* 26-01-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“బాధ్యతను స్వీకరించటంద్వారా లాభము"
పిల్లలైన మీరే విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ ఆధారమూర్తులు. ఉద్ధారము చేసేవారు కూడా మరియు తోడుతోడుగా విశ్వము ముందు ఉదాహరణగా తయారయ్యేవారు కూడా. ఎవరైతే ఆధారమూర్తులుగా ఉంటారో వారి పైనే మొత్తము బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీ ఒక్కొక్క అడుగు వెనుక అనేకుల అడుగులను వేయించే బాధ్యత ఉంది. మొదట సాకార రూపము(బ్రహ్మాబాబా) ఫాలో ఫాదర్ రూపములో ఎదురుగా ఉండేవారు. ఇప్పుడు మీరు నిమిత్త మూర్తులుగా ఉన్నారు. కావున మనము ఏవిధంగా ఏ రూపము ద్వారా ఎక్కడైతే అడుగులను వేస్తామో అలాగే సర్వ ఆత్మలు మన వెనుక ఫాలో చేస్తారు అని మీరు భావించండి. ఇది బాధ్యత. సర్వులకు ఉద్ధారమూర్తులుగా అయిన కారణంగా సర్వ ఆత్మల ఆశీర్వాదము ఏదైతే లభిస్తుందో, దాని ద్వారా తేలికతనము కూడా వచ్చేస్తుంది, సహాయము కూడా లభిస్తుంది, ఆ కారణంగా బాధ్యత తేలిక అవుతుంది. పెద్ద పెద్ద కార్యములు ఉన్నాగానీ ఎవరో చేయిస్తున్నారు అన్నది అనుభవము చేసుకుంటారు. ఈ బాధ్యత ఇంకా అలసటను తొలగిస్తుంది. ఫ్రీగా ఉండటము మనసుకు రుచించనే రుచించదు. బాధ్యత స్థితిని తయారు చెయ్యటంలో చాలా సహాయము చేస్తుంది. బాప్ దాదా మహారధి పిల్లలను చూసినప్పుడు అందరి వర్తమాన స్వరూపము, ఈ జన్మ యొక్క అంతిమ స్వరూపము మరియు మరుజన్మలోని భవిష్య స్వరూపము మూడూ ఎదురుగా వస్తాయి. ఇలా మేము తయారవ్వనున్నాము, మేము కిరీటము మరియు సింహాసనధారులుగా అవుతాము అన్న అనుభూతి స్పష్టరూపంలో మీకు కలుగుతోందా? ముందు ముందు దీనిని కూడా అనుభవము చేస్తారు. ఏవిధంగా సాకారరూపంలో ప్రత్యక్షముగా అనుభవము చేసుకున్నారు కదా! కర్మాతీత స్థితి కూడా స్పష్టంగా ఉండేది మరియు భవిష్య స్వరూపపు స్మృతి కూడా స్పష్టంగా ఉండేది. భవిష్య సంస్కారము ఈ స్వరూపములో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండేది. కావున మీరు, ఈ శరీరమును వదులుతాము మరియు అది సిద్ధముగా ఉంటుంది అని అనుభవము చేసుకుంటారు. బుద్ధిబలము ద్వారా ఇంతటి స్పష్టమైన అనుభవము కలుగుతుంది. ఇప్పుడు దిన ప్రతిదినము మీ సేవ ద్వారా, మీ సహయోగత్వము ద్వారా మరియు మీ సంస్కారాలను తొలగించుకొనే శక్తి ద్వారా మీ అంతిమ స్వరూపము మరియు భవిష్య రూపమును తెలుసుకోగలరు. సమీపములోని వారు మరియు దూరంగా ఉన్నవారు స్పష్టంగా కనిపించే సమయము వస్తుంది అని మొదట అనేవారు. కానీ ఇప్పుడు, దైవీ పరివారపు ఆత్మలెవరైతే ఉన్నారో వారు ఎవరెవరు సమీప రత్నాలు అన్నదానిని తెలుసుకోగలిగే అటువంటి సమయము జరుగుతోంది. ఎవరికి ఎంత సమీపంగా వచ్చేది ఉందో ఆ పరిస్థితుల అనుసారంగా కూడా అంత సమీపంగా వస్తారు. ఎవరికైనా కొంత దూరంగా ఉండేదుంటే, పరిస్థితులు కూడా మధ్యలో నిమిత్తంగా అవుతాయి, వారు రావాలని కోరుకున్నా కూడా రాలేకపోతారు. ఇవన్నీ భవిష్య సాక్షాత్కారాలు, ఇప్పుడు ప్రాక్టికల్ సేవ నడుస్తోంది. భవిష్యత్తును తెలుసుకోవటము ఇప్పుడు కష్టమేమీ కాదు.
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా తమ కొరకు కూడా ఏదైనా విశేష ప్రోగ్రామును పెట్టుకోవాలి. ఏవిధంగా సేవ మొదలగు ప్రోగ్రాములు తయారుచేస్తారో అలా ఉదయము నుండి రాత్రి వరకు మధ్యమధ్యలో ఎంత మరియు ఎలా స్మృతియాత్రపై అటెన్షన్ ఉంచేందుకు ప్రోగ్రామును చెయ్యగలము, అన్న ఈ డైరీని తయారుచేసుకోవాలి. అమృతవేళలోనే స్మృతి ప్లానును తయారుచేసుకోవాలి. మీరు ఏదైనా స్థూల కార్యములు మొదలగువాటిలో బిజీగా ఉన్నాగానీ, అప్పుడు కూడా స్మృతిలో ఉండేందుకు కొంత సమయాన్ని కేటాయించేందుకు నియమాన్ని పెట్టుకున్నారు. ఆ సమయములో ఇతరులకు కూడా ఇప్పుడు మనము ఈ పనిని చెయ్యాలి అని రెండు మూడు నిముషాల కొరకు స్మృతిని కలిగించండి, మీరు కూడా స్మృతిలో ఉండండి. ఏవిధంగా నిశ్చితమైన సమయంలో ట్రాఫిక్ ను కూడా ఆపేస్తారో, ఎంత ముఖ్యమైన పని ఉన్నాగానీ, ఎవరైనా పేషెంటు హాస్పిటల్ కు వెళ్ళేది ఉన్నా కూడా ఆపేస్తారు. ఇదేవిధంగా ఎంత చెయ్యగలిగితే అంతగా మీ టైమ్ టేబులను తయారుచేసుకోండి. వీరి ఈ సమయము స్మృతి చేసే సమయముగా నియమితమైంది అని ఇతరులు కూడా చూస్తారు కావున ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఏదైనా కార్యము ఉన్నా దానిని ముందుకు వెనుకకు చేసి రెండు, నాలుగు నిముషాల సమయాన్ని స్మృతిలో ఉండేందుకు తప్పకుండా కేటాయించినట్లయితే, దాని ద్వారా వాయుమండలములో కూడా మొత్తము ప్రభావము ఉంటుంది. అందరూ ఒకరినొకరు ఫాలో చేస్తారు. బుద్ధికి విశ్రాంతి కూడా లభిస్తుంది మరియు శక్తి కూడా నిండుతుంది మరియు వాయుమండలమునకు సహయోగము లభిస్తుంది. మళ్ళీ ఒక అద్భుతత్వము కనిపిస్తుంది. శివబాబా గుర్తు ఉన్నారా? అని మీరు ఒకరికొకరికి ఏవిధంగా స్మృతిని కలిగించుకున్నారో అలా ఎవరైనా వ్యక్త భావములో ఎక్కువగా ఉన్నారని చూసినట్లయితే వారికి నోటితో ఏమీ చెప్పకుండానే మీ అవ్యక్త శాంత రూపమును ఎలా ధారణ చేయాలంటే, వారు కూడా సూచనతోనే అర్థం చేసుకోవాలి, కావున మళ్ళీ వాతావరణము కూడా కొంత అవ్యక్తంగా ఉంటుంది. మీ 'అంతిమ స్థితి - సాక్షాత్కార మూర్తి. ఏయే విధంగా సాక్షాత్ మూర్తిగా అవుతారో అలాగే సాక్షాత్కార మూర్తిగా కూడా అవుతారు. ఎప్పుడైతే అందరూ సాక్షాత్ మూర్తిగా అయిపోతారో అప్పుడు అందరి సంస్కారము కూడా సాక్షాత్ మూర్తి సమానంగా అయిపోతుంది. ఎంతెంతగా మిమ్మల్ని చార్జ్ చేసుకుంటారో అంతగా ఇంచార్జ్ గా అయ్యే కర్తవ్యమును సఫలతాపూర్వకముగా చెయ్యగలరు. మిమ్మల్ని నిమిత్తంగా భావించుకొని అడుగులను వెయ్యాలి ఎందుకంటే మొత్తము విశ్వములోని ఆత్మల దృష్టి ఆత్మలైన మీపై ఉంది. ఏవిధంగా మీ ద్వారా ఈశ్వరీయ స్నేహము, శ్రేష్ఠ జ్ఞానము మరియు శ్రేష్ఠ చరిత్రల సాక్షాత్కారము జరుగుతుందో అలా అవ్యక్త స్థితి కూడా అంతగానే స్పష్టంగా సాక్షాత్కారమవ్వాలి. వీలైతే నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాలు అని ఎవరైనా అనుభవము చేసేటట్లుగా అటువంటి ప్లానును తయారు చెయ్యాలి. సాకారరూపములో ఫరిస్తాస్థితి అనుభవమును చేసారు కదా! ఇంత పెద్ద బాధ్యత ఉన్నా కూడా ఆకారీ మరియు నిరాకారీ స్థితి అనుభవమును చేయిస్తూ ఉండేవారు. మీ అంతిమ స్టేజ్ యొక్క స్వరూపము కూడా స్పష్టంగా కనిపించాలి. ఎవరు ఎంత అశాంతిగా ఉన్నా, ప్రశాంతత లేకుండా గాభరాగా వచ్చినా గానీ మీ ఒక్క దృష్టి, స్మృతి మరియు వృత్తుల శక్తి వారిని పూర్తిగా శాంతియుతంగా చేసెయ్యాలి. ఎవరు ఎంత వ్యక్త భావములో ఉన్నాగానీ, మీ ఎదుటికి రావటంతోనే అవ్యక్త స్థితిని అనుభవము చేసుకోవాలి. మీ దృష్టి కిరణాల వలె పని చెయ్యాలి. ఇప్పటివరకు గల రిజల్టులో మాస్టర్ సూర్యుని సమానంగా జ్ఞాన లైటు(వెలుగు)ను ఇచ్చే కర్తవ్యములో సఫలురయ్యారు. కానీ కిరణాల మైట్(శక్తి) ద్వారా ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంస్కారాలరూపీ కీటకాలను నాశనము చేసే కర్తవ్యమును చెయ్యాలి. లైట్ ను ఇవ్వటంలో పాస్ అయ్యారు, మైట్ ను(శక్తిని) ఇచ్చే కర్తవ్యము ఇప్పుడు మిగిలి ఉంది.
బాప్ దాదా వద్ద నాలుగు లిస్టులు ఉన్నాయి.
1. సర్వీసబుల్. 2. సెన్సిబుల్. 3. సక్సెస్ ఫుల్. 4. వాల్యుబుల్.
సక్సెస్ ఫుల్ గా కూడా అందరూ ఉండరు, వాల్యుబుల్ (విలువైనవారి)గా కూడా అందరూ ఉండరు. కొందరు వారి గుణాల ద్వారా, చరిత్ర ద్వారా విలువైనవారిగా తయారవుతారు, కానీ సేవా ప్లానింగులో సక్సెస్ ఉండదు. ప్రతి ఒక్కరూ వారి చార్టును తెలుసుకోగలరు. మా పేరు ఏ లిస్టులో ఉంటుంది అన్నది చూసుకోవాలి.
కొందరికి నాలుగింటిలో కూడా పేరు ఉంది, కొందరికి రెండింటిలో, కొందరికి మూడింటిలో, కొందరికి ఒక్క దాంట్లో ఉంది. వాల్యుబుల్ గా ఉండేవారి ముఖ్య గుణము - వారికి స్వయం యొక్క సమయముపై, సంకల్పముపై మరియు సేవపై స్వయం విలువ ఉంటుంది, కావున వారి సంకల్పమునకు, మాటలకు మరియు వారి ద్వారా,ఏ సేవ అయితే జరుగుతుందో దానికి ఇతరులు కూడా విలువను ఉంచుతారు మరియు డ్రామా అనుసారంగా వారి విలువ ఉంటుంది. అందరూ వారిని వాల్యుబుల్ దృష్టితో చూస్తారు. సర్వీసబుల్ లు ఫస్టా లేక సెన్సిబుల్ లు ఫస్టా? ఇరువురికీ వారి వారి విశేషత ఉంది. సెన్సిబుల్ లకు ప్లానింగు బుద్ధి ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే విశేషత తక్కువగా ఉంటుంది. సర్వీసబుల్ గా ఎవరైతే ఉంటారో వారు ప్లానింగును తక్కువ చేస్తారు, కానీ ప్రాక్టికల్ లోకి వచ్చే విశేష గుణము వారిలో ఉంటుంది. కొందరిలో సెన్స్ కూడా ఉంటుంది మరియు సర్వీసబుల్ గుణము కూడా ఉంటుంది. ఈ స్థానపు కర్తవ్యములో ఇరువురూ అవసరమే. వారి సంకల్పము, ప్లాను ఏదైతే నడుస్తుందో, దాని ద్వారా భవిష్యత్తు తయారవుతుంది, వారి కర్మ ద్వారా తయారవుతుంది. అధిక ప్రభావము వీరిది ఉంటుంది మరియు సఫలతామూర్తులది, అవ్యక్త స్థితి ఆధారంపై పరిణామము వెలువడుతుంది. కొందరు కొందరిది ప్లాను కూడా నడుస్తుంది, ప్రాక్టికల్ కూడా చేస్తారు, కానీ సఫలత తక్కువగా ఉంటుంది. సర్వీసబుల్ గా అవ్వగలరు, కానీ సఫలతామూర్తులుగా అందరూ అవ్వజాలరు. కొందరికి డ్రామా అనుసారంగా సఫలతా వరదానము ప్రాప్తించి ఉంటుంది. వారికి శ్రమ తక్కువగా చెయ్యవలసి ఉంటుంది, సహజంగానే సఫలత లభిస్తుంది. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిదీ వారి వారి పాత్ర ఉంది. అచ్ఛా!
టీచర్లయితే టీచర్లుగా ఉండనే ఉన్నారు. టీచరు కన్నా ముందు నేను స్టూడెంట్ ను అన్నది టీచర్లకు ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. స్టూడెంట్ స్మృతి ద్వారా స్టడీ(చదువు) గుర్తు ఉంటుంది. ఎప్పుడైతే స్వయం స్టడీ చేస్తారో అప్పుడు ఇతరులను స్టడీ చేయిస్తారు. స్టూడెంట్ లైఫ్ లేని కారణంగా ఇతరులను స్టూడెంట్ గా తయారు చెయ్యలేరు. వాతావరణాన్ని మార్చేందుకు, నేను మాస్టర్ సూర్యుడిని అని మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ భావించాలి. సూర్యుని కర్తవ్యము ఏమిటి? ఒకటి-ప్రకాశమును ఇవ్వటము, రెండు-వ్యర్థమును సమాప్తము చెయ్యటము. నా నడవడికరూపీ కిరణాల ద్వారా ఈ రెండు కర్తవ్యాలు జరుగుతున్నాయి అని ఎల్లప్పుడూ భావించాలి. సర్వ ఆత్మలకు ప్రకాశము కూడా లభించాలి, వ్యర్థము కూడా సమాప్తమవ్వాలి. వెలుగు వస్తున్నా వ్యర్థము సమాప్తమవ్వటం లేదంటే నా కిరణాలలో శక్తి లేదు అని భావించండి. ఎండ తీవ్రంగా లేనట్లయితే కీటాణువులు నశించవు. నాలో శక్తి తక్కువగా ఉంది, కావున జ్ఞాన ప్రకాశమును ఇచ్చినా గానీ పాత సంస్కారాల రూపీ కీటాణువులు నశించటం లేదు, ఎంతటి పవర్‌ఫుల్ వస్తువుగా ఉంటే అంత త్వరగా సమాప్తము. పవర్ తక్కువగా ఉన్నట్లయితే చాలా సమయము పడ్తుంది, కావున పవర్ ఫుల్ గా అవ్వాలి. నేను అంతగా చదువుకోలేదు అని భావించవద్దు, సృష్టి జ్ఞానాన్ని చదువుకున్నట్లయితే అందులో అన్నీ వచ్చేస్తాయి. అచ్ఛా!
Comments
Post a Comment