30-11-1970 అవ్యక్త మురళి

* 30-11-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“వర్కర్ల వండర్‌ఫుల్ సర్కస్."

           మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా? ఈ అధర్‌కుమారుల గ్రూపు ఏదైతే ఉందో వీరందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపొయ్యారా లేక అయ్యేందుకు వచ్చారా? అయ్యేందుకు వచ్చామని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మిగిలినవారు ఎవరైతే తయారైపోయి ఉన్నారో వారు ఎదురుగా రావాలి. మాస్టర్ సర్వశక్తివంతులైనప్పుడు, ఎప్పుడూ పాస్ అవుతుంటారు, ఫెయిల్ అవ్వరు, ఎప్పుడూ, ఏవిషయములోనూ ఫెయిల్ అవ్వటము ఉండదు. అచ్ఛా, ఎప్పుడైనా ఫీలింగ్ వస్తుందా? వీరు ఫీలింగ్ ప్రూఫ్ లు అని నిమిత్తమైయున్న టీచర్ల నుండి సర్టిఫికేట్ లభించిందా? వర్తమాన సమయానుసారంగా ఇవి మామూలు విషయాలేమీ కావు. వర్తమాన పురుషార్థము ప్రమాణంగా మామూలు విషయము కూడా గొప్పగా లెక్కింపబడుతుంది. ఏవిధంగా ఎంతగా పెద్ద వ్యక్తులు ఉంటారో, ఎంతగా అధిక ధనవంతులుగా ఉంటారో వారు చేసే చిన్న చెడు పనికి గానీ లేక చిన్న పొరపాటుకు గానీ పైసా దండన కూడా వారికి చాలా పెద్దగా అనిపిస్తుంది. కావున ఈ రీతిగా వర్తమానసమయములో మామూలు వారు కూడా గొప్పవారి లిస్ట్ లో  లెక్కింపబడతారు. మాస్టర్ సర్వశక్తివంతులు అనగా ఫీలింగు నుండి దూరంగా ఉండేవారు. అన్ని విషయాలలో ఫుల్. నాలెడ్జ్ ఫుల్. అన్ని పదాల చివర ఫుల్ అని వస్తుంది. కావున ఎంతగా ఫుల్ అవుతూ ఉంటారో అంతగా ఫీలింగ్ యొక్క ఫ్లా(మచ్చ) మరియు ఫ్లూ సమాప్తమైపోతుంటుంది. ఫ్లాలెస్(మచ్చలేని) వారినే ఫుల్ అని అంటారు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? ఎవరైతే చేతులెత్తలేదో వారు కూడా మాస్టర్ సర్వశక్తివంతులే, ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రిని తనవారిగా చేసుకొన్నారు. సర్వశక్తివంతుడైన తండ్రిని సర్వ సంబంధాలతో తనవారిగా చేసుకొన్నారు, ఇదే మాస్టర్ సర్వ శక్తివంతుల శక్తి. మరి సర్వశక్తివంతుడిని సర్వ సంబంధాలతో మీవారిగా చేసుకున్నారా? ఇంత పెద్ద ప్రత్యక్ష ప్రమాణము ఉన్నప్పుడు మరింకెందుకు మిమ్మల్ని మీరు తెలుసుకోరు మరియు ఒప్పుకోరు! ఈ ప్రత్యక్ష ప్రమాణము ఎల్లప్పుడూ ఎదురుగా ఉన్నట్లయితే మాయాజీతులుగా చాలా సహజరీతిలో అవ్వగలరు. అర్థమైందా? సర్వ సంబంధాలు ఒక్కరితోటే జోడింపబడి ఉన్నట్లయితే మిగిలిన విషయాలేవైనా ఉంటాయా? ఎప్పుడైతే అసలు ఏమీ ఉండనే ఉండవో, ఇక బుద్ధి మరెక్కడకు వెళ్తుంది! ఒకవేళ బుద్ధి అటూ ఇటూ వెళ్తున్నట్లయితే సర్వ సంబంధములు ఒక్కరితోనే జోడింపబడి లేవు అని అప్పుడు బుజువవుతుంది. జోడించిన దానికి గుర్తు- అనేకము నుండి విడిపోవటము. అసలు ఆధారమే లేనప్పుడు బుద్ధి ఎక్కడికెళుతుంది? ఇప్పుడు అన్ని ఆధారాలూ పడిపోతాయి, ఒక్కరితోనే జోడింపబడుతుంది. అప్పుడిక బుద్ధి అటూ ఇటూ వెళ్తుంది అన్న కంప్లైంట్ (ఫిర్యాదు) ఏదైతే ఉందో అది సమాప్తమైపోతుంది. అచ్ఛా!

        మేము భట్టీలో వచ్చాము అని ఈ గ్రూపు భావిస్తుంది, భట్టీలోనే ఉన్నారు, కానీ విశేషరూపంలో ఎందుకు వచ్చారు? భట్టిలోనే ఉన్నాము కానీ బ్యాటరీ ఎంతవరకు చార్జ్ అయ్యింది అన్నదానిని వెరిఫై చేయించుకొనేందుకు లేక చెకింగు చేయించేందుకు వచ్చాము అని అంటారా? చార్జ్ చేయించేందుకు వచ్చారా లేక చెకింగ్ చేయించేందుకు వచ్చారా? (రెండూ), అలా అయితే ఇది విలువైన, సేవాధారులైన వర్కర్ల గ్రూపు. ఈ గ్రూపు టైటిల్‌ను అయితే విన్నారు కదా! ఈ టైటిల్‌ను విని అందరూ సంతోషపడుతూ ఉన్నారు. అయినా, ఇందులో  'కానీ' అన్నది కూడా ఉంది. ఇది లక్ష్యము కూడా. భవిష్యత్తు కొరకు భట్టీ నుండి సమానంగా అయ్యి వెళ్తాము అన్న లక్ష్యముతో చెప్తారు. ఉన్నదైతే వర్కర్ల గ్రూపుగా, కానీ వర్కర్ల బదులుగా అప్పుడప్పుడూ ఏంచేస్తారో తెలుసా?  ఎవరైతే దీన్ని చేస్తారో ఆ వర్కర్ల యాక్షన్ న్ను బాప్ దాదా వతనము నుండి చూస్తారు. అప్పుడప్పుడూ చాలా విచిత్రమైన సర్కస్ ను చేస్తారు. ఏవిధంగా సర్కస్ లో  భిన్న భిన్నమైన వేషాలు చూపిస్తారో  అలా ఇక్కడ కూడా తమ తమ సర్కస్ ను చూపిస్తారు. ఆ సర్కస్లో ఏమేమి పాత్రలు పోషిస్తారో అవన్నీ చూడటానికి మంచిగా అనిపిస్తాయి. అప్పుడప్పుడూ వర్కర్లు తమ భయంకర రూపాన్ని కూడా చూపిస్తారు. తమ లోపాలపై భయంకర రూపాన్ని ధారణ చేసేందుకు బదులుగా ఇతరులపై భయంకర రూపానికి చెందిన సర్కసన్ను చూపిస్తారు. వ్యవహారములో, పరివారములో,  పరమార్థములో ఈ మూడింటిలో ఈ భయంకర రూపము కలిగిన సర్కస్ ను చూపిస్తారు. అప్పుడప్పుడూ మరొక సర్కస్ ను, వ్యర్థ సంకల్పాల ఊయలలో ఊగే సర్కస్ ను చూపిస్తారు. వాస్తవానికి ఊయలను ఊగాల్సింది అతీంద్రియ సుఖములో, కానీ ఊగేది వ్యర్థ సంకల్పాల ఊయలలో. మూడో సర్కస్ గా దేన్ని చూపిస్తారు? స్థితిని మార్చే సర్కస్ ను చూపిస్తారు. మెజారిటీ వారు రూపము మరియు స్థితిని మార్చే పాత్రను చూపిస్తుంటారు. మరి వతనములో  కూర్చొని బాప్ దాదా వర్కర్ల గ్రూపు చేసే ఈ సర్కస్ ను చూస్తారు. పురుషార్థమును చాలా బాగా చేస్తారు, కానీ పురుషార్థమును చేస్తూ చేస్తూ అక్కడక్కడా మంచి పురుషార్థమును చేసిన తరువాత ప్రాలబ్దమును ఇక్కడే అనుభవించాలని కోరిక పడుతుంటారు. కావున కోరిక కూడా ఉంది, మంచిది. కానీ ప్రాలబ్ధమును జమ చేసుకోవాలి. అక్కడక్కడా తమ పురుషార్థపు ప్రాలబ్ధమును ఇక్కడే అనుభవించాలన్న కోరికతో జమ చేసుకోటములో తక్కువ చేసేసుకుంటారు. అర్థమైందా! కావున ఈ విషయమును ఇక్కడే సమాప్తము చేసి వెళ్ళాలి. ప్రాలబ్ధపు కోరికను సమాప్తము చేసి కేవలము మంచి పురుషార్థమును చెయ్యండి. ఇచ్ఛా(కోరిక) అన్న మాటకు బదులుగా అచ్ఛా అన్న పదమును గుర్తు ఉంచుకోండి. అర్థమైందా! ఇచ్ఛ స్వచ్ఛతను సమాప్తము చేసేస్తుంది మరియు స్వచ్ఛతకు బదులుగా సోచతా(ఆలోచించేవారి)గా అయిపోతారు. ఇదే వర్తమానపు రిజల్టు. వర్కర్స్ అంటే చేసేవారు, ఆలోచించేవారు కాదు.

          ఈ గ్రూపువారు ఆశావాదీ రత్నాల గ్రూపు అని బాప్ దాదాకు తెలుసు. ఆశావాదులు కూడా,  ధైర్యవంతులు కూడా కేవలము ఒక్క పదమును జత చెయ్యాలి సహన శక్తివంతులుగా అవ్వాలి.  తరువాత ఆశావాదులనుండి సఫలతామూర్తులుగా అయిపోతారు. అర్థమైందా! ఇప్పుడు ఆశావాదులు, ఈ ఒక్క పదమును కలపటం ద్వారా సఫలతామూర్తులుగా అయిపోతారు. సంపూర్ణతా సామీప్యతకు గుర్తు సఫలత. ఎంతెంతగా మిమ్మల్ని మీరు సఫలతామూర్తులుగా చూసుకుంటారో అంతగా సంపూర్ణతకు సమీపంగా వచ్చామని భావించండి. ఈ గ్రూపు సఫలతామూర్తులుగా అయ్యేందుకు ఏ స్లోగన్ ను ఎదురుగా ఉంచుకుంటారు? పవిత్రతే సంగమయుగపు సౌభాగ్యము - ఇదే స్లోగన్. పవిత్రతకు ఎంత విస్తారము ఉంది! పవిత్రత అంటే ఏమిటి, మరియు ఏ యుక్తుల ద్వారా ధారణ చెయ్యగలరు అన్న టాపిక్ పై టీచర్లు క్లాస్, చేయించాలి. బాప్ దాదా కేవలము టాపిక్ ను ఇస్తున్నారు. పవిత్రతా విస్తారమును అర్థము చేసుకోవాలి. సంపూర్ణ పవిత్రత అని దేనిని అంటారు? కావున పవిత్రతే సంపద. ఇదే ఈ  గ్రూపు యొక్క శ్రేష్ఠ స్లోగన్. సమాప్తి సమయములో సంపూర్ణత యొక్క పరీక్షను తీసుకుంటాము. పేపరులోని ప్రశ్నలను ముందే చెప్పేస్తాము. అప్పుడిక పాస్ అవ్వటము సహజమౌతుంది కదా! సంపూర్ణత అంటే ఏమిటి, దానికి చెందిన నాలుగు ముఖ్య విషయాలతో కూడిన పరీక్షను తీసుకుంటాము, ఆ నాలుగు ఏమిటి అన్నదానిని మాత్రము చెప్పము. అచ్ఛా!

Comments