* 30-07-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మహారథి అంటే మహానత.
ఈ రోజు ఇది పాండవ సేన భట్టీ సమాప్తి సమారోహమా లేక ఈ రోజు మొదలుపెట్టారా? (సమీపిస్తోంది) విశేషంగా ఎటువంటి అభివృద్ధిని చేసారు, అందుకొరకు ఏ విశేష సంకల్పమును చేసారు? పరివర్తన మొదలైందా లేక మొదలవుతుందా? సంకల్ప రూపంలో తీసుకున్నారా లేక సంస్కారమును నింపుకున్నారా? (ప్రతి ఒక్కరూ వారి వారి అభిప్రాయాలను వినిపించారు) ఇదే పాండవ సేన భట్టి యొక్క పరీక్ష. ఈ ఒక్క ప్రశ్న ద్వారా మొత్తము పరీక్ష అయిపోతుంది. వర్తమాన సమయములో సంకల్పము మరియు కర్మ తోడుతోడుగా ఉండటము అవసరము. ఇప్పుడిప్పుడే సంకల్పము చేసారు, ఇప్పుడిప్పుడే దానిని కర్మలోకి తీసుకువచ్చారు. సంకల్పము మరియు కర్మలో చాలా అంతరము ఉండకూడదు. మహారథుల అర్థమే మహానత. కావున మహానత కేవలం సంకల్పములోనే కాకుండా అన్నింటిలోనూ ఉండాలి. ఇదే మహారథుల గుర్తు. సంకల్పమును ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు ఆలోచన చేయడంలో సమయం పట్టదు, ఎందుకంటే ఎటువంటి సంకల్పమైతే ప్రాక్టికల్ లో సంభవం అవ్వగలదో అటువంటి సంకల్పమే మహారథుల సంకల్పంగా ఉంటుంది. దీనిని చెయ్యాలా - చెయ్యవద్దా, ఎలా చెయ్యాలి, ఏం అవుతుంది - ఇటువంటి వాటిని ఆలోచించే అవసరమే వారికి ఉండదు. సంకల్పమే ఎటువంటిది ఉత్పన్నమౌతుందంటే ఏ సంకల్పమునైతే చేస్తారో అది జరిగిపోతుంది. దీని ద్వారా మీ స్థితిని పరిశీలించుకోగలరు. యోగ సిద్ధిని ప్రాప్తి చేసుకోవటము, కర్మ సిద్ధిని ప్రాప్తి చేసుకోవటము - ఇదే ఫైనల్ స్టేజ్, దీనికొరకు ముఖ్యమైన ఏ శక్తిని ధారణ చేసుకోవాలి. ఆ శక్తి ద్వారా ఇవన్నీ నిరూపణ అయిపోవాలి. సంకల్పము, వాణి, కర్మ అన్నీ నిరూపణ అయిపోవాలి, ఇందుకొరకు ఏ శక్తి అవసరము? అందరూ ఏయే శక్తులనైతే వినిపించారో అవన్నీ అవసరమే, కానీ వాటిలో కూడా మొదటగా కంట్రోలింగ్ పవర్(అదుపు చేసుకొనే శక్తి) విశేషంగా అవసరము. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేనట్లయితే వ్యర్థము కలిసిన కారణంగా సిద్ధి ప్రాప్తించదు. ఒకవేళ యథార్థ సంకల్పాలు ఉత్పత్తి అయినట్లయితే లేక యథార్థ వాణి వెలువడినట్లయితే, యథార్థ కర్మ ఉన్నట్లయితే సిద్ధి లేదు అన్నది ఉండజాలదు. కానీ వ్యర్థము కలిసినందువలన సిద్ధి ప్రాప్తించదు. యథార్థమైన దానికే సిద్ధి ఉంటుంది, వ్యర్థమైన దానికి సిద్ధి ఉండదు. వ్యర్థమును కంట్రోల్ చేయడము జరుగుతుంది, అందుకొరకు కంట్రోలింగ్ పవర్ తప్పక అవసరము. ఏదో ఒక బలహీనత కారణంగా కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉంది. బలహీనత ఎందుకు ఉంటుంది? ఈ సంకల్పము యథార్థమైనదా లేక వ్యర్థమైనదా అన్నది తెలుసుకోగలిగి కూడా, కంట్రోలింగు పవర్ లేదు అన్నది తెలుసుకొని కూడా మీ సంస్కారాలను తొలగించుకోలేరు. ఈ సంకల్పము యదార్థమైనదా, వ్యర్థమైనదా అన్నది అర్థం చేసుకోని కూడా కంట్రోల్ చేసుకోనప్పుడు ఆ సంస్కారమునకు బదులుగా వేరే సంస్కారమును మీలో జమ చేసుకోగలరు. కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉన్న కారణంగా మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేరు. మీ రచనకు రచయితగా అవ్వటము వస్తుందా? ఎటువంటి రచనను రచించాలి? యథార్థమైన రచనను రచించటంలో లోపము ఉంది. తమ రచన ద్వారా తామే వ్యాకులతలోకి వచ్చేటటువంటి రచనను రచిస్తారు. ఇప్పుడు పాండవసేన ప్రాక్టికల్ లో ఏ ప్రమాణమును ఇవ్వాలి? బలహీనమైన మాటలు, బలహీనమైన కర్మలు ఏవైతే చేస్తారో వాటి సమాప్తి యొక్క సమాప్తి సమారోహమును చెయ్యాలి. భట్టి సమాప్తి సమారోహము కాదు. బలహీనతకు సమాప్తి మరియు ప్రతి సంకల్పమూ ఎటువంటి శక్తిశాలీదిగా ఉత్పన్నమవ్వాలంటే ఒక్కొక్క సంకల్పము అద్భుతము చేసి చూపించేదిగా ఉండాలి. కావున కమ్ జోరి(బలహీనత) స్థానంలో కమాల్ (అద్భుతము)ను నింపవలసి ఉంటుంది. బలహీనత అన్న మాటే ఇప్పుడు శోభించదు. విశ్వము యొక్క ఆధారము ఆత్మలైన మీపైనే ఉంది. కావున విశ్వానికి ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు అయిన మూర్తుల నోటి నుండి బలహీనత అన్న మాట శోభించదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మూర్తిలో అందరికీ ఏం సాక్షాత్కారమౌతుంది? బాప్ దాదా, అటువంటి అలౌకికమైన ప్రకాశము అందరి మూర్తులలో కనిపించాలి. ఈ ప్రకాశము ఎటువంటిదిగా ఉండాలంటే ఆ ప్రకాశమును చూసిన ఎవరైనా సరే బలిహారమైపోవాలి. అందరినీ బలిహారము చెయ్యగలరు. కొందరికి ముక్తిధామమైతే కొందరికి జీవన్ముక్తిధామము. మీ ద్వారా ఎవ్వరూ తమ యథార్థ పాత్ర యొక్క హక్కును తీసుకోకుండా ఉండిపోకూడదు. ఆత్మలందరూ కూడా మీ ద్వారా వారివారి యథార్థమైన పాత్రను మరియు తండ్రి వారసత్వమును తప్పకుండా తీసుకోవాలి. ఎవ్వరు కూడా తమ వారసత్వమును తీసుకోవటములో, వంచితులై ఉండని విధంగా మీ మూర్తిలో అంతటి ప్రకాశము ఉండాలి. మిమ్మల్ని మీరు ఈ విధంగా దాత పిల్లలైన దాతలుగా భావించాలి. ఇచ్చే వారిలో ఆ ప్రకాశము నషా ఉంటుంది. ఇప్పుడు అది మర్జ్ అయి ఉంది. ఆ సంస్కారాలను ఇప్పుడు ఇమర్జ్ చేసుకోండి. ఆ ప్రకాశము ఇప్పటివరకు కూడా ఇమర్జ్ కాకపోవటానికి ఏ విషయంలో బిజీగా ఉన్నారు? బలహీనతలను తొలగించుకోవడంలో బిజీ. వీటిని పూర్తిగా తొలగించటమైతే చెయ్యవలసిందే. కానీ ఒకటేమో త్వరగా తొలగించటము. అదే పనిని కొందరు 5 నిముషాలలో పూర్తి చెయ్యగలిగితే కొందరు అర్థగంట కూడా తీసుకుంటారు. మరికొందరైతే మొత్తము రోజంతా ఆలోచిస్తూ కూడా లెక్కవేయలేరు. మీరందరూ విశేష ఆత్మలు, కావున ప్రతి సంకల్పము, ప్రతి కర్మ విశేషంగా ఉండాలి, వీటితో ప్రతి ఆత్మకూ ముందుకు వెళ్ళేందుకు ప్రేరణ లభించాలి. ఎందుకంటే మీరందరూ ఆధారమూర్తులు. ఒకవేళ ఆధారమే అలా ఇలా ఉంటే ఇక ఇతరులేం చెయ్యగలరు? విశేష ఆత్మలు విశేష శ్రద్ధను ఇవ్వవలసిందే. జరిగిపోయిన వాటిని ఇప్పుడు సంకల్పములో కూడా ఇమర్జ్ చేసుకోకూడదు. ఒకవేళ పొరపాటున పాత సంస్కారాలనే విషము ఇమర్జ్ అయినట్లయితే దానిని చాలా వెనుక జన్మల సంస్కారముగా భావించండి, ఇప్పటిది కాదు. పాత, జరిగిపోయిన విషయాలను పదే-పదే వర్ణన చేసినట్లయితే దానిని వ్యర్థము అని అంటారు. ఈ పాండవసేన ఎలా అయితే సాకారరూపములో ఉదాహరణగా అయ్యారో అలా మొదటగా వారి పరివారములో ఒక ఉదాహరణమూర్తిగా అయ్యి చూపించాలి. ఆవిధంగా ఫాలో ఫాదర్(బాబాను అనుసరించండి). కావున ఈ రోజును పాత సంస్కారాలు మరియు సంకల్పాల సమాప్తి సమారోహ దినముగా అంటాము, అర్థమైందా!
ఈ గ్రూపు పేరేముంది? ఏ ఆధారముతో పేరును పెట్టడం జరుగుతుంది? ఈ రోజు ఏ రోజు? బృహస్పతి వారము(గురువారము). బృహస్పతి దశ అనగా సఫలత, కావున ఈ గ్రూపు సర్వుల సహయోగి, సఫలతామూర్త సంగఠన. ఎప్పుడైనా, ఎవ్వరికైనా, ఏవిధమైన సహయోగము అవసరమైనా దాత పిల్లలు ఎల్లప్పుడూ ఇచ్చేవారుగా ఉంటారు. వారి చెయ్యి ఎప్పుడూ కూడా ఇవ్వటములో ఆగిపోదు. ఎప్పుడైతే సర్వుల స్నేహులుగా ఉంటారో అప్పుడే సర్వుల సహయోగులుగా అవుతారు. స్నేహులుగా అవ్వనట్లయితే సర్వుల సహయోగులుగా కూడా అవ్వజాలరు. కావున ఈ గ్రూపు మనసా, వాచ, కర్మణ మరియు సంబంధములలో కూడా సహయోగిగా అవ్వాలి, సఫలతామూర్తిగా అవ్వాలి, కావుననే సర్వుల సహయోగి, సఫలతామూర్తి సంగఠన అని అంటారు. అర్థమైందా!
సర్వుల సహయోగిగా అయ్యేందుకు తమను తాము తొలగించుకోవలసి కూడా ఉంటుంది. ఈ కార్యము నుండి తొలగిపోవటము కాదు, మరి తమని తాము తొలగించుకోవటము అనగా తమ పాత సంస్కారములను తొలగించటము. పాత సంస్కారాలే సర్వుల సహయోగిగా అవ్వడములో విఘ్నాలు వేస్తాయి. కావున మీ పాత సంస్కారాలను తొలగించుకోవాలి. ఇతరుల సంస్కారాలను తొలగించటమును గూర్చి చెప్పటం లేదు. మీ సంస్కారాలను తొలగించుకున్నట్లయితే ఇతరులు వారికి వారే మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఒకటి మనము, రెండు తండ్రి, మూడవది చూస్తూ కూడా చూడవద్దు. మూడవ విషయములో చూడవలసి వచ్చినా కూడా, చూస్తూ కూడా చూడవద్దు, స్వయమును మరియు తండ్రిని చూడండి. “తొలగుతాము కానీ సర్వుల సహయోగిగా ఉంటాము” అన స్లోగన్ నే ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. కల్పపూర్వపు మీ స్మృతి చిహ్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తున్నాయా? గోవర్థన పర్వతపు స్మృతి చిహ్నరూపములో ఏం తయారుచేస్తారు? ఎప్పుడైనా చూసారా? నేటి భక్తిమార్గంలో గోవర్థన పర్వతపు పూజను చేసేటప్పుడు ఏం తయారుచేస్తారు? (పేడతో పర్వతాన్ని చేస్తారు) పర్వతానికి వ్రేలును ఇవ్వటము అనగా పాత సంస్కారాలను తొలగించటములో వ్రేలును ఇవ్వటము. మొదట ఈ పర్వతాన్ని ఎత్తినట్లయితే అప్పుడు ఈ కలియుగ ప్రపంచము మారిపోయి క్రొత్త ప్రపంచము తయారవుతుంది. ఏదో ఒక స్లోగన్ ను స్మృతిలో ఉంచుకోవటము కూడా మంచిదే. కానీ స్లోగన్ స్వరూపంగా అవ్వవలసిందే. ఇది ఒక సాధనము, కానీ సాధనతో స్వరూపులుగా అవ్వటము మంచిది. ఏ విశేషతమూలంగా మాలలోని మణులుగా అవుతారు? ఏకమతులై ఒకే దారములో తిరగటమే మాలలోని మణుల విశేషత. ఒక్కరి లగనములోనే ఏకరస స్థితి మరియు ఏకమతమైనప్పుడు అందరూ ఒక్కటే. అన్నీ ఒకే విధమైన మణులైనప్పుడు ఒకే దారములో తిరుగుతాయి కదా! కావున ఒక్కరి మతముపైనే నడిచేవారు మరియు పరస్పరములో కూడా ఏకరసము. సంకల్పము కూడా ఒక్కటే. రెండు మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16,000 మాలలోని మణిగా అయిపోతారు. కావున ఏకమతము కొరకు అటువంటి వాతావరణమును తయారుచేయాలి. ఎప్పుడైతే ఇముడ్చుకొనే శక్తి ఉంటుందో అప్పుడే వాతావరణము తయారవుతుంది. ఏ విషయంలోనైనా భిన్నత ఉన్నట్లయితే, ఎందుకంటే యథా యోగ్య యథా శక్తి కదా, ముందుగా ఆ భిన్నతను ఇముడ్చుకోండి. ఇముడ్చుకొనే శక్తి అవసరము. కావున అటువంటి ఐక్యత ద్వారానే పరస్పరములో సమీపంగా వస్తారు, అందరి ఎదుట ఉదాహరణగా అయిపోతారు. అందరిలో వారివారి విశేషతలు ఉంటాయి, వారు ఎవరైనా, వారి విశేషతలను చూడండి, అప్పుడు విశేష ఆత్మలుగా అయిపోతారు. లోపమును అస్సలు చూడనే కూడదు. చంద్రుడుకిగానీ, సూర్యుడికిగానీ గ్రహణము పట్టినప్పుడు వారిని చూడకూడదు, చూస్తే గ్రహచారము పట్టుకుంటుంది అని ఏవిధంగా చెప్తుంటారో అలా ఎవరిలోనైనా లోపము ఉన్నా అది కూడా గ్రహణమే. పొరపాటున కూడా ఎవరైనా చూసినట్లయితే గ్రహచారము పట్టుకుంటుందని భావించండి. కావున సత్యమైన బంగారంగా అవ్వాలి. కొంచెము మలినము ఉన్నా, అదే కనిపిస్తుంది, విశేషతలను అణిచేస్తుంది. ఇతరులపై ప్రభావము పడేంతగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఒక్కసారిగా మార్పు చేసుకోవాలి. ఒక్కసారిగా వెంబడే అతీతంగా అయినట్లయితే ఇతరుల లగావ్(మోహము) కూడా తొలగిపోతూ ఉంటుంది. అచ్ఛా!
Comments
Post a Comment