* 29-04-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“అనంతమైన పరీక్షలో పాస్ అయ్యేందుకు సాధనము.”
ఈ రోజు ఇది భట్టీ సమాప్తియా లేక భట్టీ యొక్క ప్రాక్టికల్ పరీక్ష ప్రారంభమవుతోందా? ఇప్పుడు మీరు ఎక్కడకు వెళుతున్నారు? పరీక్ష హాలులోకి వెళ్తున్నారా లేక మీ మీ స్థానాలకు వెళ్తున్నారా? ఎప్పుడైతే పరీక్ష హాలు అని అనుకుంటారో అప్పుడు ప్రాక్టికల్ లో పాస్ అయ్యి చూపిస్తారు. మా ఇంటికి వెళ్తున్నాము అని భావించకండి. అతి పెద్ద కోర్సును దాటి అతి పెద్ద పరీక్షను వ్రాసేందు కొరకు పరీక్ష హాలులోకి వెళ్తున్నారు. సెంటర్లలో చదువును చదువుకుంటారు, అది స్కూలు చదువు వంటిది. కానీ ఎప్పుడైతే మధువనపు వరదానీ భూమిలో డైరెక్ట్ గా బాప్ దాదా లేక నిమిత్తంగా అయిన మహారధులైన పెద్దలందరి ద్వారా ట్రైనింగ్ తీసుకుంటారో మరియు చదువుకొంటారో, అప్పుడు నేను కాలేజీ లేక యూనివర్సిటీ విద్యార్ధిని అని భావించండి. స్కూలు పరీక్ష మరియు యూనివర్సిటీ పరీక్షలో అంతరము ఉంటుంది. చదువులో కూడా అంతరము ఉంటుంది, కావున ఈ భట్టీలో ట్రైనింగ్ తీసుకోవటము అనగా యూనివర్సిటీ విద్యార్ధిగా అవ్వటము. కావున ఇప్పుడు యూనివర్సిటీ చదువు యొక్క పరీక్షను వ్రాసేందుకు వెళ్తున్నారు. యూనివర్సిటీ పరీక్ష తరువాతనే స్టేటస్(హోదా) ప్రాప్తిస్తుంది. అలాగే భట్టీలోకి వచ్చిన తరువాత ఎవరైతే ప్రాక్టికల్ పరీక్షలో పాస్ అయ్యి వస్తారో వారికి వర్తమానము మరియు భవిష్య స్టేటస్ మరియు స్టేజ్ ప్రాప్తిస్తాయి. కావున దీనిని మామూలు విషయంగా భావించవద్దు. మొదట్లో సెంటర్లలో చదువుకొంటూ ఉండి ఉండవచ్చు మరియు పరీక్షలను కూడా ఇస్తూ ఉండి ఉండవచ్చు కానీ ఇది యూనివర్సిటీ పరీక్ష, బాప్ దాదా ద్వారా తిలకము మరియు ముద్రను వేయించుకొన్న తరువాత ఒకవేళ ఏదైనా ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిల్ అయినట్లయితే ఏమౌతుంది? జన్మజన్మాంతరాలకు ఫెయిల్ అనే మచ్చ ఉండిపోతుంది. కావున ఒకవేళ ఫెయిల్ అయ్యే సంస్కారము గానీ, నడవడిక గానీ ఉన్నట్లు అనిపిస్తే, ఈ రోజు ఆ మిగిలి ఉన్న మచ్చను మరియు బలహీనపు నడవడికను మరియు సంస్కారమును తొలగించుకొని వెళ్ళాలి. దీని ద్వారా పరీక్ష హాలులోకి వెళ్ళి, పరీక్షలో ఫెయిల్ కాకుండా ఉండాలి. అర్థమైందా! ఆ పేపరునైతే ఇచ్చేసారు, అదైతే సహజము కానీ ఫైనల్ నెంబరు మరియు మార్కులు ప్రాక్టికల్ పరీక్ష తరువాతనే లభిస్తాయి. కావున ఈ స్మృతి మరియు దృష్టి ఈ రెండింటిని పరివర్తనలోకి తీసుకువచ్చి వెళ్ళాలి. ప్రతి క్షణము నా పరీక్ష జరుగుతూ ఉంది - అని స్మృతిలో ఉండాలి. చదివించేవారు తండ్రి మరియు చదివే నేను స్టూడెంట్ ఆత్మను - అని దృష్టిలో ఉండాలి. ఈ స్మృతి, వృత్తి మరియు దృష్టిని మార్చుకొని వెళ్ళటం ద్వారా ఫెయిల్ అవ్వరు, పైగా ఫుల్ పాస్ అవుతారు. కావున భట్టీని ఏదో సాధారణ విషయంగా భావించవద్దు. ఈ భట్టీ ముద్ర మరియు తిలకమును సదా స్థిరంగా ఉంచుకోవాలి. ఏవిధంగా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉద్యోగమును ఇప్పిస్తుందో, పదవిని ప్రాప్తి చేయిస్తుందో, అలాగే ఈ భట్టీ తిలకము మరియు ముద్రను సదా మీ వద్ద ప్రాక్టికల్ లో స్థిరంగా ఉంచుకోవటము - ఇదే అతి పెద్ద సర్టిఫికేట్. ఎవరికైతే సర్టిఫికేట్ ఉండదో వారు ఎప్పుడూ ఎటువంటి స్టేటస్ ను పొందజాలరు. ఈవిధితో ఇది కూడా ఒక సర్టిఫికేట్. భవిష్య మరియు వర్తమాన పదవి యొక్క ప్రాప్తి మరియు సఫలతలకు సర్టిఫికేట్. సర్టిఫికేట్ ను ఎల్లప్పుడూ జాగ్రత్త పరుచుకొని ఉంచుకోవటం జరుగుతుంది. నిర్లక్ష్యము ఉంటే పోతుంది. ఎప్పుడూ మాయకు అధీనులై అనగా వశమై పురుషార్థములో నిర్లక్ష్యమును తీసుకురావద్దు. లేదంటే మాకు సర్టిఫికేట్ ఉందని మీరనుకుంటారు కానీ మాయ లేక రావణుడు సర్టిఫికేట్ ను దొంగలించేస్తాడు. ఏవిధంగా ఈ రోజుల్లో దొంగలు మరియు జేబులను కత్తిరించేవారు ఎటువంటి చాకచక్యంతో పని చేస్తారంటే, బయటకు అసలు ఏమీ తెలియనే తెలియదు కానీ లోపల ఖాళీ అయిపోతుంది. ఇదేవిధంగా ఒకవేళ పురుషార్థములో నిర్లక్ష్యమును తీసుకువచ్చినట్లయితే రావణుడు లోపల లోపలనే సర్టిఫికేట్ ను దొంగలించేస్తాడు, అప్పుడు ఇక మీరు స్టేటస్ ను పొందలేకపోతారు. కావున అటెన్షన్. అర్థమైందా!
ఈ గ్రూపు సేవాయోగ్యులుగా అయితే ఉన్నారు, ఇప్పుడు ఎలా తయారవ్వాలి? ఏవిధంగా సేవాయోగ్యులో అలాగే సేవలో ఒకటేమో త్రికాలదర్శీతనపు సెన్స్ (వివేకము)ను నింపాలి, రెండవది - ఆత్మికతా ఎసెన్స్ (సారము)ను నింపాలి, ఎప్పుడైతే మూడు విషయాలు కలసిపోతాయో - సర్వీస్, సెన్స్ మరియు ఎసెన్స్, ఎసెన్స్ సూక్ష్మంగా ఉంటుంది కదా! మరి ఈ ఆత్మికతా ఎసెన్స్ మరియు త్రికాలదర్మీతనపు సెన్స్ ను నింపటం ద్వారా సేవా యోగ్యులతో పాటు సక్సెస్ ఫుల్ గా కూడా అయిపోతారు. కావున సెన్స్ మరియు ఎసెన్స్ ఎంతవరకు ప్రతి ఒక్కరు తమ లోపల నింపుకున్నారు అన్నదానిని పరిశీలించుకోవాలి. ఇప్పుడు సమయము ఉంది. ఏవిధంగా పరీక్ష హాలులోకి వెళ్ళే రెండు గంటల ముందు కూడా చదువుకొని వెళ్తారో అలా మీరు కూడా పరీక్ష హాలులోకి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకొనేందుకు ఇప్పుడు సమయము ఉంది. బ్రహ్మాకుమారులుగా కనిపించటంతో పాటుగా తపస్వీ కుమార్ గా కూడా కనిపించాలి అని ఇంతకుముందు వినిపించాము కదా! వారు తమ నయనాలలో, ముఖములో ఆత్మికతను ధారణ చేయాలి, వారు వెళ్ళటంతోనే అలౌకికముగా అతీతముగా మరియు ప్రియమైన వారిగా అందరికీ కనిపించాలి? కేవలము భట్టీలో వచ్చినవారే కాదు, కానీ ఎవరైతే మధువనమునకు వచ్చారో, వారందరూ కూడా వీటిని విశేషరూపంలో ధారణ చెయ్యాలి. భట్టీ సక్సెస్ అయ్యిందా?? వీరి చదును నేగముతో మీరు సంతుష్టులయ్యారా? మీరు భట్టీలోని చదువుతో మీ పురుషార్థములో సంతుష్టులయ్యారా? ఏమీ మిగిలి అయితే లేవు కదా! ఇప్పుడు లేవు, కానీ తరువాత ఎప్పుడన్నా ఉంటాయా?
వీరు తమ సేఫ్టీ సాధనాన్ని వెతుకుతారు. ఏమైనా జరిగితే ఇది చెప్పవచ్చు కదా అని భావిస్తారు.కానీ దీనితో కూడా మళ్ళీ బలహీనత వస్తుంది. కావున ఇలా కూడా ఎప్పుడూ ఆలోచించవద్దు. ఎప్పుడూ ఫెయిల్ అవ్వము అని అనుకోండి. ఇప్పుడు కూడా ఉంది మరియు జన్మ జన్మాంతరాలకూ గ్యారంటీ ఉంది, ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. దీనినే ఫుల్ పాస్ అని అంటారు. ఏది అనుకుంటే అది చెయ్యగల విశేషత కుమారులది. ఈ విల్ పవర్(ఆత్మ విశ్వాసం) తప్పక ఉంది. కానీ ప్రతి క్షణం, ప్రతి సంకల్పమును విల్ చేసే విల్ పవర్ కావాలి. తమ పిల్లలకు మొత్తం విల్(వీలునామా) చెయ్యడం జరుగుతుంది కదా. ఉన్నదంతా విల్ చెయ్యడం జరుగుతుంది. అలాగే మీరు కూడా వారసులను తయారు చేస్తారు మరియు వారసులుగా అవుతారు కూడా. కావున, ఇతర విషయాలలో విల్ పవర్ ఉన్నట్లుగా ఉన్న దాన్నంతా విల్ చేసే విల్ పవర్ కూడా కావాలి. ఆ శక్తిని ఇక్కడి నుండే నింపుకుని వెళ్ళాలి. ఉన్నదంతా విల్ చేసేసినప్పుడు ఎలా తయారవుతారు? నష్టోమోహ. ఎప్పుడైతే మోహము నష్టమవుతుందో అప్పుడు బంధనముక్తులుగా అయిపోతారు. బంధనముక్తులే యోగయుక్తులుగా మరియు జీవనముక్తులుగా అవ్వగలుగుతారు. అర్థమయ్యిందా. ఇప్పుడు మీ వద్ద సంగమసమయపు ఏ ఖజానా ఉంది? జ్ఞాన ఖజానానైతే బాబా ఇచ్చారు. కానీ మీ మీ ఖజానాలేమిటి? సమయము మరియు సంకల్పము. ఎలా అయితే బాబా పూర్తిగా తమను తాము విల్ చేసుకున్నారో అలాగే మీ స్మృతిని కూడా పూర్తిగా విల్ చెయ్యాలి. ఎలా అయితే స్థూల ఖజానాలతో ఏది కావాలంటే దానిని పొందవచ్చో, అలాగే ఈ సమయపు ఖజానాలైన సమయము మరియు సంకల్పాలతో కూడా మీరు ఏమి కావాలనుకుంటే దానిని పొందవచ్చు. ప్రాప్తికి పూర్తి ఆధారము సంగమయుగపు సమయము మరియు శ్రేష్ఠ స్మృతి. ఇదే ఖజానా, దీనినే విల్ చెయ్యాలి. పూర్తిగా విల్ చేసేసి వెళ్తున్నారా లేక జేబు ఖర్చుకు కూడా కొంచం పెట్టుకున్నారా? అవసరానికి కొంచం కావాలని మూలన ఎక్కడో దాచి ఉంచుకోలేదు కదా. జేబు పూర్తిగా ఖాళీ అవ్వాలి.
(కుమారులు బాబాకు ఒక పాటను వినిపించారు) ఈ మధ్య కాలంలో మధువనంలోని ఏ మూలా ఖాళీగా లేదు, ప్రతి స్థానంలో సితారల మెరుపు కనిపిస్తున్నప్పుడు ఖాళీ అని ఎందుకు అంటున్నారు? సూర్యుడు వ్యక్తం నుండి అవ్యక్తమైనప్పుడు సితారలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే బాబా వ్యక్తం నుండి అవ్యక్తమై విశ్వంలోని సితారల మెరుపును చూపిస్తున్నారు. మరి ఖాళీ అని ఎందుకు అంటారు? స్థూల సూర్యుడ్ని అస్తమించాడు అని అంటారు, కానీ ఈ జ్ఞాన సూర్యుడు వ్యక్తం నుండి అవ్యక్తమయ్యారు. కానీ సితారలతో పాటు ఉన్నారు. సాకార రూపంలో సదా తోడుగా ఉండలేరు కదా. సాకారంలో ఉంటున్నప్పటికీ సదా తోడుగా ఉండటానికి అవ్యక్త స్థితి మరియు అవ్యక్త తోడును అనుభవం చేసుకునేవారు, అలాగే ఇప్పుడు కూడా సదా తోడుగా ఉండాలంటే అది అవ్యక్త రూపంగానే వీలవుతుంది. ఎందుకంటే అవ్యక్త రూపం వ్యక్త శరీర బంధనం నుండి ముక్తమయినది. మరి మీ అందరికీ సదా తోడుగా నిలవడానికి, శరీర స్మృతి నుండి దూరం చెయ్యడానికి ఈ అవ్యక్త పాత్ర జరుగుతోంది. బాప్ దాదా అయితే అన్నివేళలా పిల్లలందరి తోటి ఉంటారు. మొదట్లో ఒక పాటను తయారు చేసారు "క్యోం హో అధీర్ మాతా...(ఓ మాతా నువ్వు అధైర్యురాలిగా ఎందుకు అవుతున్నావు...." (ఈ పాటను అక్కయ్యలు వినిపించారు) ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ సదా తోడుగా ఉన్నాను. కానీ కావాలనుకున్నవారు అనుభవం చేసుకోవచ్చు. ఇప్పుడు అనుభవం చెయ్యడానికి ఎలా అయితే బాబా అవ్యక్తమయ్యారో అలాగే అవ్యక్తమైతేనే అనుభవం చేసుకోగలరు. ఈ అలౌకిక అనుభవాన్ని చేసుకోవడానికి సదా వ్యక్త భావం నుండి దూరంగా, వ్యక్త దేశ స్మృతితో ఉపరామంగా అనగా సాక్షిగా అవ్వడం ద్వారానే ప్రతి సమయము తోడును అనుభవం చేసుకోగలరు. అర్థమయిందా, అచ్ఛా!
Comments
Post a Comment