02-01-1980 అవ్యక్త మురళి

02-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

రాబోయే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది?

  ఈ రోజు బాప్ దాదా ఏ సభను చూస్తున్నారు? ఇది భగవంతుని కుమారులు, కుమార్తెల సభ ఈ సభనే భవిష్యత్తులో రాకుమారులు, రాకుమార్తెల సభ అవుతుంది. సత్యమైన భగవంతుని పిల్లలమైన మేమంతా భగవంతుని కుమారులము, కుమార్తెలము అన్న నశా సదా ఉంటుందా? రాకుమారులు, రాకుమార్తెల జీవితాల కంటే ఈ జీవితము పదమారెట్లు శ్రేష్ఠమైనది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ శ్రేష్ఠతను తెలుసుకొని నిరంతరము అదే తన్మయత్వములో, సంతోషములో ఉంటున్నారా? భగవంతుని కుమారులు, కుమారీలకు ఎంత గొప్ప మహత్వమున్నదను విషయంపై ఈ రోజు తండ్రి మరియు దాదా(బ్రహ్మ)ల ఆత్మిక సంభాషణ జరిగింది. భవిష్య జీవితములో అన్ని సంస్కారాలు ఈ జీవితము నుండే ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో మీరు రాజవంశములో, రాజ్యాధికారులుగా ఉండుట వలన ప్రతి జన్మను సదా సర్వ సంపదలతో సంపన్నంగా, మీ ప్రతి వస్తువు మాలామాల్ గా ఉండి రాజఠీవితో గడుపుతారు. సర్వ ప్రాప్తులు సేవ చేయుటకు ప్రతి ఒక్కరి జీవితములో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఫలాని వస్తువు ప్రాప్తించాలనే కోరిక ఉండదు. కాని సర్వ ప్రాప్తులు నా యజమాని నన్ను ఉపయోగించుకోవాలి అన్న కోరికతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నలువైపులా వైభవాల నిధులన్నీ నిండుగా ఉంటాయి. ప్రతీ వైభవము తమ ద్వారా సుఖమునిచ్చుటకు సదా ఎవరెడీగా ఉంటుంది. సదా సంతోషము కలిగించే సన్నాయి మేళాలు(బాజాలు) ఆటోమేటిక్ గా మోగుతూ ఉంటాయి. మోగించే అవసరముండదు. మీ రచన అయిన వృక్ష సంపద విశ్వపతులైన మీ ముందు తమ ఆకులను కదిలించుట వలన రకరకాల సంగీత వాయిద్యాలను మోగిస్తాయి. వృక్షముల ఆకులు కదులుట, ఊగుట వలన రకరకాల న్యాచురల్ సంగీతంలా ఉంటుంది. ఎలాగైతే ఈ రోజుల్లో అనేక ప్రకారాలైన కృత్రిమ పాటలను తయారు చేస్తున్నారో అలా అక్కడ పక్షుల మాటలే వెరైటీ పాటలుగా ఉంటాయి. చైతన్యమైన అటబొమ్మల వలె మీకు అనేక ప్రకారాలైన ఆటలు చూపిస్తాయి. ఎలాగైతే ఈ రోజుల్లో మనోరంజనం కొరకు రకరకాల మాటలు నేర్చుకుంటారో అలా అక్కడ పక్షులు రకరకాల ధ్వనులతో మీ ఆదేశానుసారము మీ మనసును రంజింపజేస్తాయి. ఫలాలు, పుష్పాలు కూడా అలాగే ఉంటాయి. రకరకాల రుచులు గల ఫలాలుంటాయి. ఇక్కడ ఎలాగైతే ఉప్పు, కారము, తీపి, మసాలాలు మొదలైనవి వేసి రుచి గల పదార్థాలు తయారుచేస్తారో అలా అక్కడ రకరకాల రుచులు గల న్యాచురల్ ఫలాలే ఉంటాయి. అక్కడ పంచదార మిల్లులు మొదలైనవి ఉండవు. పంచదార ఫలాలుంటాయి. ఏ రుచి కావాలంటే ఆ రుచిని న్యాచురల్ ఫలాలతోనే చేసుకోవచ్చు. ఇక్కడలా ఆకుకూరలుండవు. ఫలవుష్పాల కూరలుంటాయి. పూలతో, ఫలాలతో కూరలు తయారుచేసుకుంటారు. పాలైతే నదులలా ప్రవహిస్తూ ఉంటాయి. అచ్ఛా ఇప్పుడే తాగాలనిపిస్తూ ఉందా? న్యాచురల్ రసాల (రుచుల) ఫలాలు వేరుగా ఉంటాయి, తినే ఫలాలు వేరుగా, తాగే ఫలాలు వేరుగా ఉంటాయి. కష్టపడి రసము తీసే అవసరముండదు. ఇక్కడ కొబ్బరిబొండాం నీరు తాగుతారు కదా! అలా అక్కడ ప్రతీ ఫలములో రసము అంత నిండుగా ఉంటుంది. పండు చేతిలోకి తీసుకొని కొంచెం వేలితో నొక్కగానే రసం తాగేయవచ్చు. స్నానం చేసే నీరు కూడా ఈరోజు పర్వతాలలోని వనమూలికల మధ్య నుండి ప్రవహించుట వలన గంగాజలానికి చాలా మహత్వముందో, ఆ నీరు చెడిపోకుండా క్రిములు ఏర్పడకుండా శుద్ధముగా ఉండినందున పావనమని మహిమ చేయబడుతుందో అలా అక్కడ పర్వతాలపై సుగంధభరితమైన వనమూలికలుండుట వలన అక్కడ నుండి వచ్చే నీటికి సహజ సువాసన ఉంటుంది. సెంటు వేయరు కాని పర్వతాలను రాసుకుంటూ ప్రవహించుట వలన, అక్కడ సుగంధభరిత మూలికలుండుట వలన ఆ నీరు సుందరమైన సువాసన కలిగి ఉంటుంది. అక్కడ అమృతవేళలో టేప్ రికార్డరు మేల్కొల్పదు. పక్షులు చేసే సహజ కిలాకిలారాగాలే పాటలుగా ఉంటాయి. అవి విని మీరు మేల్కుంటారు. అక్కడ పొద్దున్నే నిద్ర లేస్తారు. అక్కడ అలసిపోరు. ఎందుకంటే చైతన్య దేవతలు మేల్కొన్న దానికి గుర్తుగానే భక్తిమార్గంలో భక్తులు ఉదయమే లేచి మేల్కొల్పుతారు. భక్తిలో కూడా అమృతవేళకు మహత్యముంది. ఉదయమే మేల్కొంటారు. అయినా వారు సదా జాగృతమైన జ్యోతులుగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ కష్టపడే పనులేవీ ఉండవు. శరీరానికి కష్టముండదు, బుద్ధికీ పని ఉండదు, ఏ బరువూ ఉండదు. అందువలన మేల్కొని ఉన్నా, నిదురిస్తున్నా సమానంగానే ఉంటారు. ఇక్కడయితే ఉదయమే లేవాల్సి వస్తుందని అనుకుంటారు కదా, అక్కడ ఈ సంకల్పము కూడా ఉండదు. అచ్ఛా, అక్కడ ఏమి చదువుకుంటారు? లేక చదువే వద్దని అనుకుంటున్నారా? అక్కడ చదువు కూడా ఒక ఆటగానే ఉంటుంది. ఆడుతూ - ఆడుతూ చదువుకుంటారు. మీ రాజధానిని గురించిన జ్ఞానమైతే ఉండాలి కదా? అందువలన అక్కడ రాజ్యమునకు సంబంధించిన జ్ఞానమే చదువు. కాని అక్కడ ముఖ్యమైన సబ్జక్టు చిత్రలేఖనం (డ్రాయింగ్). చిన్నవారు, పెద్దవారు అందరూ ఆర్టిస్టులుగా ఉంటారు. చిత్రకారులుగా ఉంటారు. సంగీతం, చిత్రలేఖనం, ఆటలు. సంగీతం అనగా పాటలు పాడే విద్య పాటలు పాడ్తారు, ఆడుకుంటారు. వీటి ద్వారానే చదువుకుంటారు. అక్కడ చరిత్ర కూడా పాటలలో, కవితలలో ఉంటుంది. ఇక్కడలా నేరుగా విసిగించే(బోర్ కొట్టే) విధంగా ఉండదు. రాస్ నృత్యము కూడా ఒక ఆటే కదా, అక్కడ నాటకాలు కూడా ఉంటాయి. కాని సినిమాలు ఉండవు. నాటకాలుంటాయి. నాటకాలు మనోరంజనంగా, హాస్యపూరితంగా ఉంటాయి. నాటకశాలలు కూడా చాలానే ఉంటాయి. అక్కడ మహళ్ల లోపల విమానాల వరుస ఉంటుంది. విమానం నడుపుట కూడా చాలా సులభంగా ఉంటుంది. అన్ని పనులు అణుశక్తితో జరుగుతాయి. మీ కొరకే ఈ చివరి అన్వేషణ (ఇన్వెన్షన్) జరిగింది.

కరెన్సీలో(ధనము) బంగారు నాణాలుంటాయి. అయితే ఈ రోజుల్లో వలె ఉండవు. రూపురేఖలు మారిపోయి ఉంటాయి. చాలా మంచి మంచి డిజైన్లలో ఉంటాయి. ధనము ఇచ్చి పుచ్చుకొనుట కేవలం నామమాత్రంగా ఉంటుంది. ఉదాహరణానికి ఇక్కడ మధువనంలో అందరూ ఒకే పరివారానికి చెందినవారైనా వేరు వేరు డిపార్ట్మెంట్లు, వేరు వేరు ఇన్ చార్జర్లు తయారు చేశారు కదా. పరివారములోని వారైనా ఏదైనా కావలసి వస్తే ఆ డిపార్ట్ మెంట్ ఇన్ చార్జ్ నుండి తీసుకుంటారు కదా, ఒకటి ఇస్తారు, మరొకటి తీసుకుంటారు. అలా అక్కడ కూడా కుటుంబ పద్ధతి ఉంటుంది. దుకాణదారులని, కొనుక్కునేవారమనే భావముండదు. అందరికీ యజమానులమనే భావనే ఉంటుంది. కేవలం పరస్పరము వస్తువులను మార్చుకుంటారు. కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకుంటారు. ఏ వస్తువూ లోటుగా ఉండదు. ప్రజలకు కూడా ఏ లోటూ ఉండదు. ప్రజలు కూడా తమ శరీర నిర్వహణకు కావలసిన దానికంటే పదమారెట్లు (కోటాను కోట్ల రెట్లు) భర్ పూర్ గా ఉంటారు. అందువలన మేము తీసుకునేవారు, వీరు ఇచ్చేవారు (యజమానులు) అనే భావముండదు. స్నేహంగా ఇచ్చి పుచ్చుకుంటారు. లెక్కాచారాల టెన్షన్ ఉండదు. రిజిస్టర్లు అనగా ఖాతా పుస్తకాలు ఉండవు.

రత్నజడిత సంగీత వాయిద్యాలుంటాయి. సులభంగా వాయించేవిగా ఉంటాయి. కష్టపడే అవసరముండదు. వేలితో తాకగానే పలుకుతాయి, పాటలు వినిపిస్తాయి. చాలా మంచి డ్రస్సులు ధరిస్తారు. పనిని బట్టి డ్రస్సు ఉంటుంది. అలాగే స్థానాన్ని బట్టి డ్రస్సు ఉంటుంది. వేరు వేరు కార్యాలకు వేరు వేరు డ్రస్సులు ధరిస్తారు. శృంగారాలు (అలంకారాలు) కూడా చాలా రకాలు ఉంటాయి. రకరకాల కిరీటాలు, ఆభరణాలు ఉంటాయి. కాని అవి బరువుగా ఉండవు. దూది కంటే తేలికగా ఉంటాయి. అసలు బంగారులో వజ్రాలు పొదగబడి ఉంటాయి. వాటి నుండి రంగురంగుల కాంతులు వెదజల్లబడూ ఉంటాయి. ఒక్కొక్క వజ్రములో ఏడు రంగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రంగురంగుల ట్యూబ్ లైట్లు వెలిగిస్తారు కదా, అక్కడ వజ్రాలే రంగు రంగుల ట్యూబుల వలె వెలుగునిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి మహలు రంగు రంగుల లైట్లతో అలంకరింపబడి ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ అనేక అనేక దర్పణాల నుంచి ఒకే వస్తువును అనేక వస్తువులుగా అనేక రూపాలలో చూపుతారో అలా అక్కడ రత్నాలు ఎలా అమర్చబడి ఉంటాయంటే పైనున్న దృశ్యము ఒకటిగా కాక అనేక రూపాలుగా కనిపిస్తుంది. బంగారు కాంతులు, వజ్రాల కాంతులు అనగా రెండిటి కలయిక ద్వారా వచ్చే మెరుపుతో మహళ్లు వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి. సూర్య కిరణాలు పడుట వలన బంగారు మరియు వజ్రాలు వేలాది లైట్లు వెలుగుతున్నట్లు మెరిసిపోతూ ఉంటాయి. ఇక్కడ వలె వైర్లు మొదలైనవి అవసరముండవు. ఈ రోజుల్లో ఎలాగైతే రాజు కుటుంబాలలో కరెంటుతో వెలిగే రకరకాల బల్బులు రకరకాల డిజైన్లలో చూస్తున్నారో అలా అక్కడ అసలైన వజ్రాల దీపాలైనందున ఒక్కొక్క దీపము అనేక దీపాల పని చేస్తుంది. ఎక్కువగా శ్రమ చేసే పని ఉండదు. అన్నీ సహజంగా ఉంటాయి.

భాష కూడా చాలా శుద్ధమైన హిందీ భాషనే ఉంటుంది. ప్రతీ శబ్ధము ఒక సత్యాన్ని ఋజువు చేస్తుంది.(విదేశీయులతో) మీ ఇంగ్లాండు, అమెరికాలు ఎక్కడకు పోతాయి? అక్కడ ఎవరూ మహళ్లు కట్టుకోరు. మహళ్లు భారతదేశములోనే కట్టుకుంటారు. అక్కడికి కేవలం విహరించుటకు వెళ్తారు. అవి పిక్నిక్ స్థానాలుగా, విహరించే స్థానాలుగా ఉంటాయి. అవి కూడా కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నీ కాదు. విమానాలు శబ్దము కంటే వేగంగా పయనించి వేగం కంటే గమ్యాన్ని చేరుకుంటాయి. ఇంత వేగం గల విమానాలుంటాయి. ఫోనులో మాట్లాడినంత త్వరగా విమానం ద్వారా చేరుకుంటారు. అందువలన ఫోన్ చేసే అవసరముండదు. విమానాలు కుటుంబానికి వేరుగా, ఒక్కొక్క వ్యక్తికి వేరువేరుగా కూడా ఉంటాయి. ఏ సమయానికి ఏవి కావాలో అవి ఉపయోగించుకుంటారు. విమానంలో కూర్చున్నారా? ఇప్పుడు సత్యయుగములోని విమానాన్ని వదిలి బుద్ధి విమానములోకి వచ్చేయండి. బుద్ధి విమానానికి కూడా అంత వేగముందా? సంకల్ప వేగము గలదిగా ఉందా? సంకల్పము చేస్తూనే సూర్య చంద్రులకు అతీతంగా మీ ఇంటికి చేరిపోవాలి. ఇటువంటి బుద్ధి విమానము సదా ఎవరెడీగా ఉందా? సదా విఘ్నాలకు అతీతంగా ఉందా? ఏ విధమైన ఆక్సిడెంట్ (ప్రమాదము) జరగరాదు, పరంధామానికి వెళ్లాలి. అయితే భూమినే వదలలేకుంటే లేక ఏదైనా పర్వతాన్ని ఢీకొని క్రింద పడిపోతే ఎలా చేరుకుంటారు? వ్యర్థ సంకల్పాలు కూడా ఒక పర్వతాన్ని ఢీ కొనడం వంటిది. కనుక ప్రమాదాలకు అతీతంగా బుద్ధి రూపి విమానం ఎవరెడీగా ఉందా? ముందు ఇక్కడ ఈ విమానం ఎక్కితే తర్వాత అక్కడ ఆ విమానం లభిస్తుంది. అలా ఎవరెడీగా ఉన్నారా? ఎలాగైతే స్వర్గము మాటలు వింటున్నప్పుడు హా, హా (ఆ,ఆ) అంటూ ఉండినారో అలా ఈ మాటలు వింటున్నపుడు హా హా అని అనరా!

ఈరోజు వతనంలో స్వర్గ పటాన్ని (మ్యాపును) తీశారు. అందుకే ఇప్పుడు మీకు కూడా వినిపించాను. బ్రహ్మా బాబా తయారుచేస్తున్నాడు కదా. స్వర్గములోకి వెళ్లుటకు స్వర్గము మ్యాపును తీస్తున్నాడు. మీరంతా రెడీగా ఉన్నారు కదా, అదేమిటో మీకు తెలుసు కదా? తండ్రితో పాటు ఎవరెవరు స్వర్గము గేటు ద్వారా పోతారు? అందుకు స్వర్గము పాస్ తీసుకున్నారా? గేట్ పాస్ అయితే తీసుకున్నారు కాని తండ్రితో పాటు స్వర్గము గేటు ద్వారా పోయేందుకు పాస్ ఉండాలి. ఒకటేమో వి.వి.పి గేట్ పాస్, ఇంకొకటి రాష్ట్రపతి పాస్ కూడా ఉంటుంది. ఇది విశ్వపతికి లభించే గేట్ పాస్. ఏ గేట్ పాస్ తీసుకున్నారు? మీ పాసు చెక్ చేసుకోండి. 

ఇలా వర్తమాన సమయంలో భగవంతుని పుత్రుల నుండి రాకుమారులుగా, ప్రకృతికి యజమానుల నుండి విశ్వానికి యజమానులు, మాయాజీతుల నుండి జగత్ జీతులు, ఒకే సంకల్పము చేసే విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు. ఇటువంటి సర్వసిద్ధి స్వరూపులు, సదా సమీపంగా (పాస్) ఉండేవారు, సమీపంగా ఉండి జతలో గేటు దాటుకునేవారు. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే.

పార్టీలతో కలయిక (ఢిల్లీ జోన్) -

1)మీ రాజధానిని అలంకరించుటకు స్మృతి మరియు సేవల బ్యాలన్స్ ఉంచండి - అందరూ మీ రాజధాని ఎలా ఉంటుందో ఆ సమాచారమంతా విన్నారు కదా. ఇప్పుడు రాజధానిని తయారుచేసే బాధ్యత విశేషంగా ఢిల్లీ నివాసులపై ఉంది. ఈ బాధ్యత ఉందని భావించి నడుచుకుంటున్నారా? సేవ ఎవరో చేస్తే ఫలితము మేము తినాలని లేదు కదా. సేవ చేసి ఫలము భుజించాలి. ప్రపంచములో కూడా ఎవరైనా స్వంతంగా తనే కష్టపడి ఏదైనా వస్తువును తయారుచేస్తే వారికి విశేషమైన సంతోషముంటుంది కదా, మీరంతా విశేషంగా ఏ బాధ్యతను తీసుకొని రాజధానిని తయారు చేస్తున్నారు? రాజధానిని అలంకరించే సేవ మరియు స్మృతుల బ్యాలన్స్ లో ఉండండి. ప్రతి సంకల్పములోనూ సేవ ఉండాలి. ప్రతి సంకల్పములో సేవ ఉంటే వ్యర్థము నుండి విడుదలైపోతారు. కనుక ఏ సంకల్పము ఉత్పన్నమైనా ఏ సెకండు గడచినా అందులో సేవ మరియు స్మృతుల బ్యాలన్స్ ఉంది కదా? అని చెక్ చేసుకోండి. అలా ఉంటే ఫలితమెలా ఉంటుంది? ప్రతి అడుగులో ఉన్నతమయ్యే కళ, ప్రతి అడుగులో పదమ్(కోటాను కోట్లు) జమ అవుతూ ఉంటుంది. అప్పుడే రాజ్య అధికారులుగా అవుతారు. కనుక సేవ మరియు స్మృతుల చార్టు పెట్టండి. సేవ జీవితములో ఒక అంగముగా తయారైపోవాలి. ఎలాగైతే శరీరములో అన్ని అవయవాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవితములో విశేషమైన అంగము సేవ. చాలా ఎక్కువగా సేవ చేయుటకు ఛాన్స్ లభించుట కూడా భాగ్యానికి ఒక గుర్తు. స్థానము లభించుట, సాంగత్యము లభించుట, ఛాన్స్ లభించుట - ఇది కూడా భాగ్యానికి గుర్తే. మీ అందరికీ సేవ చేయుటకు సువర్ణావకాశము లభించింది. జంప్ చేయుటకు సహయోగము లభించింది. అందువలన సేవకు ఋజువునివ్వాలి కదా. మనసా, వాచా, కర్మణా, సంబంధము, సంపర్కాలతో ప్రతిరోజూ సేవలో మార్కులు జమ చేసుకోవాలి. ప్రతి సేవాకేంద్రములో ప్రతి వెరైటీ పుష్పగుచ్ఛానికి స్మృతి చిహ్నము తప్పక ఉండాలి. అన్ని రకాల వి.వి.పిల స్యాంపుల్ ఉండాలి. విశేషమైన స్థానాలు వి.వి.ల సేవ చేయాలి.

2)ఏకరస స్థితిని తయారు చేసుకొనుటకు సహజ సాధనం - ఒక్క తండ్రితో సర్వ సంబంధాలను అనుభవం చెయ్యండి - సదా ఒక్క తండ్రి స్మృతిలో ఉండి వారితోనే సర్వ సంబంధాలు నిభాయించేవారు ఏకరస స్థితిలో ఉంటున్నారా? ఒక్క తండ్రి ద్వారా సర్వ రూపాలు అనగా సర్వ ప్రాప్తులను అనుభవము చేయువారిని ఏకరస స్థితి ఉండువారని అంటారు. అలా ఉన్నారా? రెండవదేదియూ కనిపించరాదు. అలా ఏదైనా కనిపిస్తూ ఉందా? తండ్రి తప్ప ఇంకే వస్తువైనా చూడదగింది ఉందా? తండ్రి తప్ప వేరే ఎవ్వరి నుండైనా వినాల్సినదేమైనా ఉందా? చాలామందిని చూచారు. విన్నారు కూడా దాని పరిణామాన్ని కూడా చూచారు. ఇప్పుడు ఒక్కరి స్మృతిలో ఏకరసంగా ఉండండి. అనేకమందిని వదిలి ఒక్కరి స్మృతిలో ఉండండి, ఒక్కరినే చూడండి, ఒక్కరి ద్వారానే వినండి, ఒక్కరితోనే కూర్చోండి... అనేకమందితో నిభాయించుట కష్టమవుతుంది. ఒక్కరితో అయితే సులభమవుతుంది. అనేక జన్మలు అనేకమందితో నిభాయించారు. తండ్రితో వేరు, టీచరుతో వేరు, గురువుతో వేరుగా - సంబంధాలు నిభాయించారు. ఇప్పుడు ఒక్కరితోనే నిభాయించమని తండ్రి తెలిపించారు. ఎక్కడ చూచినా అక్కడ ఒక్కరినే చూడండి. దీనినే భావన కారణంగా భక్తిమార్గంలో సర్వవ్యాపి అని అనేశారు. వారు అంతా మీరే మీరు....... అని అనేస్తారు. సదా తండ్రి తోడును అనుభవము చేస్తారు. ఎక్కడకెళ్లినా అక్కడ తండ్రే తండ్రి అని అనుభవం చేయాలి.

3)మేరాపన్ (నాది అనుదానిని) సమాప్తము చేయుట ద్వారా డబల్ లైట్ స్థితి - అందరూ తండ్రి నుండి అధికారాన్ని పూర్తిగా తీసుకున్నారా? అధికారాన్ని పూర్తిగా తీసుకోవాలంటే పాతదంతా పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. ఈ రెండు పనులు (వ్యాపారాలు) చేశారు కదా. లేక నీదంతా నాది, కాని నాది తాకకండి అని అనుట లేదు కదా. కేవలం ఒక్క శబ్ధము మారిపోతే డబల్ లైట్ గా అయిపోతారు. ఏ మాత్రము 'మేరాపన్' వచ్చిందంటే పై నుండి కిందికి వచ్చేస్తారు. నీది నీకే అర్పిస్తున్నాను అని అన్నారంటే సదా డబల్ లైట్ గా సదా పైన ఎగురుతూ ఉంటారు అనగా ఉన్నత స్థితిలో ఉంటారు. 

Comments

Post a Comment