29-01-1977 అవ్యక్త మురళి

29-01-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మధువనం యొక్క మహిమ.

                                జ్ఞానసాగరుడు, నిరాకారి, నిర్వికారి బాబా మధువనం నివాసి పిల్లలతో మాట్లాడుతున్నారు-
                     అందరు సదా సంతోషంగా ఉన్నారు కదా? ముడు కాలాల యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు కనుక రాజీ అయిపోయారు కదా? ఎప్పుడైనా ఎవరైనా కోపంలోకి వస్తున్నారు అంటే డ్రామా యొక్క రహస్యాన్ని మర్చిపోయినట్లే. ఎవరైతే డ్రామా యొక్క రహస్యాన్ని మరియు మూడు లోకాలను తెలుసుకుంటారో వారు రాజీగా ఉంటారు కదా! కోపంలోకి రావటం అంటే రహస్యాన్ని తెలుసుకోకపోవటం. మూడు లోకాల జ్ఞానాన్ని తెలుసుకున్నవారిని త్రికాలదర్శి అని అంటారు. వారు సదా రాజీగా మరియు సంతోషంగా ఉంటారు. మధువన నివాసీయులు అంటే సదా రాజీగా మరియు సంతోషంగా ఉండేవారు. ఇతరులతో కోపగించుకోవటం అంటే స్వయాన్ని రహస్యం తెలుసుకునే స్థితి నుండి క్రిందికి తెచ్చుకోవటం. సింహాసనాన్ని వదిలి క్రిందికి వచ్చేస్తున్నారు అప్పుడే కోపంలోకి వస్తున్నారు. త్రికాలదర్శి అంటే జ్ఞానస్వరూపులు, జ్ఞాన స్వరూపమనేది ఒక సింహాసనం, ఉన్నతస్థితి. ఎప్పుడైతే ఈ సింహాసనాన్ని వదిలి క్రిందికి వస్తున్నారో అప్పుడే కోపంలోకి వస్తున్నారు. ఎటువంటి స్థానమో అటువంటి స్థితి ఉండాలి.
                    మధువనాన్ని స్వర్గభూమి అని అంటారు కదా! మధువనం స్వర్గం యొక్క ఉదాహరణగా భావిస్తున్నప్పుడు మధువనంలో మాయ వస్తుందా? మాయ అంటే ఏమిటో తెలియనివారిగా అవ్వాలి. స్వర్గంలో మాయ యొక్క జ్ఞానం ఉండదు. ఈ భూమిని సాధారణ భూమిగా భావిస్తున్న కారణంగా మాయ వస్తుంది. మధువన వరదాన భూమిని సాధారణ స్థానంగా భావించకండి. మధువనం యొక్క స్మృతి కూడా శక్తినిస్తుంది. మధువనంలో ఫరిస్తాగా ఉండాలి. మధువనం యొక్క మహిమ అంటే మధువన నివాసీయులు మహిమ. మధువన గోడలకు మహిమ కాదు. మధువన నివాసీయులను మొత్తం విశ్వం ఏ దృష్టితో చూస్తుంది, విశ్వం ఇప్పటి వరకు ఎంత ఉన్నత దృష్టితో చూస్తుంది! భక్తులు కూడా మధువనం నివాసీయుల మహిమ చేస్తున్నారు. బ్రాహ్మణ పరివారం కూడా ఉన్నత దృష్టితో చూస్తారు. ఒకవేళ మీకు కూడా ఇంత ఉన్నతదృష్టి ఉంటే ఫరిస్తాగా అయిపోయేవారు కదా?
                 మధువన నివాసీయులను యజ్ఞనివాసి అని కూడా అంటారు. యజ్ఞంలో ఉండేవారు స్వయాన్ని ఆహుతి చేసుకోవాలి. అప్పుడే ఇతరులు అనుసరిస్తారు. స్మృతిచిహ్నంగా తయారైన యజ్ఞంలో కూడా మంత్రాన్ని జపించినప్పుడే ఆహుతి సఫలం అవుతుంది. ఇక్కడ కూడా మన్మనాభవ యొక్క మంత్రం స్మృతి ఉన్నప్పుడే ఆహుతి సఫలం అవుతుంది. మధువన నివాసీయులు సదా నిరంతరం మంత్ర స్థితిలో స్థితులై ఉండేవారు. కేవలం చెప్పేవారు కాదు కానీ మంత్ర స్వరూపులు. ఇప్పుడు బాబా అనుభూతి కోర్స్ ఇచ్చారు. కనుక స్వయం అనుభవం చేసుకుని పరివర్తన చేసుకున్నారా? అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాము అనే వారికి నోటిలో గులాబ్ జామ్ అని బాప్ దాదా చెప్తున్నారు. చెప్పటం ద్వారా కూడా మంచిగా అయిపోతారు. లోపం గురించి మాటి మాటికి ఆలోచించటం ద్వారా లోపం ఉండిపోతుంది. లోపాన్ని చూసుకుంటూ సమాప్తి చేసుకుంటూ వెళ్ళండి. పరిశీలించుకోవటంతో పాటు పరివర్తన కూడా చేసుకోండి. ఏదోక అద్భుతం చేసి చూపించాలి కదా? ఇంత సమయంలో ఎంత తోడు లభించిందో అంతగా అద్భుతం చేసారు. అద్భుతమైన మహిమ జరిగే పని చేసారా లేక చేస్తూ కూడా మర్చిపోతున్నారా? స్వయాన్ని సదా గుణమూర్తిగా భావిస్తూ ఉన్నత స్థితిలో స్థితులవ్వండి. క్రిందికి రాకండి. ఉన్నత కుటుంబీకుల పిల్లలు ఎప్పుడు భూమిపై, మట్టిలో పాదం పెట్టరు. ఇక్కడ దేహాభిమానమే మట్టి దీనితో క్రిందికి రాకండి. ఈ మట్టితో సదా దూరంగా ఉండండి. సంకల్పంలో అయినా దేహాభిమానంలోకి వచ్చారంటే మట్టిలో పాదం పెట్టినట్లే. వాచా, కర్మణాలోకి వచ్చారంటే మట్టిని తిన్నట్లే.
                    ఉన్నత కుటుంబీకుల పిల్లలు ఎప్పుడు మట్టిని తినరు. సదా ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క ఉన్నతోన్నత స్థితి కలిగిన పిల్లలం అని స్మృతి ఉంటే నీచ దృష్టి రాదు. పాత స్థితిని స్వప్నంలో కూడా రానివ్వకూడదు. యోగీ, జ్ఞాని ఆత్మల స్వప్నాలు కూడా క్రొత్త ప్రపంచానికి, క్రొత్త జీవితానికి సంబంధించినవిగా ఉండాలి. స్వప్నాలు మారిపోతే ఇక సంకల్ప విషయమేమీ ఉండదు. మధువన నివాసీయుల స్వప్నం కూడా శ్రేష్టంగా ఉండాలి. బాప్ దాదా కూడా అదే దృష్టితో చూస్తారు. ఇప్పుడు అంతిమ సమయం వరకు కూడా బృందావనం, మధువనం అని పేరుకి చాలా మహిమ ఉంది. కేవలం పేరుతో తమ శరీర నిర్వహణ చేసుకుంటున్నారు. పేరుకి ఇంత గొప్పతనం ఉంది అంటే మధువన నివాసీయుల పేరే ఉన్నతమైనది. పేరుకే ఇంత మహిమ ఉంది అంటే స్వయం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? మంచిది, అందరు సంతుష్టమే కదా! మంచిది.

Comments