28-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మాస్టర్ సర్వజ్ఞులు అనే స్థితి ద్వారా సర్వశక్తివంతుని యొక్క ప్రత్యక్షత.
దీదీగారితో అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మధురమహావాక్యాలు -
ఏ విశేష బలహీనతలు తొలిగించుకునేటందుకు విశేష సంఘటన కావాలి? మహాకాళీ స్వరూప శక్తుల యొక్క సంఘటన కావాలి. వారు తమ యోగాగ్ని యొక్క ప్రభావంతో ఈ వాతావరణాన్ని పరివర్తన చేయాలి. ఇప్పుడైతే డ్రామానుసారం ప్రతి ఒక్కరి నడవడిక రూపీ దర్పణంలో అంతిమ ఫలితం స్పష్టం కానున్నది. ఇకముందు మహారథీ పిల్లలు తమ ఙ్ఞానశక్తి ద్వారా ప్రతి ఒక్కరి ముఖం ద్వారా వారి యొక్క కర్మలకథలు స్పష్టంగా చూడగలరు. ఏవిధంగా అయితే మలిన భోజనం యొక్క దుర్వాసన తెలిసిపోతుందో అలాగే మలిన సంకల్పాలనే ఆహారాన్ని స్వీకరించే ఆత్మల యొక్క వైబ్రేషన్ ద్వారా బుద్ధిలో స్పష్టంగా ప్రేరణ వస్తుంది. దీనికి యంత్రం బుద్దిలైన్ క్లియర్ గా ఉండాలి. ఎవరి యొక్క ఈ యంత్రం శక్తివంతంగా ఉంటుందో వారు సహజంగా తెలుసుకోగలరు. శక్తులు లేదా దేవతల యొక్క జడచిత్రాల్లో కూడా ఈ విశేషం ఉంటుంది. ఏ పాపాత్మ అయినా కానీ వారి పాపాలను దేవతల ముందు దాచలేరు, తమకు తామే వర్ణన చేసేస్తారు, మేము ఇలాంటి వాళ్ళము అని స్వతహాగానే తమ గురించి వర్ణన చేస్తారు. జడ స్మృతి చిహ్నంలో కూడా అంతిమకాలం వరకు ఈ విశేషత కనిపిస్తుంది. చైతన్యరూపంలో శక్తుల యొక్క ఈ విశేషత ప్రసిద్ధమైంది. అందువలనే స్మృతి చిహ్నంలో కూడా ఆ విధంగా ఉంది. ఇది మాస్టర్ సర్వజ్ఞ స్థితి అనగా జ్ఞాన సాగర స్థితి. ఈ స్థితి ప్రత్యక్ష రూపంలో అనుభవం అవుతుంది. ఇప్పుడు అవుతూ ఉంది.. ఇకముందు అవుతుంది కూడా. ఇలాంటి సంఘటన తయారుచేశారా? తయారవ్వాల్సిందే. ఇలాంటి దీపపు స్వరూపం యొక్క సంఘటన కావాలి వారి యొక్క ప్రతి అడుగు ద్వారా బాబా ప్రత్యక్షం అవ్వాలి. ఎవరైతే సదా బాబాలో లవలీనం అయ్యి ఉంటారో అనగా స్మృతిలో లీనమై ఉంటారో అలాంటి ఆత్మల యొక్క నయనాల్లో మరియు నోటి ద్వారా వచ్చే ప్రతి మాటలో బాబా నిండి ఉంటారు. అందువలన శక్తిస్వరూపానికి బదులు సర్వశక్తివంతుడు కనిపిస్తారు. స్థాపన ఆదిలో బ్రహ్మారూపంలో సదా శ్రీకృష్ణుడు కనిపించేవారు. అదేవిధంగా శక్తుల ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి. ఈ విధంగా అనుభవం అవుతుంది కదా. ఎవరైతే సదా బాబా యొక్క స్మృతిలో ఉంటారో, నేను అనే భావాన్ని త్యాగం చేసే వృత్తి కలిగి ఉంటారో వారి ద్వారానే బాబా కనిపిస్తారు. అదేవిధంగా ఇతరులకు కూడా వారి యొక్క రూపం కనిపించదు కానీ సర్వశక్తివంతుని రూపం కనిపిస్తుంది. మంచిది.
Comments
Post a Comment