27-09-1971 అవ్యక్త మురళి

* 27-09-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"స్నేహ శక్తి ద్వారా సత్యత యొక్క ప్రత్యక్షత"

           ఈ సమయంలో అందరి స్మృతిలో, నయనాలలో ఏమి ఉంది? ఒక్క బాబా ఉన్నారా లేక ఇద్దరూ ఉన్నారా లేక ఒక్కరిలో ఇద్దరు ఉన్నారా? ఎవరు ఉన్నారు? (ఒక్క బాబాయే ఉన్నారు). ఈ రోజు అందరూ ఒకే మతంలో మరియు ఒకే విషయంపై ఉన్నారు. అచ్ఛా, ఈ సమయంలో అయితే ఒకే విషయం ఉంది  కాని వర్తమాన సమయంలోని సృతిలో లేక నయనాలలో సదా ఏమి ఉంటోంది? లేక కేవలం ఇంటికి వెళ్ళాలి అన్నది మాత్రమే గుర్తు ఉంటోందా? సేవ చేయకుండా ఎలా వెళ్ళగలరు? వారసత్వం కూడా మీ గూర్చి అయితే స్మృతిలో ఉంది, కాని ఇతరులకు కూడా వారసత్వాన్ని ఇప్పించాలి అన్నది కూడా గుర్తుండాలి. ప్రతి అడుగులో, స్మృతిలో బాబా స్మృతి మరియు దానితో పాటు సేవ కూడా ఉంటోందా లేక కేవలం స్మృతి ఉంటోందా? ఇంకేమి ఉండాలి? నడుస్తూ, తిరుగుతూ కర్మ చేస్తూ మేము అన్నివేళలా ఈశ్వరీయ సేవార్థము నిమిత్తమై ఉన్నాము, స్థూల కార్యము చేస్తూ కూడా ఈశ్వరీయ సేవ కొరకు నిమిత్తులమై ఉన్నాము అన్న స్మృతి ఉన్నట్లయితే ఈ స్మృతి ఉండడం ద్వారా, ఎల్లప్పుడూ నిమిత్తంగా భావించడం ద్వారా డిస్ సర్వీస్ అయ్యే కర్మలేవీ జరుగవు. ఈ స్మృతిని మర్చిపోయినప్పుడే సాధారణ కర్మలు లేక సాధారణరీతిగా సమయము గతిస్తూ ఉంటుంది. ఏదైనా విశేష సేవార్థము నిమిత్తమైనట్లయితే ఎంత సమయమైతే విశేష సేవారూపము మీ ముందు ఉంటుందో అంత సమయం యొక్క స్టేజి లేక స్థితి మంచిగా ఉంటుంది కదా! ఎందుకంటే మేము ఈ సమయంలో అందరి ముందు సేవ కొరకు నిమిత్తంగా ఉన్నాము అని భావిస్తారు. అలాగే స్థూల కార్యము చేస్తూ కూడా ఈ సమయంలో మనస్సు ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే సేవలో ఉపస్థితులమై ఉన్నాము అని భావించినట్లయితే ఎటువంటి స్థితి ఉంటుంది, ఎటువంటి అటెన్షన్ ఉంటుంది? ఎటువంటి చెకింగ్ జరుగుతుంది? అదేవిధంగా సదా స్వయమును విశ్వ స్టేజిపై విశ్వకళ్యాణ సేవార్థము ఉన్నాము అని భావించినట్లయితే సాధారణ స్థితి, సాధారణ నడవడిక లేక నిర్లక్ష్యము ఉంటుందా? మరియు ఎంత సమయం వ్యర్థంగా పోవడం నుండి సఫలమైపోతుంది! జమ ఖాతా ఎంతగా పెరుగుతుంది! ఎవరిపైనైనా చాలా బాధ్యత ఉన్నట్లయితే వారు తమ ఒక్కొక్క క్షణము అమూల్యమైనదని భావిస్తారు. ఒకటి, రెండు నిమిషాలు వ్యర్థమైనా కాని వారికి ఆ రెండు నిమిషాలు కూడా ఎంతో పెద్దగా కనిపిస్తాయి. కావున అందరికన్నా ఎక్కువ బాధ్యత మీపై ఉంది, ఇంకెవ్వరికీ ఈ సమయంలో మీకు ఉన్నంత పెద్ద బాధ్యత లేదు. కావున మొత్తం విశ్వకళ్యాణము చేయాలి, జఢము, చైతన్యము రెండింటినీ పరివర్తన చేయాలి, ఇది ఎంత పెద్ద బాధ్యత! కావున అన్నివేళలా ఈ సమయంలో బాబా మాకు ఏ డ్యూటీని ఇచ్చారు అన్నది స్మృతిలో ఉండాలి. ఒక కంటిలో బాబా స్నేహము, ఇంకో కంటిలో బాబా ద్వారా లభించిన కర్తవ్యము అనగా సేవ ఉండాలి. కావున స్నేహము మరియు సేవ రెండూ జతలో ఉండాలి. స్నేహులు కూడా ప్రియమైనవారే కాని సేవాధారులైన జ్ఞానీ ఆత్మలు అతిప్రియమైనవారు. కావున ఈ రెండూ కలిసి ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండింటి స్మృతి కలిసి ఉంటుందో అప్పుడే సేవ చేసే సమయంలో స్నేహీమూర్తులుగా కూడా ఉంటారు. కాని కేవలం స్నేహము మాత్రమే సరిపోదు, స్నేహంతోపాటు ఇంకేం కావాలి? (శక్తి రూపము). శక్తిరూపంగా అయితే ఉండనే ఉంటారు, కాని శక్తి రూపం యొక్క ప్రత్యక్ష రూపము ఇంకేమి కనిపిస్తుంది? సేవా రిజల్టులో నెంబరు దేని ఆధారంపై లభిస్తుంది? ఎందుకంటే వాటిలో శక్తి నిండి ఉండాలి, అనగా స్నేహంతో పాటు మాటలలో ఎటువంటి పదును ఉండాలంటే అవి వినడం ద్వారా వారి హృదయం విధీర్ణమైపోవాలి. ఇప్పటివరకు రిజల్టు ఎలా ఉంది? మరీ ఎక్కువ పదును గల శక్తినయినా చూపిస్తున్నారు లేక అతిస్నేహమైనా చూపిస్తున్నారు! మరీ సాధారణమైన రూపంలో అయినా మాట్లాడుతున్నారు లేక చాలా నషాలో అయినా మాట్లాడుతున్నారు! కాని నిజానికి ఎలా ఉండాలి? ఒక్కొక్క మాటలోను స్నేహంతో కూడుకున్న రేఖలు ఉండాలి, ఆ తరువాత ఎటువంటి కఠినమైన మాటలను మాట్లాడినా అవి హృదయానికి తప్పకుండా తగులుతాయి. ఆ పదాలు కఠినంగా అనిపించవు, యథార్థంగా అనిపిస్తాయి. ఇప్పుడు మాటలు పదునుగా ఉంటే రూపంలో కూడా ఆ కఠినత్వపు భావము కనిపిస్తూ ఉంటుంది, ఆ కారణంగానే మీలో అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది లేక అందరినీ అవమానపరుస్తారు అని అంటూ ఉంటారు. కాని ఒకవైపు అథారిటీతో మాట్లాడుతున్నా ఇంకొకవైపు దానితోపాటు స్నేహమును కూడా ఇస్తున్నట్లయితే మీ స్నేహమూర్తి ద్వారా తమను తిరస్కరిస్తున్నట్లుగా అనుభవం చేసుకోరు, ఆత్మలైన తమపై దయ చూపిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. తిరస్కారభావన మారిపోయి దయాభావనను అనుభవం చేసుకుంటారు. కావున రెండూ కలిసి ఉండాలి కదా! మఖమల్ చెప్పుతో కొట్టవలసి ఉంటుంది అని అంటారు కదా! కావున సేవతో పాటు అతి దయ కూడా ఉండాలి అలాగే  దానితోపాటు అయథార్థ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసే సంతోషం కూడా ఉండాలి.

            అన్ని విషయాలను స్పష్టంగా చెప్పాలి, కాని స్నేహంతో చెప్పాలి. స్నేహమూర్తులుగా ఉండడం ద్వారా వారికి జగన్మాత రూపము అనుభవమవుతుంది. తల్లి పిల్లలకు ఎటువంటి మాటలతో శిక్షణను ఇచ్చినాకాని ఆ తల్లి స్నేహము కారణంగా ఆ మాటలు కఠినంగా అనిపించవు. మా తల్లి స్నేహిగా ఉంది, కళ్యాణకారిగా ఉంది అని భావిస్తారు, అలాగే మీరు ఎన్ని స్పష్టమైన మాటలతో మాట్లాడినాకాని వారు అది అనుభవం చేసుకోరు. కావున ఈ విధంగా రెండు స్వరూపాల సమానతతో కూడిన సేవను చేయాలి, అప్పుడే సేవా సఫలతను సమీపంగా చూస్తారు. ఎక్కడకు వెళ్ళినా నిర్భయులుగా అయి వెళ్ళండి. సత్యతాశక్తి స్వరూపులుగా అయి ఆల్ మైటీ గవర్నమెంటు యొక్క సి.ఐ.డి ఆఫీసర్లుగా అయి అదే నషాతో వెళ్ళండి. ఈ నషాతో మాట్లాడండి, ఇదే నషాతో చూడండి. మేము అనుచరులము అన్న స్మృతితో అయ్యథార్థమును యథార్థములోకి తీసుకురావాలి. సత్యమును ప్రసిద్ధము చేయాలే కాని దాచి ఉంచకూడదు. కాని రెండు రూపాల సమానత కావాలి, ఎవరినైనా చూసినప్పుడు లేక దేనినైనా విన్నప్పుడు దయాభావంతో చూస్తున్నారా లేక వింటున్నారా  లేక నేర్చుకోవాలి, కాపీ చేయాలి అన్న లక్ష్యంతో వింటున్నారా లేక చూస్తున్నారా? ఈ రోజుల్లోని అల్ప సుఖాలను భోగించే ఆత్మలు దాసి అయిన ప్రకృతి యొక్క ప్రదర్శనలో కనిపిస్తూ ఉంటాయి. వారి ప్రదర్శనను చూసి స్థితి ఎలా ఉంటుంది? ఈ ఆత్మలు ఈ విధానము లేక ఈ ఆచార వ్యవహారాలతో ప్రకృతిని దాసిరూపంగా చేసుకొని స్టేజిపై ప్రఖ్యాతమయ్యారు, కావున మనం కూడా అలాగే చేయాలా లేక మనం కూడా వీరిలా  మనలో పరివర్తన చేయాలా? ఇటువంటి సంకల్పం కూడా వచ్చినట్లయితే వారిని ఏమంటారు? దాత పిల్లలు బికారులను కాపీ చేస్తారా? మీ ముందు ఎంతగా ప్రదర్శన చేసే ఆత్మలు ఉన్నా కాని వారు భవిష్యత్తులో ప్రత్యక్షం కానున్న బికారులే. ఈ ఆత్మలందరూ బాప్ దాదాల పిల్లలతో ఎంతో కొంత శక్తి బిందువులను ధారణ చేశారు. మీ శక్తి యొక్క అంచలిని తీసుకోవడం ద్వారా ఈ రోజుల్లో ఈ అంచలి యొక్క ఫలంగా ప్రకృతిని దాసి యొక్క ఫలరూపంలో చూస్తున్నారు. కాని అంచలిని తీసుకునేవారిని చూసి సాగరుని పిల్లలు ఏమైపోతారు? ప్రభావితమైపోతారు. వీరందరూ కొద్ది సమయంలోనే మీ చరణాలపై శిరస్సు వంచేందుకు తపిస్తారు. కావున స్నేహంతో పాటు సేవ యొక్క నషా కూడా కావాలి. ఏ విధంగా ప్రారంభంలో స్నేహము కూడా ఉండేది మరియు నషా కూడా ఉండేది, నిర్భయులుగా ఉండేవారు. వాతావరణం లేక వాయుమండలం యొక్క ఆధారం నుండి అతీతంగా ఉండేవారు. కావుననే ఏకరసమైన సేవ యొక్క ఉల్లాసము మరియు నషా ఉండేది. ఇప్పుడు వాయుమండలమును లేక వాతావరణమును చూసి అక్కడక్కడా మీ రూపురేఖలను మార్చేస్తూ ఉంటారు, కావుననే సఫలత ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది. కలియుగాంతంలోని ఆత్మలు తమ సత్యతను ప్రసిద్ధం చేసుకోవడంలో నిర్భయులుగా అయి స్టేజీ పైకి వస్తున్నారు, మరి పురుషోత్తమ సంగమయుగీ సర్వశ్రేష్ఠ ఆత్మలు తమను సత్యమైనవారిగా ప్రసిద్ధము చేసుకోవడంలో వాయుమండలము అనుసారంగా రూపురేఖలను ఎందుకు తయారుచేస్తున్నారు? మీరు మాస్టర్ రచయితలు కదా! వారంతా రచన కదా! రచనను మాస్టర్ రచయితలు ఎలా చూస్తారు? మాస్టర్ రచయిత రూపంలో స్థితులై చూసినట్లయితే ఇవన్నీ ఎటువంటి ఆటల్లా కనిపిస్తాయి? ఏ దృశ్యాన్ని చూస్తారు? వర్షం పడినప్పుడు, వర్షం పడ్డ తరువాత ఏ దృశ్యమును చూస్తారు? కప్పలు ఆ కొద్దిపాటి నీటిలో సాగరంలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటూ ఉంటాయి, బెక బెక మంటూ నాట్యం చేస్తూ ఉంటాయి. కాని అది అల్పకాలికమైన సుఖమునిచ్చే నీరు. అక్కడ కప్పలు బెక బెక మంటూ నాట్యం చేస్తూ, గెంతులు వేస్తూ ఉండే దృశ్యము కనిపిస్తుంది. ఇవి ఇప్పుడిప్పుడే అల్పకాలికమైన సుఖంలో ఎగురుతూ అంతమైపోతాయి అని అనిపిస్తుంది. కావున మాస్టర్ రచయిత స్థితిలో ఉండడం ద్వారా ఈ దృశ్యాలు కూడా అలాగే కనిపిస్తాయి, అందులో ఎటువంటి సారము కనిపించదు. మాటలు అర్థము లేకుండా కనిపిస్తాయి. కావున సత్యతను ప్రసిద్ధం చేసే ధైర్యము మరియు ఉల్లాసము కలుగుతోందా? సత్యతను ప్రసిద్ధము చేసే ఉల్లాసము కలుగుతోందా లేక అందుకు ఇంకా సమయం ఉందా? సత్యమును ప్రసిద్ధం చేసేందుకు ఇంకా సమయం మిగిలి ఉందా? మీకు నషా కూడా ఉండాలి మరియు ఆ ప్రకాశము కూడా ఉండాలి. ఎటువంటి నషా ఉండాలంటే సత్యము ముందు మనందరి యొక్క అల్పకాలికమైన ఈ ఆడంబరాలు కొనసాగజాలవు అని అనుభవం చేసుకోవాలి. ఏవిధంగా స్టేజిపై వికారాలు వీడ్కోలు తీసుకొని చేతులు జోడిస్తూ, శిరస్సు వంచి వెళుతున్నట్లుగా డ్రామాలో చూపిస్తారో, అలాగే ఈ డ్రామాను ప్రాక్టికల్ విశ్వం యొక్క స్టేజిపై చూపించాలి. ఇప్పుడు ఈ డ్రామాను హద్దులోని స్టేజి నుండి బేహద్ స్టేజి పైకి తీసుకురండి, దీనినే సేవ అని అంటారు. ఇటువంటి సర్వీసబుల్ విజయీ ఆత్మలు మాలలోని విశేషమైన మణులుగా అవుతారు. కావున ఈ విధంగా సర్వీసబుల్ గా అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడైతే ఈ అభ్యాసాన్ని చేస్తున్నారు, మొదట ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కావున చిన్న చిన్న వాటిపై వేటాడతారు ఆ తరువాత పులిని వేటాడుతారు. చివరిలోని ప్రత్యక్ష పాత్రను ఖచ్చితంగా ఈ చిన్న డ్రామా ఉన్నట్లుగా చూస్తారు. అప్పుడు ఒకవైపు జయజయకారాలు మరియు ఇంకొకవైపు హాహాకారాలు జరుగుతాయి, రెండూ ఒకే స్టేజిపై ఉంటాయి. అచ్ఛా !

Comments