* 31-12-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"అమృతవేళ నుండి పరివర్తన శక్తి ప్రయోగము."
ఈ రోజు బాప్ దాదా వర్తమానము మరియు భవిష్యత్తు, రెండు కాలాలలోని రాజ్య అధికారులను అనగా విశ్వ కల్యాణకారి మరియు విశ్వ రాజ్య అధికారి ఈ రెండు రూపములలో పిల్లలను చూస్తున్నారు. ఎంతెంతగా విశ్వ కల్యాణకారులుగా అవుతారో అంతంతగానే విశ్వ రాజ్య అధికారిగా అవుతారు. ఈ రెండు అధికారాలను పొందేందుకు విశేషంగా స్వ పరివర్తన శక్తి అవసరము. పరివర్తన శక్తిని అమృతవేళ నుండి రాత్రివరకు ఎలా కార్యములో పెట్టాలి అన్నదానిని ఆ రోజు కూడా వినిపించి ఉన్నాము.
మొదటి పరివర్తన - కండ్లు తెరవటంతోనే నేను శరీరాన్ని కాను, ఆత్మను, ఇదే ఆది సమయపు ఆది పరివర్తనా సంకల్పము, ఈ ఆది సంకల్పముతోనే మొత్తము దినచర్య ఆధారపడి ఉంది. ఒకవేళ ఆది సంకల్పములో పరివర్తన లేనట్లయితే మొత్తము రోజంతటిలో స్వరాజ్యము కలవారిగా మరియు విశ్వ కల్యాణములో సఫలురుగా అవ్వజాలరు. ఆది సమయము నుండి పరివర్తనా శక్తిని కార్యములోకి తీసుకురండి. ఏవిధంగా సృష్టి ఆదిలో బ్రహ్మ నుండి దేవ ఆత్మ సతో ప్రధానతా ఆత్మ పాత్రలోకి వస్తారో, అలా ప్రతిరోజూ అమృతవేళ ఆదికాలము. కావున ఈ ఆదికాలపు సమయములో లేవటంతోనే తండ్రితో మిలనము చేసేందుకు బ్రాహ్మణ ఆత్మ విచ్చేసారు అన్న మొదటి సంకల్పము స్మృతిలో ఉండాలి. ఈ సమర్థ సంకల్పమే శ్రేష్ఠ సంకల్పము, శ్రేష్ఠ వాక్కు, శ్రేష్ఠ కర్మకు ఆధారంగా అవుతుంది. మొదటి పరివర్తన - “ నేను ఎవరిని!” అన్నది. కావున ఈ పునాదియే పరివర్తనా శక్తికి ఆధారము. దీని తరువాత -
రెండవ పరివర్తన - “ నేను ఎవరికి చెందిన వాడను” సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి! సర్వ ప్రాప్తులూ ఎవరితో ఉన్నాయి! మొదట దేహ పరివర్తన, తరువాత దేహ సంబంధాల పరివర్తన, తరువాత సంబంధాల ఆధారముతో ప్రాప్తుల పరివర్తన - ఈ పరివర్తననే సహజ స్మృతి అని అంటారు. కావున ఆదిలోని పరివర్తనా శక్తి ఆధారముతో అథికారిగా అవ్వగలరు.
అమృతవేళ తరువాత మీ దేహమునకు చెందిన కార్యక్రమములను చేస్తున్న సమయములో ఎటువంటి పరవర్తన అవసరము? దీనిద్వారా నిరంతర సహజయోగిగా అయిపోతారు. ఎల్లప్పుడూ - ' నేను చైతన్యమైన సర్వ శ్రేష్ఠ మూర్తిని మరియు ఈ దేహము ఒక మందిరము, చైతన్య మూర్తియొక్క ఈ దేహము చైతన్య మందిరము. మందిరాన్ని అలంకరిస్తున్నాను అన్న ఈ సంకల్పములనే చెయ్యండి. ఈ మందిరము లోపల స్వయం బాప్ దాదాల ప్రియ మూర్తి విరాజమానమై ఉంది. ఈ మూర్తి గుణాల మాలను స్వయంగా బాప్ దాదానే స్మరిస్తున్నారు. ఈ మూర్తిని స్వయంగా బాబానే మహిమ చేస్తారు. అటువంటి విశేష మూర్తికి చెందిన విశేష మందిరము. మూర్తి ఎంత విలువైనదిగా ఉంటుందో మూర్తి ఆధారంగా మందిరమునకు కూడా విలువ ఉంటుంది. మరి ఎటువంటి పరివర్తనను చెయ్యాలి? నా శరీరము కాదు కానీ బాప్ దాదా యొక్క విలువైన మూర్తికి ఇది మందిరము. స్వయమే మూర్తి మరియు స్వయమే మందిరమునకు చెందిన ట్రస్టీగా అయ్యి మందిరాన్ని అలంకరిస్తూ ఉండండి. ఈ పరివర్తనా సంకల్పము ఆధారముగానే మేరాపన్ అనగా దేహభానము పరివర్తన అయిపోతుంది. దీని తరువాత మీ ఈశ్వరీయ విద్యార్థి రూపము సదా స్మృతిలో ఉండాలి. ఇందులో విశేషమైన ఏ పరివర్తనా సంకల్పము కావాలి? దీని ద్వారా ప్రతి క్షణము యొక్క చదువు, ప్రతి అమూల్యమైన వాక్కుల ధారణతో ప్రతి క్షణము వర్తమానము మరియు భవిష్యత్తు, రెండూ శ్రేష్ఠ ప్రాలబ్దముగా అయిపోతాయి. ఇందుకు కావలసిన పరివర్తనా సంకల్పము - నేను సాధారణమైన విద్యార్థిని కాను, ఇది సాధారణమైన చదువు కాదు, డైరెక్టుగా తండ్రే ప్రతిరోజూ దూరదేశము నుండి నన్ను చదివించటానికి వస్తారు. భగవంతుని వాక్యాలే మా చదువు. శ్రీ శ్రీ యొక్క శ్రీమతమే మా చదువు. ఈ చదువునకు సంబంధించిన ప్రతి మాటా కోటానురెట్లా సంపాదనను జమ చేయిస్తుంది. ఒకవేళ ఒక్క మాటనైనా కూడా ధారణ చెయ్యనట్లయితే అది ఒక్క మాటను మిస్ చెయ్యటం కాదు కానీ పదమాల సంపాదన, అది కూడా అనేక జన్మల శ్రేష్ఠ ప్రాలబ్దము మరియు శ్రేష్ఠ పదవిని పొందటంలో లోటు ఉండటము. ఇటువంటి పరివర్తనా సంకల్పము -'భగవంతుడు మాట్లాడుతున్నారు', మనము వింటున్నాము. నా కోసము తండ్రి టీచరుగా అయ్యి వచ్చారు. నేను ప్రియమైన స్పెషల్ స్టూడెంటును, కాబట్టి నాకోసము వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు వచ్చారు మరియు ఏం చదివిస్తున్నారు? ఈ పరివర్తనా శ్రేష్ఠ సంకల్పము ప్రతిరోజూ క్లాసు సమయములో ధారణ చేసి చదవండి. సాధారణమైన క్లాసు కాదు, వినిపించే వ్యక్తిని చూడవద్దు. కానీ ఆ మాట్లాడేవారి మాటలు ఎవరివి అన్నదానిని ఎదురుగా చూడండి. వ్యక్తిలో అవ్యక్త తండ్రి మరియు నిరాకార తండ్రిని చూడండి. మరి ఏ పరివర్తనను చెయ్యాలి అన్నది అర్థమైందా? ముందుకు వెళ్ళండి - చదువును కూడా చదివారు - ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు సేవా పాత్ర వచ్చింది. సేవలో ఏవిధమైన సేవ అయినా అది ప్రవృత్తికి చెందినదైనా, వ్యవహారమునకు చెందినదైనా, ఈశ్వరీయ సేవకు చెందినదైనా, ప్రవృత్తి అది లౌకిక సంబంధాలదైనా, కర్మబంధన ఆధారంగా సంబంధమున్నాగానీ ప్రవృత్తిలో సేవ చేస్తూ ఈ పరివర్తనా సంకల్పమును చెయ్యండి - మరజీవాజన్మ కలిగింది అనగా లౌకిక కర్మబంధనాలు సమాప్తమయ్యాయి. కర్మబంధనము అని భావిస్తూ వ్యవహరించకండి. కర్మబంధనము, కర్మబంధనము అని ఆలోచించటము, అనటము ద్వారా బంధింపబడతారు, కానీ ఈ లౌకిక కర్మబంధన సంబంధము ఇప్పుడు మరజీవాజన్మ కారణంగా శ్రీమతము ఆధారముతో సేవా సంబంధమునకు ఆధారముగా అయ్యింది. కర్మ బంధనము కాదు, సేవా సంబంధము. సేవా సంబంధములో వెరైటీ ఆత్మలు అన్న జ్ఞానమును ధారణ చేస్తూ, సేవా సంబంధముగా భావించి నడిచినట్లయితే బంధనములో అలసిపోరు. అతి పాపాత్మలు, అతి అపకారీ ఆత్మలు, కొంగలపై కూడా ద్వేషము రాదు, విశ్వ కల్యాణకారీ స్థితిలో స్థితులై దయాహృదయులై దయా భావనను ఉంచుతూ, సేవా సంబంధముగా భావిస్తూ సేవ చేసినట్లయితే, ఎంత హోప్ లేస్ కేసుకు సేవ చేస్తారో అంతగానే ప్రైజ్ (బహుమతి) కి అధికారిగా అవుతారు. ప్రసిద్ధి చెందిన విశ్వ కల్యాణకారులుగా కీర్తింపబడతారు. పీస్ మేకర్ (శాంతి స్థాపనను చేసేవారు) ప్రైజ్ ను తీసుకుంటారు. కావున ప్రవృత్తిలో కర్మబంధనకు బదులుగా, ఇది సేవా సంబంధము అన్న ఈ పరివర్తనా సంకల్పమును చెయ్యండి. కానీ సేవ చేస్తూ చేస్తూ అటాచ్ మెంట్ (మోహము) లోకి రాకూడదు. ఒక్కోసారి డాక్టరు కూడా రోగి మోహంలోకి వచ్చేస్తాడు. సేవా సంబంధము అనగా త్యాగము మరియు తపస్వీరూపము. త్యాగము మరియు తపస్సే సత్యమైన సేవ లక్షణము. అలాగే వ్యవహారములో కూడా డైరెక్షన్ ప్రమాణంగా నిమిత్త మాత్రముగా శరీర నిర్వాహణార్థము కర్మ చేయాలి. కానీ మూల అర్థము ఆత్మ నిర్వహణార్థము, శరీర నిర్వహణ చేస్తూ చేస్తూ ఆత్మ నిర్వహణను మర్చిపోకూడదు. వ్యవహారము చేస్తూ శరీర నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణ, రెండింటి బ్యాలెన్సు ఉండాలి. బ్యాలెన్సు లేనట్లయితే వ్యవహారము మాయాజాలమైపోతుంది. ఇటువంటి వలను ఎంతగా పెంచుకుంటూ ఉంటారో అంతగా చిక్కుకొనిపోతారు ధనవృద్ధిని చేసుకుంటూ కూడా సృతివిధిని మర్చిపోకూడదు. స్మృతి విధి మరియు ధన వృద్ధి రెండూ తోడుతోడుగా ఉండాలి ధనవృద్ధి వెనుక విధిని వదిలెయ్యకూడదు. లౌకిక స్థూల కర్మను కూడా కర్మయోగీ స్టేజ్ లోకి పరివర్తన చేసుకోవటము అని దీనిని అంటారు. కేవలము కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారము, యోగము అనగా పరమార్థము. పరమార్థము అనగా పరమ పిత సేవార్థము చేస్తున్నారు. కావున వ్యవహారము మరియు పరమార్థము, రెండూ తోడుతోడుగా ఉండాలి. శ్రీమతముపై నడిచే కర్మయోగులు అని వీరినే అంటారు. వ్యవహారము చేసే సమయములో ఏ పరివర్తనను చెయ్యాలి? నేను కేవలము వ్యవహారినే కాదు, కానీ వ్యవహారి మరియు పరమార్థి అనగా ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవార్థము చేస్తున్నాను. వ్యవహారి మరియు పరమార్థి రెండు రూపాలూ కంబైండుగా ఉన్నాయి. ఈ పరివర్తనా సంకల్పము సదా స్మృతిలో ఉన్నట్లయితే మనస్సు మరియు తనువు డబుల్ సంపాదన చేస్తూ ఉంటాయి. స్థూలధనము కూడా వస్తూ ఉంటుంది మరియు మనస్సు ద్వారా అవినాశీ ధనము కూడా జమ అవుతూ ఉంటుంది. ఒకే తనువు ద్వారా ఒకే సమయములో మనస్సు మరియు ధనముల డబుల్ సంపాదన జరుగుతూ ఉంటుంది. నేను డబుల్ సంపాదన చేసేవాడిని అని సదా గుర్తు ఉండాలి. ఈ ఈశ్వరీయ సేవలో నిమిత్తమాత్రము యొక్క మంత్రము మరియు నేను చేసేవాడిని అన్న స్మృతి సంకల్పము సదా గుర్తు ఉండాలి. చేయించేవారిని మర్చిపోరు. కావున సేవలో సదా నిర్మాణచిత్తులే నిర్మాణమును చేస్తూ ఉంటారు. అచ్చా ...
ఇంకా ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళేకొద్దీ అనేక రకాల వ్యక్తులు మరియు వైభవాలు, అనేక రకాల వస్తువులతో సంపర్కము ఉంటుంది. ఇందులో కూడా సదా వ్యక్తిలో వ్యక్త భావమునకు బదులుగా ఆత్మిక భావమును ధారణ చెయ్యండి. వస్తువులు మరియు వైభవాలలో అనాసక్త భావమును ధారణ చేసినట్లయితే వైభవాలు మరియు వస్తువులు అనాసక్తత ముందు దాసీ రూపములో ఉంటాయి మరియు ఆసక్త భావము కలిగినవారిముందు అయస్కాంతము వలె బంధించేవిగా ఉంటాయి. వదిలించుకోవాలన్నా కూడా వదలవు. కావున వ్యక్తి మరియు వైభవాలలో ఆత్మ భావము మరియు అనాసక్త భావముల పరివర్తనను చెయ్యండి.
ఇంకా ముందుకు వెళ్ళండి పాత ప్రపంచమునకు చెందిన ఏదైనా ఆకర్షణమయ దృశ్యమును చూసినప్పుడుగానీ, అల్పకాలికమైన సుఖమునిచ్చే సాధనమును ఉపయోగించినప్పుడుగానీ ఆ సాధనాలు లేక దృశ్యములను చూసి అక్కడక్కడ సాధనను మరిచి సాధనాలలోకి వచ్చేస్తారు. సాధనాలకు వశీభూతమైపోతారు. సాధనాల ఆధారంపై సాధన చెయ్యటం - ఇసుక పునాదిపై భవనమును నిర్మిస్తున్నట్లుగా భావించండి. దాని పరిస్థితి ఎలా ఉంటుంది? పదేపదే అలజడిలో కిందకు మీదకు అవుతూ ఉంటుంది. దాని పరిస్థితి పడిపోయినట్లు గానే ఉంటుంది. కావున సాధనాలు వినాశీ అయినవి మరియు సాధన అవినాశీ అయినది అని పరివర్తన చేసుకోండి. వినాశీ సాధనాల ఆధారముపై అవినాశీ సాధన జరగజాలదు. సాధనాలు నిమిత్తమాత్రమైనవి, సాధన నిర్మాణమునకు ఆధారము. కావున సాధనాలకు మహత్వమును ఇవ్వకండి, సాధనకు మహత్వమునివ్వండి. కావున నేను సిద్ధి స్వరూపమునే కానీ సాధనాల రూపమును కాను అనే ఎల్లప్పుడూ భావించండి. సాధన సిద్ధిని ప్రాప్తింప చేస్తుంది. సాధనాల ఆకర్షణలో సిద్ధి స్వరూపమును మర్చిపోకండి. ప్రతి లౌకిక వస్తువును చూస్తూ, లౌకిక విషయాలను వింటూ, లౌకిక దృశ్యాలను చూస్తూ లౌకికమును అలౌకికములోకి పరివర్తన చెయ్యండి, అనగా జ్ఞాన స్వరూపులై ప్రతి విషయము నుండి జ్ఞానమును తీసుకోండి. విషయాలలోకి వెళ్ళకండి, జ్ఞానములోకి వెళ్ళండి, ఏ పరివర్తనను చెయ్యాలి అన్నది అర్థమైందా! అచ్ఛా!
ఇంకా ముందుకు వెళ్ళండి - ఇప్పుడు ఇంకేం మిగిలింది! ఇప్పుడు నిద్రించడము ఉండిపోయింది. సోనా (నిద్రించటము) అనగా సోనే (బంగారు) ప్రపంచములో నిద్రించటము. నిద్రించటాన్ని కూడా పరివర్తన చెయ్యండి. పరుపుపై నిద్రించకండి, కానీ ఎక్కడ నిద్రించాలి? బాబా స్మృతి అనే ఒడిలో నిద్రపోతారు. ఫరిస్తాల ప్రపంచములో స్వప్నములో షికారు చెయ్యండి, కావున స్వప్నమును కూడా పరివర్తన చెయ్యండి మరియు నిద్రించటాన్ని కూడా పరివర్తన చెయ్యండి. ఆది నుండి అంతిమము వరకు పరివర్తనను చెయ్యండి. ఎలా పరివర్తన శక్తిని ఉపయోగించాలి అన్న విషయము అర్థమైందా?
ఈ క్రొత్త సంవత్సరపు కానుక పరివర్తనా శక్తి యొక్క కానుక. స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన, ఈ గిఫ్టు (బహుమతి) అనే లిఫ్టు ద్వారా విశ్వ పరివర్తనా సమయమును సమీపంగా తీసుకువస్తారు. క్రొత్త సంవత్సర శుభకాంక్షలనైతే అందరూ ఇస్తారు, కానీ బాప్ దాదా క్రొత్త సంవత్సరములో సదా తీవ్ర పురుషార్థిగా అయ్యే నవీనత యొక్క శుభాకాంక్షలను ముందుగానే ఇస్తున్నారు. క్రొత్త సంవత్సరము, క్రొత్త సంస్కారము, క్రొత్త స్వభావము, క్రొత్త ఉల్లాస-ఉత్సాహాలు, విశ్వమును క్రొత్తగా చేసే శ్రేష్ఠ సంకల్పము, సర్వులకు ముక్తి-జీవన్ముక్తి వరదానమును ఇచ్చే సదా శ్రేష్ఠ సంకల్పము - ఇటువంటి నవీనత యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. పాత సంస్కారాలకు, పాత నడవడిక, పాత వ్యవహారము, పాతవాటికి వీడ్కోలు ఇస్తున్నందుకు అభినందనలు. అచ్ఛా!
ఇలా ప్రతి కర్మలో పరివర్తనా శక్తి ద్వారా స్వపరివర్తన మరియు విశ్వపరివర్తనను చేసేవారికి, ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మనూ క్రొత్తదిగా అనగా గోల్డెన్ ఏజ్ గా చేసుకొనేవారైన శ్రేష్ఠులు అనగా సతో ప్రధానంగా చేసుకొనే వారికి, నూతన సంవత్సరములో స్వయములో మరియు విశ్వములో నూతన చమత్కారమును చూపించేవారికి, స్వయము పట్ల మరియు విశ్వము పట్ల దేనినైతే అసంభవముగా భావిస్తున్నారో ఆ అసంభవమును సహజముగా సంభవము చేసే ఇటువంటి సదా సఫలతామూర్త శ్రేష్ఠ సిద్ధి స్వరూప ఆత్మలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment