28-06-1973 అవ్యక్త మురళి

* 28-06-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“యోగయుక్తులుగా అవ్వడం ద్వారా స్వతహాగానే యుక్తియుక్తమైన సంకల్పాలు, మాటలు, కర్మలు జరుగుతాయి”

          ఏ విధంగా స్థూలమైన మిలట్రీ వారికి ఒక్క క్షణంలో ఎక్కడున్నారో అక్కడ, ఎలా ఉన్నారో అలా అక్కడే నిలిచిపోండి అని ఆర్డరిస్తారో, అప్పుడు వారు ఆ ఆర్డర్‌ను గూర్చి ఆలోచించడంలో మరియు అర్థం చేసుకోవడంలోనే సమయాన్ని గడిపేసినట్లయితే దాని రిజల్టు ఏమౌతుంది? విజయం యొక్క ప్లాను ప్రాక్టికల్ రూపంలోకి రాజాలదు. అదేవిధంగా సదా విజయులుగా అయ్యేవారి విశేషత ఏమిటంటే, వారు క్షణంలో తమ సంకల్పాలను ఆపేసుకుంటారు. ఏదైనా స్థూల కార్యంలో లేక జ్ఞానమును మననం చేసుకోవడంలో ఎంతో బిజీగా ఉన్నా కాని అటువంటి సమయంలో కూడా తమను తాము ఒక్క క్షణంలో ఆపుకోగలగాలి.

           ఏ విధంగా వారు ఎంతో వేగంగా పరిగెడుతున్నా లేక చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నా, అటువంటి సమయంలో కూడా స్టాప్ అని అనగానే ఒక్క క్షణంలో ఆగిపోతారు. అదేవిధంగా ఏ సమయంలోనైనా సంకల్పాలు నడిపించకూడదు అని అనుకున్నప్పుడు, ఈ సమయంలో మననం చేసేందుకు బదులుగా బీజరూప స్థితిలో స్థితులైపోవాలి అని అనుకున్నట్లయితే ఆ విధంగా ఒక్కక్షణంలో ఆపేయగలరా? ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలను ఎలా కావాలనుకుంటే అలా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఒక్క క్షణంలో ఉపయోగించగలరో అలా వాటి పైన అధికారం ఉంది కదా!అలాగే బుద్ధి మరియు సంకల్పాలపై కూడా అధికారులుగా అయ్యారా? ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటే పెట్టగలరా? అటువంటి అభ్యాసం ఉందా? విస్తారంలోకి వెళ్ళేందుకు బదులుగా ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలిగే విధంగా అటువంటి స్థితి ఉందని భావిస్తున్నారా? ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ను తీసుకునేందుకు వెళ్ళినప్పుడు కావాలనే వారితో వేగంగా డ్రైవ్ చేయించి, మళ్ళీ వెంటనే వారిని ఆపివేయడం జరుగుతుంది లేక వెనక్కి రమ్మని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా అభ్యాసమే కదా! కావున మీ బుద్ధిని నడిపించే లేక నిలిపి ఉంచే అభ్యాసం కూడా చేయాలి. ఎప్పుడైతే ఇటువంటి సమయంలో ఒక్క క్షణంలో ఆపివేయగలరో అప్పుడే దానిని అద్భుతము అని అంటారు. ఎవరికైతే యుక్తియుక్తమైన సంకల్పాలు లేక యుక్తియుక్తమైన మాటలు లేక యుక్తియుక్తమైన కర్మలు జరుగుతాయో లేక ఎవ్వరి ఒక్క సంకల్పమైనా వ్యర్థమవ్వదో వారినే నిరంతర విజయులు అని అంటారు. ఎప్పుడైతే ఏదైనా సేవలో పూర్తిగా విజయులవ్వవలసిన సందర్భంలో ఒక్క క్షణంలో దానిని కూడా స్టాప్ చేసే అభ్యాసమును ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇది జరుగుతుంది.

           ఇప్పుడు సమయం ఎటువంటిది వస్తోందంటే, దీని ద్వారా మొత్తం ప్రపంచానికి మంటలు అంటుకుంటాయి. ఆ మంటల నుండి రక్షించుకునేందుకు ముఖ్యంగా రెండు విషయాలు అవసరము. ఎప్పుడైతే వినాశనపు మంటలు నలువైపులా వ్యాపిస్తాయో ఆ సమయంలో శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క మొదటి కర్తవ్యము - శాంతి దానమును అనగా సఫలత యొక్క శక్తిని ఇవ్వడము. దాని తర్వాత ఇంకేం కావాలి? ఆ తర్వాత ఎవరికి ఏది అవసరమో అది పూర్తి చేయడం జరుగుతుంది. మీరు అటువంటి సమయంలో వారి యొక్క ఏ అవసరాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది? ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ వేరు వేరు శక్తుల అవసరం ఉంటుంది. కొందరికి సహించే శక్తి అవసరం ఉంటుంది, మరికొందరికి చదువుకునే శక్తి అవసరం ఉంటుంది, మరికొందరికి నిర్ణయం తీసుకునే శక్తి అవసరం ఉంటుంది, మరికొందరికి ముక్తి అవసరం ఉంటుంది. ఎవరికి ఏ ఆశ ఉంటే వారి ఆ ఆశను పూర్తి చేసేందుకు బాబా పరిచయం ద్వారా ఒక్క క్షణంలో అశాంత ఆత్మను శాంతింపజేసే శక్తి కూడా ఆ సమయంలో అవసరమే. కావున ఈ శక్తులన్నింటినీ ఇప్పటినుండే పోగుచేసుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ప్రాణదానమును ఎలా ఇవ్వగలరు? మొత్తం విశ్వంలోని సర్వ ఆత్మలకు శక్తుల దానమును ఇవ్వవలసి ఉంటుంది. ఎంతటి స్టాకును జమ చేసుకోవాలంటే, స్వయం కూడా తమ శక్తి యొక్క ఆధారంపై నడిపించగలగాలి మరియు ఇతరులకు కూడా ఇవ్వగలగాలి, ఎవ్వరూ వంచితమవ్వకూడదు. ఒక్క ఆత్మ వంచితమైనా కాని ఆ భారం ఎవరిపై పడుతుంది? ప్రాణదానమును ఇచ్చేందుకు నిమిత్తులై ఉన్న వారి పైనే పడుతుంది కదా! కావున మీ ప్రతి శక్తి యొక్క స్టాకును పరిశీలించుకోండి. ఎవరివద్దనైతే శక్తుల స్టాకు జమ అయి ఉంటుందో వారే లక్కీ స్టారుల రూపంలో విశ్వంలోని ఆత్మల మధ్య ప్రకాశిస్తూ కనిపిస్తారు. కావున ఇప్పుడు ఇటువంటి చెకింగ్ చేసుకోవాలి.

           అమృతవేళ లేచి స్వయమును అటెన్షన్ రూపీ పట్టాలపై నడిపించాలి. పట్టాలపై బండ్లు సరిగ్గా నడుస్తాయి కదా! మీపై మొత్తం విశ్వపు బాధ్యత ఉంది, కేవలం భారతదేశానిది కాదు. శ్రేష్ఠ ఆత్మల ప్రతి అడుగు ఉన్నతోన్నతమైనదే కదా! కావున రోజంతటిలో అటువంటి మాటలేవీ వెలువడడం లేదు కదా! అలాగే మనస్సులో వ్యర్థ సంకల్పాలేవీ కలగడం లేదు కదా! లేక కర్మలేవీ తప్పుగా జరగడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ప్రతి సంకల్పం పైనా మొదటి నుండే అటెన్షన్ ఉండాలి. యోగయుక్తులుగా ఉండడం ద్వారా ఆటోమేటిక్ గానే యుక్తియుక్తమైన సంకల్పాలు, మాటలు మరియు కర్మలు జరుగుతాయి. అచ్ఛా!

Comments