27-04-1972 అవ్యక్త మురళి

* 27-04-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“లక్కీ మరియు లవ్లీగా అయ్యేందుకు పురుషార్థము.”

మిమ్మల్ని  లవ్లీయస్ట్ మరియు లక్కీయస్ట్ గా(అతి ప్రియమైన వారిగా మరియు మిక్కిలి అదృష్టవంతులుగా) ఈ రెండు రకాలుగా భావిస్తున్నారా? ప్రియమైనవారిగా మరియు మిక్కిలి అదృష్టవంతులుగా కూడా ఉన్నారు, ఈ రెండింటిని స్వయములో భావించుకున్నట్లయితే సదా నిర్విఘ్నముగా అనుభవము చేసుకుంటారు, లగనములో మగ్న అవస్థను అనుభవము చేసుకుంటారు. ఒకవేళ కేవలము అదృష్టవంతులుగా ఉండి, ప్రియమైనవారిగా లేనట్లయితే కూడా లగనములో మగ్న స్థితి లేక సదా నిర్విఘ్న స్థితిని అనుభవము చేసుకోలేరు మరియు కేవలము ప్రియమైనవారిగా ఉండి, అదృష్టవంతులుగా కానట్లయితే కూడా ఏ స్థితినైతే వినిపించటం జరిగిందో దానిని అనుభవము చేసుకోలేరు కావున రెండింటి ఆవశ్యకత ఉంది. లవ్లీ మరియు లక్కీల ప్రాప్తి కొరకు ముఖ్యంగా మూడు విషయాల ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఆ మూడు విషయాలను స్వయములో అనుభవము చేసుకున్నట్లయితే లక్కీగా మరియు లవ్లీగా తప్పక అవుతారు. ఆ మూడు విషయాలు ఏమిటి, వాటి ద్వారా సహజముగానే ఈ రెండు స్థితులను అనుభవము చేసుకోగలరు? లక్(అదృష్టము)ను తయారుచేసుకోగలమా లేక తయారై ఉంటుందా? మిమ్మల్ని లక్కీగా తయారుచేసుకోగలరా లేక మొదటి నుండి ఎవరైతే లక్కీగా అయ్యారో వారే అవ్వగలరా? మీ లక్ ను తయారుచేసుకోగలరా లేక తయారై ఉన్నదానిపై నడవటము జరుగుతుందా? అదృష్టమును మార్పు చెయ్యగలరా లేక చెయ్యలేరా? దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అవ్వగలరా? లక్ ను తయారుచేసుకోవటానికి పురుషార్థపు మార్జిన్ ఏమైనా ఉందా? (ఉంది) అదృష్టమును మేల్కొలుపుకొని వచ్చారా లేక అదృష్టమును మేల్కొలిపేందుకు వచ్చారా? మేల్కొనియున్న అదృష్టమును తోడుగా తీసుకొని వచ్చారు కదా, మరి ఇక దేనిని తయారుచేసుకుంటారు? అదృష్టమును ఎవరైతే మేల్కొలుపుకొని వచ్చారో దాని అనుసారముగానే తండ్రికి చెందినవారిగా అయ్యారు, తండ్రికి చెందినవారుగా అవ్వటంలోనే అదృష్టపు విషయము ఉంది కదా! అదృష్టాన్ని తయారుచేసుకొని కూడా వచ్చారు మరియు తయారుచేసుకోవచ్చు కూడా, అలానే? ఎప్పుడైతే ఏదైనా విషయముపై ఎక్కువ పురుషార్థము చెయ్యవలసి వచ్చినప్పుడు నా అదృష్టములో అయితే ఇదే కనిపిస్తుందా? అన్న సంకల్పము మీ లోపలి నుండి వస్తుంది. పురుషార్థము చేసిన తరువాత కూడా సఫలత లభించనట్లయితే - అదృష్టములోనే ఇలా ఉంది అని భావిస్తారు కదా! సఫలత లభించనందుకు గల కారణము ఏమిటి? మీ రీతితో పురుషార్థము చేసారు, అయినా కూడా సఫలత లభించనట్లయితే ఏమని అంటారు? డ్రామాలో అలానే ఉంది. అంటే, డ్రామాలో తయారైయున్న అదృష్టమునే తీసుకొని వచ్చారు కదా? పురుషార్థము చేసిన తరువాత ఏదైనా అసఫలత కూడా జరగవచ్చు అని పురుషార్థి ఎప్పుడూ భావించకూడదు. ఎల్లప్పుడూ ఇలానే భావించాలి - ఏ పురుషార్థమునైతే చేసానో అది ఎప్పుడూ వ్యర్థముగా పోజాలదు. ఒకవేళ సరియైన విధానముతో పురుషార్థము చేసినట్లయితే దాని సఫలత ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా తప్పకుండా లభిస్తుంది. అసఫలత రూపాన్ని చూసి ఇది పరీక్ష అని భావించాలి, దీనిని దాటిన తరువాత పరిపక్వత రానున్నది. కావున అది అసఫలత కాదు, కానీ మీ పురుషార్థపు పునాదిని దృఢంగా చేసే ఒక సాధనము. ఎప్పుడైనా దేనినైనా శక్తివంతముగా చేయాలన్నప్పుడు మొదటగా దాని పునాదిని దిమ్మిసలతో దృఢంగా చేయడం జరుగుతుంది, అలా దానిని దిమ్మిసలతో కొడుతూ, కొడుతూ దృఢంగా చేస్తారు. అలా దానిని కొట్టడం కూడా పరిపక్వతకు సాధనము. కావున ఎప్పుడూ మీ వ్యక్తిగత పురుషార్థములో లేక సంగఠన యొక్క సంపర్కములో లేక ఈశ్వరీయ సేవలో ఈ మూడు రకాల పురుషార్థములో బయటకు అసఫలత కనిపించినా కూడా ఇది అసఫలత కాదు కానీ పరిపక్వతకు సాధనము అనే భావించాలి. ముందు వినిపించినట్లుగా తుఫానులను తుఫానులుగా భావించకుండా దానిని ఒక తోఫా(కానుక)గా భావించాలి. పడవలో వెళ్ళేటప్పుడు గాలి విసుర్లు వస్తుంటాయి కానీ ముందుకు వెళ్ళటానికి అవి ఒక సాధనము. అదే విధముగా అసఫలతలో సఫలత ఇమిడి ఉంది, దీనిని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ పురుషార్థము సరియైనదైనట్లయితే 'అసఫలత' అన్న మాట కూడా బుద్ధిలోకి రాకూడదు.

అచ్ఛా! లక్కీ మరియు లవ్లీగా అయ్యేందుకు మూడు విషయాల ఆవశ్యకత ఉంది అని వినిపిస్తూ ఉన్నాము కదా, అవి ఏమిటి? మొదట ఆలోచించండి - అదృష్టమును ఎలా తయారు చేసుకోవచ్చు? మేము అదృష్టవంతులుగా మరియు ప్రియమైనవారిగా ఉన్నామా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ అదృష్టమును ఎందుకని మేల్కొలపలేకపోతున్నారు? దానికి మూల కారణము - జ్ఞానసంపన్నులుగా లేరు. జ్ఞాన సంపన్నములో అన్ని రకాల జ్ఞానము వస్తుంది. ఎవరు ఎంత జ్ఞాన సంపన్నులుగా ఉంటారో తప్పకుండా అంత అదృష్టవంతులుగానే ఉంటారు ఎందుకంటే జ్ఞానము యొక్క ప్రకాశము మరియు శక్తి ద్వారా ఆది-మధ్య-అంతిమములను తెలుసుకొని ఏ పురుషార్థమునైతే చేస్తారో అందులో వారికి తప్పకుండా సఫలత ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తించటము-ఇది అదృష్టమునకు గుర్తు. ఒకటేమో వారు జ్ఞాన సంపన్నులుగా అవుతారు, అనగా ఫుల్ జ్ఞానము ఉంటుంది. ఫుల్ లో ఒకవేళ ఏదైనా తక్కువ ఉన్నట్లయితే అదృష్టవంతులుగా అవ్వటంలో కూడా నంబరువారీగా ఉంటారు. జ్ఞాన సంపన్నులైనట్లయితే అదృష్టవంతులుగా అవ్వడములో కూడా నంబర్‌వన్‌గా ఉంటారు. కర్మల జ్ఞానము కూడా ఉంటుంది. మరియు తమ రచయిత మరియు రచనల జ్ఞానము కూడా ఉంటుంది. పరివారమువారితో అయినా జ్ఞానీ ఆత్మల సంపర్కములోకి అయినా ఎలా రావాలి, అన్నదాని జ్ఞానము ఉంటుంది. జ్ఞానము అన్నది కేవలము రచయిత మరియు రచనలదే కాదు, కానీ జ్ఞానసంపన్నము అనగా ప్రతి సంకల్పము మరియు ప్రతి మాట, ప్రతి కర్మలో జ్ఞానస్వరూపముగా అవ్వటము. అటువంటి వారినే జ్ఞాన సంపన్నులు అని అంటారు. రెండవ విషయము - ఎంతగా జ్ఞానసంపన్నముగా ఉంటారో అంతగానే కేర్ ఫుల్ (జాగ్రత్త)గా కూడా ఉంటారు. ఎంతగా కేర్ ఫుల్ గా ఉంటారో అంతగానే వారు చీర్ ఫుల్ (హర్షితము)గా ఉంటారు. ఒకవేళ ఎవరైనా చీర్ ఫుల్ గా లేకపోయినా కూడా లవ్లీగా అనిపించరు. ఒకవేళ ఎవరైనా కేర్ ఫుల్ గా లేకపోయినా కూడా లవ్లీగా అనిపించరు.

ఎవరైతే కేర్ ఫుల్ గా ఉండరో వారిద్వారా సమయ ప్రతిసమయము స్వయము నుండి లేక ఇతరుల సంపర్కములోకి రావటం ద్వారా ఏదో ఒక చిన్నా-పెద్ద పొరపాటు జరగటం ద్వారా స్వయమూ ప్రియమైన వారిగా ఉండరు, ఇతరులనూ ప్రియమైన వారిగా తయారుచెయ్యలేకపోతారు. కావున ఎవరైతే కేర్ ఫుల్ గా ఉంటారో వారు తప్పకుండా చీర్ ఫుల్ గా కూడా ఉంటారు. ఎవరైతే కేర్ ఫుల్ గా
ఉంటారో వారు తమ పురుషార్థములో ఎక్కువగా మగ్నమైన కారణంగా చీర్ ఫుల్ గా ఉండలేకపోతారు అని భావించకూడదు, అటువంటిదేమీ ఉండదు. కేర్ ఫుల్ కు గుర్తు చీర్ ఫుల్. కావున ఈ మూడు క్వాలిఫికేషన్స్(అర్హతలు) లేక విషయాలు ఒకవేళ ఉన్నట్లయితే అదృష్టవంతులుగానూ మరియు ప్రియమైనవారిగానూ అవ్వగలరు. పరస్పర సహయోగము ద్వారా కూడా తమ అదృష్టమును తయారుచేసుకోగలరు. కానీ ఎప్పుడైతే కేర్ ఫుల్ గా మరియు చీర్ ఫుల్ గా ఉంటారో అప్పుడే పరస్పర సహయోగము లభిస్తుంది. ఒకవేళ చీర్ ఫుల్ గా లేనట్లయితే సక్సెస్ ఫుల్ గా కూడా ఉండరు. కేర్ ఫుల్ గా మరియు చీర్ ఫుల్ గా ఉన్నట్లయితే సక్సెస్ ఫుల్ అనగా అదృష్టవంతులుగా ఉంటారు. కావున ఈ మూడు విషయాలను మీలో మీరు చూసుకోండి, ఒకవేళ మూడూ సరియైన శాతములో ఉన్నట్లయితే మేము లక్కీ మరియు లవ్లీయస్ట్ లము అని భావించండి. ఒకవేళ శాతములో తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ ఈ స్టేజ్ ఉండజాలదు. గుర్తు ఏమిటో ఇప్పుడు అర్థమైందా? నోటి ద్వారా జ్ఞానమును వినిపించటము అంతగా ప్రభావమును కలిగించజాలదు. ఎల్లప్పుడూ హర్షితముఖము ఉండాలి, దుఃఖపు అల సంకల్పములో కూడా రాకూడదు - దీనినే చీర్ ఫుల్ అని అంటారు. కావున మీ చీర్ ఫుల్ ముఖము ద్వారానే సేవ చెయ్యగలరు. ఏవిధంగా అయస్కాంతము వైపుకు లోహము దానంతట అదే ఆకర్షితమైపోతుందో, అదే విధముగా సదా హర్షితముఖులు స్వయమే అయస్కాంత స్వరూపంగా అయిపోతారు. వారిని చూడటంతోనే అందరూ సమీపంగా వస్తారు. నేటి ప్రపంచములో, నలువైపులా దుఃఖము మరియు అశాంతితో కూడిన మేఘాల నీడ ఆవరించియున్నప్పుడు, ఇటువంటి వాయుమండలములో కూడా వీరు సదా హర్షితముఖులుగా ఉంటున్నారే! అని భావిస్తారు. ఇలా ఎందుకని మరియు ఎలా ఉంటున్నారు. దీనిని తెలుసుకోవటానికి ఉత్కంఠత ఉంటుంది. ఏవిధంగా, చాలా పెద్ద తుఫాను వచ్చినప్పుడు లేక వర్షము వచ్చిన సమయములో మనుష్యులు ఎక్కడైతే వాన-తుఫానుల నుండి రక్షణ ఉంటుందని అనుకుంటారో, అక్కడకు అనుకోకుండానే పరుగులెత్తుతారు. స్థానమేమీ పిలవదు, కానీ వాయుమండల ప్రమాణంగా అది రక్షణకు సాధనము, కావున మనుష్యులు తప్పకుండా అక్కడకు పరుగెత్తుతారు. వారిని వారు రక్షించుకొనేందుకు ఆ స్థానమును ఆధారముగా తీసుకుంటారు. అక్కడకు ఆకర్షింపబడి వస్తారు కదా! కావున ఇలాగే భావించండి - వర్తమాన సమయములో నలువైపులా మాయ తుఫానులు మరియు దుఃఖపు మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయములో రక్షణ సాధనము కొరకు మీవైపుకు ఆకర్షితమౌతారు. అలా ఆకర్షితము చేసే బయటకు కనిపించే రూపము ఏది? హర్షిత ముఖము. కానీ లవ్లీగా మరియు లక్కీగా రెండూ ఉండాలి. అక్కడక్కడా జ్ఞానసంపన్నులుగా కూడా ఉన్నారు, కేర్ ఫుల్ గా కూడా ఉన్నారు కానీ చీర్ ఫుల్ (హర్షితముఖులు)గా లేరు. కేర్ చేస్తారు, కానీ కేర్ చేస్తూ చేస్తూ చేర్(ఆసనము)ను వదిలేస్తారు, కావున చీర్ ఫుల్ లుగా అవ్వజాలరు. కావున ముఖ్య పురుషార్థము లేక అటెన్షన్ లేక కేర్ ఏ విషయములో ఉండాలి, దాని ద్వారా ఈ మూడు విషయాలను సహజముగానే మీలోకి తీసుకురాగలరు, అది ఏమిటో తెలుసా? కేర్ ఫుల్ గా అయితే ఉండాల్సిందే, కానీ ముఖ్యమైన కేర్ ఏ విషయములో ఉంచాలి? కేర్ ఫుల్ ఏ ఏ విషయాలలో ఉంటుంది? (రకరకాల సమాధానాలు లభించాయి). తండ్రి ఎటువంటి కేర్‌ను ఇచ్చిన కారణముగా ఇలా తయారయ్యారు? ఆ ముఖ్యమైన విషయము ఏది? మీ మహిమ ఏదైతే గాయనము చేయబడుతుందో, దానిని పూర్తిగా వర్ణన చెయ్యండి - సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాదా పురుషోత్తములు... ఎప్పుడైతే మర్యాదల ఉల్లంఘన జరుగుతుందో అప్పుడే కేర్ లెస్(నిర్లక్ష్యులు)గా అవుతారు. మీ సంపూర్ణ స్థితి యొక్క గాయనమేదైతే ఉందో, అందులో సీతకు మర్యాద రేఖ లోపల ఉండేందుకు ఆజ్ఞ ఇవ్వబడింది, నిజానికి మరే ఇతర రేఖలు లేవు. కానీ ఈ మర్యాదనే గీత. ఒకవేళ ఈశ్వరీయ మర్యాదల రేఖ నుండి వెలుపలకు వచ్చినట్లయితే ఫకీర్ గా అయిపోతారు అనగా ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో వాటినుండి బికారులుగా, ఫకీరులుగా అయిపోతారు. రెండు పైసలు ఇవ్వండి, బట్టలను ఇవ్వండి.... అని ఏవిధంగా ఫకీరులు అరుస్తారో అలా మళ్ళీ అరుస్తారు. అలాగే ఎవరైతే మర్యాదల రేఖను ఉల్లంఘిస్తారో వారి స్థితి ఫకీరు సమానంగా తయారౌతుంది. కృపను చూపండి, ఆశీర్వదించండి, సహయోగమును ఇవ్వండి, స్నేహమును ఇవ్వండి - అని వారు అంటారు... మరి ఫకీరులుగా అయిపోయినట్లే కదా! కానీ నాకు అథికారము ఉంది అంటారో, వారినే బాలకుల నుండి యజమానులుగా అవ్వటము అని అంటారు.
అధీనులైపోయి యాచించటము, దేనినైనా యాచించేవారిని ఫకీరులనే అంటారు. కావున ఇదైతే మర్యాదల రేఖ, దాని నుండి ఒకవేళ వెలుపలకు వచ్చినట్లయితే ఫకీరులుగా అయిపోతారు. మళ్ళీ సహాయమును తీసుకోవలసి వస్తుంది. మామూలుగా అయితే బాబా పిల్లలుగా ఎవరైతే అవుతారో వారు లక్కీ కూడా, మరియు లవ్లీ కూడా. వారు స్వయము ఈశ్వరీయ కార్యములో సహాయకులే కానీ సహాయమును తీసుకొనేవారు కాదు. మీరు సహాయకులుగా అయ్యే చిత్రము కూడా ఉంది, సహాయమును యాచించే చిత్రము కాదు. భక్తుల చిత్రము యాచించేదిగానే ఉంటుంది. ఎవరైతే బాలకుల నుండి యజమానులుగా అవుతారో వారు సదా సహయోగులుగా ఉంటారు. ఎవరైతే స్వయమే సహాయకులో, వారు సహాయమును యాచించజాలరు, వారు ఇచ్చేవారే కానీ తీసుకొనేవారు కాదు. దాత ఎప్పుడూ తీసుకోడు, దాత ఇచ్చేవాడుగా ఉంటాడు. కావున మిమ్మల్ని మీరు ఒకే తండ్రికి చెందినవారుగా అనగా రాముని సత్యమైన సీతలుగా భావించుకొని సదా మర్యాదల రేఖ లోపల ఉండాలి అనగా ఈ కేర్‌ను తీసుకున్నట్లయితే కేర్ ఫుల్ గా ఉంటారు. కేర్ ఫుల్ ద్వారా ఆటోమేటిక్ గానే చీర్ ఫుల్ గా అవుతారు. కావున ఆ మర్యాదలు ఏమేమిటి అన్నవి అన్నీ బుద్ధిలో ఉండాలి.

ఉదయము నుండి రాత్రి వరకు ఏయే మర్యాదలను ఏయే కర్మలలో ఉంచాలి అన్న జ్ఞానమంతా స్పష్టముగా ఉండాలి. ఒకవేళ జ్ఞానము లేనట్లయితే కేర్ ఫుల్ గా కూడా ఉండజాలరు. కావున సీతగా భావించి ఈ రేఖ లోపల ఉండండి అనగా ఎవరైతే కేర్ ఫుల్ గా ఉంటారో, మర్యాదల రేఖ లోపల ఉంటారో వారే పురుషోత్తములుగా అవ్వగలరు. గమనించినట్లయితే చీర్ ఫుల్ గా లేనట్లయితే తప్పకుండా ఏదో ఒక మర్యాదను ఉల్లంఘించి ఉంటారు. మర్యాద అన్నది సంకల్పాల కొరకు కూడా ఉంది. వ్యర్థ సంకల్పాలను కూడా చెయ్యకూడదు. ఈ రేఖ నుండి బయటకు చెందిన వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు ఉత్పన్నం అవుతున్నట్లయితే సంకల్పాలలో మర్యాదలను ఉల్లంఘింస్తున్నట్లే. కావుననే హర్షితముగా ఉండడం లేదు. అలాగే మీ నోటి నుండి ఏయే మాటలు మాట్లాడాలి మరియు ఎటువంటి స్థితిలో స్థితులై నోటి నుండి మాట్లాడాలి అన్న ఈ మర్యాద వాణి కొరకు. ఒకవేళ వాణిలో కూడా ఏదైనా మర్యాద ఉల్లంఘన జరుగుతున్నట్లయితే చీర్ ఫుల్ గా ఉండరు. తమ వ్యర్ధ సంకల్పాలు, వికల్పములే స్వయమును చీర్ ఫుల్ స్టేజ్ నుండి పడేస్తాయి ఎందుకంటే మర్యాదను ఉల్లంఘన చేసారు. ఒకవేళ మర్యాదల రేఖ లోపల సదా స్వయమును ఉంచుకొన్నట్లయితే ఈ రావణుడు అనగా మాయ లేక విఘ్నము ఈ మర్యాదరేఖ లోపలకు వచ్చేందుకు ధైర్యమును ఉంచజాలదు. ఏ విఘ్నము వచ్చినా లేక తుఫాను, ఆందోళన లేక ఉదాసీనత వచ్చినట్లయితే - సీత పాదాన్ని బయట పెట్టినట్లుగా మీరు ఎక్కడో అక్కడ మర్యాదల రేఖ నుండి మీ బుద్ధిరూపీ పాదాన్ని బయటపెట్టారు అని భావించాలి. బుద్ధి కూడా పాదము, దీనిద్వారా యాత్ర చేస్తారు. కావున బుద్ధి రూపీ పాదము కాస్తయినా మర్యాదల రేఖ నుండి బయట పెట్టినట్లయితే అప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి మరియు ఎలా తయారుచేస్తుంది? తండ్రికి చెందిన లక్కీ మరియు లవ్లీ పిల్లలను ఫకీరుగా తయారుచేస్తుంది! ఫకీరుగా అయినందుకు గుర్తు - ఒకటేమో ఆత్మల నుండి, తండ్రి నుండి ఆధారమును యాచిస్తూ ఉంటారు. శక్తి శాలీ అయిన తమ ఖజానాలు సమాప్తమైపోతాయి. లకీర్ కే ఫకీర్(రేఖపై ఉండే యాచకులు) అని ఒక నానుడి కూడా ఉంది. కావున ఇలా ఎవరైతే ఫకీరులుగా అవుతారో వారు లకీర్ కు కూడా ఫకీరుగా(నామమాత్రముగా చేసేవారిగా) అవుతారు. ఆ శక్తిశాలీ స్థితి అంతమైపోతుంది. జ్ఞానమైతే చెప్తూ ఉంటారు. పురుషార్థము చేస్తూ ఉంటారు కానీ లకీర్ యొక్క ఫకీరుల(నామమాత్రముగా చేసేవారి) సమానంగా ఉంటారు. తమ ప్రాప్తుల నషా మరియు శక్తి ఏవైతే ఉండాలో అవి ఉండవు. భక్తి మార్గములో కూడా నామమాత్రముగా చేసేవారు ఉంటారు కదా. కావున ఇలా మర్యాదల ఉల్లంఘన చేసేవారు రెండు రకాలైన ఫకీరులుగా తయారౌతారు. కావున ఎప్పుడూ ఫకీరులుగా అవ్వకూడదు. ఈ సమయములో ఎవరైతే విశ్వరాజ్యాధికారులుగా అవుతారో వారికి కూడా మీరు రాజులు. రాజులకే రాజు అని అంటారు కదా! విశ్వరాజులుగా ఎప్పుడైతే తయారవుతారో ఆ సమయములోని స్టేజ్ ను రాజులకు రాజులు అని అంటారు కానీ ఈ సమయములోని బ్రాహ్మణత్వముయొక్క స్టేజ్ ఏదైతే ఉందో లేక డైరెక్ట్ తండ్రి ద్వారా జ్ఞానసంపన్నులుగా అయ్యే స్టేజ్ ఏదైతే ఉందో అది ఉన్నతమైనది, కావున అటువంటి స్టేజ్ ను వదిలి ఫకీరుగా అవ్వటము శోభితముగా అయితే ఉండదు కదా! కావున ప్రతి సంకల్పము మరియు కర్మలో దీనిని పరిశీలించుకోండి అనగా కేర్ తీసుకోండి - బయటకైతే పోవటం లేదు కదా? ఇలా స్వయమును మర్యాదా పురుషోత్తములుగా తయారుచేసుకోండి. అలా మర్యాదా పురుషోత్తములుగా అయ్యే తీవ్ర పురుషార్థులకు, జ్ఞానసంపన్నులకు, కేర్ ఫుల్ మరియు చీర్ ఫుల్ గా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే, అచ్ఛా!

Comments