29-06-1970 అవ్యక్త మురళి

* 29-06-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

         “సమర్పణ విశాలరూపము.”

              మీరందరికీ మీ నాలుగు మూర్తుల గురించి తెలుసా? ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ఇప్పటి (భవిష్యత్తువి కావు) సంగమయుగపు నాలుగు మూర్తులను ఒక్కొక్కరిలో చూస్తున్నారు. ఆ నాలుగు మూర్తులు ఏవి? మీ మూర్తిని గురించి తెలుసా? (కొందరు కొందరు చెప్పారు) ఇప్పుడు వర్ణన చేసినవన్నీ అటువంటి మూర్తిగా ఇప్పుడు తయారువుతున్నారా లేక తయారైపోయారా? ఎప్పుడు తయారవుతారు? లాస్ట్ లో ఫాస్ట్ గా వెళ్తాము, అని ఆలోచిస్తున్నారా? కానీ లాస్ట్ సమయంలో ఫాస్ట్ గా వెళ్ళగలరా? ఎంతగా చాలా కాలము నుండి స్వయమును సఫలతా మూర్తిగా తయారుచేసుకుంటారో అంతగానే చాలా సమయము అక్కడ సంపూర్ణ రాజ్య అధికారులుగా అవుతారు. ఒకవేళ ఎవరైనా చాలా కాలము నుండి సఫలతాముర్తిగా అవ్వలేదనుకోండి, అప్పుడు దాని అనుసారంగా రాజ్య అధికారము కూడా కొద్ది సమయమే లభిస్తుంది, సంపూర్ణ సమయము లభించదు. ఎవరైతే చాలా సమయము నుండి సంపూర్ణంగా అయ్యే పురుషార్థములో మగ్నమై ఉంటారో వారే సంపూర్ణ సమయము రాజ్య అధికారిగా అవుతారు. ఏ నాలుగు మూర్తులను చూస్తున్నారు? ఇది కూడా సంపూర్ణంగా అయ్యేందుకు లక్ష్యము. 1. జ్ఞాన మూర్తులు, 2. గుణ మూర్తులు, 3. దాన మూర్తులు మరియు 4. సంపూర్ణ సఫలతా మూర్తులు. వీటిని చూస్తున్నారు. సేవ చెయ్యటము అనగా మహాదానిగా అవ్వటము అని వినిపించాము కదా! కావున ప్రతి ఒక్కరి ఈ నాలుగు మూర్తులను చూస్తున్నారు. నాలుగు ముఖాల గాయనము కూడా ఉంది కదా. ఒక్క మూర్తిలో నాలుగు మూర్తుల సాక్షాత్కారమును అందరికీ చేయించాలి. ఒకవేళ ఒక్క మూర్తి అయినా తక్కువగా ఉన్నట్లయితే అక్కడ కూడా అంతగా తక్కువ అవుతుంది. ఏవిధముగా ఇక్కడ తమ తేడుగా తీసుకువెళ్ళే సామానును బుక్ చేసుకుంటే అక్కడ లభిస్తుందో అలాగే ఇది కూడా బుకింగ్ ఆఫీసు. ఎంతగా ఇక్కడ బుక్ చేసుకుంటారో అంతగా అక్కడ ప్రాప్తి ఉంటుంది. నాలుగు మూర్తులూ తయారయ్యాయా అన్నదానినే ఆలోచించండి. చతుర్ముఖులుగా అయ్యామా? ఎంతగా ఇక్కడ తమ మూర్తిలో సర్వ విషయాలను ధారణ చేస్తారో అంతగానే భవిష్య రాజ్యమైతే లభిస్తుంది, కానీ ద్వాపరములో  మీ జడమూర్తులనేవైతే తయారు చేస్తారో వాటిని కూడా ఈ సంగమయుగపు మూర్తి ప్రమాణంగానే తయారవుతాయి. అర్థమైందా! ఇప్పుడు సంపూర్ణ మూర్తిగా అయ్యేందుకు ఏ లక్ష్యమును మీ ముందు ఉంచుతారు? భక్తులకు చిత్రాలను చూపించి, వారు ఏ పురుషార్థముతో ఇలా తయారయ్యారు అన్నదానిని ఆలోచించండి అని వారికి అర్థం చేయిస్తారు కదా? మరి మీరు సంపూర్ణ మూర్తిగా అయ్యేందుకు ఏ లక్ష్యమును ఎదురుగా ఉంచుకుంటారు? వారు ఏ లక్ష్యమును ఉంచారు? సాకారములో సంపూర్ణ లక్ష్యమైతే ఒక్కటే కదా! వారు కర్మాతీతముగా అయ్యేందుకు ఏ లక్ష్యమును ఉంచారు? ఏ విషయాలలో సంపూర్ణులుగా అయ్యారు? సంపూర్ణత అన్న పదమును ఎంత విశాలతతో ధారణ చేసారో తెలుసా? సంపూర్ణము అన్నదైతే ఒక్కటే పదము. కానీ ఎంత విశాల రూపములో ధారణ చేసి అలా తయారయ్యారు! సర్వ సమర్పణ లక్ష్యముతోనే సంపూర్ణులుగా అయ్యారు. ఎంతగా  సమర్పణమో అంత సంపూర్ణత. కానీ సమర్పణకు కూడా విశాల రూపము ఏది? ఎంత విశాల రూపముతో దీనిని ధారణ చేస్తారో అంతగానే విశాలబుద్ధి కూడా తయారవుతుంది  మరియు విశ్వ అధికారిగా కూడా అవుతారు. ఆ విశాలత ఏమిటి? ఇందులో కూడా నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటేమో తమ ప్రతి సంకల్పము సమర్పణము, రెండవది ప్రతి క్షణము సమర్పణ అనగా సమయము సమర్పణ, మూడవది కర్మ కూడా సమర్పణ మరియు నాలుగవది సంబంధము, సంపత్తి ఏవైతే ఉన్నాయో అవికూడా సమర్పణ. సర్వ సంబంధాల సమర్పణ కూడా అవసరము. ఆ సంబంధములో లౌకిక సంబంధము అయితే రానే వస్తుంది. కానీ ఈ ఆత్మ మరియు శరీర సంబంధమేదైతే ఉందో దానిని కూడా సమర్పణ చేయాలి. ఇంతగా సంబంధమును సమర్పణ చేసారా? వినాశీ సంపద అయితే పెద్ద విషయమేమీ కాదు. కానీ అవినాశీ సంపద అయిన సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ ఆనందముల ప్రాప్తి ఏదైతే ఉందో జన్మసిద్ధ అధికారపు సంబంధము ఏదైతే ఉందో,దానిని కూడా ఇతర ఆత్మల సేవలో సమర్పణ చేసేసారు. పిల్లల శాంతియే స్వయం శాంతిగా భావించారు. కావున ఆత్మలకు శాంతిని ఇవ్వటమే తమ శాంతిగా భావించారు. ఇదే లౌకిక సంపద మరియు దీనికి తోడుగా ఈశ్వరీయ సంపదను కూడా సమర్పణ చేసి తమ సాక్షి  స్థితిలో ఉండాలి. కావున సమర్పణ పదానికి ఇంత పెద్ద విశాల రహస్యము ఉంది. అర్థమైందా! అటువంటి విశాల రూపముతో ధారణ చేసేవారే సంపూర్ణ మూర్తిగా మరియు సఫలతా మూర్తిగా అవుతారు. కావున సమర్పణ అన్న పదాన్ని ఏదో సాధారణ అర్థముగా భావించకండి. లౌకికమును సమర్పణ చెయ్యటము సహజమే కానీ ఈశ్వరీయ ప్రాప్తి ఏదైతే ఉందో దానిని కూడా సమర్పణ చెయ్యటము అనగా మహాదానిగా అవ్వటము మరియు ఇతరుల శుభ చింతకులుగా అవ్వటము, ఇది నెంబర్ వారీగా, యథా యోగ్యము, యథాశక్తిగా ఉంటుంది. ఇంతగా సమర్పణ అయ్యేవారినే సంపూర్ణ సమర్పణులు అని అంటారు. అటువంటి సంపూర్ణమూర్తులుగా, సమర్పణ మూర్తులుగా అయ్యారా? నాది అన్నది పూర్తిగా ఇమిడిపోవాలి. ఏదైనా వస్తువు ఎందులోనైనా కలసిపోతే సమానమైపోతుంది ఇమిడిపోవటము అనగా సమానమవ్వటము. కావున నాది అన్నది ఎంతగా ఇమిడిపోతుందో అంతగానే సమానతా మూర్తిగా అవుతారు. మీరు ఇతర ఆత్మల సేవ చేసేటప్పుడు ఏ  లక్ష్యమును ఉంచి చేస్తారు? (తమ సమానంగా చేసే) మీ సమానంగా కూడా కాదు, తండ్రి సమానంగా తయారుచెయ్యాలి. మీ సమానంగా చేసినట్లయితే మీలో ఏ లోపాలు అయితే ఉన్నాయో అవి వారిలోకి కూడా వచ్చేస్తాయి. కావున ఒకవేళ సంపూర్ణంగా అవ్వాలంటే మీ సమానంగా కూడా కాకుండా తండ్రి సమానంగా తయారుచెయ్యాలి. తండ్రి ఏవిధంగా తమకన్నా ఉన్నతమైన వారిగా చేసారో అలా మీకంటే కూడా ఉన్నతంగా తండ్రి సమానంగా తయారుచేసినట్లయితే ఫాలో ఫాదర్ గా అయిపోతారు. కావున ఇప్పుడు మీ సమానంగా కాకుండా తండ్రి సమానంగా తయారుచెయ్యాలి. ఒకవేళ మీరు మీ సమానంగా తయారుచేసే లక్ష్యమునే ఉంచినట్లయితే వారిలో చాలా లోపాలు ఉండిపోతాయి. ఎందుకంటే మీరు లక్ష్యమునే అటువంటిది ఉంచారు. కావున లక్ష్యమును ఎల్లప్పుడూ సంపూర్ణతదే ఉంచాలి. ఎవరైతే సంపూర్ణ మూర్తులుగా ప్రత్యక్షముగా ప్రఖ్యాతమైపొయ్యారో వారి లక్ష్యమును | ఉంచవద్దు. ఎవరైతే ఇప్పుడు గుప్తంగా ఉన్నారో, ప్రత్యక్షతలోకి రాలేదో వారి లక్ష్యమును కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఎటువంటి లక్ష్యము ఉంటుందో అటువంటి ప్రాప్తి ఉంటుంది. కావున ఒకవేళ లక్ష్యమును శ్రేష్టంగా ఉంచినట్లయితే ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఇప్పుడు మూడ నేత్రము ఎల్లప్పుడూ పైన ఉన్న లక్ష్యము వైపు స్థిరముగా ఉండాలి. ఏవిధంగా ఎవరైనా మగ్న అవస్థలో ఉన్నట్లయితే వారి నయనాలు ఒక్కచోటే స్థిరమైపోతాయి కదా, అలాగే ఈ మూడవ నేత్రము, దివ్యబుద్ధితో కూడిన ఈ నేత్రము కూడా ఎల్లప్పుడూ ఒకటే చోట, ఏక రసముగా ఉండిపోవాలి. స్థిరముగా అనగా ఒక్కరిలోనే నిమగ్నమైన మగ్నరూపము కనిపించాలి. మూడవ నేత్రపు సాక్షాత్కారము ఎలా జరగుతుంది? మస్తకము ద్వారా! మస్తకములో ప్రకాశము, నయనాలలో నషా కనిపించాలి. వీరి మూడవ నేత్రము మగ్నమై ఉందా లేక యుద్ధ స్థలములో ఉందా అన్నది దీని ద్వారా తెలిసిపోతుంది. కండ్లు కొంచెము బాగా లేనప్పుడు కనురెప్పలు మాటిమాటికీ కిందకు పైకీ అవుతూ ఉంటాయి. ఈ మూడవ నేత్రము కూడా ఒకవేళ యధార్థ రీతిలో సరిగ్గా ఉన్నట్లయితే దివ్య బుద్ధి యధార్థ రీతిలో స్వచ్ఛమైనట్లయితే ఒక్క చోటనే దృష్టి ఉంటుంది. కంట్లో ఏదైనా చెత్త పడినట్లయితే ఏమవుతుంది? కనురెప్పలు అల్లల్లాడుతాయి. చెత్తకు గుర్తు కదలటము. యధార్ధమైన ఆరోగ్యమునకు గుర్తు - స్థిరముగా అవ్వటము. అలాగే ఈ మూడవ నేత్రము ఎల్లప్పుడూ స్థిరమై ఉండాలి. ఈ సాక్షాత్కారము మీ మస్తకము ద్వారా జరుగుతుంది, మీ నయనాల ద్వారా జరుగుతుంది కావున మా మూడవ నేత్రము త్వరత్వరగా మూసుకుంటూ-తెరుచుకుంటూ ఉందా లేక ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటుందా అన్నదానిని పరిశీలించుకోండి. దేని జ్ఞాపకంలో అయినా మునిగిపోయి ఉన్నప్పుడు కూడా కండ్లు స్థిరమైపోతాయి. కావున ఇక్కడ కూడా ఎవరైతే ఒక్కరి స్మృతిలోనే మగ్నమై ఉంటారో వారే సంపూర్ణ స్థితిలో స్థిరమైపోతారు. లేదంటే నయనాలలాగా మూస్తూ, తెరుస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా చెత్త ఉన్నట్లయితే దానిని త్వరగా తొలగించుకోండి. లేదంటే... నవ్వు వచ్చే విషయము వినిపించామంటారా? ఎవరైనా మీ సాక్షాత్కారము చేసుకుంటున్నారనుకోండి, ఆ సమయములో మీ మూర్తి కిందకు,  పైకి అవుతూ ఉన్నట్లయితే ఏం సాక్షాత్కారము చేసుకుంటారు? ఫోటో తీసే సమయములో కూడా కదలటాన్ని ఆపుతారు కదా. ఒకవేళ కదిలారంటే ఫోటో పాడైపోతుంది. అలాగే మీ స్థితి కదులుతూ ఉన్నట్లయితే ఏం సాక్షాత్కారమౌతుంది? ఏవిధంగా ఫోటో తీసే సమయములో మిమ్మల్ని ఎంత స్థిరంగా ఉంచుకుంటారో అలాగే మా భక్తులు ప్రతి సమయము మా సాక్షాత్కారమును చేస్తున్నారు అని ఎల్లప్పుడూ భావించండి. కావున సాక్షాత్కారమూర్తులుగా అనగా స్థిరమూర్తులుగా అవుతారు. లేకపోతే భక్తులకు స్పష్టమైన సాక్షాత్కారమవ్వదు. స్పష్టమైన సాక్షాత్కారము చేయించేందుకు స్థిర బుద్ధి, స్థిరమైన స్థితి అవసరము. అర్థమైందా?

ఇప్పటినుండే భక్తులు ఒక్కొక్కరిని సాక్షాత్కారము చేసుకుంటారు. ఆ బీజము అనగా సంస్కారము ఆ భక్తుల ఆత్మలలో నిండుతుంది, ఆ సంస్కారముతో మర్జ్ అవుతారు. మళ్ళీ ద్వాపరములో అదే సంస్కారము ఇమర్జ్ అవుతుంది. ధర్మ స్థాపకులు ఇక్కడినుండే సందేశమును తీసుకొని, సంస్కారమును నింపుకొని వెళ్తారు, అవే మళ్ళీ ఇమర్జ్ అవుతాయి  అని మీరు అర్థం చేయిస్తారు కదా! అలాగే మీ అందరి భక్తులు మరియు ప్రజలు  సంస్కారమును తీసుకొని వెళ్తారు, మళ్ళీ దాని అనుసారముగానే ఇమర్ట్ అవుతుంది.  ఒకవేళ భక్తుల ముందర స్పష్టమైన మూర్తి కనిపించనప్పుడు వారిలో ఆ సంస్కారము ఎలా  నిండుతుంది? ఈ కర్తవ్యమును కూడా చెయ్యాలి. కేవలము ప్రజలను తయారు చెయ్యటము కాదు, తోడుతోడుగా భక్తులలో కూడా ఆ సంస్కారమును నింపాలి. ఎంతమంది ప్రజలు తయారయ్యారు, ఎంతమంది భక్తులు తయారయ్యారన్నది కూడా తెలిసిపోతుంది. భక్తుల  మాల మరియు ప్రజల మాల రెండూ ప్రత్యక్షమౌతాయి. ప్రతి ఒక్కరికీ తమ రెండు మాలల  సాక్షాత్కారము జరుగుతుంది. నేను మాలలో త్రిప్పబడ్డానా అని తమ విషయము కూడా సాక్షాత్కారమౌతుంది. కొందరికి భక్తులు ఎక్కువగా ఉంటే, కొందరికి ప్రజలు ఎక్కువగా తయారవుతారు, ఇది కూడా ఒక గుప్త రహస్యము. ఏవిధంగా కొందరి రాజధాని పెద్దదిగా ఉన్నాకూడా సంపత్తి తక్కువగా ఉంటుంది, కొందరి రాజధాని తక్కువగా ఉన్నాగానీ  సంపత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుప్త రహస్యము, దీనిని ఎప్పుడో ఒకసారి తెరవడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజలను తయారుచేసుకొనే లక్ష్యమును ఉంచండి. భక్తులైతే చివర్లో క్షణాలలో తయారైపోతారు. ఇక్కడ కూడా భక్తులు వందనము చేస్తారు. పూజ చెయ్యరు, గాయనము చేస్తారు, మళ్ళీ పూజను అక్కడ చేస్తారు. ఇవన్నీ తరువాత  తెలుస్తాయి. అచ్ఛా!

Comments