26-06-1972 అవ్యక్త మురళి

26-06-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రభావం నుండి రక్షించుకోవటం అంటే పరిపక్వంగా అవ్వటం.

                       మీ అందరి లక్ష్యం - పరిపక్వంగా అవ్వటం కదా! పరిపక్వత అంటే ఏ లోపం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే వారి గుర్తులు ఏమి ఉంటాయి? ఏదోక రకమైన అంటే మనసా సంకల్పంలో, సంపర్కంలో, సంబంధంలో ఏదోక రకమైన మాయా ప్రభావం ఉన్న కారణంగా లోపం ఉంటుంది. ఎలా అయితే శరీరానికి కూడా ఏదైనా విషయం యొక్క ప్రభావం ఉంటే అనారోగ్యం అంటే లోపం ఉంటుంది. ఎలా అయితే శరీరానికి వాతావరణం యొక్క ప్రభావం ఉంటుంది లేదా ఆహార పానీయాల యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడే అనారోగ్యం వస్తుంది. ఏవిధమైన లోపం లేకుండా ఉండేటందుకు మాయా ప్రభావం నుండి రక్షించుకోవాలి. ఏదోక రకమైన ప్రభావం పడిపోతుంది. అందువలనే పరిపక్వంగా కాలేకపోతున్నారు. కనుక ఏ రకమైన ప్రభావం పడకూడదు, ప్రభావ ఫ్రూఫ్ గా కావాలి అనే ప్రయత్నం చేయాలి. దీని కొరకు సాధన కూడా సమయానుసారం లభిస్తూ ఉంటుంది. మనస్సుని ప్రభావం నుండి ఏవిధంగా దూరంగా ఉంచుకోవాలి, మాటను ఏదైనా ప్రభావం నుండి ఏవిధంగా దూరంగా ఉంచుకోవాలి, మరియు కర్మణాలో ప్రభావం నుండి ఏవిధంగా దూరంగా ఉండాలి - ఈ ఒక్కొక్క విషయంలో అనేక రకాలైన యుక్తులు చెప్పబడి ఉన్నాయి. కానీ ప్రభావంలోకి వచ్చేసి తర్వాత ఆ సాధన చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలివైనవారు వారు మొదటే ధ్యాస పెట్టుకుంటారు. వేడి సీజన్ లో వేడి యొక్క ప్రభావం లేకుండా మొదటే సాధన చేస్తారు, వారిని తెలివైనవారు అని అంటారు. ఒకవేళ తెలివి తక్కువగా ఉంటే వేడి యొక్క ప్రభావం పడుతుంది. కనుక కమలపుష్ప సమానంగా సదా ప్రభావానికి అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అవ్వాలి. ప్రతి ఒక్కరికి తమ పురుషార్థం అనుసరించి లేదా తమ స్థితి అనుసరించి మా ఆత్మలో ఏ విషయం యొక్క ప్రభావం సమయానుసారం పడుతుంది అనేది తెలుస్తుంది. తెలిసినప్పటికీ ఆ సాధనాలను సొంతం చేసుకోవటం లేదు. అనుకుంటున్నప్పటికీ ఆ సమయంలో తెలివి తక్కువ వారిగా అయిపోతున్నారు. ఏదైనా ప్రభావం ఉంటే అది మానవుల బుద్ధిని లోపంగా చేసేస్తుంది. ఆ సమయంలో బుద్ధి పని చేయదు. అలాగే మాయ కూడా రకరకాలైన ప్రభావాల ద్వారా తెలివితక్కువ వారిగా చేసేస్తుంది. అందువలన పరిపక్వంగా అవ్వటంలో లోపం ఉండిపోతుంది. ఎలా అయితే శరీరాన్ని సంభాళించుకోవటం అవసరమో అలాగే ఆత్మ పట్ల కూడా పూర్తి తెలివి ఉంచుకుని నడవాలి. అప్పుడే చాలా త్వరగా ప్రభావానికి అతీతంగా పరిపక్వంగా అయిపోతారు. తెలిసినప్పటికీ అక్కడక్కడ సాంగత్యంలోకి వచ్చి కూడా పొరపాటు చేస్తున్నారు. అర్ధం చేసుకుంటున్నారు కూడా కానీ ఆ సమయంలో వాతావరణం లేదా ఏదోక సమస్య కారణంగా, సంస్కారాల కారణంగా లేదా సంపర్కంలోకి వచ్చే శక్తి తక్కువ అయిన కారణంగా ఆ ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. సదా స్వయాన్ని ముఖ్యంగా ఏ విషయం కారణంగా ప్రభావం పడుతుంది అనేది పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభావం నుండి స్వయాన్ని సదా రక్షించుకోవాలి. అప్పుడే సహజంగా పరిపక్వంగా అవుతారు. ఇదే ముఖ్య పురుషార్ధం. మీరు ప్రతి ఒక్కరు మీ ముఖ్య ప్రభావం యొక్క కారణాన్ని అయితే తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నప్పటికీ మాయ లేదా సమస్య ప్రభావంలోకి కొద్దిగా అయినా తీసుకువచ్చేస్తుంది కదా! కనుక ప్రభావం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. ప్రభావముక్తులుగా అయ్యారా? సాంగత్యదోషం, అన్నదోషం ఉండకూడదు. దీని పద్ధతి తెలుసుకుంటే స్వయాన్ని ప్రభావ ముక్తులుగా కూడా చేసుకోగలుగుతారు. మాయ తెలివైనవారి నుండి తెలివితక్కువ వారిగా చేసేస్తుంది. సదా జ్ఞానం అంటే తెలివిలో ఉంటే ఎప్పుడు ఎవరి ప్రభావంలోకి రారు. ఏదైనా ప్రభావం నుండి రక్షించుకుని వచ్చినవారినే చాలా తెలివైనవారు అని అంటారు. మాయ మొదట తెలివిని బలహీనం చేసేస్తుంది. ఎలా అయితే యుద్ధం చేసే శత్రువు మొదట బలహీనం చేయటానికి ప్రయత్నం చేస్తారు, తర్వాత యుద్ధం చేస్తారు, అప్పుడు విజయీ అవుతారు. మొదట బలహీనం చేయటానికి ఏదోక పద్ధతి వెతుకుతారు మాయ శత్రువు కూడా మొదట నుండే తెలివిని బలహీనం చేస్తుంది. ఇది సత్యమా, అసత్యమా అనేది కూడా అర్థం చేసుకోవటం లేదు. తర్వాత ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభావమే లోపంగా రూపం ధారణ చేస్తుంది. లోపం పరిపక్వంగా అవ్వనివ్వటం లేదు. ఏమి లక్ష్యం పెట్టుకున్నారు? పరిపక్వంగా అంటే 16 కళా సంపన్నంగా అవుతాము అని, కొద్దిగా లోపం ఉన్నా 14కళలలోకి వచ్చేస్తారు కనుక ఏమి లక్ష్యం పెట్టుకున్నారు? తెలివైనవారిగా ఉండేవారు విజయాలుగా తప్పకుండా అవుతారు. మంచిది.

Comments