03-04-1981 అవ్యక్త మురళి

03-04-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్ఞాన మార్గానికి స్మృతి చిహ్నం - భక్తి మార్గము.

  ఈరోజు మధువన్ భూమిలో(నదీ తీరంలో) ఏ మేళా జరుగుతున్నది? ఈ రోజు అనేక నదులు మరియు సాగరుని మిలనం జరుగుతున్నది. ప్రతి ఒక్క చిన్న పెద్ద జ్ఞాననది పతిత పావనుడైన తండ్రి సమానంగా పతిత పావని అయ్యింది. తండ్రి తన సేవా సహయోగులను చూస్తున్నారు. దేశం నుండి విదేశం వరకు పతితపావని నదులు చేరుకున్నాయి. దేశ, విదేశాలలోని ఆత్మలు పావనమై మహిమ చేసే పాటలను ఎంతగానో పాడుతున్నారు. మనసులో పాడే ఈ పాటలే మళ్ళీ ద్వాపర యుగంలో నోటితో పాడే పాటలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి శ్రేష్ఠ ఆత్మల శ్రేష్ఠ కార్యమును, శ్రేష్ఠ జీవితపు కీర్తిని పాడుతున్నారు. ఇదే మళ్ళీ భక్తిమార్గంలో కీర్తనగా అవుతుంది. ఇప్పుడు అతీంద్రియ సుఖాన్ని ప్రాప్తి చేసుకున్న కారణంగా ఆత్మల మనస్సు సంతోషంగా నాట్యం చేస్తుంది, మళ్ళీ భక్తిమార్గంలో కాళ్ళతో (పాదాలతో) నాట్యం చేస్తారు. ఇప్పుడు శ్రేష్ట ఆత్మల గుణాల మాలను స్మరణ చేస్తారు లేక వర్ణన చేస్తారు, మళ్ళీ భక్తి మార్గంలో మణుల మాలను స్మరణ చేస్తారు. ఇప్పుడు మీరందరూ స్వయంగా తండ్రికి భోగ్ ను సమర్పిస్తున్నారు, దీనికి బదులుగా భక్తిమార్గంలో భక్తులు మీ అందరికి భోగ్ ను (నైవేద్యాన్ని) సమర్పిస్తారు. ఎలాగైతే ఇప్పుడు మీరందరూ తండ్రికి స్వీకారం చేయించకుండా ఏ పదార్థాన్ని స్వీకరించరో “ముందు బాబాకు" అనే స్నేహం సదా హృదయంలో ఉంటుందో అలాగే భక్తిమార్గంలో దేవాత్మలైన మీకు స్వీకారం చేయించకుండా స్వయం స్వీకరించరు. ముందు దేవతలు, తర్వాత మేము అని భావిస్తారు. ఇప్పుడు మీరు ముందు తండ్రి తరువాత మేము అని అంటారు కదా. కావున అంతా కాపీ(అనుసరణ) చేసారు. మీరు స్మృతి స్వరూపులవుతారు, వారు స్మృతి చిహ్నపు స్మృతి స్వరూపంగా ఉంటారు. ఎలాగైతే మీరు అఖండ అవ్యభిచారులుగా అనగా ఒక్కరి స్మృతిలోనే ఉంటున్నారో, ఎవ్వరూ కదిలించలేరో, మార్చలేరో అలాగే నౌధా భక్తులు, సత్యమైన భక్తులు, ఆదిలోని భక్తులు తమ ఇష్ట దైవంపై నిశ్చయంలో అఖండంగా, స్థిరంగా, నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటారు. ఒక వేళ హనుమంతుని భక్తులకు రాముడు దొరికినా, వారు హనుమంతుని భక్తులుగానే ఉంటారు. అటువంటి స్థిరమైన విశ్వాసపాత్రులుగా ఉంటారు. మీరు అనుసరించే ఒకే బలము, ఒకే నమ్మకాన్ని వారు అనుసరించారు.

మీరందరూ ఇప్పుడు ఆత్మిక యాత్రికులుగా అవుతారు. మీది స్మృతియాత్ర వారిది స్మృతి చిహ్న యాత్ర. మీరు వర్తమాన సమయంలో జ్ఞాన స్తంభము, శాంతి స్తంభము నలువైపులా ఉన్న శిక్షణా మహావాక్యాల కారణంగా చుట్టూ గుండ్రంగా తిరుగుతారు. ఇతరులతో కూడా ఇలాగే చేయిస్తారు. వ్రాసి ఉన్న శిక్షణల స్మృతి స్వరూప మహావాక్యాలను చదవటానికి చుట్టూ తిరుగుతారు. ఒక్క వైపు కూడా వదలరు. నలువైపులా తిరగటం సంపన్నమైన తర్వాత అన్నీ చూశాము, అనుభవం చేశాము అని భావిస్తారు. భక్తులు మీ స్మృతి స్వరూపాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. ప్రదక్షిణ పూర్తి కానంతవరకు భక్తి సంపన్నం కాలేదని భావిస్తారు. మీ అందరి అన్ని కర్మలు, గుణాల సూక్ష్మ రూపాన్ని స్థూల రూపములో భక్తిలో అనుసరించారు, కావున బాప్ దాదా సర్వ దేవాత్మలకు సదా స్థిర నిశ్చయబుద్ధితో ఉండమని శిక్షణను ఇస్తున్నారు. ఒకవేళ మీరందరూ ఒక్కరి స్మృతిలో ఏకరసంగా, ఏకాగ్రముగా, స్థిరబుద్ధితో లేకుంటే మీ భక్తులు కూడా స్థిరమైన నిశ్చయ బుద్ధి కలిగి ఉండరు. ఇక్కడ మీ బుద్ది భ్రమిస్తూ ఉంటుంది, అక్కడ భక్తులు కాళ్ళతో భ్రమిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒక్కక్కరిని తమ దేవతగా చేసుకుంటారు. ఈ రోజు రాముని భక్తులుగా ఉంటారు, రేపు కృష్ణుని భక్తులుగా అవుతారు. "సర్వ ప్రాప్తులు ఒక్కరి ద్వారానే” అన్న స్థితి మీకు తయారు కానంత వరకు, భక్త ఆత్మలు కూడా ప్రతీ ప్రాప్తి కొరకు వేరు వేరు దేవతల వద్దకు భ్రమిస్తూ ఉంటారు. మీరు తమ శ్రేష్ఠ గౌరవము నుండి దూరమౌతారు. మీ భక్తులు కూడా విసుగు చెంది అలజడి చెందుతారు. ఏ విధంగా ఇక్కడ మీరు స్మృతి ద్వారా అలౌకిక అనుభూతులను చేయడానికి బదులుగా, మీ బలహీనతల కారణంగా ప్రాప్తికి బదులు ఫిర్యాదులు చేస్తారు, నిందిస్తారు. నిరాశతో ఫిర్యాదు చేసినా, స్నేహంతో ఫిర్యాదు చేసినా మీ భక్తులు కూడా ఫిర్యాదులు చేస్తూ నిందలు వేస్తూ ఉంటారు. నిందలు మీకు బాగా తెలుసు, అందుకే వినిపించడం లేదు. 

తండ్రి చెప్తున్నారు - దయా హృదయులుగా కండి, నిరంతరం దయా భావనను ఉంచుకోండి, కానీ దయా భావనకు బదులు అహంకారము, అపోహ (భ్రమ/వహం) ఏర్పడుతూ ఉంది. భక్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అపోహ అనగా ఇది చేద్దామా, ఇలా అవుతుందా, అవ్వదా, ఇలా అయితే అవ్వదు కదా......... ఈ విషయాల్లో దయా భావాన్ని మర్చిపోతారు. స్వయం పట్ల, సర్వుల పట్ల దయా భావన ఉండాలి. అపోహ(వహం) స్వయం పట్ల, సర్వుల పట్ల కూడా ఉంటుంది. ఒకవేళ ఈ అపోహ అనే రోగం వృద్ధి చెందితే ఇది కాన్సర్ లాంటి రోగమైపోతుంది. ప్రారంభ దశలో ఉన్నవారు బ్రతుకుతారు, చివరి దశలో ఉన్నవారు బ్రతకడం కష్టం. జీవించలేరు, మరణించలేరు. అలా ఇక్కడ కూడా పూర్తి అజ్ఞానులు కాలేరు, పూర్తి జ్ఞానులుగా కూడా కాలేరు. వారి గుర్తు ఏమనగా - "నేను ఇలాగే ఉన్నాను” అని అంటారు. ఇతరుల పట్ల అయితే "వీరు ఇంతే" అనే స్లోగన్ ను పదే పదే అంటూ ఉంటారు. ఎంతగా పరివర్తన చేయాలని ప్రయత్నించినా మళ్ళీ ఆ పాటే పాడుతూ ఉంటారు. క్యాన్సర్ రోగి బాగా తింటాడు, త్రాగుతాడు. బయటికి బాగా కనిపిస్తాడు, కానీ లోపల శక్తిహీనంగా ఉంటాడు. అపోహ రోగగ్రస్తుడు కూడా బయటికి తనను తాను బాగా నడిపించుకుంటాడు, బయటికి ఏ బలహీనతను కనిపించనివ్వడు, ఎవరైనా లోపాలు చెప్తే స్వీకరిస్తాడు. కానీ లోలోపల ఆత్మ అసంతుష్టమైన కారణంగా సంతోషము, సుఖము ప్రాప్తిలో బలహీనమవుతూ ఉంటాడు. అలాగే రెండవది అహంభావం. దయా భావనకు గుర్తు ప్రతి మాటలో, సంకల్పంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకుడదు. దయా భావన ఉన్నవారికి ఎక్కడ చూసినా తండ్రియే తండ్రి కనిపిస్తారు. అహం భావన ఉన్నవారు ఎక్కడకు వెళ్లినా, ఎక్కడ చూసినా నేనే అని అంటారు. వీరు "నేను-నేను” అనే మాలను స్మరించేవారు తండ్రి మాలను స్మరించేవారికి నేను అనే భావన తండ్రిలోనే ఇమిడిపోయి ఉంటుంది. దీనినే ప్రేమలో లీనమగుట అని అంటారు. వీరు లవలీన ఆత్మలు. వారు “నేను-నేను” అనే దాంట్లో లీనమైన ఆత్మలు. ఇప్పుడు అర్థమయిందా. మిమ్మల్ని అనుసరించేవారు(కాపీ చేసేవారు) పూర్తి కల్పంలో ఉన్నారు. మీరు భక్తులకు మాస్టర్ భగవంతులు. సత్య, త్రేతాయుగాలలో ప్రజలకు ప్రజాపితలు. సంగమయుగంలో బాప్ దాదా పేరును, కర్తవ్యాన్ని ప్రత్యక్షం చేసే ఆధారమూర్తులు. తమ శ్రేష్ఠ కర్మ ద్వారా పరివర్తన ద్వారా తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలన్నా లేక వ్యర్ధ కర్మ ద్వారా, సాధారణ నడవడిక ద్వారా తండ్రికి చెడ్డపేరు తేవాలన్నా పిల్లల చేతిలోనే ఉంది.

వినాశ కాలంలో విశ్వానికి మహాకళ్యాణకారిగా మహావరదానీ, మహాదానీ, శ్రేష్ఠ పుణ్యాత్మల స్వరూపంలో ఉంటారు. అంటే అన్ని కాలాలలో ఎంత శ్రేష్ఠ ఆత్మలయ్యారు. ప్రతి కాలంలోనూ ఆధార మూర్తులు. ఈ విధంగా తమను తాము భావిస్తున్నారా. ఆది, మధ్య, అంత్యం మూడు కాలాల పరిచయం స్మృతిలోకి వచ్చింది. వీరు ఒక్కరే కాదు, మీ వెనుక మిమ్ములను అనుసరించేవారు చాలా మంది ఉన్నారు, కావున సదా ప్రతి సంకల్పంలో కూడా అటెన్షన్ ఉండాలి. మంచిది.

అలాంటి మూడు కాలాల్లో శ్రేష్ఠంగా, సదా ఒక్క బాబా స్మృతిలో సమర్థ స్వరూపులు, సదా దయా హృదయులు, ప్రతి సెకెండు ప్రాప్తి స్వరూపులు, ప్రాప్తి దాతలు, అలాంటి బాప్ సమాన్ సదా సంపన్న స్వరూప ఆత్మలకు బాప్ దాదా గారి యాద్ ప్యార్ మరియు నమస్తే.

టీచర్స్ పట్ల అవ్యక్త బాప్ దాదా మహావాక్యాలు :- టీచర్ల వాస్తవిక స్వరూపమే నిరంతర సేవాధారులు. ఇది బాగా తెలుసు కదా. సేవాధారుల విశేషత ఏమిటి? సేవాధారులు సఫలీకృతులుగా దేని ద్వారా అవుతారు. సేవలో సదా నిమగ్నమై ఉండాలి. అలాంటి సేవాధారుల విశేషత - నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేశాను - ఈ భావాన్ని కూడా త్యాగం చేయాలి. దీనినే మీరు త్యాగమును కూడా త్యాగం చేయడం అని అంటారు. నేను సేవ చేశాను అని అంటే, సేవలో సఫలత రాదు. నేను చేయలేదు, నేను చేసేవాడిని, చేయించేవారు తండ్రి అనే స్మృతి ఉండాలి. అప్పుడు తండ్రి మహిమ వస్తుంది. నేను సేవాధారిని, నేను చేశాను, నేను చేస్తాను, ఈ నాది అనే భావన సేవాధారి లెక్కలో వచ్చిందంటే, అది సేవలో సఫలతను రానివ్వదు. ఎందుకంటే సేవలో నాది అనే భావన మిక్స్ అయ్యిందంటే అది స్వార్థ పూరిత సేవ అవుతుంది, త్యాగభరిత సేవ కాదు. ప్రపంచంలో రెండు రకాల సేవాధారులు ఉంటారు - ఒకరు స్వార్థంతో కూడిన సేవాధారులు, రెండవవారు స్నేహంతో కూడిన త్యాగమూర్తి సేవాధారులు. మీరు ఎలాంటి సేవాధారులు? ఇంతకుముందు వినిపించాను కదా - నాది అన్న భావన బాబా ప్రేమలో లీనమైపోతే, వారిని సత్యమైన సేవాధారీలని అంటారు. నేను, నువ్వు అనే భాషయే సమాప్తమైపోతుంది. చేయించేవారు బాబా, మేము నిమిత్తము. ఎవరైనా నిమిత్తం కావచ్చు. నాది అనే భావన వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది? మై, మై(నేను, నేను) అని ఎవరంటారు(మేక). నేను, నేను అన్నప్పుడు మోహం వచ్చేస్తుంది. మేక తల ఎప్పుడూ వంగి ఉంటుంది, సింహం తల పైకి ఎత్తబడి ఉంటుంది. ఎక్కడైతే నాది అనే భావన వస్తుందో అక్కడ ఎదో ఒక కోరిక కారణంగా వంగిపోతారు. సదా నషాలో తల ఉన్నతంగా ఉండదు. ఏదో ఒక విఘ్నం కారణంగా తల మేక వలె క్రిందికి వంగి ఉంటుంది. గృహస్థుల జీవితం కూడా మేక వలె ఉంటుంది, ఎందుకంటే సదా వంగి ఉంటారు కదా. నమ్రతతో వంగి ఉండటం అది వేరే విషయం, అది మాయ వంచలేదు, ఈ నాది అనే భావన మాయ మేక వలె తయారు చేసేస్తుంది. బలవంతంగా తలను క్రిందికి దించేస్తుంది, కళ్ళను క్రిందికి దించుతుంది. సేవలో నాది అనే భావన కలవడం అంటే బానిసలుగా అవ్వడం. తర్వాత వ్యక్తికి బానిసగా, పాత్రకు బానిస, వస్తువులకు బానిస, వాయుమండలానికి బానిస, ఏదో ఒక దానికి బానిసలుగా అయిపోతారు. తమ సంస్కారాలకు కూడా బానిసలుగా అయిపోతారు. బానిసలనగా. పరవశులు. బానిసగా ఉన్న వ్యక్తి పరవశమయ్యే ఉంటాడు. సేవాధారులలో ఈ సంస్కారం ఉండనే ఉండరాదు.

సేవాధారులు ఛాలెంజ్ చేయు వారిగా వుంటారు. తలపైకి ఎత్తుకొనే ఎప్పుడూ ఛాలెంజ్ చేస్తారు, తప్పు జరిగి ఉంటే తల దించుకొని మాట్లాడతారు. సేవాధారులనగా ఛాలెంజ్ చేయువారు, మాయకు మరియు విశ్వంలోని ఆత్మలకు తండ్రి ఛాలెంజ్ ను ఇచ్చేవారు (తెలిపేవారు). ఎవరైతే పాత సంస్కారాలను ఛాలెంజ్ చేసినవారుగా ఉంటారో వారే ఈ ఛాలెంజ్ ను చేయగలరు. మొదట తమ సంస్కారాలను ఛాలెంజ్ చేయండి, తరువాత సాధారణ విఘ్నాలను ఛాలెంజ్ చేయండి. అలాంటి సేవాధారులను విఘ్నాలు ఎప్పుడూ ఆపలేవు. ఛాలెంజ్ చేసేవారు మాయ పర్వత రూపాన్ని కూడా సెకెండులో ఆవ గింజంతగా చేసేస్తారు. మాయను గురించి ఒక డ్రామా చేస్తారు కదా - అందులో మీరు ఏమంటారు? సత్యమైన సేవాధారులు అనగా తండ్రి సమానులు, ఎందుకనగా తండ్రి మొట్టమొదట స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? “నేను విశ్వ సేవాధారిని”. సేవాధారిగా కావడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఒక్క జన్మలో చేసిన సేవ అనేక జన్మలకు కిరీటధారులుగా, సింహాసనాధికారులుగా చేస్తుంది. సంగమయుగము సేవ చేసే యుగము కదా. అది ఎంత సమయం వరకు? చెప్పాలంటే సంగమయుగం ఆయువు తక్కువే. అందులోనూ సేవ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి చాలా తక్కువ సమయం లభిస్తుంది. సుమారు 50-60 సంవత్సరాలు సేవ చేశారనుకోండి, 5000 సంవత్సరాలలో 60 తీసి వేయండి, మిగిలినదంతా ప్రాలబ్దమే. 60 సంవత్సరాలు సేవ, మిగిలినదంతా ప్రాప్తి. ఎందుకనగా సంగమయుగ పురుషార్థానుసారము పూజ్యులుగా అవుతారు. పూజ్యులుగా అయ్యే దానిని బట్టి నెంబరు వారుగా పూజారులుగా అవుతారు. పూజారులు కూడా నెంబరువారుగా అవుతారు. పూజ్యులుగా అయ్యే దానిని బట్టి నెంబరు వారీ పూజారులుగా అవుతారు. పూజారులలో కూడా నెంబరు వారుగా అవుతారు. చివరి జన్మ కూడా ఎంత బాగున్నారో చూడండి. మంచి పురుషార్థుల చివరి జన్మ ఇంత బాగుందంటే, ముందు జన్మ ఎలా ఉండి ఉండవచ్చు. సుఖంతో పోల్చుకుంటే ఇది దు:ఖం అని చెప్పవచ్చు. ధనికుడు కొంచెం పేదవాడైతే ఇలాగే పోలుస్తారు కదా. ఒక గొప్ప వ్యక్తికి సగం డిగ్రీ జ్వరం ఉన్నా, ఫలానా వారికి జ్వరం వచ్చిందని అంటారు, అదే పేదవానికి 5 డిగ్రీలు జ్వరం వచ్చినా ఎవ్వరూ అడగనే అడగరు. అలాగే మీరు కూడా ఇంత దు:ఖితులుగా కారు, కానీ అతి సుఖాన్ని పొందిన లెక్కతో దు:ఖం పొందారని అంటారు. చివరి జన్మలో కూడా భికారీగా అయితే కాలేదు కదా. ఇంటింటి వద్ద రెండు రొట్టెలు అడుక్కునేవారిగా అయితే కాలేదు, అందుకే పురుషార్థం చేసే సమయం చాలా తక్కువ, ప్రాలబ్ధ సమయం చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ప్రాలబ్ధము ఎంత శ్రేష్ఠంగా ఉంది. ఎంత సమయం లభిస్తుందో గుర్తుంటే ఎంత మంచి స్థితి తయారవుతుంది? శ్రేష్ఠంగా అయిపోతుంది కదా. కనుక సేవాధారిగా అవ్వడం అనగా మొత్తం కల్పమంతా ప్రాప్తిని పొందే అధికారిగా అవ్వడం. సంగమ యుగమంతా సేవ చేస్తూనే ఉండాలా అని ఆలోచించకండి. ప్రాప్తి పొందుకొనేటప్పుడు పూర్తి కల్పమంతా పొందుకుంటునే ఉన్నామని అనరు కదా. లభిస్తుందని గుర్తుంది కదా. ఒకటికి లక్ష రెట్లు అవుతుందంటే లెక్క కూడా ఉంటుంది కదా. సేవాధారులుగా అవ్వడం అంటే పూర్తి కల్పమంతా సదా సుఖీలుగా అవ్వడం. ఇది తక్కువ అదృష్టమేమీ కాదు. టీచర్లు అనండి, సేవాధారులనండి. ఎందుకనగా శ్రమకు వేయి రెట్ల ఫలితం లభిస్తుంది, ఆ శ్రమ కూడా ఏ మాత్రం ఇక్కడ కూడా విద్యార్ధులకు దీది, దాదీగా అయిపోతారు. టైటిల్ అయితే దొరుకుతుంది కదా. 10 సంవత్సరాల విద్యార్థి కూడా రెండు సంవత్సరాల టీచరును దీది, దాది అని అనడం ప్రారంభిస్తారు. ఇక్కడ కూడా ఉన్నతమైన స్థితిలో చూస్తారు కదా. గౌరవం అయితే ఇస్తారు కదా. ఒకవేళ సత్యమైన సేవాధారులైతే ఇక్కడ కూడా గౌరవం లభించేందుకు యోగ్యులైపోతారు. ఒకవేళ కల్తీ ఉంటే ఈ రోజు దీది, దాదీ అంటారు. రేపు మీ గురించి మొత్తం వినిపిస్తారు. సేవలో కల్తీ ఉంటే, గౌరవంలో కూడా కల్తీయే కల్తీ ఉంటుంది. అందుకే సేవాధారులనగా బాప్  ​సమానమైనవారు సేవాధారులనగా తండ్రి అడుగులో అడుగు వేసేవారు, కొంచెం కూడా ముందు, వెనుక కాదు. మనస్సులో కానీ, వాచాలో కానీ, కర్మణాలో కానీ, సంపర్కంలో కానీ అన్నింటిలోనూ అడుగు జాడల్లో నడవాలి. అడుగులో అడుగు వేయుటను ఫుట్ స్టెప్ అంటారు. ఏమనుకుంటున్నారు? మీరు అలాంటి గ్రూపు వారే కదా? టీచర్లు సదా సహజయోగులే కదా. టీచర్లు శ్రమను అనుభవం చేస్తే, విధ్యార్ధుల పరిస్థితి ఎలా ఉంటుంది. మంచిది. 

Comments

  1. Sukriya ❤❤baba. Divya gnan gupth gnan muje sikaye. Muje apna banaliye. Mera sowbagy ko abhi badalonga. Sukriya🌹🌹🌹🌹🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹oom shanthi🙏🙏🙏 🙏🙏🙏

    ReplyDelete

Post a Comment