01-04-1978 అవ్యక్త మురళి

* 01-04-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిరంతర యోగులే నిరంతరము తోడుగా ఉండేవారు.

ఈరోజు ఇది మాయాజీతులైన విజయీ రత్నాల యొక్క విశేష సభ. నేటి ఈ సభలో బాప్ దాదా ఏ పిల్లలను చూస్తున్నారు? ఎవరైతే ఆది నుండి అంతిమం వరకు బాప్ దాదాకు సదా నమ్మకస్తులుగా, సదా బాబా యొక్క అడుగులలో అడుగులు వేస్తూ సదా సహయోగులుగా మరియు తోడుగా ఉన్నారో వారిని చూస్తున్నారు. అన్నివేళలా బాబా మరియు సేవలో మగ్నమై ఉండేవారు, సదా శ్రేష్ఠ మర్యాదల యొక్క రేఖ నుండి సంకల్పంలో కూడా బైటకు వెళ్ళని మర్యాద పురుషోత్తములు ఇటువంటి పిల్లలు ఎవరైతే సదా ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో జన్మ జన్మలు తోడుగా ఉంటారో అటువంటి పిల్లలను చూస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు నీతోనే కూర్చుంటాను, నీతోనే ప్రతిక్షణము, ప్రతికర్మ తోడును నిర్వర్తిస్తాను అని బాబాతో చేసిన వాగ్దానమును నిలబెట్టుకుంటారో ఇటువంటి వాగ్దానమును నిలబెట్టుకునే సుపుత్రులైన పిల్లలకు బాబా కూడా జన్మ జన్మాంతరాలు తోడుగా ఉండే వరదానమును ఇప్పుడే ఇస్తారు. సాకార బాబాతో పాటు భిన్న నామరూపాలతో పూజ్యత్వంలోనూ తోడుగా మరియు పూజారి రూపంలోనూ తోడుగా ఉంటారు. జ్ఞానీ ఆత్మలుగా అవ్వడంలోనూ తోడుగా ఉంటారు మరియు భక్త ఆత్మలుగా అవ్వడంలోనూ తోడుగా ఉంటారు. ఇలా సదా తోడు యొక్క లేక తతత్వం యొక్క వరదానము ఇటువంటి విశేష ఆత్మలకు ఇప్పుడే ప్రాప్తమవుతుంది.

 ప్రతి మహారథి స్వయాన్ని, వర్తమాన సమయంలో బాప్ దాదా యొక్క గుణాలలో, జ్ఞానము మరియు సేవలో సమానత మరియు తోడు ఎంతవరకు ఉంది అని పరిశీలించుకోవాలి. సమానతయే సామీప్యతను తీసుకువస్తుంది. ఇప్పటి స్థితిలోను మరియు భవిష్య స్థితిలోను సామీప్యతను తెస్తుంది మరియు ప్రతిక్షణము తోడును అనుభవం చేసుకోవడము జన్మ జన్మాంతరాలు కూడా నామ, రూప, సంబంధాలలో తోడును అనుభవం చేసుకునేందుకు నిమిత్తముగా అవుతుంది. విక్రమాజీతులుగా అవ్వడంలోనూ తోడుగా ఉంటారు మరియు రాజా విక్రమాదిత్యునిగా అయ్యే సమయంలోనూ తోడుగా ఉంటారు. ప్రతి పాత్రలోను, ప్రతి వర్ణములోను తోడుగా ఉంటారు. తోడుగా జీవిస్తాము, తోడుగా మరణిస్తాము అనగా కలిసి ఎక్కుతాము, కలిసి దిగుతాము. ఎక్కే కళ మరియు దిగే కళ, పగలు మరియు రాత్రి రెండింటిలోనూ నిరంతర యోగులుగా, నిరంతరము తోడుగా ఉంటారు అన్నది దీని యొక్క గాయనమే. ఎంతగా ఇప్పుడు సంగమ యుగంలో తోడును నిర్వర్తించడంలో సంపూర్ణంగా ఉన్నారో అంతగా సమీప సంబంధీకులుగా అవ్వడంలో కూడా సమీపంగా ఉంటారు. విశ్వములోని నెంబర్ వన్ శ్రేష్ఠ ఆత్మకు కూడా డ్రామాలో మహత్వము ఉంది అలాగే ఇటువంటి నెంబర్ వన్ ఆత్మ యొక్క సంబంధంలో సదా ఉండే ఆత్మలకు కూడా మహత్వముంటుంది. ఈ రోజుల్లో అల్పకాలికమైన స్టేటస్ ను పొందే ఆత్మలు ఎవరైనా ప్రెసిడెంట్‌గా, ప్రైమ్ మినిస్టర్ గా అయితే వారితో పాటు వారి కుటుంబానికి కూడా మహత్వము ఏర్పడుతుంది. కావున సదాకాలిక శ్రేష్ఠ ఆత్మ యొక్క సంబంధంలోకి వచ్చే ఆత్మల యొక్క మహత్వము మరి ఇంక ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు కాస్త అలజడి జరగనివ్వండి అప్పుడు పాత ఆత్మలు ఎవరైతే సదా తోడు యొక్క సంబంధమును నిర్వర్తిస్తూ వచ్చారో వారికి ఎంత మహత్వమేర్పడుతుందో చూడండి! ఏవిధంగా పాత వస్తువుకు మహత్వమును ఉంచుతారో, ఎంతో విలువైనదిగా భావిస్తారో అలాగే పాత ఆత్మలైన మీ యొక్క విలువను వర్ణన చేస్తూ చేస్తూ, గుణగానము చేస్తూ చేస్తూ స్వయమును కూడా ధన్యులుగా అనుభవం చేసుకుంటారు. అటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా స్వయమును భావిస్తున్నారా? ఎంతగా మీరు బాబా యొక్క గుణగానము చేస్తారో అంతగా ప్రతిఫలంగా అటువంటి ఆత్మల యొక్క గుణగానమును వారు చేస్తారు. ఇప్పుడు గుణగానము ఎందుకు చేయడం లేదు? సేవ ఇప్పుడు చేస్తున్నారు కాని సంపూర్ణ ఫలము అంతిమంలోనే ఎందుకు లభిస్తుంది? ఇప్పుడు కూడా లభిస్తుంది. కాని తక్కువగా లభిస్తుంది. దానికి కారణమేమిటో తెలుసా? ఇప్పుడు అప్పుడప్పుడూ బాబాను మరియు స్వయమును అక్కడక్కడా కలిపివేస్తారు. బాబా యొక్క గుణగానము చేస్తూ చేస్తూ స్వయం యొక్క గుణగానము చేయడం కూడా మొదలుపెట్టేస్తారు. చాలా మధురమైన భాషను వాడుతారు కాని నాదీ అనే భావన ఉన్న కారణంగా ఆత్మల యొక్క భావన సమాప్తమైపోతుంది. ఇదే అన్నింటికన్నా పెద్దదైన చాలా సూక్ష్మమైన త్యాగము. ఈ త్యాగము యొక్క ఆధారము పైనే నెంబర్ వన్ ఆత్మ తన నెంబర్ వన్ భాగ్యమును తయారుచేసుకుంది మరియు అష్టరత్నాల నెంబర్ యొక్క ఆధారము కూడా ఈ త్యాగమే. ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో బాబా బాబా ఇదే గుర్తుండాలి. నేను అనేది సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే నేనూ అనేది ఉండదో అప్పుడు నాదీ అనేది కూడా ఉండదు. నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, నా పని లేక డ్యూటి, నా పేరు, నా ప్రతిష్ట మొదలైన ఈ నాదీ నాదీ అనేవి కూడా ఆ నేనూ అనే దానితో పాటు సమాప్తమైపోతాయి. నేనూ మరియు నాదీ సమాప్తమవ్వడమే సమానత మరియు సంపూర్ణత. స్వప్నంలో కూడా నాదీ అనేది ఉండకూడదు. దీనినే అశ్వమేధ యజ్ఞములో నేను అనే అశ్వమును స్వాహా చేయడము అని అంటారు. ఇదే అంతిమ ఆహుతి... మరియు దీని యొక్క ఆధారముపైనే అంతిమ విజయము యొక్క ఢంకా మ్రోగుతుంది. సంఘటిత రూపంలో ఈ అంతిమ అహుతి యొక్క శబ్దమును హృదయాంతరము నుండి వ్యాపింపచేయండి అప్పుడు ఈ పంచతత్వాలు సదా అన్ని రకాల సఫలతల యొక్క మాలలను మీకు ధరింపజేస్తాయి. ఇప్పటివరకు ఇంకా తత్వాలు కూడా అక్కడక్కడా విఘ్న రూపంగా అవుతున్నాయి, కాని స్వాహా యొక్క ఆహుతిని ఇవ్వడం ద్వారా అవి కూడా హారతి పడతాయి. సంతోషము యొక్క భజంత్రీలను మ్రోగిస్తాయి. సర్వ ఆత్మలు తమ బహుకాలికమైన కోరికలను ప్రాప్తించుకుంటూ మహిమ యొక్క గజ్జెలను కట్టుకుని నాట్యమాడతాయి అప్పుడే అంతిమ భక్తి యొక్క సంస్కారాలు ఇమిడిపోతాయి. ఇటువంటి భక్త ఆత్మలకు తమ భక్తరూపము యొక్క వరదానము కూడా ఇప్పుడే ఇష్టదేవ ఆత్మలైన మీ ద్వారా లభిస్తుంది. కొందరికి భక్త ఆత్మ భవ యొక్క వరదానము, కొందరికి ఆత్మజ్ఞాని భవ యొక్క వరదానమును సర్వ ఆత్మలకు ఇప్పుడు వరదాతలుగా అయి వరదానములను ఇస్తారు. రాజ్యము చేయాలనే కోరికగలవారికి రాజ్యపదవి యొక్క వరదానమును ఇస్తారు. ఇటువంటి వరదానీ మూర్తులుగా, కామధేను ఆత్మలుగా అయ్యారా? ఏ ఆత్మ ఏమి కోరుకున్నా తధాస్తు. ఇటువంటి ఆత్మలను సదా సమీపము మరియు తోడుగా ఉండేవారు అని అనడం జరుగుతుంది, అచ్ఛా!

ఇటువంటి సదా శూరవీరులకు, సదా సింహాసనము మరియు కిరీటధారులకు, ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో శ్రేష్ఠ త్యాగము ద్వారా, శ్రేష్ఠ భాగ్యమును తయారుచేసేవారికి, ప్రతి అడుగులోను అనుసరించేవారికి అన్నివేళలలోనూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండేవారికి, తరగని ఖజనాలతో సదా సంపన్నంగా ఉండేవారికి, లక్ష్యమును మరియు లక్షణములను సదా సంపూర్ణంగా ఉంచుకునేవారికి ఇటువంటి సంపూర్ణ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీ-దీదీలతో మిలనము: - భవిష్యత్తు యొక్క ప్లానును తయారుచేయాలి, దాని కొరకు సంఘటనను పోగు చేసారా? ఏ ప్లానును తయారుచేస్తారు. ఏదైతే చేసారో అదంతా చాలా బాగా చేసారు మరియు ఇప్పుడు ఏదైతే చేస్తారో అది కూడా బాగానే చేస్తారు. ఏదైనా ప్రోగ్రాము లేక ప్లాను యొక్క సఫలతకు ఆధారము ఏమిటి? సాధారణ రీతిలో కూడా ఏదైనా కార్యము యొక్క సఫలతకు ఆధారము ఏమిటి? ఏదైనా ప్రోగ్రామును సఫలం చేయాలనుకుంటే ఏమాలోచిస్తారు? ఇప్పుడు ఏ కాన్ఫరెన్స్ అయితే చేసారో దాని యొక్క విశేషమైన సఫలత విశేష వ్యక్తి యొక్క లేక పర్సనాల్టీ యొక్క ఆధారముపై ఉంటుంది. ఎటువంటి పర్సనాల్టీవారు వస్తే అటువంటి శబ్దము వ్యాపిస్తుంది. మీరు ఎప్పుడు ప్రోగ్రాము చేసినా విశేషంగా శబ్దమును వ్యాపింపచేసే లక్ష్యమును ఉంచి ప్లానును తయారుచేస్తారు. విశేష పర్సనాలిటీలు (వ్యక్తిత్వము కలవారు) రావాలని తద్వారా స్వతహాగానే శబ్దము వ్యాపించాలని చూస్తారు. కావున పర్సనాలిటీ సాధనమైపోతుంది. లౌకిక పర్సనాలిటీవారు బాహ్యమైన శబ్దమును వ్యాపింపచేసేందుకు నిమిత్తులవుతారు అలాగే వర్తమాన సమయంలో సేవలో విశేషంగా నిమిత్తులైన సేవాధారులగు మీ యొక్క పర్సనాలిటీ కూడా కావాలి. పర్సనాలిటీ మనుష్యులను తమ వైపుకు ఆకర్షిస్తుంది. కావున వర్తమాన సమయంలో ఏ పర్సనాలిటీ కావాలి? పవిత్రతయే పర్సనాలిటీ. ఎంతెంతగా పవిత్రత ఉంటుందో అంతంతగా పవిత్రత యొక్క పర్సనాలిటీ స్వయమే సర్వుల శిరస్సును వంచేలా చేస్తుంది.

డ్రామానుసారముగా సన్యాసుల ముందు కూడా పవిత్రత యొక్క పర్సనాలిటీ ఉన్న కారణంగా శిరస్సును వంచుతారు. పవిత్రత యొక్క పర్సనాలిటీ గొప్ప గొప్ప వ్యక్తుల శిరస్సులను కూడా వంచేలా చేస్తుంది. అలాగే వర్తమాన సమయంలో కూడా పవిత్రత యొక్క పర్సనాలిటీ యొక్క ఆధారముపై శిరస్సును వంచుతారు. ఏవిధంగా అగరబత్తి యొక్క సుగంధము ఆకర్షిస్తుందో అలాగే రావడంతోనే పవిత్రత యొక్క సుగంధము అనుభవమవ్వాలి. ఎక్కడ చూసినా పవిత్రతయే పవిత్రత కనిపించాలి. వర్తమాన సమయంలో అంతా దీనినే అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు. ఇది నలువైపులా ఎక్కడా కనిపించడం లేదు. ఎంత మహాన్ ఆత్మలైనా, గొప్ప పేరు ఉన్నా పవిత్రత యొక్క వైబ్రేషన్లు లేవు ఎందుకంటే వారు సిద్ధి యొక్క పేరు ప్రతిష్టలను, గౌరవమును స్వీకరించేస్తారు. కావుననే పవిత్రత యొక్క వైబ్రేషన్లు ఎక్కడా కనిపించవు. అల్పకాలిక ప్రాప్తి యొక్క ఆకర్షణ కలుగుతుంది కాని, పవిత్రత యొక్క ఆకర్షణ కలగదు. ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ కావాలి, ఆ పర్సనాలిటీ స్వయమే ఆకర్షించాలి. ఎక్కడికైనా ప్రైమ్ మినిస్టరు వస్తే, అతడి పర్సనాలిటీ ఉన్న కారణంగా స్వతహాగానే అందరూ పరిగెడతారు కదా! కావున ఈ పర్సనాలిటీ అన్నింటికన్నా మొట్టమొదటిది. ఇప్పుడు ఈ ప్లానును తయారుచేయండి. ధర్మాత్మలను ఆకర్షించేది కూడా ఈ పర్సనాలిటీయే. ఏ వస్తువు అయితే తమ వద్ద లేదో అది ఇక్కడ ఉంది అని వారు అనుభవం చేసుకోవాలి. లేకపోతే, కన్యలు, మాతలు ఉన్నారు, మంచి పని చేస్తున్నారు అన్న భావనతోనే చూస్తారు. అందుకు బదులుగా పర్సనాలిటీగా భావిస్తూ వీరు విశ్వములోకెల్లా అతి పెద్ద పర్సనాలిటీ కలవారు అని భావిస్తూ ముందుకు రావాలి. ఏదో భావిస్తూ వచ్చాము కానీ ఇంకేదో చూసాము అని అనుభవం చేసుకోవాలి. మా బుద్దిలో ఏ విషయమైతే లేదో ఆ విషయము వీరి ప్రత్యక్ష జీవితంలో ఉంది అని అనుభవం చేసుకోవాలి. ఇదే మహారధిని క్రిందకు దించడం. చీమ ఏనుగును కూడా పడవేస్తుంది కదా! కావున ఈ పర్సనాలిటీలో వారు శిరస్సు వంచుతారు. ఇప్పుడు స్వయం యొక్క స్వరూపము సర్వప్రాప్తుల అయస్కాంతము యొక్క స్వరూపం ఉండాలి. తద్వారా స్వయమే అందరూ ఆకర్షితులవ్వాలి. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ప్రాప్తి యొక్క అనుభవం కలగాలి. కావున ప్రాప్తియే అయస్కాంతము మరియు సర్వప్రాప్తి స్వరూపమే అయస్కాంతము.

ఇప్పుడు ఇంకా శ్రమను, శక్తిని మరియు ధనమును కూడా వినియోగించవలసి వస్తోంది. తర్వాత వీటి యొక్క పనిని కూడా పవిత్రత యొక్క పర్సనాలిటీయే చేస్తుంది. ఇప్పుడు ఇంకా వైబ్రేషన్లు మారలేదు. ఇప్పుడు కూడా ఇంకా భిన్నమైన దృష్టితో చూస్తున్నారు. ఇప్పుడు మీ వైబ్రేషన్ల ద్వారా ఎలా ఉన్నారో అలా అదే దృష్టితో చూసే వైబ్రేషన్లను వ్యాపింపచేయండి మరియు మీ యొక్క వరదానీ, మహాదానీ వృత్తి ద్వారా వైబ్రేషనున్లు మరియు వాయుమండలమును కూడా పరివర్తన చేయండి. ఇప్పటివరకు పాపం వారు తపిస్తూ ఎక్కడకి వెళ్ళాలి అని వెదుకుతూ ఉన్నారు. దాహార్తులైన ఆత్మలకు ఇప్పటికీ ఇంకా సాగరము లేక నదుల యదార్థ స్థానము యొక్క పరిచయము లభించలేదు. కావుననే ఎక్కువగా వెదకుతున్నారు. కావున మీ యొక్క లైట్ హౌస్ స్వరూపము ద్వారా లక్ష్యము యొక్క దారిని చూపించండి, అచ్ఛా!

జానకి దాదీతో: లండన్లో కూడా ధర్మాత్మల యొక్క అవకాశము ఉంది. ఏ అవకాశము తీసుకున్నా అందులో ఆత్మిక ఆకర్షణ యొక్క దృశ్యము తప్పకుండా ఉండాలి. తీర్థ స్థానాలలో శాంతిగుండము లేక గతి, సద్గతుల యొక్క గుండమును తయారుచేస్తారు కదా! అలాగే సర్వప్రాప్తి కుండము ఇదేనని భావించాలి. అతీతముగా అనుభవమవ్వాలి, సాధారణముగానూ ఉండాలి కాని శక్తిశాలిగా ఉండాలి మరియు ఇది సత్వత అని అనుభవమవ్వాలి. ఇటువంటి స్టేజ్ ను తీసుకుంటూ తీసుకుంటూ విశ్వము యొక్క రాజ్యమును కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు కేవలం కార్యక్రమం యొక్క నిమంత్రణను ఇస్తారు. తర్వాత ఏ విధంగా జడచిత్రాలను కనుల ముందుకు మరియు శిరస్సు పైకి ఎత్తుకుంటారో అలాగే మిమ్మల్నందర్నీ అదే దృష్టితో ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏమి చెయ్యాలి అని ఏమీ అర్థం కాకుండా ఉంటారు. వీరి మహిమలో ఏమి పలకాలి, ఏమి పలకకూడదు అన్నది వారికి తోచదు. సంఘటితమవ్వడం మంచిది, సంఘటితమవ్వడం ద్వారా కూడా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి. అచ్ఛా! ఓంశాంతి.

Comments