02-06-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వాత్మలకు ఆధారమూర్తులు, ఉద్దారమూర్తులు మరియు పూర్వీకులు, బ్రాహ్మణుల నుండి దేవతలు.
సదా స్వయం యొక్క పూర్వపు స్థితిలో స్థితులై ఉండేటువంటి, సర్వులకు ఆధారమూర్తి ఆత్మలతో అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -
బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను విశేషంగా రెండు రూపాలలో చూస్తున్నారు. ఆ రెండు రూపాలు ఏమిటో తెలుసా? ఆ రెండు రూపాలు ఏమిటంటే - ఒకటి సర్వులకు పూర్వీకులు. రెండవది సర్వులకు పూజ్యనీయులు. పూర్వీకులు మరియు పూజ్యనీయులు. పూజతో పాటు మహిమాయోగ్యులు కూడా! ఇలా మీ యొక్క రెండు స్వరూపాలు స్మృతి ఉంటున్నాయా! మేమే సర్వ ధర్మస్థాపకులకు లేదా సర్వ ధర్మ ఆత్మలకు పూర్వీకులం అనే స్మృతి ఉంటుందా? బ్రాహ్మణుల నుండి దేవతలు అంటే ఆదిసనాతన దేవిదేవతా ధర్మం యొక్క ఆత్మలు బీజం అంటే బాబా ద్వారా డైరెక్ట్ కాండం రూపంలో ఉన్నారు. సృష్టి వృక్షం యొక్క చిత్రంలో మీ స్థానం ఎక్కడ? ముఖ్య స్థానం కదా! మూల కాండం దీని ద్వారానే సర్వ ధర్మ రూపి శాఖలు ఉత్పన్నం అయ్యాయి. కనుక మూల ఆధారం అంటే సర్వులకు పూర్వీకులు, బ్రాహ్మణుల నుండి దేవతలు, ఇలా పూర్వీకులు అంటే ఆదిదేవుని ద్వారా ఆది రచన. ప్రతి ఒక్కరికి తమ పూర్వ స్థితి యొక్క గౌరవం మరియు స్నేహం ఉంటుందా! ప్రతి కర్మకు, కుల మర్యాదలకు, ఆచారవ్యవహారాలకు పూర్వీకులే ఆధారం. కనుక సర్వాత్మలకు ఆధారమూర్తులు, ఉద్దారమూర్తులు పూర్వీకులైన మీరే. ఇలా మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితులై ఉంటున్నారా?
పూర్వీకులకు స్వమానం ఉన్న కారణంగా పూర్వీకుల స్థానానికి కూడా స్వమానం ఉంటుంది. ఏ ధర్మం వారైనా తెలియనప్పటికీ భారతభూమి అంటే పూర్వీకుల స్థానాన్ని మహత్వం యొక్క దృష్టితో చూస్తారు. వెనువెంట సర్వ మహాన్ ప్రాప్తులకు ఆధారమైన సహజయోగం లేదా ఏ రకమైన యోగానికి అయినా, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రాప్తికి కేంద్రంగా భారతదేశాన్నే భావిస్తారు. భారతదేశం యొక్క స్మృతిచిహ్నమైన గీతాశాస్త్రాన్ని సర్వ శాస్త్రాలకు శ్రేష్ఠ స్వమానం యొక్క శాస్త్రంగా భావిస్తారు. విజ్ఞానానికి మరియు శాంతికి రెండింటికి ప్రేరణ ఇచ్చేదిగా గీతాశాస్త్రాన్ని భావిస్తారు. మీ పూర్వీకుల చిత్రం మరియు చరిత్ర చూడాలని మరియు వినాలని మనస్సులో కోరిక ఉంటుంది. పూర్తి గ్రహింపు లేని కారణంగా, స్మృతి లేని కారణంగా, కోరిక ఉన్నప్పటికీ ధర్మం మరియు దేశం యొక్క భిన్నత్వంతో అంత సమీపంగా రాలేకపోతున్నారు. ఈ అన్ని విషయాలకు కారణం, వారందరికీ పూర్వీకులు మీరే. లౌకికంలో కూడా మీ పూర్వీకుల భూమి అంటే స్థానంతో, చిత్రాలతో, వస్తువులతో చాలా స్నేహం ఉంటుంది. అలాగే తెలియకుండానే భారతదేశం యొక్క పాత వస్తువులతో మరియు పాత చిత్రాల యొక్క విలువ ఇతర ధర్మాల వారికి ఇప్పటి వరకు కూడా ఉంది.
ఇలా నిమిత్తంగా అయిన పూర్వీకులు సదా ఈ మహామంత్రాన్ని స్మృతి ఉంచుకుంటారు. ఈ సమయంలో మీ సంకల్పం అంటే మనసా, వాచా మరియు కర్మణా ద్వారా ఏ కర్మ మరియు సంకల్పం నడుస్తుందో అది సర్వాత్మల వరకు చేరుకుంటుందా? అని. కాండం ద్వారానే శాఖలకు శక్తి లభిస్తుంది. అలాగే ఆత్మలైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ఠ సంకల్ప శక్తి, సర్వశక్తుల ప్రాప్తి స్వతహాగా లభిస్తూ ఉంటుంది. ఇంత ధ్యాస ఉంటుందా? పూర్వీకులనే అందరు అనుసరిస్తారు. ఏ సంకల్పం, ఏ కర్మ మీరు చేస్తారో దానిని స్థూల మరియు సూక్ష్మ రూపంలో అందరు అనుసరిస్తారు. ఇంత పెద్ద బాధ్యతాదారునిగా భావిస్తూ సంకల్పం లేదా కర్మ చేస్తున్నారా? పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఉంటుంది. మీరు సతో ప్రధానంగా ఉంటే విశ్వమంతా స్వర్ణిమయుగంలో ప్రకృతి లేదా వాయుమండలం సతో ప్రధానంగా ఉంటుంది. సమయం మరియు స్థితికి ఆధారం, ప్రకృతికి ఆధారం పూర్వీకులైన మీరే. మా కర్మల యొక్క లెక్కానుసారం మా కర్మలకు ప్రాలబ్దం లభిస్తుంది అని అనుకోకండి. కానీ పూర్వీకుల కర్మల యొక్క ప్రాలబ్దం స్వయంతో పాటు, సర్వాత్మలతో మరియు సృష్టిచక్రంతో సంబంధం ఉంది. ఇటువంటి మహాన్ ఆత్మలే కదా? ఇటువంటి స్మృతిలో ఉండటం ద్వారా స్వతహాగానే ధ్యాస ఉంటుంది. ఏ రకమైన సోమరితనం రాదు. సాధారణ లేదా వ్యర్థ సంకల్పం లేదా కర్మ జరుగదు. సదా ఈ శ్రేష్ఠ స్థితిలో ఉండండి. మీ స్థితికి మాయ నమస్కారం చేస్తుంది. పంచవికారాలు మరియు పంచతత్వాలు మీ ముందు దాసీగా అయిపోతాయి మరియు మీరు పంచ వికారాలకు అర్ధకల్పం వరకు వీడ్కోలు ఇచ్చేయండి అని ఆజ్ఞాపిస్తారు. ప్రకృతి సతో ప్రధానంగా, సుఖదాయిగా అయిపోతుంది. పూర్వీకుల స్థితిలో ప్రతి సంకల్పం ద్వారా ఆజ్ఞను ఇస్తే అది వినకపోవటమనేది ఉండదు అంటే ప్రకృతి పరివర్తన కాకపోవటం, పంచ వికారాలు వీడ్కోలు ఇవ్వకపోవటమనేది ఉండదు. అర్ధమైందా! ఈ విధమైన శ్రేష్ఠ స్వమానాన్ని బాబా నలువైపుల ఉన్న మహావీర్ పిల్లలకు ఇస్తున్నారు. అందరు నెంబర్ వారీగా అయితే ఉంటారు. మంచిది.
ఇలా సర్వులకు ఆధారమూర్తులకు, మాయ మరియు ప్రకృతి యొక్క బంధనాల నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా అధికారి మరియు సదా తమ పూర్వీక స్థితిలో ఉండేవారికి, మీ యొక్క ప్రతి సంకల్పం మరియు కర్మ ద్వారా సర్వాత్మలను శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా చేసేటందుకు నిమిత్తంగా భావించేవారికి, ఇలా మాస్టర్ రచయిత, మాస్టర్ సర్వశక్తివాన్, జ్ఞానస్వరూప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment