30-04-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఉన్నతోన్నతమైన అధికారం యొక్క స్థితికి ఆధారం - కంబైండ్ రూపం యొక్క స్మృతి.
సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారు, మర్యాదలనే రేఖలో ఉండేవారు, కృత్రిమ బంగారు లేడి వెనుక పడి సత్యమైన సహయోగిని వేరు చేయకుండా, సాథీ నుండి ఒక సెకను కూడా దూరంగా ఉండకుండా ఉండేవారు, సదా స్మృతి యొక్క వ్రేలుతో మరియు సాథీ యొక్క సహయోగి అయ్యి నడిచేవారు, వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క సింహాసనాధికారి ఆత్మలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
మీ కంబైండ్ రూపం యొక్క స్థితిలో సదా స్థితులై ఉంటున్నారా? మొదటిది ఆత్మ మరియు శరీరం యొక్క కంబైండ్ రూపం, అనాది సృష్టిచక్రంలో అనాదిగా పాత్ర అభినయిస్తూ ఉన్నారు. రెండవది ఈ పురుషోత్తమ సంగమయుగంలో బ్రాహ్మణాత్మలు అంటే పిల్లలు మరియు తండ్రి యొక్క సదా వెంట ఉండే కంబైండ్ రూపం. మూడవది చతుర్భుజ రూపాన్ని స్మృతిచిహ్న రూపంలో కూడా చూపించారు. ఇలా సదా కంబైండ్ రూపం యొక్క జ్ఞానాన్ని ధారణ చేస్తూ వెళ్తే సదా స్వయాన్ని ఉన్నతోన్నతమైన అధికారిగా అనుభవం చేసుకుంటారు.
మొదట మీ శరీరం మరియు ఆత్మ యొక్క కంబైండ్ రూపాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. శరీరం రచన, ఆత్మ రచయిత. రచయిత మరియు రచన యొక్క కంబైండ్ రూపం స్మృతి ఉంటే స్వతహాగానే యజమాని స్థితి యొక్క స్మృతిలో ఉంటారు. యజమాని స్మృతి అంటే ఉన్నతోన్నతమైన అధికారంలో ఉంటారు. నడిపించేవారిగా ఉంటారు. కానీ వశం అయ్యి నడిచేవారిగా ఉండరు. ఎలా అయితే నడుస్తూ, నడుస్తూ ప్రజలు ఆత్మ, పరమాత్మను కలిపేసారో అలాగే ఆత్మ మరియు శరీరాన్ని వేరు వేరుగా ఉంచడానికి బదులు కలిపేసి ఒకటిగా చేసేసారు అంటే మీ అధికారం యొక్క స్మృతిని సమాప్తి చేసేసారు. నడుస్తూ, నడుస్తూ దేహాభిమానంలోకి వచ్చేసిన కారణంగా కంబైండ్ రూపానికి బదులు ఒకటిగా చేసేసారు. కనుక స్వయాన్ని మర్చిపోయారు. దాని ఫలితం ఏమౌతుంది? అన్నీ పోగొట్టుకున్నారు కనుక తెలివి తక్కువ స్థితిలో మీవన్నీ దోచేసుకున్నారు.
వర్తమాన సమయంలో బాబా మరియు పిల్లల యొక్క కంబైండ్ రూపాన్ని మర్చిపోతున్నారు? కనుక ఉన్నతోన్నతమైన అధికారానికి బదులు నిర్బలంగా, శక్తిహీనంగా, ఉదాసీనంగా, అలజడి ఆత్మగా లేదా వశీభూత ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారు. కంబైండ్ రూపం యొక్క స్మృతి సమర్థతను తీసుకువస్తుంది. ఏ రకమైన మాయా విఘ్నాలైనా కంబైండ్ రూపం యొక్క స్మృతితో ఎదుర్కునే అధికారం స్వతహాగా అనుభవం చేసుకుంటారు. స్వయం బలహీన ఆత్మ అయినా కానీ బాబా తోడు ఉన్న కారణంగా సర్వశక్తివంతుని సాంగత్యం లేదా స్మృతితో మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకుంటారు. కంబైండ్ రూపంలో స్మృతిలో ఉంటే స్మృతిచిహ్న స్వరూపం కూడా సదా స్మృతిలో ఉంటుంది. అలంకారి స్వరూపం మాయాజీతుకు గుర్తు. అలంకారి సదా స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకుంటారు. మూడు రకాలైన కంబైండ్ రూపాలను స్మృతిలో ఉంచుకోండి.
దంపతుల రూపంలో ఒంటరిగా అవ్వకండి. ఈ రోజుల్లో ప్రపంచంలో అందరు విశేషంగా తోడు మరియు సహయోగం కోరుకుంటున్నారు. దీని వెనుక తమ తనువు, మనస్సు, ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. లౌకికంలో సహయోగులు మోసం కూడా చేస్తారు, దు:ఖం కూడా ఇస్తారు, మూడ్ మార్చుకుంటారు, అప్పుడప్పుడు నవ్వుతారు, అప్పుడప్పుడు ఏడిపిస్తారు. కానీ అలౌకిక సహయోగి సదా హర్షితంగా ఉంటారు, ఎప్పుడు మూడ్ ఆఫ్ చేయరు. మోసం నుండి రక్షిస్తారు, సదా ఒకటికి వేల రెట్లు ఇచ్చేదాత అయినప్పటికీ సహయోగిని గ్రహించని కారణంగా సదా తోడుగా ఉండడానికి బదులు వేరుగా చేసేస్తున్నారు. చాలా తుంటరి పనులు చేస్తున్నారు. అప్పుడప్పుడు మనస్సుని మార్చుకుంటున్నారు, అప్పుడప్పుడు బుద్ధితో అక్కడికి, ఇక్కడికి భ్రమిస్తున్నారు, అప్పుడప్పుడు సంకల్పంలో కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు. ఏదోక వ్యక్తి లేదా వైభవానికి వశీభూతం అవ్వటం అంటే ప్రభావితం అవ్వటం అంటే అంత సమయం మీ సహయోగికి సంకల్పంతో విడాకులు ఇచ్చినట్లు అవుతుంది. వేరు చేయటం అంటే విడాకులు ఇవ్వటం. హృదయ సింహాసనంలో సత్యమైన సహయోగికి బదులు అల్పకాలిక తోడుని ఇచ్చే, హద్దు ప్రాప్తి యొక్క లోభంతో మోసం చేసే అంటే కృత్రిమమైన బంగారు లేడి తన వైపు ఆకర్షితం చేస్తుంది. సింహసనాధికారి, సత్యమైన సహయోగి అవ్వటానికి బదులు మోసం చేసే సహయోగిగా అయిపోతున్నారు. సంకల్పంలో ఆకర్షితం అవ్వటం అంటే విడాకులు ఇవ్వటం. వాస్తవానికి మాటి మాటికి విడాకులు ఇవ్వటం సదాకాలికంగా రాజ్యభాగ్యానికి విడాకులు ఇవ్వటం.
కొంతమంది చాలా అలుగుతున్నారు కూడా! అలగటం ఒక మనోరంజనంగా భావిస్తున్నారు. మాటి మాటికి సహయోగితో మేము ఇలానే నడుస్తాము అని అహంకారం కూడా చూపిస్తున్నారు. మేము ఇదే చేస్తాము, మీరు కూడా చేయాలి, మీరు ప్రతిజ్ఞ చేసారు కనుక మమ్మల్ని తీసుకునే వెళ్ళాలి, సర్వశక్తివంతుడవు కనుక శక్తి ఇవ్వండి, సహాయం చేయటం మీ పని అని చెప్తారు. కానీ సహాయం తీసుకోవటం నా పని అనేది స్మృతి ఉంచుకోవటం లేదు. ఒక అడుగు నేను వేస్తే వేల అడుగులు సహయోగి వేయిస్తారు అనేది మర్చిపోతున్నారు. సహయోగి ఏ విషయాలు చెప్పారో అవే విషయాలు మరలా సహయోగికి స్మృతి ఇప్పిస్తున్నారు. ఇది అహంకారమే కదా? వ్రేలు మాటి మాటికి స్వయం వదిలేస్తున్నారు. మరలా బాబాని నా వ్రేలు ఎందుకు పట్టుకోవటం లేదు అని అంటున్నారు. ఇలా తుంటరితనం చాలా చేస్తున్నారు. కానీ నయనాలలో కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళే సహయోగి మీకు ఎప్పుడైనా లభిస్తారా? ఇది స్మృతి ఉంచుకోండి. కనుక సహయోగి యొక్క తోడుని నిలుపుకోండి అంటే కంబైండ్ రూపంలో ఉండండి.
వెనువెంట బ్రాహ్మణాత్మల సాంగత్యం అన్నింటికంటే శ్రేష్ఠ సాంగత్యం. డ్రామా భాగ్యానుసారం మీ కొద్ది మంది ఆత్మలకే లభించింది. సాంగత్యం చేసేటప్పుడు కూడా ఈ సాంగత్యం లాభాన్ని ఇస్తుందా లేదా ప్రాప్తిని ఇస్తుందా అని చూస్తారు. బ్రాహ్మణుల సాంగత్యం సర్వ ప్రాప్తులను ఇచ్చేది. బ్రాహ్మణులలో కూడా పూర్తి కులం బ్రాహ్మణులు మరియు సగం కులం బ్రాహ్మణులు ఇద్దరు ఉన్నారు. సగం కులం వారు అంటే క్షత్రియులు. కనుక సత్యమైన బ్రాహ్మణుల సాంగత్యమే ఉండాలి. సగం కులం బ్రాహ్మణులతో సాంగత్యం చేస్తే సత్యమైన సహయోగికి సమీపంగా ఉండడానికి బదులు స్వతహాగానే దూరం అయిపోతారు. బ్రాహ్మణుల సాంగత్యం ఎగిరేకళలోకి తీసుకువెళ్తుంది. ఎవరు ఎంత శ్రేష్ఠముగా ఉంటారో అంత సాంగత్యం కూడా శ్రేష్ఠముగా ఉంటుంది. బ్రాహ్మణులు అంటే శ్రేష్ఠమైనవారు. కనుక క్షత్రియుల సాంగత్యం బాబా మంజూరు చేయరు. నమ్మకమైన సహయోగులు ఈ విధమైన సాంగత్యం చేయరు. ఏం చేయము? సాంగత్యమైతే కావాలి కదా అని అనకండి, ఏ సాంగత్యం కావాలి అనేది కూడా ఆలోచించాలి. సదా సహయోగిని మరియు సాంగత్యాన్ని అర్థం చేసుకుని తోడుని నిలుపుకోండి. సహయోగి యొక్క ప్రీతి యొక్క రీతిని నిలుపుకోండి మరియు సాంగత్యంలో మర్యాదలను నిలుపుకోండి. అర్ధమైందా! దీనినే కంబైండ్ రూపం యొక్క స్మృతితో ఉన్నతోన్నతమైన అధికారి స్థితిలో ఉండటం అంటారు. మంచిది.
సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారికి, కృత్రిమమైన బంగారు లేడి వెనుక పడి సత్యమైన సహయోగిని వేరు చేయకుండా ఒక సెకను కూడా సహయోగి నుండి దూరంగా ఉండకుండా ఉండేవారికి, సదా స్మృతి అనే వ్రేలుని సహయోగికి ఇచ్చి నడిచేవారికి, వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క సింహాసనాధికారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Om Shanti good afternoon bap dad's 🌹🌹🌹🌹🌹❤️🙏 go soon come 🔜🙏
ReplyDelete