28-10-1975 అవ్యక్త మురళి

28-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వందమంది బ్రాహ్మణులు కంటే ఉత్తమమైన కన్యగా తయారయ్యేందుకు ధారణలు.

                                కుమారీలతో అవ్యక్త బాప్ దాదా పలికిన అవ్యక్త వ్యాక్యాలు -
                   కుమారీలందరూ బాబాతో మొట్టమొదట ప్రతిజ్ఞ చేశారు. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరని దానిని నిలుపుకుంటున్నారా? ఈ ప్రతిజ్ఞను సదా నిలుపుకునే కుమారి విశ్వకళ్యాణం కోసం నిమిత్తం అవుతుంది. కుమారీలకు పూజ జరుగుతుంది, ఆ పూజకు ఆధారం సంపూర్ణ పవిత్రత. కనుక కుమారీల గొప్పతనం పవిత్రతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కుమారి, కుమారీగా ఉంటూ పవిత్రంగా లేనట్లయిటే ఆ కుమారీ జీవితానికి గొప్పతనం లేదు. కనుక కుమారీకి ఏదైతే విశేషత ఉందో దానిని సదా వెంట ఉంచుకోండి, వదిలిపెట్టకండి. మీ విశేషతలను వదిలేస్తే వర్తమాన జీవితం యొక్క అతీంద్రియ సుఖాన్ని మరియు భవిష్యత్తు యొక్క రాజ్యసుఖము. రెండింటి నుండి వంచితం అయిపోతారు. అతీంద్రియ సుఖం సంగమయుగం యొక్క వారసత్వం అని వింటారు, చెబుతారు కానీ అనుభవం మాత్రం అవ్వదు. ఎప్పుడైతే కుమారీ జీవితం యొక్క గొప్పతనాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటారో అప్పుడే సఫలతా టీచర్  లేదా బ్రహ్మాకుమారీగా కాగలరు. ఈ లక్ష్యం మీకున్నట్లయితే కుమారీ స్థితి యొక్క విశేషతలను లక్షణాలను సదా స్థిరంగా ఉంచుకోండి. ఈ విశేషతలను కదపడానికి మాయ ఎంతగా ప్రయత్నించినా కానీ అంగదుని సమానంగా స్థిరంగా ఉండాలి. కుమారీ అనగా నిర్బంధన కానీ కుమారీగా ఉంటూ మాయకు ఎక్కడ వశం అయిపోతారో అనే భయం ఉంటుంది. ఈ భయం అనే కారణాన్ని తొలగించలేరు. ఇక ట్రయల్ వేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది పరివర్తనా శక్తి కావాలి. ఎలాంటి ఆత్మ అయినా కానీ ఎలాంటి పరిస్థితి అయినా కానీ స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి ఉండాలి. అప్పుడే సఫలతా టీచర్‌గా మరియు సేవాధారిగా తయారుకాగలరు. ఒకటి - సంపూర్ణ పవిత్రత, రెండు - పరివర్తనా శక్తి. ఈ రెండు విశేషతలతో సేవ, స్నేహం మరియు సహయోగంతో విశేష ఆత్మగా తయారుకాగలరు. లేకపోతే ట్రయల్ వేసేవారి జాబితాలో ఉంటారు కాని సమర్పణ అయినవారి జాబితాలోకి రాలేరు. ఈ రెండు విశేషతలను స్థిరంగా ఉంచుకునే కుమారి మహిమకు మరియు పూజకు యోగ్యం అవుతుంది. అల్పకాలిక వైరాగ్యం కాదు, సదాకాలిక వైరాగ్యం ఉండాలి అనగా త్యాగం మరియు తపస్సు. అప్పుడే విశేష కుమారి అని అంటారు. ఇప్పుడైతే నిమిత్తమైనవారు ధ్యాస పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు విశేషత కనిపించటం లేదు అందువలన సేవ ఆపవలసి వస్తుంది. ఎవరి ద్వారా మీ గురించి ఏ ఫిర్యాదు వినబడకూడదు అప్పుడే మీరు సంపూర్ణ టీచర్ లేదా వందమంది బ్రాహ్మణులకంటే ఉత్తమమైన కన్యగా కాగలుగుతారు. మంచిది.

Comments