02-10-1981 అవ్యక్త మురళి

02-10-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సదా 'మిలనము' అనే ఊయలలో ఊగేందుకు ఆధారము"

  ఈ రోజు నలువైపులా స్మృతిలో ఉన్న పిల్లలను బాప్ దాదా సాకారము లేక ఆకారములో, సన్ముఖములో చూస్తూ స్మృతికి బదులుగా పదమారెట్లు ప్రియస్మృతులను తెలుపుతున్నారు. కొందరు తనువుతో, కొందరు మనస్సుతో ఒకే మిలనపు సంకల్పంలో, ఒక్కరి స్మృతిలోనే స్థితులై ఉన్నారు. బాప్ దాదా ఖజానాలైతే ఇచ్చే ఉన్నారు. సాకారం ద్వారా, ఆకార అవ్యక్త రూపం ద్వారా అన్ని ఖజానాలకు అధికారులుగా చేసేశారు. ఎప్పుడైతే అన్ని ఖజానాలకు యజమానులుగా అయ్యారో, ఇంకా ఏమి మిగిలి ఉంది? ఏమైనా మిగిలి ఉందా? బాప్ దాదా కేవలం అధికారులకు సలాం(వందనం) చేయుటకు వచ్చారు. చూడటంలో అయితే మాస్టర్ గా అయ్యేపోయారు, ఇంకా ఏం మిగిలి ఉంది?

విన్నదానిని లెక్కించండి, వినిపించినదానిని లెక్కించండి. చాలా విన్నారు, చాలా వినిపించారు. వింటూ, వింటూ వినిపించేవారిగా కూడా అయిపోయారు. వినిపించేవారు ఇక ఏం వినాలి? ఇతరులకు చెప్పేవారికి ఇంకా ఏమి చెప్పాలి? మీ పాటే ఉంది కదా. అనుభవం యొక్క పాటను పాడ్తారు - "పొందవలసినదంతా పొందాను - ఇక ఏ పని మిగిలి ఉంది”. ఇది ఎవరి పాట? బ్రహ్మాబాబాదా లేక బ్రాహ్మణులది కూడానా? ఈ పాట మీదే కదా? కావున తండ్రి కూడా అడుగుతున్నారు - ఇంకా ఏమైనా మిగిలి ఉందా? తండ్రి మీలో ఇమిడిపోయారు, మీరు తండ్రిలో ఇమిడిపోయారు. ఇమిడిపోయిన తర్వాత ఇంకా ఏమి మిగిలి ఉంది? ఇమిడిపోయారా లేక ఇమిడిపోతున్నారా? ఏమంటారు? ఇమిడిపోయారా లేక ఇమిడిపోతున్నారా? నది మరియు సాగరుని మేళా అయితే జరిగిపోయింది కదా. ఇమిడిపోవడం అనగా మిలనం చేయడం. మరి మిలనాన్ని జరుపుకున్నారు కదా? సాగరం నుండి వేరుగా లేదు, గంగ సాగరం నుండి వేరుగా లేదు. ఇది గంగ మరియు సాగరుని అవినాశి మేళా. ఇమిడిపోయారు అనగా సమానమైపోయారు. సమానంగా అయ్యే వారికి బాప్ దాదా కూడా స్నేహంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈసారి బాప్ దాదా కేవలం చూచేందుకే వచ్చారు. యజమానుల ఆజ్ఞను అంగీకరించి కలవడానికి వచ్చారు. యజమానులకు కాదు అని చెప్పలేరు. కనుక “చిత్తం"(అలాగే) అనే పాఠాన్ని చదివి హాజరయ్యారు. అలాగే 'తతత్వం' కూడా. బాప్ దాదా ఆదికాలం నుండి “తతత్వం” అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంకల్పం, స్వరూపం రెండింట్లో మీరు తతత్వం యొక్క వరదానులు. ధర్మము, కర్మ రెండింట్లో తతత్వం యొక్క వరదానులు. అలాంటి వరదానులు ఎల్లప్పుడూ సమీపము మరియు సమానతను అనుభవం చేస్తూ ఉంటారు. బాప్ దాదా ఇలాంటి సమీప, సమాన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అమృతవేళ నుండి రోజు పూర్తయ్యే వరకు కేవలం ఒక్క మాటను ధర్మము, కర్మలోకి తీసుకొస్తే సదా మిలనపు ఊయలలో ఊగుతూ ఉంటారు. ఈ మిలనపు ఊయలలో ఊగుతూ ఉంటే ప్రకృతి మరియు మాయ ఇద్దరూ మీ ఊయలను ఊపే దాసులుగా అయిపోతారు. సర్వ ఖజానాలు మీ శ్రేష్ఠ ఊయలకు అలంకారముగా అయిపోతాయి. శక్తులను, గుణాలను, శ్రమతో ధారణ చేసే పని ఉండదు. కానీ అవే స్వయంగా మీ శృంగారమై మీ ఎదుటకు స్వతహాగా వస్తాయి. ఈ మిలనపు ఊయలలో తండ్రి మరియు మీరు(ఆప్, బాప్) సమానంగా అనగా ఇమిడిపోయి ఉంటారు. అలాంటి ఊయలలో సదా ఊగడానికి ఆధారం ఒకే మాట - “బాప్ సమాన్”

సమానంగా లేకపోతే ఇమిడిపోలేరు. ఒకవేళ ఇమిడిపోవడం రానట్లయితే సంగమ యుగాన్ని పోగొట్టుకోవడమే. ఎందుకనగా సంగమ యుగమంటే నదిని, సాగరాన్ని కలిపే మేళా. మేళా అనగా ఇమిడిపోవడం, మిలనం చేయడం. మరి ఇమిడిపోవడం వస్తుందా? మేళాను జరుపుకోనట్లయితే ఏం చేస్తారు? అలజడి చెందుతారు. కనుక ఝమేలా అయినా ఉంటుంది లేక మేళా అయినా ఉంటుంది(అలజడి లేక కలయిక). ఒంటరిగా ఉన్నామని పిల్లలు అంటారు, కానీ తండ్రి చెప్తారు - ఒంటరిగా ఉండనే ఉండవద్దు. ఒంటరితనంలో కూడా బాబా జతలో ఉన్నారు. సంగమ యుగమే కంబైండుగా ఉండే యుగము. తండ్రితో అయితే వేరుగా కాలేరు కదా. సదా తోడుగా ఉన్నారు. పోతే చిన్న, చిన్న పిల్లలు గొడవల్లో ఇరుక్కుపోతారు. గొడవలు కూడా ఒక రకం కావు, అనేక రకాలున్నాయి. 'మేళా' ఒక్కటే ఉంటుంది. గొడవలు అనేకముంటాయి. మేళాలో ఉంటే గొడవలు(ఝమేలే) సమాప్తమైపోతాయి. ఇప్పుడు సంపన్నతను ప్రాలబ్దముగా చేసుకోండి. అల్పకాలిక ప్రాలబ్ధాన్ని సమాప్తం చేసి సంపూర్ణత యొక్క సంపన్నతా ప్రాలబ్ధాన్ని అనుభవంలోకి తీసుకురండి. మంచిది.

ఇలాంటి బాప్ సమానంగా ఉండేవారు, సదా తండ్రితో మిలనం చేస్తూ ఊయలలో ఊగేవారు, పొందవలసినదంతా పొందాను - అనే సర్వ ప్రాప్తి స్వరూపులు, సదా ప్రతి సంకల్పం, మాట, కర్మలో చిత్తం (అలాగే) అని భగవంతుని ఆజ్ఞను పాలన చేసేవారు, ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలకు, సాకారం ద్వారా లేక ఆకారం ద్వారా మిలనం చేసే దేశ విదేశాలలోని పిల్లలందరికి, బాలకుల నుండి మాలికులయ్యే వారికి, తండ్రి సలాం (వందనం) మరియు యాద్ ప్యార్, జత జతలో శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే. 

పార్టీలతో ప్రాణ అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మిలనము - కర్ణాటక జోన్ :-- 

1) అందరూ సదా సాక్షి స్థితిలో స్థితులై ప్రతీ కర్మను చేస్తున్నారా? సాక్షిగా ఉంటూ కర్మ చేసేవారికి స్వత:గా తండ్రి తోడు(జత) అనుభవము కూడా అవుతుంది. సాక్షిగా లేకుంటే తండ్రి కూడా జతలో ఉండరు. కావున సదా సాక్షి స్థితిలో స్థితమై ఉండండి. దేహంతో కూడా సాక్షి, దేహ సంబంధాలతో, దేహంతో సాక్షిగా అయినప్పుడు స్వత:గానే ఈ పాత ప్రపంచంతో సాక్షిగా అయిపోతారు. చూస్తూ, సంపర్కంలోకి వస్తూ సదా భిన్నంగా, ప్రియంగా ఉంటారు. ఈ స్థితియే సహజయోగీ స్థితిని అనుభవం చేయిస్తుంది. కావున సదా సాక్షిగా ఉండండి. దీనినే సదా జతలో ఉంటూ కూడా నిర్లేపము అని అంటారు. ఆత్మ నిర్లేపము కాదు, కానీ ఆత్మాభిమాన స్థితి నిర్లేపము అనగా మాయ లేపము లేక ఆకర్షణతో భిన్నంగా ఉంటారు. భిన్నంగా ఉండుట అనగా నిర్లేపము. మరి సదా అలాంటి స్థితిలో స్థితులై ఉన్నారా? మాయ మీపై ఏవిధమైన దాడి చేయరాదు. తండ్రికి బలిహారమయ్యేవారు సదా మాయ దాడి నుండి సురక్షితంగా ఉంటారు. బలిహారమైన వారిపై దాడి జరగదు. కనుక మీరు అలా ఉన్నారు కదా? ఎలాగైతే ఫస్టు ఛాన్స్ దొరికిందో అలా బలిహారమవుటలో, మాయ దాడి నుండి అతీతముగా ఉండుటలో కూడా మొదటి నెంబరు. ఫస్టు అర్థమే ఫాస్ట్ గా తీవ్రంగా) వెళ్ళడం. కావున ఈ స్థితిలో సదా ఫస్ట్. సదా సంతోషంగా ఉండండి, సదా భాగ్యశాలురుగా ఉండండి. మంచిది. 

2) ఎలాగైతే తండ్రి గుణాలను వర్ణిస్తారో అలా స్వయంలో కూడా ఆ సర్వగుణాలను అనుభవం చేస్తున్నారా? ఎలాగైతే తండ్రి జ్ఞాన సాగరులు, సుఖ సాగరులుగా ఉన్నారో, అలాగే స్వయాన్ని జ్ఞాన స్వరూపం, సుఖ స్వరూపంగా అనుభవం చేస్తున్నారా? ప్రతి గుణం యొక్క అనుభవం కేవలం వర్ణించడమే కాకుండా అనుభవం ఉండాలి. సుఖ స్వరూపమైనప్పుడు, సుఖ స్వరూప ఆత్మ ద్వారా సుఖమునిచ్చే కిరణాలు విశ్వంలో వ్యాపిస్తాయి. ఎందుకనగా మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులు. కనుక సూర్యుని కిరణాలు ఎలాగైతే పూర్తి విశ్వంలో వ్యాపిస్తాయో అలా జ్ఞాన సూర్యుని పిల్లలైన మీ జ్ఞానము, సుఖము, ఆనంద కిరణాలు సర్వ ఆత్మలకు చేరుకుంటాయి. ఎంత ఉన్నతమైన స్థానము మరియు స్థితిలో ఉంటారో అంత నలువైపులా స్వతహాగా వ్యాపిస్తూ ఉంటాయి. అలాంటి అనుభవీ మూర్తులుగా అయ్యారా? వినడం, వినిపించడం చాలా జరిగిపోయింది, ఇప్పుడు అనుభవాన్ని పెంచుకోండి. మాట్లాడటం అనగా స్వరూపులుగా తయారు చేయడం, వినడం అనగా స్వరూపులుగా అవ్వడం. 

3) మీరు సదా ఖుషీ ఖజానాలతో ఆడుకునేవారు కదా? ఖుషీ కూడా ఒక ఖజానా, ఈ ఖజానా ద్వారా అనేక ఆత్మలను సుసంపన్నంగా చేయగలరు. ఈ రోజుల్లో విశేషంగా ఈ ఖజానా యొక్క అవసరం చాలా ఉంది. మిగిలినవన్నీ ఉన్నాయి, ఖుషీ లేదు. మీ అందరికీ సంతోషపు గనులు లభించాయి. లెక్కలేనంత ఖజానా లభించింది. ఖుషీ ఖజానాల్లో కూడా రకాలున్నాయి కదా. ఒకసారి ఒక విషయానికి, ఇంకోసారి ఇంకో విషయానికి సంతోషము కలుగుతుంది. ఒకసారి బాలకుడిని అన్న ఖుషీ మరోసారి అధికారినన్న ఖుషీ. ఎన్ని రకాల ఖుషీ ఖజానాలు లభించాయి. వాటిని వర్ణిస్తూ ఇతరులను కూడా సమృద్ధిగా చేయవచ్చు. కనుక ఈ ఖజానాలను సదా గుర్తుంచుకోండి, సదా ఖజానాలకు అధికారులు కండి. 

సదా తండ్రి ద్వారా లభించిన శక్తులను కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి. తండ్రి ఏమో శక్తులను ఇచ్చేశారు. ఇప్పుడు కేవలం వాటిని కార్యంలో ఉపయోగించండి. కేవలం లభించాయి అన్న ఖుషీలోనే ఉండకండి, కానీ లభించినవాటిని స్వయం పట్ల, సర్వుల పట్ల ఉపయోగించండి, అప్పుడు సదా సంపన్న స్థితిని అనుభవం చేస్తారు. 

4) అందరూ వరదానీ ఆత్మలే కదా? ఈ సమయంలో విశేషంగా భారతదేశంలో ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? వరదానులను. దేవీలనగా వరదానీలు. దేవీలను విశేషంగా వరదానీ రూపంలో స్మృతి చేస్తారు. కనుక మమ్ములనే స్మృతి చేస్తున్నారని అనుభవమవుతుందా? భక్తుల పిలుపులు అనుభవమవుతున్నాయా లేక కేవలం జ్ఞానం ఆధారంగా అనుకుంటున్నారా? ఒకటి తెలుసుకోవడం, రెండవది అనుభవమవ్వడం. వరదానీ మూర్తులుగా అయ్యేందుకు ఏ విశేషత ఉండాలో అనుభవమవుతుందా? మీరందరూ వరదానులే కదా. మరి వరదానుల విశేషత ఏది? వారు సదా తండ్రి సమానంగా, సమీపంగా ఉండేవారిగా ఉంటారు. ఒకసారి బాప్ సమానంగా, ఇంకోసారి బాప్ సమానంగా కానట్లయితే స్వ పురుషార్థులు, వరదానులుగా కాలేరు. ఎందుకనగా తండ్రి పురుషార్థం చేయరు, సదా సంపన్న స్వరూపంలో ఉంటారు. చాలా పురుషార్ధం చేస్తున్నారంటే, పురుషార్థులంటే చిన్న పిల్లలు, తండ్రి సమానం కాదు. సమానము అనగా సంపన్నము. అలాంటి సమానంగా ఉండేవారు సదా వరదానులుగా ఉంటారు. మంచిది.

Comments