29-06-1971 అవ్యక్త మురళి

* 29-06-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"జ్ఞానమనే లైట్ ద్వారా పురుషార్థపు మార్గము స్పష్టము."

           అందరూ ఏ పురుషార్థమునైతే చేస్తున్నారో ఆ పురుషార్థము ద్వారా వర్తమాన సమయపు ప్రాప్తి యొక్క లక్ష్యము ఏమిటి? దేవ పదవి ప్రాప్తి అయితే భవిష్యత్తుకు చెందినది, కానీ వర్తమాన సమయములో పురుషార్థపు ప్రాప్తి యొక్క లక్ష్యము ఏమిటి? (ఫరిస్తాగా అవ్వటము) ఫరిస్తాల ముఖ్య క్వాలిఫికేషన్(అర్హత)ఏమిటి? ఫరిస్తాగా అవ్వటానికి కావలసిన రెండు క్వాలిఫికేషన్స్ ఏమిటి? ఒకటి లైట్ కావాలి, రెండు మైట్ కావాలి. రెండూ తప్పనిసరి. లైట్ మరియు మైట్ (ప్రకాశము, శక్తి) రెండూ ఫరిస్తాతనపు జీవితములో స్పష్టముగా కనిపిస్తాయి. లైట్‌ను ప్రాప్తింపచేసుకొనేందుకు విశేషంగా ఏ శక్తి కావాలి? శక్తులైతే చాలామంది ఉన్నారు కదా! మైట్ రూపము మరియు లైట్ రూపముగా తయారయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో గుణాన్ని చెప్పండి. ఒకటి మనన శక్తి, రెండవది సహన శక్తి. ఎంత సహన శక్తి ఉంటుందో అంతగా సర్వశక్తివంతుని సర్వశక్తులు స్వతహాగనే ప్రాప్తిస్తాయి. జ్ఞానాన్ని కూడా లైట్ అని అంటారు కదా! మరి పురుషార్థపు మార్గమును సహజముగా మరియు స్పష్టముగా చేసేందుకు కూడా జ్ఞానపు లైట్ అవసరము. ఈ లైట్ కొరకు మళ్ళీ మనన శక్తి అవసరము. కావున ఒకటి మనన శక్తి, రెండవది సహన శక్తి అవసరము. ఒకవేళ ఈ రెండు శక్తులూ ఉన్నట్లయితే నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తా స్వరూపము ఎవ్వరికైనా సాక్షాత్కారము అవ్వగలదు. సహన శక్తి ద్వారా సర్వగుణాల ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే సహనశక్తి కలిగినవారుగా ఉంటారో వారిలో నిర్ణయ శక్తి, పరిశీలించే శక్తి, గంభీరతా శక్తి వాటికవే ఒకదానితో ఒకటి అనేకము వచ్చేస్తాయి. సహన శక్తి కూడా అవసరము మరియు మనన శక్తి కూడా అవసరము మనసు కొరకు మనన శక్తి, అలాగే వాచ మరియు కర్మణల కొరకు సహన శక్తి. సహన శక్తి ఉన్నట్లయితే ఏ మాటలు మాట్లాడినాగానీ అవి సాధారణంగా ఉండవు, మరొకటి ఏ కర్మలనైతే చేస్తారో వాటిని కూడా దాని అనుసారంగానే చేస్తారు. కావున రెండు శక్తుల అవసరమూ ఉంది. సహన శక్తి కలిగినవారు కార్యములో కూడా సఫలురౌతారు. సహన శక్తి తక్కువగా ఉన్న కారణంగా కార్యము యొక్క సఫలతలో కూడా లోటు వచ్చేస్తుంది. సహన శక్తి కలిగినవారికే అవ్యక్త స్థితి మరియు శుద్ధ సంకల్పాల స్వరూపపు స్థితి ఉంటాయి. సహన శక్తి కలిగినవారి ముఖములో ప్రకాశము ఉంటుంది. ఎటువంటి సంస్కారము కలిగినవారు అయినా కూడా, వారిని తమ సహన శక్తి ద్వారా తాత్కాలికముగా అయినా ఆ సంస్కారమును అంతం చేస్తారు. కావున రెండు శక్తులు అవసరము. తమ పురుషార్థములో మనసు యొక్క సంకల్పాలను నడపటంలో కూడా సహన శక్తి అవసరము, దీనినే కంట్రోలింగ్ పవర్ అని కూడా అంటారు. సహన శక్తి ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలను కూడా కంట్రోల్ చెయ్యగలరు. కావున ఈ రెండు శక్తుల కొరకు అటెన్షన్ ను  ఉంచాలి.

           నంబర్ వన్ బిజినెస్ మాన్(వ్యాపారవేత్త)గా అయ్యేందుకు సహజమైన పద్ధతి ఏది? స్వయమును బిజీగా పెట్టుకోవటం ద్వారానే నంబర్ వన్ బిజినెస్ మాన్ గా అయిపోతారు. ఎవరికైతే స్వయమును బిజీగా పెట్టుకోవటం రాదో వారు బిజినెస్ మాన్ గా అయ్యేందుకు అర్హులు కాదు అని అనబడుతుంది. ఇక్కడ బిజినెస్ మాన్ గా అవ్వటము అనగా స్వ సంపాదన మరియు ఇతరుల సంపాదన కూడా. ఇందుకొరకు మిమ్మల్ని మీరు క్షణకాలము కూడా ఫ్రీగా ఉంచకూడదు.

           మీరు ఏ నంబర్ బిజినెస్ మాన్ లు? ఎంతగా ఇక్కడ గ్యాలప్(వేగంగా పరుగెత్తుట)చేస్తారో అంతగా మీ భవిష్య సింహాసనమును కూడా గ్యాలప్ చేస్తారు. అవకాశం బాగుంది. ఏది చెయ్యాలనుకుంటారో అది చెయ్యగలరు. అందరికీ ఫ్రీడమ్ (స్వేచ్ఛ) ఉంది. ఎవరు ఎంతగా అవకాశం తీసుకుంటారో వారు అంతగా తమ సింహాసనపు గుర్తును దృఢం చేసుకుంటారు. బిజినెస్ మాన్ కు అర్థమే ఒక్క సంకల్పము కూడా వ్యర్థముగా పోకుండా ఉండటము. ప్రతి సంకల్పములో సంపాదన ఉండాలి. ఏవిధంగా ఆ బిజినెస్ మాన్ ఒక్కొక్క పైసాను కూడబెట్టి ఎంతగా సంపాదిస్తారు! ఇక్కడ కూడా ఎవరైతే ఒక్కొక్క క్షణము మరియు సంకల్పములో సంపాదించి చూపిస్తారో వారినే నంబర్ వన్ బిజినెస్ మాన్ అని అంటారు. బుద్ధికి వేరే పని మాత్రం ఏముంటుంది! బుద్ధి ఇందులోనే బిజీగా ఉండాలి. మిగిలిన అన్నివైపులైతే సమాప్తమైపోయాయి కదా లేక బుద్ధి వెళ్ళగలిగేందుకు కాస్త ఏవైనా మిగిలి ఉన్నాయా? అన్ని దిక్కులైతే మూసుకుపోయాయి కదా! మీ పాత సంస్కారాలనే దారి కూడా మూసుకుపోయింది కదా! బుద్ధి వేళ్ళే వైపు లేక దారి, ఆశ్రయము అదే. బుద్ధి పాత సంస్కారాలవైపన్నా వెళుతుంది లేకపోతే తన శరీర లెక్కాచారము వైపు కన్నా వెళుతుంది లేదా మనసును వ్యర్థ సంకల్పాల వైపుకు లాగుతుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు సమాప్తమైపోయాయు కదా! శరీరమునకు రోగముంటే ఇది ఫలానా నెప్పి, దీనికి నివారణ ఇది అని దానికి సంబంధించిన జ్ఞానము ఉంటుంది ఎందుకంటే ఎంతగా శరీరమును మంచిగా ఉంచుకుంటే అంతగా సేవ చేస్తాము అన్న లక్ష్యము ఉంది. అంతేగానీ తనది అన్న ఏ స్వార్థమూ లేదు. సేవ నిమిత్తంగా చేస్తారు, ఇది సాక్షితనము కదా. ఇప్పుడు కేవలము ఒక్కటే మార్గము ఉండిపోయింది. ఇంతకుముందు అనేక మార్గాలు ఉన్న కారణంగా బుద్ధి భ్రమిస్తూ ఉండేది, ఆ మార్గాలన్నీ ఇప్పుడు మూసుకుపోయాయి కదా! శక్తివంతమైన ప్రభుత్వపు సీల్ పడిపోయింది కదా! ఎప్పటివరకైతే పూర్తి కాదో అప్పటివరకు సీల్ ఉంటుంది, ఎప్పుడూ తెరుచుకోదు. కావున మీ పరిశీలనను అలా చేసుకోవాలి. ఎవరి భాగ్యములోనైనా ఉన్నట్లయితే పరిస్థితులు కూడా అలా తయారవుతాయి, అవి లిఫ్టు రూపంగా తయారవుతాయి. ఇక్కడ కూడా ఎవరికైతే కల్ప పూర్వపు భాగ్యము డ్రామాలో రచింపబడి ఉంటుందో, వారి పురుషార్థము కూడా ఉంటుంది, కానీ తోడుతోడుగా ఈ లిఫ్టు కూడా దైవీ పరివారము ద్వారా లభిస్తుంది మరియు బాప్ దాదా ద్వారా కూడా గిఫ్టు(కానుక) లభిస్తుంది. కావున ఇప్పుడు బాప్ దాదా ద్వారా మరియు దైవీ పరివారము ద్వారా ఏయే గిఫ్టులు ప్రాప్తించాయి అన్నదానిని కూడా పరిశీలించుకోవాలి. పెద్దపెద్ద వారికి గిఫ్టులు లభించినప్పుడు షోకేస్ లో వాటిని భద్రపరుస్తుంటారు. దాని ద్వారా వారి దేశము పేరును ప్రసిద్ధము చేస్తారు. ఇక్కడ సమయ ప్రతిసమయము ఏ గిఫ్టు అయితే ప్రాప్తించిందో దాని ద్వారా బాప్ దాదా మరియు కులపు పేరు ప్రసిద్ధి చెయ్యాలి. అచ్ఛా!

           మీరు మొదట్లో సేవకు వెళ్ళిన సమయంలో జ్ఞాన శక్తి అయితే తక్కువగా ఉండేది, కానీ సఫలత ఏ శక్తి ఆధారంతో లభించింది? త్యాగము మరియు స్నేహము. బుద్ధి లగనము పగలు రాత్రి బాబా మరియు యజ్ఞము వైపు ఉండేది. బాబా మరియు యజ్ఞము అన్న మాటలు చాలా ప్రేమగా వెలువడేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగములోకి తీసుకువచ్చింది. ఈ స్నేహ శక్తి ద్వారానే కేంద్రములు తయారయ్యాయి కావున ఆది స్థాపనలో ఏ శక్తి అయితే సహయోగమును ఇచ్చిందో, అంతిమంలో కూడా అదే జరుగుతుంది. మొదట సాకార స్నేహము ద్వారానే మన్మనాభవగా అయ్యారు. సాకార స్నేహమే సహయోగులుగా చేసింది, మరియు త్యాగము చేయించింది. సంగఠన మరియు స్నేహపు శక్తి ద్వారా చుట్టుముట్టాలి. బయట విదేశాలలో కూడా సేవా సఫలతకు మూలకారణము స్నేహము, సహయోగములే. ఈ స్నేహము మరియు సంగఠన శక్తియే జ్ఞానమునకు ప్రాక్టికల్ ప్రమాణములు. సేవా సఫలతకు మూల ఆధారము ఇవే. ఏవిధంగా ప్లాన్ చేస్తే అందరికీ సందేశమును ఇచ్చే కార్యము త్వరగా పూర్తవుతుంది! అని ఎక్కడ ఉన్నాగానీ, ఇదే ఆలోచించాలి. ఇప్పుడైతే చాలా మిగిలి ఉంది. స్నేహము ద్వారా త్యాగము చేసేందుకు ముందుకు రావాలనే ఉల్లాసము కలుగుతుంది. మీరందరూ త్యాగమును ఎలా చేసారు? నరనరములో స్నేహమును నింపుకున్నారు కనుకనే జంప్ చెయ్యగలిగారు.

           ఇప్పుడు ఈశ్వరీయ నషా మరియు సంతోషములో ఉంటూ ఎలా అయితే ముందుకు వెళ్తున్నారో అలాగే సదా నషా మరియు సంతోషములో ఉంటూ సేవలో సఫలురౌతూ ఉంటారు అని విదేశీయులకు కూడా వ్రాసి పంపాలి, విజయ తిలకమైతే దిద్దబడి ఉంది. మీ విజయ తిలకాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి. ఇకపోతే ఇప్పటివరకు ఏదైతే చేసారో వాటిని చూసి బాప్ దాదా కూడా హర్షితులౌతున్నారు, కానీ ముందుకు వెళ్ళాల్సిందే. ఎవరినైనా వారసులుగా తయారుచేసినప్పుడే శభాష్ అని అంటారు. ఇప్పటివరకు ఏదైతే చేసారో అందులో హర్షితులవ్వాలి. ఓహో! ఓహో! అని అనిపించే కార్యమును ఇప్పుడు చెయ్యాలి. నషా మరియు సంతోషము బాగా దృఢంగా ఉన్నాయి కాబట్టే హర్షితముగా ఉంటారు. ఇప్పటివరకు రిజల్టు చాలా మంచిగా ఉంది, వీరి కమాండర్ చాలా ధైర్యము కలిగినవారు. ఏ కార్యములోనైనా ఎవరైనా ఒక్కరైనా తమ ధైర్యముతో బాధ్యతను చేపట్టినట్లయితే ఇతరులు కూడా సహచరులుగా తయారవుతారు. వెరైటీ గ్రూపుగా ఉన్నాగానీ పుష్పగుచ్ఛము చాలా మంచిగా ఉంది, అందుకని అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా!

Comments