* 28-07-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఆకారునిలో నిరాకారుని చూసే అభ్యాసము."
ఆకారుని చూస్తూ నిరాకారుని చూసే అభ్యాసము ఏర్పడిందా? ఏవిధంగా తండ్రి ఆకారములో నిరాకార ఆత్మలనే చూస్తారో అలాగే తండ్రి సమానంగా అయ్యారా? ఎల్లప్పుడూ శ్రేష్ఠ బీజము ఏదైతే ఉంటుందో దాని వైపుకే దృష్టి మరియు వృత్తి వెళ్తాయి. మరి ఈ ఆకారము మధ్యలో శ్రేష్ఠ వస్తువు ఏది? నిరాకార ఆత్మ. మరి రూపాన్ని చూస్తారా లేక రూహ్ (ఆత్మ)ను చూస్తారా? ఎందుకంటే ఇప్పుడైతే అంతరమును కూడా తెలుసుకున్నారు మరియు మహామంత్రమును కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్నారు, చూసారు కూడా, ఇక ఏం మిగిలింది? స్థితిలో ఉండే విషయంలో అభ్యాసులుగా ఉన్నారా? (ప్రతి ఒక్కరూ వారి వారి అనుభవమును తెలిపారు) అంతిమము వరకు మొదటి పాఠము యొక్క అభ్యాసులుగానే ఉంటారా? అంతిమము వరకు అభ్యాసులుగా అయ్యి ఉంటారా లేక స్వరూపముగా కూడా అవుతారా? అంతిమములో ఎంత సమయమునకు ముందు ఈ అభ్యాసము సమాప్తమౌతుంది మరియు స్వరూపులుగా అయిపోతారు? శరీరము వదిలేంతవరకు అభ్యాసులుగానే ఉంటారా? మొదటి పాఠము యొక్క సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? అంతిమము వరకు అభ్యాసులుగా ఉంటాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఆకారములో నిరాకారుని చూసే విషయమును, మొదటి పాఠమును గూర్చి అడుగుతున్నారు. ఇప్పుడు ఆకారుని చూస్తూ నిరాకారుని చూస్తారా? సంభాషణను ఎవరితో చేస్తున్నారు? (నిరాకారునితో) ఆకారునిలో నిరాకారుని చూడటానికి వచ్చారు - ఇందులో అంతిమము వరకు కూడా ఒకవేళ అభ్యాసులుగానే ఉన్నట్లయితే దేహీ అభిమానము మరియు తమ వాస్తవిక స్వరూపపు ఆనందము, సుఖము ఏవైతే ఉన్నాయో వాటి అనుభవమును సంగమయుగములో పొందరా? సంగమయుగపు వారసత్వము ఎప్పుడు ప్రాప్తిస్తుంది? సంగమయుగపు వారసత్వము ఏది? (అతీంద్రయ సుఖము) ఇది అంతిమంలో ఎప్పుడైతే వెళ్ళేవారుగా ఉంటారో అప్పుడు లభిస్తుందా? ఆత్మిక స్వరూపులై నడవటము మరియు దేహీలుగా అయ్యి నడవటము... ఈ అభ్యాసము లేదా? ఇప్పుడు సాకారుని లేక ఆకారుని చూస్తూ ఆకర్షణ ఇటు వైపుకు వెళ్తుందా లేక ఆత్మ వైపుకు వెళ్తుందా? ఆత్మను చూస్తారు కదా! ఆకారునిలో నిరాకారుని చూడటము, ఇది ప్రాక్టికల్ మరియు నేచురల్ స్వరూపముగా అయ్యే వెళ్ళాలి. ఇప్పటివరకూ శరీరమునే చూస్తారా? సేవనైతే ఆత్మదే చేస్తారు కదా! భోజనమున స్వీకరించే సమయములో ఆత్మకు తినిపిస్తారా లేక శారీరిక భానములో చేస్తారా? మెట్లను దిగుతూ-ఎక్కుతూ ఉంటారు. మెట్ల ఆట మంచిగా అనిపిస్తుందా? దిగటము మరియు ఎక్కడము ఎవరికన్నా మంచిగా అనిపిస్తుందా? చిన్నచిన్న పిల్లలు ఎక్కడ మెట్లను చూసినా వాటిని తప్పకుండా ఎక్కుతూ దిగుతూ ఉంటారు, మరి చివరివరకు చిన్నతనమే ఉంటుందా? వానప్రస్థులుగా అవ్వరా? శరీరమునకు ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ ఉంటుందో అప్పుడు నెమ్మది-నెమ్మదిగా చిన్ననాటి సంస్కారములు తొలగిపోతూ ఉంటాయి కదా! అంతము వరకు అభ్యాసిగా ఉండాలి అని ఒకవేళ భావించినట్లయితే ఈ మొదటి పాఠమును పరిపక్వము చేసుకొనడంలో ఢీలాతనము వచ్చేస్తుంది. మరి ఇక నిరంతర సహజ స్మృతి మరియు స్వరూపపు స్థితి యొక్క సఫలతను చూడరా? శరీరమును వదిలినప్పుడు సఫలులవుతారా? కానీ అలా కాదు, ఈ ఆత్మిక స్వరూపపు అనుభవమును అంతిమమునకు ముందే చెయ్యాలి. ఏవిధంగా అనేక జన్మలు మీ దేహ స్వరూపపు స్మృతి సహజంగా ఉందో, అలాగే మీ వాస్తవిక స్వరూపపు స్మృతి అనుభవమును కొద్ది సమయము కూడా చెయ్యరా? ఇది జరగాలా? ఈ మొదటి పాఠము తప్పక పూర్తవుతుంది. ఈ ఆత్మ అభిమాని స్థితిలోనే సర్వ ఆత్మలకు సాక్షాత్కారము చేయించేందుకు నిమిత్తులుగా అవుతారు. కావున ఈ అటెన్షన్ ను ఉంచవలసి ఉంటుంది. ఆత్మగా భావించటము ఇదైతే మీ స్వరూపపు స్థితిలో ఉండటము కదా! ఏవిధంగా బ్రహ్మాకుమారులు లేక బ్రహ్మాకుమారీలు అని అన్నప్పుడు బ్రహ్మాబాబాను మరియు బ్రహ్మాకుమార స్వరూపమును మర్చిపోతారా? మరి దీనిని మరచిపోనప్పుడు శివవంశీయులుగా మీ ఆత్మిక స్వరూపమును ఎందుకు మరచిపోతారు? శివబాబా అని అన్నప్పుడు నిరాకారీ స్వరూపము మీ ముందుకు వస్తుంది కదా. కావున ఏవిధంగా బ్రహ్మాకుమారులము అన్న స్వరూపము నడుస్తూ-తిరుగుతూ దృఢమైపోయిందో మరి అలాగే మీ శివవంశీ స్వరూపమును ఎందుకు మర్చిపోవాలి! బ్రహ్మాకుమారులుగా అయిపోయారు కానీ శివవంశీ స్వరూపముగా అంతిమములో అవుతారా? బాప్ దాదా అని కలిపి అంటారా లేక విడిగా అంటారా? ఎప్పుడైతే బాప్ దాదా అని కలిపి అంటున్నప్పుడు మీ రెండు స్వరూపాలు ఆత్మిక స్వరూపము మరియు బ్రహ్మాకుమార స్వరూపము రెండూ స్మృతిలో ఉండవా? ఈ అభ్యాసము మొదటినుండే పూర్తి చెయ్యవలసి ఉంటుంది. అంతిమము కొరకైతే ఇతరమైన చాలా విషయాలు ఉండిపోతాయి.
వినిపించాము కదా - అంతిమ సమయములో క్రొత్త క్రొత్త పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలను పాస్ అయ్యి సంపూర్ణత అనే డిగ్రీని తీసుకోవాలి. ఒకవేళ ఈ మొదటి పాఠమే స్మృతిలో లేనట్లయితే సంపూర్ణతా డిగ్రీని కూడా తీసుకోలేరు. డిగ్రీ లభించనట్లయితే ఏమౌతుంది? ధర్మరాజు యొక్క డిక్రీ వెలువడుతుంది. కావున ఈ అభ్యాసమును చాలా దృఢం చెయ్యండి. ఏవిధంగా మొదటి వికారమును పూర్తిగా సంకల్పరూపము నుండి కూడా తొలగించేందుకు నిశ్చయము చేసుకున్న కారణముగా అందులో చాలామంది విజయులుగా అయ్యారు కదా. మీ ప్రతిజ్ఞపైనే ఆధారము ఉంది. ఏ విషయము యొక్క ఫోర్స్ ద్వారా ప్రతిజ్ఞ చేస్తారో ఆ ప్రతిజ్ఞ ప్రాక్టికల్ రూపము తీసుకుంటుంది. ఇది అంతిమ కోర్సు అని ఒకవేళ భావించినట్లయితే రిజల్టు ఏమౌతుంది? ప్రాక్టికల్ ఉండదు. ప్రాక్టీసే ఉండిపోతుంది. ఈ విషయాలనైతే ముందు దాటాలి. ఒకవేళ అంతిమము వరకు క్రాస్ చేస్తూ ఉన్నట్లయితే పూర్తి అతీంద్రియ సుఖపు వారసత్వాన్ని ఎప్పుడు ప్రాప్తి చేసుకుంటారు? చాలా విషయాలు ఎటువంటివంటే, వాటిలో ప్రతి ఒక్కరూ తమ తమ యథా శక్తితో దాటివేస్తూ కొందరు కొన్ని విషయాలలో, కొందరు కొన్ని విషయాలలో ప్రాక్టీసుకు బదులుగా ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చారు. ఉదాహరణకు లౌకిక దేహ సంబంధపు విషయములో కొందరు ప్రాక్టీసులో ఉన్నారు, కొందరు ప్రాక్టికల్ లో ఉన్నారు, ఒకే అలౌకిక పారలౌకిక అనుభవములో ఉన్నారు. స్వప్నములో కూడా ఎప్పుడూ సంకల్పరూపములో దేహ సంబంధీకుల వైపుకు వృత్తి మరియు దృష్టి వెళ్ళకూడదు. ఇందులో పాండవులు కూడా క్రాస్ చెయ్యాలి. లౌకికమును అలౌకికములోకి పరివర్తన చేసే స్మృతి వచ్చినట్లయితే అది కల్యాణార్థము అయినట్లు. మీరైతే మధువనపు భట్టిలో ఉంటారు కదా? మరి మొదటి మెట్లను దాటివేయాలి కదా! ఒక క్షణము ముందులేని దానిని ఇప్పటి ఈ క్షణములో తీసుకురాలేరా? మీరు మధువనపు పాండవులు, యూనివర్సిటీ స్టూడెంట్లు. ఏదో చిన్న గీతా పాఠశాల స్టూడెంట్లు కారు. మరి వీరికి ఎంత నషా ఉండాలి! వీరి చదువు ఎంత ఉన్నతమైనది! ఎటువంటి అద్భుతమును చేసి చూపించాలంటే క్షణకాలము ముందు మీపై విజయులవుతారు అని నమ్మకము లేకపోయినా కానీ మరుక్షణంలో వారందరూ నమ్మకము కలిగినవారుగా అయిపోవాలి. మహావీర సైన్యము ఏం చేసింది? మొత్తము లంకను కాల్చేసినప్పుడు మరి మీరు ఈ మెట్టును దాటి వెయ్యలేరా? మొదటి మెట్టు ఏమిటో చెప్పాము. రెండవ మెట్టు- కర్మేంద్రియాలపై విజయము. మూడవది- వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలపై విజయము. ఇదే చివరిది. కానీ రెండవదానిని కూడా దాటివెయ్యాలి, మేము ఫుల్ పాస్ అని ఉల్లాస-ఉత్సాహాలతో చెప్పగలగాలి. రెండవ మెట్టు అయితే చాలా సహజమైనది. మరజీవాగా అయినప్పుడు ఈ పాత కర్మేంద్రియాల ఆకర్షణ ఎందుకు? మరజీవాగా అయ్యారంటే అన్నీ సమాప్తమైపోయాయి కదా! ఫలానావారు ఈ ఆయుష్షు వరకు ఉంటారు, తరువాత చనిపోతారు అని జన్మపత్రిని చూసి చెప్తుంటారు, కానీ ఒకవేళ ఏదైనా దానపుణ్యాలు చేసినట్లయితే నూతన జన్మరూపంలో నూతన ఆయువు మొదలవుతుంది. కావున అటువంటి మరజీవాగా అయ్యారు అనగా అన్ని వైపుల నుండి చనిపోయారు కదా! పాత ఆయువు సమాప్తమైపోయింది, ఇప్పుడైతే నూతన జన్మ ప్రారంభమయ్యింది. అందులో బ్రహ్మాకుమారీ- బ్రహ్మాకుమారులుగా అయ్యారు. బ్రహ్మాకుమారీ - బ్రహ్మాకుమారులకు కర్మేంద్రియాలపై విజయము ఉండకపోవటము అన్నది జరగగలదా? పాత లెక్కాచారాలు ఉన్నట్లయితే అవి సమాప్తమైపోయాయి. మరజీవాగా అయినప్పుడు, బ్రహ్మాకుమారులుగా అయినప్పుడు మళ్ళీ కర్మేంద్రియాలకు ఎలా వశమవ్వగలరు? బ్రహ్మాకుమారుల నూతన జీవితములో కర్మేంద్రియాలకు వశమవ్వటము అంటే ఏమిటి అన్న ఈ జ్ఞానము నుండి కూడా దూరంగా ఉంటారు. ఇప్పుడు శూద్రతనము నుండి మరజీవాగా అవ్వలేదా, లేక ఇప్పుడు అవుతున్నారా? శూద్రతనపు శ్వాస అనగా సంస్కారము కాస్త అయినా ఎక్కడా అడ్డుకొని లేదు కదా? కొందరి శ్వాస దాగి ఉంటుంది, మరల అది కొంత సమయము తరువాత ప్రకటితమవుతుంది. ఇక్కడ కూడా అలా ఏమైనా ఉందా? పాత సంస్కారాలు అడ్డుగా చిక్కుకొని ఉన్నట్లయితే మరజీవాగా అయ్యారు అని ఎలా అంటారు? మరజీవాగా అవ్వనట్లయితే బ్రహ్మాకుమారులని ఎలా అంటారు? మరజీవాగా అయితే అయ్యారు కదా! మిగిలినవి మనసా సంకల్పాలు, బ్రహ్మాకుమారులుగా అయిన తరువాతనే మాయ వస్తుంది. శూద్రకుమారుల వద్దకు మాయ వస్తుందా? మీరు ఎందుకు తికమక చెందుతారు? మరజీవాగా అయ్యాము అని చెప్పండి. మరజీవాగా అయిన తరువాత మాయకు ఛాలెంజ్ చేసారు, కనుకనే మాయ వస్తుంది. దానితో యుద్ధము చేసి మేము విజయులుగా అవుతాము అని ఎందుకు అనరు! మహావీరులు కాబట్టి మీ నషాను కూడా స్థిరంగా ఉంచుకోండి కదా! ఎప్పుడైతే స్వయమును బ్రహ్మాకుమారులుగా భావిస్తారో అప్పుడు మళ్ళీ కర్మేంద్రియాల ఆకర్షణ అనే ఈ రెండవ మెట్టు ఏదైతే ఉందో దాని నుండి కూడా దూరమైపోతారు. బ్రహ్మాకుమారులు మరియు శివకుమారులు... ఈ రెండింటి స్మృతిని ఉంచుకోవటం ద్వారా ఎప్పుడూ ఫెయిల్ అవ్వజాలరు. ఎందుకంటే బ్రహ్మాకుమారులుగా భావించటం ద్వారా అప్పుడు బ్రహ్మాకుమారుల కర్తవ్యము ఏమిటి, బ్రహ్మాకుమారుల గుణము ఏమిటి అన్నది కూడా స్మృతిలో ఉంటుంది కదా. కావున ఇప్పుడు రెండవ మరియు మూడవ మెట్టును దాటివేసి పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు, సమీపంగా వచ్చేందుకు ఈ భట్టీని చేసారు. మరి భట్టీ సమాప్తితో పాటు దీనిని కూడా సమాప్తి చేసెయ్యాలి. చూడండి, స్థానము ఆధారంగా స్థితి తయారవుతుంది. ఈ మధువనపు స్థానము ఎటువంటిదంటే అది స్థితిని కూడా మార్చేస్తుంది కదా! స్థితిపై స్థానముయొక్క ప్రభావము ఉంటుంది. ప్రతిఒక్కరికీ తమ స్థానపు నషా ఎంతగా ఉంటుంది! తమ దేశపు, తమ హద్దు నివాస స్థానపు(ఇంటి) నషా ఉండదా? పెద్ద బంగళా లేక మహల్ లో నివాసము చేసేవారైతే, స్థితిపై స్థానపు ప్రభావము ఉంటుంది. మరి మీరు అందరికంటే శ్రేష్ఠ స్థానములో ఉన్నారు, కావున దీని ప్రభావము కూడా స్థితిపై ఉండాలి. శ్రేష్ఠ వరదానీ భూమి నివాసులు, కావున మీ స్థితిని కూడా సదా అందరికి ఇచ్చేవారిగా తయారుచేసుకోవాలి.
ఎవరైతే సాక్షాత్కారమూర్తులుగా ఉంటారో వారే వరదానమును ఇవ్వగలరు. ఎవరైనా భక్తులకు కూడా వరదానము ప్రాప్తించినట్లయితే అది కూడా సాక్షాత్కారమూర్తుల ద్వారా జరుగుతుంది కదా! కావున సాక్షాత్ మరియు సాక్షాత్కారమూర్తులుగా అవ్వటం ద్వారానే వరదానమూర్తిగా అవ్వగలరు. దాత అయిన బాబా పిల్లలు దాతలుగా అవ్వాలి. తీసుకొనేవారుగా కాదు, ఇచ్చేవారుగా అవ్వాలి. ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో ఇవ్వాలి. దాతగా అయినప్పుడు మరి దాత యొక్క ముఖ్య గుణము ఏముంటుంది? ఉదారచిత్తత. ఎవరైతే ఇతరులను ఉద్ధరించేందుకు నిమిత్తులుగా అవుతారో, మరి వారు తమ ఉద్ధారమును చేసుకోలేరా? మేము దాత పిల్లలము అని ఎల్లప్పుడూ భావించండి, ఒక్క క్షణము కూడా ఇవ్వకుండా ఉండలేము. వీరినే మహాదానులు అని అంటారు. ఇచ్చే ద్వారము ఎల్లప్పుడూ తెరచి ఉండాలి. మందిర ద్వారము కూడా ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది కదా! ఈ రోజుల్లో అయితే మూసివేస్తున్నారు. కావున అటువంటి దాత పిల్లల ఇచ్చే ద్వారము ఎప్పుడూ మూసి ఉండదు. ఏమైనా ఇచ్చానా? తీసుకోనైతే లేదు కదా? అని ప్రతి క్షణము, ప్రతి సంకల్పమును పరిశీలించుకోండి. ఇస్తూ వెళ్ళండి. తీసుకోవటమైతే తండ్రి నుండి తీసుకోవాలి, దానినైతే తీసుకుంటూనే ఉన్నారు, ఇక ఇప్పుడు ఇవ్వాలి. తీసుకొనేందుకు ఇంకా ఏమైనా మిగిలి ఉందా? ఏదైతే తీసుకొనేది ఉందో దానినంతా తీసుకొన్నారు. ఇక మిగిలినది ఇవ్వటము. ఇవ్వటంలో బిజీగా ఉన్నట్లయితే ఈ విషయాలు ఎవరికైతే దాటడము కష్టమనిపిస్తుందో అవి కూడా చాలా సహజమైపోతాయి ఎందుకంటే మహాదానులుగా అవ్వటం ద్వారా మహాన్ శక్తి యొక్క ప్రాప్తి స్వతహాగనే కలుగుతుంది. కావున ఈ కార్యమైతే చాలా మంచిది కదా! ఇచ్చేందుకైతే భండారా నిండుగా ఉంది కదా! ఇందులో ఫుల్ పాస్ లేనా? ఎందులో ఫుల్ పాస్ గా ఉన్నారో అందులో రైట్ గుర్తు పెట్టుతూపోండి. ఫుల్ పాస్ అవ్వాలి అని ఎందులో అయితే భావిస్తారో అందులో ఫుల్ పాస్ లుగా అయ్యి భట్టీ నుండి వెలువడాలి. ఎంతగా దాతలుగా అవుతారో అంతగా నిండుతూ ఉంటుంది. భండారా నిండుగా ఉన్నట్లయితే ఎందుకని దాతగా కాకూడదు! నిరంతర ఆత్మిక సేవాధారి అని వారినే అంటారు. కావున ఈ భట్టీ నుండి నిరంతర ఆత్మిక సేవాధారులుగా అయ్యి వెళ్ళాలి.
ఎప్పటివరకైతే త్యాగము ఉండదో అప్పటివరకు సేవాధారులుగా అవ్వజాలరు. సేవాధారిగా అవ్వటం ద్వారా త్యాగము సహజము మరియు స్వతహాగా జరిగిపోతుంది. ఎల్లప్పుడూ మిమ్మల్ని బిజీగా ఉంచుకొనేందుకు పద్ధతి ఇదే. సంకల్పముల నుండి, బుద్ధి నుండి, స్థూల కర్మణ నుండి ఎంతగా ఫ్రీగా ఉంటారో అంతగానే మాయ అవకాశాన్ని తీసుకుంటుంది. ఒకవేళ స్థూలము మరియు సూక్ష్మము రెండు రూపాలతో స్వయాన్ని ఎల్లప్పుడూ బిజీగా ఉంచుకున్నట్లయితే మాయకు అవకాశము లభించదు. ఏ రోజైతే స్థూల కార్యమును కూడా చాలా ఇష్టముతో, శ్రద్ధతో చేస్తారో ఆ దినమును పరిశీలించినట్లయితే మాయ రాదు, ఒకవేళ దేవతలుగా అయ్యి చేసినట్లయితే. ఒకవేళ మనుష్యులుగా అయ్యి చేసినట్లయితే మళ్ళీ అవకాశమిచ్చినట్లు, సేవాధారులుగా మరియు దేవతలుగా అయ్యి చాలా అభిరుచి, ఉల్లాసములతో స్వయమును బిజీగా ఉంచుకొని చూసినట్లయితే మాయ ఎప్పుడూ రాదు. సంతోషము ఉంటుంది. సంతోషము కారణంగా ముందుకు రావటానికి మాయ సాహసము చెయ్యదు. కావున బిజీగా ఉంచుకొనే ప్రాక్టీసు చెయ్యండి. ఎప్పుడైనా చూడండి, ఈ రోజు బుద్ధి ఫ్రీగా ఉన్నట్లయితే స్వయమే టీచరుగా అయ్యి బుద్ధి నుండి పనిని తీసుకోండి. ఏవిధంగా స్థూల కార్యముల కొరకు ఈ రోజు మొత్తంలో ఈ ఈ పనులు చెయ్యాలి అని డైరీని తయారుచేసుకుంటారో, ప్రోగ్రామును తయారు చేస్తారో, మళ్ళీ పరిశీలించుకుంటారో, అదేవిధంగా మీ బుద్ధిని బిజీగా ఉంచుకొనేందుకు కూడా డైలీ ప్రోగ్రాము ఉండాలి. ప్రోగ్రాము ద్వారా ప్రోగ్రెస్ చెయ్యగలరు. ఒకవేళ ప్రోగ్రాము లేనట్లయితే ఏ కార్యము కూడా సమయానికి సఫలమవ్వదు. డైలీ(రోజంతటి) డైరీ ఉండాలి. ఎందుకంటే అందరూ చాలా పెద్దవారు కదా! పెద్ద మనుష్యులు ప్రోగ్రామును ఫిక్స్ చేసుకొనే ఎక్కడికైనా వెళ్తారు. కావున మిమ్మల్ని కూడా చాలా పెద్దవారైన తండ్రి పిల్లలుగా భావించుకొని ప్రతి క్షణానికి కూడా ప్రోగ్రామును ఫిక్స్ చెయ్యండి. ఏవిషయంలో అయితే ప్రతిజ్ఞ చెయ్యబడుతుందో అందులో విల్ పవర్ ఉంటుంది. అలాగే కేవలము ఆలోచన చేస్తే అందులో విల్ పవర్ ఉండదు, కావున ఇది చెయ్యాల్సిందే అని ప్రతిజ్ఞ చెయ్యండి. చూస్తాములే, చేస్తాములే అని అనుకోకూడదు, చెయ్యాల్సిందే. స్థూల కార్యము కూడా అది ఎంత ఎక్కువగా ఉన్నా గానీ ప్రతిజ్ఞను చెయ్యటం ద్వారా చేసేస్తారు కదా! ఒకవేళ ఢీలా ఆలోచన ఉన్నట్లయితే, చేసే ఉద్దేశము లేనట్లయితే ఎప్పుడూ పూర్తి చెయ్యలేరు. మళ్ళీ సాకులు కూడా చాలా తయారవుతాయి. ప్రతిజ్ఞ చెయ్యటం ద్వారా సమయము కూడా దొరుకుతుంది మరియు సాకులు కూడా పోతాయి. ఈరోజు బుద్ధిని ఈ ప్రోగ్రాముపై నడిపించాల్సిందే - ఇలా ప్రతిజ్ఞ చెయ్యాలి. భిన్న భిన్న సమస్యలు, పురుషార్థహీనులుగా తయారు చేసే వ్యర్థ సంకల్పాలు, సోమరితనము మొదలగునవి వస్తాయి. కానీ విల్ పవర్ ఉన్న కారణంగా వాటిని ఎదుర్కొని విజయులుగా అయిపోతారు. దీనికి కూడా డైలీ డైరీ తయారు చెయ్యండి, మరల అప్పుడిక చూడండి - ఆత్మిక సుఖాన్ని ఇచ్చే ఆత్మ అందరికీ ఎలా కనిపిస్తుందో! రూహ్ అని ఆత్మనే అంటారు మరియు రూహ్ అని ఎసెన్స్ ను కూడా అంటారు. కావున రెండు రకాలుగా అయిపోతారు. దివ్యగుణాల ఆకర్షణ అనగా ఎసెన్స్ ఉన్నవారు రూహ్ గా కూడా ఉంటారు మరియు ఆత్మిక స్వరూపము కూడా కనిపిస్తుంది, ఇటువంటి లక్ష్యమును ఉంచుకోవాలి. కావున రూప విస్మృతి, రూహ్ స్మృతి, ఈ భట్టీ నుండి ఇది తయారుచేసుకొని వెళ్ళాలి. ఈ శరీరము ఒక బాక్సు వంటిది అని పూర్తిగా అటువంటి అనుభవము ఉండాలి. ఈ బాక్సు లోపల ఉన్న రత్నము ఏదైతే ఉందో దానితోనే సంబంధము - స్నేహము. అలా అనుభవము చెయ్యాలి. కావున నివాస స్థానమును కూడా ఆధారముగా తీసుకొని స్థితిని తయారు చేసుకోండి. అచ్ఛా!
Comments
Post a Comment