26-01-1977 అవ్యక్త మురళి

26-01-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అంతర్ముఖత ద్వారా సూక్ష్మ శక్తి యొక్క లీలలు అనుభవం.

                              శాంతిశక్తి ద్వారా ఆత్మల సేవ చేసే విధి చెప్తూ విశ్వకళ్యాణకారి తండ్రి శివబాబా అన్నారు -
                    మీ వాస్తవిక శాంతిశక్తి గురించి బాగా తెలుసుకున్నారా? ఏవిధంగా అయితే వాచా శక్తి లేదా కర్మ శక్తి యొక్క ప్రత్యక్ష పరిణామాలు కనిపిస్తున్నాయో అదేవిధంగా అన్నింటి కంటే శక్తిశాలి శాంతిశక్తి యొక్క ప్రత్యక్ష రుజువుని చూశారా, అనుభవం చేసుకున్నారా? వాచా ద్వారా ఏ ఆత్మనైనా ఎలాగైతే పరివర్తన చేయగలరో అదేవిధంగా శాంతిశక్తి ద్వారా అంటే మనస్సు ద్వారా ఏ ఆత్మ యొక్క వృత్తి, దృష్టిని అయినా పరివర్తన చేసే అనుభవం ఉందా? వాణి ద్వారా అయితే ఎదురుగా ఉన్నవారినే పరివర్తన చేయగలరు. కానీ మనస్సు ద్వారా లేదా శాంతిశక్తి ద్వారా స్థూలంగా ఎంత దూరంలో ఉన్న ఆత్మను అయినా కానీ వారికి సన్ముఖంగా ఉన్నట్లుగా
అనుభవం చేయించగలరు. ఎలాగైతే విజ్ఞాన యంత్రాల ద్వారా దూరదృశ్యం సన్ముఖంగా అనుభవం అవుతుందో అదేవిధంగా శాంతిశక్తి ద్వారా కూడా దూరం సమాప్తి అయిపోయి ఎదురుగా ఉన్నట్లుగా మీరు మరియు ఇతరులు కూడా అనుభవం చేసుకుంటారు. దీనినే యోగబలం అని అంటారు. కానీ విజ్ఞాన సాధనాలు అయిన యంత్రాలు కూడా ఎప్పుడు పని చేస్తాయంటే వాటి సంబంధం మెయిన్ స్టేషన్ తో ఉన్నప్పుడే. అదేవిధంగా బాప్ దాదాతో నిరంతరం స్పష్ట సంబంధం కలిగి ఉండటం ద్వారానే శాంతిశక్తి ద్వారా అనుభవం చేసుకోగలరు. అక్కడ యంత్రాలకు అయితే కనెక్షన్ జోడిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ కనెక్షన్ అంటే సంబంధం. అప్పుడు అన్నీ స్పష్టంగా అనుభవం అవుతాయి. అప్పుడే మనసాశక్తి యొక్క ప్రత్యక్ష రుజువు చూడగలరు.
                    ఇప్పుడు మనసాశక్తి ద్వారా ఆత్మలను ఆహ్వానం చేసి వారిని పరివర్తన చేసే సూక్ష్మ సేవ చాలా తక్కువ చేస్తున్నారు. ఆత్మిక శక్తి, సగం పవిత్రత కలిగిన ఆత్మలే తమ సాధన ద్వారా ఆత్మలను ఆహ్వానం చేయగలుగుతున్నారు, అల్పకాలిక సాధనాల ద్వారా దూరంగా ఉన్న ఆత్మలకు తమ చమత్కారాన్ని చూపించి తమ వైపుకి ఆకర్షించుకోగలుగుతున్నప్పుడు పరమాత్మ శక్తి అంటే సర్వ శ్రేష్ట శక్తి చేయలేనిది ఏముంటుంది? దీని కోసం విశేషంగా ఏకాగ్రత కావాలి. సంకల్పాల యొక్క ఏకాగ్రత మరియు స్థితి యొక్క ఏకాగ్రత కూడా కావాలి. ఏకాగ్రతకి ఆధారం - అంతర్ముఖత. అంతర్ముఖంగా ఉండటం ద్వారా లోలోపల చాలా విచిత్ర అనుభవాలు చేసుకుంటారు. ఏవిధంగా అయితే దివ్యదృష్టి ద్వారా సూక్ష్మ వతనం అంటే సూక్ష్మసృష్టి అంటే సూక్ష్మ లోకం యొక్క అనేక విచిత్ర లీలలు చూస్తున్నారో అదేవిధంగా అంతర్ముఖత ద్వారా సూక్ష్మశక్తి యొక్క లీలలు అనుభవం చేసుకుంటారు. ఆత్మలను ఆహ్వానించటం, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయటం, ఆత్మల సంబంధాన్ని బాబాతో జోడింపచేయటం, ఇటువంటి ఆత్మిక లీలలను అనుభవం చేసుకోగలుగుతున్నారా? దూరంగా కూర్చుని కూడా అప్రాప్తి ఆత్మలకు, అశాంతి, దుఃఖి, రోగి ఆత్మలకు, శాంతి, శక్తి, నిరోగి స్థితి యొక్క వరదానం ఇస్తున్నారా? శక్తుల యొక్క జడచిత్రాలలో వరదానం ఇచ్చే స్థూలరూపాన్ని వరదాని హస్తంగా చూపించారు, ఆ హస్తాన్ని ఏకాగ్ర రూపంలో చూపిస్తారు. వరదాని స్థితికి గుర్తుగా హస్తాన్ని దృష్టి మరియు సంకల్పాన్ని ఏకాగ్రంగా చూపిస్తారు. అదేవిధంగా చైతన్య రూపంలో ఏకాగ్రచిత్తంగా ఉండే శక్తిని పెంచుకోండి. అప్పుడే ఆత్మల ప్రపంచంలో ఆత్మిక సేవ జరుగుతుంది. ఆత్మల ప్రపంచం అంటే మూలవతనం కాదు. కానీ ఆత్మ ఆత్మను ఆహ్వానించి ఆత్మిక సేవ చేయాలి. ఈ ఆత్మిక లీలను అనుభవం చేసుకోండి. ఈ ఆత్మిక సేవను తీవ్రవేగంతో చేయగలుగుతున్నారా! వాచా మరియు కర్మణా సేవలో నాది - నీది అనే ఘర్షణ ఉంటుంది, పేరు, గౌరవం, మర్యాదల ఘర్షణ,స్వభావ సంస్కారాల ఘర్షణ ఉంటుంది, సమయం లేదా ధనం యొక్క కొరత ఉండవచ్చు. ఈరకంగా ఏవైతే విఘ్నాలు వస్తాయో అవన్నీ సమాప్తి అయిపోతాయి. ఆత్మిక సేవ అనేది ఒక సంస్కారంగా అయిపోతుంది. ఆ సంస్కారంలోనే తత్పరులై ఉంటారు. ఈ సంవత్సరం ఈ శక్తిశాలి సేవను కూడా ప్రారంభించండి. వాణి ద్వారా లేదా ప్రత్యక్ష జీవితం యొక్క ప్రభావం ద్వారా వచ్చిన ఆత్మలకు లేదా సంపర్కంలోకి రావాలనే ఆశతో ఉన్న ఆత్మలకు ఆత్మిక శక్తి యొక్క అనుభవం చేయించండి. ఇప్పుడు శ్రమ మరియు మహానతతో పాటు ఆత్మీయత యొక్క అనుభవం కూడా చేయించండి. మూడు విషయాలు అనుభవం అవ్వాలి.
                      ఈ శివరాత్రికి ఇటువంటి స్థూల మరియు సూక్ష్మ స్థితిని తయారు చేస్కోండి. దీని వలన వచ్చేటటువంటి ఆత్మలకు తమ స్వరూపం అయిన ఆత్మ మరియు ఆత్మీయత అనుభవం అవ్వాలి. మాట ద్వారా మాటలకు అతీతమైన స్థితి అనుభవం అవ్వాలి. ఇలా సంపర్కంలోకి వచ్చేటటువంటి ఆత్మలకు ఈ విశేష కార్యక్రమం పెట్టండి. కేవలం ఉపన్యాసం చెప్పటం కాదు, అనుభవం చేయించాలి అనే లక్ష్యం పెట్టుకోండి. చిన్న చిన్న సంఘటనలను తయారుచేయండి కానీ ఆత్మీయత మరియు ఆత్మిక తండ్రి యొక్క సంబంధం మరియు అనుభవానికి సమీపంగా తీసుకురండి. ఏదోక నవీనత చేయండి. స్థానం మరియు స్థితి రెండింటి ద్వారా దూరం నుండే ఆత్మీయత యొక్క ఆకర్షణ ఉండాలి. సాధారణ సందేశాన్ని ఇవ్వటం వేరే విషయం . అది కూడా ఇవ్వాలి, ఇవ్వండి కానీ ఇది కూడా తప్పకుండా చేయండి. దీని కొరకు నిమిత్త ఆత్మలు అంటే సేవాధారి ఆత్మలు విశేషంగా రోజు ఏకాగ్రత యొక్క, అంతర్ముఖత యొక్క వ్రతం పెట్టుకోవాలి. ఈ వ్రతం ద్వారా వృత్తులను పరివర్తన చేయగలరు. ఎలా అయితే భక్తులు స్థూల భోజనం యొక్క వ్రతం పెట్టుకుంటారో అదేవిధంగా సేవాధారి, జ్ఞాని ఆత్మలు వ్యర్ధ సంకల్పాలు, వ్యర్ధ మాట, వ్యర్ధ కర్మ యొక్క అలజడికి అతీతంగా ఏకాగ్రంగా అంటే ఆత్మీయతలో ఉండే వ్రతాన్ని తీసుకోవాలి. అప్పుడే ఆత్మలకు జ్ఞాన సూర్యుని యొక్క చమత్కారాన్ని చూపించగలరు. దీని కొరకు అలౌకిక ప్లాన్ తయారుచేయండి. భక్తిలో అగరువత్తి యొక్క సువాసన దూరం నుండే ఎలాగైతే ఆకర్షిస్తుందో అలా ఆకర్షించాలి. ఇప్పుడు ఏమి చేయాలో అర్ధమైందా? సమీపంగా వచ్చిన వారిని సంబంధంలోకి తీసుకురండి. విశేషాత్మలను అనుభవం ద్వారా ధ్వనిని వ్యాపింపచేయడానికి నిమిత్తం చేయండి.
                   ఈవిధంగా ఆత్మీయతలో ఏకాగ్రత యొక్క అనుభవం చేయించేవారికి, ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకను ఆత్మిక సేవలో తత్పరులై ఉండేవారికి, అనుభవాల ద్వారా ఆత్మకు మార్గాన్ని చూపించేవారికి ఇటువంటి ఆత్మిక సేవాధారులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు  నమస్తే.

Comments