01-02-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సూక్ష్మవతనములోని కార్యవ్యవహారాలు.
ఈ రోజు బాప్ దాదా విశేషంగా భావుక పిల్లలతో కలియుటకు వచ్చారు. ఎంత భావవంతులో అంత భాగ్యవంతులుగా కూడా ఉన్నారు. భాగ్యవాన్ పిల్లలతో భాగ్యవిధాత తండ్రి కలుసుకునేందుకు వచ్చారు. బాప్ దాదా దగ్గర పిల్లలందరి భావన, స్నేహము మరియు సేవల పూర్తి చార్టు ఉంది. ఎలాగైతే పాత ప్రపంచములోని సేనాధిపతుల వద్ద తన ప్రాంతపు మరియు సేనల చార్ట్ మరియు మ్యాప్ ఉంటుందో అలా తండ్రి వద్ద కూడా ప్రతి సెంటర్ మరియు ప్రతి సేవాధారుల చార్ట్ మరియు మ్యాప్ ఉంది. ఆ చార్ట్ ద్వారా అన్ని స్థానాలు మరియు సేవాధారులందరు ప్రతి సమయంలో ఎలా సేవ చేస్తున్నారో ఆ పద్ధతి, వారి పురుషార్థ వేగము రెండింటిని ఒకే స్థానంలో కూర్చొని చూస్తున్నారు. మొత్తం రోజంతటిలో పిల్లలందరి స్థితులు స్పష్టంగా సాత్కారమవుతూ ఉంటాయి. సూక్ష్మవతనములోని కార్యవ్యవహారాలన్నీ ఏ శక్తితో జరుగుతాయి? ఉదాహరణానికి ఇక్కడ అనేక భిన్న భిన్న సాధనాల ద్వారా కార్యవ్యవహారాలు జరుగుతాయి. సత్యయుగములో విశేషంగా అటామిక్ శక్తి ద్వారా జరుగుతాయి. సూక్ష్మవతనములో కార్యవ్యవహారాలు ఎలా జరుగుతాయి? ఏ శక్తి ఆధారముతో జరుగుతాయో? ఎలా నడుస్తాయో తెలుసా? లైట్ వతనము కనుక లైట్ వతనములో కార్యవ్యవహారాలు ఎలా నడుస్తాయి? లైట్ ఆధారముతోనా లేక ఏ ఆధారముతో? ఈ రోజు పేపర్లు చూచారు. ఈ రోజు పిల్లలు ఇమర్జ్ అవుతూనే ఈ అనేక భిన్న కార్యవ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి.
కర్ణాటకవారు అపురూపమైన పిల్లలు కదా. అందువలన వారికి ముఖ్యంగా లోతైన రహస్యాలు వినిపించబడును. కర్ణాటక సేవలో జంట(హృదయపుష్పదాది, చంద్రమణిదాది) కూడా చాలా బాగా కుదిరింది. చేసి చేయించే ఇద్దరి జంట బాగుంది. ఒకరేమో ప్రేమ స్వరూపులు, మరొకరు జ్ఞాన స్వరూపులు. ఒకరు ప్రేమ మరియు నియమబదులు(లా ఫుల్). మరొకరు కేవలం లా ఫుల్ అయినా కర్ణాటక పూలతోట బాగా ఫలీభూతమయ్యింది. రకరకాల మంచి మంచి సేవాధారులు కూడా ఉన్నారు. ఎలాగైతే డబల్ విదేశీయులకు బాప్ దాదా వారి విశేషతలు చూచి విశేష ప్రియస్మృతులు ఇస్తారో అలా భిన్న ధర్మాలలోకి పరివర్తన(కన్వర్ట్) అయినా, తమ ప్రాచీన ధర్మాన్ని గుర్తించుటకు మరియు స్వీకరించుటకు తీవ్ర పురుషార్థము చేస్తున్నారు. మెజారిటీ స్నేహము మరియు శాంతి ప్రాప్తుల ఆధారంతో తక్కువ సంశయ బుద్ధిగలవారిగా అవుతారు. ఇదే డబల్ విదేశీయుల విశేషత. ఈ విశేషత కారణంగా బాప్ దాదా కూడా బదులుగా (రిటర్న్) ప్రియస్మృతులు తెలుపుతున్నారు. అలా కర్ణాటకవారు కూడా భావన మరియు ప్రేమ ద్వారా సహజంగా తండ్రి వారిగా అవుతారు. స్నేహం కారణంగా అమాయకులైనారు. వాస్తవానికి నాలెడ్జ్ ఫుల్ గా కూడా ఉన్నారు. కానీ మొదట స్నేహము కారణంగా దగ్గరవుతున్నారు. తర్వాత జ్ఞానము విని ముందుకు వెళ్తారు.
ఒక్కొక్క భూమి జ్ఞానము ఆధారముతో ముందుకొస్తుంది. తర్వాత స్నేహములోకి వస్తారు. మరి కొంతమంది స్నేహములో వచ్చి తర్వాత జ్ఞానము తీసుకుంటారు. అందుకే భోలానాథ్ తండ్రికి ప్రియమైన వారిగా అయ్యారు. అర్థమయిందా? మీ అందరికీ మహత్యముంది. మాకు భాష తెలియదని అందుకే వెనుక ఉన్నామని ఎప్పుడూ అనుకోకండి. బాప్ దాదాకు సదా సమీపంగానే ఉన్నారు. బాప్ దాదా భాషను చూడరు, భావాన్ని చూస్తారు.
సూక్ష్మవతనములో కార్యవ్యవహారాలు ఎలా నడుస్తాయో మీరు వినిపించండి. దేని ఆధారంతో నడుస్తాయి. ఇక్కడ కరెంటు పోతే మీరు ఇతర సాధనాల ద్వారా పనులు నడిపిస్తారు కదా. ఇక్కడైతే జనరేటర్ ద్వారా కరెంటు వస్తుంది. అక్కడ ఏముంది? ఏ శక్తి ద్వారా పనులు జరుగుతాయి? ఆకారము సాకారాన్ని ప్రేరేపిస్తుందా? లేక సాకారము ఆకారాన్ని ప్రేరేపిస్తుందా? ఎలా కార్యవ్యవహారాలు నడుస్తాయో చెప్పండి. విశేషంగా సూక్ష్మవతనంలోని కార్యవ్యవహారాలు శుద్ధ సంకల్పాల ఆధారముతో నడుస్తాయి. బ్రహ్మ సంకల్పము చేత సృష్టి రచింపబడిందని గాయనముంది. అలాగే ఇక్కడ కూడా సంకల్పము చేస్తూనే ఇమర్జ్ అవుతారు. మర్జ్ మరియు ఇమర్జ్(ప్రత్యక్షమవ్వడం, గుప్తమవ్వడం) ఆటగా ఉంటుంది. రూపురేఖలు సైగలుగా ఉంటాయి. కాని విశేషంగా ఆకారీ రూపాల వ్యవహారం మనోబలం అనండి లేక సంకల్పమనండి దీని ఆధారముతో నడుస్తుంది. బాప్ దాదా సంకల్పాల స్విచ్ ఆన్ చేస్తూనే అందరూ ఇమర్జ్ అవుతారు. ఇక్కడ కార్యవ్యవహారాలు వరకు వైర్‌లెస్ ద్వారా చాలా దూర దూరాల పనులు చేస్తారు. కాని అక్కడ మూడు లోకాల వరకు వైస్లెస్(నిర్వికారి) శక్తి ద్వారా సంబంధం జోడించవచ్చని వినిపించాను కదా? బుద్ధియోగము పూర్తి స్వచ్ఛంగా ఉండాలి. సూక్ష్మవతనము వరకు సంకల్పాలు చేరుట కొరకు సూక్ష్మ సర్వ సంబంధాల సారవంతమైన స్మృతి ఉండాలి. ఇవే అన్నింటికంటే శక్తివంతమైన తీగలు. దీని మధ్యలో మాయ ప్రవేశించలేదు.
అక్కడ బాప్ దాదా వద్ద చాలా ప్రకాశముంటుంది. ఈ ప్రపంచము వలె కాదు(కరెంటు పదే పదే పోతుంది). పూర్తి కల్పములో సూక్ష్మవతనము ఈ సమయంలోనే ఇమర్జ్ అవుతుంది. అందువలన సూక్షవతనపు శాంతి కూడా ఇప్పుడే ఉంటుంది. మరలా మీ కొరకు స్వర్గపు శాంతి లేక ఆనందముంటుంది. (ఇక్కడే కూర్చొని సూక్ష్మవతనాన్ని అనుభవం చేయగలరా?) అనుభవమైతే పిల్లలే చేస్తారు. ఈ వతనము పిల్లల కొరకే. ఇక ఏ ఆత్మలూ కూడ సూక్ష్మవతనాన్ని అనుభవం చేయలేరు. ఎందుకంటే బ్రహ్మ మరియు బ్రాహ్మణులకే సంబంధముంది. భక్తులు కేవలం ఏదో ఒక విశేష దృశ్యాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు. కాని సూక్ష్మవతనము మన ఇల్లు, బ్రహ్మ తండ్రి స్థానమంటే అది మన స్థానము కూడా. సూక్ష్మవతనపు పద్ధతుల విచిత్ర అనుభవం, కలయిక అనుభవం, ఆహ్లాదపరిచే అనుభవం బ్రాహ్మణులే చేయగలరు.
విదేశీయులు కూడా కూర్చోని మురళి వింటున్నారు - ఈరోజు డబల్ విదేశీయుల సంకల్పాలు చేరుతున్నాయి. క్రింద ఉన్నా తండ్రి ముందే ఉన్నారు. అందుకే డబల్ విదేశీయులకు బాప్ దాదా విశేషమైన ప్రియస్మృతులు తెలుపుతున్నారు. దీనితో పాటు నలువైపులా ఉన్న పిల్లలు దూరంగా ఉంటున్నా సంకల్ప శక్తిచే తమను సమీపంగా అనుభవం చేస్తున్నారు. వారిలో కర్నాటక నివాసులకు కూడా ముఖ్యంగా ప్రియస్మృతులు. మధువనం వారంటే వంట ఇంట్లోని వారు కనుక హృదయవాసులు. వేడి వేడిగా మధుబన్ వారికి లభిస్తుంది. సేవలో(అథక్) అలసిపోని వారై మంచి ఉదాహరణ ఇస్తున్నారు. మెజారిటీ నిద్రజీత్ గుణమును కూడా బాగా చూపిస్తున్నారు. రాత్రిపూట నిద్రను కూడా వదిలి సేవలో మంచి సహయోగులుగా ఉన్నారు. అవునండి మరియు సరేనండి అనే పాత్రను అభినయిస్తున్నారు. అందుకే మధువన సేవాధారులు నెంబర్ వార్ సేవలో నిరూపణ ఇచ్చేవారికి విశేష ప్రియస్మృతులు. మంచిది.
పిల్లలందరికీ బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో కలయిక - సఫలతకు ఆధారం భిన్నత్వము - అందరూ సదా తమ విశ్వకళ్యాణకారీ స్టేజ్ పై స్థితమై సేవాపాత్రను చేస్తున్నారా? విశ్వకళ్యాణకారులంటే అనంతమైన సేవాధారులు. ఎలాంటి హద్దులోకి రారు. విశ్వము అనంతమైనది. కనుక విశ్వసేవాధారి అనగా బేహద్ స్థితిలో ఉండువారు. విశ్వకళ్యాణకారులు సదా సేవ చేస్తున్నా భిన్నంగా, తండ్రికి ప్రియంగా ఉంటారు. సేవలో కూడా లేకుండా ఉండేవారు. సేవపై ఆకర్షణ కూడా బంగారు సంకెళ్ళే ఈ బంధన కూడా బేహద్ నుంచి హద్దులోకి తెస్తుంది. అందుకే సదా సేవలో భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా నడవండి. ఇలాంటి స్థితిలో ఉండువారు సదా సఫలతా మూర్తులుగా ఉంటారు. న్యారా మరియు ప్యారాగా అవ్వడమే సఫలతకు సహజ సాధనము. ఎక్కడైనా సఫలతలో లోపముంటే దానికి కారణం న్యారాగా అవ్వడంలో లోపమే. న్యారా అంటే దేహ స్మృతి కూడా లేకుండా భిన్నము, ఈశ్వరీయ సంబంధపు ఆకర్షణకు కూడా న్యారా మరియు ఈశ్వరీయ సేవలో సాధనాలతో కూడా న్యారా. ఇలాంటి భిన్నత్వం తగ్గినప్పుడు సఫలత తగ్గిపోతుంది. కనుక సదా ఇలాంటి సఫలతా మూర్తినని భావిస్తున్నారా? లేక స్వయాన్ని చిన్నవారని అనుకుంటున్నారా? ఏదైనా ఆదేశం లభించినప్పుడు దాన్ని ప్రాక్టికల్ లో తెచ్చే సమయంలో చిన్నవారని తెలుసుకొనుట సరియైనదే. అయితే సేవ చేయడంలో పెద్దవారై సేవ చేయండి. ఆదేశమిచ్చు సమయంలో స్వయాన్ని చిన్నవారిమని భావిస్తే సదా సఫలత లభిస్తుంది. పెద్ద అంటే బేహద్(వృత్తిగలవారు).
అందరూ సంతుష్టం(తృప్తిగా) ఉన్నారా? ఏ మాటైనా మనసులోకి వస్తే దాన్ని వినిపించుటకు ఆలోచించకండి. కాని వినిపించిన తర్వాత పెద్దల ఆదేశం ప్రకారం నడిచేందుకు సదా సిద్ధంగా ఉండాలి. వినిపిస్తే మీ భాద్యత సమాప్తమై పెద్దలు భాద్యులుగా ఉంటారు. అందుకే వినిపించుట తప్పనిసరి. దానితో పాటు ఆజ్ఞానుసారం తప్పక నడుచుకోవాలి. ఏ మాటను కూడా లోపల ఉంచుకోకండి వినిపించి తేలికైపోండి. లేదంటే లోపల ఏమైనా ఉంటే, సేవలో స్వఉన్నతిలో అది పదే పదే విఘ్నరూపమవుతుంది. అందుకే తేలికగా ఉండుట కూడా తప్పనిసరి. ఆజ్ఞ లభిస్తే దాన్ని అమలుపరిచి తేలికైపోవాలి. అందుకు విశేషంగా ఏ శక్తి కావాలి? స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి. పరివర్తన చేయు శక్తి ఉంటే, ఎక్కడ ఉన్నా సఫలత లభిస్తుంది. సదా స్వ పరివర్తనవ్వాలనే లక్ష్యం ఉంచుకోండి. ఇతరులు మారితే నేను మారతానని కాదు. ఇతరులు మారనీ లేక మారకపోనీ నేను మారాలి. ఆ అర్జునుడు నేనే కావాలి. ఇతరులు అర్జునులు కావాలని కాదు. సదా స్వ పరివర్తనలో నేను మొదట. ఇందులో 'నేను మొదట' చేస్తే అన్నింటిలో మొదటి నెంబర్ గా అవుతారు.
స్వయాన్ని మోల్డ్ చేసుకొనుటే రియల్ గోల్డ్ గా అవ్వడం. ఇతరులను మోల్డ్ చేయడమంటే మిక్స్ గోల్డ్ గా అవ్వడం. కావున అందరూ రియల్ గోల్డ్ అయ్యారా? రియల్ గోల్డ్ కు విలువ ఉంటుంది. మిక్సింగ్(కల్తీ)కు విలువ తక్కువగా ఉంటుంది. కనుక సదా స్వయాన్ని రియల్ గోల్డ్ స్థితిలో ఉంచుకోండి.
పుట్టుక నుండే విశేషంగా ఏ బలహీనతను తాకనివారు, వారు జన్మతోనే వైష్ణవులు. కొందరు పిల్లలు జన్మతోనే సాత్విక సంస్కారవంతులుగా ఉంటారు. కొందరు రజోగుణం నుండి సాత్వికులుగా అవుతారు. కొందరు తమోగుణం నుండి రజోగుణీలుగా అవుతారు. కొందరు మూడింటిలో కలిసి నడుస్తారు. జన్మతోనే వైష్ణవులంటే సదా సురక్షితులు.
1. త్రికాలదర్శి స్టేజ్ లో స్థితులైతే వ్యర్థ ఖాతా సమాప్తమవుతుంది. అందరూ స్వయాన్ని పదమా పదమ్ భాగ్యశాలురుగా భావిస్తూ ప్రతి సంకల్పం మరియు కర్మ చేస్తున్నారా? శ్రేష్ఠ సంకల్పం, మాట మరియు కర్మతో పాటు వ్యర్థము మరియు సమర్థము రెండూ కలిసి ఉండుట లేదు కదా? ఇప్పుడిప్పుడే వ్యర్ధము, ఇప్పుడిప్పుడే సమర్థము. ఇలాంటి ఆటలు నడవడం లేదు కదా? ఒక్క సెకెండ్ వ్యర్ధము వలన పదమాల నష్టం వాటిల్లుతుంది. సమర్థము వలన ఒక్క సెకండులో పదమాల సంపాదన జరుగుతుంది. ఒక్క సెకెండ్ వ్యర్థము కూడా సంపాదనలో చాలా నష్టం కలిగిస్తుంది. ఎలా సంపాదన ఖాతా జమ అవుతుందో అలా నష్ట ఖాతా కూడా జమ అవుతుంది. నష్ట ఖాతా ఎక్కువైతే అందులో సంపాదన కనిపించకుండా పోతుంది. కావున వ్యర్థము సమాప్తమైపోయిందా? లేక ఇప్పుడు కూడా ఉందా? త్రికాలదర్శి స్టేజ్ లో స్థితమైతే వ్యర్ధము సహజంగా సమాప్తమవుతుంది. త్రికాలదర్శిస్టేజ్ కంటే క్రిందికి వచ్చి ఏకకాలదర్శిలై కర్మ చేస్తే వ్యర్థమవుతుంది. కనుక మీరు ఎవరైనారు? త్రికాలదర్శులా లేక ఏకకాలదర్శులా. సదా త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉంటే సఫలతా మూర్తులవుతారు. అర్థమయిందా?
ఎవరు సదా(అచల్, అడోల్) స్థిరంగా ఉండి శ్రేష్ఠ పాత్ర నటిస్తున్నారో వారిని విశేష పాత్రధారులని అంటారు. మీరు విశేష పాత్రధారులా లేక సాధారణమైనవారా? విశేష పాత్రధారుల విశేష గుణం స్వ సేవ మరియు విశ్వ సేవ. రెండింటి బ్యాలెన్స్(సమతుల్యత).
2. దేహము, దేహసంబంధీల స్మృతి నుండి నిర్మోహులుగా కండి :- పాత ప్రపంచములో ఉంటూ స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులమని భావించి నడుస్తున్నారా? సంగమయుగ బ్రాహ్మణులు కలియుగ సృష్టి నుంచి దూరమైపోయారు. అందుకే వారి కళ్ళు పాత ప్రపంచము వైపు ఎప్పుడూ వెళ్ళవు. పాత విశ్వము, పాత దేహము లేక సంబంధాలు ఏ వైపు కూడా ఆకర్షణ ఉండరాదు. ఎలాగైతే ప్రభుత్వపు పాస్పోర్ట్ లేకుండా ఎవరైనా ఇతర దేశానికి వెళ్తే బంధీలైపోతారో అలా ఇక్కడ కూడా తండ్రి అనుమతి లేకుండా వెళ్ళారంటే మాయ తన బంధీలుగా చేసుకుంటుంది. ఎప్పుడూ దేహ సంబంధపు స్మృతి అయితే రాదు కదా. నిర్మోహులుగా అయ్యారా? ఏ కొంచెం మోహమున్నా ఎలా మొసలి మొదట కొద్దిగా పట్టి తర్వాత పూర్తిగా లాక్కుంటుందో అలా మాయ కూడా పూర్తిగా మింగేస్తుంది. అందుకే కొద్దిగా కూడా మోహం ఉండరాదు. సదా నిర్మోహీలుగా ఉండండి.
3. సేవాధారి అన్నయ్యలు, అక్కయ్యలతో :- అనేక జన్మలకు జమ చేసుకొని వెళ్తున్నారా? మధువనమంటే వరదాన భూమి. వరదాన భూమి నుండి వరదానాల జోలె నింపుకొని వెళ్తున్నారా? అనేక జన్మలకు జమ చేసుకున్నారా? ఇక్కడి వాతావరణము, ఇక్కడి అనుభవము సదా తోడు ఉంచుకుంటారా లేక ఒక సంవత్సరము లేక అర్ధ సంవత్సరము వరకే ఉంచుకుంటారా? సదా ఇదే వాయుమండలాన్ని స్మృతిలో ఉంచుకొని స్వయాన్ని సమర్థులుగా చేసుకోండి. వాతావరణం ఎలా ఉన్నా స్మృతి సమర్థత ఉంటే వాతావరణాన్ని పరివర్తన చేసేస్తారు. ఇలాంటి మహావీరులై వెళ్తున్నారు కదా? లేక కొద్ది సమయం తర్వాత మాయ వచ్చిందని వ్రాస్తారా? వాయుమండలాన్ని మార్చేవారా లేక వాయుమండలములో మారేవారా? అందరూ మహావీరులై తమ సాంగత్యపు రంగు ఇతరులకు కూడా ఉంటే ఎక్కడకు వెళ్ళినా అక్కడ జాగంతి(వెలిగే) జ్యోతి పని చేస్తారు. సదా మేలుకొని ఇతరులను కూడా మేల్కొల్పుతారు.
4. విదేశీ అన్నయ్య అక్కయ్యలతో :- అందరూ స్వయాన్ని లైట్ హౌస్ గా భావిస్తున్నారా? అందరికి దారి చూపడమే లైట్ హౌస్ పని. కావున లైట్ హౌస్ లేక మైట్ హౌస్ అయ్యి వెళ్తున్నామని భావిస్తున్నారా? ఎలాంటి వెతికే ఆత్మలకైనా సహజంగా యథార్థ గమ్యాన్ని చూపేందుకు వెళ్తున్నారు. అందుకు విశేషంగా రెండు మాటలు గమనముంచుకోవాలి. 1. సదా పరిశీలనా శక్తిని ధారణ చేసి ఆత్మల కోరికలను గుర్తించాలి. నాడిని తెలిసినవారినే యోగ్య డాక్టరని అంటారు. కావున పరిశీలనా శక్తిని సదా ఉపయోగిస్తూ ఉండాలి. 2. సదా తమ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని స్థిరంగా ఉంచాలి. సర్వ ఖజానాల అనుభవీలు ఇతరులకు కూడా సహజంగా అనుభవం చేయిస్తారు. సదా ఈ లక్ష్యముంచుకోండి - వినిపించడం కాదు, అనుభవం చేయించాలి. కనుక సర్వ అనుభవీ మూర్తులై వెళ్తున్నారా? అనుభవీ మూర్తులుగా అవ్వాలి, స్పీకర్లుగా కాదు. సర్వ సంబంధాలు, సర్వ శక్తులు అన్నింటి అనుభవముండాలి. కావున టైటిల్ ఏమౌతుంది? శక్తుల అనుభవపు బిరుదు? మాస్టర్ సర్వశక్తివంతులు, గుణాల అనుభవపు టైటిల్ గుణమూర్తి. సర్వసంబంధాల అనుభవీ టైటిల్ సర్వుల స్నేహీలు. కనుక ఎన్ని టైటిల్స్ అయ్యాయి. ఈ టైటిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు కదా. ఎలాగైతే ఆ జ్ఞానాన్ని చదివేవారు లేక ఏదైనా డిపార్టుమెంటులో పని చేయువారు మెడల్స్ తీసుకొని వెళ్తారో అలా మీకెన్ని మెడల్స్ లభించాయి? అందరూ మెడల్స్ తీసుకున్నారా? ఎన్ని ఎక్కువ మెడల్స్ ఉంటాయో అంత అందరి అటెన్షన్ ఉంటుంది కదా. వీరు సర్వ ప్రాప్తి స్వరూపులని వారి మస్తకంలో, కళ్ళల్లో కనిపించాలి. ఇలా తయారై వెళ్తున్నారా? అచ్ఛా
Comments
Post a Comment