులో స్వర్గములోకి వెళ్ళేందుకు అవకాశమున్నా ఎవరూ వెళ్ళేందుకు సిద్ధమవ్వరు. అలాగే, ఏదో నామమాత్రముగా వెళతాము, వెళతాము అనేవారైతే కాదు కదా! లెక్కాచారాలను సమాప్తము చేసుకున్నారా? లేక ఇప్పుడు కూడా కొన్ని మిగిలియున్నాయా? మీ లెక్కాచారాల సమాప్త సమారోహమును జరుపుకున్నారా? లేక ఇప్పటివరకూ ఇంకా ఏర్పాట్లే చేసుకుంటున్నారా? అంతిమంలో ఈ సమాప్త సమారోహమును జరుపుకుంటాము అని అయితే భావించడం లేదు కదా! ఇప్పటినుండే సమాప్త సమారోహమును జరుపుకున్నట్లయితే అప్పుడే అంతిమంలో కూడా సంపూర్ణతా సమారోహమును జరుపుకుంటారు. ఈ పాత లెక్కాచారాలను సమాప్తము చేయాలి. అది ఇప్పుడు చేయడం ద్వారా చాలాకాలం బంధనముక్తులుగా ఉన్నవారు చాలాకాలం జీవన్ముక్తి యొక్క పదవిని పొందగలుగుతారు, లేకపోతే అంతిమం వరకూ యుద్ధం చేసే యోద్ధులుగానే ఉండిపోతారు. ఎవరైతే అంతిమం వరకూ యోద్ధ జీవితంలో ఉంటారో వారి ప్రాలబ్దము ఎలా ఉంటుంది? యోద్ధ జీవితమైతే బాల్యపు జీవితము, ఇప్పుడైతే స్వరాజ్యాధికారులుగా అయిపోయారు కదా! స్మృతియొక్క తిలకము గల బాబా యొక్క హృదయసింహాసనాధికారులుగా అయిపోయారు. సింహాసనాధికారులు ఏమైనా యోద్ధులుగా ఉంటారా? యుద్ధము యొక్క ప్రాలబ్దముగా సింహాసనము మరియు కిరీటము లభించింది. ఈ వర్తమాన ప్రాలబ్దము లేక ప్రత్యక్షఫలము ప్రాప్తించలేదా? సంగమయుగము యొక్క ప్రాలబ్దమును పొందేసారా లేక పొందాలా? మీరు ఏ గీతమును గానం చేస్తారు? ఏదైతే పొందాలో దానిని పొందేసారా లేక పొందాలా? వర్తమానముతో భవిష్యత్తుకు సంబంధం ఉన్నప్పుడు భవిష్య ప్రాలబ్దము 2,500 సంవత్సరాలు ఉంది. మరి వర్తమాన ప్రాలబ్దము అంతిమంలో 5, 6 నెలలు ఉంటుందా లేక 5 రోజులు ఉంటుందా లేక 5 గంటలు ఉంటుందా లేక సంగమయుగము యొక్క బహుకాలము ఉంటుందా? సంగమయుగము యొక్క ప్రాలబ్దము చాలాకాలము ఉండకపోతే భవిష్య ప్రాలబ్దము చాలాకాలము ఎలా ఉంటుంది? అక్కడి 2,500 సంవత్సరాలు ఇక్కడ 25 సంవత్సరాలు కూడా ఉండదా? డైరెక్ట్ బాబా యొక్క పిల్లలుగా అయి సంగమయుగము యొక్క సదాకాలికమైన వారసత్వాన్ని పొందకపోతే మరి అసలు పొందింది ఏమిటి? సర్వ ఖజానాల యొక్క గనులకు అధిపతి అయిన తండ్రి యొక్క బాలకులుగా అయి ఖజానాలతో సంపన్నముగా అవ్వకపోతే ఆ అధిపతికి బాలకులుగా అయి చేసింది ఏమిటి?

“సఫలత మా జన్మసిద్ధం కారము". ఇలా అంటూ సదా సఫలతను అనుభవం చేసుకోకపోతే జన్మసిద్ధ అధికారులుగా అయి ఏమి చేసినట్లు? భాగ్య విధాతలైన ఇరువురు తండ్రుల యొక్క పిల్లలుగా అయ్యాక కూడా సదా పదమా పదమ భాగ్యశాలులుగా అవ్వకపోతే ఇరువురు తండ్రుల యొక్క పిల్లలుగా అయి చేసింది ఏమిటి? శ్రేష్ఠ కర్మలను లేక శ్రేష్ఠ చరిత్రను తయారుచేసుకునేందుకు అతి సహజమైన విధిని తండ్రి వరదాతగా అయి ఇచ్చాక కూడా సిద్ధీ స్వరూపులుగా అవ్వకపోతే మరేమి చేసినట్లు?

యుద్ధం చేయడం, శ్రమించడం, మెల్లమెల్లగా విశ్రాంతిగా వెళ్ళడం మీకు ఇదే ఇష్టమా? యుద్ధమైదానము మీకు ఇష్టమా? హృదయసింహాసనం మీకు ఇష్టం లేదా? మీకు సింహాసనమే ఇష్టమైనట్లయితే మరి సింహాసనాధికారుల వద్దకు మాయ రాజాలదు. సింహాసనము నుండి దిగి యుద్ధ మైదానములోకి వెళ్ళిపోతారు, అప్పుడే కష్టపడవలసి వస్తుంది. కొందరు పిల్లలు ఉంటారు, వారు పోట్లాడుకోకుండా ఉండలేరు. వారికి ఎవరూ దొరక్కపోతే తమలో తామే ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. యుద్ధం యొక్క సంస్కారాలు రాజ్య సింహాసనాన్ని వదిలించి కూడా యుద్ధమైదానములోకి తీసుకు వెళతాయి. ఇప్పుడు ఇక యుద్ధ సంస్కారాలను సమాప్తం చేయండి,
రాజ్య సంస్కారాలను ధారణ చేయండి. ప్రాలబ్దులుగా అవ్వండి, అప్పుడు బహుకాలము యొక్క భవిష్య ప్రాలబ్దము కలవారిగా అయిపోతారు. అంతిమం వరకూ యోద్ధ జీవితం ఉన్నట్లయితే ఏమవుతారు? చంద్రవంశీయులుగా అవ్వవలసి వస్తుంది.

సదా సంతోషం యొక్క నాట్యమును చేస్తూ ఉండడం సూర్యవంశీయుల గుర్తు. వారు సదా అతీంద్రియ సుఖములో ఊగుతూ ఉంటారు. చంద్రవంశీయుడైన రాముడిని ఎప్పుడూ ఊయలలో ఊపరు, నాట్యమాడుతున్నట్లుగా చూపించరు. యుద్ధము యొక్క ధనస్సును చూపిస్తారు. చివరిలోనే రాజ్యభాగ్యము లభిస్తుంది. అర్ధకాలపు రాజ్యము బహుకాలమైతే కాదు కదా! కావున సదా ఊయలలో ఊగుతూ ఉండండి. సర్వులతో నాట్యము కలుపుతూ సంతోషము యొక్క నాట్యమును చేస్తూ ఉండండి. దీనినే సంగమయుగము యొక్క ప్రాలబ్ద స్వరూపము అని అంటారు. పురుషార్ధులము కదా అనే ఈ మాట కూడా ఎప్పటివరకూ?

ఇప్పుడిప్పుడే పురుషార్థులుగా, మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రాలబ్దులుగా అవ్వండి. సంగమయుగము యొక్క పురుషార్ధము, సత్యయుగము యొక్క ప్రాలబ్ధము కాదు. సంగమయుగము యొక్క ప్రాలబ్దులుగా అవ్వాలి. ఇప్పుడిప్పుడే బీజమును నాటండి, ఇప్పుడిప్పుడే ఫలాన్ని పొందండి. సైన్స్ వారు కూడా ప్రతి కార్యములోనూ ప్రాప్తి యొక్క గతిని తీవ్రతరం చేస్తున్నారు. మరి సైలెన్స్ శక్తివారు తమ గతిని దాని కన్నా తీవ్రముగా చేస్తారా లేక ఒక జన్మలో చేసి ఇంకొక జన్మలో పొందుతాము అని భావిస్తున్నారా? వారు శబ్దము యొక్క గతి కన్నా తీవ్రముగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అన్ని కార్యాలను ఒక్క క్షణము యొక్క గతి కన్నా తీవ్ర వేగముతో చేయాలనుకుంటున్నారు. ఇంత పెద్ద విశ్వము యొక్క వినాశనాన్ని ఎంత కొద్ది సమయంలో చేసేందుకు వారు తయారైపోయారు! మరి స్థాపన కొరకు నిమిత్తమైయున్న ఆత్మలు క్షణములో చేయడం, క్షణములో పొందడం అనే తీవ్రగతి యొక్క అనుభవజ్ఞులుగా అవ్వరా? మరి ఇప్పుడేమి చేయాలో అర్థం చేసుకున్నారా? ప్రత్యక్ష ఫలాన్ని పొందండి. ప్రత్యక్ష ఫలము మీకు నచ్చదా? శ్రమించే ఫలము మీకు నచ్చుతుందా? కష్టపడడం అనే ఎండిపోయిన ఫలాన్ని తినడం వల్లనే ఇలా బలహీనంగా అయిపోయారు. నయనహీనులుగా, బుద్ధిహీనులుగా, శ్రేష్ఠ కర్మహీనులుగా అయిపోయారు. ఇప్పుడైనా తాజా ప్రత్యక్ష ఫలాన్ని తినండి. శ్రమను ప్రేమలోకి మార్చివేయండి, అచ్ఛా!

ఇటువంటి సదా రాజ్యవంశము యొక్క సంస్కారము కలవారికి, సదా సర్వఖజానాల యొక్క అధికారులకు అనగా బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారికి, సంగమయుగ ప్రాలబ్ద సంస్కారము కలవారికి, ప్రత్యక్ష ఫలమును తినేవారికి, ఇటువంటి సదా ప్రాప్తి స్వరూపులకు, సదా సర్వ బంధనముక్తులకు, సంగమయుగ జీవన్ముక్తులకు ఇటువంటి సింహాసనాధికారులకు, కిరీట అధికారీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. 

పార్టీలతో వ్యక్తిగత మిలనము: -

1. సదా ఆత్మికనషాలో స్థితులై ఉంటున్నారా? ఆత్మిక నషా అనగా ఆత్మాభిమానులుగా అవ్వడం. సదా నడుస్తూ, తిరుగుతూ ఆత్మను చూడడం - ఇదే ఆత్మిక నషా, ఆత్మిక నషాలో సదా సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం సహజముగా కలుగుతుంది. స్థూల నషా కలవారు కూడా తమను ప్రాప్తీవంతులుగా భావిస్తారు, అలాగే ఈ ఆత్మిక నషాలో ఉండేవారు సర్వ ప్రాప్తి స్వరూపులుగా అయిపోతారు. ఈ నషాలో ఉండడం ద్వారా అన్నిరకాల దు:ఖాలు దూరమైపోతాయి. దు:ఖము మరియు అశాంతికి వీడ్కోలు చెప్పినట్లవుతుంది. సదాకాలికమైన సుఖదాత, శాంతిదాత యొక్క పిల్లలుగా అయిపోయినట్లయితే మరి దుఃఖ అశాంతులకు వీడ్కోలు ఇచ్చినట్లే కదా! అశాంతి యొక్క నామరూపాలు కూడా ఉండవు. శాంతిసాగరుని పిల్లలు ఎలా అశాంతమవ్వగలరు? ఆత్మిక నషా అనగా దుఃఖము మరియు అశాంతి యొక్క సమాప్తము. దాని వీడ్కోలు యొక్క సమారోహాన్ని జరుపుకున్నారా? ఎందుకంటే అపవిత్రత ద్వారానే దు:ఖము, అశాంతి యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కడైతే అపవిత్రత ఉండదో అక్కడకు దు:ఖము, అశాంతి ఎక్కడినుండి వస్తుంది? పతిత పావనుడైన తండ్రి యొక్క పిల్లలు మాస్టర్ పతితపావనులుగా అయిపోతారు. ఎవరైతే ఇతరులను పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారో వారు స్వయమూ పావనులుగా ఉంటారు కదా! పావనులైన పవిత్ర ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటుంది. కావున మీరు పావన ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు మరియు విశేష ఆత్మలు. విశ్వములో మీరు మహాన్ ఆత్మలు. ఎందుకంటే తండ్రికి చెందినవారిగా అయిపోయారు. అన్నింటికన్నా అతిపెద్ద మహానత పావనులుగా అవ్వడమే. కావున ఈ రోజు కూడా ఇదే మహానత ముందు శిరస్సు వంచుతారు. ఆ జడచిత్రాలు ఎవరివి? ఇప్పుడు మందిరంలోకి వెళితే ఏమి భావిస్తారు? ఎవరి యొక్క పూజ జరుగుతోంది? ఇవి  మా జడచిత్రాలేనని స్మృతి కలుగుతుంది. ఇలా స్వయాన్ని మహాన్ ఆత్మలుగా భావిస్తూ నడుచుకోండి. మీరు ఎటువంటి దివ్యదర్పణముగా అవ్వాలంటే, అందులో అనేక ఆత్మలకు తమ యదార్ధస్వరూపము కనిపించాలి.

2. సదా పైకి ఎక్కే కళలోకి వెళుతున్నారా? ప్రతి అడుగులోనూ పైకి ఎక్కే కళ యొక్క అనుభవజ్ఞులుగా ఉండాలి. సంకల్పము, వాక్కు, కర్మ, సంపర్కము మరియు సంబంధం అన్నింటిలో పైకి ఎక్కే కళ, ఎందుకంటే ఈ సమయమే పైకి ఎక్కే కళ యొక్క సమయం. ఇంకే యుగమూ పైకి ఎక్కే కళ యొక్క యుగము కాదు. సంగమయుగమే పైకి ఎక్కే కళ యొక్క యుగము. కావున సమయాన్ని బట్టి అటువంటి అనుభవం ఉండాలి. ఒక క్షణం గతించి ఆ తర్వాతి క్షణం వస్తే అందులోనూ పైకి ఎక్కే కళ ఉండాలి. రెండు నెలల క్రితం ఉన్నారో అలాగే ఇప్పుడూ ఉండడం కాదు. అన్ని వేళలలోనూ, అన్ని సమయాలలోనూ పరివర్తన ఉండాలి. కానీ ఆ పరివర్తన కూడా పైకి ఎక్కే కళ యొక్క పరివర్తనగా ఉండాలి, ఏ విషయములోనూ ఆగేవారిగా కాదు. పైకి ఎక్కే కళ కలవారు ఎక్కడా ఆగరు. వారు సదా ఇతరులను కూడా పైకి ఎక్కే కళలోకి తీసుకువెళతారు.

3. స్వయాన్ని ఎగిరే పక్షిగా భావిస్తున్నారా? ఎవరైతే పైకి ఎగిరే పక్షులుగా ఉంటారో వారు చక్రవర్తులుగా ఉంటారు, ఆల్ రౌండ్ పాత్రధారులుగా ఉంటారు. ఎగిరే కళలో ఉండేవారే ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి చేరుకోగలిగే విధంగా నిర్బంధులుగా ఉంటారు మరియు అన్నిరకాల సేవలలోనూ సఫలతామూర్తులుగా అయిపోతారు. ఏ విధంగా బాబా ఆల్‌రౌండ్ పాత్రధారులో, సఖునిగానూ అవ్వగలరో మరియు తండ్రిగానూ అవ్వగలరో అలా పైకి ఎగిరే కళ కలవారు ఏ సమయంలో ఏ సేవ యొక్క అవసరం ఉంటుందో ఆ సేవలో సంపన్నపాత్రను అభినయించగలుగుతారు. దీనినే ఆల్ రౌండ్ గా విహరించే పక్షులుగా ఉండడం అని అంటారు, అచ్ఛా!

కుమారీలతో - కుమారీలను చూసి బాప్ దాదా ఎంతో హర్షిస్తారు, ఎందుకు? ఎందుకంటే, ఒక్కొక్క కుమారి అనేకులను మేల్కొలిపేందుకు నిమిత్తులుగా అవుతారు, కావున కుమారీల యొక్క భవిష్యత్తును చూసి హర్షిస్తారు. ఒక్కొక్క కుమారి విశ్వ కళ్యాణకారిగా అవుతుంది. పరివార కళ్యాణిగానే కాదు, విశ్వ కళ్యాణిగా అవ్వాలి. కుమారి గృహస్థిగా అయిపోతే పరివార కళ్యాణకారిగా అయిపోతుంది కానీ బ్రహ్మాకుమారీగా అయిపోతే విశ్వకళ్యాణకారిగా అయిపోతుంది. మరి మీరు ఏమవ్వనున్నారు? కుమారీలకు భక్తికాలము యొక్క అంత్యకాలములో కూడా పూజ జరుగుతుంది. కావున చివరి వరకూ కూడా మీరు అంత శ్రేష్ఠులు. కుమారి జీవితానికి కూడా ఎంతో మహత్వము ఉంది. కుమారీలకు బ్రాహ్మణ జీవితములో లిఫ్ట్ కూడా ఉంది. కుమారీలు ఎంత త్వరగా సేవాకేంద్రము యొక్క ఇన్‌ఛార్జ్ గా అయిపోతారు! కుమారులకు ఎంతో ఆలస్యంగా అవకాశం లభిస్తుంది. కుమారీలు రేస్లో ముందుకు వెళ్ళినట్లయితే తమను తాము ఎంతగానో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఒక్క కుమారి అనేక సేవాకేంద్రాలను సంభాళించగలుగుతుంది. డ్రామా అనుసారముగా ఈ లిఫ్ట్ గిఫ్ట్ యొక్క రూపములో లభించింది. ఇందులో కష్టపడలేదు. కుమారీల యొక్క విశేషత ఏమిటి? కుమారీ జీవితము అనగా సంపూర్ణ పావనము. కుమారీ జీవితములో ఈ విశేషత లేకపోతే దానికి ఎటువంటి మహత్వమూ లేదు. బ్రహ్మాకుమారీ అనగా మనస్సులో కూడా అపవిత్రత యొక్క సంకల్పము ఉండకూడదు, అప్పుడే పూజ్యులుగా అవుతారు లేకపోతే ఖండితమైపోతారు మరియు ఖండితమైనవారి యొక్క పూజ జరుగదు, మరి మీకు ఈ విశేషతనుగూర్చి తెలుసా? ఇంతమంది కుమారీలు సేవాధారులుగా అయిపోతే ఎన్ని సెంటర్లు తెరువబడతాయి! బాప్ దాదా ఎవరినీ లౌకిక సేవను వదిలేయండి అని కూడా అనరు, కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఎంతెంతగా ఈ సేవలో బిజీగా అవుతూ ఉంటారో అంతంతగా అది దానంతట అదే వదిలిపోతుంది. ఉద్యోగాన్ని వదలండి అని ఎవరితోనైనా అంటే ఆలోచనలో పడిపోతారు. అజ్ఞానులను బీడీ వదలండి, సిగరెట్ వదలండి అని అంటే అది కేవలం వదిలినంత మాత్రాన వదిలిపోదు, అనుభవంతో వదిలివేస్తారు, అలాగే మీరు కూడా ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా అయిపోతారో అప్పుడు అది వదిలిపోతుంది.

ఇప్పటివరకూ గుజరాత్ కు కట్నముగా సెంటర్ లభించలేదు, బాంబేకు లభించింది. గుజరాత్ ఏది కావాలనుకుంటే అది చేయగలదు, లోటు లేదు, కేవలం సంకల్పము మరియు సిస్టం ప్రారంభమవ్వలేదు, ఇప్పుడు కుమారీలు బాప్ దాదా కులము యొక్క దీపకులే కదా! మీ భాగ్యమును చూసి సదా హర్షితముగా ఉన్నట్లయితే ఈ జీవితములో బాబాకు చెందినవారిగా అయిపోతారు. ఇదే జీవితము దిగజార్చేదిగానూ ఉంటుంది మరియు పైకి ఎక్కించేదిగానూ ఉంటుంది. మరి అందరూ  పైకి ఎక్కే కళ యొక్క దారికి చేరుకున్నారా? అచ్ఛా!

Comments