31-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మహారథి యొక్క సర్వవిశేషతలను ఈ సంవత్సరం ధారణ చేయండి.
మీటింగ్ కు వచ్చిన అన్ని జోన్ల మహారథీ సోదరీ సోదరులతో అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మధుర మహావాక్యాలు -
ప్లానింగ్ బుద్ధి కల పార్టీ వీరు. వెనువెంట సఫలతామూర్తులు కూడా ప్లానింగ్ బుద్ధి తరువాత సఫలతామూర్తి అవ్వడంలో ఏదైతే సమయం ఇస్తున్నారో, శ్రమిస్తున్నారో ఆ ఫలితం తీసుకువచ్చేటందుకు మహారథీల సఫలత విశేషంగా ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది. అది ఏవిషయం? మహారథీల విశేషత ఏమిటి? ఆ విశేషత ద్వారానే వారు మహారథీ అయ్యారు అది ఏమిటి? మహారథీల విశేషత ఏమిటంటే వారు సర్వుల ద్వారా సంతుష్టతా సర్టిఫికెట్ తీసుకుంటారు. అప్పుడే మహారథి అని అంటారు. సంతుష్టతయే శ్రేష్టత లేదా మహానత. ప్రజలు కూడా దీని ఆధారంగానే తయారవుతారు. సంతుష్టం అయ్యారంటే ఆ ఆత్మలు వారిని రాజుగా భావిస్తారు ఏదోక సేవా సహయోగం ద్వారా స్నేహాన్ని గాని, సహయోగాన్ని గాని, ధైర్యాన్ని గాని, ఉల్లాసాన్ని గాని మరియు శక్తిని గాని ప్రాప్తింపచేస్తే వారు సంతుష్టం అవుతారు. మహారథియే కాని వారితో అందరూ సంతుష్టంగా లేకపోతే వారు పేరుకే మహారథి పనికి కాదు. పెద్ద అక్కయ్య, అన్నయ్య తల్లిదండ్రులతో సమానంగా ఉంటారు. తల్లిదండ్రులు అందరినీ సంతుష్టం చేస్తారు. కనుక మహారథీలు మొదట ఈ ధ్యాస పెట్టుకోవాలి. దీనికోసం స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. కానీ ఈ సంతుష్టత అనే సర్టిఫికెట్ తప్పక తీసుకోవాలి. ఎంతమంది ఆత్మలు నాతో సంతుష్టంగా ఉన్నారు, నాతో అందరూ సంతుష్టంగా ఉండాలంటే నేను ఏమి చేయాలని పరిశీలించుకోండి. మహారథీలలో స్వయాన్ని మలుచుకునే శక్తి ఉండాలి, మలుచుకునేవారే బంగారం లాంటివారు. మలుచుకోలేని వారు నిజమైన బంగారం కాదు, కల్తీ బంగారం అనగా గుర్రపు సవారీ. మహారథీలు అయితే మలుచుకుంటారు. ప్లాన్ తయారుచేయడం అనగా బీజాన్ని నాటడం. కనుక బీజం శక్తిశాలిగా ఉండాలి. సర్వుల సంతుష్టత యొక్క మరియు స్నేహం యొక్క ఆశీర్వాదాలు స్నేహమనే నీరు తప్పక కావాలి. లేకపోతే ప్లానింగ్ అనే బీజం శక్తిశాలిగా ఉంటుంది కానీ స్నేహం, సహయోగం అనే నీరు లభించకపోతే వృక్షం రాదు. ఒక్కోసారి వృక్షం వచ్చినా కానీ ఫలం రాదు. ఒకవేళ ఫలం వచ్చినా కానీ అది రెండవ తరగతి, మూడవ తరగతికి చెందినది ఉంటుంది. దానికి కారణం నీరు లభించకపోవడం. మహారథీ అనగా సర్వగుణ సంపన్నులు సర్వకళలు, సర్వ విశేషతలు ఉండాలి. ఒకవేళ ఒకటి రెండు కళలు తక్కువైతే సర్వకళా సంపూర్ణులు కాదు. సర్వగుణాలు లేకపోతే మహారథి అనే టైటిల్ నుండి తొలగిపోతారు. ఇది మహారథీల గ్రూపు, మహారథీలకే ఆహ్వానం లభించింది. సఫలతామూర్తులుగా అయ్యేటందుకు ముఖ్యంగా రెండే విశేషతలు కావాలి. ఒకటి - పవిత్రత, రెండు - ఐక్యత. పవిత్రత తక్కువగా ఉంటే ఐక్యతలో కూడా లోపం వస్తుంది, కేవలం బ్రహ్మచర్య వ్రతాన్నే పవిత్రత అని అనరు. సంకల్పం, స్వభావం, సంస్కారంలో కూడా పవిత్రత ఉండాలి. ఉదాహరణకి ఒకరిపట్ల ఒకరికి ఈర్ష్య లేదా ద్వేషం యొక్క సంకల్పాలుంటే, అది పవిత్రత కాదు, అపవిత్రత. పవిత్రత యొక్క పరిభాష ఏమిటంటే సర్వ వికారాలు అంశమాత్రంగా కూడా ఉండకూడదు. సంకల్పంలో కూడా ఏరకమైన అపవిత్రత ఉండకూడదు. పిల్లలైన మీరు నిమిత్తంగా అయ్యారు, చాలా ఉన్నత కార్యాన్ని సంపన్నం చేసేటందుకు. మహారథీలుగా నిమిత్తమై ఉన్నారు కదా. ఒకవేళ జాబితాని తీసినట్లయితే ఆ జాబితాలో కూడా సేవాధారులు లేదా సేవకు నిమితమైన బ్రాహ్మణ పిల్లలే మహారథీ జాబితాలో లెక్కించబడతారు. కాని మహారథీ యొక్క విశేషతలు ఎంతవరకు వచ్చాయో ప్రతి ఒక్కరికి స్వయానికి స్వయం తెలుసు. మహారథీలు ఏ జాబితాలో అయితే లెక్కించబడతారో వారు ఇకముందు మహారథీ అవుతారు లేదా వర్తమాన లిస్టులో మహారథీగా ఉంటారు. కనుక ఈ రెండు విషయాలపై ధ్యాస అవసరం. ఐక్యత అనగా స్వభావ సంస్కారాలను కలుపుకోవడం. ఎవరి స్వభావ సంస్కారాలైన కలవకపోయినట్లయితే ప్రయత్నించి మరీ కలుపుకోండి, ఇదే ఐక్యత. కేవలం సంఘటనని ఐక్యత అని అనరు. నిమిత్తమైన సేవాధారి ఆత్మలు ఈ రెండు విషయాలు లేకుండా బేహద్ సేవకు నిమిత్తం కాలేరు. హద్దులో సేవకు అయితే అవుతారు కానీ, బేహద్ సేవకు అయితే ఈ రెండు విషయాలు కావాలి. చెప్పాను కదా నాట్యంలో తాళం కలవాలి, అప్పుడే ఓహో ఓహో అంటారు. అలాగే ఇక్కడ కూడా తాళం కలవాలి, అనగా నాట్యం చేయాలి, ఇంతమంది ఆత్మలు ఎవరైతే జ్ఞానాన్ని వర్ణిస్తూ ఉన్నారో అందరి నోటి నుండి ఒకటే మాట రావాలి, మీరు అందరూ ఒకే విషయం చెబుతున్నారు, వీరందరి టాపిక్ ఒకటే, ఒకే మాట అందరూ చెబుతున్నారు అని రావాలి. ఈ విధంగా అందరి స్వభావ సంస్కారాలు ఒకరితో ఒకరికి కలవాలి, అప్పుడే నాట్యం చేసినట్లు. దీనికోసం ప్లాన్ తయారుచేశారా (ప్లాన్ వినిపించారు) లక్ష్యం అయితే పెట్టుకున్నారు. స్థాపనా కార్యాన్ని ప్రఖ్యాతి చేయాలని, ప్రఖ్యాతి చేయాలని ఏదైతే ప్లాన్ తయారుచేశారో అది బాగుంది. ప్రఖ్యాతి చేసేటందుకు ప్లాన్ రాబోయే సంవత్సరానికి తయారుచేసారు. ఈ సంవత్సరంలో ఏదైతే కొద్ది సమయం ఇంకా మిగిలి ఉందో ఈ సమయంలో ప్రతి ఒక్క స్థానంలో వర్తమాన వాతావరణం అనుసారంగా సంప్రదింపుల్లోకి వచ్చే వ్యక్తి ఒకరు తప్పక కావాలి. రాబోయే సంవత్సరం యొక్క సేవా సఫలత ఈ సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది. ప్రాపకాండలో ఇలాంటి సహయోగి ఆత్మల యొక్క సహయోగం కావాలి. దీనిద్వారా తక్కువ ఖర్చు ఎక్కువ పేరు, శ్రమ తక్కువ సఫలత అధికంగా లభిస్తుంది. సమయానుసారం మీరు అలాంటివారికి సేవ చేస్తే సహయోగం లభించదు. కానీ సమయానికి ముందే అలాంటివారికి సేవ చేయడం ద్వారా సహయోగం తీసుకోవచ్చు, అప్పుడు ప్రభావం పడుతుంది. ప్లాన్స్ అయితే అన్నీ బాగున్నాయి, వినిపించిన ప్లాన్స్ లో అన్నీ బాగున్నాయి, ప్రతి వర్గంలోని వ్యక్తి తప్పక సంప్రదింపుల్లోకి రావాలి. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వ్యక్తి సంప్రదింపుల్లోకి రావడం ద్వారా తయారైపోయినటువంటి వేదిక లభిస్తుంది. ఏ ప్లాన్ అయినా కానీ విహంగమార్గం యొక్క సేవ కోసం ఇవన్నీ కావాలి. గీతా పాయింట్ల ద్వారా అయితే వస్తే హాహాకారులు లేదా జైజైకారాలు వస్తాయి. మొదట అలజడి జరుగుతుంది, తరువాత జైజై కారాలు వస్తాయి. ఇలాంటి పాయింట్లు క్లియర్ చేయడానికి అందరి సహయోగం కావాలి. మినిష్టర్, న్యాయవాది మరియు న్యాయమూర్తి అందరూ కావాలి. ఇక్కడ కూడా డాక్టరు, న్యాయవాదులు అందరూ వస్తున్నారు కదా! దీనికోసం అందరి యొక్క సంప్రదింపులు తప్పక కావాలి. మినిస్ట్రీ అసోసియేషన్ లాంటి వారితో సంప్రదింపులు కావాలి. ఇప్పుడు అందరూ వినాలనే కోరిక పెట్టుకుంటున్నారు. దీనిలో నడిచే ధైర్యం లేదు, కనుక సహయోగి కాగలరు. వారు మొదట వారి సేవతో భూమిని తయారుచేసి ఆ తరువాత విశాలకార్యం యొక్క బీజాన్ని నాటండి, ప్లానంతా బాగుంది. ఈ సంవత్సరంలో ఏదోకటి కొత్త విషయం తప్పకుండా ఉండాలి. 76వ సంవత్సరం కోసం ప్లాన్ తయారు చేశారు. నిమిత్తంగా అవ్వాల్సి ఉంటుంది. కానీ జరిగేది డ్రామానుసారం జరుగుతుంది. కాని ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారి పేరు బ్రాహ్మణ కులంలో ప్రసిద్ధి అవుతుంది. ఇది కూడా ఒక కానుక ప్రతి ఒక్కరు మీమీ జోన్లవైపు నుండి మీటింగ్ పెట్టుకుని ఫలితం తీయండి. ప్లాన్ సెట్ చేసుకుని తరువాత ఫలితం యొక్క మీటింగ్ పెట్టుకోండి. ప్లానులో అయితే అందరూ అలాగే అలాగే అంటారు, కానీ ఫలితంలో అయితే ఐదుగురే వస్తారు. కనుక రిజల్టు కోసం కూడా మీటింగ్ పెట్టుకుని ఉత్సాహం పెంచుకునేటందుకు లక్ష్యం పెట్టుకోండి. అందరినీ బిజీగా ఉంచండి. మేము కూడా మా వ్రేలు ఇచ్చాము అని వారికి కూడా సంతోషం ఉంటుంది. శ్రమించి పని చేసేవారైనా, ప్లాన్లు తయారుచేసే బుద్ధి కలవారైనా, చిన్నవారైనా, అందరినీ ముందుకు తీసుకువెళ్ళండి. లేకపోతే ఒకరు ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తారు, ఇతరుల యొక్క వైబ్రేషన్ సఫలతలో విఘ్నం వేస్తుంది. కనుక అందరి సహయోగం కావాలి. ప్రతి ఒక్కరికి ఏదోక డ్యూటి తప్పకుండా పంచండి. ఎలాగైతే ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు కదా! అలాగే ఈ సేవా ప్రసాదాన్ని కూడా అందరికీ పంచండి. అప్పుడు అందరి యొక్క ఉత్సాహంతో కూడిన వాయుమండలం ఉంటుంది. ఆ వాయుమండలం యొక్క ప్రభావంతో ఎవరూ బయటకు వెళ్ళలేరు. చుట్టూ తిరిగేవారిగా అయినా లేదా అర్పణ అయిపోయేవారిగా అయినా అవుతారు. కనుక ఈ సంవత్సరంలో ఏ విశేషత ఉండాలి. అందరూ నా బాబా అని అంటున్నారు. అదేవిధంగా నా సేవ, నా కార్యక్రమం అని అనాలి. పెద్దవారు తయారుచేశారు, వెళ్ళాలా వద్దా అని అనుకోకూడదు, నా కార్యక్రమం అని అనుకోవాలి. ఇలా అందరి యొక్క ధ్వని వస్తే సఫలత వస్తుంది, కనుక అందరికీ సేవకు అవకాశం ఇవ్వండి. అచ్ఛా ఓంశాంతి.
Comments
Post a Comment