30-06-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అవ్యక్త స్థితిలో స్థితులవ్వటం ద్వారా పురుషార్ధం యొక్కవేగంలో తీవ్రత.
ప్రకృతి మరియు వికారాల ఆకర్షణలకు సదా అతీతంగా ఉండేటువంటి, విశ్వం యొక్క సర్వాత్మలకు సేవ చేసేటువంటి మరియు సదా విదేహి పరమపిత పరమాత్మ శివబాబా మాట్లాడుతున్నారు -
ఈ రోజు పిల్లలందరికి సూక్ష్మవతనం యొక్క సమాచారం చెప్తున్నాను. మీ అందరికి సూక్ష్మవతనం షేర్ చేయాలి అంటే ఒకసారి వతనం తప్పకుండా చూడాలి అని అందరికి అభిరుచి ఉంటుంది కదా? ఈ కోరిక లేదా సంకల్పం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకంటే బాప్ దాదా సూక్ష్మవతనవాసి అయ్యి పాత్ర అభినయిస్తున్నారు, అందువలన మేము కూడా ఒకసారి బాప్ దాదాతో కలిసి ఈ అనుభవం చేసుకోవాలి అనే సంకల్పం వస్తుంది. అందువలన బాప్ దాదాయే తన అనుభవం చెప్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అనుభవం చేసుకోవటం లేదా వినే దృశ్యం ఏ సమయంలో ఉంటుందో, ఇది అయితే తెలుసు కదా! విశేషంగా పిల్లల కొరకు అమృతవేళ సమయం నిశ్చితమై ఉంది. తర్వాత విశ్వం యొక్క ఇతరాత్మలకు, శక్తిననుసరించి భావనకు ఫలం ఇవ్వటం లేదా ఏదైనా రజోప్రధాన కర్మ అల్పకాలికంగా ఏ ఆత్మల ద్వారా జరుగుతూ ఉంటుందో వారికి కూడా ఆ కర్మలననుసరించి అల్పకాలిక ఫలం ఇచ్చేటందుకు, వెనువెంట సత్యమైన భక్తుల యొక్క పిలుపు వినేటందుకు మరియు భక్తులకు రకరకాలైన భావనలను అనుసరించి సాక్షాత్కారం చేయించేటందుకు మరియు ఇప్పటి వరకు కూడా నలువైపుల దాగి ఉన్న కల్పపూర్వపు బ్రాహ్మణాత్మలకు సందేశం ఇచ్చేటందుకు, పిల్లలను నిమిత్తంగా చేసే కార్యంలో వైజ్ఞానికుల పరిస్థితి చూసేటందుకు, జ్ఞానీ ఆత్మలకు, స్నేహి,సహయోగి పిల్లలకు రోజంతటిలో ఈశ్వరీయ సేవ చేసేటందుకు లేదా మాయాజీత్ అవ్వటంలో ధైర్యం ఉన్న పిల్లలకు బాబా సహాయం చేస్తారు అనే నియమం ప్రకారం వారికి సహయం చేసే కర్తవ్యంలో డ్రామానుసారం నిమిత్తంగా అయ్యారు.
బ్రహ్మబాబా అవ్యక్త శరీరధారిగా అంటే శరీర బంధనలో లేని కారణంగా ఇప్పుడు తీవ్ర వేగంతో బాబాకి సహయోగిగా అయ్యారు. అలా వ్యక్తంలో సహయోగిగా కాలేరు. ఎందుకు అవ్వలేరు? కారణం ఏమిటి? వ్యక్తం మరియు అవ్యక్తంలో తేడా ఎందుకు వస్తుంది అంటే, వ్యక్త శరీరంలో ఉన్నప్పుడు వ్యక్త శరీరానికి సమయం ఉపయోగించాల్సి ఉంటుంది. మరియు అప్పుడప్పుడు కర్మభోగం పట్ల కూడా నిమిత్తంగా ఉన్న మన సర్వశక్తులను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యక్త శరీరంలో ఉన్నప్పుడు స్వయం పట్ల, పిల్లల పట్ల మరియు విశ్వం పట్ల ఈ మూడింటికి సమయం ఇవ్వాల్సి, ఉపయోగించాల్సి ఉంటుంది మరియు వ్యక్త శరీరధారిగా ఉన్న వ్యక్త సాధనాల ఆధారంగా సేవ చేయాల్సి ఉంటుంది. కానీ అవ్వక్త రూపంలో స్వయం కోసం కూడా సాధనాల ఆధారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకటి - సంపూర్ణంగా అయిన కారణంగా సంపూర్ణ తీవ్రగతి, రెండవది- స్వయం పట్ల సమయం మరియు శక్తులు ఉపయోగించవలసిన అవసరం లేని కారణంగా సేవలో తీవ్రగతి, మూడవది - వినాశి సాధనాల ఆధారం లేని కారణంగా సంకల్పాల వేగం కూడా తీవ్రంగా ఉంటుంది, సంకల్పం ద్వారా ఎక్కడికైనా చేరుకోవటంలో మరియు వినాశి శరీరం ద్వారా ఎక్కడికైనా చేరుకోవటంలో సమయంలో మరియు శక్తికి ఎంత తేడా వస్తుంది! అలాగే వ్యక్తం మరియు అవ్యక్తం యొక్క వేగంలో కూడా తేడా ఉంటుంది.
వైజ్ఞానికులు సమయాన్ని మరియు తమ శక్తిని అంటే శ్రమను, సాధనాల విస్తారాన్ని సూక్ష్మంగా మరియు చిన్నవిగా చేసేస్తున్నారు. తక్కువలో తక్కువ ఒక సెకను వరకు చేరుకునే తీవ్ర పురుషార్ధం చేస్తున్నారు. ఎలా అయితే వినాశనానికి నిమిత్తమైన ఆత్మల వేగం సూక్ష్మం మరియు తీవ్రం అవుతూ ఉందో, అలాగే స్థాపనకు నిమిత్తమైన ఆత్మల వేగం మరియు స్థితి సూక్ష్మంగా మరియు తీవ్రంగా ఉండాలి కదా? అప్పుడే రెండు కార్యాలు సంపన్నం అవుతాయి. కనుక ఇప్పుడు వ్యక్త శరీరానికి మరియు అవ్యక్త శరీరానికి తేడా అర్థమైందా? అవ్యక్తమవ్వటమనేది డ్రామానుసారం ఏ సేవకు నిమిత్తమయ్యారో ఈ రహస్యం అర్ధం చేసుకున్నారా? బ్రహ్మ యొక్క పాత్ర స్థాపన కార్యంలో అంతిమం వరకు నిర్ణయించబడి ఉంది. ఎప్పటి వరకు స్థాపనాకార్యం సంపన్నం అవ్వదో అప్పటి వరకు నిమిత్తంగా అయిన (బ్రహ్మ) ఆత్మ యొక్క పాత్ర సమాప్తి అవ్వదు. ఆయన అంత వరకు రెండవ పాత్ర అభినయించరు. జగత్ పితకు క్రొత్త విశ్వం యొక్క రచన సంపన్నం చేసే కార్యం డ్రామాలో నిర్ణయించబడి ఉంది. మానవ సృష్టి యొక్క సర్వవంశావళి యొక్క రచయిత అని బ్రహ్మకే మహిమ ఉంది, అందువలనే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని మహిమ ఉంది. కేవలం స్థితి, స్థానం మరియు వేగం పరివర్తన అయ్యింది కానీ బ్రహ్మ యొక్క పాత్ర ఇప్పటి వరకు అదే.
కొంతమందికి ఇంత సమయం మా బాబా ఏమి చేస్తున్నారు? అని సంకల్పం వస్తుంది. బాబా కూడా ప్రశ్నిస్తున్నారు - బ్రహ్మతో పాటు బ్రాహ్మణుల యొక్క సర్వాత్మల కళ్యాణార్థం నిమిత్తమయ్యే పాత్ర మరియు క్రొత్త ప్రపంచ స్థాపన యొక్క పాత్ర ఏదైతే నిర్ణయించబడి ఉందో అది సమాప్తి అయిపోయిందా? ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వలేదు మరియు సృష్టి కూడా పరివర్తన అవ్వలేదు. మరి బ్రహ్మ యొక్క పాత్ర ఎలా సమాప్తి అవుతుంది? స్నేహం కారణంగా వతనంలో ఇంత సమయం ఏమి చేస్తున్నారు? అని సంకల్పం వస్తుంది. వతనం యొక్క పాత్ర ఇంత సమయం ఎందుకు మరియు ఎలా అనే సంకల్పం ఎప్పుడు వస్తుంది? ఇది కూడా ఒక గుహ్య రహస్యం. కర్మబంధనతో ముక్తి, సంపన్న ఆత్మ, జనన, మరణ చక్రం సమాప్తి చేసుకున్న ఆత్మ, నిరాకారి బాబాకి మొదటి నెంబర్ సహయోగి ఆత్మ, విశ్వకళ్యాణానికి నిమిత్తమైన మొదటి ఆత్మ స్వయం పట్ల మరియు విశ్వం పట్ల సర్వ సిద్ధులు పొందిన ఆత్మ ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం అక్కడ స్వతంత్ర రూపంలో పాత్రను అభినయిస్తుంది. అల్పకాలిక సిద్ధిని పొందే ఆత్మలు తమ సిద్ధి ఆధారంగా తమ రూపాన్ని పరివర్తన చేసుకుంటున్నారు, మరి సర్వ సిద్ధులు పొందిన ఆత్మ అవ్యక్త రూపధారి అయ్యి ఎంత సమయం కావాలంటే అంత సమయం డ్రామానుసారం పాత్రను అభినయించలేదా?
ఆత్మ నిరాకారి లేదా అవ్యక్త స్థితి నుండి వ్యక్తంలోకి రావటానికి కారణం ఏమిటి? ఒకటి కర్మల యొక్క బంధన, రెండవది సంబంధాల యొక్క బంధన, మూడవది వ్యక్త సృష్టిలో పాత్ర యొక్క బంధన, నాల్గవది దేహబంధన. శరీరం తయారవుతుంది ఆత్మకు పాతదాని నుండి క్రొత్త శరీరం ఆకర్షిస్తుంది. ఈ అన్ని బంధనాల గురించి ఆలోచించండి. స్థాపనా పాత్ర యొక్క బంధన ఏదైతే ఉందో అది వ్యక్తంలో కంటే అవ్యక్త రూపంలో ఇంకా తీవ్ర వేగంతో జరుగుతుంది. ఈ కల్పంలో ఇప్పుడు దేహ ఆకర్షణ యొక్క బంధన లేదు, దేహధారి అయ్యి కర్మ బంధనలోకి వచ్చే బంధన సమాప్తి చేసుకున్నారు. ఇలా ఎప్పుడైతే సర్వ బంధనాల నుండి ముక్తి ఆత్మగా అయిపోతారో అప్పుడు ఈ వ్యక్త దేహం లేదా వ్యక్త దేశం ఆత్మను ఆకర్షించదు. ఎలా అయితే విజ్ఞానం ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు మరియు భూమి యొక్క ఆకర్షణకు అతీతంగా అయిపోతున్నారు. కనుక భూమి వారిని ఆకర్షించటం లేదు. అలాగే ఎప్పటి వరకు క్రొత్త కల్పంలో క్రొత్త జన్మ మరియు క్రొత్త ప్రపంచంలో పాత్ర అభినయించే సమయం రాదో అప్పటి వరకు ఈ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది మరియు ఈ వ్యక్త బంధనాల నుండి ముక్తిగా ఉంటుంది. అర్ధమైందా! అందువలన ఇప్పుడు రకరకాలైన సంకల్పాలు చేయకండి. బ్రాహ్మణ పిల్లలతో వెంటే నడుస్తాను, వెంటే జీవిస్తాను అంటే పాత్ర అభినయిస్తాను మరియు వెంటే చనిపోతాను అని, బాబా యొక్క ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తారు. బ్రహ్మబాబా పిల్లలతో కలిసి విశ్వపరివర్తన యొక్క కాంట్రాక్ట్ ఏదైతే తీసుకున్నారో అది సగంలో వదిలేస్తారా ఏమిటి? స్థాపనా కార్యంలో నిమిత్తంగా అయిన పునాది మధ్యలో తొలగిపోతారా ఏమిటి? ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి అందరు చేస్తారు అనే స్లోగన్ ఏదైతే ఉందో అది కర్మ కోసం నిమిత్తమైన ఆత్మ పూర్తి చేయదా ఏమిటి? ఇప్పుడు సేవ అనే కర్మలో బాబాను చూసి చేస్తున్నారు కదా? కర్మ చేసిన చూపించడానికి నిమిత్తంగా అయిన ఆత్మ అంతిమం వరకు తోడుగా మరియు సహయోగిగా తప్పకుండా అవుతుంది. మంచిది. ఇవి సంకల్పాలకు జవాబు. అమృతవేళ సమాచారం మరలా మరోసారి చెప్తాను. ఎందుకంటే అది విశేషంగా బాబా మరియు పిల్లల యొక్క సమాచారం, దాని విస్తారం చాలా ఉంటుంది. మంచిది.
ఇలా గుహ్యరహస్యాలను అర్ధం చేసుకునే రాజయుక్త, యోగయుక్త, జ్ఞానయుక్త, యుక్తీయుక్త, సర్వ గుణాల యుక్త, ప్రకృతి మరియు వికారాల యొక్క ఆకర్షణకు సదా అతీతంగా ఉండేవారికి, బాబాతో పాటు స్థాపనా కార్యంలో తీవ్రవేగంతో సహయోగి అయ్యేవారికి మరియు సదా స్నేహి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, శుభరాత్రి మరియు నమస్తే.
Comments
Post a Comment