* 01-11-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సేవా సఫలతకు తాళంచెవి.
ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూస్తున్నారు? ఈ రోజు విశ్వ సేవాధారి అయిన బాబా తమ సేవాధారీ పిల్లలను చూస్తున్నారు, అనగా తమ ఈశ్వరీయ సేవాధారులైన పిల్లలను చూస్తున్నారు. ఈశ్వరీయ సేవాధారులుగా ఎవరైతే ఉన్నారో వారికి సదా ఈశ్వరుడు మరియు సేవ అనగా బాబా మరియు సేవ రెండూ గుర్తుంటూనే ఉంటాయి. ఈనాటి ప్రపంచంలో కూడా ఎవరైనా ఎవరి కార్యమైనా చేయకపోతే, సహయోగులుగా అవ్వకపోతే, కనీసం భగవంతుడి పేరు మీద అయినా ఈ పని చేయి అని ఒకరితో ఒకరు అంటూ ఉంటారు, ఎందుకంటే భగవంతుడి పేరు మీద సహయోగము లభిస్తుంది మరియు సఫలత కూడా లభిస్తుంది అని భావిస్తారు. ఏదైనా అసంభవమైన కార్యము హోప్ లెస్ విషయము ఉంటే 'భగవంతుని పేరు తలుచుకుంటే ఆ పని అయిపోతుంది' అని అంటారు. దీని ద్వారా ఏమి నిరూపింపబడుతుంది? అసంభవమైన దానిని సంభవముగా, నిరాశాపరులను ఆశావాదులుగా చేసే కార్యమును బాబా వచ్చి చేసారు. కావుననే ఇప్పటివరకూ కూడా ఈ నానుడి నడుస్తూ వస్తోంది. మీరందరూ ఈశ్వరీయ సేవాధారులు. కేవలం భగవంతుని పేరును తలుచుకొనేవారు కాదు, భగవంతుని తోటివారిగా అయి శ్రేష్ఠ కార్యమును చేసేవారిగా ఉన్నారు. కావున ఈశ్వరీయ సేవాధారులైన పిల్లల యొక్క ప్రతి కార్యము సఫలమయ్యే తీరుతుంది. ఈశ్వరీయ సేవాధారుల యొక్క కార్యంలో ఎటువంటి అసంభవమైన విషయమూ ఉండదు. అన్నీ సంభవమే మరియు సహజమే. ఈశ్వరీయ సేవాధారులైన పిల్లలకు విశ్వపరివర్తన కార్యమేమైనా కష్టమా? అది అయ్యే తీరుతుంది. అటువంటి అనుభవం కలుగుతోంది కదా! దీనినైతే మేము అనేకసార్లు చేశాము, ఇది క్రొత్త విషయమే అనిపించడం లేదు అనే విధంగా అనుభవం చేసుకుంటున్నారా? జరుగుతుందా, జరగదా, ఎలా జరుగుతుంది? అన్న ప్రశ్నే ఉత్పన్నమవ్వదు. ఎందుకంటే మీరంతా బాబా యొక్క తోటివారు. ఇప్పటివరకూ కేవలం భగవంతుని పేరుతోనే అన్ని పనులు జరిగిపోతుంటే మరి వారితో పాటు కార్యము చేసే పిల్లల యొక్క ప్రతి కార్యము సఫలమయ్యే తీరుతుంది కదా! కావున బాప్ దాదా పిల్లలను సదా సఫలతా మూర్తులు అని అంటారు. సఫలతా సితారలు తమ సఫలత ద్వారా విశ్వమును ప్రకాశవంతం చేస్తారు. కావున సదా స్వయాన్ని ఇటువంటి సఫలతామూర్తులుగా అనుభవం చేసుకుంటాన్నారా? నడుస్తూ, తిరుగుతూ ఎప్పుడైనా అసఫలత లేక కష్టము అనుభవమవుతే దానికి కారణము - కేవలం సేవాధారులుగా అయిపోవడమే. అప్పుడు ఈశ్వరీయ సేవాధారులుగా ఉండరు. ఈశ్వరుడిని సేవ నుండి దూరం చేసేస్తారు. కావున ఒంటరిగా ఉన్న కారణంగా సహజమైనది కూడా కష్టమైపోతుంది మరియు లక్ష్యము దూరముగా కనిపిస్తుంది. కాని మీ పేరే ఈశ్వరీయ సేవాధారులు. కావున కంబైండ్ గా ఉన్నవారిని వేరు చేయకండి. కాని వేరు చేసేస్తారు కదా! సదా ఈ పేరు గుర్తు ఉన్నట్లయితే సేవలో స్వతహాగానే ఈశ్వరీయ ఇంద్రజాలము నిండుతుంది. సేవ యొక్క క్షేత్రంలో భిన్న భిన్న రకాల విఘ్నలేవైతే స్వయం ప్రతి లేక సేవా ప్రతి కలుగుతాయో దానికి కూడా కారణము ఇదే. కేవలం సేవాధారులుగా భావిస్తారు కాని ఈశ్వరీయ సేవాధారులుగా భావించరు. కేవలం సేవ కాదు, ఇది ఈశ్వరీయ సేవ అన్న స్మృతి ద్వారానే స్మృతి మరియు సేవ స్వతహాగానే కంబైండ్ అవుతుంది. స్మృతి మరియు సేవ యొక్క సమతుల్యత ఉంటుంది. ఎక్కడైతే సమతుల్యత ఉంటుందో అక్కడ స్వయమూ సదా ఆనంద స్వరూపంగా ఉంటారు మరియు ఇతరుల ప్రతి కూడా దీవెనలు అనగా కృపాదృష్టి సహజంగానే ఉంటుంది. వీరిపై కృప చూపించాలి అని ఆలోచించే అవసరం కూడా ఉండదు. మీరు ఉన్నదే కృపాళులుగా, మీ సదాకాలికమైన పనే కృప చూపించడం. ఈ విధంగా అనాది సంస్కారాలు స్వరూపంగా అయ్యాయా? విశేష సంస్కారాలేవైతే ఉంటాయో అవి స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటాయి. ఆలోచించి చేయరు. స్వతహాగానే జరిగిపోతుంది. పదే పదే నా సంస్కారాలు ఇలా ఉన్నాయి కావున అలా అయిపోయింది అని అంటూ ఉంటారు. నాకు ఆ భావన లేదు, నాకు ఆ ఉద్దేశ్యం లేదు కాని జరిగిపోయింది అని అంటారు. ఎందుకు? ఎందుకంటే ఆ సంస్కారము ఉంది. మీరలా అంటారు కదా? కొందరు నేను క్రోధం చేయలేదు. నా మాట తీరే అలాంటిది అని అంటారు. దీని ద్వారా ఏమి నిరూపింపబడుతుంది? అల్పకాలిక సంస్కారాలు కూడా స్వతహాగానే మా మరియు కర్మలను చేయిస్తూ ఉంటాయి. మరి శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క అనాది మరియు ఒరిజినల్ సంస్కారాలు ఏమిటి? సదా సంపన్నులు మరియు సఫలతా మూర్తులు. సదా వరదానులు మరియు మహాదానులు. కావున ఈ సంస్కారాలు స్మృతిలో ఉండడం ద్వారా స్వతహాగానే సర్వుల ప్రతి కృపాదృష్టి ఉంటుంది.
అల్పకాలిక సంస్కారాలను అనాది సంస్కారాలతో పరివర్తన చేయండి. తద్వారా భిన్న భిన్న రకాలైన విఘ్నాలు, అనాది సంస్కారాలు ఎమర్ట్ అవ్వడం ద్వారా సహజముగానే సమాప్తమైపోతాయి. బాప్ దాదా ఇప్పటివరకూ పిల్లల యొక్క స్వపరివర్తన లేక విశ్వపరివర్తన యొక్క సేవలో శ్రమ ఉండడం చూసి సహించలేకపోతున్నారు. ఈశ్వరీయ సేవాధారులు మరియు శ్రమ! వారి పేరుతోనే పని నడుపుతున్నారు, మరి మీరైతే అధికారులు కదా! మరి మీరు శ్రమించడం ఏమిటి? కేవలం చిన్న పొరపాటు చేస్తారు, అదేమిటి? అదేమిటో తెలుసా? ఏమిటో కూడా బాగా తెలుసు, అయినా కాని ఎందుకు వస్తారు? పరవశులైపోతారు. కేవలం 'నా సంస్కారము, నా స్వభావము' అనే చిన్న పొరపాటు. అనాది కాలానికి బదులుగా మధ్యకాలముగా భావిస్తారు. మధ్య కాలం యొక్క సంస్కారాలను, స్వభావాలను మీ సంస్కారాలుగా భావించడమే ఆ పొరపాటు. ఇది రావణుని స్వభావము, మీది కాదు. పరాయి వస్తువును మీదిగా భావించే ఈ పొరపాటునే చేస్తారు. నాదీ అని అనడము మరియు భావించడం ద్వారా స్వతహాగానే వాటివైపుకి వంగిపోవడం జరుగుతుంది. కావుననే వదలాలనుకున్నా వదల లేకపోతారు. పొరపాటు ఏమిటో అర్థమైందా? కావున సదా ఈశ్వరీయ సేవాధారులము అన్నది గుర్తుంచుకోండి. “నేను చేశాను అని కాదు, ఖుదా నా ద్వారా చేయించారు“ అన్న ఈ ఒక్క స్మృతి ద్వారా సహజముగానే సర్వ విఘ్నాల యొక్క బీజమును సదాకాలికముగా సమాప్తము చేసెయ్యండి. అన్ని రకాల విఘ్నాల యొక్క బీజములు రెండు పదాలలో ఉన్నాయి. అవి ఏ రెండు పదాలు? ఏ రెండు పదాల ద్వారానే విఘ్నము యొక్క రూపము వస్తుంది? విఘ్నాలు వచ్చే ద్వారాలు మీకు తెలుసా? కావున ఆ ప్రసిద్ధమైన రెండు పదాలు ఏమిటి? విస్తారమైతే ఎంతగానో ఉంది కాని ఆ రెండు పదాలలో సారము వచ్చేస్తుంది. 1. అభిమానము మరియు 2. అవమానము. సేవా క్షేత్రంలో విశేషంగా ఈ రెండు దారుల గుండా విఘ్నము వస్తుంది. నేను చేశాను అన్న అభిమానమైనా లేక నన్ను ముందు ఎందుకు ఉంచలేదు. నన్ను ఈ విధంగా ఎందుకు అన్నారు, ఇది నన్ను అవమానపరచడమే అనైనా ఉంటుంది. ఈ అభిమానము మరియు అవమానము యొక్క భావన భిన్న భిన్న విఘ్నాల యొక్క రూపంలో వస్తుంది. మనము ఈశ్వరీయ సేవాధారులమైనప్పుడు చేయువారు మరియు చేయించువారు తండ్రియే అయినప్పుడు మరి అభిమానము ఎక్కడి నుండి వస్తుంది? అవమానము ఎక్కడ జరిగినట్లు? కావున ఇది చిన్న పొరపాటు కదా! కావుననే ఈశ్వరుడిని సేవ నుండి వేరు చేయకండి అని చెప్పడం జరుగుతుంది. సేవలో కూడా కంబైండ్ రూపమును గుర్తుంచుకోండి, ఖుదా మరియు సేవ. మరి ఇది చేయడం రాదా? ఇది చాలా సహజము. శ్రమ నుండి విముక్తులైపోతారు. ఏం చేయాలో అర్థమైందా?
ఇలా సదా అనాది సంస్కారాల స్మృతి స్వరూపులకు, సదా స్వయమును నిమిత్తమాత్రంగా మరియు బాబాను చేయువారు మరియు చేయించువారిగా అనుభవం చేసుకునేవారికి, సదా స్వయం అనాది స్వరూపంగా అనగా ఆనంద స్వరూపంగా ఉంటూ ఎటువంటి విఘ్నం యొక్క బీజమునైనా సమాప్తము చేయడంలో సమర్థులైన ఆత్మలకు ఇటువంటి సదా బాబా యొక్క తోటివారికి, ఈశ్వరీయ సేవాదారులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అదర్ కుమారులతో: - అందరూ స్వయాన్ని బాబా యొక్క స్నేహులుగా మరియు సహయోగీ శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారు కదా? సదా మేము శ్రేష్టాతి శ్రేష్ఠమైన ఆత్మలము అన్న నషా ఉంటుందా? ఎందుకంటే మీరు బాబాతో పాటు పాత్రను అభినయించేవారు. మొత్తం చక్రమంతటిలో ఈ సమయంలో బాబాతో పాటు పాత్రను అభినయించేందుకు నిమిత్తులుగా అయ్యారు. ఉన్నతోన్నతమైన పాత్రను అభినయించేందుకు నిమిత్తులుగా అయ్యారు. ఉన్నతోన్నతుడైన భగవంతునితో పాటు పాత్రను అభినయించేవారు ఎంతటి ఉన్నతమైన ఆత్మలవుతారు! లౌకికంలో కూడా ఎవరైనా శ్రేష్ఠ పదవి కలవారితో పని చేస్తే వారికి కూడా ఎంతటి నషా ఉంటుంది! ప్రైమ్ మినిష్టర్ యొక్క ప్రైవేట్ సెక్రటరీకి కూడా ఎంతటి నషా ఉంటుంది? మరి మీరు ఎవరితో పాటు ఉన్నారు? ఉన్నతోన్నతుడైన బాబాతో పాటు మరియు అందులోనూ ఒక్క కల్పం కొరకు కాదు, అనేక కల్పాలు ఈ పాత్రను అభినయించారు. మరలా సదా అభినయిస్తూనే ఉంటారు. ఇందులో మార్పు జరుగజాలదు. ఇటువంటి నషాలో ఉన్నట్లయితే సదా నిర్విఘ్నముగా ఉంటారు. ఎటువంటి విఘ్నమూ రావడం లేదు కదా? వాయుమండలం యొక్క, వైబ్రేషన్ల యొక్క, సాంగత్యము యొక్క ఎటువంటి విఘ్నమూ లేదు కదా? కమల పుష్ప సమానముగా ఉన్నారా? కమలపుష్ప సమానముగా అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు. నేను బాబాకు ఎంత ప్రియముగా అయ్యాను అన్నదాని లెక్కను మీ అతీతమైన స్థితి ద్వారా లెక్క వేయివచ్చు. ఏదో కొద్దిగా అతీతముగా ఉంటూ మిగిలినది చిక్కుకొని ఉన్నట్లయితే ప్రియముగా కూడా అంతే ఉంటారు. ఎవరైతే సదా బాబాకు ప్రియముగా ఉంటారో వారికి గుర్తు - స్వతః స్మృతి. ప్రియమైన వస్తువు స్వతహాగానే సదా గుర్తుంటుంది కదా! కావున ఇది కల్పకల్పము యొక్క ప్రియమైన వస్తువు. ఏదో ఒక్కసారి బాబాకు చెందినవారిగా అవ్వలేదు, కల్పకల్పమూ అయ్యారు. మరి ఇటువంటి ప్రియమైన వస్తువును ఎలా మర్చిపోగలరు? ఎప్పుడైతే బాబా కన్నా కూడా అధికముగా ఎవరైనా వ్యక్తిని లేక వస్తువును ప్రియముగా భావించడం మొదలుపెడతారో అప్పుడే మర్చిపోతారు. సదా బాబాను ప్రియముగా భావించినట్లయితే మర్చిపోజాలరు. ఎలా స్మృతి చేయాలి అని ఆలోచించే పరిస్థితి రాదు. కానీ ఎలా మర్చిపోగలము అన్న ఆశ్చర్యం కలుగుతుంది. కావున అదర కుమార్ అన్న పేరు ఉంది కానీ మీరు బ్రహ్మాకుమారులే. బ్రహ్మాకుమారులైన మీరు విజయులే కదా! అదర్ కుమారులైతే అనుభవీ కుమారులు. అన్నీ అనుభవం చేసుకున్నారు. అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోరు. గతం యొక్క అనుభవజ్ఞులు మరియు వర్తమానము యొక్క అనుభవజ్ఞులు కూడా. ఒక్కొక్క అదర్ కుమార్ తమ అనుభవాల ద్వారా అనేకుల యొక్క కళ్యాణమును చేయగలరు. ఇది విశ్వకళ్యాణకారీ గ్రూప్. అచ్ఛా!
మాతలతో:- ప్రవృత్తిలో ఉంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్న ఈ స్మృతిలో ఉంటున్నారా? ఇది పరిశీలిస్తున్నారా? ఎందుకంటే ప్రవృత్తి యొక్క వాయుమండలంలో ఉంటూ, ఆ వాయుమండలం యొక్క ఆధారము ఉండకూడదు. సదా బాబాకు ప్రియమైనవారిగా ఉండాలి. ఇందుకొరకు ఈ విషయం యొక్క చెకింగ్ కావాలి. ప్రవృత్తి నిమిత్తమాత్రముగా ఉంది, కావున బాబా యొక్క స్మృతిలో ఉండాలి. పరివారిక సేవ యొక్క పాత్రను ఎంతగా అభినయించవలసి వచ్చినా ట్రస్టీగా అయి అభినయించాలి. ట్రస్టీలుగా ఉన్నట్లయితే నష్టోమోహులుగా అయిపోతారు. గృహస్థ స్థితి ఉన్నట్లయితే మోహము వచ్చేస్తుంది. బాబా గుర్తు రావడం లేదంటే మోహం ఉంటుంది. బాబా యొక్క స్మృతి ద్వారా ప్రతి ప్రవృత్తి యొక్క కార్యము సహజముగా అయిపోతుంది. ఎందుకంటే, స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. కావున బాబా స్మృతి యొక్క ఛత్రఛాయ క్రింద ఉంటున్నారు కదా! ఛత్రఛాయ క్రింద ఉండేవారు ప్రతి విఘ్నము నుండి అతీతముగా ఉంటారు. మాతలైతే బాప్ దాదాకు అతి ప్రియమైనవారు. ఎందుకంటే మాతలు ఎంతగానో సహించారు. కావున బాబా ఇటువంటి పిల్లలకు తాము సహించిన దానికి ప్రతిఫలముగా సహయోగమును మరియు స్నేహమును ఇస్తున్నారు. సదా సౌభాగ్యవతులుగా ఉండండి. ఈ జీవితములో ఎంతటి శ్రేష్ఠమైన సౌభాగ్యము లభించింది! ఎక్కడైతే సౌభాగ్యము ఉంటుందో అక్కడ భాగ్యము తప్పక ఉంటుంది, కావున సదా సౌభాగ్యవతీ భవ.
యు.పి. మరియు గుజరాత్ జోన్ వారు బాప్ దాదా ముందు కూర్చున్నారు. బాప్ దాదా వారి విశేషతను వినిపిస్తున్నారు. ప్రతి స్థానానికి తమ, తమ విశేషత ఉంది. యు.పి. తక్కువ కాదు, అలాగే గుజరాత్ కూడా తక్కువేమీ కాదు. ఢిల్లీ తర్వాత యు.పి. వెలువడింది. ఎవరైతే ఆదిలో స్థాపనకు నిమిత్తమయ్యారో వారికి కూడా డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. ఎంతైనా ఆదిలోనివారు డబుల్ లాటరీనైతే తీసుకున్నారు కదా! సాకార మరియు నిరాకారుని యొక్క డబుల్ లాటరీ లభించింది కదా! ఇదేమైనా తక్కువ పాత్రా? కల్పకల్పము యొక్క చరిత్రలో సదా తోడుగా ఉండే స్మృతిచిహ్నము ఉంది. ఇది కూడా విశేషమైన భాగ్యమే. ఇప్పుడు కూడా బాప్ దాదా అవ్యక్త రూపములో అన్ని పాత్రలను అభినయిస్తారు. కానీ సాకారుడు సాకారుడే కదా! సాకారం వారి యొక్క విశేషత వారిది మరియు వీరి విశేషత వీరిది. వీరు అవ్యక్తములో కూడా సాకారుని యొక్క స్నేహమును ఆకర్షిస్తున్నారు. సాకారములో తోడుగా ఉండేవారి కన్నా అధికముగా ఇప్పుడు అనుభవం చేసుకునేవారు కూడా కొందరు ఉన్నారు. కావున అందరూ ఒకరి కన్నా ఒకరు ముందు ఉన్నారు, అచ్ఛా!
ఈ రోజు యు.పి. వాళ్ళకు అవకాశం లభించింది. యు.పి. ఎక్కువగా నదీతీరాలలో ఉంది. యమునానదీ తీరములో రాజధానిని మరియు నాట్యమును చూపిస్తారు, కానీ యు.పి.యొక్క పతితపావని ఎంతో ప్రసిద్ధమైనది, అనగా యు.పి.ని సేవాస్థానముగా చూపించారు, కావున అనేకుల యొక్క సేవకు నిమిత్తముగా అయ్యేవారు ఎవరో యు.పి. నుండి తప్పకుండా వెలువడతారు. ఇటువంటివారు ఎవరైనా తయారవుతారు. ఏ విధముగా అమెరికాలో ఒక్కరి ద్వారా అనేకుల యొక్క సేవ జరుగుతుందో అలాగే యు.పి. నుండి కూడా ఒక్కరి ద్వారా అనేకుల యొక్క సేవ జరిగే విధంగా ఎవరో ఒకరు వెలువడతారు. శబ్దమైతే వ్యాపిస్తుంది కదా! ఎప్పుడైతే విదేశము నుండి శబ్దము వెలువడుతుందో అప్పుడు అందరూ మేల్కొంటారు. ఇప్పుడు పెద్ద వి.ఐ.పి. ఎవరూ వెలువడలేదు. ఇప్పటివరకూ వి. ఐ.పి.లు ఎవరైతే వెలువడ్డారో వారందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైనది ఆ విదేశీయే కదా! వారు ప్రత్యక్షముగా అనేకులకు సందేశమునిప్పించేందుకు నిమిత్తమవుతున్నారు. భారతదేశము కూడా ముందుకు వెళ్ళవచ్చు కానీ ఇది ఇప్పటి విషయం. చివరిలో జయజయకారాలైతే భారతదేశములోనే జరగాలి కదా! విదేశము నుండి కూడా జయజయకారాల యొక్క నినాదాలు చేస్తూ భారతదేశములోకి చేరుకుంటారు కదా! వారి నోటి నుండి కూడా మా భారతదేశము అనే వెలువడుతుంది. భారతదేశములో తండ్రి వచ్చారు. యు.పి.లోకి తండ్రి వచ్చారు అని అయితే అనరు కదా! విదేశీయులు ఈ సమయంలో రేస్లో ముందుకు వెళుతున్నారు. ఇది ఇప్పటి విషయం, రేపు ఇంకొకటి మారవచ్చు. ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా ముందుకు వెళతారు. ఇప్పుడు యు.పి. యొక్క వి.ఐ.పి.ని ఎవరినైనా తీసుకురండి. పతిత పావని ఎవరినైనా పావనముగా చేసి ఛూ మంత్రమును చేయండి.
గుజరాత్ వృద్ధిలో నెంబర్ వన్ గా అయిపోయింది. వి.ఐ.పి.లు కూడా స్టేజి పైకి వచ్చేస్తారు. అనంతమైన సేవను చేసే వి.ఐ.పి.లు ఉండాలి. గుజరాత్ వారు గుజరాత్ లోనే చేస్తే అది చిన్న మైకే అవుతుంది, నలువైపులా చేస్తే వారిని పెద్ద మైకు అని అనడం జరుగుతుంది, అచ్ఛా!
Comments
Post a Comment