29-01-1975 అవ్యక్త మురళి

29-01-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరిశీలనా శక్తి యొక్క ప్రయోగం ద్వారా సఫలత.

            సర్వశక్తుల, వరదానాల యొక్క దాత, శివబాబా సత్యమైన రాజఋషి పిల్లల ఎదురుగా మాట్లాడుతున్నారు -
            ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ రాజఋషులు, ఇది రాజఋషుల సభ. మధువనం అనే మాట రెండు విషయాలను రుజువు చేస్తుంది, ఒకటి - మధురత, రెండు - బేహద్ వైరాగ్యవృత్తి. అదేవిధంగా రాజఋషి అనే మాటకు అర్ధం - రాజ్యం చేసేవారు. రాజఋషి అనగా బీదవారి నుండి రాజుగా అవ్వడం. ఎంత అధికారమో అంతగానే సర్వస్వత్యాగం. సర్వత్యాగి అనగా సమయంపై, సంకల్పంపై, స్వభావం మరియు సంస్కాంపై అధికారాన్ని పొందేవారు. ఎలా కావాలంటే అలా తమ సమయాన్ని, స్వభావాన్ని మరియు సంస్కారాన్ని పరివర్తన చేసుకోగలిగేవారు. అంటే ఎలాంటి సమయమో అలాంటి స్వ స్వరూపాన్ని లేదా స్థితిని ధారణ చేయగలిగిన వారు. ఇటువంటి రాజఋషి అనగా సర్వాధికారి మరియు సర్వ త్యాగిగా అయ్యారా? జన్మ తీసుకుంటూనే కర్మ ప్రమాణంగా, శ్రేష్ఠ స్వమానం ప్రమాణంగా రాజఋషి అనే పదవి బాప్ దాదా ద్వారా ప్రాప్తించినదా? సర్వాధికారి అయిపోయారా లేక ఇప్పుడు అవ్వాలా, ఏమని భావిస్తున్నారు? మీ అందరి యొక్క విశేష స్లోగన్ ఏమిటి? జన్మ సిద్ధ అధికారం అయినప్పుడు జన్మతోనే అది ప్రాప్తిస్తుంది కదా! అనగా అధికారి అయిపోయారు కదా? మాస్టర్ జ్ఞాన సాగరులు అయిపోయారు. అయితే జ్ఞానము అనగా తెలివితో అధికారం ప్రాప్తిస్తుంది. తెలివి తక్కువగా ఉంటే అధికారం కూడా తక్కువగా ఉంటుంది. జ్ఞాన సాగరులు కదా? ఇప్పుడు అంతిమ స్థితి ఏమిటి ? తెలుసా! కర్మాతీతంగా తయారైన స్థితికి గుర్తు ఏమిటి? సదా సఫలతామూర్తి. సమయం కూడా సఫలం, సంకల్పం కూడా సఫలం, సంబంధ సంప్రదింపుల్లో సదా సఫలం. అలాంటి వారినే సఫలతామూర్తి అని అంటారు. ఇలాంటి సఫలతామూర్తిగా తయారయ్యేటందుకు వర్తమాన సమయాన్ని అనుసరించి విశేషంగా ఏ శక్తి అవసరం? దాని ద్వారా ఈ విషయాలన్నింటిలో సదా సఫలతామూర్తిగా కాగలరు? ఆ శక్తి ఏది? సర్వశక్తులు ప్రాప్తిస్తున్నాయి. అయినా కానీ వర్తమాన సమయాన్ని అనుసరించి విశేషంగా పరిశీలనా శక్తి అవసరం. పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటే రకరకాలుగా వచ్చే విఘ్నాలు సంలగ్నతలో విఘ్నంగా అయ్యే వాటిని ముందుగానే తెలుసుకుని, వాటితో యుద్ధం చేయడానికి ముందుగానే సమాప్తి చేసేస్తారు. అందువలన సమయం వ్యరంగా వెళ్ళడానికి బదులు సమర్ధంలో జమ అవుతుంది. అదేవిధంగా సేవలో ప్రతి ఆత్మ యొక్క ముఖ్య కోరిక మరియు వారి యొక్క ముఖ్య సంస్కారం తెలుసుకుంటారు. కనుక ఆ రకంగా ఆ ఆత్మకు అదే ప్రాప్తిని ఇస్తారు. అందువలన సేవలో కూడా సదా సఫలం అవుతారు. మూడో విషయం ఏమిటంటే ఇతరుల సంబంధంలోకి రావడం అనేది ముఖ్య సబ్జెక్టు, దీనిలో కూడా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాన్ని లేదా స్వభావాన్ని తెలుసుకుంటూ ఆ రకంగానే వారిని సదా సంతుష్టంగా ఉంచుతారు. నాలుగో విషయం సమయం యొక్క వేగం. ఏ సమయంలో ఎలాంటి వాతావరణమో లేదా వాయుమండలమో మరియు ఏమి జరగాలో పరిశీలిస్తారు. కనుక ఆ సమయానుసారంగా స్వయాన్ని కూడా మరియు ఇతరాత్మలను కూడా తీవ్ర వేగంలోకి తీసుకురాగలరు. మరియు ఎలాంటి సమయమో అలాంటి స్వరూపాన్ని ధారణ చేసే ఉత్సాహ ఉల్లాసాలను కూడా నింపగలరు, మరియు సమయ ప్రమాణంగా జ్ఞానవంతులుగా, నియమపూర్వకంగా మరియు ప్రేమపూర్వకంగా కూడా అవుతారు మరియు తయారు చేస్తారు. ఈ రకంగా సదా సఫలులు కాగలరు. ఎందుకంటే ఒక్కొసారి నియమపూర్వకంగా అవ్వాలి మరియు ఒక్కొక్కసారి ప్రేమపూర్వకంగా అవ్వాలి, ఈ పరిశీలన ఉంటుంది. కనుక సదా సహజంగానే సఫలులు కాగలరు. ఇలాంటి సఫలతామూర్తుల ఎదురుగా ప్రకృతి లేదా పరిస్థితి కూడా దాసి అయిపోతుంది. అనగా వారు ప్రకృతి మరియు పరిస్థితిపై కూడా సదా విజయీ అవుతారు. వారు ప్రకృతికి లేదా పరిస్థితికి వశీభూతం అవ్వరు. ఇలాంటి విజయీలనే సదా సఫలతామూర్తి అని అంటారు. దీని కోసం మూడు స్వరూపాల యొక్క బాబా మాటను గుర్తు పెట్టుకోండి. మూడు స్వరూపాలు అనగా నిరాకారి, ఆకారి మరియు సాకారి. ఎలాగైతే సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన గురువు... ఇలా మూడు సంబంధాలతో శిక్షణలను స్మృతిలో పెట్టుకుంటారో, అలాగే మూడు స్వరూపాలతో మూడు ముఖ్య విషయాలను స్మృతిలో ఉంచుకోండి. ఈ మూడు స్వరూపాలతో విశేషంగా మూడు వరదానాలు ఏమిటి? నిరాకారి స్వరూపం యొక్క ముఖ్య శిక్షణ యొక్క వరదానం ఏమిటి? కర్మాతీత భవ! ఆకారీ స్వరూపం లేదా ఫరిస్తా స్థితి యొక్క వరదానం ఏమిటి? డబల్ లైట్ భవ! డబల్ లైట్ అనగా సర్వ కర్మబంధనాల నుండి తేలికగా మరియు లైట్ అనగా సదా ప్రకాశ స్వరూపంలో స్థితి అయ్యేవారు. ఆకారి స్వరూపం యొక్క విశేష వరదానం - డబల్  లైట్ భవ. దీని ద్వారానే డబల్ కిరీటధారిగా అవుతారు. సాకార స్వరూపం యొక్క విశేష వరదానం ఏమిటి? సాకార స్వరూపం యొక్క విశేష వరదానం సాకారుని సమానంగా నిరహంకారి మరియు నిర్వికారి భవ! ఈ మూడు వరదానాలు సదా స్మృతిలో ఉంచుకోవడం ద్వారా సదా కాలికంగా సహజంగానే సఫలతామూర్తిగా అయిపోతారు. అర్థమైందా! బాప్ దాదా కంటే కూడా పిల్లలు శక్తివంతులు. ఎందుకంటే వారు సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తమయ్యారు. మరైతే వారు ఎక్కువ శక్తివంతులు కాదా? సర్వశక్తివంతుడిని సర్యసంబంధాలతో తమవారిగా చేసుకున్నారు. లేదా తమ స్నేహం అనే త్రాడుతో బంధించారు, మరైతే ఎక్కువ శక్తివంతులు అవ్వలేదా? విశ్వాధికారిని, విశ్వసేవాధారిగా చేసేసారు. దీనికి నిమిత్తం ఎవరు? సమీప మరియు సహయోగి పిల్లలు.
                 ఈవిధంగా సదా బాప్ దాదాని ప్రతి కర్మ మరియు ప్రతి అడుగు ద్వారా ప్రత్యక్షం చేసే సర్వ శ్రేష్ట ఆత్మలకు, ప్రతి ఆత్మను బాబాతో కలిపేటందుకు నిమిత్తం అయ్యేవారికి, సదా బాబా మరియు సేవలో లవలీనంగా ఉండేవారికి, లక్ష్యం మరియు లక్షణము సమానంగా తయారు చేసేవారికి, సాక్షాత్తు బాబా సమానంగా అయి సర్వులకు బాబాని సాక్షాత్కారం చేయించేవారికి ఈవిధంగా నియమపూర్వకంగా మరియు ప్రేమపూర్వకంగా ఉండే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.

Comments