27-09-1975 అవ్యక్త మురళి

27-09-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బేహద్ వైరాగి త్యాగి మరియు సేవాధారులే విశ్వ మహరాజులు. 

                     మనుష్యాత్మలకు ప్రకాశాన్ని మరియు శక్తిని ఇచ్చేవారు, విశ్వ మహరాజు యొక్క శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని ప్రాప్తింపచేసేవారు, దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు, ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షించే పురుషార్థం చేయించేవారు, విశ్వ కళ్యాణకారి పరమాత్మ శివబాబా మాటాడుతున్నారు -
                    ఆత్మిక మిలనం అనేది వాణి ద్వారా అవుతుందా లేక వాణికి అతీతంగా అయితే ఆత్మిక మిలనం అవుతుందా? అంతిమ స్థితి అనేది వాణికి అతీతంగా, ఒక్క సెకెండులో ఆత్మిక దృష్టి యొక్క మెరుపు చూపించే విధంగా ఉంటుంది. మెరుపు చూపించండి అనే మహిమ ఉంది. నయనాల ద్వారా మస్తకమణి యొక్క మహిమ ఉంది. అంతిమ సమయంలో దృష్టి ద్వారా అద్భుతం చేసే మహిమ ఉంది. మీరు ప్రతి ఒక్కరు లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ యొక్క స్థితిలో ఉంటే ఒక్క స్థానంలో స్థితులై ఉంటూ కూడా విశ్వం యొక్క నలువైపులా మీ యొక్క ప్రకాశాన్ని ఇచ్చే కర్తవ్యం చేయగలరు. విశ్వమహరాజుగా అయ్యేవారు, లైట్ మరియు మైట్‌హౌస్ గా ఉంటారు. రాజ్య పదవి పొందేవారు సంప్రదింపుల్లోకి వచ్చేటటువంటి షావుకారులు (ధనవంతులు) లేదా ప్రజలు. లైట్ హౌస్ గా ఉండరు. కానీ లైట్ స్వరూపంలో ఉంటారు. లైట్‌హౌస్ మరియు మైట్‌హౌస్ రెండింటిలో తేడా ఉంది. ఎప్పటి వరకు విశ్వ సేవకులు అవ్వరో అప్పటి వరకు విశ్వ మహరాజుగా కాలేరు. విశ్వ మహరాజుగా అయ్యేటందుకు మూడు స్థితులను దాటవలసి ఉంటుంది. మొదటి స్థితి ఒక్క సెకెండులో బేహద్ త్యాగి, ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టేవారు కాదు. వెంటనే మరియు ఒక్క దెబ్బతో బాబాకు బలిహరం అయిపోయేవారు. రెండవ విషయం బేహద్ మరియు నిరంతర అలసిపోని సేవాధారి మరియు మూడవ విషయం సదా బేహద్ వైరాగ్యవృత్తి కలవారు. బేహద్ త్యాగి, బేహద్ సేవాధారి మరియు బేహద్ వైరాగి, ఈ మూడు స్థితులను దాటేవారే విశ్వమహరాజుగా కాగలరు మరియు అంతిమంలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ గా అవ్వగలరు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - మూడు స్థితుల్లో ఏ స్థితి వరకు చేరుకున్నాను? స్వయానికి స్వయమే న్యాయమూర్తులు అవ్వండి. ధర్మరాజుపురికి వెళ్ళే ముందు ఎవరైతే స్వయానికి స్వయం న్యాయమూర్తులు అవుతారో వారే ధర్మరాజుపురి యొక్క శిక్షల నుండి రక్షింపబడతారు. బాబా కూడా పిల్లలను ధర్మరాజుపురిలో చూడాలనుకోవడం లేదు. ధర్మరాజుపురి యొక్క శిక్షల నుండి రక్షించుకునేటందుకు సహజ ఉపాయం ఏమిటో తెలుసా? అజ్ఞాన కాలంలో కూడా చెబుతారు - ఆలోచించి అర్థం చేసుకుని పనిచేయండి. మొదట ఆలోచించండి, తరువాత కర్మ చేయండి లేదా మాట్లాడండి. ఒకవేళ ఆలోచించి అర్థం చేసుకుని కర్మ చేస్తే వ్యర్ధ కర్మకి బదులు ప్రతి కర్మ సమర్థంగా అవుతుంది. కర్మ చేసే ముందు ఆలోచన అనగా సంకల్పం ఉత్పన్నమవుతుంది. ఈ సంకల్పమే బీజం. బీజం అనగా సంకల్పం శక్తిశాలిగా ఉంటే మాట మరియు కర్మ స్వతహగానే శక్తిశాలిగా ఉంటాయి. అందువలన వర్తమాన సమయం యొక్క పురుషార్ధంలో ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా తయారుచేసుకోవాలి. సంకల్పమే జీవితం యొక్క శ్రేష్ట ఖజానా. ఎలాగైతే స్థూల ఖజానా ద్వారా ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత పొందవచ్చో, అలాగే శ్రేష్ట సంకల్పం ద్వారా కూడా సదాకాలిక శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని పొందగలరు. సదా ఈ చిన్న సూక్తిని స్మృతిలో ఉంచుకోండి - ఆలోచించి, అర్థం చేసుకుని కర్మ చేయాలి మరియు మాట్లాడాలి. అప్పుడు సదాకాలికం కొరకు శ్రేష్ట జీవితం తయారు చేసుకోగలరు మరియు ధర్మరాజుపురి యొక్క శిక్షల నుండి కూడా రక్షించుకోగలరు. న్యాయమూర్తి యొక్క పని ఏమటి? ఆలోచించి అర్థం చేసుకుని నిర్ణయం ఇవ్వడం. అదేవిధంగా ప్రతి సంకల్పంలో మీకు మీరు న్యాయమూర్తిగా అవ్వండి. దీని ద్వారా స్వర్గంలో కూడా విశ్వమహరాజు అనే శ్రేష్ట పదవిని ప్రాప్తింపచేసుకోగలరు. మంచిది.
                   ఈరోజు విశేషంగా కొత్త కొత్త పిల్లలను కలుసుకునేటందుకు బాప్ దాదా కూడా పాత ప్రకృతిని ఆజ్ఞ చేసుకోవాల్సి వచ్చింది. కొత్త పిల్లల యొక్క బలిహరం బాబాని కూడా మీ సమానంగా తయారుచేసింది. బాప్ దాదా కూడా ఇలాంటి గారాబ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క సంలగ్నత, స్నేహము మరియు మిలనం జరుపుకోవాలనే ధ్యని బాప్ దాదా దగ్గరికి సదా చేరుకుంటుంది. దానికి బదులిచ్చేటందుకు బాప్ దాదా కూడా రావాల్సి వస్తుంది. మంచిది.
                  ఈవిధంగా అతి స్నేహి, గారాబ, సదా ఒకరి సంలగ్నతలోనే నిమగ్నం అయ్యి ఉండేవారు, లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ డివిజనులోకి వచ్చే తీవ్ర పురుషార్థీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments