* 27-07-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"అవ్యక్తమయ్యేందుకు ముఖ్యమైన శక్తుల ధారణ."
ఈరోజు బాప్ దాదా ఏ రూపంలో చూస్తున్నారు? ఒక్కొక్కరి ముఖంలో ఏమి చూస్తున్నారు? తెలుసుకోగలరా? ప్రతి ఒక్కరూ ఎంతవరకు అవ్యక్త మూర్తిగా, ఆకర్షణమూర్తిగా, అలౌకికమూర్తిగా మరియు హర్షితమూర్తిగా అయ్యారు? అన్నది చూస్తున్నారు. నాలుగు లక్షణాలు ఈ ముఖము ద్వారా కనిపిస్తాయి. ఎవరెవరు ఎంత వరకు తయారయ్యారు అని ప్రతి ఒక్కరి ముఖము సాక్షాత్కారం చేయిస్తుంది. ఎలా అయితే దర్పణంలో స్థూల ముఖాన్ని చూసుకుంటారో అలాగే దర్పణంలో ఈ లక్షణాలను కూడా చూసుకుంటున్నారా? చూసినప్పుడు తమ సాక్షాత్కారం ఎలా అవుతుంది? నాలుగు లక్షణాలలో విశేషంగా ఏ లక్షణాన్ని స్వయంలో చూసుకుంటున్నారు? తమను తాము చూసుకునే అభ్యాసము ప్రతి ఒక్కరికీ ఉండాలి. అంతిమ స్థితి ఎలా ఉంటుందంటే, అప్పుడు ప్రతి ఒక్కరి ముఖములో ఈ సర్వ లక్షణాలు ప్రసిద్ధ రూపంలో కనిపిస్తాయి. ఇప్పుడు కొందరు గుప్తంగా ఉన్నారు, కొందరు ప్రత్యక్షంగా ఉన్నారు. ఒక గుణం విశేషంగా ఉంది, మరో గుణం దానికన్నా తక్కువగా ఉంది. కానీ సంపూర్ణ స్థితిలో ఈ లక్షణాలన్నీ సమాన రూపంలో మరియు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. దీనిద్వారా అందరి ప్రత్యక్షత నంబరువారీగా అవ్వనుంది. ఎంతెంతగా ఎవరిలో అయితే ప్రత్యక్ష రూపంగా గుణాలు వస్తూ ఉంటాయో అంతంతగా ప్రత్యక్షత కూడా జరుగుతూ ఉంది.
ఈ రోజు విశేషంగా ఏ కార్యం కోసం వచ్చాము? పాండవ సైన్యం కోసం. పాండవుల భట్టీ ఆరంభము కానుంది. స్వయములో ఎటువంటి నవీనతను తీసుకురావాలి, తెలుసా? విశేషంగా భట్టీకి వచ్చారు, కావున విశేషంగా ఏమి ధారణ చేస్తారు? (ప్రతి ఒక్కరూ తమ తమ లక్ష్యాన్ని వినిపించారు). టీచర్లు, మీరు చెప్పండి, ఈ పాండవ సైన్యంతో ఏమేమి చేయించాలి? ముందు నుండి వినడం ద్వారా వీరు తమలో ఈ పాయింట్లను ధారణ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు, తరువాత మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు వీరి నుండి ఏమి కోరుకుంటున్నారు? వీరు ఒక్క క్షణంలో తమను తాము మార్చుకోగలరు. కష్టమనేది ఏదీ ఉండజాలదు. ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారికి సహాయము కూడా చాలా బాగా లభిస్తుంది. కల్పక్రితపు పాండవ సైన్యమైతే ప్రసిద్ధమయ్యే ఉన్నారు. పాండవుల కర్తవ్యానికి స్మృతిచిహ్నము అయితే ప్రసిద్ధమైనది. కల్పక్రితం జరిగిన దానిని ఇప్పుడు కేవలం రిపీట్ చెయ్యాలి. అవ్యక్తమవ్వడానికి, లేక అందరూ తమతమ లక్ష్యాన్ని ఏదైతే వినిపించారో దానిని పూర్తి చెయ్యడానికి తమలో ఏయే విషయాలను ధారణ చేసుకోవాలి అన్నదానిని ఈ రోజు వినిపిస్తాము. పాండవులందరూ తమను తాము ఏమని పిలుచుకుంటారు? ఆల్ మైటీ గాడ్ ఫాదర్ సంతానము అని అంటారు కదా. మరి అవ్యక్తమవ్వడానికి ముఖ్యంగా ఏ శక్తులను స్వయములో ధారణ చెయ్యాలి? అప్పుడే తీసుకున్న లక్ష్యము పూర్తి కాగలదు. భట్టీ నుండి ముఖ్యంగా ఏ శక్తులను ధారణ చేసుకుని వెళ్ళాలో అది చెప్తాము. చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా, ఒకటి సహనశక్తి కావాలి, పరిశీలించే శక్తి కావాలి మరియు విస్తారాన్ని సారంలోకి తీసుకువచ్చే మరియు చిన్నదానిని పెద్దదిగా చెయ్యగల శక్తి కూడా కావాలి. ఒక్కోసారి విస్తారాన్ని తగ్గించాల్సి ఉంటుంది, మరో చోట విస్తారం కూడా చెయ్యవలసి ఉంటుంది. సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కునే శక్తి మరియు నిర్ణయ శక్తి కూడా అవసరము. వీటన్నిటితో పాటు, అందరినీ సహయోగులుగా చేసే అనగా సర్వులను కలుపుకునే శక్తి కూడా కావాలి. కావున ఈ శక్తులన్నిటినీ ధారణ చేసుకోవాలి. అప్పుడే అన్ని లక్షణాలు పూర్తి కాగలవు. పూర్తి కాగలవు కాదు, కావలసిందే. చేసే వెళ్ళాలి. ఇవి నిశ్చయబుద్ధి గలవారి మాటలు. దీని కొరకు ఒక విషయము విశేషమైనది - ఆత్మికతను కూడా ధారణ చెయ్యాలి మరియు దీనితో పాటు ఈశ్వరీయ నషా కూడా. రెండు విషయాలను ధారణ చెయ్యాలి. ఒక విషయాన్ని వదిలి పెట్టాలి. అది ఏమిటి? (ఆవేశము అని ఒకరు అన్నారు, నీచత్వము అని మరొకరు అన్నారు) ఇది సరైనదే. ఒక్కోసారి స్వయంపై నమ్మకం లేని కారణంగా అనేక కార్యాలను నిరూపణ చెయ్యలేకపోతున్నారు. అందుకే నీచత్వమును వదిలి పెట్టాలి అంటున్నారు. ఆవేశాన్ని కూడా వదిలిపెట్టాలి. రెండు ఒక్కోసారి ఒక రకంగా ఉంటూ భిన్న భిన్న రూపాలనేవైతే మారుస్తూన్నారో, ఆ భిన్న భిన్న రూపాలను మార్చడం వదిలి ఒక్క అవ్యక్త మరియు అలౌకిక రూపాన్ని భట్టీ నుండి ధారణ చేసుకుని వెళ్ళాలి. అచ్ఛా! తిలకము అయితే పెట్టి ఉంది కదా. ఇప్పడిక కేవలం భట్టీ బహుమతిని ఇవ్వవలసి ఉంది. ఏ బహుమతిని ఇస్తాము? తిలకము పెట్టి ఉంది, కిరీటధారిగా కూడా ఉన్నారు, లేక కిరీటము ఇవ్వాలా? ఇప్పుడు ఒకవేళ చిన్న కిరీటాన్ని ధారణ చేస్తే భవిష్యత్తులో తక్కువ అవుతుంది. భట్టిలో విశ్వ మహారాజుగా అవ్వడానికి వచ్చారు. అన్నింటికన్నా అతి పెద్ద కిరీటము విశ్వ మహారాజుకే ఉంటుంది. వారికి ఏయే బాధ్యతలు ఉంటాయి అన్న పాఠాన్ని కూడా నేర్చుకోవలసి ఉంటుంది.
ఇది కూడా ఒక మంచి సమావేశము. మీ టీచరు (చంద్రమణి) చాలా హర్షితమవుతున్నారు. ఎందుకంటే మా విద్యార్థులందరూ విశ్వ మహారాజులవుతారు అని చూస్తున్నారు. ఈ గ్రూపు పేరు ఏమిటి? ఒక్కొక్కరిలో విశేషమైన గుణాలు ఉన్నాయి. అందుకే ఇది విశేష ఆత్మల గ్రూపు. స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తున్నారు. చూడండి, ఈ కీ చెయిన్ (త్రిమూర్తుల తాళం చెవి)ని బహుమతిగా ఇస్తున్నాము. ఈ లక్ష్యాన్ని చూస్తూ ఇటువంటి లక్షణాలను ధారణ చెయ్యాలి. ఇతరుల సంస్కారాలను కలుపుకుపోవాలి మరియు ఈ తాళం చెవి గుర్తు అనగా సర్వ శక్తులు ఏవైతే వినిపించామో, వాటి తాళం చెవిని తీసుకునే వెళ్ళాలి. కానీ రచయిత మరియు రచన గురించిన యథార్థ జ్ఞానము బుద్ధిలో ఉన్నప్పుడు ఈ రెండూ స్థిరంగా ఉండగలవు. అందుకే ఈ స్మృతి కానుకను ఇస్తున్నారు. స్వయాన్ని సఫలతామూర్తిగా భావిస్తున్నారా? సఫలత అనగా సంపూర్ణంగా గుణాలను ధారణ చెయ్యడము. ఒకవేళ అన్ని విషయాలలో సఫలత ఉన్నట్లయితే వారి పేరే సఫలతామూర్తి, సఫలతా సితారలు. ఈ స్మృతిలో ఉంటూ కార్యాన్ని చేసినట్లయితే కార్య సఫలత లభిస్తుంది. సఫలత సితారలుగా అవ్వడంతో ఎదుర్కొనే శక్తి వస్తుంది. సఫలతను మీ ముందు పెట్టుకోవడం ద్వారా సమస్య కూడా తిరిగిపోతుంది, సఫలత ప్రాక్టికల్ గా కూడా జరుగుతుంది. సమీప సితారల లక్షణము ఏమిటి? ఎవరి సమీపంలో ఉంటారో వారి సమానంగా అవ్వాలి. సమీప సితారలలో బాప్ దాదా గుణాలు మరియు కర్తవ్యము ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఎంతగా సమీపత ఉంటుందో అంతగా సమానత కనిపిస్తుంది. వారి ముఖము బాప్ దాదాను సాక్షాత్కారం చేయించే దర్పణంగా అవుతుంది. వారికి బాప్ దాదా పరిచయాన్ని ఇచ్చే ప్రయత్నం తక్కువగా చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే వారు స్వయమే పరిచయమూర్తిగా ఉంటారు. వారిని చూడగానే బాప్ దాదా పరిచయము ప్రాప్తిస్తుంది. సేవలో ఇటువంటి ప్రత్యక్ష ప్రమాణమును చూస్తారు. చూసేది మిమ్మల్ని అయినా కానీ బాప్ దాదా వైపుకు ఆకర్షణ కలుగుతుంది. దీనినే సన్ షోస్ ఫాదర్(తండ్రిని పిల్లలు ప్రత్యక్షం చేస్తారు) అని అంటారు. స్నేహము సమీపంలోకి తీసుకువస్తుంది. మీ స్నేహమూర్తి గురించి తెలుసా? స్నేహము ఎప్పుడూ గుప్తంగా ఉండజాలదు. స్నేహుల ప్రతి ఒక్క అడుగులో, ఎవరిపై స్నేహము ఉంటుందో వారి ముద్ర కనిపిస్తుంది. ఎంతగా హర్షితముఖము ఉంటుందో అంతగా ఆకర్షణమూర్తిగా అవుతారు. ఆకర్షణ మూర్తిగా సదా ఉండేందుకు ఆకారీ రూపధారిగా అయి సాకార కర్తవ్యములోకి రావాలి. అంతర్ముఖి మరియు ఏకాంతవాసి లక్షణాలను ధారణ చేయడం వలన ఏ లక్ష్యానైతే పెట్టుకున్నారో అది సహజంగా ప్రాప్తిస్తుంది. సాధనతో సిద్ధి ప్రాప్తిస్తుంది కదా!
సేవలో సదా సంపూర్ణ సఫలత కోసం విశేషంగా ఏ గుణాన్ని మీ ముందు ఉంచుకోవలసి ఉంటుంది? సాకార రూపంలో విశేషంగా ఏ గుణమున్న కారణంగా సఫలత ప్రాప్తించింది? (ఉదార చిత్తత) ఎంతగా ఉదారచిత్తత ఉంటుందో అంతగా సర్వుల ఉద్ధరణకు నిమిత్తం కాగలరు. ఉదారచిత్తత ఉండటం వలన సహయోగాన్ని పొందడానికి పాత్రులుగా అవుతారు. మేము సర్వాత్మల ఉద్ధరణకు నిమిత్తంగా వున్నాము అని భావించాలి. కావున ప్రతి విషయంలో ఉదారచిత్తముగా ఉండాలి. మనసాలో, వాచాలో మరియు కర్మణలో కూడా ఉదారచిత్తులుగా కావాలి, సంపర్కంలో కూడా కావాలి అవుతూ వున్నారు మరియు అవుతూ ఉండాలి.ఎవరు ఎంతగా ఉదారచిత్తముగా ఉంటారో అంతగా ఆకర్షణమూర్తిగా అవుతారు. కావున ఈ ప్రయత్నమును ముందుకు తీసుకువెల్తూ ప్రత్యక్షతలోకి తీసుకురావాలి. మధువనంలో ఉంటూ మధురత మరియు అనంతమైన వైరాగ్యవృత్తిని ధారణ చెయ్యాలి. ఇదే మధువనపు ముఖ్య లక్షణము, దీనినే మధువనం అని అంటారు. బయట ఉంటూ కూడా ఈ లక్ష్యము ఉన్నట్లయితే మధువన నివాసులే. ఎంతగా ఇక్కడ బాధ్యతను తీసుకుంటారో అంతగా అక్కడ ప్రజల ద్వారా గౌరవము లభిస్తుంది. సహయోగమును తీసుకోవడానికి స్నేహులుగా కావాలి. సర్వుల స్నేహులు, సర్వుల సహయోగులు. ఎంతెంతగా చక్రవర్తిగా అవుతారో అంతగా సర్వుల సంబంధంలోకి రాగలరు. ఈ గ్రూపు విశేషంగా చక్రవర్తిగా కావాలి, ఎందుకంటే సర్వుల సంబంధంలోకి వచ్చినప్పుడు సర్వులకు సహయోగమును ఇవ్వగలము, సర్వుల సహయోగమును తీసుకోగలము కూడా, ప్రతి ఒక్క ఆత్మలోని విశేషతను చూస్తూ, వింటూ, సంపర్కంలోకి వస్తూ ఉంటే ఆ విశేషతలు స్వయంలోకి వచ్చేస్తాయి. కావున ప్రాక్టికల్ లో సర్వులకు సహయోగిగా కావాలి. ఇందుకోసం పాండవసైన్యం చక్రవర్తులుగా కావలసి ఉంటుంది. యోగ అగ్ని సదా వెలుగుతూ ఉండాలి. దీనికోసం మనసు-వాణి-కర్మ మరియు సంబంధము, ఈ నాలుగు విషయాలను చూసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఈ అగ్ని అవినాశిగా ఉంటుంది. మాటిమాటికీ ఆర్పుతూ వెలిగిస్తూ ఉన్నట్లయితే సమయము వృధా అవుతుంది మరియు పదవి కూడా తక్కువది లభిస్తుంది. ఎంత స్నేహము ఉందో అంత శక్తిని కూడా పెట్టుకోండి. ఒక్క క్షణములో ఆకారిగా మరియు ఒక్క క్షణములో సాకారిగా కాగలరా? ఇది కూడా అవసరమైన సేవ. ఎలా అయితే సేవకు అనేక సాధనాలు ఉన్నాయో అలాగే ఈ ప్రాక్టీసు కూడా అనేక ఆత్మల కళ్యాణం కోసం ఒక సాధనము. ఈ సేవతో ఏ ఆత్మనైనా ఆకర్షించగలరు. ఇందులో ఖర్చు ఏమీ లేదు. తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి, ఇటువంటి ప్లానును తయారు చెయ్యండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేష శక్తి ఉంది, కానీ సర్వ శక్తులు వచ్చేస్తే అప్పుడు ఏమవుతారు? మాస్టర్ సర్వశక్తిమాన్. అన్ని గుణాలలో శ్రేష్ఠంగా అవ్వాలి. ఇష్ట దేవతలలో సర్వ శక్తులు సమాన రూపంలో ఉంటాయి. కావున ఈ పురుషార్థమును చెయ్యాలి. అచ్ఛా!
Comments
Post a Comment