02-01-1978 అవ్యక్త మురళి

* 02-01-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారల యొక్క మెరుపులు.

బాప్ దాదా ప్రియమైన మరియు అదృష్టవంతులైన పిల్లలందరినీ చూస్తూ హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంపై భాగ్యం యొక్క తార ప్రకాశించటం బాబా చూస్తున్నారు. సాకార సృష్టి యొక్క ఆత్మలు ఆకాశం వైపు చూస్తారు మరియు ఆకాశం కన్నా అతీతంగా ఉన్న తండ్రి సాకార సృష్టిలోకి భూమిపై ఉన్న తారలను చూసేందుకు వచ్చారు. ఏ విధంగా చంద్రునితో పాటు నక్షత్రాలు మెరవడం అతి సుందరంగా ఉంటుందో అలాగే చంద్రుడెన బ్రహ్మ పిల్లలు అనగా తారలతోనే సుందరంగా కనిపిస్తారు. పిల్లలపై తల్లి యొక్క స్నేహం ఎక్కువగా ఉంటుందా లేక తల్లిపై పిల్లల యొక్క స్నేహం ఎక్కువగా ఉంటుందా? పిల్లలు, ఆటలలో నిమగ్నమైపోతే తల్లిని మర్చిపోతారు. తల్లి యొక్క మమత పిల్లలను గుర్తు చేయిస్తుంది. అలాగే స్నేహం లేకపోతే పిల్లలకు ప్రాప్తి కూడా జరగదు.

ఈరోజు అమృతవేళ విశేషంగా ఈ సమయంలో మధువనంలో సంఘటితమై ఉన్న ఆత్మలు బాబా యొక్క స్మృతితో పాటు తల్లి అయిన బ్రహ్మ యొక్క స్మృతిని కూడా ఎక్కువగా చేశారు. ఈరోజు వతనంలో కూడా సూర్యుడు బాబా గుప్తంగా ఉన్నారు కాని, చంద్రుడు అనగా పెద్ద తల్లి అయిన బ్రహ్మ బ్రాహ్మణ పిల్లలతో, సితారలతో లేక తారలతో మిలనం జరపడంలో లవలీనమై ఉన్నారు. ఈ రోజు వతనంలో ఏ దృశ్యం ఉంది? మాతాపితలు మరియు పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ సదా నడుస్తూ ఉంటుంది. కానీ, ఈ రోజు మాతాపితలది జరిగింది. అది ఏ ఆత్మిక సంభాషణే మీకు తెలుసా?

ఈరోజు అమృతవేళలో బ్రహ్మాబాబా బ్రాహ్మణుల యొక్క స్నేహములో విశేషంగా ఉన్నారు ఎందుకంటే బ్రహ్మ యొక్క సాకార రూపంలోని కర్మ భూమి, సేవా భూమి లేక తల్లి మరియు తండ్రి రెండు రూపాలతో సాకార రూపంలో పిల్లలతో జరిపే మిలనం యొక్క భూమిగా స్వయం ద్వారా తనువు మరియు మనస్సు ద్వారా అలంకరింపబడిన ఈ మధువన భూమిపై ఉన్న ఈ తారల యొక్క ప్రకాశమును చూసి ఈ రోజు బ్రహ్మబాబాకు లేక తల్లికి సాకార రూపంలో సాకార సృష్టి యొక్క విశేష స్మృతి కలిగింది. బ్రహ్మ ఇలా అన్నారు - "చంద్రుడు తారలతో సమాన రూపంలో మిలనం జరపడంలో ఇప్పటికి ఇంకా ఎంత సమయం పడుతుంది?" అనగా వ్యక్తము మరియు అవ్యక్త రూపము యొక్క మిలనము ఎప్పటివరకు? జవాబు ఏమి లభించి ఉంటుంది.

"ఎప్పుడైతే తల్లి అందరూ ఎవర్రెడీగా ఉన్నారు అని అంటుందో అప్పుడు జరుగుతుంది” అని బాబా అన్నారు. కావుననే తల్లి అయిన బ్రహ్మ పరిక్రమణ చేసేందుకు బయలుదేరింది. నలువైపులా చుట్టి వస్తూ బ్రాహ్మణులందరి యొక్క ఆత్మికతను చూశారు. అంతా చుట్టి వచ్చిన తర్వాత వతనంలో ఆత్మిక సంభాషణ జరిగినప్పుడు “నా పిల్లలు లక్ష్యంలో నెంబర్ వన్ గా ఉన్నారు, అందరూ సమయం కొరకు ఎదురుచూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు తప్పక తయారైపోతారు" అని బ్రహ్మా బాబా అన్నారు, అప్పుడు బాబా రాజధాని తయారైపోయిందా అని అన్నారు. ఈ రోజు బ్రహ్మ బ్రాహ్మణ పిల్లల వైపు మాట్లాడుతున్నారు. 16,108 మాల తయారైపోయింది, బ్రాహ్మణుల సంఖ్యను ఎంత చెబుతున్నారు? 50,000 మందిలో 16,108 మంది వెలువడరా? మణులు తయారుగా ఉన్నాయి కానీ, నెంబర్ వారీగా స్మరింపబడేందుకు చివరి క్షణం ఇంకా మిగిలి ఉంది. మణులు తయారైనాయి కానీ వాటి స్థానం ఫిక్స్ అవ్వలేదు. స్థానంలో లాస్ట్ ఫాస్ట్ అవ్వవచ్చు. ఈ రోజు బ్రహ్మా 16,108 అనగా సహయోగీ ఆత్మల అందరి యొక్క భాగ్యం యొక్క రేఖను ఫైనల్ చేశారు. ఈ కారణంగానే భాగ్య విదాత, భాగ్యమును పంచేవాడు అని బ్రహ్మనే అంటారు, అలాగే స్మృతిచిహ్న రూపంలో కూడా జన్మదినం నాడు లేక నామసంస్కారం నాడు జన్మపత్రిని బ్రాహ్మణులే తయారుచేస్తారు కావున తల్లి అయిన బ్రహ్మ 16,108 మణుల యొక్క నిశ్చితమైన భాగ్యమును వినిపించారు, మీరందరూ ఇందులో ఉన్నారు కదా!

ఈ రోజు విశేషంగా బ్రహ్మ ద్వారా విదేశీ మరియు దేశీ పిల్లల ఇరువురి మహిమ యొక్క గుణగానం జరుగుతుంది. ఏ విధంగా ఆదిలో వచ్చిన పిల్లల యొక్క భాగ్యమునకు మహిమ ఉందో అలాగే అవ్యక్త రూపంలో పాలన తీసుకునే క్రొత్త పిల్లలకు కూడా ఇంతటి మహిమ ఉంది. ఆదిలో ప్రత్యక్ష జీవితం యొక్క ప్రభావం లేదు కేవలం ఒక్క బాబా యొక్క స్నేహమే ప్రమాణంగా ఉండేది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నదేమీ స్పష్టంగా లేదు, గుప్తంగా ఉండేది. కానీ, ఆత్మలు దీపంపై బలిహారమయ్యే దీపపు పురుగులలా ఉండేవారు, అలాగే కొత్త పిల్లల ముందు అనేక జీవితాల యొక్క ఉదాహరణ ఉంది, ఆది మధ్యాంతములన్నీ స్పష్టంగా ఉన్నాయి. 84 జన్మల యొక్క జన్మపత్రి కూడా స్పష్టంగా ఉంది. పురుషార్థం మరియు ప్రారబ్దము రెండూ స్పష్టంగా ఉన్నాయి. కానీ, తండ్రి మాత్రం అవ్యక్తంగా ఉన్నారు. బాబా యొక్క పాలన అవ్యక్త రూపంలో ఉన్నాకానీ, వ్యక్త రూపము యొక్క అనుభవమును కలిగిస్తుంది. అవ్యక్తమును వ్యక్తంగా అనుభవం చేసుకోవడం, సమీపంగా మరియు తోడుగా అనుభవం చేసుకోవడం ఈ అద్భుతం క్రొత్త పిల్లలదే. ఆదిలో పిల్లల యొక్క అద్భుతం ఏ విధంగా ఉందో అలాగే చివరిలో వచ్చిన, ముందు ముందుకు వెళ్ళిపోయే పిల్లలది కూడా అద్భుతమైన పాత్రయే. ఇలా ఆ అద్భుతం యొక్క గుణగానమును బాబా చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఆత్మిక సంభాషణ విన్నారు కదా!

ఫిర్యాదుల యొక్క మాలలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ ఫిర్యాదుల యొక్క మాలలు బ్రహ్మను స్నేహరూపంగా చేస్తున్నాయి. ఈ రోజు బ్రహ్మ విశేషంగా పిల్లల యొక్క స్నేహంలో ఇమిడి ఉన్నారని వినిపించాను కదా! స్నేహమూర్తిగా అయి ఉండి కూడా డ్రామా యొక్క సీటుపై కూర్చుని ఉన్నారు కావుననే స్నేహమును ఇముడ్చుకుంటున్నారు. సాగరుని పిల్లలైన మీరు కూడా ఇముడ్చుకునేవారే కదా! స్నేహమును చూపించగలరు మరియు ఇముడ్చుకోగలరు కూడా. మర్జ్ మరియు ఇమర్జ్ చేయడం మీకు బాగా వచ్చు కదా! ఎందుకంటే మీరు హీరో యాక్టర్లు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపమును ధారణ చేయగలరు అనగా పాత్రను అభినయించగలరు, అచ్ఛా

ఇటువంటి సదా స్నేహి, సర్వశక్తులతో సంపన్నమైన, సదా అతి ప్రియమైన మరియు అతీతమైన, ఎల్లప్పుడూ తమ మెరుస్తున్న భాగ్యపు సితారను చూసేవారికి, సర్వశ్రేష్ఠ భాగ్యవంతులకు, వర్తమాన మరియు భవిష్య సింహాసనాధికారులకు ఇటువంటి పదమ పతులకు క్షణంలో స్వయాన్ని లేక సర్వులను పరివర్తన చేసే విశ్వకళ్యాణకారీ పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో మిలనము: - ఈ రోజు అమృతవేళ బ్రహ్మాబాబా విశేష ఆత్మల యొక్క భాగ్యరేఖనేదైతే ఫైనల్ చేశారో అందులో ఫైనల్ గా ఏ రత్నాలు ఉండి ఉంటారు? 8 రత్నాలు ఫైనల్ అయి ఉంటారా? మాతాపితల వద్ద నిశ్చితమై ఉన్నారు కానీ ఇప్పుడిక స్టేజీపై ప్రసిద్ధం చేయాలి. బాబా వద్ద 108 మంది నిశ్చితమై ఉన్నారు. అది ఎలా? ఏ విధంగా వర్తమానం స్పష్టంగా ఉందో అలా బాబా వద్ద భవిష్యత్తు కూడా సుస్పష్టంగా ఉంది, అలాగే అనన్యమైన పిల్లల వద్ద కూడా భవిష్యత్తు అలాగే స్పష్టమవుతోంది ఎందుకంటే బాబాతో పాటు అన్ని కార్యాలలోనూ సమీపంగా మరియు సహయోగిగా ఉన్నారు కాబట్టి అష్ట రత్నాలు చీఫ్ జస్టిస్ వంటివారు. జస్టిస్ యొక్క నిర్ణయము అవునో కాదో ఫైనల్ చేయబడుతుంది. బాబా ప్రెసిడెంట్, కానీ చీఫ్ జస్టిన్లు పిల్లలే, నిర్ణయం పిల్లలదే. చీఫ్ జస్టిస్ యొక్క జడ్జిమెంట్ సదా యదార్ధంగా ఉంటుంది. జస్టిస్ యొక్క నిర్ణయంపై చీఫ్ జస్టిస్ అవును లేక కాదు అని అనవచ్చు. కానీ, చీఫ్ జస్టిస్ యొక్క నిర్ణయానికి ఎంతో విలువ ఉంటుంది. ఎప్పటివరకైతే భవిష్యత్తు కూడా వర్తమానం వలే స్పష్టంగా ఉండదో అప్పటివరకూ జడ్జిమెంట్ ను యదార్థంగా ఎలా ఇవ్వగలరు? వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క సమానతనే బాబా యొక్క సమానత అని అంటారు. ఇటువంటి స్థితిని అనుభవంలోకి తీసుకువచ్చారా?

ఈరోజు సాకార రూపంలో స్మృతి చేశారా లేక అవ్యక్త రూపంలో చేశారా? తారలను చూస్తే చంద్రుడు గుర్తుకు వస్తాడు కదా! కావున ఈ రోజు బ్రహ్మ కూడా గుర్తుచేశారు. అచ్చా!

పార్టీలతో మిలనము: - 

గుజరాత్ పార్టీ:- గుజరాత్ వారికి విశేషంగా చివరిలో వచ్చినా, వేగంగా ముందుకు వెళ్ళే పాత్ర వరదానముగా లభించింది. గుజరాత్ వారికి డ్రామానుసారంగా ఆత్మలైన మాకు విశేషమైన భాగ్యం లభించింది అన్న నషా ఉంటుంది. ఏ విధంగా స్థానం యొక్క రూపంలో గుజరాత్ మధువనానికి సమీపంగా ఉందో అలాగే పురుషార్థంలో కూడా సామీప్యతను తీసుకురావడంలో స్వతహాగా వరదానం కూడా డ్రామానుసారంగా ప్రాప్తించింది. ఏ విధంగా స్థానం యొక్క రూపంలో సమీపంగా ఉన్నారో అలాగే జ్ఞానధారణ యొక్క లెక్కలో కూడా ఇది ధారణా యోగ్యమైన భూమి. భూమి బాగుంటే ఏ విధంగా ఫలాలు త్వరగా వెలువడతాయో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాలు వెలువడతాయో అలాగే గుజరాత్ కు భూమి యొక్క మరియు సమీపంగా ఉండడం యొక్క వరదానం లభించింది. ఇటువంటి వరదానీ ఆత్మలు పురుషార్థంలో ఎంత వేగంగా ఉంటారు? ధారణ యొక్క సబ్జెక్టులో గుజరాత్ దేశం యొక్క నివాసులకు లిఫ్ట్ లభించింది. కలియుగ ప్రపంచం యొక్క లెక్కలో అతి తమో ప్రధానత యొక్క లెక్కలో చూస్తే ఇది ఇంకా బాగానే ఉంది కావుననే గుజరాత్ వారు తమ రెండు వరదానాల లిస్ట్ ద్వారా వేగంగా చేరుకోవాలి. వరదానాల యొక్క లాభమును తీసుకున్నట్లయితే ప్రతి కష్టమైన విషయమును సహజంగా అనుభవం చేసుకుంటారు. చూసేందుకు చాలా కష్టంగా ఉంటుంది కానీ అతి సహజమైన రీతిలో దానిని సమాధానపర్చగల్గుతారు. దీనినే పర్వతం కూడా దూది సమానంగా అయిపోవడం అని అంటారు. అవగింజ కాస్త గట్టిగ ఉంటుంది కానీ దూది మెత్తగా మరియు తేలికగా ఉంటుంది, కావున ఇలా అనుభవం చేసుకుంటున్నారా? అచ్ఛా!

మీరు వినడం ఎంతగా వింటున్నారు? ఈ సీజన్ లో కూడా ఎంత విని ఉంటారు? ఇప్పుడు డ్రామా యొక్క తీరును బట్టి శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. ఈ శరీరము యొక్క అలజడి కూడా నిమిత్తంగా, శిక్షణ ఎంతో అయిపోయింది అని వినిపిస్తోంది. ఇప్పుడు విన్న తర్వాత ఇక ఇముడ్చుకోవాలి అనగా స్వరూపంగా అవ్వాలి. ఇప్పుడు ఇక ఇది దాని సీజనే. వినడం యొక్క సీజన్ ఎన్ని సంవత్సరాలు నడిచింది? సాకారుని ద్వారా కానీ, రివైజ్ కోర్సు ద్వారా కానీ వినడం యొక్క కోర్సు ఎంతగానో నడిచింది కావున ఇప్పుడిక స్వరూపం ద్వారా సేవ చేయాలి. ఇప్పుడిక కేవలం ఈ ఒక్క సీజన్ మాత్రమే మిగిలి ఉంది కదా! దీని ద్వారానే ప్రత్యక్షత యొక్క ఢంకా మ్రోగుతుంది. శబ్దం ఆగిపోతుంది, నిశ్శబ్దత ఏర్పడుతుంది. కానీ, సైలెన్స్ ద్వారానే డంకా మ్రోగుతుంది. ఎప్పటివరకైతే నోటి ద్వారా నగాఢా మ్రోగుతూ ఉంటుందో అప్పటివరకూ ప్రత్యక్షత జరగదు. ఎప్పుడైతే ప్రత్యక్షత యొక్క ఢంకా మ్రోగుతుందో అప్పుడు నోటి యొక్క ఢంకాలు ఆగిపోతాయి. సైలెన్స్ విజయం పొందుతుంది అని అంటారే కానీ, వాణి పొందుతుంది అని అనరు. సమయం యొక్క సమాప్తికి గుర్తు ఏమిటి? శబ్దంలోకి రావాలనే కోరిక స్వతహాగానే కలగదు. ప్రోగ్రాం అనుసారంగా కాదు సహజంగానే ఆ స్థితి ఏర్పడుతుంది. సాకార బాబాను చూసినప్పుడు సంపూర్ణతకు గుర్తుగా ఏం కనిపించింది? రెండు నిమిషాలైనా లేక ఒక్క నిముషమైనా ఆ స్వరూపం యొక్క గుర్తు ఈ స్థితి ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా శబ్దంలోకి రావడంపై స్వతహాగానే వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు వద్దనుకున్నా కానీ అలవాటు శబ్దంలోకి ఏ విధంగా తీసుకువస్తుందో అలా నడుస్తూ నడుస్తూ కూడా శబ్దం నుండి అతీతంగా అయిపోతారు. ప్రోగ్రాం వేసుకొని శబ్దంలోకి వస్తారు. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు విజయం యొక్క ఢంకా మ్రోగనున్నది అని అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో మెజార్టీ అందరికీ సుఖము కన్నా శాంతి ఎక్కువగా కావాలి. వారు ఒక్క క్షణం యొక్క శాంతి అనుభవంను ఎంత శ్రేష్టంగా భావిస్తారంటే స్వయంగా భగవంతుని యొక్క ప్రాప్తి లభించినట్లుగా భావిస్తారు. కావున ఒక్క క్షణంలో శాంతిని అనుభవింపచేయువారు స్వయం శాంతి స్వరూపంలో స్థితులై ఉంటారు కదా! వినాశనం ఎప్పుడు జరుగుతుంది? దానికొరకు ఎవరు నిమిత్తమవుతారు? గడియారపు సూచికలుగా ఎవరవుతారు? గంట మ్రోగేందుకు సూచికయే నిమిత్తమవుతుంది కదా! కావున వినాశనం యొక్క గంట మ్రోగేందుకు సూచిక ఎవరు? సర్వశక్తుల యొక్క స్టాకును జమా చేసుకున్నారా? ఎందుకంటే స్టాకు జమా అవ్వకపోతే అనేక జన్మల యొక్క ప్రాలబ్దమును కూడా పొందలేరు. ఈ ఒక్క జన్మలో అనేక జన్మల కొరకు జమా చేసుకుంటారు. 21 జన్మలు ఆ ప్రారబ్దమును అనుభవిస్తూ ఉండేంతగా జమా చేసుకున్నారా? బికారీ ఆత్మలకు కూడా మహాదానిగా దానం చేయగల్గేంతగా జమా చేసుకున్నారా? సదా స్టాక్ ను పరిశీలించండి. స్టాక్ లో సర్వశక్తులూ కావాలి. ఇముడ్చుకొనే శక్తి ఉంది కానీ సహన శక్తి లేకపోయినా ఫరవాలేదు అని భావించడం కాదు. ఏ శక్తిలో లోపం ఉందో ఆ శక్తిలోనే ఫైనల్ పేపర్ వస్తుంది. ఆరు లేవు కనీసం రెండైనా ఉన్నాయి కదా, ధారణ లేదు సేవ అయితే ఉంది కదా, సేవ లేదు, కనీసం యోగమైతే ఉంది కదా అని ఎప్పుడూ భావించకండి. అన్నీ కావాలి, ఏవిధంగా బాబాలో జ్ఞానము, శక్తి, గుణాలు అన్నీ ఉన్నాయో అలాగే బాబాను ఫాలో చేయండి.

సదా స్వచింతనతో మీ స్టాకును జమా చేసుకోవడంలో నిమగ్నమై ఉండండి. ఈ సమయంను కూడా ముందు ముందు ఎంతగానో తల్చుకోవలసి ఉంటుంది కావున తర్వాత మళ్ళీ ఆలోచించవలసిన అవసరం లేకుండా పశ్చాత్తాప పడకుండా ఉండేందుకు ఇప్పటినుండే స్వచింతనలో నిమగ్నమవ్వండి. సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్టులోనూ ముందుకు తీసుకువెళ్ళడంలో నిమగ్నమవ్వండి. ప్రతి గుణం యొక్క అనుభవంను పెంచుతూ ఉండండి, ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా నవీనతను అనుభవం చేసుకుంటారు. అనుభవీ మూర్తులుగా అయ్యే రిసెర్చ్ ను చేసినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. ఏవిధంగా బాబా సాగరులో అలాగే మాస్టర్ సాగరులుగా అవ్వండి. ఇప్పుడు అటువంటి పురుషార్ధం కావాలి.

సేవాధారులు సేవ యొక్క పాత్రను అభినయించారు. సేవాధారుల యొక్క విశేషత ఏమిటి? దేనిని చూసి అందరూ వీరు ఫస్ట్ క్లాసయిన సేవాధారులు అని అంటారు? సేవ చేయడంలో కూడా నెంబర్‌వారీగా ఉంటారు. నెంబర్‌ వన్‌ సేవా ధారుల యొక్క విశేషత ఏమిటి? నెంబర్ వన్ సేవాధారుల యొక్క విశేషత ఏమిటంటే వారు సేవ చేస్తూ కూడా సేవ ద్వారా బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యాలను కూడా ప్రసిద్ధం చేసేవారిగా కనిపిస్తారే కానీ కేవలం కర్మణా సేవను చేయరు. స్థూలంగా చేస్తున్నా కానీ ప్రతి కర్మ ద్వారా, ప్రతి అడుగు ద్వారా బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యాలను ప్రసిద్ధం చేయాలి. ఇదే ఫస్ట్ క్లాసయిన సేవ. సేవ చేస్తూ కూడా మాస్టర్‌ జ్ఞానసాగరులుగా, సుఖసాగరులుగా, శాంతి సాగరులుగా అనుభవమవ్వాలి. కావున ఇటువంటి లక్ష్యమును ఉంచండి లేక కేవలం కర్మణా సేవలో అలసటలేనివారిగా అవ్వాలి అన్న లక్ష్యమును మాత్రమే ఉంచారా? ఫస్ట్ క్లాసయిన సేవాధారులు అనగా ఒకే సమయంలో మూడు రకాలైన సేవలను చేయగల్గాలి. మూర్తి ద్వారా, మనస్సు ద్వారా మరియు కర్మ ద్వారా కూడా చేయగల్గాలి. మూర్తి ద్వారా అలౌకిక సేవాధారి యొక్క రూపము అనగా ఫరిస్తా స్థితి యొక్క రూపము కనిపించాలి మరియు మనస్సు యొక్క మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా సేవ చేయాలి. ఇలా ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగాలి. వారినే ఫస్ట్ క్లాసయిన సేవాధారులు అని అంటారు. సేవ చేయడం ఒక గుణం. కానీ, మాస్టర్ సర్వగుణాల యొక్క సాగరునిగా ఉండడం ఈ విశేషత ఇంకెక్కడా ఉండజాలదు. అథక్ సేవాధారులుగా అందరూ అవ్వవచ్చు. కానీ ఆల్ రౌండ్ సేవాధారులు, ఒకే సమయంలో మూడు రకాల సేవ చేసేవారు లభించరు. కావున బ్రాహ్మణుల యొక్క విశేషత ఏదైతే ఉందో ఆ లక్ష్యమును పెట్టుకొని దానిని లక్షణముల ద్వారా చూపించాలి.

ఇప్పుడు విశేషంగా ఏ పని చేస్తారు? వినిపించాను కదా! స్మృతి యాత్ర యొక్క, ప్రతి ప్రాప్తి యొక్క, ఇంకా అంతర్ముఖులుగా అయి అతి సూక్ష్మమైన మరియు గుహ్యాతి గుహ్యమైన అనుభవమును చేయండి, రిసెర్చ్ చేయండి, సంకల్పమును ధారణ చేయండి మరియు దాని పరిణామాన్ని చూడండి, సిద్ధిని చూడండి. ఏదైతే సంకల్పం చేశానో అది సిద్ధించిందా లేదా అని, ఏ శక్తినైతే ధారణ చేశానో ఆ శక్తి యొక్క ప్రత్యక్ష రిజల్ట్ ఎంత శాతం ఉంది అని పరిశీలించండి. ఇప్పుడు అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండాలి. వీరందరూ ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ఈ ప్రపంచానికే అతీతంగా ఉన్నారు అని అనుభవమవ్వాలి. కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ ను ఇంకా ముందుకు పెంచండి. కర్మ చేస్తూ యోగము యొక్క శక్తిశాలి స్థితి ఉండేలా అభ్యాసమును పెంచండి. బ్యాలెన్స్ ను ఉంచడం అనగా తీవ్రగతి. బ్యాలెన్స్ లేని కారణంగా నడుస్తూ నడుస్తూ తీవ్రగతికి బదులుగా సాధారణ గతి ఏర్పడుతుంది కావున ఏవిధంగా సేవ కొరకు ఇన్వెన్షన్ చేస్తున్నారో అలాగే ఈ విశేషమైన అనుభవాల యొక్క అభ్యాసము కొరకు కూడా సమయాన్ని తీయండి మరియు నవీనతను తీసుకువచ్చి అందరి ముందూ ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. ఇప్పుడు అందరూ యోగము అంటే స్మృతి అని, యోగము అంటే సంబంధము అని వర్ణన చేస్తూనే ఉన్నారు. కానీ, ఆ సంబంధము యొక్క ప్రత్యక్ష రూపము, ప్రమాణము ఏమిటి, ప్రాప్తి ఏమిటి, దీని యొక్క సూక్ష్మతలోకి వెళ్ళండి. బాహ్య రూపంలో కాదు, ఆత్మికత యొక్క గుహ్యతలోకి వెళ్ళండి అప్పుడు ఫరిస్తా రూపం ప్రత్యక్షమవుతుంది. స్వయంలో ముందు సర్వ అనుభవాలు ప్రత్యక్షమవ్వడమే ప్రత్యక్షత యొక్క సాధనము. విదేశ సేవలో కూడా ఏ రిజల్టును విన్నారు? దేని ప్రభావం పడుతోంది? దృష్టి యొక్క మరియు ఆత్మీయతా శక్తి యొక్క ప్రభావము పడుతుంది. భాషను గూర్చి తెలియకపోయినా ఫరిస్తా స్థితి యొక్క మరియు నయనాల ద్వారా ఆత్మిక దృష్టి యొక్క ప్రభావమే ముద్రగా పడుతుంది. రిజల్టులో ఇదే చూశారు కదా! అంతిమంలో అంతటి సమయమూ ఉండదు, అంతటి శక్తి ఉండదు. నడుస్తూ నడుస్తూ మాట్లాడే శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ, వాణి ఏ పని అయితే చేస్తుందో దాని కన్నా అనేక రెట్లుగా ఆత్మికత యొక్క శక్తి కార్యము చేయగలదు. వాణిలోకి రావడం ఏ విధంగా అభ్యాసమైపోయిందో అలాగే ఆత్మికత యొక్క అభ్యాసము జరిగినట్లయితే వాణిలోకి వచ్చేందుకు మనసు కలగదు. 

Comments