* 29-05-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సమీపరత్నాల యొక్క గుర్తులు.
సమీపరత్నాల యొక్క గుర్తులు.
సమయము ఎంత సమీపానికి చేరుకుందో కనిపిస్తోందా, లెక్క చూడగలరా? భవిష్య లక్షణములతో పాటు సంపూర్ణ స్వరూపపు లక్ష్యము కూడా ఎదురుగా ఉందా? సమీపపు లక్షణము ఏమిటి? శరీరాన్ని వదిలేటప్పుడు చాలామందికి ముందే తెలిసిపోతుంది. అలాగే మీరు కూడా ఈ శరీరము వేరు, దీనిని మేము ధరించి నడిపిస్తున్నాము అన్న అనుభవము చేసుకుంటారు. సమీపంగా వచ్చే సమీప రత్నాల లక్షణము ఇదే ఉంటుంది. ఎల్లప్పుడూ తమ ఆకారీ రూపము మరియు భవిష్య రూపమును ఎదురుగా చూస్తూ ఉంటారు. ప్రాక్టికల్ లో అనుభవమవుతుంది. ఇలా తయారవ్వాలి అని లైటు యొక్క ఫరిస్తా స్వరూపము ఎదురుగా కనిపిస్తుంది మరియు భవిష్యరూపము కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని వదులుతాము దానిని తీసుకుంటాము.... ఎప్పుడైతే ఇటువంటి అనుభవము ఉంటుందో అప్పుడు సంపూర్ణతకు సమీపంగా వచ్చినట్లు భావించండి. ఒక కంట్లో సంపూర్ణ స్వరూపము, మరొక కంట్లో భవిష్య స్వరూపము ఈ విధముగా ప్రత్యక్షముగా కనిపిస్తుంది. ఏవిధంగా మీ ఈ స్వరూపము ప్రత్యక్షముగా అనుభవమవుతుందో అలా, ఇక్కడ లేము కానీ ఆ సంపూర్ణ స్వరూపములో కూర్చున్నాము అని కూర్చొని, కూర్చొనే అటువంటి అనుభవం చేసుకుంటారు. ఈ పురుషార్థీ శరీరము పూర్తిగా మర్జ్ అయిపోతుంది. ఒకవైపు అవ్యక్తము మరొకవైపు భవిష్యత్తు, ఈ రెండూ ఇమర్జ్ అవుతాయి. ఇటువంటి అనుభవమును మొదట మీరు చేసుకున్నట్లయితే అప్పుడు ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఏవిధంగా ఒక వస్త్రాన్ని వదిలి మరొకదానిని ధరించినట్లుగా అంత సహజముగా అనుభవము చేసుకుంటారు. ఇది మర్జ్ అవుతుంది అది ఇమర్జ్ అవుతుంది, దీనిని మర్చిపోతూ ఉంటారు. ఇటువంటి స్థితిలో విల్ పవర్ కూడా ఉంటుంది. విల్లును వ్రాస్తారు కదా, విల్లు చేసిన తరువాత నాది అన్న భావమంతా సమాప్తమైపోయినట్లుగా, బాధ్యత దిగిపోయినట్లుగా అనుభవమవుతుంది. విల్ పవర్ కూడా వస్తుంది మరియు సర్వస్వమును విల్లు చేసేసినట్లుగా కూడా అనుభవమవుతుంది. సంకల్ప సహితంగా అన్నీ విల్లు అయిపోయాయి. శరీర భానమును వదలటము మరియు సంకల్పాలతో సహా పూర్తిగా విల్లు చేయటము ఇదే మైట్(శక్తి). అప్పుడిక సమానత స్థితి కలుగుతుంది. సమానత అన్నా సంపూర్ణత అన్నా విషయమైతే ఒక్కటే. ఇప్పుడు ఈ చార్టును పెట్టాలి. ఆ చార్ట్ అయితే మామూలే. పంచతత్వాల శరీరము ఉన్నాగానీ లైట్ స్వరూపమును అనుభవము చేసుకుంటారు. లైటు అన్న మాటకు గల అర్థములో కూడా అంతరము ఉందని వినిపించి ఉన్నాము కదా! లైట్ అనగా తేలికతనము అని మరియు లైట్ అనగా జ్యోతి అని కూడా అంటారు. పూర్తిగా తేలికతనము అనగా లైట్ స్వరూపులై నడుస్తున్నాము, మేమైతే నిమిత్తులము! అవ్యక్తరూపములో అయితే ప్రతి విషయములోనూ సహాయము లభిస్తుంది. అచ్ఛా!
ఓంశాంతి, సమీపత యొక్క లక్షణాలు ఏమి ఉంటాయి? తేలికతనం అంటే ఏమిటి? స్వరూపంగా అవ్వటం అంటే ఎలా అర్పణ అవ్వాలి? ఏ విషయంలో చార్ట్ పెట్టుకోవాలి? సమాన స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?
ReplyDelete